మంత్రి అక్రమాలన్నీ నిరూపిస్తాం | YSR CP MLA Anil kumar yadav takes on minister p narayana | Sakshi
Sakshi News home page

మంత్రి అక్రమాలన్నీ నిరూపిస్తాం

Published Tue, Dec 16 2014 10:43 AM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

మంత్రి అక్రమాలన్నీ నిరూపిస్తాం - Sakshi

మంత్రి అక్రమాలన్నీ నిరూపిస్తాం

నెల్లూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి.నారాయణ అక్రమాలన్నీ నిరూపిస్తామని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. మంగళవారం నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ... నెల్లూరు నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

నగర అభివృద్ధికి ఏం చర్యలు తీసుకుంటున్నారని మంత్రి నారాయణను ప్రశ్నిస్తే ఆయన తమపైఆరోపణలకు దిగడం సరికాదన్నారు. అదికాక వైజాగ్లో తన పనితనం చూడాలని ఆయన చెప్పడం విడ్డూరంగా ఉందని అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement