Delhi-NCR
-
Delhi Pollution: ఢిల్లీలో వరస్ట్ మార్నింగ్
దేశ రాజధానిలో కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతూ.. డేంజర్ లెవల్‌ను దాటిపోయింది. ఈ ఉదయం నగరంలో వాయునాణ్యత సూచీ (ఏక్యూఐ) 450 severe-plus దాటింది. దీంతో ఈ సీజన్‌కే వరెస్ట్ పరిస్థితి నెలకొంది. మరోవైపు పొగమంచు కమ్మేయడం అన్నీ రవాణా వ్యవస్థలకు ఆటంకం కలుగుతోంది. ఇప్పటికే పలు ఆంక్షలు విధించగా.. ఈ ఉదయం నుంచి మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో ఈ ఉదయం నుంచి ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ)- 4’ కింద మరిన్ని నిబంధనలను అమల్లోకిచ్చాయి. ఢిల్లీలో ట్రక్కుల ప్రవేశంపై నిషేధం విధించారు. నిత్యావసరాలు అందించే ట్రక్కులకు మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అలాగే.. ఎల్ఎన్జీ, సీఎన్జీ, ఎలక్ట్రిక్, బీఎస్-4 డీజిల్ ట్రక్కులనే తిరగనిస్తారు.మరోవైపు కాలుష్యానికి దట్టమైన పొగమంచు తోడైంది. విమాన ప్రయాణాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఉదయం ఐదు గంటలకు విజిబిలిటీ 150 మీటర్ల దూరానికి పడిపోయింది. ఈ ఉదయం ఏడుగంటలకు.. ఏక్యూఐ 481గా నమోదైంది. 👉ఏక్యూఐ 0-50 మద్య ఉంటే గుడ్, 👉51-100 ఉంటే సంతృప్తికరం, 👉101-200 మధ్య ఉంటే ఓ మోస్తరు కాలుష్యం, 👉201-300 నుంచి పూర్, 👉301 నుంచి 400 మధ్య ఉంటే వెరీ పూర్, 👉401 నుంచి 450 ఉంటే సివియర్, 👉450 పైనే ఉంటే వెరీ సివియర్ ఈ స్థాయిలో ఢిల్లీ కాలుష్యం పెరగడంపై ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ (సీఏక్యూఎం) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అన్నిరకాల నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్ వంతెనలు, పవర్ లైన్లు, పైపులైన్లు.. ఇలా ఎలాంటి నిర్మాణ సంబంధిత ప్రాజెక్టులైనా సరే ఆపేయాలని స్పష్టం చేసింది. అలాగే.. సరి-బేసి వాహన నిబంధనలు అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సూచించింది.కాలుష్యానికి తోడు దట్టమైన పొగమంచు పేరుకుపోయి కనీసం వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఆదివారం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మూడు విమానాలను రద్దు చేయగా.. మరో 107 విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి.సీఏక్యూఎం సూచన మేరకు.. ఇప్పటికే 1 నుంచి ఐదో తరగతి వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. తాజాగా 6 నుంచి 9, 11 తరగతుల విద్యార్థులకు వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అన్ని పాఠశాలలకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖను ఢిల్లీ సీఎం ఆతిశీ ఆదేశించారు.ప్రైవేట్ ఆఫీసులతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు కూడా 50 శాతం సామర్థ్యంతో పని చేసేలా చర్యలు చేపట్టాలని, మిగతావాళ్లను వర్క్‌ఫ్రమ్ హోం ద్వారా పని చేయించుకోవాలని అధికార యంత్రాగానికి సీఏక్యూఎం సిఫారసు చేసింది.ఇదీ చదవండి: మందు పార్టీ లేదా సీఎం సాబ్? -
ఉత్తర భారతంలో స్వల్ప భూకంపం
సాక్షి, ఢిల్లీ: ఉత్తర భారత దేశంలో రాజధాని ఢిల్లీ చుట్టుపక్కల సహా పలు రాష్ట్రాల్లో బుధవారం మధ్యాహ్నం భూమి కంపించింది. మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 4.4 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఢిల్లీ-ఎన్సీఆర్తో పాటు ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానాలోని పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించినట్లు తెలుస్తోంది. భూకంపం కేంద్రం ఉత్తరాఖండ్ ఫితోరాగఢ్‌లో పదికిలోమీటర్ల లోతున కేంద్రీకృతమైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం ధాటికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం. ఇదిలా ఉంటే ఈ ఉదయం పొరుగు దేశం నేపాల్‌లో భూమి స్వల్పంగా కంపించగా.. ఆ ప్రభావం నార్త్ ఇండియాలో చూపించినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు చైనా సరిహద్దు ప్రాంతాల్లోనూ నిన్న భూమి స్వల్పంగా కంపించింది కూడా. Earthquake of Magnitude:4.4, Occurred on 22-02-2023, 13:30:23 IST, Lat:29.56 & Long:81.70, Depth: 10 Km ,Location: 143km E of Pithoragarh, Uttarakhand, India for more information Download the BhooKamp App https://t.co/MNTAXJS0EJ@Dr_Mishra1966 @Ravi_MoES @ndmaindia @Indiametdept pic.twitter.com/ovDBNhb7VO — National Center for Seismology (@NCS_Earthquake) February 22, 2023 -
లగ్జరీ ఇళ్లకు అనూహ్య డిమాండ్
న్యూఢిల్లీ: ఖరీదైన ఫ్లాట్లు/ఇళ్ల విక్రయాలు (రూ.1.5 కోట్లకు పైన విలువైనవి) దూసుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఈ ఏడాది జనవరి–జూన్ కాలంలో 25,680 యూనిట్లు అమ్ముడుపోయాయి. గడిచిన మూడేళ్ల కాలంలో మొదటి ఆరు నెలల విక్రయాలతో పోలిస్తే అధికంగా నమోదైనట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ తెలిపింది. 2021 సంవత్సరం మొత్తం విక్రయాలు 21,700తో పోల్చి చూసినా 20 శాతం అధికంగా నమోదయ్యాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోని మొత్తం విక్రయాల్లో సగం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లోనే నమోదయ్యాయి. ఖరీదైన ఇళ్ల విక్రయాలు ఈ ఏడాది అద్భుతంగా సాగినట్టు అనరాక్ పేర్కొంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ఎంఎంఆర్, ఢిల్లీ ఎన్సీఆర్, పుణె పట్టణాలకు సంబంధించిన గణాంకాలతో అనరాక్ సోమవారం ఓ నివేదిక విడుదల చేసింది. 2020లో 8,470 యూనిట్లు, 2019లో 17,740 యూనిట్లు అమ్ముడుపోవడం గమనించాలి. ‘‘లగ్జరీ ఇళ్ల విక్రయాలు పుంజుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. ఈ ఏడాది చాలా వరకు లగ్జరీ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయింది. కస్టమర్లు వెంటనే గృహ ప్రవేశానికి అనుకూలంగా ఉన్న ఇళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు’’అని అనరాక్ చైర్మన్ అనుజ్‌పురి తెలిపారు. అధిక ధనవంతులు (హెచ్ఎన్ఐలు) కరోనా మహమ్మారి సమయంలో స్టాక్ మార్కెట్ నుంచి లాభాలు సంపాదించారని, దాన్ని వారు ఇప్పుడు రియల్ ఎస్టేట్‌పై పెడుతున్నారని చెప్పారు. ‘‘ఉమ్మడి కుటుంబాలు మరింత విశాలమైన ఇళ్లు అవసమని కరోనా సమయంలో అర్థం చేసుకున్నాయి. ఇది కూడా డిమాండ్‌ను పెంచడానికి ఓ కారణం’’అని అనుజ్‌పురి వెల్లడించారు. వైశాల్యం, వసతులకు ప్రాధాన్యం ‘‘కరోనా తర్వాత కొనుగోలుదారులు ఖరీదైన వసతుల కోసం చూస్తున్నారు. మరింత పెద్ద ఇళ్లను మంచి ట్రాక్ రికార్డు కలిగిన డెవలపర్ల నుంచి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు’’అని కల్పతరు డైరెక్టర్ ముకేశ్ సింగ్ తెలిపారు. పట్టణాల వారీగా.. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య ఖరీదైన ఇళ్ల విక్రయాలను పరిశీలిస్తే.. హైదరాబాద్ మార్కెట్లో 2,420 యూనిట్లుగా ఉన్నాయి. 2021లో 1,880 యూనిట్లు, 2020లో 620 యూనిట్లు, 2019లో 500 యూనిట్లు చొప్పున అమ్ముడుపోవడం గమనార్హం. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 4,160 యూనిట్లు, ఎంఎంఆర్‌లో 13,670 యూనిట్లు, బెంగళూరులో 2,430 యూనిట్లు, పుణెలో 1,460 యూనిట్లు, చెన్నైలో 900 యూనిట్లు, కోల్‌కతా మార్కెట్లో 630 యూనిట్ల చొప్పున ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో విక్రయాలు నమోదయ్యాయి. ఎన్ఆర్ఐల ఆసక్తి ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) నుంచి కూడా ఇళ్లకు డిమాండ్ ఉన్నట్టు అనరాక్ తెలిపింది. రూపాయి విలువ క్షీణించడాన్ని వారు అనుకూలంగా చూస్తున్నట్టు పేర్కొంది. 2022 మొదటి ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో 1.84 లక్షల ఇళ్ల యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇందులో లగ్జరీ ఇళ్ల వాటా 14 శాతానికి చేరుకుంది. కరోనా రెండో విడత తర్వాత నుంచి ఇళ్ల ధరలు పెరిగినట్టు అనరాక్ తెలిపింది. ఇప్పటికీ ఇళ్ల ధరలు సహేతుక స్థాయిలోనే ఉన్నాయని, ఈ రేట్లు ఇంకా పెరగొచ్చని కొనుగోలుదారులు భావిస్తున్నట్టు వెల్లడించింది. -
ఐదేళ్ల జైలు.. కోటి జరిమానా
న్యూఢిల్లీ: ఢిల్లీ, పరిసర రాష్ట్రాల్లో వాయు కాలుష్యానికి కారణమయ్యే వారికి భారీగా జరిమానా, జైలుశిక్ష విధించేలా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీనిప్రకారం కాలుష్య కారకులకు ఏకంగా కోటి రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. గరిష్టంగా ఐదేళ్ల దాకా జైలు శిక్ష పడే ప్రమాదం కూడా ఉంది. ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ బుధవారం సంతకం చేయడంతో వెంటనే అమల్లోకి వచ్చింది. ఆర్డినెన్స్‌ను కేంద్ర న్యాయ శాఖ గురువారం విడుదల చేసింది. దీని ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీ, హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ నిమిత్తం 22 ఏళ్ల క్రితం నాటి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అథారిటీ(ఈపీసీఏ)ని రద్దు చేసి, దాని స్థానంలో ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఈ కమిషన్‌లో 20 మందికిపైగా సభ్యులు ఉంటారు. ఆర్డినెన్స్ నియమ నిబంధనలను, ప్రత్యేక కమిషన్ ఆదేశాలను ఉల్లంఘిస్తే కోటి రూపాయల జరిమానా లేదా ఐదేళ్ల దాకా జైలు శిక్ష విధించవచ్చు. కమిషన్ చైర్మన్‌ను కేంద్ర పర్యావరణం, అటవీ శాఖ మంత్రి అధ్యక్షతన ఏర్పాటయ్యే కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ కమిటీలో రవాణా, వాణిజ్య, సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర శాఖల మంత్రులు, కేబినెట్ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఢిల్లీకి పొరుగున ఉన్న రాష్ట్రాల్లో ప్రతిఏటా పంట వ్యర్థాలను దహనం చేస్తుంటారు. దీనివల్ల ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. పంట వ్యర్థాల దహనాన్ని, తద్వారా వాయు కాలుష్యాన్ని అరికట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయ్యింది. ఈ వ్యాజ్యంపై న్యాయస్థానం ఇటీవలే విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కమిషన్ ఏం చేస్తుందంటే.. ►ఏయే ప్రాంతాల్లో గాలి నాణ్యతను ఎంత స్థాయిలో ఉండాలో నిర్ధారించే అధికారం కమిషన్‌కు కట్టబెట్టారు. ►చట్టాన్ని ఉల్లంఘిస్తూ వాయు కాలుష్యానికి కారణమవుతున్న కంపెనీలు/ప్లాంట్లను కమిషన్ తనిఖీ చేస్తుంది. ►అలాంటి కంపెనీలు/ప్లాంట్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేస్తుంది. ►కమిషన్ తనంతట తానుగా(సుమోటో) లేదా ఫిర్యాదుల ఆధారంగా ఆదేశాలు జారీ చేస్తుంది. ►కమిషన్ తన వార్షిక నివేదికలను నేరుగా పార్లమెంట్‌కు సమర్పిస్తుంది. ►కమిషన్ ఆదేశాలను సివిల్ కోర్టుల్లో సవాలు చేసేందుకు వీల్లేదు. జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో సవాలు చేయొచ్చు. -
పేలుడు పదార్థాలు పెట్టి చంపేయండి
న్యూఢిల్లీ: లక్షల మంది పౌరుల ఆయుష్షును తగ్గించేస్తున్న వాయు కాలుష్యంపై రాష్ట్రాలు నిర్లిప్తంగా వ్యవహరించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పంట వ్యర్థాలను పొలాల్లో తగలబెడుతూ ఢిల్లీ– ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యం పెరిగేందుకు పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రైతులూ కారణమవు తున్నారని ఆక్షేపించింది. వాయు కాలుష్యంతో పాటు జల కాలుష్యం, వ్యర్థాల నిర్వహణపై తమకు నివేదికలు సమర్పించాలని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తాల సుప్రీంకోర్టు బెంచ్ రాష్ట్రాలకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు స్మాగ్ టవర్ల నిర్మాణం చేపట్టే అంశంపై కేంద్రం 10 రోజుల్లో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ‘ప్రజలు ఇలా గ్యాస్ ఛాంబర్లలో ఎందుకు ఉంటున్నారు? బదులు పేలుడు పదార్థాలు పెట్టి వాళ్లందరినీ చంపేయండి’ అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది. పంట వ్యర్థాల దహనంపై తాము నిషేధం విధించినా ఈ ఏడాది దహనాలు మరింత పెరగడంపై పంజాబ్, హరియాణా ప్రభుత్వాలను తప్పుపట్టింది. ‘దీన్ని ఇంకా సహించాలా? ఇది అంతర్యుద్ధం కంటే తీవ్రమైంది కాదా? కాలుష్యం కారణంగా లక్షలమంది పౌరుల ఆయుష్షు తగ్గిపోతోంది. వాళ్లను అలా వదిలేద్దామా?’ అని విమర్శించింది. -
ఎన్జీటీలో కేంద్రానికి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ : పాత డీజిల్ వాహనాలపై నిషేధంపై కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. పదేండ్లు దాటిన డీజిల్ వాహనాలపై విధించిన నిషేధాన్ని ఎత్తేయాలని కోరుతూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కొట్టివేసింది. డీజిల్ వాహనాల కాలుష్యం ప్రజల పాటి ప్రమాదకరంగామారిందని పేర్కొంది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో కాలుష్యం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో నిషేధ ఆజ్ఞలను సవరిండానికి నిరాకరించిన ఒక డీజిల్ వాహనం 24 పెట్రోల్ వాహనాలు, 40 సిఎన్జీ వాహనాలకు సమానం అవుతుందని వ్యాఖ్యానించింది. కాగా నవంబర్ 2014 లో, జాతీయ రాజధానిలో వాయు కాలుష్యం పెరుగుతున్నందున 15 ఏళ్ల కంటే ఎక్కువ డీజిల్, పెట్రోల్ వాహనాలకు అనమతి లేదని ఎన్జీటీ ఆదేశించింది. ఆ తరువాత ఏప్రిల్, 2015 లో ట్రిబ్యునల్ మరోసారి డీజిల్ వాహనాలను 10 ఏళ్ళకు పైబడిన డీజిల్ వాహనాలను అనుమతించరాదని ఆదేశించింది. అలాంటి వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని ఎన్జీటీ మరోసారి ఆదేశించింది. జనవరి, 2017 లో ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో డీజిల్ వాహనాలపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పరిధిని 15 ఏండ్లకు పెంచాలని కోరింది. ఎన్జీటీ నిర్ణయంతో పబ్లిక్, ప్రయివేటు సెక్టార్లు తీవ్రంగా దెబ్బ తింటాయని కేంద్రం వాదిస్తోంది. అటు డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేసే ప్రక్రియను ఢిల్లీ ఆర్టీఓ గతేడాది నవంబర్‌లో ప్రారంభించిన అసంగతి తెలిసిందే. -
రూ. 9 లక్షలు ఆదాయం.. సొంతిల్లు సొంతం!
► స్థిరాస్తి కొనడానికైనా.. అద్దెకైనా భాగ్యనగరమే బెస్ట్ ► నాలుగేళ్లుగా నగరంలో 6.3 శాతం పెరిగిన కమర్షియల్ ధరలు ► 10.46 శాతం మేర పడిపోయిన రెసిడెన్షియల్ అద్దెలు ► అర్థయంత్ర బై వర్సెస్ రెంట్ నివేదిక వెల్లడి భాగ్యనగరంలో సొంతిల్లు.. మోస్తారుగా ఉన్నోళ్లకు మాత్రం దక్కే అదృష్టమనేది నిన్నటి మాట. కానీ, నేడది ఏడాదికి రూ.9 లక్షల ఆదాయమున్న ప్రతీ ఒక్కరికీ సొంతం! దీనర్థం నేటికీ భాగ్యనగరంలో స్థిరాస్తి ధరలు అందుబాటులో ఉన్నాయని!! కొనడానికే కాదు అద్దెకుండేందుకైనా చారిత్రక నగరి దగ్గరిదారేనట!!! ఈ వరుసలో అహ్మదాబాద్‌కూ చోటుందని అర్థయంత్ర యాన్యువల్ బై వర్సెస్ రెంట్ (ఏబీఆర్ఎస్) నివేదిక వెల్లడించింది. ఇటీవల అర్థయంత్ర సంస్థ దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలైన అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కత్తా, ముంబై, పుణెల్లో ‘‘స్థిరాస్తి కొనుగోలు.. అద్దెలు’’ అంశంపై సర్వే చేసింది. ఇందులో పలు ఆసక్తికర వివరాలివిగో.. - సాక్షి, హైదరాబాద్ హైదరాబాద్ నగరంలో స్థిరాస్తి కొనేందుకైనా, అద్దెకుండేందుకైనా ధరలు అందుబాటులోనే ఉన్నాయి. నాలుగేళ్లుగా వాణిజ్య సముదాయాల అద్దె ధరలు 6.3 శాతం పెరిగాయి. ఆదే సమయంలో నివాస సముదాయాల ధరలు 10.46 శాతం మేర పడిపోయాయి. ఏడాదికి రూ.9 లక్షల ఆదాయం సంపాదించేవారు ఇక్కడ నివాస సముదాయాన్ని కొనుగోలు చేయవచ్చు. బెంగళూరు ఐటీ, స్టార్టప్ హబ్ పేరొందిన గార్డెన్ సిటీ.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండటంతో ఇక్కడ నివాస, వాణిజ్య సముదాయాల అద్దెలకు గిరాకీ బాగా ఉంది. గతేడాదితో పోల్చితే ఇక్కడి అద్దెలు 10.08 శాతం మేర పెరిగాయి. ఇదే సమయంలో స్థిరాస్తి ధరలు మాత్రం 2.55 శాతం మేర పడిపోయాయి. ఇక్కడ స్థిరాస్తిని కొనుగోలు చేయాలంటే ఏడాదికి కనీసం రూ.15 లక్షల ఆదాయం ఉండాల్సిందే. చెన్నై దేశంలో స్థిరాస్తి ధరలు ప్రియంగా ఉన్న నగరాల్లో చెన్నైది మూడో స్థానం. తొలి రెండు స్థానాలు ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లవి. గతేడాదితో పోల్చితే చెన్నైలో ధరలు 8.78 శాతం పెరిగాయి. ఆసక్తికరంగా అద్దెలు మాత్రం 1.7 శాతం మేర పడిపోయాయి. ఏడాదికి రూ.20 లక్షల ఆదాయం గడించేవారు మాత్రంమే చెన్నైలో స్థిరాస్తి సొంతమవుతుంది. ఢిల్లీ-ఎన్సీఆర్ దేశ రాజధానిలో స్థిరాస్తి ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. నివాస సముదాయాల ధరల విషయంలో ఢిల్లీది రెండో స్థానం. గత నాలుగే ళ్లుగా రాజధానిలో నివాస, వాణిజ్య సముదాయాల అద్దెలు 20 శాతం పెరిగాయి. ఇదే సమయంలో స్థిరాస్తి కొనుగోలు ధరలైతే 9.1 శాతం మేర పెరిగాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో స్థిరాస్తిని కొనుగోలు చేయాలంటే ఏటా ఆదాయం కనీసం రూ.25 లక్షలకు పైగానే ఆర్జించాలి మరి. కోల్కత్తా స్థిరాస్తి కొనుగోలుకైనా, అద్దె విషయంలోనైనా కోల్కత్తా సమాంతరంగా వృద్ధి చెందుతుంది. ఏడాదికాలంగా ఇక్కడ స్థిరాస్తి ధరలు 11.27 శాతం, అద్దెలు 11.48 శాతం మేర పెరిగాయి. ఏటా ఆదాయం రూ.15 లక్షలుంటే కోల్‌కత్తాలో ప్రాపర్టీ కొనుగోలు చేయవచ్చు. అహ్మదాబాద్ హైదరాబాద్ తర్వాత స్థిరాస్తి కొనుగోలుకైనా, అద్దెకైనా సామాన్యులకు అందుబాటులో ఉన్న నగరమేదైనా ఉందంటే అది అహ్మదాబాదే. ఏటా ఆదాయం రూ.10 లక్షలుంటే చాలు ఇక్కడ సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు. పిల్లల గదుల్లో రంగులు, అలంకరణ వారికి ఆహ్లాదం కలిగించేలా ఉండాలి. గదంతా కార్టూన్లతో నింపకుండా ఒక వైపు గోడను మాత్రమే కార్టూన్లకు కేటాయిస్తే సరిపోతుంది. చిన్నారుల కోసం ఫర్నీచర్, మంచం లాంటివి కొనేప్పుడు అందంతో పాటు పిల్లల భద్రత, సౌకర్యాలకు కూడా ప్రాధాన్యమివ్వాలి. -
ఆన్లైన్ షాపింగ్ సిటీగా ఢిల్లీ
-ఎన్సీఆర్ టైర్-2 పట్టణాల్లో -గుంటూరుకు చోటు ఫ్లిప్‌కార్ట్ నివేదిక బెంగళూరు: దేశంలో ఆన్లైన్ షాపింగ్ అత్యధికంగా జరిగే ప్రాంతాల్లో ఢిల్లీ-ఎన్సీఆర్ టాప్‌లో ఉంది. దీని తర్వాతి స్థానాల్లో బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్ ఉన్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ నివేదిక ప్రకారం.. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ పట్టణాల వల్ల దక్షిణ భారతదేశం ఈ-కామర్స్ రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది. టైర్-1 పట్టణాల్లో పుణే అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానాల్లో కోయంబత్తూరు, అహ్మదాబాద్, లక్నో పట్టణాలు ఉన్నాయి. తూర్పు భారత దేశం నుంచి ఒక్క భువనేశ్వర్ మాత్రమే ఫ్లిప్‌కార్ట్ జాబితాలో చోటు దక్కించుకుంది. ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా జరిగే టైర్-2 పట్టణాల్లో మంగళూరు, మైసూర్, డెహ్రాడూన్ ప్రాంతాలు ఉన్నాయి. వీటి తర్వాతి స్థానాల్లో సేలం (తమిళనాడు), గుంటూరు ప్రాంతాలు నిలిచాయి. -
ఆన్లైన్ హైరింగ్ జోరు
కొత్త ప్రభుత్వంతో కొత్త కొలువులు : మాన్‌స్టర్‌డాట్‌కామ్ వెల్లడి న్యూఢిల్లీ: భారత్‌లో ఆన్లైన్ హైరింగ్ జోరు ఎప్పటికప్పుడు పెరుగుతోంది. ఈ ఏడాది మేలో ఈ ఆన్లైన్ హైరింగ్ 19 శాతం వృద్ధి చెందిందని ప్రముఖ జాబ్ పోర్టల్ మాన్‌స్టర్‌డాట్‌కామ్ సర్వేలో తేలింది. గత ఏడాది ఫిబ్రవరి నుంచి చూస్తే ఇదే అత్యంత అధిక వృద్ధిరేటని వివరించింది. కొత్త ప్రభుత్వం కారణంగా ఆర్థిక వృద్ధి జోరు పెరుగుతుందని, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం నెలకొంటోందని, ఫలితంగా భారీ సంఖ్యలో కొత్త కొలువులు వస్తాయని మాన్‌స్టర్‌డాట్‌కామ్ ఎండీ సంజయ్ మోడి చెప్పారు. ఈ సర్వే వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు..., * ఈ ఏడాది ప్రారంభం నుంచే ఆన్లైన్ హైరింగ్ కార్యకలాపాలు నిలకడగా పెరుగుతున్నాయి. * గత ఏడాది మేలో 127 పాయింట్లుగా ఉన్న ద మాన్‌స్టర్‌డాట్‌కామ్ ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ 19 శాతం (24 పాయింట్లు) వృద్ధితో ఈ ఏడాది 151 పాయింట్లకు పెరిగింది. ఏప్రిల్‌లో కూడా ఇదే స్థాయి వృద్ధిని సాధించింది. * 27 పారిశ్రామిక రంగాల్లో 16 రంగాల్లో ఉద్యోగ నియామక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. హైరింగ్ విషయంలో మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగం అత్యధిక వృద్ధిని (59 శాతం) సాధించింది. * ఇక సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరిగింది. * ఏడాది కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే 13 నగరాల్లో ఆన్లైన్ హైరింగ్ పెరిగింది. 37 శాతం వృద్ధితో బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ముంబై(27% వృద్ధి), ఢిల్లీ-ఎన్సీఆర్(20 %), హైదరాబాద్(19%), చెన్నై(17%) ఉన్నాయి.