సాక్షి, నెల్లూరు: నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి పి నారాయణ అల్లుడు పునీత్‌పై పన్నుల ఎగవేత కేసు నమోదు అయ్యింది. అంతేకాదు ఈ కేసు విచారణలో భాగంగా బంధువుల ఇళ్లలో సైతం తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. కోటికి పైగా నగదు సైతం సీజ్ చేశారు.
ఈ సోదాలపై జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి మీడియాకు వివరాలు తెలియజేశారు. ‘‘ఇన్‌స్పైర్ మేనేజ్‌మెంట్ సర్వీస్ పేరుతో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ జీఎస్టీ ఎగొట్టాడు. సుమారు 84 వాహనాలకు జీఎస్టీ కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేశారు. రూ.10 కోట్ల 32 లక్షలు దాకా కట్టాల్సి ఉంటే.. రూ. 22 లక్షల మాత్రమే జీఎస్టీ కట్టారు. అంటే 10 కోట్ల పన్ను ఎగవేశారన్నమాట. ఇక నారాయణ సమీప బంధువుల నివాసాల్లో సోదాలు చేసి సరైన పత్రాలు చూపించనందున రూ. కోటి 82 లక్షలు నగదు సీజ్ చేశాం..
. పునీత్ డైరెక్టర్ గా ఉన్న ఇన్‌స్పైర్ మేనేజ్‌మెంట్ కేంద్రంగా రవాణా శాఖకు పన్నులు ఎగగొట్టారు. సొసైటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రభుత్వానికి జీఎస్టీ కట్టలేదు. డీఆర్‌ఐ అధికారులు రవాణా శాఖకు ఫిర్యాదు చేయడంతో సోదాలు నిర్వహించాం. ఈ వ్యవహారంపై నారాయణ అల్లుడు పునీత్ పై కేసు నమోదు చేశాం. నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీకి అనుబంధంగా ఈ ఇన్‌స్పైర్ సొసైటీ ఉంది. అయితే బస్సులు కొనుగోలు సంబంధించి ఇన్వాయిస్ మాత్రం నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పైన రిజిస్ట్రేషన్ చేశారు. నారాయణ విద్యా సంస్థల నుంచి ప్రతి నెలా అద్దె కడుతున్నారు. అలాగే.. నారాయణ సంస్థలు కొన్నట్లు రవాణా శాఖకు చూపించారు’’ అని ఎస్పీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment