recover
-
వాట్సాప్ చాట్ డిలీట్ అయిందా? ఇదిగో రికవరీ టిప్స్..
స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరూ.. వాట్సాప్ వినియోగిస్తుంటారు. అయితే కొన్నిసార్లు తెలిసో.. తెలియకో చాటింగ్ మొత్తం డిలీట్ అయిపోతుంది. అందులో ముఖ్యమైన విషయాలు ఉండవచ్చు లేదా ఇష్టమైనవారితో చేసిన చాటింగ్ కూడా ఉండొచ్చు. అలాంటిప్పుడు బాధపడటం మానేసి కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయ్యారంటే డిలీట్ అయిన చాట్ మొత్తం తిరిగి పొందవచ్చు.వాట్సాప్ చాటింగ్ రికవరీ➤ముందుగా వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి.. కుడివైపు పైన కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేయాలి.➤క్లిక్ చేసిన తరువాత అక్కడ కనిపించే ఆప్షన్లలో 'సెట్టింగ్స్' ఆప్షన్ ఎంచుకోవాలి.➤సెటింగ్స్ మీద క్లిక్ చేసిన తరువాత 'చాట్స్'పైన క్లిక్ చేయాలి.➤క్లిక్ చేసిన తరువాత ఓపెన్ అయ్యే పేజీని.. కొంచెం స్క్రోల్ చేస్తే.. అక్కడ 'చాట్ బ్యాకప్' అనే ఆప్షన్ కనిపిస్తుంది.➤చాట్ బ్యాకప్ మీద క్లిక్ చేసిన తరువాత బ్యాకప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే డిలీట్ అయిన చాట్స్ వెనక్కి వస్తాయి.ఆండ్రాయిడ్ వాట్సాప్ యూజర్లు వినియోగదారులు తమ చాట్లను గూగుల్ డ్రైవ్‌కు బ్యాకప్ చేయవచ్చు. ఐఫోన్ వినియోగదారులు బ్యాకప్ల కోసం ఐక్లౌడ్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. బ్యాకప్ స్టార్ట్ చేయడానికి ముందే.. గూగుల్ డిస్క్‌లో తగినంత స్టోరేజ్ ఉందా? లేదా అని నిర్థారించుకోండి. -
ఫోన్ల రికవరీలో అనంతపురం పోలీసుల రికార్డు.. ఏకంగా 18.85 కోట్ల విలువైన
సాక్షి, అనంతపురం: అనంతపురం పోలీస్ మైదానంలో సెల్ఫోన్ల రికవరీ మేళా నిర్వహించారు. సెల్ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు క్యూ కట్టడంతో పరేడ్ మైదానం జాతరను తలపించింది. మంగళవారం ఒక్కరోజే 1309 మంది బాధితులకు తమ ఫోన్లను తిరిగి అందజేశారు పోలీసులు. ఫోన్లు రివకరీ చేసిన సిబ్బందిని పోలీసులు ప్రశంసించి రివార్డులు అందించారు.ఇప్పటి వరకు జిల్లాలో 10వేల మందికి సంబంధించిన 18.5 కోట్ల రూపాయల విలువైన సెల్ ఫోన్లను రికవరీ చేసి ఇచ్చామని జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. ఇవాళ అందజేసిన ఫోన్ల విలువ రూ. 3 కోట్ల 45 లక్షలు ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు 10,195 ఫోన్లు రికవరీ చేయగా.. వీటిలో 19 జిల్లాలకు 2535 ఫోన్లను, 20 రాష్ట్రాలకు 1056 మొబైళ్లను పంపిణీ చేశామని తెలిపారు. రికవరీ చేసి నేడు అందించిన ఫోన్ల విలువ 3 కోట్ల 45 లక్షలు ఉంటుందని చెప్పారు. -
రూ.61 కోట్లు రికవరీ చేసిన ఈపీఎఫ్ఓ
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ చెల్లించాల్సిన రూ.73 కోట్ల బకాయిలకుగాను రూ.61 కోట్లను రికవరీ చేసినట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తెలిపింది. మార్చి 2020 నుంచి మే 2021 వరకు ఈపీఎఫ్ఓకు చెల్లించాల్సిన ఎంప్లాయర్(కంపెనీ) వాటాలో కొంత మొత్తం వసూలైనట్లు పేర్కొంది.స్పైస్‌జెట్ సంస్థ ఉద్యోగుల వేతనాల్లో కట్ అవుతున్న ఈపీఎఫ్ఓ వాటాలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. మేనేజ్మెంట్ వాటాను ఈపీఎఫ్ఓకు జమ చేయడం లేదని, బకాయిపడిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని సంస్థకు నోటీసులు అందించారు. దాంతో తాజాగా మార్చి 2020 నుంచి మే 2021 వరకు బకాయిపడిన మొత్తం రూ.73 కోట్లలో రూ.61 కోట్లు రికవరీ అయినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది. ఆలస్య చెల్లింపునకు సంబంధించిన వడ్డీ, జనవరి 2022 తర్వాత చెల్లించాల్సిన బకాయిలను కూడా అంచనా వేసినట్లు పేర్కొంది.ఈ సందర్భంగా స్పైస్‌జెట్ అధికారి ఒకరు మాట్లాడుతూ..‘ఈపీఎఫ్ సెక్షన్ 14బీ, ఇతర నిబంధనల చట్టం 1952 ప్రకారం విచారణ జరుగుతుంది. చట్టంలోని సెక్షన్ 7A కింద మిగిలిన కాలానికి (ఇప్పటి వరకు) ఎంత చెల్లించాలో లెక్కించి దాన్ని రికవరీ చేసే ప్రక్రియ మొదలైంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: అంబానీ చెల్లి.. భర్త చనిపోయినా కోట్ల కంపెనీకి ఛైర్‌పర్సన్‌గా..ఈపీఎఫ్ఓ పరిధిలోని ప్రతి సంస్థ ఎంప్లాయర్ వాటాను ఉద్యోగభవిష్య నిధిలో జమ చేయాలి. ప్రతి నెలా 15వ తేదీలోపు ఈపీఎఫ్ఓలో తమ రిటర్న్‌లను ఫైల్ చేయాలి. లేదంటే బకాయిపడిన తేదీ నుంచి ఏటా 12% చొప్పున వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది. -
ఏపీ పోలీస్: చోరీ అయిన ఫోన్ల రికవరీ.. యజమానులకు అందజేత (ఫొటోలు)
-
31 శాతం తగ్గిన విస్తారా నష్టాలు
ముంబై: గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో ప్రయివేట్ రంగ విమానయాన కంపెనీ విస్తారా నష్టాలు భారీగా తగ్గాయి. రూ. 1,393 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది(2021–22) లో నమోదైన రూ. 2,031 కోట్లతో పోలిస్తే 31 శాతంపైగా రికవర్ అయ్యాయి. కార్పొరేట్ వ్యవహారాల శాఖకు దాఖలు చేసిన సమాచారం ప్రకారం టాటా ఎస్ఐఏ ఎయిర్‌లైన్స్(విస్తారా) మొత్తం ఆదాయం రెట్టింపై రూ. 11,784 కోట్లను తాకింది. దీంతో నష్టాలు భారీగా తగ్గినట్లు కంపెనీ పేర్కొంది. అయితే నెట్‌వర్త్ రూ. 1,250 కోట్ల నుంచి రూ. 502 కోట్లకు నీరసించింది. దేశీ విమానయాన పరిశ్రమ గతేడాది పటిష్ట వృద్ధిని సాధించినట్లు విస్తారా తెలియజేసింది. కోవిడ్ ముందుస్థాయిని సైతం అధిగమించినట్లు వెల్లడించింది. గత ఆరు నెలల్లో సగటున ప్రతిరోజూ 4 లక్షల మంది ప్రయాణికులు నమోదవుతున్నట్లు తెలియజేసింది. ఉమ్మడి నష్టం ఇలా.. టాటా గ్రూప్ వెలువరించిన 2022–23 వార్షిక నివేదిక ప్రకారం గతేడాది గ్రూప్‌లోని ఎయిరిండియా, ఎయిరేíÙయా, విస్తారాల ఉమ్మడి నష్టం రూ. 15,532 కోట్లుగా నమోదైంది. వెరసి 2021–22లో నష్టం రూ. 13,838 కోట్లు మాత్రమే. అయితే ఈ కాలంలో మూడు సంస్థల ఆదాయం పుంజుకున్నప్పటికీ ఎయిరిండియా విమానాలు, ఇంజిన్ల నిలుపుదల కారణంగా రూ. 5,000 కోట్లమేర అదనపు ప్రొవిజనింగ్ చేపట్టడంతో ఉమ్మడి నష్టాలు పెరిగాయి. టాటా సన్స్ వార్షిక నివేదిక ప్రకారం గతేడాది ఎయిరిండియా ఆదాయం రూ. 31,377 కోట్లను దాటగా.. రూ. 11,388 కోట్ల నష్టం నమోదైంది. ఎయిరేíÙయా టర్నోవర్ రూ. 4,310 కోట్లుకాగా.. రూ. 2,750 కోట్ల నష్టం ప్రకటించింది. అయితే ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ మాత్రం గతేడాది రూ. 5,669 కోట్ల ఆదాయం సాధించింది. అంతేకాకుండా రూ. 117 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
విద్యార్థుల మధ్య గొడవ.. హాస్టల్ గదిలో మారణాయుధాలు..
లక్నో: చదువుకోవాల్సిన విద్యార్థుల హాస్టళ్లలో మారణాయుధాలు లభించాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం హాస్టల్లో రెండు పిస్టళ్లు, 30 వరకు బాంబులు లభించాయని తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్లో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. అదీ కాస్త తీవ్రస్థాయికి చేరడంతో పోలీసులు చొరవ తీసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో హాస్టల్లో తనిఖీలు చేయగా.. 2 పిస్టళ్లు, 30 బాంబులు లభించాయని పోలీసులు తెలిపారు. అయితే.. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఉమేశ్ పాల్ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బీఎస్పీ నాయకుడు రాజు పాల్‌ను కూడా దుండగులు జరిపిన కాల్పుల్లో మృతి చెందారు. ఈ రెండు కేసుల్లో నిందితులు ఈ హాస్టల్లోనే తలదాచుకోగా.. పోలీసులు అరెస్టు చేశారు. ఇదీ చదవండి: చైనీయుడనుకుని సిక్కిం వాసిపై దాడి -
ఆర్థిక సంక్షోభం నుంచి పాకిస్తాన్ బయటపడుతుందా?
ఇస్లామాబాద్: గత కొంత కాలంగా ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ ఈ పరిస్థితుల్లో నుంచి బయట పడటానికి కొంత సమయం పడుతుందన్నారు పాకిస్తాన్ ఆర్థిక శాఖ మంత్రి ఇషాక్ దార్. గతంలోనూ ఇదే పరిస్థితి... కరాచీ వాణిజ్య మండలి పరిశ్రమ నిర్వహించిన ఓ సమావేశంలో పాకిస్తాన్ ఆర్ధిక మంత్రి ఇషాక్ దార్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం చేయడానికి అనుసరిస్తున్న విధానాలను, భవిష్యత్తు కార్యాచరణను వివరించే ప్రయత్నం చేశారు ఇషాక్ దార్. ఆయన మాట్లాడుతూ.. 1998, 2013 లో మనం ఇంతకంటే ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాం. కానీ కొంత కాలానికి ఆ సంక్షోభం నుంచి బయటపడ్డాము. పడి లేచిన ఆర్ధిక వ్యవస్థ... 2017 సమయానికి పాకిస్తాన్ ఆర్ధికంగా అత్యుత్తమ స్థాయికి చేరుకుంది. కానీ ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ అస్థిరత కారణంగా ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థ పతనావస్థకు చేరుకుంది. ఇటువంటి సంక్షోభాలకు తక్షణ పరిష్కారం అంటూ ఉండదు. తేరుకోవడానికి కొంత వ్యవధి పడుతుంది. తొందర్లోనే మనం ఈ దుస్థితి నుండి బయటపడి ఆర్ధికంగా నిలదొక్కుకుంటామన్నారు ఇషాక్ దార్. నూతన కార్యాచరణ.. కఠినమైన సంస్కరణలు తీసుకొచ్చి సమిష్టిగా సవాళ్ళను ఎదుర్కొంటే పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థను తిరిగి గాడిలో పడుతుంది. ఇప్పటికే ఈ కార్యాచరణను కూడా మొదలుపెట్టాము. విదేశీ చెల్లింపులకే మా మొదటి ప్రాధాన్యత. వ్యవసాయ రంగంలోనూ ఐటీ రంగంలోనూ విప్లవాత్మక మార్పులను తీసుకురానున్నాము కాబట్టి త్వరితగతినే కుదురుకుంటామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. ఇది కూడా చదవండి: బీజేపీ ప్రధాని కాదు, భారత దేశ ప్రధాని -
సంపన్న ఎకానమీపై గీతా గోపీనాథ్ వ్యాఖ్యలు
దావోస్: అభివృద్ధి చెందిన ఎకానమీలు 2024 నాటికి తిరిగి ట్రాక్‌లోకి వస్తాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు మళ్లీ పురోగతి పట్టాలెక్కకపోతే, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల వృద్ధి రేటు 5 శాతం దిగువనే ఉంటుందని కూడా ఆమె అభిప్రాయపడ్డారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశం 2022 సందర్భంగా ‘ప్రపంచ తదుపరి వృద్ధి ధోరణి’ అనే అంశంపై జరిగిన ప్రత్యేక సెషన్లో ఆమె చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు... ♦ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ప్రతికూల ప్రభావాలకు లోనయ్యాయి. నెమ్మదిగా తిరిగి కోలుకుంటున్నాయి. ఈ రికవరీకి ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం మళ్లీ విఘాతంగా మారింది. ♦ యుద్ధం వల్ల ఇంధనం, ఆహారంతో సహా వస్తువుల ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ప్రపంచం తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొంటోంది. దీనితో ప్రపంచ వృద్ధి ధోరణిపట్ల డౌన్‌గ్రేడ్ దృక్పధాన్ని కలిగి ఉన్నాము. ♦ ప్రధానంగా అధిక స్థాయి ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి సెంట్రల్ బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. వడ్డీ రేట్లను తీవ్రంగా పెంచుతున్నాయి. ఈ చర్యలు తీసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి ఉంది. అయితే ఆయా వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక, వాణిజ్య విభాగాలపై త్రీవ ప్రతికూల పరిణామాలకు దారితీసే వీలుంది. ♦ కోవిడ్, తదనంతరం యుద్ధ వాతావారణ పరిస్థితుల నేపథ్యంలో వృద్ధికి సంబంధించి ప్రపంచ దేశాల మధ్య తీవ్ర వ్యత్యాసాలు నెలకొన్నాయి. ఆర్థిక వనరుల వినియోగం, వ్యాక్సినేషన్ వంటి అంశాల్లో వైరుధ్యాలు దీనికి కారణం. ♦ ఆహారం, ఇంధనం, వనరుల సంక్షోభాలు ఇప్పుడు వృద్ధి అసమతౌల్యతకు దారితీసే అవకాశాలు ఏర్పడినందున దీర్ఘకాలిక ఆర్థిక శ్రేయస్సు, అంతర్జాతీయ పరస్పర సహకారం వంటి అంశాలపై తక్షణం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
కొట్టేసిన మారడోనా వాచీ ధరెంతో.. స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Maradona Stolen Watches Specialities And Cost: అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం డిగో మారడోనా.. సాకర్ ప్రపంచంలో ఓ లెజెండ్. మరణం అనంతరం ఆయన లెగసీ కొనసాగుతోంది. అయితే ఆయనకు చెందిన కాస్ట్లీ వాచీ ఒకటి దుబాయ్‌లో చోరీకి గురికాగా.. ఎట్టకేలకు దానిని అస్సాం(అసోం)లో రికవరీ చేసుకున్నారు పోలీసులు. 2010 ఫిఫా వరల్డ్ కప్ టైంలో స్విట్జర్లాండ్‌కు చెందిన కాస్ట్లీ వాచ్ మేకింగ్ కంపెనీ హుబ్లోట్.. బిగ్‌బ్యాంగ్ మోడల్ పేరుతో మారడోనా గౌరవార్థం లిమిటెడ్ ఎడిషన్ రిలీజ్ చేసింది. మొత్తం 250 వాచీలు తయారు చేయించగా.. క్షణాల్లో హాట్‌కేకుల్లా ఒక్కక్కటి భారీ ధరకు అమ్ముడుపోయాయి. వీటిలో రెండు వాచీలను మారడోనాకు గిఫ్ట్‌గా ఇచ్చింది హుబ్లోట్. 2010 ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా మారడోనా ఈ రెండు వాచీలను(రెండుచేతులకు చెరోటి) ధరించి స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపించారు. అందులో ఆయన విక్టరీ సింబల్ చూపించే ఫొటో(వెనకనుంచి), సంతకం, జెర్సీ నెంబర్ కూడా ఉంటాయి. వీటి ధర ఒక్కొక్కటి రూ. 20 లక్షలుగా(మన కరెన్సీలో) ప్రకటించింది కంపెనీ. అయితే.. In an act of international cooperation @assampolice has coordinated with @dubaipoliceHQ through Indian federal LEA to recover a heritage @Hublot watch belonging to legendary footballer Late Diego Maradona and arrested one Wazid Hussein. Follow up lawful action is being taken. pic.twitter.com/9NWLw6XAKz — Himanta Biswa Sarma (@himantabiswa) December 11, 2021 మారడోనా మరణానంతరం ఆయనకు చెందిన వస్తువులు కొన్నింటిని దుబాయ్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీ వేలంపాటలో చేజిక్కించుకుంది. ఆ కంపెనీకి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న వాజీద్ హుస్సేన్ అనే వ్యక్తి.. ఆ వాచీని దొంగిలించాడు. ఆపై తన తండ్రికి బాగోలేదని ఆగష్టులో భారత్(అస్సోం) వచ్చేశాడు. ఈ చోరీని సీరియస్‌గా తీసుకున్న దుబాయ్ పోలీసులు.. ఎట్టకేలకు అస్సోం పోలీసుల సహకారంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, డీజీపీలు స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. A costly Hublot watch... Maradona... Dubai... Assam Police Looks like random words, don't they? But today all these words came together nicely, stating a story of successful International Cooperation between #DubaiPolice and @assampolice . pic.twitter.com/oMRYgpX3HH — DGP Assam (@DGPAssamPolice) December 11, 2021 -
మీ స్మార్ట్ఫోన్లలో డిలీటైనా ఫోటోలను ఇలా పొందండి...!
Recover Deleted Photos and Videos From Google Photos: గడిచిన కాలాన్ని గుర్తుచేసే తీపి జ్ఞాపకాలు ఫోటోస్ ..! బ్లాక్ అండ్ వైట్, ఫిల్మ్ ఫోటోల నుంచి నేటి స్మార్ట్ఫోన్ల వరకు ఫోటోల పరిణామ క్రమం గణనీయంగా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు ఫోటో స్టూడియోలకు వెళ్లి ఫోటోగ్రాఫర్ మన ఫోటోలను తీయించుకునేవాళ్లము. మారుతున్న కాలంతో పాటు ఫోటో పరిణామ క్రమంలో భారీ మార్పులే వచ్చాయి. నేటి సాంకేతికతతో ఫోటోలను స్మార్ట్‌ఫోన్ కెమెరాలను ఉపయోగించి మన ఫోన్లలో ఆయా సందర్బపు క్షణాలను బంధిస్తున్నాం. చదవండి: Gmail: జీమెయిల్ యూజర్లకు గుడ్‌న్యూస్...! మన స్మార్ట్ఫోన్లలో దించిన ఫోటోలను ఎప్పటికప్పుడు గూగుల్ ఫోటోస్‌తో సింక్ చేయడంతో మన ఫోన్ల నుంచి డిలీట్ఐనా ఆయా ఫోటోలు గూగుల్ ఫోటోస్ సహాకారంతో తిరిగి పొందవచ్చును. స్మార్ట్ఫోన్లలో డిలీట్ఐనా ఫోటోలను గూగుల్ ఫోటోస్ ద్వారా పొందే సౌలభ్యం ఉంది. మరి అదే గూగుల్ ఫోటోస్ నుంచి డిలీట్ ఐనా ఫోటోలను లేదా వీడియోలను పొందడం ఏలా అని వాపోతున్నారా...! కంగారు పడే అవసరమే లేదు..! గూగుల్ ఫోటోస్ నుంచి డిలీట్ ఐనా ఫోటోలను మళ్లీ తిరిగి పొందవచ్చును. గూగుల్ ఫోటోస్ నుంచి డిలీటైనా ఫోటోలు లేదా వీడియోలు 60 రోజుల వ్యవధి దాటితే వాటిని తిరిగి పొందలేము.. గూగుల్ ఫోటోస్ నుంచి డిలీటైనా ఫోటోలను ఇలా పొందండి. ఆండ్రాయిడ్ ఫోన్, ఆండ్రాయిడ్ టాబ్లెట్, ఐఫోన్ లేదా ఐప్యాడ్‌లో ఫోటో లేదా వీడియోలను తిరిగి పొందడం కోసం మీ ఫోన్లో ఉన్న గూగుల్ ఫోటోస్ యాప్‌ను ఓపెన్ చేయండి. దిగువన ఉన్న లైబ్రరీపై క్లిక్ చేయండి. తరువాత ట్రాష్ బిన్ సింబల్‌పై క్లిక్ చేయండి. మీరు తిరిగి పొందాలనుకున్న ఫోటో లేదా వీడియోలకోసం చూడండి. మీరు ఎంచుకున్న ఫోటో లేదా వీడియోపై హోల్డ్ చేసి ప్రెస్ చేయండి. ఫోటో లేదా వీడియోపై ప్రెస్ చేసిన వెంటనే మీకు దిగువన రిస్టోర్ అనే అప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన వెంటనే తిరిగి ఆయా ఫోటోలను లేదా వీడియోలను తిరిగి గూగుల్ ఫోటోస్‌లో పొందవచ్చును. ఒక వేళ కంప్యూటర్ నుంచి పొందాలనుకుంటే... బ్రౌజర్నుపయోగించి మీ జీ మెయిల్ ఖాతాలోకి సైన్ ఇన్ అవ్వండి. నెక్ట్స్ ట్యాబ్‌లో photos.google.comను సెర్చ్ చేయండి. మీకు మీ గూగుల్ ఫోటోస్ ఉన్నఅకౌంట్ ప్రత్యక్షమౌతుంది. విండోకు ఎడమ వైపున ఉన్న ట్రాష్ బిన్ ఫోల్డర్‌పై క్లిక్ చేయండి. మీరు తిరిగి పొందాలనుకుంటున్న ఫోటో లేదా వీడియోపై కర్సర్‌ను ఉంచి, ఎగువ కుడి వైపున, ఉన్న రిస్టోర్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి . క్లిక్ చేసిన వెంటనే తిరిగి ఆయా ఫోటోలను లేదా వీడియోలను పొందవచ్చును. చదవండి: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన భారత్..! -
కరోనా బాధితుల్లారా మరికొన్నాళ్లు జాగ్రత్త
వాషింగ్టన్: మహమ్మారి వైరస్ కరోనా నుంచి కోలుకున్నా కూడా అది శరీరంలో దాదాపు 8 నెలల వరకు దాగి ఉంటుందని ఓ సర్వే చెప్పింది. రోగ నిరోధక శక్తి అతి తక్కువగా ఉండడంతో వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని ఆ సర్వే నివేదిక తెలిపింది. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న 2020 జూలై నెలలో చేసిన సర్వేలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. కరోనా సోకిన తర్వాత శరీరంలో రోగ నిరోధక శక్తి క్షీణిస్తుందనేది అందరికీ తెలిసిందే. అయితే కోలుకున్న తర్వాత కూడా రోగ నిరోధక శక్తి అంతత మాత్రమే ఉంటుందని అమెరికాకు చెందిన అల్లెసాండ్రో సెట్టె ఆఫ్ లా జొల్ల ఇన్స్టిట్యూట్ (ఎల్‌జేఐ) తెలిపింది. షేన్ క్రాటీ, డానియల వేస్కాఫ్‌తో కలిసి ఎల్‌జేఐ సర్వే చేసింది. మొత్తం 188 బాధితులపై సర్వే చేయగా వారి రక్త నమూనాల్లో ఇదే విషయం తెలిసిందని ఆ సంస్థ తమ జర్నల్‌లో ప్రచురించిన కథనంలో పేర్కొంది. యాంటీ బాడీస్‌ను వైరస్ కిల్ చేస్తుందని గుర్తించారు. బి సెల్స్, టీ సెల్స్‌ను నశింపజేస్తుందని తమ నివేదికలో పేర్కొన్నారు. నిరోధక శక్తిపై ప్రభావం చూపి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు మీడియాకు చెప్పారు. సార్స్ వ్యాధి పొంచి ఉండే ప్రమాదం ఉందని, కొన్నాళ్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కరోనా నుంచి కోలుకున్న 60 శాతం మందిలో ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం 16.7 శాతం మందికి ఉందని, అది కూడా 65 రోజుల్లోపు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని ఈ సర్వే ద్వారా వారు చెప్పాలనుకుంటున్నారు. -
ప్లాస్మా థెరఫీతో కోలుకున్న మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌తో బాధపడుతూ ఢిల్లీలోని సాకేత్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్యం మెరుగైంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న జైన్ చికిత్సకు స్పందిస్తున్నారని, ఆయనను సోమవారం జనరల్ వార్డుకు తరలిస్తారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఆయన కోలుకోవడంతో 24 గంటలు పరిశీలనలో ఉంచి జ్వరం, శ్వాస ఇబ్బందులు మళ్లీ తలెత్తకుంటే జనరల్ వార్డుకు తరలిస్తామని వెల్లడించాయి. కరోనా పాజిటివ్‌తో రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరిన జైన్ ఆరోగ్యం విషమించడంతో ఆయనను మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. జైన్‌కు ప్లాస్మా థెరఫీ ఇవ్వడంతో కోలుకున్నారు. సత్యేందర్ జైన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి ట్వీటీ చేశారు. చదవండి : కీలక దశలో వ్యాక్సిన్ పరీక్ష -
చందా కొచర్‌కు మరిన్ని చిక్కులు
సాక్షి,ముంబై: ఐసీఐసీఐ-వీడియోకాన్ కుంభకోణంలో ఐసీఐసీఐ బ్యాంకు బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈస్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎండీ చందా కొచర్ నుంచి తామిచ్చిన బోనస్‌ను రికవరీ చేయాలని కోరింది. అలాగే తన తొలగింపు అక్రమమంటూ చందా కొచర్ గత ఏడాది దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేయాలని కూడా విజ్ఞప్తి చేసింది. తన తొలగింపు ద్వారా ఆర్బిఐ నిబంధనలను ఉల్లంఘించినట్లు పేర్కొనడం, బ్యాంకు విలువైన స్టాక్ ఆప్షన్‌ను పొందేందుకు, తప్పు దారి పట్టించే ప్రయత్నమని ఐసీఐసీఐ బ్యాంకు తన అఫిడవిట్లో పేర్కొంది. ఈ మేరకు జనవరి 10 న దావా వేసింది. దీనిపై తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా పడింది. ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో, ఎండీగా ఆమెను తొలగించిన తరువాత ఏప్రిల్ 2006- మార్చి 2018 వరకు ఆమెకిచ్చిన బోనస్ క్లాబ్యాక్ చేయాలని కోరుతోంది. (క్లాబ్యాక్ అంటే ఏదైనా దుష్ప్రవర్తన లేదా క్షీణించిన లాభాల విషయంలో ఒక ఉద్యోగి నుండి బోనస్ తదితర ప్రోత్సాహక-ఆధారిత వేతనాన్ని కంపెనీ తిరిగి తీసుకోవచ్చు) బ్యాంకు వ్యాపార ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి బ్యాంకుతోపాటు వాటాదారులందరికీ తీవ్రమైన ఇబ్బందిని కలిగించిందనీ, బ్యాంకుకు ప్రతిష్టకు తీరని నష్టం కలిగిందని ఆరోపించింది. తన భర్త దీపక్ కొచర్‌కు లబ్ధి చేకూర్చడం కోసమే వీడియోకాన్ గ్రూపునకు రూ .2,250 కోట్ల రుణాలు మంజూరు చేయడంలో చందా కొచర్ పాత్ర ఉందని బ్యాంకు ఆరోపించింది. కాగా చందా కొచర్ తన పదవీకాంలో వీడియోకాన్‌కు క్విడ్ ప్రో కో ద్వారా చట్టవిరుద్ధంగా రూ.3250 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తోంది. అయితే మొదట్లో చందా కొచర్‌కు బాసటగా నిలిచిన ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు జస్టిస్ (రిటైర్డ్) బిఎన్ శ్రీకృష్ణ కమిటీని 2019 జనవరిలో ఏర్పాటు చేసింది. ఈ కమిటి నివేదిక ఆధారంగా ఆమెను పదవినుంచి తొలగించడంతోపాటు ఏప్రిల్ 2009- మార్చి 2018 మధ్య ఆమెకు చెల్లించిన అన్ని బోనస్, స్టాక్ ఆప్షన్లను తిరిగి తీసుకోవాలని బ్యాంక్ బోర్డు నిర్ణయించింది. మరోవైపు తన తొలగింపు చట్టవిరుద్ధమని పేర్కొంటూ బ్యాంకు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ (నవంబర్ 30, 2019న)చందా కొచర్ బాంబే హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
తెల్ల జెండాలతో వచ్చి శవాలను తీసుకెళ్లారు
న్యూఢిల్లీ: భారత సైన్యాన్ని కాల్పులతో ఎదుర్కోలేక పాకిస్తాన్ ఆర్మీ తెల్ల జెండాతో హాజిపిర్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖలోకి ప్రవేశించింది. భారత్–పాక్ సైన్యాల మధ్య జరిగిన కాల్పుల్లో మరణించిన తమ సైనికుల మృతదేహాలను తీసుకెళ్లేందుకు పాక్ ఆర్మీ ఈ పద్ధతిని ఎంచుకుంది. దీనికి ముందు పాక్ ఎల్ఓసీలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని విస్మరించి కాల్పులు జరిపింది. దీంతో భారత ఆర్మీ కూడా తిరిగి కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఈ నెల 10న పాక్ సైనికుడు గులాం రసూల్ మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు పాక్ తిరిగి కాల్పులు జరుపుతూ చొరబడాలని ప్రయత్నించింది. భారత సైన్యం తిరిగి కాల్పులు జరపడంతో మరో సైనికుడు మృతిచెందాడు. దీంతో రెండు రోజుల తర్వాత పాక్ సైన్యం తెల్ల జెండాతో ముందుకొచ్చింది. తెల్ల జెండా పట్టుకొని ఉంటే కాల్పులు జరపబోమని సంకేతం. ఈ జెండాతో మరణించిన తమ సైనికుల మృతదేహాలను తీసుకెళ్లింది. మరణించిన ఇద్దరినీ పంజాబ్‌కు చెందిన ముస్లింలుగా భావిస్తున్నారు. జూలై 30–31న కీరన్ సెక్టార్లో జరిగిన కాల్పుల్లో దాదాపు ఏడు మంది పాక్ సైనికులు మరణించినప్పటికీ, పాక్ వారి మృతదేహాలను తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. బహుశా వారు కశ్మీర్ నేపథ్యం ఉన్నవారుగానీ, పాకిస్తాన్‌లోని ఉత్తర లైట్ ఇన్ఫాంట్రీకి చెందిన వారు అయి ఉండవచ్చని ఆర్మీ వర్గాలు తెలిపాయి. కేవలం పంజాబీ పాకిస్తానీలు మరణిస్తేనే పాక్ ముందుకు వస్తుందని విమర్శించారు. -
మీరు చెప్పిందేమిటి... జరిగిందేమిటి!
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) కేసులో నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) బ్యాంకులకు అక్షింతలు వేసింది. అసెట్స్ అమ్మకం ద్వారా రూ. 37,000 కోట్లు రాబట్టేసుకుంటామంటూ ’తప్పుడు అభిప్రాయం’ కలిగించాయని, తీరా చూస్తే అమ్మకం జరగకపోగా.. రూ. 260 కోట్ల ఐటీ రీఫండ్‌ను రికవర్ చేసుకునేందుకు తంటాలు పడుతున్నాయని వ్యాఖ్యానించింది. ‘రిలయన్స్ జియోకి అసెట్స్‌ను విక్రయించడం ద్వారా రూ. 37,000 కోట్లు వస్తాయని ఆర్‌కామ్ అంటే మీరంతా దానికి వంతపాడారు. భవిష్యత్ అంతా బంగారంగా ఉంటుందంటూ భ్రమలు కల్పించారు. కానీ అసలు అసెట్స్ అమ్మకమే జరగలేదు. మీరు విఫలమయ్యారు. జాయింట్ లెండర్స్ ఫోరమ్ విఫలమైంది. అసలు మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పండి‘ అంటూ బ్యాంకులను.. ముఖ్యంగా ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ సారథ్యంలోని ద్విసభ్య ఎన్సీఎల్ఏటీ బెంచ్ కడిగేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎరిక్సన్ సంస్థకు బాకీలు కట్టుకోవడం కోసం ఐటీ రీఫండ్ నిధులను ఆర్‌కామ్ వినియోగించుకునేలా ఎందుకు అనుమతించరాదో చెప్పాలంటూ బ్యాంకులను ఆదేశించింది. దీనిపై రెండు పేజీల నోట్‌ను దాఖలు చేయాలని ఆదేశించిన ఎన్సీఎల్ఏటీ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. టెలికం పరికరాల సంస్థ ఎరిక్సన్కు రూ. 550 కోట్ల బాకీలు తీర్చకపోతే ఆర్‌కామ్ అధినేత అనిల్ అంబానీతో పాటు ఇద్దరు అధికారులు కోర్టు ధిక్కరణ నేరం కింద జైలుశిక్ష ఎదుర్కోనున్న సంగతి తెలిసిందే. దీంతో ఐటీ రీఫండ్ రూపంలో వచ్చిన రూ. 260 కోట్లను ఇందుకోసం ఉపయోగించుకునేలా తగు ఆదేశాలివ్వాలంటూ ఎన్సీఎల్ఏటీని ఆర్‌కామ్ ఆశ్రయించింది. -
పురాతన నాణేలు స్వాధీనం
అనంతపురం సెంట్రల్: కర్ణాటకలోని బీజాపూర్ కోటలో తవ్వకాల్లో బయటపడిన పురాతన నాణేలను విక్రయించేందుకు సిద్ధపడ్డ నిందితుడు బెస్త కరుణాకర్‌బాబును నాల్గవ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో పాత నేరస్తుడుగా ఉన్న సదరు నిందితుడు బుధవారం తపోవనం బస్‌స్టాప్ వద్ద పురాతన నాణేలతో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని నుంచి అమ్మవారి విగ్రహం, మత్తు పానీయం సేవించే పాత్ర, , రాగి బిందె, 822 రాగి నాణెలు స్వాధీనం చేసుకున్నట్లు నాల్గవ పట్టణ సీఐ శ్యామరావు వెల్లడించారు. నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు వివరించారు. -
భారీగా నకిలీ 2000 నోట్ల పట్టివేత
రాజ్‌కోట్: పెద్ద నోట్ల రద్దు సందర్భంగా ఇక కొత్తగా వచ్చే నోట్లకు నకిలీ తయారు చేయడం సాధ్యం కాదని.. ఇప్పటి వరకూ ఉన్న నకిలీ నోట్ల ప్రెస్‌లను మూసివేసుకోవాల్సిందే అంటూ వ్యాఖ్యలు వినిపించాయి. అయితే.. ఈ వ్యాఖ్యలు ఉత్తమాటలేనా అనే సందేహాలు వ్యక్తమయ్యేరీతిలో భారీ సంఖ్యలో కొత్త 2000 నోట్లు నకిలీవి గుజరాత్లో పట్టుబడ్డాయి. రూ. 26 లక్షల నకిలీ 2000 నోట్లను రాజ్‌కోట్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌చేసి విచారణ జరుపుతున్నారు. కొత్తనోట్లను ఎక్కడ ముద్రించారు, దీని వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. -
మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు!
ముంబై : గత కొన్ని రోజులుగా తగ్గుముఖంగా ఉన్న బంగారం ధరలు సోమవారం రికవరీ అయ్యాయి. అంతర్జాతీయంగా వస్తున్న బలమైన సంకేతాలతో పాటు దేశీయ బులియన్ మార్కెట్లో నెలకొన్న తాజా డిమాండ్‌తో బంగారం ధరలు ఎగిశాయి. వెండి సైతం స్వల్పంగా లాభపడింది. శుక్రవారం రూ.29,160గా ఉన్న 99.5 శాతం స్వచ్ఛమైన 10 గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర నేటి మార్కెట్లో రూ.135 రూపాయలు లాభపడి రూ.29,295గా నమోదైంది. అదేవిధంగా 10 గ్రాముల ప్యూర్ బంగారం ధర రూ.29,445గా ఉంది. వెండి ధర సైతం స్వల్పంగా రూ.35 ఎగిసి కేజీ రూ.41,800 వద్ద ముగిసింది. డాలర్ షాక్‌తో ఐదున్నర కనిష్ట స్థాయికి పడిపోయిన బంగారం ధరలు గ్లోబల్‌గా పునరుద్ధరించుకున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో ద్రవ్యోల్బణం పెరగొచ్చనే అంచనాలతో డాలర్ విలువ బలపడుతూ వస్తోంది. దూసుకుపోతున్న డాలర్ కొంచెం నెమ్మదించే సరికి, బంగారం ధరలు పునరుద్ధరించుకోవడం ప్రారంభించాయి. స్పాట్ గోల్డ్ ధరలు అంతర్జాతీయంగా ఒక ఔన్స్‌కు 1,214.21 డాలర్లు ఎగిశాయి. సిల్వర్ సైతం 16.67 డాలర్లు పెరిగింది. -
రూ.3 లక్షలు విలువ చేసే గుట్కా స్వాధీనం
అనంతపురం సెంట్రల్ : నగరంలో కళ్యాణదుర్గం రోడ్డు సమీపంలో మబ్బుకొట్టాలలో రూ.3 లక్షలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను మంగళవారం రాత్రి టూటౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుట్కా నిల్వ చేసినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఒక షెడ్డుపై దాడి చేయగా అందులో నిల్వ చేసిన గుట్కా పాకెట్లు బయటపడ్డాయి. అయితే నిందితులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. ఈ దాడుల్లో సీఐ శుభకుమార్, ఎస్ఐ శివగంగాధర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
పన్నులు తక్కువ వసూళ్లు చేస్తే చర్యలు
ఏలూరు (మెట్రో): జిల్లాలో 15–16 సంవత్సరానికి సంబంధించి వచ్చే వారం రోజుల్లో 90శాతం తక్కువ పన్నులు వసూలు చేసే ఇఒ పిఆర్డిలు, పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం పంచాయతీ పన్నులు, డంపింగ్ యార్డుల నిర్మాణం, చెత్త సేకరణ, బయోమెట్రిక్ హాజరు అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ పన్నుల వసూళ్లపై ప్రతి వారం సమీక్షిస్తున్నా కొంత మంది అధికారులు నిర్లక్ష్యం వీడటం లేదనీ, సమావేశానికి వచ్చి ఏదోలా ఆ వారం గడపడానికి కుంఠిసాకులు చెప్పడం పరిపాటిగా మారిందని అసహనం వ్యక్తం చేశారు. ఛాగల్లు, ఉండ్రాజవరం, పెరవలి, దేవరపల్లి మండలాల్లో ఇంటి పన్నులతోపాటు కుళాయి పన్నులు కూడా సరిగా వసూలు చేయడం లేదన్నారు. సిబ్బంది స్థానికంగా నివాసం ఉండాలని లేకుంటే ఉద్యోగాలు వదిలి వెళ్లాలన్నారు. పల్లెల్లో కొందరు ప్రజాప్రతినిధులు కుళాయి పన్నులు కట్టబోమని చెబుతున్నారని పలువురు ఇఒపిఆర్‌డిలు సమావేశంలో ప్రస్తావించగా నెలకు కుళాయికి 50 రూపాయలు పన్ను కట్టలేని స్థితిలో పశ్చిమ ప్రజలు లేరనీ, తొలి నుండి పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వల్ల కొన్ని చోట్ల ప్రతిఘటన పరిస్థితులు ఉండవచ్చని అక్కడ కూడా వాస్తవ పరిస్థితిని వివరిస్తే నూరు శాతం పన్నులు వసూలు అవుతాయని కలెక్టర్ చెప్పారు. పంచాయతీలకు సంబంధించిన తీర్మానాలు, జమాఖర్చులు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో డివిజనల్ పంచాయతీ అధికారులు రాజ్యలక్ష్మి, శ్రీరాములు, అమ్మాజీ, ఇఒపిఆర్‌డిలు, ఎంపిడిఒ ప్రకాశరావు పాల్గొన్నారు. చెత్త సేకరణకు రిక్షాలు జిల్లాలో ప్రతి 200 ఇళ్లనూ ఒక బ్లాక్‌గా గుర్తించి ఇంటింటా చెత్తసేకరణకు ఒక రిక్షాను కేటాయిస్తామని ప్రజలంతా ఇళ్లల్లోని చెత్త సేకరణ సిబ్బందికిచ్చి పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం అత్తిలి ఇఒపిఆర్‌డి వీరాస్వామినాయుడు మండలంలో ఇంటింటా చెత్త సేకరణకు గూగుల్ రూట్ప్లాన్ను కలెక్టర్‌కు వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ జిల్లాలో ప్రతి పల్లె పరిశుభ్ర వాతావరణంలో ఉంచేందుకు ఇంటింటా చెత్త సేకరణ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని గ్రామపంచాయతీలో ప్రతి 200 ఇళ్లకు ఒక చెత్త రెక్షా ఏర్పాటు చేసుకోవాలని ఆ గ్రామంలో మొత్తం ఇళ్లను బట్టి ఎన్ని రిక్షాలు అవసరమవుతాయో, ఎంత మంది చెత్త సేకరణ సిబ్బంది కావాలో అనేది ప్రణాళిక సిద్ధం చేసుకుని రానున్న సమావేశాన్ని హాజరుకావాలని కలెక్టర్ చెప్పారు. జిల్లాలలో గాంధీజీ కలలుగన్న పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం ఆచరణలో అమలు చేసేందుకు ఇంటింటా చెత్త సేకరణ ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్ చెప్పారు. -
900 మొబైల్ ఫోన్లు, రక్తపు వస్త్రాలు స్వాధీనం
లక్నో: వరుస హత్యలకు, దొంగతనాలకు పాల్పడుతోన్న కరడుగట్టిన నేరస్తుడిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఎతాహ్ జిల్లా వ్యాప్తంగా జరిగే దోపిడీలు, హత్యాయత్న ఘటనలన్నీ కూడా అతడు చేసినవేనంట. ఈ నెల(సెప్టెంబర్) 10న సర్వేశ్ అనే వ్యక్తిని హత్య చేసి దోచుకొని పుష్పేంద్ర అనే దొంగ పరారయ్యాడు. అతడి కోసం వారం రోజులుగా గాలింపులు జరుపుతున్న పోలీసులకు సిద్ధపురా ప్రాంతంలో పారిపోతుండగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లో నుంచి పదునైన ఆయుధాలను, రక్తంతో తడిసిన వస్త్రాలను, 900 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
దొంగ అరెస్ట్..రూ.12 లక్షల సొత్తు స్వాధీనం
మదనపల్లి రూరల్(చిత్తూరు జిల్లా): మదనపల్లి పట్టణంలో చోరీలకు పాల్పడుతున్న మహ్మద్ రఫీక్(40) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.12 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో 13 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వారం క్రితం ఓ ఇంట్లో దొంగతనానికి వచ్చి దొరికిపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు సొత్తును రికవరీ చేయడానికి విషయాన్ని గోప్యంగా ఉంచారు. మహ్మద్ రఫీక్ స్థానికంగా ఉన్న పైనాన్స్ కంపెనీలో రూ.45 లక్షలు తీసుకుని ఓ లారీ కొనుగోలు చేశాడు. తీసుకున్న లారీకి ఇన్స్టాల్మెంట్లు కట్టలేక, చెడు అలవాట్లకు బానిసై అప్పులపాలయ్యాడు. దీంతో తేలికగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో చోరీలకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయాడు. -
నల్లధనం తరలిస్తూ...
లుథియాన: కోటిరూపాయల నల్లధనాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని లుథియానా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ కు చెందిన వీరిద్దరూ పేపర్ మిల్ లో పనిచేసే పంకజ్ గోయల్, రవికాంత్ లుగా గుర్తించినట్లు తెలిపారు. అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(ఏడీసీపీ) తెలిపిన వివరాల ప్రకారం షేర్ పూర్ చౌక్ పోలీసు చెక్ పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా టయోటా ఫార్చునర్ నుంచి రెండు సూట్ కేసుల్లో తరలిస్తున్న కోటి రూపాయల డబ్బును పట్టుకున్నట్లు వివరించారు. తాము పనిచేసే పేపర్ మిల్ యజమాని బిందాల్ ఈ డబ్బును లుథియానాలోని రాకేష్ కు ఇవ్వమని చెప్పినట్లు నిందితులు తెలిపారని వివరించారు. ప్రాథమిక విచారణలో ఈ డబ్బు నల్లధనంగా తేలిందని చెప్పారు. రాకేష్ అనే వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. -
'కంగారు వద్దు.. నేను క్షేమంగా ఉన్నాను'
ముంబయి: తాను క్షేమంగానే ఉన్నట్లు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తెలియజేశారు. స్వల్ప అనారోగ్యానికి గురైన ఆయన కోలుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తన అభిమానులు అసలు కంగారు పడాల్సిన పనిలేదన్నారు. 'నేను కోలుకుంటున్నాను. కాకపోతే కొంత నెమ్మదిగా. ఈ సమయంలో నా పరిస్థితి గురించి నా అభిమానులకు తెలియజేయడం నా బాధ్యత. అందుకే చెప్తున్నాను. నేను బాగానే ఉన్నాను. ఎవరూ ఎలాంటి ఆందోళన పెట్టుకోవద్దు. ఇలాంటివి అప్పుడప్పుడు వస్తుంటాయి.. పోతుంటాయి. ప్రస్తుతానికి ఓ పెయిన్ కిల్లర్ మాత్రం తీసుకున్నాను' అని చెప్పారు. చెన్నైలో ఓ నివాళి కార్యక్రమానికి హాజరైన ఆయన స్వల్పంగా అనారోగ్యం పాలయ్యారు. -
ఐదేళ్ల కిందటి ల్యాండ్ మైన్ వెలికితీత
భరంపూర్: ఒడిశాలో ఐదేళ్ల కిందటి శక్తిమంతమైన మందుపాతరను భద్రతా బలగాలు వెలికి తీశాయి. అనంతరం నిర్వీర్యం చేశాయి. అది ఒక వేళ పేలిపోయి ఉంటే భారీ స్థాయిలో ప్రాణనష్టం చోటుచేసుకొని ఉండేదని పోలీసులు తెలిపారు. ఒడిశాలో మావోయిస్టుల ఏరి వేత చర్యల్లో భాగంగా గజపతి జిల్లాలో పానిగండా అనే గ్రామంలో పోలీసులు, ప్రత్యేక బలగాలు కలిసి కూంబింగ్ నిర్వహిస్తుండగా ఓ శక్తిమంతమైన ల్యాండ్ మైన్ ఉన్నట్లు గుర్తించారు. అనంతరం జాగ్రత్తగా దానిని వెలికి తీసి పరిశీలించగా ఐదేళ్ల కిందటే మావోయిస్టులు దానిని పాతి పెట్టి ఉంచారనే అంఛనాకు వచ్చారు. దీనిని గుర్తించిన అనంతరం మరింత అప్రమత్తమైన బలగాలు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో మరింత విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు.