నేటి నుంచి ట్రక్కులు బంద్
బడులు మొత్తం ఆన్‌లైన్‌లోనే
ఆఫీసులు కూడా 50 శాతం కెపాసిటీ
ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్‌ఫ్రమ్ హోం
ఢిల్లీ వాయుకాలుష్యంపై సీఏక్యూఎం తీవ్ర ఆందోళన
దేశ రాజధానిలో కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతూ.. డేంజర్ లెవల్‌ను దాటిపోయింది. ఈ ఉదయం నగరంలో వాయునాణ్యత సూచీ (ఏక్యూఐ) 450 severe-plus దాటింది. దీంతో ఈ సీజన్‌కే వరెస్ట్ పరిస్థితి నెలకొంది. మరోవైపు పొగమంచు కమ్మేయడం అన్నీ రవాణా వ్యవస్థలకు ఆటంకం కలుగుతోంది. ఇప్పటికే పలు ఆంక్షలు విధించగా.. ఈ ఉదయం నుంచి మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో ఈ ఉదయం నుంచి ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్‌ఏపీ)- 4’ కింద మరిన్ని నిబంధనలను అమల్లోకిచ్చాయి. ఢిల్లీలో ట్రక్కుల ప్రవేశంపై నిషేధం విధించారు. నిత్యావసరాలు అందించే ట్రక్కులకు మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అలాగే.. ఎల్‌ఎన్‌జీ, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్, బీఎస్-4 డీజిల్ ట్రక్కులనే తిరగనిస్తారు.
మరోవైపు కాలుష్యానికి దట్టమైన పొగమంచు తోడైంది. విమాన ప్రయాణాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఉదయం ఐదు గంటలకు విజిబిలిటీ 150 మీటర్ల దూరానికి పడిపోయింది. ఈ ఉదయం ఏడుగంటలకు.. ఏక్యూఐ 481గా నమోదైంది.
👉ఏక్యూఐ 0-50 మద్య ఉంటే గుడ్,
👉51-100 ఉంటే సంతృప్తికరం,
👉101-200 మధ్య ఉంటే ఓ మోస్తరు కాలుష్యం,
👉201-300 నుంచి పూర్,
👉301 నుంచి 400 మధ్య ఉంటే వెరీ పూర్,
👉401 నుంచి 450 ఉంటే సివియర్,
👉450 పైనే ఉంటే వెరీ సివియర్
ఈ స్థాయిలో ఢిల్లీ కాలుష్యం పెరగడంపై ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (సీఏక్యూఎం) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అన్నిరకాల నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్ వంతెనలు, పవర్ లైన్‌లు, పైపులైన్‌లు.. ఇలా ఎలాంటి నిర్మాణ సంబంధిత ప్రాజెక్టులైనా సరే ఆపేయాలని స్పష్టం చేసింది. అలాగే.. సరి-బేసి వాహన నిబంధనలు అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ సూచించింది.
కాలుష్యానికి తోడు దట్టమైన పొగమంచు పేరుకుపోయి కనీసం వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఆదివారం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మూడు విమానాలను రద్దు చేయగా.. మరో 107 విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి.
సీఏక్యూఎం సూచన మేరకు.. ఇప్పటికే 1 నుంచి ఐదో తరగతి వరకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. తాజాగా 6 నుంచి 9, 11 తరగతుల విద్యార్థులకు వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అన్ని పాఠశాలలకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖను ఢిల్లీ సీఎం ఆతిశీ ఆదేశించారు.
ప్రైవేట్ ఆఫీసులతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు కూడా 50 శాతం సామర్థ్యంతో పని చేసేలా చర్యలు చేపట్టాలని, మిగతావాళ్లను వర్క్‌ఫ్రమ్ హోం ద్వారా పని చేయించుకోవాలని అధికార యంత్రాగానికి సీఏక్యూఎం సిఫారసు చేసింది.
ఇదీ చదవండి: మందు పార్టీ లేదా సీఎం సాబ్?
Comments
Please login to add a commentAdd a comment