అపూర్వ అశ్విన్ దౌడ
సాక్షి,హైదరాబాద్: మోడలింగ్ పేరుతో ప్రముఖ మాల్స్‌లో ర్యాంప్ షోలు నిర్వహించి, ప్రముఖ యాడ్స్‌లో సినీ తారలు, క్రికెటర్లతో కలిసి నటించే అవకాశాలు కల్పిస్తానని అమాయకులకు టోకరా వేస్తున్న ఘరానా మోసగాడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ర్యాంప్ షోలో పాల్గొనే వారితో మేకప్ ఛార్జీలు, కాస్ట్యూమ్స్ ఇతర ఉపకరణాల పేరుతో ఖాతాలలో డబ్బు జమ చేయించుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ముంబైకి చెందిన అపూర్వ అశ్విన్ దౌడ అలియాస్ అర్మాన్ అర్జున్ కపూర్ గతంలో రెండు బాలీవుడ్ సినిమాల్లో నటించాడు. కాస్మోపాలిటన్ మోడల్స్ ఏజెన్సీ ఏర్పాటు చేసిన అతను చైల్డ్ మోడలింగ్ షోలు నిర్వహించేవాడు. ఈ నేపథ్యంలో మదీనా గూడకు చెందిన గోపాలకృష్ణన్ కృష్ణానంద్ కుమార్తెను తాను నిర్వహించిన షోలో ఎంపిక చేశాడు. అనంతరం ఆమెకు ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్‌తో కలిసి యాడ్‌లో నటించే అవకాశం కల్పిస్తానని నమ్మించాడు.
ఇందుకుగాను క్యాస్టూమ్స్, షూటింగ్ పేరుతో పలు దఫాలుగా రూ.14 లక్షలు తన ఖాతాలో జమచేయించుకున్నాడు. అయితే తన కుమార్తెకు అవకాశం కల్పించకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం నిందితుడిని అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.15.60 లక్షల నగదు, 4 యాపిల్ ఫోస్లు, ల్యాప్‌ట్యాప్, 3 సిమ్ కార్డులు, 2 ఆధార్‌కార్డులు స్వాధీదీనం చేసుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే మంబైలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు.
చదవండి: కట్టెల కోసం వెళ్తే కబళించిన పులి.. అటవీ సిబ్బంది క్వార్టర్స్ వద్దే ఘోరం!
Comments
Please login to add a commentAdd a comment