పీకూ ప్రమోషన్ కార్యక్రమానికి బిగ్ బి..నో..? | 'Unwell' Big B skips Delhi promotion for 'Piku' | Sakshi
Sakshi News home page

పీకూ ప్రమోషన్ కార్యక్రమానికి బిగ్ బి..నో?

Published Tue, May 5 2015 12:22 PM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM

పీకూ  ప్రమోషన్ కార్యక్రమానికి బిగ్ బి..నో..?

పీకూ ప్రమోషన్ కార్యక్రమానికి బిగ్ బి..నో..?

ముంబై:  బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన అప్ కమింగ్ మూవీ పీకూ ప్రమోషన్ కార్యక్రమానికి హాజరు కావడంలేదు.  72ఏళ్ల  అమితాబ్ ప్రస్తుతం వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్టు  తెలుస్తోంది. అందుకే ఢిల్లీలో జరగనున్న ప్రమోషన్ కార్యక్రమానికి ఆయన హాజరు కావడం లేదట.

ఈ విషయాన్ని స్వయంగా అమితాబే  సోమవారం తన ట్విట్టర్ ద్వారా  అభిమానులు, సన్నిహితులతో పంచుకున్నారు.  'జ్వరం కొద్దిగా  తగ్గింది.. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోకపోతే మనసు కుదురుగా ఉండదుగా' అంటూ ఆయన ట్వీట్  చేశారు.
కాగా దీపికా పదుకొనే , ఇర్ఫాన్ ఖాన్ తదితరులు నటిస్తున్న పీకూ  సినిమా మే 8 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీలో దీపికా తండ్రిగా  అమితాబ్ నటిస్తున్న సంగతి తెలిసిందే..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement