శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు, ఉదయగిరి, వరికుంటపాడు, దుత్తలూరు మండలాల్లో మంగళవారం పలుమార్లు భూప్రకంపనలు వచ్చాయి.
ఉదయగిరి (నెల్లూరు) : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు, ఉదయగిరి, వరికుంటపాడు, దుత్తలూరు మండలాల్లో మంగళవారం పలుమార్లు భూప్రకంపనలు వచ్చాయి. రెండు, మూడు రోజుల నుంచి ప్రకంపనలు కనిపించకపోవడంతో కొంత ప్రశాంతంగా ఉన్న ప్రజలకు మళ్లీ ప్రకంపనలు రావడంతో ఆందోళన చెందుతున్నారు. మంగళవారం ఉదయం 11.32 గంటలకు, మధ్యాహ్నం 2.45 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వరికుంటపాడు మండలంలో చిన్నచిన్న ప్రకంపనలు ఐదుసార్లు వచ్చినట్లు చెబుతున్నారు.
వింజమూరులో నాలుగుసార్లు కంపించిన భూమి
వింజమూరు మండలంలో మంగళవారం నాలగుసార్లు భూమి కంపించింది. ఉదయం 5.30, 11.30, మధ్యాహ్నం 2.40, సాయంత్రం 6.05 గంటలకు భూమి కంపించినట్లు తహశీల్దార్ టి.శ్రీరాములు తెలిపారు.