Megastar Amitabh Bachchan
-
ఆమె స్పెషల్ లేడీ: మెగాస్టార్
ముంబై: అలనాటి బాలీవుడ్ నటి స్మితా పాటిల్ 'స్పెషల్ లేడీ' అంటూ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కితాబిచ్చారు. స్మితా 61వ జయంతి సందర్భంగా అమితాబ్ ఆమెను స్మరించుకున్నారు. స్మితాతో కలసి శక్తి, నమక్ హలల్ సినిమాల్లో నటించానని అమితాబ్ పేర్కొన్నారు. స్మితా స్పెషల్ లేడీ, వివేకవంతమైన స్నేహితురాలు.. అంటూ ట్వీట్ చేశారు. 1980ల్లో స్మితా అగ్రశ్రేణి నటిగా వెలుగొందారు. కేవలం దశాబ్దకాలం కెరీర్లో 80కి పైగా సినిమాల్లో నటించారు. హిందీతో పాటు మరాఠీ సినిమాల్లో నటించారు. జాతీయ చలనచిత్ర అవార్డుతో పాటు పద్మశ్రీ అందుకున్నారు. మంతన్, భూమిక, ఆక్రోశ్, చక్ర, చిదంబరం, మిర్చ్ మసాలా వంటి హిట్ సినిమాల్లో నటించారు. బాలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు రాజ్బబ్చర్ను వివాహం చేసుకున్న స్మితా 31వ ఏట అనారోగ్యంతో మరణించారు. ఆమె కుమారుడు ప్రతీక్ నటుడు. -
మహిళలకు మెగాస్టార్ మాట
ముంబై: మహిళలు సాధికారతతో తమ భాగస్వాములతో సమాన స్థాయిలో జీవించాలని, జీవితంలో ఎక్కడా రాజీపడి సంతృప్తి చెందరాదని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చెబుతున్నారు. కల్చర్ మిషన్ బ్లష్ చానెల్, వివెల్ కంపెనీతో కలసి అమితాబ్ 'అబ్ సంఝౌతా నహీ' పేరుతో ఓ వీడియోను రూపొందించారు. ఈ వీడియోలో అమితాబ్ మహిళలకు స్ఫూర్తి కలిగించేలా సాధికారత, హోదా గురించి మాట్లాడారు. మహిళల జీవితం రాజీపడుతూ సాగరాదని అమితాబ్ అన్నారు. మనసులో సంఘర్షణ పడుతున్న మహిళలు వాస్తవిక భావోద్వేగాలతో వాటి నుంచి బయటపడాలని సూచించారు. హక్కు అన్నది ఎప్పుడూ నిశ్శబ్ధంగా ఉండరాదని చెప్పారు. మహిళల ఆత్మవిశ్వాసంతో దేన్నైనా సాధించగలరని, సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఈ వీడియోలో అమితాబ్ చెప్పారు. -
'కంగారు వద్దు.. నేను క్షేమంగా ఉన్నాను'
ముంబయి: తాను క్షేమంగానే ఉన్నట్లు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తెలియజేశారు. స్వల్ప అనారోగ్యానికి గురైన ఆయన కోలుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తన అభిమానులు అసలు కంగారు పడాల్సిన పనిలేదన్నారు. 'నేను కోలుకుంటున్నాను. కాకపోతే కొంత నెమ్మదిగా. ఈ సమయంలో నా పరిస్థితి గురించి నా అభిమానులకు తెలియజేయడం నా బాధ్యత. అందుకే చెప్తున్నాను. నేను బాగానే ఉన్నాను. ఎవరూ ఎలాంటి ఆందోళన పెట్టుకోవద్దు. ఇలాంటివి అప్పుడప్పుడు వస్తుంటాయి.. పోతుంటాయి. ప్రస్తుతానికి ఓ పెయిన్ కిల్లర్ మాత్రం తీసుకున్నాను' అని చెప్పారు. చెన్నైలో ఓ నివాళి కార్యక్రమానికి హాజరైన ఆయన స్వల్పంగా అనారోగ్యం పాలయ్యారు. -
పీకూ ప్రమోషన్ కార్యక్రమానికి బిగ్ బి..నో..?
ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన అప్ కమింగ్ మూవీ పీకూ ప్రమోషన్ కార్యక్రమానికి హాజరు కావడంలేదు. 72ఏళ్ల అమితాబ్ ప్రస్తుతం వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఢిల్లీలో జరగనున్న ప్రమోషన్ కార్యక్రమానికి ఆయన హాజరు కావడం లేదట. ఈ విషయాన్ని స్వయంగా అమితాబే సోమవారం తన ట్విట్టర్ ద్వారా అభిమానులు, సన్నిహితులతో పంచుకున్నారు. 'జ్వరం కొద్దిగా తగ్గింది.. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోకపోతే మనసు కుదురుగా ఉండదుగా' అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా దీపికా పదుకొనే , ఇర్ఫాన్ ఖాన్ తదితరులు నటిస్తున్న పీకూ సినిమా మే 8 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీలో దీపికా తండ్రిగా అమితాబ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.. -
నేడు గ్లోబల్ డైవర్సిటీ అవార్డు అందుకొనున్న అమితాబ్
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ గ్లోబల్ డైవర్సిటీ అవార్డును బుధవారం న్యూఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అందుకోనున్నారు. అనంతరం ఆయన లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్తో ఆయన సమావేశం కానున్నారు. బాలీవుడ్ చిత్ర సీమను మకుటంలేని మహారాజుగా ఖ్యాతి పొందిన అమితాబ్ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. 1984లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్ పురస్కారాలతో భారత ప్రభుత్వం అమితాబ్‌ను సత్కరించింది. అలాగే 1999లో బీబీసీ ఆన్లైన్లో నిర్వహించిన గ్రేటెస్ట్ స్టార్ ఆఫ్ స్టేజ్ ఆర్ స్ర్కీన్ ఆఫ్ ద మిలీనియంగా అమితాబ్ ఎంపికై సంగతి తెలిసిందే. 2007లో అమితాబ్‌ను నైట్ ఆఫ్ ద లిజియన్ ఆఫ్ హనర్ పురస్కారంతో ఫ్రెంచ్ ప్రభుత్వం గౌరవించింది. అలాగే లండన్, న్యూయార్క్, హాంకాంగ్, బ్యాంకాక్ నగరాల్లోని మ్యూజియంలో అమితాబ్ మైనపు బొమ్మను ఏర్పాటు చేసిన సంగతి విదితమే.