Mild tremors
-
ఉత్తర భారతంలో స్వల్ప భూకంపం
సాక్షి, ఢిల్లీ: ఉత్తర భారత దేశంలో రాజధాని ఢిల్లీ చుట్టుపక్కల సహా పలు రాష్ట్రాల్లో బుధవారం మధ్యాహ్నం భూమి కంపించింది. మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 4.4 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఢిల్లీ-ఎన్సీఆర్తో పాటు ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానాలోని పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించినట్లు తెలుస్తోంది. భూకంపం కేంద్రం ఉత్తరాఖండ్ ఫితోరాగఢ్‌లో పదికిలోమీటర్ల లోతున కేంద్రీకృతమైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం ధాటికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం. ఇదిలా ఉంటే ఈ ఉదయం పొరుగు దేశం నేపాల్‌లో భూమి స్వల్పంగా కంపించగా.. ఆ ప్రభావం నార్త్ ఇండియాలో చూపించినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు చైనా సరిహద్దు ప్రాంతాల్లోనూ నిన్న భూమి స్వల్పంగా కంపించింది కూడా. Earthquake of Magnitude:4.4, Occurred on 22-02-2023, 13:30:23 IST, Lat:29.56 & Long:81.70, Depth: 10 Km ,Location: 143km E of Pithoragarh, Uttarakhand, India for more information Download the BhooKamp App https://t.co/MNTAXJS0EJ@Dr_Mishra1966 @Ravi_MoES @ndmaindia @Indiametdept pic.twitter.com/ovDBNhb7VO — National Center for Seismology (@NCS_Earthquake) February 22, 2023 -
ఢిల్లీలో స్వల్ప భూప్రకంపనలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం మధ్యాహ్నం భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.5గా నమోదు అయింది. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. కాగా లాక్డౌన్ సమయంలో ఢిల్లీలో భూమి కంపించడం ఇది మూడోసారి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నెల్లూరు జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఆదివారం ఉదయం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. జిల్లాలోని దుత్తలూరు, వరికుంటపాడు మండలాల్లో ఈ రోజు ఉదయం రెండు సార్లు.. కొద్ది సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురై రోడ్ల పైకి పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరుగలేదు. -
నెల్లూరు జిల్లాలో మళ్లీ భూప్రకంపనలు
ఉదయగిరి (నెల్లూరు) : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు, ఉదయగిరి, వరికుంటపాడు, దుత్తలూరు మండలాల్లో మంగళవారం పలుమార్లు భూప్రకంపనలు వచ్చాయి. రెండు, మూడు రోజుల నుంచి ప్రకంపనలు కనిపించకపోవడంతో కొంత ప్రశాంతంగా ఉన్న ప్రజలకు మళ్లీ ప్రకంపనలు రావడంతో ఆందోళన చెందుతున్నారు. మంగళవారం ఉదయం 11.32 గంటలకు, మధ్యాహ్నం 2.45 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వరికుంటపాడు మండలంలో చిన్నచిన్న ప్రకంపనలు ఐదుసార్లు వచ్చినట్లు చెబుతున్నారు. వింజమూరులో నాలుగుసార్లు కంపించిన భూమి వింజమూరు మండలంలో మంగళవారం నాలగుసార్లు భూమి కంపించింది. ఉదయం 5.30, 11.30, మధ్యాహ్నం 2.40, సాయంత్రం 6.05 గంటలకు భూమి కంపించినట్లు తహశీల్దార్ టి.శ్రీరాములు తెలిపారు. -
వింజమూరులో భూ ప్రకంపనలు
వింజమూరు (శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు) : నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో మంగళవారం రెండు సార్లు భూమి స్వల్పంగా కంపించింది. ఉదయం 11.30 గంటలకు, తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో మూడు సెకన్లపాటు భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో జనం ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇళ్లపైకప్పు రేకులు కదిలాయి. -
పిడుగురాళ్లలో స్వల్ప భూ ప్రకంపనలు
పిడుగురాళ్ల (గుంటూరు) : గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో స్వల్పంగా భూమి కంపించింది. శుక్రవారం మధ్యాహ్నం పట్టణంలో రెండు నిముషాలపాటు భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. -
అసోంలో స్వల్ప భూకంపం
గువహటి: అసోం రాజధాని గువహటిలోని పలుప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో గువహటి, నాగాన్, దర్రాంగ్ వంటి ప్రాంతాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి. దాంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, భూప్రకంపనల తీవ్రత రిక్టర్‌స్కేలుపై 4.3గా నమోదైనట్టు జియోలాజికల్ విభాగం పేర్కొంది. -
జార్ఖండ్, బిహార్‌లో భూప్రకంపనలు
రాంచీ: జార్ఖండ్‌లో మంగళవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.2గా నమోదైంది. దీని ప్రభావంతో జార్ఖండ్‌తో పాటు బిహార్‌లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. జార్ఖండ్‌లోని దేవ్‌గఢ్, ధన్‌బాద్, బిహార్‌లోని గయ, జముయ్ ప్రాంతాల్లో భూమి కంపించింది. దేవ్‌గఢ్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రజలు ప్రాణభయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. -
కంపించిన జనం
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్ : జిల్లాలో పలుచోట్ల బుధవారం రాత్రి 9.55 నుంచి 10 గంటల సమయంలో మూడు సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. నిద్రకు ఉపక్రమిస్తున్న వేళ భూ ప్రకంపనలు రావడంతో అందరూ తీవ్ర ఆందోళన చెందారు. సెకన్ల కాలం భూమి కంపించినా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలోని వంట సామగ్రి, కప్బోర్డ్లలోని వస్తువులు పడిపోవడంతో ఉలిక్కిపడ్డారు. ఎన్నడూ లేని విధంగా దాదాపు జిల్లావ్యాప్తంగా భూమి కంపించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన భూ కంపం ప్రభావంతో జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం, బొ బ్బిలి, సీతానగరం, గుర్ల, నెల్లిమర్ల, గరివిడి, చీపురుపల్లి, గజపతినగ రం ప్రాంతాలతో పాటు భోగాపురం, పూసపాటిరేగ ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న వసంతవిహార్ అపార్ట్మెంట్, తోటపాలెం, అయ్యన్నపేట జంక్షన్, కామాక్షినగర్ ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనతో బయటకు పరుగు లు తీశారు. బొబ్బిలిలోని సాయినగర్ కాలనీ, గొల్లపల్లి, ఐటీఐ, పూల్ బాగ్ కాలనీల్లో భూమి కంపించింది. ఇళ్లల్లోని చిన్న చిన్న సామాన్లు కిందకు పడడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. పార్వతీపురంలోని జనశక్తి కాలనీతో పాటు శివారు కాలనీల్లోనూ భూమి స్వల్పంగా కంపించింది. కురుపాం మండలంలో మొండెంఖల్, గుమ్మడి, నీలకంఠాపురం తదితర గ్రామాల్లోనూ, నెల్లిమర్ల మండంలోని నెల్లిమర్ల, జరజాపుపేట ప్రాంతాల్లో కూడా భూమి స్వల్పంగా భూమి కంపించింది. వేసవి కావడంతో ఈ ప్రాంతాల్లోని ప్రజలు మేడపై పడుకున్నారు. ఇంతలో స్వల్ప ప్రకంపనలు రావడంతో ఆందోళనతో పలువురు పరుగుపరుగున కిందకు దిగిపోయారు. జరజాపుపేటలో కాస్త అధికంగా ప్రకంపనలు వ చ్చినట్టు స్థానికులు తెలిపారు. చీపురుపల్లి పట్టణంలోని అగ్రహారం, స్థానిక ఓంశాంతి భవనం సమీపంలోనూ భూమి స్వల్పం గా కంపించడంతో స్థానికులు ఆందోళన చెందారు. పోతాయవలసలో కూడా భూమి కంపించినట్టు స్థానికులు తెలిపారు. మెరకముడిదాం మండలంలోని మెరముడిదాం, సోమలింగాపురం, గర్భాం, ఉత్తరావల్లి తదితర గ్రామాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి.జేసీ ఆరా: జిల్లాలోని భూ ప్రకంపనలపై జాయింట్ కలెక్టర్ బి. రామారావు అధికారులను ఆరా తీశారు. ఎక్కడెక్కడ భూమి కంపించిందో అధికారులను అడిగి తెలుసుకున్నారు.