ఉత్తర భారతంలో స్వల్ప భూకంపం | Light tremors in Delhi NCR After Nepal Earthquake | Sakshi
Sakshi News home page

ఉత్తర భారతంలో స్వల్ప భూకంపం

Published Wed, Feb 22 2023 2:43 PM | Last Updated on Wed, Feb 22 2023 2:43 PM

Light tremors in Delhi NCR After Nepal Earthquake - Sakshi

సాక్షి, ఢిల్లీ: ఉత్తర భారత దేశంలో రాజధాని ఢిల్లీ చుట్టుపక్కల సహా పలు రాష్ట్రాల్లో బుధవారం మధ్యాహ్నం భూమి కంపించింది. మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో రిక్టర్‌ స్కేల్‌పై 4.4 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వెల్లడించింది. 

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హర్యానాలోని  పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించినట్లు తెలుస్తోంది. భూకంపం కేంద్రం ఉత్తరాఖండ్‌ ఫితోరాగఢ్‌లో పదికిలోమీటర్ల లోతున కేంద్రీకృతమైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం ధాటికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం.

ఇదిలా ఉంటే ఈ ఉదయం పొరుగు దేశం నేపాల్‌లో భూమి స్వల్పంగా కంపించగా.. ఆ ప్రభావం నార్త్‌ ఇండియాలో చూపించినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు చైనా సరిహద్దు ప్రాంతాల్లోనూ నిన్న భూమి స్వల్పంగా కంపించింది కూడా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement