
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తక్కువ ఖర్చుతో విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయొచ్చునని పేర్కొన్నారు. తక్కువ సమయంలోనే విశాఖ ఆదాయ వనరుగా మారనుందని తెలిపారు. తన స్వార్థ ప్రయోజనాల కోసమే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రైతులకు తమ ప్రభుత్వం కచ్చితంగా న్యాయం చేస్తుందని అవంతి శ్రీనివాస్ తెలిపారు.