సుశాంత్‌కు స్లో పాయిజన్‌ ఇచ్చారు: నటి | Drug Case: Actor Said About Bollywood Industry Drug Nexus | Sakshi
Sakshi News home page

రియాను హనీ ట్రాప్‌గా‌ ఉపయోగించారు: నటి

Published Mon, Sep 14 2020 2:49 PM | Last Updated on Mon, Sep 14 2020 3:39 PM

Drug Case: Actor Said About Bollywood Industry Drug Nexus - Sakshi

ముంబై: ప్రస్తుతం బాలీవుడ్‌లో డ్రగ్స్‌ కేసు కలకలం రేపుతోంది. సుశాంత్‌ మృతి కేసుతో వెలుగు చూసిన ఈ డ్రగ్స్‌ కేసులో రోజుకో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే సుశాంత్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తితో పాటు మరో నలుగురిని ఎన్‌సీబీ అరెస్టు చేసిన జైలుకు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో కీలక సమాచారం వెలుగు చూసింది. డ్రగ్స్‌ కేసులో రియాను హనీ ట్రాప్‌గా ఉపయోగించారని దీని వెనక పెద్ద కుట్ర ఉందని అంకిత లోఖండేల సన్నిహితురాలైన బాలీవుడ్‌ నటి వెల్లడించింది. అంతేగాక సుశాంత్‌కు స్లో పాయిజన్‌ కూడా ఇచ్చారని సదరు నటి సంచలన వ్యాఖ్యలు చేశారు.
(చదవండి: రేఖ టూ రియా.. చరిత్ర పునరావృతమవుతోందా?)

ఆమె ఓ ఇంగ్లీష్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఈ విషయాలను వెల్లడించారు. బాలీవుడ్‌ డ్రగ్‌ నెక్సస్‌ సుశాంత్‌ను బలిగొందని, ఆమె కూడా ఈ డ్రగ్స్‌ పెడ్లర్ల బాధితురాలినే అని చెప్పారు. అదృష్టవశాత్తు దీని నుంచి బయట పడ్డానని, తన జీవితంలో అది ఒక భయంకరమైన దశ అని ఆమె పేర్కొన్నారు. ‘సుశాంత్‌ మృతి కారణాలు ఒక్కొక్కటిగా తెలుస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఇందంతా చేస్తుంటే తన జీవితాన్ని తెరపై చూస్తున్నట్టుందని ఆవేదన వ్యక్తం చేశారు. నేను కూడా ఒకప్పుడు అదే డ్రగ్స్‌ ముఠా బాధితురాలిగా ఉన్నాను. బాలీవుడ్‌ రెండవ పేరు డ్రగ్‌గా ఆమె పిలిచారు. ఈ డ్రగ్స్‌ ముఠా చాలా పెద్దది. పరిశ్రమలో పెద్ద పెద్ద లింక్‌లు ఉన్నాయ’ని సదరు నటి తెలిపింది. పరిశ్రమలో అడుగు పెట్టిన కొత్తలో తనకు ఎదురైన చేదు అనుభవాలను ఈ సందర్భంగా నటి గుర్తు చేసుకున్నారు. (చదవండి: మళ్లీ డ్రగ్స్‌ కలకలం.. తెరపైకి రకుల్‌‌ పేరు)

‘‘పరిశ్రమలో ఎవరికి తెలియని డ్రగ్స్‌ చీకటి కోణం ఉంది. నేను అలీబాగ్‌లోని ఓ గ్రామం నుంచి వచ్చాను.  పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో ఓ పార్టీకి వెళ్లాను. అక్కడ నా ఎదురుగా ఉన్న బల్లపై తెల్లటి పౌడర్‌ ఉంది. అది ఇది డ్రగ్‌ అని తెలిసి ఆశ్చర్యపోయాను. అయితే అక్కడి వారంతా నువ్వు ఈ డ్రగ్‌ తీసుకోకపోతే నిన్ను ఓ గ్రామం నుంచి వచ్చిన వ్యక్తిగా చులకనగా చూస్తారు’’ అని తనతో చెప్పినట్లు తెలిపారు. బాలీవుడ్‌లో డ్రగ్‌ తీసుకోవడం ట్రెండ్‌గా ఫాలో అవుతారని, ఇది తీసుకోకపోతే మిమ్మల్ని వింతగా చూస్తారని చెప్పింది. పెద్ద పెద్ద పార్టీల్లో మాదక ద్రవ్యాలను విచ్చల విడిగా వినియోగిస్తారని, పార్టీలకు మాదక ద్రవ్యాలు సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా డీలర్లు, పెడ్లర్‌లు ఉన్నట్లు ఆమె చెప్పింది. ఈ ముఠాకు సంబంధించిన ప్రధాన వ్యక్తిని చేరుకోలేరని కూడా సదరు నటి తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement