
కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు
ఢిల్లీ : నిత్యం తీవ్ర వాయు కాలుష్యం(Delhi Pollution)తో కొట్టిమిట్టాడే ఢిల్లీలో కాలుష్య నివారణ చర్యలకు శ్రీకారం చుట్టింది తాజా బీజేపీ ప్రభుత్వం. ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యలను బీజేపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా ఈరోజు(శనివారం) సమీక్ష నిర్వహించారు పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా.
ఈ సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ఢిల్లీ ప్రభుత్వం. పాత వాహణాలపై ఆంక్షలు, స్మోగ్ నిరోధక చర్యలు తప్పనిసరి చేయడంతో పాటు పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ కు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని నిర్ణయించింది. ఢిల్లీలోని అన్ని ఎత్తైన భవనాలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలు వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి యాంటీ స్మోగ్ గన్ లను ఏర్పాటు చేయడాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయం తీసుకున్నఆరు. ఢిల్లీలో కొన్ని పెద్ద హోటళ్లు, కొన్ని పెద్ద కార్యాలయం సముదాయాలు, ఢిల్లీ విమానాశ్రయం, పెద్ద నిర్మాణ స్థలాలకు వెంటనే యాంటీ స్మోగ్ ఎక్స్ ని ఇన్ స్టాల్ చేయడాన్ని తప్పనిసరి చేయనున్నారు.
వాహనాలకు 15 ఏళ్లు దాటితే..
ఇక 15 ఏళ్లు దాటిన వాహనాలకు ఢిల్లీ బంకుల్లో ఇంధనం నిలిపివేయనున్నారు. 15 ఏళ్ల పైబడిని వాహనాలకు మార్చి 31 తర్వాత బంకుల్లో ఇంధనం పోయకూడదంటూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment