
సాక్షి, విజయవాడ: ప్రతిపక్షనేత చంద్రబాబు ఎన్ని కుతంత్రాలు చేసినా పరిపాలన వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోలేకపోయారని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. బాబు సిగ్గులేకుండా ఇంకా అమరావతి కోసం మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబాటుకు పరిష్కారం చూపించారని పేర్కొన్నారు. అమరావతిలో ఇల్లు కూడా కట్టని బాబుకి అసలు మాట్లాడే అర్హతే లేదన్నారు. (చదవండి: 3 రాజధానులకు రాజముద్ర)
చంద్రబాబు హైదరాబాద్‌లో దాక్కుని ఇక్కడ రాజధాని కోసం మాట్లాడతాడా అని అనిల్‌కుమార్ ప్రశ్నించారు. బాబు అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ మాఫియా నడిపాడని దుయ్యబట్టారు. వేల కోట్లు దోచిన బాబు, ఆయన బినామీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బ్లాక్‌డే అన్నారు. కానీ రూ. 5 కోట్ల మంది ప్రజలు జగన్ నిర్ణయంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. చంద్రబాబుని ప్రజలు, ఆయన ఎమ్మెల్యేలే నమ్మట్లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ పనైపోయిందన్నారు. ఇక వాళ్లేన్ని చెప్పిన ఎవ్వరు నమ్మరని అన్నారు. (చదవండి: బాబు కుట్రలు సాగవు)