'కంగారు వద్దు.. నేను క్షేమంగా ఉన్నాను' | I am well: Big B | Sakshi
Sakshi News home page

'కంగారు వద్దు.. నేను క్షేమంగా ఉన్నాను'

Published Mon, Feb 22 2016 11:56 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'కంగారు వద్దు.. నేను క్షేమంగా ఉన్నాను' - Sakshi

'కంగారు వద్దు.. నేను క్షేమంగా ఉన్నాను'

ముంబయి: తాను క్షేమంగానే ఉన్నట్లు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తెలియజేశారు. స్వల్ప అనారోగ్యానికి గురైన ఆయన కోలుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తన అభిమానులు అసలు కంగారు పడాల్సిన పనిలేదన్నారు.

'నేను కోలుకుంటున్నాను. కాకపోతే కొంత నెమ్మదిగా. ఈ సమయంలో నా పరిస్థితి గురించి నా అభిమానులకు తెలియజేయడం నా బాధ్యత. అందుకే చెప్తున్నాను. నేను బాగానే ఉన్నాను. ఎవరూ ఎలాంటి ఆందోళన పెట్టుకోవద్దు. ఇలాంటివి అప్పుడప్పుడు వస్తుంటాయి.. పోతుంటాయి. ప్రస్తుతానికి ఓ పెయిన్ కిల్లర్ మాత్రం తీసుకున్నాను' అని చెప్పారు. చెన్నైలో ఓ నివాళి కార్యక్రమానికి హాజరైన ఆయన స్వల్పంగా అనారోగ్యం పాలయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement