ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ గ్లోబల్ డైవర్సిటీ అవార్డును బుధవారం న్యూఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అందుకోనున్నారు. అనంతరం ఆయన లోక్సభ స్పీకర్ మీరాకుమార్తో ఆయన సమావేశం కానున్నారు. బాలీవుడ్ చిత్ర సీమను మకుటంలేని మహారాజుగా ఖ్యాతి పొందిన అమితాబ్ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.
1984లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్ పురస్కారాలతో భారత ప్రభుత్వం అమితాబ్ను సత్కరించింది. అలాగే 1999లో బీబీసీ ఆన్లైన్లో నిర్వహించిన గ్రేటెస్ట్ స్టార్ ఆఫ్ స్టేజ్ ఆర్ స్ర్కీన్ ఆఫ్ ద మిలీనియంగా అమితాబ్ ఎంపికై సంగతి తెలిసిందే. 2007లో అమితాబ్ను నైట్ ఆఫ్ ద లిజియన్ ఆఫ్ హనర్ పురస్కారంతో ఫ్రెంచ్ ప్రభుత్వం గౌరవించింది. అలాగే లండన్, న్యూయార్క్, హాంకాంగ్, బ్యాంకాక్ నగరాల్లోని మ్యూజియంలో అమితాబ్ మైనపు బొమ్మను ఏర్పాటు చేసిన సంగతి విదితమే.