avanthi srinivas
-
అవంతిలాంటి నేతలు ఎంతమంది పార్టీని వీడినా నష్టం లేదు: ఆల్ఫా కృష్ణ
-
అవంతి శ్రీనివాస్ కు గూబ గుయ్యమనేలా కౌంటర్ ఇచ్చిన గుడివాడ
-
పార్టీకి అవంతి శ్రీనివాస్ రాజీనామా బొత్స సెటైర్లే సెటైర్లు
-
బాబు కుట్రలు: సంక్షేమ పథకాల అమలును చంద్రబాబు అడ్డుకుంటున్నారు: అవంతి
-
గంటా శ్రీనివాసరావుకి షాక్ భీమిలి వైఎస్సార్సీపీ లో భారీ చేరికలు
-
వాలంటీర్లను చూసి చంద్రబాబు, పవన్ భయపడుతున్నారు: అవంతి శ్రీనివాస్
-
భీమిలి నియోజకవర్గంలో అవంతి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం
-
వాలంటీర్ల సేవలను ప్రధాని మోడీ ప్రశంసించారు..!
-
వలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు.. వైఎస్సార్సీపీ నేతల స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో వలంటీర్లపై శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ అభ్యర్ధి బొజ్జల సుధీర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నేతలు, వలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వలంటీర్లను టెర్రరిస్ట్లంటూ బొజ్జల సుధీర్ వ్యాఖ్యలను మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఖండించారు. వలంటీర్ల సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారని ప్రస్తావించారు. ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేస్తున్నరనే వలంటీర్లపై టీడీపీ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వలంటీర్లు తమ విధులు నిర్వహించారని పేర్కొన్నారు. వారి ఆత్మవిశ్వాసం దెబ్బ తినే విధంగా టీడీపీ నేతలుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ వలంటీర్లను కించపరిచే విధంగా మాట్లాడారని అన్నారు. టీడీపీ నేతలు వలంటీర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి: వలంటరీ వ్యవస్థపై బొజ్జల సుధీర్ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బొజ్జల సుధీర్ తండ్రి మంత్రిగా పనిచేసినప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్‌లో కోట్ల రూపాయలు సంపాదించారని విమర్శించారు. బొజ్జల సుధీర్‌కు బుద్ది లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాన్ని ప్రజలకు అందించే వ్యవస్థ వలంటరీ వ్యవస్థ.. ఒక్క రూపాయి అవినీతి లేకుండా పనిచేస్తుందన్నారు. ‘2 లక్షల 50 వేల మంది వలంటీర్లు అంటే ఎవరు, వాళ్లంతా మన ఇంట్లో పిల్లలు, ఇరుగు పొరుగు పిల్లలు కాదా? కేరళ రాష్ట్రంలో వలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు అధ్యయనం చేస్తున్నారు. ఆనాడు పవన్ కల్యాణ్ వలంటరీ వ్యవస్థను విమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అని పిచ్చి కూతలు కూశాడు. వలంటీర్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్, పచ్చ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి. వలంటరీ వ్యవస్థతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తప్పుడు తెలుగుదేశం నాయకులు రాజకీయాలు చేస్తున్నారు.’ అని మండిపడ్డారు. వలంటీర్లపై విషం అవ్వతాతాలు గడప దాటకుండా ఒకటో తారీఖున టంచన్‌గా పింఛన్ ఇస్తున్న వాలంటరీలపై కాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుదీర్ రెడ్డి విషం కక్కుతున్నాడని మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే ఆదర్శంగా నిలిచినా వాలంటరీ వ్యవస్థను స్లీపర్ సెల్స్‌తో పోల్చిన బొజ్జల సుదీర్ రెడ్డి అసలు మనిషేనా అని ప్రశ్నించారు. వలంటరీలను తమ సొంత బిడ్డల్లా ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. అలాంటి వాళ్ళను టెర్రరిస్టులు ఉగ్రవాదులు జిహాదీలతో పోల్చిన బొజ్జలపై ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు , పవన్‌లు వలంటరీలపై విషం కక్కి అబాసు పాలయ్యారపి. వంలంటరీ వ్యవస్థపై పడి ఏడుస్తున్న వీరందరికి త్వరలో ప్రజలు బుద్ది చెప్తారని అన్నారు కృష్ణా జిల్లా: వలంటీర్లను తీవ్రవాదులుగా పోల్చి మాట్లాడడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట వెంకయ్య. చంద్రబాబు సన్నిహితుడు బొజ్జల సుధీర్ రెడ్డి వలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. గతంలో చంద్రబాబు ఇళ్లదగ్గర మగవాళ్ళు లేని సమయంలో వలంటీర్లు తలుపులు కొడతారని అన్నడం విన్నామని. దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ ఒంటరి మహిళలను వలంటీర్లు ట్రాప్ చేస్తున్నారని అన్నారని గుర్తు చేశారు. టీడీపీ నాయకులు అధికార దాహంతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘రాష్ట్రంలో 2.50 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం జగన్‌ది. 2006 నుంచి గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా సొంత ఖర్చులతో మోటార్లు ఏర్పాటు చేసి పట్టిసీమ నీరు రైతులకు అందిస్తున్నారు. అదే క్రమంలో ప్రస్తుత రైతుల అవసరాల కోసం మోటార్లు ఏర్పాటు చేసి నీరు అందిస్తున్నారు. వంశీ రైతులకు మేలు చేస్తుంటే టీడీపీ నాయకులకు కళ్ళు కుడుతున్నాయి. కావాలని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నారు. స్థానిక టీడీపీ నాయకులు రైతుల పొట్టలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ నాయకుల కుయుక్తులు నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో టీడీపీని ప్రజలు తరిమి కొట్టడం ఖాయం.’ అని పేర్కొన్నారు. కాగా వలంటీర్లు శ్రీకాళహస్తి నియోజకవర్గం టిడిపి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వలంటీర్లు టెర్రరిస్టులతో సమానమని, స్లీపర్ సేల్స్లాగా మారి శ్రీకాళహస్తిని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక వలంటీర్ల అంతు చూస్తామని అన్నారు. -
శ్రీవారి సన్నిధిలో అవంతి ఫ్యామిలీ
-
విశాఖ అగ్నిప్రమాద ఘటన దురదృష్టకరం: ఎంపీ మోపీదేవి
-
ప్రభుత్వం, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఘటనపై వెంటనే స్పందించారు: అవంతి
-
విశాఖ జిల్లా ఆనందపురంలో ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం
-
చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ నేతల డ్రామాలు: అవంతి శ్రీనివాస్
-
చంద్రబాబు నీచ రాజకీయం...!
-
మళ్ళీ జగనన్నే రావాలి
-
నారా లోకేష్ ఎవరి మాట వినడు..
-
టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నావ్? ఎందుకు విడిపోయావ్?: అవంతి
-
నువ్వు సినిమాల్లోనే హీరోవి.. నేను పొలిటికల్ హీరోని: మంత్రి అవంతి
సాక్షి, అమరావతి: భీమిలి నియోజకవర్గంలో ఒక గజం భూమి తాను ఆక్రమించుకున్నానని నిరూపించినా రాజీనామా చేస్తానని మంత్రి అవంతి శ్రీనివాస్ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు సవాల్ విసిరారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప వాస్తవాలు తెలుసుకోరంటూ అంటూ పవన్‌పై మండిపడ్డారు. తమ నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలపై ఎప్పుడైనా దాడులు చేశారా అని ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో జరిగిన గుండాగిరి కనపడలేదా అని నిలదీశారు. టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నావ్, ఎందుకు విడిపోయావ్ అని ప్రశ్నించిన మంత్రి అవంతి.. పవన్ ప్యాకేజీ స్టార్ అన్న సంగతి అందరికీ తెలుసని అన్నారు. బీజేపీతో పొత్తు వల్ల రాష్ట్రానికి ఏం సాధించాగలిగావో ప్రజలకు చెప్పాలని మంత్రి అవంతి శ్రీనివాస్ పవన్ కల్యాణ్‌ను డిమాండ్ చేశారు. కుల, మతాలతో సంబంధం లేకుండా లక్షా ముప్పై వేల కోట్లు పేదల అకౌంట్లో వేశామని తెలిపారు. ఎక్కడైనా అవినీతి జరిగిందా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి టూరిస్ట్‌గా వచ్చే పవన్‌కు ఇవన్నీ ఏం తెలుస్తాయని ఎద్దేవా చేశారు. అమరావతిని తీసేస్తామని సీఎం జగన్ ఎప్పుడూ చెప్పలేదని, అమరావతితోపాటు ఇతర ప్రాంతాల అభివృద్ధి గురించి కూడా చెప్తుంటే ఎందుకు విమర్శిస్తున్నారని నిలదీశారు. చదవండి: ఎం జగన్‌ను కలిసిన మంత్రి వెల్లంపల్లి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ‘అభివృద్ధి వికేంద్రీకరణ చేయటం తప్పా. జిల్లాల వికేంద్రీకరణ కూడా అభివృద్ధి కోసమే. వైఎస్సార్సీపీని ఎందుకు గద్దె దించాలి? అవినీతి లేకుండా పాలన చేస్తున్నందుకా? 2008లో మన ఇద్దరిప్రస్థానం ఒకేసారి మొదలయింది. నేను మూడు సార్లు గెలిచి మంత్రి పదవి దాకా వచ్చానంటే నాలో మంచి క్వాలిటీ ఉన్నందునే. మరి నువ్వు ఎందుకు గెలవలేకపోయావ్? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. ప్రజా రాజ్యం నుంచి మేమంతా ఎందుకు బయటకి వచ్చామో తెలుసుకో. వైఎస్ జగన్‌కు 151 సీట్లు ప్రజలు ఎందుకు ఇచ్చారో తెలుసుకో. అన్ని పార్టీలను కలపటానికి నువ్వు ఎవరు? కొన్ని లక్షల మంది జీవితాలతో ఆటలాడుకోవద్దు టీడీపీ అధికారంలోకి వస్తే లోకేష్‌ని సీఎం చేస్తారా? నిన్ను చేస్తారా? జనసేన కార్యకర్తలు బాగా ఆలోచించుకోవాలి. సోషల్ ఇంజనీరింగ్ గురించి పవన్ మాట్లాడుతున్నారు. అన్ని వర్గాల వారికి పదవులు ఇవ్వటం సోషల్ ఇంజనీరింగ్‌గా కనపడటం లేదా? ఎమర్జెన్సీతో ఇప్పటి పరిస్థితుల గురించి మాట్లాడటంలోనే పవన్ పరిణితి లేని రాజకీయ నేత అని అర్థం అవుతుంది. కాపు నిర్మాతల కోసం కాల్షీట్లు ఇచ్చావా? జనసైనికులకు నీ సినిమాల్లో అవకాశం ఇచ్చావా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి వారం టైం ఇస్తున్నట్లు వార్నింగ్ ఇచ్చావు. మరి తర్వాత కేంద్రంతో ఎందుకు మాట్లాడలేదు? ఒక పొలిటికల్ లీడర్‌కు అంత గర్వం పనికిరాదు. నా గురించి నాగబాబుకి బాగా తెలుసు. ఒకసారి మీ అన్నతో నా గురించి మాట్లాడితే తెలుస్తుంది. సినిమాల్లో కూడా హిట్ల కంటే ప్లాపులు ఎక్కువ. నువ్వు కేవలం సినిమాల్లోనే హీరోవి. నేను పొలిటికల్‌గా హీరోని అయ్యాను.’ అని మంత్రి పేర్కొన్నారు. చదవండి: భీమ్లానాయక్ అని బెదిరిస్తే.. భయపడేవారెవరూ లేరు: మంత్రి వెల్లంపల్లి -
శివనామ స్మరణతో మార్మోగుతున్న శ్రీశైలం పుణ్యక్షేత్రం
-
సూపర్‌స్టార్ కృష్ణకు ఘన సన్మానం.. 350కిపైగా చిత్రాల్లో నటించినా
Tribute To superstar Krishna Under Alluri Sitaramaraju 125th Birth Anniversary: తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ప్రయోగాలకు నిర్వచనం సూపర్ స్టార్ కృష్ణ. జేమ్స్ బాండ్ వంటి హాలీవుడ్ తరహా పాత్రలను టాలీవుడ్‌కు పరిచయం చేసి హిట్ కొట్టారు. విభిన్న పాత్రలు, కథలతో ప్రేక్షకులు, అభిమానులను ఎంతగానో అలరించారు. 350పైగా చిత్రాల్లో నటించి సూపర్ స్టార్‌గా ఎదిగారు. నిర్మాతగా, దర్శకుడిగా సైతం రాణించి ఎందరో ఆర్టిస్ట్‌లకు దేవుడిగా మారారు. ఎన్నో మైలు రాళ్లు చేరుకున్న ఘట్టమనేని కృష్ణకు హైదరాబాద్‌లో ఆదివారం ఘనంగా సన్మానం జరిగింది. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఏపీ, తెలంగాణ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలుగు రాష్ట్రాల మంత్రులు శ్రీనివాస్ గౌడ్, అవంతి శ్రీనివాస్‌తోపాటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, నిర్మాతలు అశ్వినీదత్, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రేక్షకుల గుండెల్లో అల్లూరిసీతరామరాజుగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కృష్ణకు సన్మానం చేశారు. అలాగే తన 100వ చిత్రం అల్లూరి సీతారామరాజు విశేషాల్ని పంచుకున్నారు కృష్ణ. 350 చిత్రాల్లో నటించినా అల్లూరి సీతారామరాజు సినిమానే తనకిష్టమని తెలిపారు. -
వైజాగ్‌లో లండన్ ఐ!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఒకవైపు సముద్ర అలల తాకిడి... మరోవైపు కొండగాలి పలకరింపులు.. రెండింటి మధ్య విశాఖ అందాలను 360 డిగ్రీల కోణంలో 125 మీటర్ల ఎత్తు నుంచి చూస్తూ రాత్రి డిన్నర్ చేస్తే ఎలా ఉంటుంది. ఆహా ఊహ అద్భుతంగా ఉంది కదూ.. ఇప్పుడు ఆ ఊహ కాస్తా నిజం కానుంది. విశాఖపట్నంలో ‘లండన్ ఐ’ తరహాలో 125 మీటర్ల ఎత్తు ఉన్న మెగా వీల్‌ను బీచ్ రోడ్డులో నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పర్యాటకశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. మొత్తం 15 ఎకరాల్లో రూ.250 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ మెగావీల్ ప్రపంచ మెగావీల్ టాప్–10లో ఒకటిగా నిలిచిపోనుంది. లండన్ ఐ తరహాలో.. లండన్ ఐ.. మిలీనియం వీల్.. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే ప్రదేశం. థేమ్స్ నది ఒడ్డున ఏకంగా 130 మీటర్ల ఎత్తులోనున్న జెయింట్ వీల్ నుంచి లండన్ నగరాన్ని చూసే వీలుంది. ఇప్పుడు అదే తరహాలో సముద్రం ఒడ్డున వైజాగ్ అందాలను ఒకేసారి వీక్షించేందుకు అనుగుణంగా మెగావీల్ను నిర్మించనున్నారు. అంతేకాదు రాత్రి సమయంలో అటు సముద్రం.. ఇటు నగర అందాలను వీక్షిస్తూ 125 మీటర్ల ఎత్తులో భోజనం కూడా చేసే ఏర్పాట్లు చేయాలని పర్యాటకశాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఈ మెగావీల్ నిర్మాణానికి అవసరమైన 15 ఎకరాల భూమిని అధికారులు పరిశీలిస్తున్నారు. బీచ్ రోడ్డులో 4 ప్రదేశాలను పర్యాటకశాఖ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. అంతిమంగా భీమిలికి వెళుతున్న బీచ్‌రోడ్డుకు ఇటువైపుగా రూ. 250 కోట్ల మేర వ్యయంతో ఈ మెగావీల్ ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. ఇందులో 44 కేబిన్లు ఉంటాయి. ఒక్కో కేబిన్‌లో 10 మంది చొప్పున ఒకేసారి 440 మంది ప్రయాణించే వీలుంటుంది. 15 ఎకరాల్లో ఈ మెగావీల్తో పాటు షాపింగ్ కాంప్లెక్స్, పార్కింగ్, ఇతర రిక్రియేషన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం గ్లాసుతో నిర్మించనున్న కేబిన్ల ద్వారా చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూసే వీలు కలగనుంది. అంతేకాకుండా 125 మీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత కేబిన్ ఫ్లోరింగ్ కూడా గ్లాసుతో నిర్మించనుండడంతో కిందకు కూడా చూసే వీలుంటుంది. ► కేబిన్‌లో పూర్తిస్థాయి ఏసీ సదుపాయం. వైఫై, ఆడియో, వీడియో సదుపాయంతో పాటు పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఏర్పాటు. ► ఆటోమేటిక్ ఫొటోగ్రఫీ సదుపాయం. ► తుపాన్లతోపాటు 8.3 భూకంప తీవ్రతస్థాయిని తట్టుకునేలా వీల్ నిర్మాణం. ► అత్యధిక ఉష్ణోగ్రతలనూ తట్టుకుంటుంది. ► వీల్ మొత్తం ఒకసారి రొటేషన్ అయ్యేందుకు 20 నిమిషాల సమయం పడుతుంది. అంటే గంటకు 1,320 మంది పర్యాటకులు ప్రయాణించేందుకు వీలు. పర్యాటక అభివృద్ధికి అన్ని చర్యలు విశాఖ నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం. అటు బీచ్‌ల అభివృద్ధితో పాటు పలు హోటల్స్, రిసార్టుల నిర్మాణం జరుగుతోంది. మెగా వీల్ నిర్మాణంతో విశాఖ పర్యాటకంగా మరింత పరుగులు పెట్టనుంది. పలు ప్రైవేటు సంస్థలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. – ముత్తంశెట్టి శ్రీనివాస్, పర్యాటక శాఖ మంత్రి 4 ప్రాంతాలను పరిశీలిస్తున్నాం.. విశాఖపట్నానికి ఈ మెగావీల్ తలమానికం కానుంది. ఈ మెగావీల్ నిర్మాణానికి 15 ఎకరాల స్థలం అవసరం. ఇందుకోసం నాలుగు ప్రాంతాలను పరిశీలిస్తున్నాం. నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. – ప్రసాద్ రెడ్డి, ఏపీటీడీసీ చైర్మన్ -
అతడు ఆమె ప్రియుడు..టీజర్ చాలా బాగుంది
‘‘అతడు ఆమె ప్రియుడు’ సినిమా టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా అద్భుత విజయం సాధించి, యూనిట్‌కి మంచి పేరు, డబ్బులు రావాలి’’ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. సునీల్, కౌశల్, బెనర్జీ, మహేశ్వరి ముఖ్య పాత్రల్లో యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతడు ఆమె ప్రియుడు’. కూనం కృష్ణకుమారి సమర్పణలో రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని అవంతి శ్రీనివాస్ విడుదల చేశారు. యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ– ‘‘చిరంజీవి నటించిన పలు బ్లాక్ బస్టర్స్‌కు కథలు అందించిన నేను ఆయనకు పెద్ద ఫ్యాన్. రవి కనగాల–తుమ్మలపల్లి ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమా నిర్మించారు’’ అన్నారు. ‘‘అతి త్వరలో మా సినిమా విడుదల కానుంది’’ అన్నారు రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి. -
అధికారులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలి: మంత్రి అవంతి
విశాఖ: పాడేరు ఐటీడీఏ పరిధిలో అభివృద్ధి పనులపై మంత్రి అవంతి శ్రీనివాస్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సచివాలయాలు, ఆర్బీకేల నిర్మాణాలకు త్వరలో బిల్లులు మంజురు చేస్తామని మంత్రి అవంతి పేర్కొన్నారు. ఏజెన్సీలో ప్రతి గ్రామానికి రోడ్డు,విద్యుత్,తాగునీటి సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. అధికారులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అదే విధంగా.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ రావు తెలిపారు. -
ఎయిడెడ్ స్కూల్స్ విషయంలో ఎవరిపైనా ఒత్తిడిలేదు: మంత్రి అవంతి
విశాఖపట్నం: ఎయిడెడ్ స్కూల్స్ యాజమాన్యంతో ఆదివారం మంత్రి అవంతి శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిడెడ్ స్కూల్స్ విషయంలో కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం జిల్లాలో.. మొత్తంగా 89 ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయని, వాటిలో 69 పాఠశాలల యాజమాన్యాలు విలీనం చేసేందుకు ముందుకొచ్చాయని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎయిడెడ్ స్కూల్స్ విషయంలో ఎవరిపైనా ఒత్తిడి లేదని మంత్రి స్పష్టం చేశారు. అదేవిధంగా, విద్యార్థుల చదువులకు సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. చదవండి: ‘ఎయిడెడ్ సంస్థల్ని ప్రక్షాళన చేస్తుంటే ప్రతిపక్షాలకు ఎందుకు నొప్పి?’ -
ప్రాంతాలవారీ పర్యాటక పండుగలు
సాక్షి, అమరావతి: పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రాంతాల వారీగా పర్యాటక పండుగలు (టూరిజం ఫెస్టివల్స్) నిర్వహించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సూచించారు. ఆయన మంగళవారం సచివాలయంలో పర్యాటకశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరిత హోటళ్లలో నూరుశాతం ఆక్యుపెన్సీ సాధించేలా అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. నిత్యం హరిత హోటళ్లు, రిసార్ట్‌లను పర్యవేక్షిస్తూ నెలరోజుల్లో మెరుగైన సౌకర్యాలతో తీర్చిదిద్దాలని ఆదేశించారు. కొత్త సంవత్సరంలో టూరిజం యాప్‌ను అందుబాటులోకి తేవాలన్నారు. ప్రైవేట్ ఆపరేటర్లతో చర్చించి బోటింగ్ సేవలను ప్రారంభించాలని చెప్పారు. సీఎం కప్ టోర్నీకి అపూర్వ స్పందన అనంతరం క్రీడాశాఖాధికారుల సమీక్షలో మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ సీఎం కప్ టోర్నీకి అపూర్వ స్పందన వస్తోందని చెప్పారు. వచ్చేనెల 6వ తేదీన విజయనగరం, అనంతరం పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో కూడా టోర్నీ నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. తెనాలి, బాపట్లలోని క్రీడా వికాసకేంద్రాలను నవంబర్ 1వ తేదీన ప్రారంభించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ, ఆంధ్రప్రదేశ్ పర్యాటకసంస్థ సీఈవో సత్యనారాయణ, సాంస్కృతికశాఖ సీఈవో మల్లిఖార్జున, క్రీడాప్రాధికార సంస్థ ఎండీ ఎన్.ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు. -
స్త్రీ,శిశు సంక్షేమ శాఖకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు
-
‘చంద్రబాబు రాజకీయ జీవితమంతా కుట్రలు, కుతంత్రాలే’
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధిని ఎలాగైనా అడ్డుకోవాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. విశాఖలో రెండోరోజు కొనసాగుతున్న జనాగ్రహ దీక్షలో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయ జీవితమంతా కుట్రలు, కుతంత్రాలతో కూడుకున్నదని విమర్శించారు. సొంత మామను వెన్నుపోటు పొడిచిన చరిత్ర బాబుదన్నారు. తమ ప్రభుత్వం పార్టీలు, కులమతాలకతీతంగా పథకాలు అమలు చేస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహేతుకంగా ఉండాలి: విజయసాయిరెడ్డి ఏపీలో టీడీపీ వెంటిలేటర్‌పై ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో టీడీపీ పాలన ఎలా ఉండేదో ప్రజలకు తెలుసని అన్నారు. 2019 నుంచి ప్రతి ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైందని అన్నారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్నారని అన్నారు. లోకేష్ ట్విట్టర్లో అసభ్య పదజాలాన్ని వాడుతున్నారని మండిపడ్డారు. ప్రతి పక్షం ప్రజా సమస్యలపై పోరాడాలి కానీ అసభ్యంగా దూషించడం సరికాదని ఎంపీ విజయసాయిరెడ్డి హితవు పలికారు. చదవండి: ఏపీలో ఉవ్వెత్తున జనాగ్రహ దీక్షలు -
చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు
-
ఏపీలో అలజడులకు చంద్రబాబు కుట్ర
-
‘ఏపీలో అలజడులకు చంద్రబాబు కుట్ర’
సాక్షి, విశాఖపట్నం: అభివృద్ధి కార్యక్రమాలకు టీడీపీ ఆటంకాలు సృష్టిస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. రాష్ట్రంలో పార్టీలకతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. ‘‘టీడీపీ నేతలు దిగజారి ప్రవర్తిస్తున్నారు. అలజడులు సృష్టించాలన్నది చంద్రబాబు కుట్ర. ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. సంక్షేమ పాలనను చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని’’ మంత్రి అవంతి దుయ్యబట్టారు. టీడీపీ నేతలు హద్దులు దాటి ప్రవర్తిసున్నారు.. కర్నూలు: టీడీపీ నేతలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మండిపడ్డారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. బాబు డైరెక్షన్లో ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని హఫీజ్‌ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఫ్రస్టేషన్.. తాడేపల్లి: రాష్ట్రంలో అలజడులకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని.. అందుకే సీఎంపై తన చెంచాలతో అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోవడంతో చంద్రబాబుకు ఫ్రస్టేషన్ పెరిగిపోయిందన్నారు. సీఎంని దూషించిన వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలన్నారు. ఉనికి కోసం టీడీపీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు అనంతపురం: టీడీపీ ఉనికి కోసం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యల వెనుక చంద్రబాబు హస్తం ఉందన్నారు. చంద్రబాబు డైరెక్షన్లోనే అయ్యన్నపాత్రుడు, పట్టాభి రెచ్చిపోతున్నారన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేతలు క్షమాపణలు చెప్పాలన్నారు. టీడీపీ నేతలు విజ్ఞత కోల్పోయారు.. తూర్పుగోదావరి: టీడీపీ నేతలు విజ్ఞత కోల్పోయారని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. టీడీపీ నేత పట్టాభి వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. బాబులో మార్పు రాలేదు... కాకినాడ: చంద్రబాబు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలజడులు సృష్టించడానికి చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ప్రజలు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా.. బాబులో మార్పు రాలేదన్నారు. టీడీపీ నేత పట్టాభి మాటలు సంస్కారహీనం.. నెల్లూరు: వరుస ఓటములతో చంద్రబాబుకు పిచ్చి పట్టిందని ఎమ్మెల్యే సంజీవయ్య మండిపడ్డారు. టీడీపీ నేత పట్టాభి మాటలు సంస్కారహీనమని ధ్వజమెత్తారు. లోకేష్ అసమర్థుడు అనే విషయాన్ని బాబు జీర్ణించుకోలేపోతున్నారు. ఏమీ చేయలేక చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని సంజీవయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అయ్యన్నపాత్రుడు సప్త వ్యసనపరుడు: అవంతి శ్రీనివాస్
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి టీడీపీ ఓర్వలేకపోతుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో అలజడి, అశాంతి సృష్టించాలనే టీడీపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.(చదవండి: ‘పెగ్గేనా.. గంజాయి కూడా తీసుకున్నారా?’) ‘‘మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సప్త వ్యసన పరుడు. సీఎంపై మాట్లాడిన తీరు అమానుషం. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైఎస్సార్సీపీకి ఏకపక్ష విజయం వస్తుందని అందరికీ తెలుసు. వైఎస్సార్సీపీ విజయం ఖాయమని భావించి టీడీపీ కుట్రలు చేస్తోంది. అయ్యన్న పాత్రుడిని బేషరతుగా అరెస్ట్ చేయాలని’’ మంత్రి అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. చదవండి: కొరటాల, జక్కన్నలను ఓ ఆటాడుకున్న తారక్! -
టెంపుల్ టూరిజంలో ఆలయాల అభివృద్ధి
సాక్షి, అమరావతి: టెంపుల్ టూరిజంలో భాగంగా దేవాలయాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించినట్టు పర్యాటక, సాంస్కృతిక, యువజనశాఖ మంత్రి ముత్తంశెట్జి శ్రీనివాసరావు తెలిపారు. సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాదం’ పథకం కింద రూ.48 కోట్లతో అన్నవరం దేవస్థానాన్ని అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. ఇప్పటికే రూ.50 కోట్లతో శ్రీశైల దేవాలయం అభివృద్ధి పనులు పూర్తిచేశామని, మరో రూ.50 కోట్లతో సింహాచల ఆలయ అభివృద్ధి పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కోస్తా, రాయలసీమ పర్యాటక సర్క్యూట్లలో రవాణా, కమ్యూనికేషన్ సౌకర్యాల కల్పనతో పాటు మౌలిక వసతులను మెరుగుపరుస్తామన్నారు. రూ.47 కోట్లతో పర్యాటక సంస్థకు చెందిన 15 హోట్లళ్లు, రెస్టారెంట్లను ఆధునికీకరిస్తున్నట్లు తెలిపారు. పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక టూర్ ప్యాకేజీలను తీసుకొస్తున్నామన్నారు. పర్యాటక సంస్థకు ఏడాదిలో ఇప్పటికే రూ.40 కోట్ల ఆదాయం వచ్చిందని, రూ.125 కోట్ల వార్షిక ఆదాయం లక్ష్యంతో ముందుకెళుతున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ సీఈవో, ఏపీ టూరిజం కార్పొరేషన్ ఎండీ ఎస్.సత్యనారాయణ పాల్గొన్నారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించలేరు..
గాజువాక: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కార్మికులు ఏడు నెలలుగా పోరాడుతున్నా కేంద్రం మొండిగా వ్యవహరించడం సబబు కాదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. విశాఖ స్టీల్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఉక్కు అఖిల పక్ష కార్మిక, నిర్వాసిత సంఘాల ఆధ్వర్యంలో గాజువాకలో ఆదివారం నిర్వహించిన మహా పాదయాత్రను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్ని కుట్రలు పన్నినా స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించలేరని స్పష్టం చేశారు. ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్సీపీ పూర్తి స్థాయిలో మద్దతుగా ఉంటాయన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అంశంపై రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్రాన్ని ప్రశ్నించాలని డిమండ్ చేశారు. స్టీల్ ప్లాంట్‌కు నష్టాలొచ్చాయన్నది మాత్రం దుష్ప్రచారమని కొట్టిపారేశారు. జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం కూడా చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పాదయాత్ర
-
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం: మంత్రి అవంతి
సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం వ్యతిరేకిస్తూ మహా పాదయాత్రను మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆదివారం ప్రారంభించారు. కాకతీయ గేట్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ప్రారంభించిన ఈ పాదయాత్రలో గ్రేటర్ విశాఖ మేయర్ హరి వెంకట కుమరి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. (చదవండి: ఆ కడుపు కోత నాకు తెలుసు: బాబు మోహన్ భావోద్వేగం) ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ లాభాల్లో నడుస్తోందన్నారు. పార్టీలకతీతంగా స్టీల్‌ప్లాంట్ కోసం పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏడు నెలలుగా రోడ్లపైకి వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై వ్యతిరేకిస్తున్న కేంద్రం పట్టించుకోవడం లేదని మంత్రి మండిపడ్డారు. కేంద్రం నిర్లక్ష్యం... విభజన హామీలను పట్టించుకోకుండా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. స్టీల్‌ప్లాంట్ కోసం పోరాటం చేస్తూనే ఉంటామని ఎమ్మెల్యే అమర్నాథ్ అన్నారు. చదవండి: ఒంగోలులో స్ట్రీట్ ఫైట్: వీడియో వైరల్ -
సింహాచలం ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
-
పర్యాటక రంగానికి ‘స్టార్’ హంగులు
సాక్షి, అమరావతి: విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతి జిల్లాలో ఐదు నుంచి ఏడు నక్షత్రాల హోటళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనశాఖ మంత్రి ముత్తంశెట్జి శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం సచివాలయంలో 13 జిల్లాలకు చెందిన పర్యాటక, క్రీడా సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో మూడుచోట్ల స్టార్ హోటళ్ల నిర్మాణాలకు పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరిపినట్టు తెలి పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి 50 శాతం హోటళ్లను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు. థాయిలాండ్, మలేషియా, స్విట్జర్లాండ్ వంటి 40 శాతం దేశాలు కేవలం పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయంతోనే అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని చెప్పారు. వీటి తరహాలోనే రాష్ట్ర ఆదాయ వనరుగా పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతులు, రవాణా, బోటింగ్ సౌకర్యాలను మెరుగుపర్చి.. ఆన్లైన్, సోషల్ మీడియా వేదికగా ప్రచారం కల్పిస్తామని, ఇందుకోసం దసరాలోగా ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడిం చారు. ఈ సమీక్షలో మంత్రి ఇంకా ఏమన్నారంటే.. పర్యాటకంపై ప్రత్యేక కార్యక్రమాలు ► పర్యాటక ప్రాంతాల ప్రాచుర్యం అందరికీ తెలిసేలా నెలకు ఒక జిల్లాలో ప్రత్యేక ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తాం. లోకల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కోస్తా, రాయలసీమ పర్యాటక సర్క్యూట్లలో ఒక్కో మేనేజర్‌ను నియమించి.. ప్రత్యేక బస్సు నడుపుతూ ఒకటి, రెండు రోజుల ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తాం. ► కోవిడ్‌కు ముందు రూ.120 కోట్లు పర్యాటక ఆదాయం వచ్చేది. ప్రస్తుతం అది రూ.60 కోట్లకు పడిపోయింది. అది కూడా కోవిడ్ ఆస్పత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో భోజన సదుపాయం కల్పించడం వల్ల సమకూరింది. ► పర్యాటకశాఖలో కోవిడ్‌తో మృతిచెందిన 8 మంది ఉద్యోగుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయంతో పాటు అర్హతను బట్టి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తాం. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విభాగాల్లో ఒకే చోట ఐదేళ్లకు మించి పని చేస్తున్న వారికి స్థాన చలనం తప్పదు. త్వరలోనే ఖాళీలు భర్తీ చేస్తాం. సీ ప్లెయిన్లను నడిపేందుకు చర్చలు ► బోట్ల నిర్వహణ సజావుగా సాగేందుకు ఏర్పాటు చేసిన తొమ్మిది కమాండ్ కంట్రోల్ సెంటర్ల మార్గదర్శకాలకు అనుగుణంగా 24 ప్రభుత్వ, 164 ప్రైవేటు బోటు సేవలు ప్రారంభిస్తాం. విశాఖపట్నం, విజయవాడ, నాగార్జునసాగర్, సూ ర్యలంక తదితర ప్రాంతాల్లో సీ ప్లెయిన్లను నడిపేందుకు ఆయా సంస్థలతో చర్చిస్తున్నాం. ► కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘ప్రసాద్’ (పిలిగ్రిమేజ్ రెజువినేషన్ అండ్ స్పిరిచ్యువల్ అగ్మెంటేషన్ డ్రైవ్) పథకం కింద టెంపుల్ టూరిజంలో భాగంగా రూ.50 కోట్లతో శ్రీశైలం ఆలయ అభివృద్ధి చేపట్టాం. మరో రూ.50 కోట్లతో సింహాచల దేవస్థానం అభివృద్ధి పనులకు త్వరలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తాం. నూతన క్రీడా పాలసీకి సన్నాహాలు గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించేందుకు నూతన క్రీడా పాలసీని తీసుకొస్తున్నట్టు మంత్రి ముత్తంశెట్జి శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే ముసాయిదా సిద్ధమైందని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆమోద ముద్ర వేయిస్తామన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద క్రీడా ప్రాంగణాల అభివృద్ధి, క్రీడాకారులను దత్తత తీసుకునే కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నట్టు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తామన్నారు. విశాఖ జిల్లా కొమ్మాదిలో క్రీడా ప్రాంగణాన్ని ఖేలో ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సమీక్షలో ఏపీటీడీసీ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ (శాప్) చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ సీఈఓ ఎస్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మాజీ సైనికులకు అండగా సీఎం జగన్: హోం మంత్రి సుచరిత
-
విశాఖలో పరిపాలన రాజధానిపై టీడీపీ వైఖరేంటి?
మహారాణిపేట (విశాఖ దక్షిణ): విశాఖలో పరిపాలన రాజధానికి టీడీపీ ఉత్తరాంధ్ర నాయకులు అనుకూలమా, వ్యతిరేకమా అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సూటిగా ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఉత్తరాంధ్ర చర్చా వేదిక పేరిట డ్రామాలాడే బదులు విశాఖ పరిపాలన రాజధానిని అడ్డుకోవద్దని హితవు పలికారు. విశాఖే రాజధాని కావాలని తీర్మానం చేసి చంద్రబాబుకు పంపాలని, వారికి దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబును ఒప్పించాలని సూచించారు. వారికి ఉత్తరాంధ్ర ఓట్లు, సీట్లు కావాలి తప్ప.. అభివృద్ధి చెందితే ఓర్చుకోలేరని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో అనుసరించిన రెండు కళ్ల సిద్ధాంతాన్నే మూడు రాజధానులపై చంద్రబాబు అనుసరిస్తున్నారన్నారు. గంగవరం పోర్టు 90 శాతం ప్రైవేటుగా ఉందని, 10 శాతమే ప్రభుత్వానికి ఈక్విటీ ఉందని గుర్తు చేశారు. ఆ వాటాకు గత ఐదేళ్లలో ప్రభుత్వానికి రూ.80 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందన్నారు. చంద్రబాబు హయాంలో 58 సంస్థలను అమ్మేశారని.. వారు చేస్తే ఒప్పు, వేరేవాళ్లు చేస్తే తప్పా అని మంత్రి ప్రశ్నించారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధం రాష్ట్రంలో వైఎస్సార్సీపీ సర్కార్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు తామెప్పుడూ సిద్ధమేనని మంత్రి ముత్తంశెట్టి చెప్పారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటినుంచి 13 జిల్లాలను అభివృద్ధి చేస్తున్నారని, ఏ ప్రాంతాన్ని విస్మరించలేదని గుర్తు చేశారు. తెలుగుదేశం నాయకులే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత ఉద్దానం కిడ్నీ బాధితులకు సహాయం చేయడమే కాకుండా వారి కోసం ప్రత్యేకంగా ఆస్పత్రి నిర్మిస్తున్నారని, పాడేరులో రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతోందని, పోలవరం ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. టీడీపీ నాయకులు దుష్ప్రచారాన్ని నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించవద్దని ప్రధానికి సీఎం లేఖ రాశారని, అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపారని, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో స్టీల్‌ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులను కేంద్ర ఆర్థిక, ఉక్కు శాఖల మంత్రుల వద్దకు తీసుకు వెళ్లారని, ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన ఆందోళనలో తమ ఎంపీలు పాల్గొన్నారని గుర్తు చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు పాల్గొన్నారు. -
విశాఖలో ఘనంగా గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి
-
Avanthi Srinivas: అది తప్పుడు ఆడియో
సాక్షి, విశాఖపట్నం: సోషల్ మీడియాలో గురువారం వైరల్ అయిన ఆడియో తనది కాదని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. వ్యక్తిగతంగా, రాజకీయంగా తన ఎదుగుదలను చూసి ఓర్వలేక కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసు కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హాకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా విచారణ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇలా క్రియేట్ చేస్తున్నవారి నిగ్గుతేల్చాలని కోరినట్లు చెప్పారు. విశాఖలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాన్య కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. మంచితనంతో అంచెలంచెలుగా ఎమ్మెల్యే నుంచి మంత్రి స్థాయి వరకు ఎదిగానని చెప్పారు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేక ఎవరో కొందరు కుట్ర పన్నారని, దీనివెనుక ఎవరున్నారన్న విషయం పోలీసుల విచారణలో తేలుతుందని పేర్కొన్నారు. తాను ఎటువంటి అవినీతిఖి పాల్పడనన్నారు. తన రాజకీయ ఎదుగుదలను, వైఎస్సార్సీపీ సర్కార్ ప్రగతిని చూసి ఓర్వలేక జరిగిన కుట్రగా భావిస్తున్నట్లు తెలిపారు. తనకు శత్రువులు లేరని చెప్పారు. తాను మహిళతో మాట్లాడిన విషయం వాస్తవం కాదన్నారు. రోజురోజుకు రాజకీయాలు దిగజారుగుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. తనకు దేవుడిపై నమ్మకం ఉందని, ఇలాంటి కుట్రలు ఎవరు పన్నినా అవి ఫలించవని చెప్పారు. తన ప్రత్యర్థి కూడా బాగుండాలి అనుకుంటానన్నారు. తాను తప్పుడు పనులు చేయనని, ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతానని చెప్పారు. రాజకీయంగా తనపై పోటీచేసిన ప్రత్యర్థులను కూడా మిత్రులుగానే చూసే వ్యక్తినన్నారు. జిల్లాలో ఏకైక మంత్రిగా తాను చేసే మంచిపనులు, పార్టీ అభివృద్ధి చూడలేకనే సోషల్ మీడియాలో ఫేక్ వీడియోతో ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో మంచి కన్నా చెడు త్వరగా ప్రచారం జరుగుతుందన్నారు. ఇందులో ఎవరున్నా వదిలేది లేదని పేర్కొన్నారు. దేవుడి ఆశీస్సులు, ప్రజల అభిమానం ఉన్నంతవరకు ఎవరూ తన ఎదుగుదలను అడ్డుకోలేరన్నారు. ఇలాంటి వదంతులు నమ్మవద్దని నియోజకవర్గ ప్రజలను, రాష్ట్రంలో పార్టీ శ్రేణులను, అభిమానులను కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. బవైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నుంచి దళితులను వేరు చేయలేరు : మంత్రి అవంతి
-
నవరత్నాలు-పేదలందరికి ఇళ్ల నిర్మాణంపై మంత్రి అవంతి సమీక్ష
-
ఆదర్శనీయం వంగపండు జీవితం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): ప్రజాకవి వంగపండు ప్రసాదరావు జీవితం ఎందరికో ఆదర్శనీయమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. సిరిపురంలోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో బుధవారం వంగపండు ప్రసాదరావు ప్రథమ వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ..సాంస్కృతిక, కళా రంగానికి వంగపండు జీవితం అంకితం చేశారని చెప్పారు. ప్రజాకవి గుమ్మడి విట్టల్‌రావు (గద్దర్) మాట్లాడుతూ..కళాకారులంతా వంగపండు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జానపద కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గౌరవిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. సినీ నటుడు, దర్శక, నిర్మాత ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. వంగపండుకు రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని గౌరవం కల్పించిందన్నారు. ఆయన చనిపోతే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టిందని గుర్తుచేశారు. బీచ్‌రోడ్డులో వంగపండు విగ్రహం ఏర్పాటుకు చర్యలు, ఏటా ఆయన పేరిట ఓ కళాకారుడికి రూ.2 లక్షల నగదు అవార్డు ప్రదానం చేయడం మంచి నిర్ణయమన్నారు. కళాకారులకు సీఎం వైఎస్ జగన్ ఎంతో గౌరవం ఇస్తున్నారంటూ సభాముఖంగా సెల్యూట్ చేశారు. గద్దర్, ఆర్.నారాయణమూర్తి, విమలక్క తదితరులు తమ ఆటపాటలతో అలరించారు. బాడ సూరన్నకు అవార్డు ప్రదానం శ్రీకాకుళం జిల్లాకు చెందిన జానపద కళాకారుడు బాడ సూరన్నకు జానపద వాగ్గేయకారుడు వంగపండు స్మారక అవార్డుతో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సత్కరించారు. అవార్డులో భాగంగా రూ.2 లక్షల నగదును ప్రభుత్వం తరఫున అందించారు. బాడ సూరన్న మాట్లాడుతూ..తన 36 ఏళ్ల జీవితంలో కళను, కళాకారుడిని ఇంతలా గౌరవించిన ప్రభుత్వం మరొకటి చూడలేదన్నారు. కార్యక్రమంలో మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, రాష్ట్ర సామాజిక న్యాయ సలహాదారుడు జూపూడి ప్రభాకరరావు, అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఏపీ రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక సమితి చైరపర్సన్ వంగపండు ఉష, వీఎంఆర్డీఏ చైరపర్సన్ అక్కరమాని విజయనిర్మల, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, వాసుపల్లి గణేష్‌కుమార్, రాష్ట్ర విద్యాభివృద్ధి మౌలిక సదుపాయాల సంస్థల చైర్మన్ మళ్ల విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
‘విశాఖ బీచ్ రోడ్లో త్వరలో వంగపండు ప్రసాదరావు విగ్రహం ఏర్పాటు’
సాక్షి, విశాఖపట్నం: దివంగత ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు వర్థంతిని విశాఖపట్నంలో రేపు(బుధవారం) నిర్వహిస్తామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏటా ఆగస్టు 4న వంగపండు వర్థంతిని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వంగపడు ప్రసాదరావు స్మారక అవార్డు పేరిట ఉత్తమ జానపద కళాకారునికి రూ.2 లక్షల అవార్డు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. విశాఖ బీచ్ రోడ్లో త్వరలో వంగపండు ప్రసాదరావు విగ్రహం ఏర్పాటు చేస్తామని మంత్రి అవంతి తెలిపారు. -
ప్రభుత్వం తరపున అన్ని రకాల ప్రోత్సహకాలు ఉంటాయి : అవంతి
-
పీవీ సింధుకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు
ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన పీవీ సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. సింధు విజయం ద్వారా భారత్‌కు మరింత గౌరవం దక్కిందని ఆంధ్రప్రదేశ్ క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కొనియాడారు. ఈ విజయం స్ఫూర్తిగా భారత యువత క్రీడల్లో రాణించే అవకాశం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్.. పీవీ సింధుని ప్రశంసించారు. కాగా టోక్యో ఒలింపిక్స్‌కు భారీ అంచనాల నడుమ ఒలింపిక్స్‌కు వెళ్లిన సింధు.. దాన్ని సాకారం చేసుకుంటూ భారత్‌కు పతకం అందించి త్రివర్ణపతకాన్ని అంతర్జాతీయ వేదికపై మరోసారి రెపరెపలాడించింది. పీవీ సింధు 21-13, 21-15 తేడాతో బింగ్ జియావోపై గెలిచింది. -
బడుగు బలహీన వర్గాలకు సీఎం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు :అవంతి శ్రీనివాస్
-
ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఆందోళన : అవంతి శ్రీనివాస్
-
విశాఖ ఉక్కు కార్మికుల నిరసనలకు మద్ధతిస్తాం: విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖ: పార్లమెంట్ సమావేశాల్లో స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఆగష్టులో జంతర్‌మంతర్ వద్ద చేపట్టబోయే కార్మికుల నిరసనలకు మద్దతు ప్రకటిస్తామని తెలిపారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్‌తో స్టీల్‌ప్లాంట్ కార్మికులు బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. విపక్ష నేతల మద్దతుతో పార్లమెంటులో తమ గళం వినిపిస్తామని భరోసా ఇచ్చారు. ఆర్ధిక, ఉక్కుశాఖ మంత్రులను కలుసి మాట్లాడతామని అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి తాము వ్యతిరేకమని, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం సరికాదని విజయసాయిరెడ్డి అన్నారు. నష్టాల్లో ఉన్న సంస్థలను లాభాల్లోకి తీసుకొచ్చే చర్యలు చేపట్టాలని, స్టీల్‌ప్లాంట్ రుణాలను ఈక్విటీగా మార్చాలని తెలిపారు. మైనింగ్‌ను కేటాయిస్తే తక్కువ ధరకు ముడిసరుకు లభిస్తుందని పేర్కొన్నారు. కాగా జాతి సంపదను ప్రైవేటీకరణ చేయడం సరికాదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో చేపట్టబోయే నిరసనలకు మద్దతు ఇవ్వాలని కార్మికులు కోరగా.. మంత్రి అందుకు అంగీకరించారు. -
భూ అక్రమాల బాధ్యులపై కఠిన చర్యలు
సాక్షి, విశాఖపట్నం: మాన్సాస్ ట్రస్టు, సింహాచలం అప్పన్న దేవస్థాన భూముల పరాధీనానికి బాధ్యులపై కఠినచర్యలు తప్పవని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, ఎంపీ వి.విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ సుమారు 748 ఎకరాల భూమిని ఆలయ రిజిస్టర్ నుంచి తొలగించిన విషయాన్ని ‘సాక్షి’ పత్రిక వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఆయా భూములను సర్వే చేయడంతో పాటు ఆ వ్యవహారంపై విచారణ జరపడానికి విజయనగరం, విశాఖపట్నం జాయింట్ కలెక్టర్లు కిశోర్‌బాబు, ఎం.వేణుగోపాల్‌రెడ్డికి రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి బాధ్యతలు అప్పగించారని మంత్రి ముత్తంశెట్టి చెప్పారు. వారు పదిరోజుల్లో నివేదికను, సంబంధిత రికార్డులను అందించిన తర్వాత ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఈ భూముల వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై, తద్వారా అడ్డగోలుగా లబ్ధిపొందిన వ్యక్తులపై చర్యలు తప్పవని చెప్పారు. విశాఖ నగర అభివృద్ధి, సింహాచలం పంచగ్రామాల భూసమస్య, ప్రభుత్వ భూముల పరిరక్షణ తదితర అంశాలపై మంగళవారం విశాఖ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి, ఎంపీ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉత్తరాంధ్రలో దేవాలయాల భూముల పరిరక్షణపై ఇటీవల దేవదాయశాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాన్సాస్ ట్రస్టు, సింహాచలం పంచగ్రామాల భూసమస్య గురించి అధికారులు ప్రస్తావించినట్లు మంత్రి చెప్పారు. దేవాలయ భూములను ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుని పేదలకు పట్టాలివ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎవరిపైనా కక్షసాధింపు చర్యలు కావని స్పష్టం చేశారు. చంద్రబాబు పరిపాలనలో యథేచ్ఛగా భూఆక్రమణలు జరిగాయన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.వేలకోట్ల విలువైన భూములను ఆక్రమణదారుల చెరనుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. తప్పు చేసినవారు తప్పించుకోలేరు వేల కోట్ల రూపాయల విలువైన సింహాచలం ఆలయ భూముల దుర్వినియోగం వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దలున్నారని ఎంపీ వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ఎస్టేట్స్ ఎబాలిషన్ యాక్ట్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సింహాచలం దేవస్థానం, మాన్సాస్ భూముల్లో జరిగిన అవకతవకలను వెలికితీస్తామన్నారు. తప్పు చేసినవారు ఎంతటివారైనా తప్పించుకోలేరని స్పష్టం చేశారు. పంచగ్రామాల భూసమస్య కోర్టులో ఉందని, జూలైలో విచారణకు వచ్చేలా చూడాలని అడ్వకేట్ జనరల్‌ను కోరామని చెప్పారు. పంచగ్రామాల్లో నివాసితులకు కోర్టు ఆదేశాలను అనుసరించే భూముల క్రమబద్ధీకరణ ఉంటుందని తెలిపారు. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, మేయర్ గొలగాని హరివెంకటకుమారి పాల్గొన్నారు. -
దేశ ఆర్థిక వ్యవస్థలో.. పోర్టులదే కీలక పాత్ర
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్ పరిస్థితుల్ని అధిగమించి.. దేశ ఆర్థిక వ్యవస్థలో పోర్టులు కీలకపాత్ర పోషించనున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. విశాఖ పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన్ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్, నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి, విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ కె.రామ్మోహన్రావు, జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి విశాఖ పోర్టు గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. అక్కడ వెంకయ్య పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పోర్టు చైర్మన్ రామ్మోహన్రావు, ఇతర అధికారులు పోర్టు పురోగతికి సంబంధించిన వివిధ అంశాల్ని వివరించారు. 103 ఎకరాల్లో రూ.406 కోట్లతో ఫ్రీ ట్రేడ్ అండ్ వేర్‌హౌసింగ్ జోన్ ఏర్పాటుచేస్తున్నట్లు ఉపరాష్ట్రపతికి తెలిపారు. ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. ప్రపంచ వ్యూహాత్మక నౌకాయాన మార్గంలో భారత్ ఉండటంతో పాటు 7,517 కి.మీటర్ల మేర ఉన్న తీరప్రాంతంలో 200కి పైగా మేజర్, మైనర్ పోర్టులు ఉండటం విశేషమన్నారు. దేశంలో పోర్టు ఆధారిత అభివృద్ధిని విస్తృతం చేసేందుకు కేంద్రం సాగరమాల కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. కోవిడ్ సమయంలో ప్రజలకు అత్యవసరమైన ఆక్సిజన్ సరఫరా చేయడంలో పోర్టులు చేసిన కృషిని ఆయన అభినందించారు. విశాఖ పోర్టులో సుస్థిరాభివృద్ధి కోసం ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పన, పోర్టు ఆధారిత అభివృద్ధి, డిజిటలైజేషన్ వ్యవస్థతో పాటు పర్యావరణ పరిరక్షణ వ్యవస్థలు ఏర్పాటుచేయడం ప్రశంసనీయమని కొనియాడారు. -
చంద్రబాబు, లోకేష్ ప్రతి విషయానికి రాద్దాంతం చేస్తున్నారు
సాక్షి, అమరావతి : నది పరివాహక ప్రాంతంలో బోటింగ్‌పై మంత్రి అవంతి శ్రీనివాస్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ రాష్ట్రంలో 250 బోట్లు ఉన్నాయి..తొమ్మిది కమాండ్ కంట్రోల్ రూమ్స్ ద్వారా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాము. తూర్పుగోదావరిలో కర్ఫ్యూ ఉంది కనుక జూలైలో బోటింగ్ ప్రారంభం అవుతుంది. విదేశీ టూరిస్టుల కోసం విదేశీ మద్యం అందుబాటులో ఉంచుతామని చెప్పాము. అన్ని రాష్ట్రాల్లో టూరిస్టుల కోసం మద్యం ఉంటుంది. మేము కొత్తగా చేసింది కాదు, గతంలో కూడా ఇది అమల్లో ఉంది. కొందరు దీన్ని వక్రీకరించి.. దుష్ప్రచారం చేస్తున్నారు. టూరిజం ప్రమోషన్స్‌ను రాజకీయాలతో ముడి పెట్టవద్దు. చంద్రబాబు, లోకేష్ ప్రతి విషయానికి రాద్దాంతం చేస్తున్నారు. కోవిడ్ సమయంలో ప్రజలకు అందుబాటులో లేకుండా హైదరాబాద్‌లో కూర్చున్నారు. మాయలు చేయడంలో చంద్రబాబు దిట్ట.. చెప్పింది చేయడంలో సీఎం వైఎస్ జగన్ ముందుంటారు. అత్యధిక టెస్టులు చేసింది.. అత్యధికంగా వ్యాక్సినేషన్ చేసింది ఏపీనే’’నని పేర్కొన్నారు. -
నేటి నుంచి పర్యాటక ప్రాంతాల్లోకి అనుమతి
సాక్షి, అమరావతి: కోవిడ్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పర్యాటక ప్రాంతాల్లోకి గురువారం నుంచి పర్యాటకులను అనుమతించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. రూ.164 కోట్లతో విశాఖ రుషికొండలోని హరిత హోటల్‌ను పర్యాటక శాఖ బ్లూబే హోటల్‌గా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. సచివాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీలోని పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ దేశంలోని ప్రధాన నగరాల్లో రోడ్ షోలు నిర్వహిస్తామన్నారు. కోవిడ్ కష్ట కాలంలో ఆదాయం తగ్గినా పర్యాటక శాఖలోని ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించలేదన్నారు. విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన విదేశీ ఓడను లో ఫ్లోటింగ్ రెస్టారెంట్ (షిప్ రెస్టారెంట్) ఏర్పాటుకు అన్ని అనుమతులు వచ్చాయని, వీలైనంత తొందరగా షిప్ కొనుగోలుకు చర్యలు తీసుకుంటామన్నారు. వైఎస్సార్ కడప జిల్లా గండికోటను హార్సిలీహిల్స్ తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణం రాష్ట్రంలో 13 ప్రాంతాల్లో సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కరోనా కారణంగా ఆ పనులు ఆలస్యమయ్యాయన్నారు. విశాఖ, తిరుపతిలో ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి ఒబెరాయ్ హోటల్ యాజమాన్యం ముందుకొచ్చిందన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లకు ఆహార పదార్థాలు సరఫరా చేయడం ద్వారా 38 హోటళ్ల ద్వారా గతేడాది రూ.58.05 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.28 కోట్ల మేర ఆదాయం ఆర్జించామన్నారు. ప్రైవేటు బోటు యజమానులతో శుక్రవారం విజయవాడలోని బెరమ్ పార్కులో సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. వారికి రూ.5 లక్షల చొప్పున ప్రోత్సాహకం ఈ ఏడాది సెప్టెంబర్‌లో టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌లో రాష్ట్రం నుంచి పాల్గొనే బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్, హాకీ క్రీడాకారిణి రజినికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో అంతర్జాతీయ స్థాయి స్టేడియాలను నిర్మించాలని నిర్ణయించామన్నారు. -
భవిష్యత్తులో విభజనవాదం రాకూడదనే ఈ ఆలోచన : అవంతి
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో పరిపాలన రాజధాని తరలింపు చట్ట ప్రకారమే జరుగుతుందని తెలిపారు. అదే విధంగా, భవిష్యత్తులో విభజన వాదం తలెత్తకూడదనే ఈ ఆలోచన చేసినట్లు పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. త్వరలో పరిపాలన రాజధానిగా విశాఖ అవుతుందని చెప్పారు. చదవండి: ఏపీ : ఐటీ పాలసీపై సీఎం వైస్ జగన్ సమీక్ష -
పాపికొండలు పర్యాటకానికి పచ్చజెండా
బుట్టాయగూడెం: గోదావరి నదికి ఇరువైపులా కొండల మధ్య పచ్చదనం పరుచుకున్న ప్రకృతి కాంత కనువిందు చేస్తోంది. పర్యాటకులకు మధురానుభూతినిచ్చే పాపికొండలు బోటు సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వాస్తవానికి గత నెలలోనే బోటు ప్రయాణాలను ప్రారంభించేలా అధికారులు ఏప్రిల్ 15న బోటు ట్రయల్ రన్ నిర్వహించారు. కోవిడ్ రెండో దశ విజృంభించడంతో బోటు ప్రయాణాలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం కోవిడ్ ఉధృతి తగ్గుముఖం పడుతుండటంతో జూన్ నెలాఖరు నుంచి బోటు సర్వీసులు నడిపేందుకు పర్యాటక శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గుముఖం పడితే.. కచ్చులూరు వద్ద బోటు ప్రమాదం తర్వాత సుమారు 19 నెలల పాటు ఆగిపోయిన బోటు సర్వీసులు తిరిగి మొదలవుతాయి. ప్రయాణం ఇక భద్రం కచ్చులూరు బోటు ప్రమాదం తర్వాత ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. బోటు ప్రయాణాలు భద్రంగా సాగేలా పోలవరం మండలం సింగన్నపల్లి, వేలేరుపాడు మండలం పేరంటాలపల్లి వద్ద రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. ఒక్కొక్క కంట్రోల్ రూమ్‌కు రూ.22 లక్షల నిధులను కేటాయించారు. బోటు ప్రయాణాలను పర్యవేక్షించేలా పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలకు చెందిన సిబ్బందిని నియమించింది. ప్రయాణికులకు లైఫ్ జాకెట్లు సమకూర్చడంతో పాటు ప్రయాణ అనుకూల పరిస్థితి, బోటు కండిషన్ తదితర అంశాలను వారు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేసింది. గోదావరి నదిపై ప్రయాణించే బోట్లకు విధిగా సీసీ కెమెరాలు ఉండేలా చర్యలు తీసుకుంది. బోటు ప్రయాణించే లొకేషన్‌ను ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ ద్వారా తెలుసుకునేలా జీపీఎస్ అమర్చే ఏర్పాట్లు చేసింది. ఏర్పాట్లు చేస్తున్నాం కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ నెలాఖరుకు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా బోటు సర్వీసులను ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. – ఏఎల్ మల్రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఏపీ టూరిజం -
తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదు: మంత్రి అవంతి
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు ఐదేళ్ల పాలనలో దోచుకోవడం, దాచుకోవడమేనని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదన్నారు. సీఎం జగన్‌కు తన, మన, పార్టీ, కులం తారతమ్యాలు లేవని తెలిపారు. చంద్రబాబుకు టీడీపీపైనా, ఆ పార్టీ నాయకులపైనా పట్టులేదని.. ఆయనకు పబ్లిసిటీ పిచ్చి తప్ప మంచి చేద్దామనే ఆలోచన ఉండదని ధ్వజమెత్తారు. కుట్రలు, కుతంత్రాలు పన్నడమే చంద్రబాబు పని అని దుయ్యబట్టారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ను చెడగొట్టొద్దని మంత్రి అవంతి శ్రీనివాస్ హితవు పలికారు. చదవండి: విశాఖ టీడీపీ భూకబ్జాదారుల గుండెల్లో గుబులు సాక్షి ఎఫెక్ట్: పల్లా ఆక్రమణలకు చెక్ -
టీడీపీ నేతలు కబ్జా చేసిన భూములను పేదలకు పంపిణీ చేస్తాం
-
చంద్రబాబు హయాంలో భారీగా భూకబ్జాలు: అవంతి
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు హయాంలో విశాఖలో భారీగా భూకబ్జాలు జరిగాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టీడీపీ నేతలపై కక్షసాధింపునకు దిగాల్సిన అవసరం తమకు లేదని.. తమది పేదల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వమని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలను చంద్రబాబు సమర్థిస్తారా? అని అవంతి ప్రశ్నించారు. ఎంతటివారైనా చర్యలు తప్పవు.. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారు ఎంతటివారైనా చర్యలు తప్పవన్నారు. టీడీపీ నేతల భూ కబ్జాలపై చంద్రబాబు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. గడిచిన రెండేళ్లలో విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి అవంతి పేర్కొన్నారు. సిట్ నివేదిక బయటపెడతాం.. ‘‘విశాఖ భూముల కుంభకోణంపై సిట్ నివేదిక బయటపెడతాం. పల్లా సింహాచలం అండ్‌కో రూ.700 కోట్ల విలువైన భూకబ్జా చేశారు. ప్రభుత్వ భూమి కబ్జాతోపాటు కొంత భూమిని అమ్మేశారు. టీడీపీ నేతలు కబ్జా చేసిన భూములను పేదలకు పంపిణీ చేస్తాం. త్వరలో ఎన్ఏడీ ఫ్లైఓవర్, భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తాం. బీజేపీ నేతలకు విశాఖపై ప్రేమ ఉంటే రైల్వే జోన్ తీసుకురావాలని’’ మంత్రి అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల్లోనే విశాఖ పరిపాలనా రాజధాని.. ప్రభుత్వ భూముల్లోనే విశాఖ పరిపాలనా రాజధాని నిర్మాణం జరుగుతుందని మంత్రి అవంతి అన్నారు. విశాఖ పరిపాలనా రాజధాని కోసం ప్రైవేట్ భూములు అవసరం లేదన్నారు. విశాఖలో ప్రభుత్వ భూములు పుష్కలంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటాం: ఎమ్మెల్యే అదీప్‌రాజు విశాఖలో కబ్జాకు గురైన ప్రతి సెంటు భూమిని స్వాధీనం చేసుకుంటామని ఎమ్మెల్యే అదీప్‌రాజు అన్నారు. టీడీపీ నేత బండారు ఆక్రమణలు విశాఖ ప్రజలకు తెలుసన్నారు. టీడీపీ నేతలు బయటకు రాకుండా జూమ్‌లో విమర్శిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ, టీడీపీ హయాంలో విశాఖలో వందల ఎకరాలు కబ్జా చేశారని.. ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. చదవండి: రూ.30 కోట్ల జరిమానా ఎగ్గొట్టిన టీడీపీ నేత నేడు, రేపు భారీ వర్షాలు -
రాజకీయ లబ్ది కోసమే లోకేశ్ ఆరాటం
విశాఖపట్నం: రాజకీయ లబ్ధికోసమే డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని లోకేష్ పరామర్శించారని మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శించారు. చంద్రబాబు హయంలోనే దళితులు ఉచకోతకు గురయ్యారని మంత్రి ఆరోపించారు. దళితుడిగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అంటూ హేళనగా మాట్లాడిన చరిత్ర చంద్రబాబుదే అని ఆయన గుర్తు చేశారు. అంతేకాదు ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని కూడా చంద్రబాబు నాయుడు చిత్రహింసలకు గురి చేశారని మంత్రి వివరించారు. ఈ రోజు చంద్రబాబుకు అన్నీ వర్గాలు దూరమయ్యాయన్నారు. ఇదేం సంస్కారం ఐదు కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని శాడిస్టు అంటూ లోకేశ్ విమర్శిస్తున్నారు, తన కొడుక్కి చంద్రబాబు నేర్పిన సంస్కారం , మర్యాదా ఇదేనా అంటూ మంత్రి అవంతి ప్రశ్నించారు. ఇకపై సీఎం జగన్‌పై విమర్శలు చేసేప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ లోకేశ్‌పై మంత్రి అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రికొడుకులిద్దరు ప్రభుత్వంపై కుట్రలు చేయడమే పనిగా పెట్టుకున్నారంటూ మంత్రి ధ్వజమెత్తారు. -
స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబుది పూటకో మాట
సాక్షి, విశాఖపట్నం : విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పూటకో మాట మాట్లాడుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాసరావు మండిపడ్డారు. స్టీల్‌ప్లాంట్‌పై డ్రామాలు ఆడేదే చంద్రబాబని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి. ప్రజల ఆకాంక్ష మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ తీర్మానం చేశారు. ఇప్పటికే ప్రధాని మోదీకి రెండు సార్లు ముఖ్యమంత్రి లేఖ రాశారు’’ అని అన్నారు. -
కోవిడ్ బాధితులకు విశాఖ కే జీ హెచ్ లో మెరుగైన వైద్య సేవలు
-
ప్రత్యేక పోస్టల్ కవర్ ని ఆవిష్కరించిన మంత్రి అవంతి శ్రీనివాస్
-
అచ్చెన్నా ఒళ్లు దగ్గర పెట్టుకో..
సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకమని, ఇప్పటికే ప్రధానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ కూడా రాశారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్‌పై చంద్రబాబు, టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. పోస్కోతో కలిసినంత మాత్రాన లాలూచీ పడినట్లు కాదని, 2014 లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు చర్చలు జరగలేదా..?. 2018లో పోస్కో ప్రతినిధులు చంద్రబాబును కలవలేదా అని ఆయన ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, సీఎం జగన్‌పై ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని మంత్రి అవంతి హెచ్చరించారు. రెండు సార్లు జైలుకెళ్లొచ్చినా అచ్చెన్నాయుడికి ఇంకా బుద్ధి రాలేదని మండిపడ్డారు. స్టీల్‌ప్లాంట్‌పై తమ పార్టీ విధానం స్పష్టంగా ఉందన్నారు. స్టీల్‌ప్లాంట్‌పై చంద్రబాబు ఎందుకు ప్రధానికి లేఖ రాయలేదని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబుకు ఆ బాధ్యత లేదా, ప్రధాని లేఖ రాసే ధైర్యం లేదా అని దుయ్యబట్టారు. దీక్షలు చేస్తున్న నేతలను ఎందుకు టీడీపీ నేతలు పరామర్శించలేదని ఆయన ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు రాజకీయాలు మానుకోవాలని అవంతి హితవు పలికారు. ఈ నెల 20న స్టీల్‌ప్లాంట్ కోసం మహా పాదయాత్ర చేస్తున్నామని.. ఆ యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మంత్రి అవంతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. (చదవండి: కలెక్టర్ వినూత్న శైలి: ఆ నోటీస్‌లో ఏముందంటే..) తిత్లీ పాపం.. టీడీపీకి కోలుకోలేని దెబ్బ.. -
అరకు ప్రమాదం: కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ
సాక్షి, విశాఖటప్నం: అరకు ప్రమాద ఘటనపై కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి ఆళ్ల నాని శనివారం తెలిపారు. ఆయన మీడియా మాట్లాడుతూ.. ఈ ప్రమాద ఘటన బాధాకరం అన్నారు. తెలంగాణ నుంచి 27 మంది అరకు ప్రాంతానికి వచ్చారని, ప్రమాదంలో నలుగురు మృతి చెందారని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు. ప్రత్యేక అంబులెన్స్‌లో స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అంతకు ముందు అరకు ఘాట్‌రోడ్ ప్రమాద ఘటనలో గాయపడి కేజీహెచ్ ఆస్పత్రిలో చేరిన బాధితులను మంత్రులు ఆళ్ల నాని, అవంతి శ్రీనివాస్ పరామర్శించారు. వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అరకు ఘాట్‌రోడ్ ప్రమాద ఘటనలో గాయపడిన 23 మంది బాధితులు కేజీహెచ్‌లో చికిత్స పొందుతురన్నారని డీఎంహెచ్‌వో తెలిపింది. అందులో చంద్రకళ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది పేర్కొంది. నాలుగు మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి చేసినట్లు తెలిపింది. చదవండి: లోయలో పడ్డ బస్సు: నలుగురు మృతి -
‘అలా చేస్తే పతనం తప్పదు’
సాక్షి, విశాఖపట్నం: దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ప్రజలంటే ఉత్తరాది రాష్ట్రాలు మాత్రమేనని బీజేపీ అనుకుంటుందని ఆయన దుయ్యబట్టారు. బడ్జెట్లో కడప స్టీల్ ప్లాంట్‌కు నిధులు కేటాయించలేదని.. ఏపీకి మొండిచేయి చూపించిందని ధ్వజమెత్తారు. విభజన హామీలు అమలు చేయలేదు సరి కదా ఎందరికో ఉపాధి కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం చేయాలని కుట్ర చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ, జనసేన నేతలు ప్రజల ఆకాంక్షను గుర్తు చేసుకోవాలన్నారు. ప్రధానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన లేఖ.. ప్రజల అభిప్రాయం చెప్పినట్టేనన్నారు. పవన్‌కల్యాణ్, బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. విశాఖ ఉక్కు కోసం రాజకీయాలకు అతీతంగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీ ఎంపీల అవసరం లేదని కేంద్రం భావిస్తే పతనం తప్పదని హెచ్చరించారు. తెలుగు ప్రజలకు నష్టం కలిగించిన పార్టీలు అడ్రస్ లేకుండా పోయాయని అవంతి శ్రీనివాస్ అన్నారు. (చదవండి: మోగని ‘గంట’: ఉత్తుత్తి లేఖతో హడావుడి..) (చదవండి: బాబ్బాబూ.. పోటీలో ఉండండి చాలు..) -
చంద్రబాబూ.. డ్రామాలు ఆపు: అవంతి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం దురదృష్టకరమని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎవరితో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని.. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మందికి ఉపాధి కల్పిస్తుందని, ఏపీపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ధ్వజమెత్తారు.(చదవండి: ఆ ఆలోచన సరికాదు: ఎంపీ ఎంవీవీ) కేంద్ర నిర్ణయంపై పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు స్పందించాలన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆపాలని, ఆయనకు ధైర్యం ఉంటే మోదీకి లేఖ రాయాలని ఆయన డిమాండ్ చేశారు. 32 మంది ప్రాణ త్యాగంతో విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పడిందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై టీడీపీ నేతలు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారని, ఉత్తుత్తి రాజీనామాలతో ఒరిగేది ఏమీలేదని మండిపడ్డారు. కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఎలాంటి పోరాటానికైన సిద్ధమని అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. (చదవండి: విశాఖ ఉక్కుపై ప్రధానికి సీఎం జగన్ లేఖ) -
సీఎం జగన్ పేదవాడి గుండె చప్పుడు
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదవాడి గుండె చప్పుడని, ప్రజల గుండెల్లో దేవుడై ఉన్నాడని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. సీఎం జగన్.. చంద్రబాబు లాగా పూటకోసారి మీడియా ముందుకు రారని, జూమ్‌లో మీటింగ్‌లు పెట్టే వ్యక్తి కాదని పేర్కొన్నారు. బుధవారం విశాఖ పీఎం పాలెం గాయత్రి నగర్లో సుమారు 2 కోట్ల రూపాయలతో పార్కుతో పాటు పలు అభివృద్ధి పనులకు మంత్రి అవంతి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ముఖ్యమంత్రి సచివాలయ సిబ్బందికి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించారు. వాలంటరీ వ్యవస్థని దేశ ప్రధాని పొగిడారు. పని చేసేవాడినే ప్రజలు ఎన్నుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా సమయంలో రూ. 1500 కోట్లు ఖర్చు పెట్టింది. అధికారంలోకి వచ్చాక జూట్ మిల్లు, తగరపువలస ఆర్టీసీ సమస్యలను తీర్చాం. (దేవాలయాలు కూల్చిన చరిత్ర టీడీపీ, బీజేపీలది..) అగ్రిగోల్డ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున రూ. 1000 కోట్లు ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మధురవాడలో ఒక్క గజం కూడా కబ్జా కాలేదు. మధురవాడలో రూ. 100 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఒక్కో వార్డులో 13 నుంచి 14 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది. చంద్రబాబుకు వేరే దిక్కు తోచక అల్లర్లు చేస్తున్నారు. ఏదో ఒక రభస చేసి ముఖ్యమంత్రికి మంచి పేరు రాకుండా చేస్తున్నారు. అభివృద్ధి విషయంలో సీఎం జగన్ కష్టపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవ్వరూ ఎవ్వరినీ చంపరు. రోజు రోజుకీ చంద్రబాబు దిగజారుతున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. మధురవాడని మధురమైన వాడగా తీర్చిదిద్దుతాం’’ అని అన్నారు. -
గాంధీ సేవలు చిరస్మరణీయం: మంత్రి అవంతి
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ నగర కార్యాలయంలో మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్.. మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలరాజు, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీ, మళ్ల విజయ ప్రసాద్, రెహమాన్, కోలా గురువులు పాల్గొన్నారు. చదవండి: పల్లెల్లో చిచ్చు: టీడీపీ నయా కుయుక్తులు.. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, జాతిని ఏక తాటిపైకి తెచ్చిన గొప్ప నేత మహాత్మాగాంధీ అని కొనియాడారు. అహింసా గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు ఆయన సాటి చెప్పారన్నారు. గాంధీజీ ఆశయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చుతున్నారన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ దేశానికి ఆదర్శమన్నారు. నాలుగు లక్షల మందికి పైగా ఒకేసారి ఉద్యోగాలను సీఎం వైఎస్ జగన్ కల్పించారన్నారు. చదవండి: నిమ్మగడ్డ లేఖ.. లక్ష్మణ రేఖ దాటిందా? -
ఏం సాధించారని రథయాత్ర
మహారాణిపేట(విశాఖ దక్షిణ): బీజేపీ నాయకులు రథయాత్ర దేనికోసం చేస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఇక్కడి ప్రభుత్వ సర్క్యూట్ హౌస్‌లో ఆయన సోమవారం మాట్లాడారు. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు అయినా తెచ్చారా అని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న సమయంలో విజయవాడలో విగ్రహాలు,ఆలయాలు పడగొడితే అప్పుడు ఎందుకు నోరు మెదపలేదో చెప్పాలన్నారు. అదే విగ్రహాలకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తిరిగి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నారని. ఇలాంటి మంచి పనులను బీజేపీ నాయకులు ఎందుకు అంగీకరించరని ప్రశ్నించారు. ► రాష్ట్రంలో రెండు రకాల బీజేపీ నాయకులు ఉన్నారని, ఒకరు నిజమైన బీజేపీ నాయకులని, మరొకరు చంద్రబాబునాయుడు పంపిన నాయకులని చెప్పారు. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గ్రహించాలని సూచించారు. ► రథయాత్ర ప్రారంభించే ముందు బీజేపీ ఆలోచించాలని, మేనిఫెస్టోలో పెట్టిన అంశాలపై బీజేపీ నాయకులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. ► అంతర్వేది ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరినా నేటివరకు విచారణ ప్రారంభం కాలేదని గుర్తు చేశారు. విశాఖలో రైల్వే జోన్, కర్నూలులో హైకోర్టు, కడప స్టీల్‌ప్లాంటు, వరద నష్టాలకు ఆర్థిక సహాయం వంటివి వచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి, అమలు చేయవలసిన బాధ్యత రాష్ట్ర బీజేపీ నాయకులకు లేదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్, కె.కె.రాజు తదితరులు పాల్గొన్నారు. -
యువత చేతుల్లో దేశ భవిష్యత్: మంత్రి అవంతి
సాక్షి, విశాఖపట్నం: ప్రపంచాన్ని భారతదేశ యువత శాసిస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన విశాఖ నగరంలోని ఉడా చిల్డ్రన్ థియేటర్లో నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రితో పాటు ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గొల్ల బాబురావు, వైఎస్సార్సీపీ నేతలు కోలా గురువులు, కేకే రాజు, మళ్ల విజయ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశ భవిష్యత్ యువత చేతుల్లో ఉందని ఎప్పుడో వివేకానంద చెప్పారన్నారు. యువతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారని మంత్రి అవంతి పేర్కొన్నారు. (చదవండి: దుర్గమ్మను దర్శించిన బండారు దత్తాత్రేయ) (చదవండి: ఏపీకి వ్యాక్సిన్ వచ్చేస్తోంది..) -
వైఎస్సార్ అనే పేరులో ఒక వైబ్రేషన్ ఉంది
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ అనే పేరులో వైబ్రేషన్ ఉందని, ఆయన పేరుతో క్రికెట్ పోటీలు నిర్వహించటం సంతోషంగా ఉందని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఈ పోటీలు చరిత్రలో నిలిచిపోతాయని అభిప్రాయపడ్డారు. సోమవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా విశాఖలో వైఎస్సార్ క్రికెట్ కప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎంపీ విజయసాయిరెడ్డి కాగడ వెలిగించి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు ఇంట్లో మనిషి జన్మదినంగా చేసుకున్నారన్నారు. ఈ పోటీలు వైఎస్సార్ సీపీ కార్యకర్తల కోసం పెట్టలేదని, క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభ బైటకు తీయడం కోసం పెట్టారని స్పష్టం చేశారు. ( వైఎస్సార్ సీపీ శ్రేణుల రక్తదానం: గిన్నిస్ రికార్డు) క్రీడల వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది : మంత్రి అవంతి ‘‘ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడతాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా వైఎస్సార్ క్రికెట్ కప్ పోటీలు పెడుతున్నాము. క్రికెట్ పోటీల వలన యువతలో ఉన్న నైపుణ్యం బైట పడుతుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్రీడా కార్యక్రమాలు నిర్వహించాలి’’ అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. -
‘ఉనికి కోసమే టీడీపీ దుష్ప్రచారం’
సాక్షి, విశాఖపట్నం: మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తున్నట్లు టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎలాంటి తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. సీఎం జగన్ ముందు టీడీపీ మైండ్ గేమ్‌లు పనిచేయవన్నారు. విశాఖలో టీడీపీ ఎమ్మెల్యేలు.. మాజీలు భూ కబ్జాలకు పాల్పడి.. వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిజం చెబితే చంద్రబాబుకు శాపం కాబోలు అన్నీ అబద్దాలే చెబుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ దుయ్యబట్టారు (చదవండి:పరిస్థితులు చక్కబడ్డాకే స్థానిక ఎన్నికలు) 25న భూ పట్టాల పంపిణీకి కసరత్తు: విజయసాయిరెడ్డి ప్రభుత్వ భూముల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నిర్మాణం జరుగుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈనెల 25న భూ పట్టాల పంపిణీకి కసరత్తు జరుగుతుందన్నారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతి లేదన్నారు. ఒడిశా అనుమతి ఇచ్చినా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు (చదవండి: పోలవరం పనులపై పీపీఏ సీఈవో సంతృప్తి) -
బంగ్లాదేశ్ షిప్‌ను ఫ్లోటింగ్ రెస్టారెంట్‌గా..
సాక్షి, విశాఖపట్నం: టూరిజం రంగానికి రీస్టార్ట్ ప్యాకేజీ అందిస్తున్నామని, రూ.200కోట్ల ప్యాకేజీని అతిధ్య రంగానికి కేటాయించాలని నిర్ణయించామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఆయన శనివారం రాష్ట్ర టూరిజం కొత్త పాలసీని ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ.. కొత్త ప్యాకేజీలో భాగంగా టూరిజంలో ఉన్న ప్రైవేట్ సంస్థలకి పెద్ద ఎత్తున రుణాలు అందిస్తామని పేర్కొన్నారు. మొత్తం రుణాలపై 9శాతం వడ్డీ కాగా, అందులో 4.5శాతం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టె సంస్థలకి త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. ఇందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి అనుమతులు సరళీకరణ చేస్తామన్నారు. చదవండి: 29న మూడో విడత ‘వైఎస్సార్ రైతు భరోసా’ రాష్ట్రంలోని పర్యాటక రంగంలో హోటల్స్ నిర్మాణం కోసం 10 సంస్థలను ఆహ్వానించామని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో టూరిజం రంగాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఏపీలోని పర్యాటక స్థలాల విశిష్టతపై రోడ్ షోలు నిర్వహించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో రోడ్ షోలు నిర్వహిస్తామని తెలిపారు. టూరిజం రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపి౦దని, పర్యాటక రంగంలో ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ ఆదాయం కూడా పడిపోయిందని అన్నారు. గత ఐదేళ్లలో ఒక్క టూరిజం ప్రాజెక్ట్ కూడా రాలేదని, గత ప్రభుత్వ పాలసీ కారణముగా ఏ ఒక్క సంస్థ ముందుకు రాలేదని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు ఆకర్షణీయంగా టూరిజం పాలసీని రూపొందించామని చెప్పారు. బంగ్లాదేశ్ షిప్‌ను ఫ్లోటింగ్ రెస్టారెంట్‌గా మారుస్తున్నామని తెలిపారు. షిప్ యజమానితో చర్చలు చివరదశలో ఉన్నాయని, కొలిక్కి రాగానే ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. కైలాసగిరిపై వాచ్ టవర్‌ను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నామని వెల్లడించారు. 70 ఏళ్ల వయసులో చంద్రబాబు బూతులు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. బాబు మనవడికి ఈ బూతులే నేర్పిస్తున్నాడా? అని ప్రశ్నించారు. అమరావతిలో 100 మంది మహిళలను చూసి రెచ్చిపోతావా? అని ధ్వజమెత్తారు. అమరావతిపై రెఫరెండంకి ముందు విశాఖలో ఆ పార్టీ ఎమ్మెల్యే లు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. సీఎం జగన్‌కు ఎన్నికలు కొత్త కాదని, విశాఖ రైల్వే జోన్‌ను బీజేపీ తాత్సరాం చేస్తోందన్నారు. పోలవరంపై నిధులు విషయంలో కూడా బీజేపీ నేతలు కేంద్రాన్ని అడగాలని తెలిపారు. రాష్ట్ర అభివృద్హికి బీజేపీ నేతలు కేంద్రంతో మాట్లాడి సహకరించాలన్నారు. -
‘నిమ్మగడ్డకు ఆ హోదాలో ఉండే హక్కు లేదు’
సాక్షి, విశాఖపట్నం: స్వామిజీ కూడా రాజకీయ రంగు పులుముతున్నారని, ఇది చాలా దురదృష్టకరమని పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఇవాళ జరిగిన శారదపీఠం స్వామిజీ పుట్టిన రోజు వేడుకల్లో బుధవారం మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గిరిజనుల్లో స్వామిజీ భక్తిభావం ఎక్కువగా తీసుకువచ్చారని, భక్తి వల్లే సమాజంలో శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉంటాయన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖంగా ఉండాలని కోరుకునేది స్వామిజీలే అన్నారు. అలాంటి వారిని రాజాకీయాల్లోకి లాగొద్దన్నారు. శారదా పీఠం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు ఎట్టినా విజయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే అన్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని పేర్కొన్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గల్లీ రాజకీయాల కోసం రాజ్యాంగ పదవిని తాకట్టు పెట్టోద్దని హితవు మంత్రి పలికారు. ఇసుక అక్రమాల్ని గతంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ఆర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి తెలిపారు. అదే నిమ్మగడ్డ తాపత్రయ: మంత్రి ఆదిమూలపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యాంగం విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఎన్నికలు నిర్వహించే ముందు ఎన్నికల కమిషనర్‌కు ప్రభుత్వాన్ని సంప్రదించాలన్న విషయం తెలియదా అని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు చెప్పినా ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎన్నికల ప్రకటన ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఏప్రిల్ తన పదవి ముగుస్తుంది కాబట్టి ఈ ఎన్నికలు పెట్టాలన్నది నిమ్మగడ్డ తాపత్రయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయనకు ప్రజల రక్షణ పట్టదా అని, సీఎస్ ఇచ్చిన నివేదికను నిమ్మగడ్డ పరిగణలోకి తీసుకోవాలి అన్నారు. ఎవరికో ప్రయోజనం చేయాలనుకునే నిమ్మగడ్డకు కమిషనర్ హోదాలో కొనసాగే నైతిక హక్కు లేదని మంత్రి పేర్కొన్నారు. -
‘ప్రజా సంకల్ప యాత్ర’పై దేవిశ్రీ పాట
సీతమ్మధార (విశాఖ ఉత్తర): వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజా గాయకుడు దేవిశ్రీ రచించి, పాడిన పాటను పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదివారం విడుదల చేశారు. ‘ఆకలన్నోడికి అన్నం పెట్టే వైఎస్ జగనన్నో.. నీకు పేదలు అండగ ఉన్నారన్నో..’ అంటూ సాగిన గీతాన్ని మంత్రి ఆదివారం విశాఖలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాకవి శ్రీశ్రీ నుంచి వంగపండు వరకు ఎందరో మహానుభావులు ఇక్కడి వారు కావడం మన అదృష్టమన్నారు. ఆ కోవకు చెందిన మరో గొప్ప కవి దేవిశ్రీ అని కొనియాడారు. ప్రభుత్వం కళాకారులకు అండగా ఉంటుందన్నారు. గుంటూరులో గుర్రం జాషువా స్మారక చిహ్నం నిర్మాణానికి ప్రభుత్వం రూ.3 కోట్లు విడుదల చేసిందన్నారు. ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ సీఎం వైఎస్ జగన్ ప్రజలకు దేవుడయ్యారని పేర్కొన్నారు. చంద్రబాబుది రెండు నాలుకల ధోరణి అని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇళ్లు ఇస్తుంటే బాబు కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఇళ్లు ఇవ్వలేదంటూ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. -
కొత్తగా 60 బోట్లకు అనుమతులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 60 పర్యాటక బోట్లకు అనుమతులు మంజూరు చేసినట్టు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తెలిపారు. నదీ ప్రాంతాలు, రిజర్వాయర్లలో బోటింగ్ కార్యకలాపాలను వెంటనే పునరుద్ధరిస్తున్నట్టు చెప్పారు. 174 ప్రైవేట్ బోట్లు నడిపేందుకు దరఖాస్తులు రాగా.. ఇప్పటికే 60 బోట్లకు అనుమతులు మంజూరు చేశామన్నారు. కరోనా కారణంగా మూతపడిన పర్యాటక కార్యకలాపాలను త్వరితగతిన పునరుద్ధరించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సచివాలయంలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్షించిన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నంతో పాటు తూర్పు గోదావరి జిల్లా దిండి, రాజమహేంద్రవరంలో ఇప్పటికే పర్యాటక బోట్లు ప్రారంభమయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో 9 చోట్ల కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు బోట్ల స్థితిగతులు, లైసెన్సులు వంటి కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నామన్నారు. పాపికొండలు ప్రాంతంలో జల వనరుల శాఖ ఆధ్వర్యంలో నావిగేషన్ సర్వే చేయాల్సి ఉన్నందున అక్కడ మినహా అన్నిచోట్లా త్వరితగతిన బోటింగ్ కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. సాగర సంగమం, అంతర్వేది, హంసలదీవిలో పర్యాటక బోట్లు నడపనున్నట్టు తెలిపారు. కొల్లూరు, ఐలేరుల్లో కొత్తగా పర్యాటక పడవలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో (పీపీపీ) విధానంలో కొత్తగా పడవల సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అంతర్వేది నుంచి నరసాపురం, కృష్ణా జిల్లాలోని హంసలదీవి, నాగార్జున సాగర్, కడప జిల్లా బ్రహ్మంసాగర్, కర్నూలు జిల్లా అవుకు, మంత్రాలయం ప్రాంతాల్లో పీపీపీ విధానంలో కొత్తగా పడవలు కొనుగోలు చేసి నడిపేందుకు చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. విజయవాడ, విశాఖలో సీ ప్లేన్ సౌకర్యం విజయవాడతోపాటు విశాఖకు కూడా సీ ప్లేన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఐదు, ఏడు నక్షత్రాల హోటళ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకుంటోందన్నారు. అందులో భాగంగా గత ఏడాది ఉత్తమ ప్రతిభ కనబర్చి బంగారు, వెండి, రజత పతకాలు సాధించిన క్రీడాకారులకు రూ.5 లక్షలు, రూ.3 లక్షలు, రూ.2 లక్షల నగదు ప్రోత్సాహకాలను అందిస్తామని తెలిపారు. ఖేల్ ఇండియా కింద కడప జిల్లాలోని వైఎస్సార్ క్రీడా పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ఎంపికైందని, దీనివల్ల ఏడాదికి రూ.3 కోట్లు ఆ కేంద్రానికి రానున్నాయని తెలిపారు. త్వరలో ఏపీ యూత్ సర్వీసెస్ పేరిట యూట్యూబ్ చానల్ ప్రారంభిస్తామని చెప్పారు. -
గీతం చారిటీ సంస్థ కాదు.. సీట్ల కోసం లక్షలు..
సాక్షి, విశాఖపట్నం : గీతం యూనివర్సిటీ యాజమాన్యం మార్కెట్ ధరకు భూములు తీసుకుని, ఆపై కూడా ప్రభుత్వ భూములు ఆక్రమించారని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. పార్టీలకు అతీతంగా భూ ఆక్రమణలు తొలగించాలని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అందులో భాగంగానే విశాఖలో భూ బకాసురులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ అక్రమ భూములు స్వాధీనం చేసుకుంటే టీడీపీ నాయకులు సునామీ వచ్చినట్టు గగ్గోలు పెడుతున్నారు. నిజంగా టీడీపీ నేతలకు గీతంపై అభిమానం ఉంటే అప్పుడు ఎందుకు క్రమబద్దీకరణ చేయలేదు. రుషికొండలో ఎకరం భూమి 20 కోట్ల రూపాయలు ఉంది. 40 ఎకరాలు అంటే 800 కోట్ల రూపాయలు. (టీడీపీలో చిచ్చు రేపిన నారా లోకేష్) ప్రభుత్వం భూమి ప్రభుత్వం తీసుకుంది. చంద్రబాబు నాయుడికి గీతం యాజమాన్యం అంటే అభిమానం లేదు.. కేవలం రాజకీయం కోసమే ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. చంద్రబాబుకి అమరావతి ఉంటే చాలు. గీతం చారిటీ సంస్థ కాదు.. సీట్ల కోసం లక్షలు వసూలు చేస్తున్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించరు. గీతం యాజమాన్యం స్థానిక రుషికొండ.. ఎందాడ ప్రజలకు ఎప్పుడైనా ఫీజ్ తగ్గించి ఇచ్చారా? గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణలపై చర్యల విషయంలో టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలు వెనక్కి తీసుకోవాల’’ని డిమాండ్ చేశారు. -
సీఎం జగన్ అండగా నిలిచారు: శ్రీవాత్సవ
సాక్షి, విశాఖపట్నం: మాజీ ఎమ్మెల్యే, విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(వీఎంఆర్డీఏ) మాజీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ ఆరోగ్యం గురించి సీఎం వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు ఆరా తీశారని ఆయన కుమారుడు శ్రీవత్సవ అన్నారు. తన తండ్రి అనారోగ్యానికి గురైతే.. పార్టీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిందని గుర్తుచేశారు. మంగళవారం విశాఖలోని ఉడా చిల్డ్రన్ థియేటర్లో ద్రోణంరాజు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయ్‌సాయిరెడ్డి, మంత్రులు అవంతి శ్రీనివాస్, కన్నబాబు, ఎంవీవీ సత్యనారాయణ.. సత్యవతి, గుడివాడ అమర్నాథ్, అదీప్‌రాజు, గొల్ల బాబూరావు, భాగ్యలక్ష్మి, కార్యకర్తలు పాల్గొని ద్రోణంరాజు శ్రీనివాస్ చిత్ర పటానికి పుల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు శ్రీవాత్సవ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ తమకు అండగా నిలిచారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ప్రేమ అనేది స్వచ్ఛంగా ఉంటుందని చెప్పారు. పార్టీలో ఆలస్యంగా చేరిన తన తండ్రికి సీఎం జగన్ ఎమ్మెల్యే సీటు ఇచ్చారని గుర్తుచేశారు. తన నాన్న ఆరోగ్యం గురించి ఆయన ఎప్పటికప్పుడు ఆరా తీశారని చెప్పారు. మెరుగైన వైద్యం అందించమని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. దురదృష్టవశాత్తు తన తండ్రి చనిపోయారని అన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి, జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు తమకు అండగా నిలిచారని చెప్పారు. సంస్మరణ సభలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజల మనసులో ద్రోణంరాజు శ్రీనివాస్ చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. చివరిసారిగా తనకు ద్రోణంరాజు శ్రీనివాస్ ఫోన్ చేసి శ్రీవత్సవను బాగా చూసుకోవాలని చెప్పారని తెలిపారు. ద్రోణంరాజు కుటంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ ద్రోణంరాజు కుటంబానికి అండగా ఉంటారని చెప్పారు. శ్రీవత్సవ తన తండ్రి బాటలోనే నడవాలని కోరుకుంటున్నానని అన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ. ద్రోణంరాజు శ్రీనివాస్ మరణం చాలా బాధాకరమని, విశాఖ నగరంతో విడదీయరాని బంధం ద్రోణంరాజు కుటుంబానికి ఉందని తెలిపారు. పార్టీ తరుఫున ద్రోణంరాజు కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. అదే విధంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ద్రోణంరాజు సంస్మరణ సభలో పాల్గొటనని ఎన్నడూ అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన అనే మనుషులను ఎన్నడూ సీఎం జగన్ వదులుకోరని తెలిపారు. వైఎస్, ద్రోణంరాజు కుటంబానికి ఎంతో సన్నిహిత సంబంధం ఉందని గుర్తుచేశారు. ఎన్నికల్లో ద్రోణంరాజు ఓడిపోయినప్పటికీ సీఎం జగన్ వీఎంఆర్డీఏ చైర్మన్ పదవినిచ్చి గౌరవించారని చెప్పారు. -
‘జలకళ’తో రైతుల్లో ఆనందం: అవంతి
సాక్షి, విశాఖపట్నం: జలకళ కార్యక్రమంలో భాగంగా పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ రిగ్ వాహనాలను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 15 వాహనాలు మంజూరయ్యాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి లాంఛనంగా వాహనాలను ప్రారంభించారు. అనంతరం వాహనాలు ఆర్కే బీచ్ గుండా ర్యాలీగా వెళ్ళిన దృశ్యం అందర్నీ ఆకట్టుకుంది. (చదవండి: మరో హామీకి శ్రీకారం చుట్టిన సీఎం జగన్) ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ‘వైఎస్సార్ జలకళ’ ద్వారా వందలాది ఎకరాలు సాగులోకి రానున్నాయని తెలిపారు. ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో నీటి కొరత నుంచి రైతులు బయటపడే అవకాశాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం ద్వారా రైతుల్లో ఆర్థిక భరోసా వస్తోందన్నారు. సీఎం జగన్ పదవి చేపట్టిన తర్వాత ఇరవై ఏళ్లలో ఎప్పుడూ లేనివిధంగా రిజర్వాయర్ల నీటితో నిండాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనకాపల్లి ఎంపీ సత్యవతి మాట్లాడుతూ ముఖ్యంగా గ్రామీణ రైతుల్లో జలకళ స్పష్టంగా కనిపించిందన్నారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు.. గ్రామీణ ప్రాంతాల్లో బోరు ఉంటే రైతులు ఆర్థికంగా స్థితిమంతులు అవుతారని అన్నారు. జిల్లాలోని 15 నియోజకవర్గాలకు ఒక్కొక్క రిగ్ వాహనం మంజూరైంది. కేవలం బోరు తీయడమే కాకుండా సన్నకారు రైతులకు మోటార్ కూడా మంజూరు చేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడం పట్ల చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కృతజ్ఞతలు తెలిపారు. -
పర్యాటక హబ్‌గా ఏపీ: మంత్రి అవంతి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షించే విధంగా పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటల్ సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు. గ్రామీణ సంస్కృతి, కళలు ఉట్టి పడుతూ పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. శుభ పరిణామం: యార్లగడ్డ అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో విశాఖ సినీ ప్రపంచ అభివృద్ధికి బీజం పడిందన్నారు. సీఎం వైఎస్ జగన్ సినీ రంగాన్ని విశాఖ నగరానికి ఆహ్వానించడం శుభ పరిణామం అని లక్ష్మీ ప్రసాద్ అన్నారు. -
ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఏపీ పర్యాటకం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ప్రపంచ పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు తగిన స్థానం దక్కేలా అవసరమైన అన్ని అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు నూతన పర్యాటక పాలసీని ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, వసతులు, భద్రత తదితరాలకు ప్రణాళికలు సిద్ధం చేసింది. పర్యాటక రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేసే సంస్థలకు పన్ను రాయితీ ఇస్తుంది. ట్రావెల్ ఏజెంట్లు, సంస్థలు, హోటళ్లు, తదితరాలన్నీ పర్యాటక శాఖ వద్ద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్దేశించింది. కాగా.. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘పర్యాటకం–గ్రామీణాభివృద్ధి’ నినాదంతో ఆదివారం విశాఖపట్నంలో ప్రభుత్వం వేడుకలు నిర్వహిస్తోంది. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ► దేశంలో గుజరాత్ తర్వాత 974 కి.మీ. పొడవైన సముద్ర తీరం ఏపీకి మాత్రమే సొంతం. ► ప్రముఖ బీచ్‌ల వద్ద ప్రైవేట్ భాగస్వామ్యంతో కుటీరాలు, తదితరాలను ఏర్పాటు చేయనున్నారు. గ్రామీణ పర్యాటకంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న కళలను తెలిపేలా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. వ్యవసాయ పర్యాటకంలో భాగంగా వ్యవసాయ భూముల్లో అతిథ్యం కల్పిస్తారు. ► ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రాచీన కట్టడాల పునరుద్ధరణ. రాష్ట్రంలో 12 నుంచి 14 ప్రాంతాలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు. ► అరకులో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో కాలేజ్‌ను ఏర్పాటు చేస్తారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు 7 స్టార్ సదుపాయాలతో రిసార్టులు, హోటళ్లను అందుబాటులోకి తెస్తారు. ► పర్యాటకుల భద్రత కోసం దేశంలోనే తొలిసారి పశ్చిమగోదావరి జిల్లా సింగనపల్లి, పేరంటాలపల్లి, పోచవరం, తూర్పుగోదావరి జిల్లా గండి పోచమ్మ, రాజమండ్రి, విశాఖజిల్లా రుషికొండ, గుంటూరు జిల్లా నాగార్జునసాగర్, కర్నూలు జిల్లా శ్రీశైలం, కృష్ణా జిల్లా విజయవాడలోని బెరం పార్క్‌ల వద్ద కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. ‘బ్లూఫ్లాగ్’’ సర్టిఫికేషన్ కోసం ఎంపికైన రుషికొండ బీచ్ బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం విశాఖలోని రుషికొండ బీచ్ ఎంపికైందని మంత్రి ముత్తంశెట్టి తెలిపారు. శనివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. ► గతేడాది విదేశీ పర్యాటకులను ఆకర్షించడంతో ఆదాయం 21% పెరిగింది. ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, టెంపుల్ టూరిజంలో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. ► కాగా, రాజకీయంగా ఎదగడానికి చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని మంత్రి మండిపడ్డారు. కులమతాల మధ్య చిచ్చు పెడుతున్న టీడీపీ, బీజేపీలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ అంటే.. సదుపాయాలు ఉండి.. అంతర్జాతీయ ప్రసిద్ధి పొందిన బీచ్‌లకు డెన్మార్క్‌లోని ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఈఈ) బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్‌ను ఇస్తుంది. ఈ సర్టిఫికేషన్ ఉన్న బీచ్‌లనే అంతర్జాతీయ పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తారు. సర్టిఫికేషన్‌కు కేంద్రం 8 బీచ్‌లను ఎంపిక చేయగా రుషికొండ కూడా ఉంది. -
‘ఆ మాటలను టీడీపీ వక్రీకరించింది’
సాక్షి, విశాఖపట్నం: వరల్డ్ టూరిజం డే ఉత్సవాలను విశాఖలో నిర్వహిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడమే ఉత్సవాల ప్రధాన ఉద్ధేశమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో సహజ వనరులు ఉన్నాయని.. 974 కిలో మీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉందని పేర్కొన్నారు. కరోనా వలన టూరిజం ఆదాయం తగ్గిందన్నారు. (చదవండి: భగవంతుణ్ణి, పాలకులను కులమతాల్లో ఇరికించవద్దు) ‘‘గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల టూరిజంలో పెట్టుబడులు రాలేదు. ప్రభుత్వ, పైవేట్ భాగస్వామ్యంతో 12 స్టార్ హోటళ్లు నిర్మించాలని భావిస్తున్నాం. ఐదు కోట్ల మందికి నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆయనకు కులం, మతం ఆపాదించవద్దని మంత్రి కొడాలి నాని అన్న మాటలను టీడీపీ నేతలు వక్రీకరించారని’’ అవంతి మండిపడ్డారు. ‘‘నా మతం మానవత్వం అని.. నా కులం.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమని’’ గతంలో వైఎస్ జగన్ చెప్పిన మాటలను మంత్రి అవంతి మరోసారి గుర్తుచేశారు. దేవుళ్లతో రాజకీయాలు చేయడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. (చదవండి: ‘వారికి టీడీపీ వత్తాసు అందుకే..’) -
వుడాకి పూర్వ వైభవం తీసుకువస్తాం..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో పర్యాటక అభివృద్దికి 12 ప్రాంతాలలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్లో సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి డిపీఆర్‌లు సిద్దం చేసినట్లు పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస రావు తెలిపారు. విదేశీ పర్యాటకులని ఆకర్షించే విధంగా పర్యాటక ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పస్తామన్నారు. కోవిడ్ కారణంగా గత ఆరు నెలలలో రాష్ట్ర పర్యాటక శాఖ 150 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందన్నారు. కేంద్రం సూచనల మేరకు కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక పార్క్ లు, మ్యూజియంలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) పారదర్శకత లేకుండా అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో పారదర్శకతకు పెద్దపీట వేశామన్నారు. ఉడాకి పూర్వ వైభవం తీసుకువస్తామని, వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధి పనులను వేగవంతంగా కొనసాగిస్తామని తెలిపారు. డిసెంబర్ నెలాఖరులోపు ఎన్ఎడి ఫ్లైఓవర్‌ను పూర్తి చేస్తామని చెప్పారు. (చదవండి: పర్యాటకానికి మరింత ఊతం) రుషికొండలో బోటింగ్ పాయింట్‌ను ఇప్పటికే ప్రారంభించామని, త్వరలో విశాఖ జిల్లాల్లోని అయిదు చోట్ల పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో టూరిజం రెస్టారెంట్లను కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. విదేశీ పర్యాటకులని ఆకర్షించే విధంగా బౌద్దారామాలనుని అభివృద్ది చేసి, పర్యాటకం ద్వారా ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని పేర్కొన్నారు. అంతేగాక ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, బీచ్ టూరిజంలపై కూడా దృష్టి సారించామన్నారు. పర్యాటక కొత్త పాలసీ ప్రకారం టూరిజం ఆపరేటర్లు ప్రభుత్వం దగ్గర లైసెన్స్ రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. -
పర్యాటకానికి మరింత ఊతం
సాక్షి, అమరావతి: పర్యాటక రంగానికి మరింత వైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అనుమతులు, ప్రోత్సాహకాలు, రాయితీలు సులభంగా పొందేలా పర్యాటక వాణిజ్యం(రిజిస్ట్రేషన్, సౌకర్యాలు)కు సంబంధించి శనివారం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులిచ్చారు. ఏపీ టూరిజం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రూపొందించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. కేరళ, గోవా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధివిధానాలను అధ్యయనం చేసిన అనంతరం.. రాష్ట్రంలో పర్యాటక వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన సులభతరమైన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. పూర్తి వివరాలను www.aptourism.gov.in వెబ్సైట్లో పొందుపరిచారు. అందులోని కొన్ని వివరాలు.. ► టూరు, బోట్ ఆపరేటర్లతో పాటు ట్రావెల్ ఏజెంట్లు, హోటళ్లు, రిసార్ట్సు, వాటర్ స్పోర్ట్స్ తదితర అనుబంధ రంగాల ఆపరేటర్లు రాష్ట్ర పర్యాటక శాఖతో అనుసంధానం. ► టూరు ఆపరేటర్లు, అనుబంధ రంగాలకు చెందిన వారు ప్రభుత్వం అందించే రాయితీలు, ప్రోత్సాహకాలు సులభంగా పొందేలా నిబంధనలు. పర్యాటక కార్యకలాపాలు, రాయితీలు, ప్రోత్సాహకాల కోసం రాష్ట్ర పర్యాటక శాఖలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ► సేవా రంగానికి పెద్దపీట వేసేందుకు సులభతరమైన విధానాల్లో అనుమతులు. ► కాగా, పర్యాటక రంగానికి సంబంధించిన సంస్థలకు ఇది ఒక మంచి అవకాశమని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, ఏపీటీడీసీ సీఈవో, ఎండీ ప్రవీణ్ కుమార్ కోరారు. పర్యాటక రంగ అభివృద్ధితో యువతకు ఉపాధి.. ఇప్పటి వరకు రాష్ట్రంలో పర్యాటక వాణిజ్య ఆపరేటర్లు నమోదు చేసుకోవడానికి సరైన యంత్రాంగం, విధివిధానాలు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో మార్గదర్శకాలు తీసుకొచ్చాం. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా సేవా రంగాన్ని బలోపేతం చేసి స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు విధివిధానాలు రూపొందించాం. – ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర పర్యాటక మంత్రి -
అదే మహానేతకు ఇచ్చే నిజమైన నివాళి
సాక్షి, విశాఖపట్నం : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్వర్గీయులై 11 ఏళ్లు పూర్తయినా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల గుండెల్లో అలాగే నిలిచిపోవటానికి కారణం ఆయన చేసిన మంచి కార్యక్రమాలేనని వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవడమే మహానేత వైఎస్సార్‌కు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. బుధవారం మద్దిలపాలెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో వైఎస్సార్ 11వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి, ఎంపీలు ఎంవీవీ, మాధవి, ఎమ్యెల్యే అదీప్ రాజ్, మాజీ ఎమ్యెల్యే పంచకర్ల, రెహ్మాన్, మల్ల విజయ ప్రసాద్, టైనాల విజయ్ కుమార్, కుంభ రవిబాబు, చింతలపూడి వెంకట రామయ్య, తిప్పల గురుమూర్తిరెడ్డితో పాటు కన్వీనర్లు, అనుబంధ సంఘాల నేతలు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... ‘‘ కొన్ని ఒత్తిళ్లకు లోనై అభ్యర్థులను ఎంపిక చేసి ఉండవచ్చు. అభిప్రాయ భేదాలను మర్చిపోయి, పార్టీ గెలుపుకు కృషి చేద్దాం. పొరపాట్లు సరిదిద్దుకుని, ప్రతి వార్డుకు వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తేనే ఎన్నికలకు సన్నద్దం అవుతాం. విశాఖ చంద్రబాబు చెప్పినట్లుగా అభివృద్ధి కాలేదు. ఐటీ సెజ్, ఫార్మా సెజ్ బీఆర్టియస్, రోడ్ల విస్తరణ, పారిశ్రామికీకరణ వైఎస్సార్ హాయాంలోనే జరిగింది. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకురావడానికి చంద్రబాబు అడ్డుపడుతున్నార’’ని అన్నారు. ( నాకు తెలిసిన మహనీయుడు ) ఏపీ చరిత్ర ఉన్నంత కాలం వైఎస్సార్ చిరస్థాయిగా ఉంటారు ఆంధ్ర్రప్రదేశ్ చరిత్ర ఉన్నంత కాలం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిరస్థాయిగా ఉంటారని మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. సంక్షేమానికి వైఎస్సార్ బ్రాండ్ అంబాసిడర్ అని కొనియాడారు. నవ శకం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోట్లాది రూపాయల సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. జూమ్ రాజకీయాలు చేసినా సీఎం వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధిని ఆపలేరన్నారు. ( ప్రజా నాయకుడి దూరదృష్టి ) విశాఖ, అరకు ఎంపీలు ఎంవీవీ, మాధవిలు మాట్లాడుతూ.. ప్రతి పేద గుండెలో ఇల్లు కట్టుకున్న వ్యక్తి వైఎస్సార్ అని కొనియాడారు. దేశంలో మొట్టమొదటిసారి ఫీజు రీయింబర్సుమెంట్‌ను ప్రవేశపెట్టిన వ్యక్తి ఆయనేనని అన్నారు. గిరిజనులందరికీ పట్టాలు పంచిన ఏకైక వ్యక్తి వైఎస్సారేనని, ఆ తర్వాత ఏ నేత కూడా ఎకరం భూమి ఇవ్వలేదు సరికదా గిరిజనుల అభివృద్ధి పట్టించుకోలేదన్నారు. వైఎస్సార్ తర్వాత వైఎస్ జగన్ పట్టాలు ఇస్తున్నారని తెలిపారు. -
శ్రీకాంత్‌కు మంత్రి అవంతి పరామర్శ
-
అందాలలో ఆహో మహోదయం..
ప్రకృతి వనరుల సిరిసంపదలు ఓ వైపు.. విశ్వఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక కేంద్రాలు మరోవైపు.. అంతర్జాతీయ యాత్రికులను అబ్బురపరిచే పర్యాటక సోయగాలు ఇంకోవైపు... ఇలా.. లెక్కకు మించి ప్రకృతి సంపద సొంతం చేసుకున్న విశాఖ జిల్లా.. పర్యాటక వైభవాన్ని సంతరించుకుంటోంది. గత ప్రభుత్వం ప్రకటించిన అస్తవ్యస్త టూరిజం పాలసీతో విసిగిపోయిన పెట్టుబడిదారులు.. ప్రస్తుత సర్కారు ప్రవేశపెట్టబోయే కొత్త పాలసీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రోత్సాహకాలు.. రాయితీలతో పర్యాటక రంగంలో పెట్టుబడుల్ని ఆకర్షించేలా పాలసీని రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాలో కొత్త ప్రాజెక్టులు తెచ్చేందుకు అవసరమైన ప్రణాళికలు పర్యాటక శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. – సాక్షి, విశాఖపట్నం సాక్షి, విశాఖపట్నం: ప్రకృతి అందాలకు నెలవైన విశాఖపట్నం.. ఆర్థిక, పర్యాటక రాజధానిగా భాసిల్లేందుకు అవసరమైన కొత్త ఆలోచనలతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. త్వరలో ప్రభుత్వం ప్రకటించనున్న టూరిజం పాలసీతో పర్యాటకం పరుగులు తీయనుంది. గత ప్రభుత్వం ప్రకటించిన లొసుగుల పాలసీతో పెట్టుబడులు రాక.. పర్యాటకం చతికిలపడిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని టూరిజంలో పెట్టుబడులు పెరిగేలా పాలసీని ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవల అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కొత్త విధానానికి సంబంధించి టూరిజం అధికారులు సమావేశమై.. నూతన పాలసీ గురించి వివరించారు. అయితే ఫ్రెండ్లీ పాలసీగా మార్చాలని ముఖ్యమంత్రి సూచించడంతో పర్యాటక విధానం ప్రకటించేందుకు మరో వారం రోజులు పడుతుందని అధికారులు భావిస్తున్నారు. వికర్ష నుంచి.. ఆకర్షణ వైపు... టీడీపీ సర్కారు ప్రకటించిన టూరిజం పాలసీ.. పారిశ్రామిక వర్గాలను అంతగా ఆకర్షించలేకపోయింది. 9 మేజర్, 42 సబ్మేజర్ థీమ్స్‌గా మొత్తం 680 ప్రాజెక్టులు అభివృద్ధి చేసేందుకు రాయితీలతో కూడిన విధానాన్ని ప్రకటించింది. పీపీపీ పద్ధతిలో ప్రాజెక్టు వ్యయాన్ని బట్టి 5 నుంచి 15 శాతం రాయితీతో పాటు, రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీపై వందశాతం పన్ను రాయితీ కల్పిస్తామని పేర్కొంది. ఇవేమీ అమల్లోకి తీసుకురాలేదు. పర్యాటక ప్రాజెక్టుకు 21 రోజుల్లో అనుమతి ఇచ్చేలా సింగిల్ డెస్క్ విధానాన్ని అమల్లో తీసుకొస్తామని చెప్పినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. సాధారణంగా ఒక పర్యాటక రంగ ప్రాజెక్టు స్థాపించాలంటే 6 ప్రభుత్వ కార్యాలయాల నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. దీనికి మూడు నెలల సమయం పడుతుంది. దీని బదులు సింగిల్ డెస్క్ విధానం అమల్లోకి తీసుకొచ్చి కేవలం రెండు వారాల్లో అనుమతులిస్తామని చెప్పిన ప్రభుత్వం దాన్ని అమలు చెయ్యలేదు. అదే విధంగా ఏదైనా సంస్థకు అందించే స్థలం విలువ ఆధారంగా 2 శాతం చొప్పున అద్దె చెల్లించాలనీ, ఆ తర్వాత ఏటా 5 శాతం చొప్పున చెల్లించాలంటూ అప్పటి టీడీపీ ప్రభుత్వం నిబంధన విధించింది. లీజు ముగిసే సరికి ఈ అద్దె భారీ స్థాయికి చేరుకుంటుందని పారిశ్రామికవేత్తలు పెదవి విరిచారు. ఇలా టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలసీ..ఎందుకూ పనికిరానిదిగా మారిపోయింది. మరో వారం రోజుల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే నూతన టూరిజం పాలసీ పర్యాటకులతో పాటు పెట్టుబడులను ఆకర్షించేదిగా ఉండబోతోందని అధికారులు చెబుతున్నారు. హోటల్స్.. రిసార్టులతో... జిల్లా చుట్టూ పర్యాటకానికి కావల్సినంత ప్రకృతి సంపద ఉంది. దీన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని వనరులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. టూరిజం శాఖకు సంబంధించిన 650 ఎకరాల్లో కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఫ్రెండ్లీ పాలసీ.. టూరిజం పాలసీ దాదాపు సిద్ధమయ్యింది. పెట్టుబడులను ఆకర్షించేలా ఫ్రెండ్లీ పాలసీ రూపొందించాలని ముఖ్యమంత్రి చేసిన సూచనల మేరకు కొత్త పర్యాటక విధానంలో మార్పులు చేస్తున్నాం. విశాఖ జిల్లా పర్యాటక ఖిల్లాగా మారుతుంది. – ముత్తంశెట్టి శ్రీనివాసరావు,పర్యాటక శాఖ మంత్రి -
ప్రజా సంక్షేమమే ధ్యేయం: అవంతి శ్రీనివాస్
సాక్షి, విశాఖపట్నం: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆయన 74వ స్వాతంత్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. విశాఖ జిల్లాలో సుమారు మూడు లక్షలమంది అర్హులైన నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టామని చెప్పారు. వైఎస్సార్ రైతుభరోసాలో 3.48 లక్షల మంది రైతులకి తొలి విడతగా 194.42 కోట్ల రూపాయలు అందించామని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పాత బకాయిలు, జగనన్న విద్యా దీవెన పథకాలకు 324 కోట్లు విద్యార్థులకి చెల్లించామన్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో ఇప్పటివరకు జిల్లాలో రూ.102 కోట్లతో 43 వేల మందికి ఉచితంగా వైద్యం అందించామని చెప్పారు. వైఎస్సార్ జలయజ్ణంలో 2022 కోట్లతో 1.3 లక్షల ఎకరాలకి నీరు అందించే ఉత్తరాంధ్ర సృజల స్రవంతి పథకం పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. దశల వారీగా మద్యపాన నిషేదాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అమ్మ ఒడి పథకంలో 3.92 తల్లులకి వారి పిల్లల చదువుల నిమిత్తం 15 వేలు చొప్పున రూ.587 కోట్లు జమ చేశామన్నారు. వైఎస్సార్ ఆసరా పథకంలో 70 వేల డ్వాక్రా గ్రూపులకి 1797 కోట్ల పాత బకాయిలని నాలుగు వాయిదాలలో రుణమాఫీ చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో 12 రకాల పెన్షన్ ల క్రింద 4.85 లక్షల మందికి ప్రతీ నెలా 116 కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ‘‘వైఎస్సార్ చేయూత కింద మొదటి విడతగా 1.94 లక్షల మందికి రూ.360 కోట్లు వారి ఖాతాలలో జమచేశాం. వైఎస్సార్ మత్స్యకార భరోసాలో 20 వేల మంది మత్స్యకారులకి రూ.20 కోట్లు బదలాయించాం. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం క్రింద 9.98 లక్షల మందికి లబ్ధి చేకూరేలా 123 కోట్ల వడ్డీ బ్యాంకులలో జమ చేశాం. వైఎస్సార్ నేతన్న నేస్తంలో చేనేత కార్మికులకు రూ. 62 లక్షలు అందించాం. జిల్లాలో ఇప్పటి వరకు 12.99 లక్షల కుటుంబాలకి రైస్ కార్డులు అందించాం. జిల్లాలో 12.27 లక్షల మందికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేశాం. జగనన్న వసతి దీవెనలో 85 వేల మందికి 70 కోట్లు మంజూరు చేశాం. వైఎస్సార్ కాపునేస్తంలో 14866 మంది లబ్ధిదారులకి 22 కోట్లు ఆర్థిక సాయం అందించాం. గిరిజనులకి స్పెషలిస్ట్ వైద్య సేవలు అందించడానికి పాడేరులో డాక్టర్ వైఎస్సార్ ట్రైబల్ మెడికల్ కాలేజీని మంజూరు చేశామని’’ మంత్రి అవంతి పేర్కొన్నారు. మన బడి నాడు- నేడులో మొదటి దశలో 1149 పాఠశాలలని రూ.300 కోట్లతో అభివృద్ధి చేపట్టామని తెలిపారు. జిల్లాలో 3.17 లక్షల మంది విద్యార్థులకి జగనన్న విద్యా కానుక అందిస్తున్నామని తెలిపారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ లో రూ.125 కోట్లతో 832 పనులు ప్రారంభించామని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. -
‘విశాఖ ఆదాయ వనరుగా మారనుంది’
-
‘విశాఖ ఆదాయ వనరుగా మారనుంది’
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తక్కువ ఖర్చుతో విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయొచ్చునని పేర్కొన్నారు. తక్కువ సమయంలోనే విశాఖ ఆదాయ వనరుగా మారనుందని తెలిపారు. తన స్వార్థ ప్రయోజనాల కోసమే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రైతులకు తమ ప్రభుత్వం కచ్చితంగా న్యాయం చేస్తుందని అవంతి శ్రీనివాస్ తెలిపారు. -
మృతుల కుటుంబాలకు భారీ పరిహారం
సాక్షి, విశాఖపట్నం : హిందూస్థాన్ షిప్‌యార్డ్ ప్రమాదంపై యాజమాన్యంతో మంత్రి అవంతి శ్రీనివాస్, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి యాభై లక్షల రూపాయల సహాయం ఇవ్వడానికి యాజమాన్యం ఒప్పుకుంది. అలాగే మృతుల కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకరించింది. (చదవండి : కుప్పకూలిన భారీ క్రేన్) కాగా, షిప్ యార్డ్ మృతులకు రూ.50లక్షల పరిహార ప్రకటనపై కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. పెద్దమొత్తంలో ఎక్స్‌గ్రేషియా ప్రకటించినందుకుగాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కార్మిక సంఘం నాయకులు మంత్రి రాజశేఖర్, బద్రీనాథ్, రఘు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, భారత రక్షణ రంగ సంస్థ ఆధీనంలో ఉన్న హిందూస్థాన్ నౌకా నిర్మాణ కేంద్రంలో శనివారం ట్రయల్ రన్ జరుగుతుండగా ఈ భారీ క్రేన్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. -
పాలన సౌలభ్యం కోసమే మూడు రాజధానులు
సాక్షి, విజయవాడ : ఏపీకి మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందడం శుభపరిణామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంపై శుక్రవారం విజయవాడలో సాక్షి టీవీతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో వేర్పాటు ఉద్యమాలు రాకూడదనే ఉదేశ్యం తో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఉత్తరాంధ్ర అందులోనూ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు ఎంతో వెనకబడ్డాయన్నారు. ఈ నిర్ణయంతో ఉత్తరాంధ్ర అభివృది చెందుతుందని పేర్కొన్నారు. చంద్రబాబుకి గతంలో ఓట్లు వేసిన వారు అమరావతి ప్రజలు ఒక్కరేన లేక 13 జిల్లాల ప్రజలు ఓట్లేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఒక అమరావతికి పరిమితం అవుతారా లేక 13 జిల్లాలకు అందుబాటులో ఉంటారా అన్నది ఆయనే తేల్చుకుంటే బాగుంటుందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్ళు తెరవాలని తాను కోరుకుంటున్నట్లు అవంతి పేర్కొన్నారు. -
అభివృద్ధికి టీడీపీ అవరోధం: అవంతి
సాక్షి, విశాఖపట్నం: అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన అని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆయన గురువారం ఆంధ్రా యూనివర్సిటీ సమత బ్లాక్ ప్రాంగణంలో వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ కన్జర్వేటర్ రామ్మోహన్రావు, ఏయూ రిజిస్ట్రార్ కృష్ణమోహన్, జేసీ గోవిందరావు, ఆర్డీవో కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు. తమకు అన్ని ప్రాంతాలు,వర్గాలు సమానమని తెలిపారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం ‘‘అవినీతి లేకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంకల్పం. వివక్ష, అవినీతి లేకుండా గడిచిన ఏడాది కాలంలో రూ.45 వేల కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేశాం. ప్రాంతాలు,కులాల మధ్య ప్రతిపక్ష నేత చంద్రబాబు చిచ్చుపెట్టాలని చూస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ అవరోధంగా మారింది. కుట్రతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. రోజుకో ప్రచారంతో విశాఖపై విషం చిమ్ముతున్నారు. విశాఖకు తుఫానుల ముప్పు ఉందని, రెండుగా చీలిక అంటూ పలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విశాఖ నుంచి విజయనగరానికి రాజధాని మారుతుందంటూ అసత్యాలను వ్యాపింప చేస్తున్నారు. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా పదేపదే కావాలని ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని’’ మంత్రి అవంతి నిప్పులు చెరిగారు 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేస్తాం.. రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ఉండాలనేది చంద్రబాబు కుట్ర అని అవంతి ధ్వజమెత్తారు. మూడు రాజధానుల వెనుక ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు లేవని ఆయన స్పష్టం చేశారు. విశాఖపై ప్రేమతోనో, అమరావతిపై కోపంతోనో మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకురాలేదని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాన్నలదే సీఎం వైఎస్ జగన్ ఉద్దేశ్యమని మంత్రి వివరించారు. ఏర్పాటు వాద ఉద్యమాలు భవిష్యత్తులో రాకూడదని సీఎం జగన్ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. కొందరు రాజకీయ నిరుద్యోగులు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ఆగస్టు 15న ఇళ్ల పట్టాలు.. ‘‘భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి త్వరలో సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారు. అక్కడే అభివృద్ధి ప్రణాళికను ప్రకటిస్తారు. విశాఖ జిల్లాలో 3 కోట్ల 30 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాం. జిల్లాలో రెండు లక్షల మంది లబ్ధిదారులకి ఆగస్టు 15కల్లా ఇళ్ల పట్టాలు అందేలా చూస్తాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాం. నగరాన్ని రాబోయే రోజుల్లో హరిత విశాఖగా తీర్చిదిద్దుతాం. ప్రజలంతా ఇంటికో మొక్క నాటి ప్రకృతి పరిరక్షణ లో భాగస్వాములు కావాలని’’ మంత్రి అవంతి శ్రీనివాస్ పిలపునిచ్చారు. -
‘ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధి ఆగదు’
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో ఒక్క గజం కూడా దోపిడీకి గురికాలేదని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ భూకబ్జా జరగకుండా రూ.400 కోట్ల విలువైన భూములను కాపాడామని పేర్కొన్నారు. ‘‘టీడీపీ నేతలు ఐదేళ్లలో భూకబ్జాలు, దోపిడీలకు పాల్పడ్డారు. విశాఖ పరిపాలన రాజధాని కాకుండా చంద్రబాబు ఎన్ని కుట్రల చేసినా ఆగదని’’ మంత్రి అవంతి స్పష్టం చేశారు. బీచ్‌రోడ్డులో ట్రామ్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నామని అవంతి పేర్కొన్నారు. భోగాపురం వద్ద అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు రాబోతుందని, మెట్రో రైలుతో విశాఖ రూపురేఖలు మారనున్నాయని ఆయన వెల్లడించారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో అన్ని కుంభకోణాలేనని, తమది అవినీతి రహిత పాలన అని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. -
పర్యాటక శాఖకు రూ.60 కోట్ల నష్టం: అవంతి
సాక్షి, అమరావతి: పరవాడ సాల్వేషన్ కంపెనీలో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే పరిశ్రమలు నిర్వహించాలన్నారు. (విశాఖ ప్రమాదం: నలుగురు సభ్యులతో కమిటీ) ఏడు పర్యాటక ప్రాంతాల్లో ఫైవ్ స్టార్ హోటళ్లు.. ప్రతి జిల్లాలో పర్యాటక ప్రాంతాలు ప్రారంభిస్తామని అవంతి శ్రీనివాస్ తెలిపారు. కరోనా కారణంగా పర్యాటక శాఖకు నెలకు రూ.10 కోట్లు చొప్పున రూ.60 కోట్ల నష్టం వచ్చిందన్నారు. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్ షిప్‌తో 7 పర్యాటక ప్రాంతాల్లో పైవ్ స్టార్ హోటల్స్ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. అన్ని వర్గాలకు మేలు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.చంద్రబాబు కొన్ని వర్గాలను మాత్రమే చూసి మేలు చేశారని.. జగన్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రభుత్వమని తెలిపారు. వివక్ష, అవినీతి లేకుండా సంక్షేమ పాలన చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.పదేళ్ల తర్వాత మళ్లీ ఏర్పాటు ఉద్యమాలు రాకూదని సీఎం జగన్ మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనుకుంటున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. -
సినీ కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేసిన మంత్రి
-
'కళాకారులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ర్టం'
సాక్షి, విశాఖ : పద్మభూషణ్ మంగళంపల్లి బాల మురళీకృష్ణ 90వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, తెలుగు భాషా సంఘం ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తదితరులు పాల్గొని నివాళులర్పించారు. ఈ సమావేశంలో లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ..కర్ణాటక సంగీతానికి ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి తెచ్చినవారు తెలుగువారని ప్రశంసించారు. మంగళంపల్లి 400 రచనలు చేశారని పేర్కొన్నారు. కళాకారులను ఆదుకుంటాం : అవంతి శ్రీనివాస్ తూర్పుగోదావరి జిల్లా మారుమూల ప్రాంతంలో జన్మించిన మంగళంపల్లి ఎంతో మందికి స్పూర్తిదాయకంగా నిలిచారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. చరిత్రలో మంగళంపల్లి పేరు నిలిచిపోతుందన్నారు. కరోనా కారణంగా ఈ సంవత్సరం ఆయన జయంతి వేడుకలను సాధారణంగా నిర్వహిస్తున్నామని దక్షిణాది రాష్ర్టాల్లో సంగీతాన్ని పరిచయం చేసింది మన తెలుగువాళ్లే అని కొనియాడారు. విద్యతో పాటు సంగీతానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్దపీట వేస్తున్నారని, కళాకారులకు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు. కళాకారులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా వెల్లడించారు. -
అమరావతిపై చంద్రబాబు మొసలి కన్నీరు
-
‘ఆయన వ్యాఖ్యల వెనుక ఏ కుట్ర దాగుందో’
సాక్షి, విశాఖపట్నం: అమరావతిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిజంగా చంద్రబాబుకు అమరావతిపై ప్రేమ ఉంటే విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని.. అమరావతి కావాలో, విశాఖ కావాలో అప్పుడు ప్రజలే నిర్ణయిస్తారన్నారు. గతంలో ఎంపీ గా గెలిపించిన విశాఖపట్నం ప్రజలపై పురంధేశ్వరి కృతజ్ఞత లేకుండా మాట్లాడారని ఆయన విమర్శించారు. (దేశమంతా ఏపీ వైపు చూసేలా..) రాజకీయ ద్వేషంతోనే.. ఉత్తరాంధ్రకు చెందిన సబ్బం హరి రాజకీయ ద్వేషంతో విశాఖ కేంద్రంగా క్యాపిటల్ ను వ్యతిరేకిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు జీవితాంతం కుట్ర రాజకీయాలే చేస్తారని.. ఇప్పుడు ఆయన వెంట సబ్బం హరి చేరారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌పై ఆయనకే ఎక్కువ బాధ్యత ఉన్నట్లుగా సబ్బంహరి మాట్లాడుతున్నారని, ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్సారేనని గుర్తు చేశారు. 2022 లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉండరని చెప్పిన సబ్బం హరి.. దాని వెనుక ఏం కుట్ర వుందో సమాధానం చెప్పాలన్నారు. బ్రేక్ ఫాస్ట్ జపాన్...మధ్యాహ్నం చైనా అంటూ రాజధానిపై చంద్రబాబు నాయుడు భ్రమలు సృష్టించారని ఎద్దేవా చేశారు. ‘‘ ఏపీ లో ప్రజాస్వామ్యం లేదని చెప్పే బీజేపీ నేతలు విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ కోసం ఏం చేశారు. తమ సొంత పనులు మినహా ప్రజల కోసం ఏమి చేయలేదు. తప్పు చేసిన నాయకులను అరెస్ట్ చేస్తే బీసీ నాయకులు అంటారా ? అంటే హత్య చేసిన వాళ్ళని.. మోసాలు చేసిన వారిని విడిచి పెట్టాలా ?’’ అంటూ మంత్రి నిప్పులు చెరిగారు. అన్ని వర్గాలు కలిసి దాడి చేసేందుకు కుట్ర చేసినా భారతంలో అర్జునుడికి మాదిరిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దేవుని ఆశీస్సులు ఉంటాయని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. -
'ఇంత నీచ రాజకీయాలు ఎప్పుడు చూడలేదు'
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి రహస్యంగా భేటీ కావడంపై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. మంగళవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..' చంద్రబాబు అడుగడుగునా కుట్రలకు పాల్పడుతున్నారు. ఇంత నీచమైన రాజకీయాలు గతంలో ఎపుడూ చూడలేదు. మూడు రాజధానుల ప్రకటన తర్వాత భారీగా కుట్రలు పన్నుతున్నారు. నేరుగా మాతో యుద్దం చేసే ధైర్యం లేక దొడ్డిదారిన వస్తున్నారు. విశాఖలో భూ అక్రమాలు జరిగాయని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరినా నిరూపించలేకపోయారు. మీ కుట్రలకి ఇక చెల్లు. మీరెన్నికుట్రలకు పాల్పడినా మేము రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తాం. నిమ్మగడ్డ రమేష్ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన కుట్రలేంటో బయటపడాలి.(రహస్య భేటీ కుట్రను ఛేదిస్తాం: ఆదిమూలపు) మాకు తెలిసింది ఒక్కటే ప్రజలకి సేవ చేయడం... ప్రజల మెప్పు పొందడం...మళ్లీ ఎన్నికలకి వెళ్లడం.నీచ రాజకీయాలకి పాల్పడితే చూస్తూ ఊరుకోం.ఏడాది కాలంలో 90 శాతానికి పైగా హామీలు నెరవేర్చడంతో చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. చంద్రబాబు కుట్ర స్వభావాన్ని మార్చుకోకుండా ప్రభుత్వంపై తప్పుడుగా బురద జల్లాలని చూస్తున్నారు.కుట్రలతో వ్యవస్ధలని అదుపులో పెట్టుకుని రాష్ట్రాభివృద్దిని అడ్డుకోవడం తగదు. గత ఏడాది కాలంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు ఎక్కడున్నారు. ఏడాదిగా బయటకి రాని వ్యక్తి ఇపుడు ఎందుకు వచ్చారు. తన అనుచరుడు కిషోర్‌ను సిఐడి పోలీసులు అరెస్ట్ చేస్తే ఎందుకు సిఐడి ఆఫీస్‌కి వచ్చావు. ఈ కేసులో తన పేరు ఎక్కడ బయటపడుతుందోననే భయంతోనే గంటా బయటకి వచ్చారే తప్ప కిషోర్ పై ప్రేమతో మాత్రం సిఐడి కార్యాలయానికి రాలేదు. కుట్రల వెనుక ఎవరున్నా .. అన్ని సాక్ష్యాదారాలతోనే నిందితులను సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు' అంటూ ధ్వజమెత్తారు.(వారితో మాట్లాడిన నాలుగో వ్యక్తి ఎవరు?) కాగా, రాష్ట్ర మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈనెల 13న రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీమంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌తో రహస్యంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో ఈ భేటీ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో రికార్డులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, తమ పార్టీ నేతలు నిమ్మగడ్డతో భేటీ కావడం పట్ల బీజేపీ అధిష్టానం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది. -
అది చంద్రబాబు నైజం : మంత్రి అవంతి
సాక్షి, విజయవాడ : ఎదుటివారిని ఇబ్బంది పెట్టి ఆనందపడటం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నైజం అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శించారు. వ్యవస్థలని చేతుల్లో పెట్టుకుని చంద్రబాబు.. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ కుట్రలు, కుతంత్రాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు వికృత చేష్టలకు ఆయన పార్టీ కేడర్ ఇబ్బంది పడుతోందన్నారు. ప్రభుత్వంలో లోపాలు చూపలేక చంద్రబాబు అక్కసు వెళ్లగక్కుతున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిది కక్ష సాధించే తత్వం కాదని స్పష్టం చేశారు. అన్ని మంచి క్వాలిటీలు ఉండబట్టే ఆదరణలో దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచారని తెలిపారు. గతంలో సమన్వయ లోపంతో బోట్ ప్రమాదాలు జరిగేవని చెప్పారు. విధివిధానాలు కూడా సక్రమంగా ఉండేవి కావని.. కానీ ఇప్పుడు పర్యాటకుల భద్రత కోసం సీఎం వైఎస్ జగన్ సంస్కరణలు తీసుకొచ్చారని వెల్లడించారు. ప్రమాదాలు నివారించేందుకు తొమ్మిది కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. -
టీడీపీ ఘోర ఓటమికి కారణం లోకేషే: అవంతి
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని, కుట్రలతో ప్రభుత్వంపై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలోనే ముఖ్యమంత్రుల పనితీరులో టాప్ ఫైవ్ లో సీఎం వైఎస్ జగన్ ఉన్నట్లు సర్వేలో వెల్లడైందన్నారు. టీడీపీ ప్రభుత్వం రైతుల కష్టాలను పట్టించుకోలేదని, ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా నీరుగార్చిందని నిప్పులు చెరిగారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని ఇతర రాష్ట్రాల్లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. (సీఎం వైఎస్ జగన్ ఏడాది పాలన భేష్) పాత బకాయిలతో సహా చెల్లించాం.. ‘‘గత టీడీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే పాత బకాయిలతో సహా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించింది. ప్రతీ నెలా ఒకటో తేదీనే ఉదయం ఆరు గంటలకే పెన్షన్ అందిస్తున్న ఘనత మాది. మీరు అధికారంలో ఉన్నప్పుడు వెయ్యి రూపాయిల ఇచ్చిన పెన్షన్ ని మేము రెట్టింపు చేశాం. త్వరలో 2,500 రూపాయిలు కూడా చేయబోతున్నాం. ఈ ఏడాది జులై 7 న రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల పైగా పేదలకి ఇళ్ల స్ధలాలు ఇవ్వబోతున్నాం. ఎన్నికల హామీలలో తొలి ఏడాదిలోనే 90 శాతం హామీలు నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్ ది. దశలవారీ మద్యపాన నిషేధంలో భాగంగా రాష్ట్రంలో దుకాణాలని 33 శాతం తగ్గించాం. రాష్ట్రంలో వైఎస్సార్ జలయజ్ఞ పేరుతో పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టలు పూర్తి చేయడంపై దృష్టి సారించాం. ప్రజలకి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని’’ అవంతి శ్రీనివాస్ తెలిపారు. (సంక్షేమ పాలనను చూడలేకే కుట్రలు) లోకేష్ భ్రష్టు పట్టించారు.. చంద్రబాబు, లోకేష్ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్‌కు సీఎం వైఎస్ జగన్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. ‘‘గత ఐదేళ్లగా చంద్రబాబుని భ్రష్టు పట్టించింది లోకేష్ కాదా? గత ఐదేళ్లూ కూడా కుల జాడ్యం, అవినీతికి, అక్రమాలకి లోకేష్ కారణం కాదా? లోకేష్ నాయకత్వాన్ని మీ ఎమ్మెల్యేలలో ఒక్కరైనా ఒప్పుకుంటారా. లోకేష్ వల్లే టీడీపీ పూర్తిగా దెబ్బతిన్న మాట వాస్తవం కాదా? ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత బాధితులని లోకేష్ ఎందుకు పరామర్శించలేదని’ మంత్రి ప్రశ్నించారు. వారు ట్విటర్,జూమ్‌లకే పరిమితం అయ్యారు.. దురుద్దేశ్యంతో లోకేష్ చేస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు, లోకేష్ జూమ్, ట్విటర్‌కే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఓడిపోయారనే కారణాలతో కళా వెంకట్రావుని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని లోకేష్ కుట్రలు చేస్తున్నారని అవంతి ఆరోపించారు. అన్ని వనరులు ఉన్న విశాఖని గతంలోనే చంద్రబాబు రాజధానిగా చేసి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఎంతో అవకాశం ఉండేదన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని మూడు రాజధానులు ప్రకటిస్తే.. కుట్రలతో అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. విశాఖ భవిష్యత్తులో అంతర్జాతీయ నగరంగా ఎదుగుతుందని అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. -
చంద్రబాబు బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు
-
8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు ప్రారంభం
-
8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు ప్రారంభం
సాక్షి, విజయవాడ : కేంద్ర మార్గదర్శకాల ప్రకారం జూన్ 8వ తేదీ నుంచి రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్లు ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు మంత్రులు అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్ హోటళ్ల యాజమాన్యాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కోవిడ్-19 నివారణ చర్యలు పాటిస్తూ హోటళ్ల నిర్వహణ అంశాలపై యాజమాన్యాలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 'ఎనిమిదో తేదీ నుంచి రాష్ట్రంలో హోటళ్లు.. రెస్టారెంట్లు ప్రారంభించవచ్చు. ఏపీలో అతిపెద్ద కోస్తా తీరం.. సుందర నదులు.. టూరిస్ట్ స్పాట్లు చాలా ఉన్నాయి. అన్ని చోట్లా హోటళ్లు ఓపెన్ చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నాం. పుణ్య క్షేత్రాల్లో కూడా హోటళ్లను తెరిచేలా చర్యలు తీసుకుంటాం. టూరిస్టులు, యాత్రీకుల వసతి కోసం హోటళ్లు నిర్వహిస్తూనే కోవిడ్ నివారణ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. దాదాపు ప్రతి జిల్లాలోనూ టూరిజం ప్రమోషన్లో భాగంగా వివిధ ఫెస్టివల్స్ నిర్వహించాం.(బాబు దళితులను హేళన చేశారు: మేరుగ) పర్యాటక రంగం ద్వారా ఆదాయాన్ని ఏ విధంగా సమకూర్చాలనే అంశంపై కసరత్తు చేస్తున్నాం. అరకు, గండికోట, హర్సలీహిల్స్ వంటి ప్రాంతాల్లో ఫైవ్ స్టార్, సెనెన్ స్టార్ రిసార్ట్స్ నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నాం. లాక్ డౌన్ సమయంలో నెలకు రూ. 10 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయాం. బోట్ ఆపరేటింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం.తొమ్మిది కమాండ్ కంట్రోల్ రూముల ఏర్పాటు చేయనున్నాం. త్వరలోనే కమాండ్ కంట్రోల్ రూములను కూడా ప్రారంభిస్తామంటూ' అవంతి శ్రీనివాస్ తెలిపారు. -
‘జూన్ 8 నుంచి హరిత హోటల్స్ ప్రారంభం’
సాక్షి, విశాఖపట్నం: లాక్డౌన్ సడలింపులతో జూన్ 8వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హరిత హైటల్స్‌ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకే హోటల్స్ తిరిగి ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. హరిత హోటల్స్‌కు ఆన్లైన్ బుకింగ్ వెసులుబాటు కూడా కల్పిస్తున్నామన్నారు. ఇది ఆతిథ్య రంగానికి శుభవార్త అన్నారు. అంర్జాతీయ స్ధాయిలో పర్యాటకులను అవినీతి రహితంగా ఆకట్టుకోవడానికి రాష్డ్ర వ్యాప్తంగా 12 పర్యాటక ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గడిచిన ఏడాది పాలనలో పర్యాటక అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. (నిరూపిస్తే రాజీనామా చేస్తా: అవంతి సవాల్) ఏడాది పాలనలో పర్యాటకుల సంఖ్య 21 శాతం పెరిగిందన్నారు. బోటింగ్ కార్యకలాపాల నియంత్రణ, భధ్రతకు రాష్ట్రంలో 9 ప్రాంతాలలో కంట్రోల్ రూమ్‌లు నిర్మించామన్నారు. రాష్ట్రంలో ఆదాయ మార్గాలు పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. ఇందుకోసం ఫెస్టివల్స్, ఎగ్జిబిషన్‌ను కూడా నిర్వహిస్తుమని తెలిపారు. గండికోట వద్ద ఉన్న ఎడ్వేంజర్ స్టోర్స్‌కు కూడా ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారని, ఏపి పర్యాటక శాఖ జాతీయ స్ధాయి అవార్డులు కూడా అందుకుందన్నారు. అంతేగాక శిల్పారామాల అభివృద్దికి ప్రత్యేక ప్రణాళిక నిర్వచిస్తున్నామని, యువతలో దేశభక్తి పెంపొందించేందుకు యూత్ ఎక్చేంజ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. -
రైతు భరోసా కేంద్రాల ప్రారంభంపై రైతుల హర్షం
-
నిరూపిస్తే రాజీనామా చేస్తా: అవంతి సవాల్
సాక్షి, విశాఖపట్నం: ఏడాది పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో 90 శాతం తొలి ఏడాదిలోనే నెరవేర్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ వైఎస్సార్ సీపీ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహాలకు మంత్రి అవంతి పూల మాలలు వేసి నివాళర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, సిటీ అధ్యక్షుడు వంశీ కృష్ణ శ్రీనివాస్, నార్త్ ఇన్ ఛార్జి కెకె రాజు, మాజీ ఎమ్మెల్యేలు రెహమాన్, కుంభా రవిబాబు, మహిళా విభాగం అధ్యక్షురాలు గరికిన గౌరి, కొయ్యా ప్రసాద రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, కోలా గురువులు పాల్గొన్నారు. (విశాఖపై అభివృద్ధి సంతకం) వినూత్న పాలనతో చెరగని ముద్ర.. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఏడాది కాలంలోనే వినూత్నమైన పాలనతో ప్రజల్లో సీఎం జగన్ చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్‌లోనే అమలు జరిగాయని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు. సీఎం జగన్ చేస్తోన్న సుపరిపాలన చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ఓర్వలేకపోతున్నారని.. కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నారని నిప్పులు చెరిగారు. ఎన్నికుట్రలు చేసినా సీఎం జగన్ సంకల్పాన్ని టీడీపీ అడ్డుకోలేదన్నారు. (ఏడాదిలో ఎన్నో సంచలన నిర్ణయాలు) టీడీపీ నేతలకు సవాల్.. పాడేరులో మెడికల్ కళాశాల ఏర్పాటుకు సీఎం జగన్ నిధులు కూడా కేటాయించారని మంత్రి అవంతి తెలిపారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా మూడు రాజధానుల ప్రకటన చేశారని చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా 80 శాతానికి పైగా సీట్లు, 50 శాతం ఓట్లు వైఎస్సార్ సీపీ సాధించిందని పేర్కొన్నారు. విశాఖ భూ కబ్జాపై టీడీపీ నేతల ఆరోపణలను అవంతి శ్రీనివాస్ ఖండించారు. ఏడాది పాలనలో భూకబ్జా జరిగిందని నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని.. కష్టించి పనిచేసిన కార్యకర్తలకు త్వరలోనే పదవులు ఇస్తామని ఆయన తెలిపారు. తనదైన మార్క్‌తో: ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఏడాది పాలనలోనే తనదైన మార్క్‌తో సీఎం జగన్ సంక్షేమ పాలన అందించారని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సీఎం వైఎస్ జగన్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఎప్పటికీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. -
విశాఖను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేస్తాం
సాక్షి, విశాఖపట్నం : లాక్డౌన్ నుంచి పారిశ్రామికవేత్తలు కోలుకునే పరిస్థితి తిరిగి వస్తుందంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. విశాఖను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారన్నారు. ఈ ఏడాదిలో 39 కొత్త పరిశ్రమల ద్వారా 30 వేల మందికి ఉపాధి లభించిందన్నారు. రాష్ట్రంలో ఐదు భారీ పరిశ్రమల ఏర్పాటుతో కొత్తగా రూ. 600 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. లాక్డౌన్ సమయంలోనూ సీఎం జగన్ పరిశ్రమలకు భారీ ప్రోత్సాహకాలు ఇచ్చి ఆదుకుంటున్నారని తెలిపారు. జిల్లాలోని రాచపల్లి, గుర్రంపాలెం వద్ద ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. ప్రతీ పార్లమెంటు పరిధిలో స్కిల్‌డెవలప్‌మెంట్ కాలేజీలు ఏర్పాటుతో పాటు విశాఖలో స్కిల్ డెవలప్మెంట్ వర్సిటీ ఏర్పాటుకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారంటూ మంత్రి తెలిపారు. చిన్న పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ముంజూరు చేయడంలో ఎప్పుడూ ముందుంటదని తెలిపారు. వలస వెళ్ళిన కార్మికులు తిరిగి పరిశ్రమల్లో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని అవంతి వెల్లడించారు. -
చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే: అవంతి శ్రీనివాస్
సాక్షి, విశాఖపట్నం: స్వర్గీయ ఎన్టీఆర్ జీవించి ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, పరిపాలన చూసి ఎంతో ఆనందించేవారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన భీమిలి మండలం తిమ్మాపురంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ బతికుంటే చంద్రబాబు నీచ రాజకీయాలు ఎప్పుడో బట్టబయలు అయ్యేవన్నారు. ఏడాది సంక్షేమ పాలనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బురద చల్లాలని ప్రయత్నించడం దుర్మార్గమని మంత్రి అవంతి మండిపడ్డారు. (‘అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా’) విమర్శించే నైతికత చంద్రబాబుకు లేదు.. అధికారంలో ఉన్న 14 ఏళ్లూ పేదల సంక్షేమాన్ని చంద్రబాబు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. మహానాడులో ఆయన ఓటమిపై విశ్లేషించుకుంటే మంచిదని మంత్రి అవంతి హితవు పలికారు. వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ పాలనను విమర్శించే నైతికత చంద్రబాబుకు లేదన్నారు. మహానాడులో చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని.. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. పేదల సంక్షేమమే ఊపిరిగా సీఎం జగన్ పరిపాలన చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నిజ స్వరూపం తెలిసే 23 సీట్లకు ప్రజలు పరిమితం చేశారని విమర్శించారు. ఇప్పటికైనా ఆయన కుట్రలు మాని హుందా రాజకీయాలు చేయాలని..లేకపోతే ప్రజలే రాజకీయ సమాధి చేస్తారని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. నీచ రాజకీయాలు అవసరమా.. ‘కన్నా’? ) -
దీంతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది: అవంతి
సాక్షి, విశాఖపట్నం: రైతులకు కరెంటు దండగా అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉచిత కరెంటు అందించారని పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు హాయాంలో సీఎంను కలవాలంటే సూటు.. బూటు వేసుకుని సింగపూర్ నుంచి రావాలని ఆయన ఎద్దేవా చేశారు. ఇక వైఎసార్ రైతు భరోసా ద్వారా సంవత్సరానికి రైతులకు రూ. 13500 పెట్టుబడి సాయం అందిందని తెలిపారు. దీంతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని, కరోనా సమయంలో 14 వేల క్వింటాళ్ల విత్తనాల పంపిణీ జరిగిందని వెల్లడించారు. అంతేగాక ఇమాములు, పూజారులు, చర్చి ప్రతినిధులకు రూ. కోటి 70 లక్షల సహాయం అందించినట్లు తెలిపారు. (‘వారిద్దరూ రాజకీయ వ్యాపారులు’) గత ప్రభుత్వం మత్స్యకారులను ఓటు బ్యాంకుగా చూశారని మంత్రి వ్యాఖ్యానించారు. మత్స్య వేట నిషేధ కాలంలో ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని రూ. 4 వేల నుంచి రూ. 10 వేలకు పెంచినట్లు చెప్పారు. కోవిడ్-19 సమయంలో కూడా సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనసాగించారన్నారు. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ఈ నెల 30న ప్రతీ గ్రామంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా రూ. 3 లక్షల ఎకరాల భూమికి నీరు అందనుందని, మార్కెటింగ్ కమిటీల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. వలసలు లేకుండా గ్రామాల్లోనే ప్రజలు ఉండేలా సీఎం జగన్ పథకాలు రూపొందించారని చెప్పారు. రైతు గర్వ పడేలా సీఎం జగన్ చర్యలు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ('సుధాకర్ విషయంలో టీడీపీది మొసలి కన్నీరు') -
‘వారిద్దరూ రాజకీయ వ్యాపారులు’
సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్షనేత చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజకీయ వ్యాపారులని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే కనిపించడం లేదని, హ్యాండ్ కర్ఛీఫ్ మార్చినట్లు.. పార్టీ మార్చే వ్యక్తి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అని ఎద్దేవా చేశారు. రెండు నెలల పాటు తెలంగాణలో మనవడితో ఆడుకున్న చంద్రబాబుకు స్వాగతం ఎందుకని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఏం ఘన కార్యం చేశారంటూ మంత్రి అవంతి మండిపడ్డారు. (‘కూన’ కోసం గాలింపు) అభివృద్ధిని అడ్డుకోవడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. మద్యం అమ్మకాలు తగ్గిస్తే బ్రాండ్లు అమ్మడం లేదంటూ ఆయన రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదాయం కోసం జనానికి చంద్రబాబు మందు పోయించారని విమర్శించారు. కేరళకు మించిన అక్షరాస్యత కోసం అమ్మ ఒడి పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్నారని తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేను గెలిపించకపోయినా విశాఖ ఉత్తర నియోజకవర్గం ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించారని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. (వెంకన్న సాక్షిగా.. పాపాలన్నీ బాబువే) -
'సుధాకర్ విషయంలో టీడీపీది మొసలి కన్నీరు'
సాక్షి, విశాఖపట్నం : దేశ చరిత్రలో ఎన్నడు లేని విధంగా వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించిందని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆదివారం విశాఖపట్నంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక దాదాపు 4లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందని తెలిపారు. అమ్మఒడి ద్వారా ఏపీ అక్షరాస్యతలో కేరళను అధిగమించిందన్నారు. అమ్మఒడి ద్వారా అక్షరాస్యతతో పాటు అభివృద్ధి కూడా సాధ్యమన్నారు. కరోనా సమయంలో గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సేవలు మరువలేనివన్నారు. రాబోయే రోజుల్లో గ్రామ వాలంటీర్లకు సమచిత స్థానం కల్పించబోతున్నామని పేర్కొన్నారు. నూటికి నూరు శాతం అవినీతికి తావు లేకుండా ప్రభుత్వం పని చేస్తుంది. (డాక్టర్ సుధాకర్ వ్యవహారం: మంత్రి సవాల్) వలంటీర్లు, సచివాలయ సిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడదని హెచ్చరించారు. రాష్ట్రంలో అభివృద్ధికి చంద్రబాబు కొన్ని వ్యవస్థలను తన ఆధీనంలో ఉంచుకుని రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి అడుగడుగునా అడ్డు పడుతున్నారు. విద్యుత్ ఛార్జీలపై మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదని విమర్శించారు. ప్రమాదకర పరిశ్రమల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని, నిబంధనలు పాటించని పరిశ్రమలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందనవసరం లేదని తెలిపారు. టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకే భూములు వేలం వేస్తున్నారు. గత ప్రభుత్వ హయంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారని.. కావాలనే ఇప్పుడు దీనిని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పర్యటన విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. డాక్టర్ సుధాకర్ విషయంలో టీడీపీ మొసలి కన్నీరు కారుస్తుందని, అతని సస్పెన్షన్ శాఖాపరమైన నిర్ణయం అని అవంతి వెల్లడించారు. (ఏపీలో 2627కు చేరిన కరోనా కేసులు) -
దేశ చరిత్రలో ఇది మరచిపోలేని రోజు: అవంతి
సాక్షి, విశాఖపట్నం: దేశ చరిత్రంలో మే 23 మరచిపోలేని రోజు అని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో విజయం సాధించి నేటీకి ఏడాది. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ: గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించిన అత్యంత ఘన విజయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిది అన్నారు. 5 సంవత్సరాల్లో చేయాల్సిన పనులు ఏడాది కాలంలోనే ముఖ్యమంత్రి పూర్తి చేశారన్నారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలతో పాటు.. విద్యార్థుల ఫీజు రీ ఎంబర్స్మెంట్, డ్వాక్రా సంఘాల మహిళలకు రుణ మాఫీ.. రైతు భరోసా అమలు చేశారన్నారు. అంతేగాక గ్యాస్ ప్రభావిత కుటుంబాలను సీఎం జగన్ ఆదుకున్న తీరు మర్చిపోలేనిదన్నారు. నాయకునికి కావాల్సింది వయసు.. అనుభవం కాదు.. వైఎస్ జగన్ లాంటి పెద్ద మనసు ఉండాలని మంత్రి పేర్కొన్నారు. ఇక గ్యాస్ లీకేజీ ఘటన ప్రభుత్వానికి దెబ్బ అంటూ పచ్చ మీడియా ప్రచారం చేస్తోందన్నారు. అయితే ఏ దెబ్బనైనా తట్టుకునే శక్తి కేవలం సీఎం జగన్‌కు మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకుల విద్యుత్ దీక్షలు ఓ పెద్ద జోక్ అని.. విద్యుత్ చార్జీలపై మాట్లాడే హక్కు టీడీపీ నేతలకు, చంద్రబాబుకు లేదని మండిపడ్డారు. బషిర్ బాగ్ సంఘటన ఇంకా జనం మర్చిపోలేదన్నారు. కాగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు 46 శాతం వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు అందుతుంటే ఎక్కువ శాతం ఇతర పార్టీలకు అందుతున్నాయన్నారు. సహాయంలో సీఎంకు పార్టీలతో సంబంధం లేదని.. పేదలే ఆర్హులని మంత్రి అన్నారు. -
‘భవిష్యత్తులో కూడా ఆదుకుంటాం’
సాక్షి, విశాఖపట్నం: గ్యాస్ లీకేజ్ ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధితులను పరామర్శించి మానసిక ధైర్యం అందించారని పేర్కొన్నారు. ఐదుగురు మంత్రులు, ముగ్గురు ఎంపీలు కూడా బాధిత గ్రామాల్లో పర్యటించి ప్రజల్లో భరోసా నింపారన్నారు. పార్టీలు, కులాలకు అతీతంగా బాధితులందరికీ తక్షణ పరిహారం అందించామని మంత్రి పేర్కొన్నారు. (మార్గదర్శకాలను పాటించాలి: కేంద్ర బృందం) స్టైరిన్‌ను కొరియా తరలించాం.. బాధిత గ్రామాల్లో మెడికల్ క్యాంప్‌లు నిర్వహించామని, వైఎస్సార్ క్లినిక్ కూడా ఏర్పాటు చేశామని మంత్రి అవంతి వెల్లడించారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ప్రమాదానికి కారణమైన స్టైరిన్ కూడా కొరియా కు తరలించామని చెప్పారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని, బాధిత గ్రామ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. (‘ఆ దిశగా ఆలోచిస్తే బాగుండేది’) -
ఊహించని విధంగా ఎల్జీ పాలిమర్స్‌పై చర్యలు
సాక్షి, విశాఖపట్నం: ఎవరూ ఊహించని విధంగా ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై చర్యలు ఉంటాయని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. కంపెనీలో భద్రతాపరంగా చర్యలు తీసుకోవడంలో యాజమాన్యం వైఫల్యమే ఈ ఘటనకు కారణమని పేర్కొన్నారు. గ్యాస్ లీకేజీ బాధిత గ్రామాల్లో శాశ్వత వైఎస్సార్ క్లినిక్‌లను ఏర్పాటు చేసి, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. బుధవారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు కుట్రలను నమ్మవద్దని కోరారు. ప్రభావిత గ్రామాల్లో అయిదుగురు మంత్రులు, ఎంపీలు బస చేసినా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు యథాస్థితికి వచ్చేవరకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. స్వార్థపూరిత రాజకీయాలకు విశాఖ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బ తీయొద్దని హితవు పలికారు. చంద్రబాబు అబద్దాల ప్రచారం మానుకోవాలని సూచించారు. తప్పుడు కథనాలతో తప్పుదోవ పట్టించొద్దు: కన్నబాబు మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. ఇలాంటి సమయంలోనైనా ఈనాడు విలువలు పాటించాలన్నారు. బాబును సంతోష పరిచే ఎజెండాలో భాగంగా ఈనాడు తప్పుడు కథనాలు ఇస్తుందని ధ్వజమెత్తారు. భయానక వాతావరణం ఉందని చిత్రీకరించి తప్పుడు వార్తలతో ప్రజలని తప్పుదోవ పట్టించద్దని కోరారు. చంద్రబాబు హయాంలో విశాఖపై సవతి ప్రేమ చూపించారు.. కానీ ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. అమరావతి కోసం విశాఖను నిలువెల్లా మోసం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు విద్యుత్ బిల్లులు పెంచారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ లీకేజ్‌పై ఇకనైనా రాజకీయం మానేయండని సూచించారు. ఈ ఘటనలో ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుందన్నారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులంతా కోలుకున్నారని తెలిపారు.స్టైరిన్ తరలింపు ప్రక్రియ వేగంగా జరుగుతోందని పేర్కొన్నారు. ఒక టన్ను స్టైరిన్ కూడా ఉండడానికి వీల్లేదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారన్నారు. -
‘మంత్రుల బసతో బాధితుల్లో ధైర్యం’
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో సోమవారం రాత్రి నలుగురు మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్, కురసాల కన్నబాబు, ఎంపీ విజయ సాయిరెడ్డి, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో నిద్ర చేశారు. బాధిత గ్రామంలో ఆరుబయట నిద్రించిన ఎంపీ విజయ సాయిరెడ్డి మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. పరిహారం ఇవ్వడం కాదు ప్రజలకు భరోసా కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పద్మనాభనగర్లోని ఓ బాధితుడి ఇంట్లో నిద్ర చేసిన మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో సాధారణ పరిస్థితి నెలకొందని, ప్రజలతో పాటు గ్రామంలో నిద్రించామని ఆయన తెలిపారు. (చిన్నారులు సహా ప్రతి ఒక్కరికీ సాయం) వెంకటాపురంలో బాధితుల ఇంటిలో బస చేసిన ఇన్‌ఛార్జి మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. బాధిత గ్రామాల ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయారని ఆయన తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో స్వయంగా మంత్రులే గ్రామాల్లో బస చేయడంతో ప్రజలలో ధైర్యం పెరిగిందని ఆయన తెలిపారు. వెంకటాద్రి నగర్లో ఓ బాధితుని ఇంటిలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ బసచేశారు. ఎస్సీ, బీసీ కాలనీలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ సోమవారం రాత్రి నిద్రచేశారు. ప్రతీ గ్రామంలోనూ వైద్య శిబిరాలు ఏర్పాటు కానున్నాయని మంత్రులు తెలిపారు. నేటి నుంచి వాలంటీర్ల సహకారంతో ఎన్యూమరేషన్ ప్రారంభం కానుందని మంత్రులు పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విశాఖ గ్యాస్ లీక్ బాధితులకు చెక్కుల పంపిణీ
సాక్షి, విశాఖపట్నం : ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు నష్ట పరిహారం చెక్కుల పంపిణీ జరిగింది. సోమవారం మంత్రులు కురసాల కన్నబాబు, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్‌లు మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల చెక్కులను అందజేశారు. మొత్తం ఎనిమిది కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. కాగా, విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో 12మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. బాధితులకు ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది. మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి నష్ట పరిహారంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఘటన జరిగిన ఐదురోజుల వ్యవధిలోనే రూ. కోటి పరిహారం బాధితులకు పంపిణీ చేయటం జరిగింది. చదవండి : ఆ అనుమతులిచ్చింది చంద్రబాబే -
బాబుకు విదేశీ మోజు ఎక్కువ: అందుకే..
సాక్షి, విశాఖపట్నం : ‘ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడికి విదేశీ మోజు ఎక్కువ. మనలాంటి సాధారణ మనుషులంటే ఆయనకి పడదు.. సూటు,బూటు వేసుకున్న వాళ్లంటేనే ఇష్టం’ అని మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకి అభద్రతా భావం పెరిగిపోయిందని అన్నారు. ఆయన హయాంలోనే నిబంధనలకి విరుద్దంగా ఎల్జీ పాలిమర్స్‌కి ఇష్టానుసారం అనుమతులిచ్చేశారని తెలిపారు. బాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎల్జీ పాలిమర్స్‌లో అగ్ని ప్రమాదం జరిగితే ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకపోయినా ప్లాంట్ విస్తరణకి బాబు హయాంలో అనుమతులు ఇవ్వలేదా.. సింహాచలం దేవస్ధానం భూములని సైతం అక్రమంగా డీనోటిఫై చేసి ఎల్జీ పాలిమర్స్ అప్పగించింది మీరే కదా బాబు? అంటూ మండిపడ్డారు. మా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు బాబుకు ఎక్కడిది ‘‘ చంద్రబాబుకి మా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎక్కడిది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలని ఎవరినీ నమ్మేవారు కాదు. సీఎం వైఎస్ జగన్ మమ్మల్ని, అధికారులని నమ్మి బాధ్యతలు అప్పగించారు. బాబుకి తానొక్కడినే ప్రచారం పొందాలనే యావ ఎక్కువ. తన హయాంలో జరిగిన ప్రమాదాలపై ఎలా స్పందించారో ప్రజలకి తెలియదా?. ప్రజలు అమాయకులు కాదు... ఆయన తప్పుడు ఆరోపణలను గమనిస్తున్నారు. ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ స్పందించిన తీరును అందరూ అభినందిస్తుంటే బాబు ఓర్వలేక విమర్శిస్తున్నారు. చంద్రబాబు నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం. ( 'ఆయనను ఇక గొలుసులతో కట్టేయాల్సిందే' ) ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగి ఉండేదికాదు. చాలా వేగంగా స్పందించి ప్రమాద స్ధాయిని తగ్గించగలిగాం. గంట ఆలస్యమైనా ప్రమాద స్ధాయి ఎక్కువగా ఉండేది. సీఎం జగన్‌కు చంద్రబాబులా ప్రచారయావ లేదు. ముఖ్యమంత్రి మనసుతో ఆలోచించే బాధిక కుటుంబాలకి కోటి రూపాయిలు నష్టపరిహారం ప్రకటించారు. చంద్రబాబు నీచ రాజకీయాలు మానాల’’ని హితవుపలికారు. -
‘చంద్రబాబుకు మనసు లేదు’
సాక్షి, విశాఖపట్నం: గ్యాస్ లీకేజీ ఘటనను రాజకీయం చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. విశాఖపట్నంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై బురదచల్లే విధంగా టీడీపీ ఆరోపణలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ ఘటనకు, ప్రభుత్వానికి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రమాద సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం చాలా వేగంగా స్పందించిందన్నారు. పోలీసులు వెంటనే స్పందించకుండా ఉంటే ప్రమాద తీవ్రత మరోలా ఉండేదన్నారు. సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధితులను పరామర్శించడమే కాకుండా మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని తెలిపారు. (‘అది టీడీపీ దద్దమ్మల డ్రామా కమిటీ’) మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. ఐఏఎస్‌లపై అవమానకరంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబుకు తన మంత్రులపై నమ్మకం లేక తానే పనిచేసినట్లు ప్రచారం చేసుకోవడం అలవాటని దుయ్యబట్టారు. సీఎం వైఎస్ జగన్‌కు ప్రచారం అవసరంలేదన్నారు. ఏడుగురు మంత్రులు, సీఎస్‌ను విశాఖలోనే ఉండాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. ఫ్యాక్టరీతో తమకు సంబంధంలేదని, ఆ కంపెనీపై ప్రత్యేక ప్రేమలేదని మంత్రి స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఐదు గ్రామాల ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. తమకు ప్రజలే ముఖ్యమని తెలిపారు. చంద్రబాబుకు మనసు లేదని విమర్శించారు. పక్క రాష్ట్రంలో కూర్చోని ట్వీట్లు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రజల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. (‘ప్రచార్భాటంతో ఆయనలా చేసి ఉంటే..’) -
‘ప్రజల భద్రతే ముఖ్యం కంపెనీ కాదు’
సాక్షి, విశాఖపట్నం: ప్రజల భద్రతే ముఖ్యమని కంపెనీ కాదని మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్ అన్నారు. మంత్రులు శనివారం సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల భద్రత కోసం ఎలాంటి చర్యలైనా తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని అన్నారు. మృత దేహాలను త్వరగా తరలించి అంత్యక్రియలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కరోనా తీవ్రత దృష్ట్యా పరిస్థితులను అర్థం చేసుకోవాలని మంత్రులు సూచించారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. (విశాఖ విషాదం: ఎల్జీ పాలిమర్స్ క్షమాపణ) సున్నితమైన సమయంలో ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు దిగవద్దన్నారు. రాజకీయాలకు ఇది సమయం కాదని ప్రజలను తప్పుదోవ పట్టించవద్దన్నారు. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం పట్ల ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తుందన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తున్నామని, కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం వైఎస్ జగన్ చెప్పారని మంత్రులు తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రులు తెలిపారు. (ప్రమాద స్థలిలో ఇదీ పరిస్థితి!) -
గ్యాస్ లీక్ పరిస్థితి అదుపులో ఉంది: అవంతి శ్రీనివాస్
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ పరిసరాల్లో సాధారణ పరిస్థితి నెలకొని, పూర్తిగా అదుపులోకి వచ్చిందని మంత్రులు అవంతి శ్రీనివాస్, గుమ్మనూరు జయరామ్, ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మంత్రులు ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనా స్థలాన్ని శనివారం పరిశీలించారు. అనంతరం మంత్రి అవంతి శీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ఎల్జీ పాలిమర్స్ పరిసరాల్లో సాధారణ పరిస్థితి నెలకొందన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. వదంతులను నమ్మొద్దు, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అవంతి శ్రీనివాస్ చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. (గ్యాస్ లీక్ బాధితులు కోలుకుంటున్నారు: కన్నబాబు) పరిస్థితి అదుపులో ఉంది: డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎల్జీ పాలిమర్స్‌ను గ్యాస్ లీకేజీ ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీజీపీ గౌతమ్ సవాంగ్ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మధ్యాహ్నానికల్లా ఢిల్లీ నుంచి నిపుణుల బృందం వస్తుందని ఆయన చెప్పారు. నిపుణుల బృందం పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకుంటామని డీజీపీ తెలిపారు. బయట నుంచి కొంతమంది వచ్చి కావాలనే ఆందోళన చేస్తున్నారని ఆయన తెలిపారు. అధికారులు చేస్తున్న పనులకు ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. (అప్రమత్తతతోనే ముప్పు తప్పింది ) -
విషాదంలోనూ దిగజారుడు రాజకీయాలా..?
సాక్షి, విశాఖపట్నం: గ్యాస్ లీకేజీపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇప్పటివరకు పరిస్థితి 75 శాతం అదుపులోకి వచ్చిందని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే 48 గంటలలో సాధారణ పరిస్థితులను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఐదు గ్రామాల ప్రజలను ఇళ్లకు పంపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు తప్ప ప్రతిపక్షాలన్నీ సీఎం వైఎస్ జగన్ కోటి రూపాయలు నష్ట పరిహారం ప్రకటించడం పట్ల హర్షించారని పేర్కొన్నారు. (చంద్రబాబు బుర్ర పని చేస్తుందా?: బొత్స) ఇంత పెద్ద విషాద సంఘటనను కూడా చంద్రబాబు తన రాజకీయానికి వాడుకోవడం దిగజారుడు చర్య అని దుయ్యబట్టారు. ఇంత వరకు ఆంధ్రాకు ఎందుకు రాలేదని చంద్రబాబును ప్రశ్నించారు. ఆయన ఆంధ్రాకు ప్రతిపక్ష నాయకుడా.. తెలంగాణాకా అంటూ అవంతి ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పూర్తి అండగా ఉంటామని.. ప్రజల బాధ్యత తమదేనని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు (48 గంటల వరకు గ్రామాలకు వెళ్లొద్దు: నీలం సాహ్ని) -
‘ఆ ప్రాంతాల్లో లాక్డౌన్ సడలింపులు లేవు’
సాక్షి, విశాఖపట్నం: కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు కొనసాగుతాయని.. మిగతా ప్రాంతాల్లో ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు లాక్డౌన్ సడలింపులు ఉంటాయని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. విశాఖ జిల్లాలో లాక్ డౌన్ మినహాయింపులపై ఆయన అధ్యక్షతన జరిగిన టాస్క్ ఫోర్స్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. (ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దుల్లో ఉద్రిక్తత) చిన్నషాపులు, దినసరి కూలీలు, కార్మికుల ఉపాధికి ఇబ్బందులు లేకుండా కార్యకలాపాలు కొనసాగిస్తూనే కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా భవన, నిర్మాణ రంగ కార్మికులకి.. ఇతర కార్మికులకి పనులు కల్పించేలా నిర్ణయించారు. వారికి అవసరమైన కార్యకలాపాలు, పనులు నిర్వహించుకునేలా వెసులుబాటు ఇవ్వాలని నిర్ణయించడంతో పాటు లాక్ డౌన్ సడలింపులు, మినహాయింపులపైనా సమావేశంలో చర్చించారు. (ఏపీలో కొత్తగా 67 కరోనా కేసులు..) -
పారిశుధ్య కార్మికులకు మంత్రి పాదాభివందనం
సాక్షి, విశాఖపట్నం: కరోనా కష్ట కాలంలో పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయమని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కొనియాడారు. విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేస్తున్నారన్నారు. పద్మనాభం మండలం విలాస్‌ఖాన్ గ్రామంలో పారిశుధ్య కార్మికులకు మంత్రి అవంతి శ్రీనివాస్ పాదాభివందనం చేశారు.అనంతరం వారిని ఘనంగా సత్కరించారు. కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్న నేపథ్యంలో.. వైద్యులు, పోలీసులతో పాటు పారిశుధ్య కార్మికులు కూడా సైనికుల్లా పనిచేస్తూ ప్రజలకు రక్షణగా నిలుస్తున్నారని మంత్రి ప్రశంసించారు. -
‘దోచుకున్న డబ్బును బయటకు తీయండి’
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నాయకులు దోచుకుని దాచుకున్న సొమ్మును బయటకు తీసి ప్రజలకు సేవ చేయాలని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ హితవు పలికారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్ నుంచి ట్వీట్లు చేస్తుంటే.. టీడీపీ నాయకులు పార్టీ కార్యాలయం నుంచి తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖపట్నంలో కరోనా టెస్ట్‌ల కోసం ఇతర ప్రాంతాలకు శాంపిల్స్ పంపించేవారమని.. ఇప్పుడు నేరుగా విశాఖలోనే టెస్ట్‌లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. (53 మంది జర్నలిస్టులకు కరోనా) కరోనా పాజిటివ్ కేసుల వివరాలు గోప్యంగా ఉంచుతున్నామన్న టీడీపీ నేతల దుష్ప్రచారాన్ని ఆయన తప్పుపట్టారు. అన్న క్యాంటీన్లు లేకున్నా అంతకు మించి 60 వసతి గృహాలు ద్వారా భోజనాలు పెడుతున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్కసుతో ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని టీడీపీ నేతలపై మండిపడ్డారు. టీడీపీ నీచ రాజకీయాలు వీడి కరోనాపై పోరాటం చేయాలని హితవు పలికారు. ప్రగతి భారతి ఫౌండేషన్‌కి విరాళాలు ఇవ్వాలని ఎక్కడా ఒత్తిడి లేదని.. ఆ సంస్థ రేషన్ లేని పేదలకు కూడా సాయం చేస్తోందన్నారు. టీడీపీ నేతలు సహాయం చేయకున్నా పర్వాలేదని.. కానీ సాయాన్ని అడ్డుకోవద్దని అవంతి శ్రీనివాస్ అన్నారు. -
ఒక్కరూ అర్ధికంగా ఇబ్బంది పడకూడదు
-
దేశ ప్రజలను మోదీ సంఘటితం చేశారు : అవంతి
సాక్షి, విశాఖపట్నం : కరోనా నియంత్రణ కోసం పనిచేస్తున్న ప్రతీ ఒక్క ఉద్యోగికి మంత్రి అవంతి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షెల్టర్ల ద్వారా అనాథలు, భిక్షాటన చేసేవారికి ఆశ్రయం కల్పించి భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్‌పై వెయ్యి రూపాయిల సాయంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. వలస వచ్చిన ఇతర జిల్లాలకి చెందిన 50 వేల కుటుంబాలకి రేషన్ అందించామని తెలిపారు. ప్రభుత్వంతో పాటు స్వచ్చంద సేవా సంస్ధలు సైతం సాయం చేయడానికి ముందుకు వస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా నియంత్రణపై అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని అవంతి తెలిపారు. కరోనా కేసులను దాస్తున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం దారుణమన్నారు. ఎవరు ముందుకు వచ్చినా టెస్టులు చేయడానికి సిద్దంగా ఉన్నామని చెప్పారు. రాత్రింబవళ్లు కష్టపడుతున్న అధికార యంత్రాంగాన్ని కనీసం మెచ్చుకునే మనస్సు చంద్రబాబు నాయుడుకు లేకపోవడం దురదృష్టకరమన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు అధికారులు బాగా పనిచేసినట్లు, మీరు ప్రతిపక్షంలో ఉంటే పనిచేయనట్లు ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలని సంఘటితం చేశారని అవంతి అన్నారు. దేశ ప్రజల శ్రేయస్సుని కాంక్షించే నాయకులైన ప్రధాని, సీఎం మనకి ఉన్నారని తెలిపారు. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు, వైద్య సిబ్బంది నుంచి వైద్యుల వరకు ప్రతీ ఒక్కరూ బాగా పనిచేస్తున్నారని కొనియాడారు. -
పారిశద్ధ్య కార్మికులకు అండగా ‘ప్రగతి భారత్ ఫౌండేషన్’
సాక్షి, విశాఖపట్నం : విశాఖలో 7500 పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.15 వేల మంది వాలంటీర్లకు శానిటైజర్లు,మాస్క్‌లను తమ ట్రస్ట్ తరపున పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. లాక్డౌన్ సమయంలో విశాఖలోని పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించిన ‘ప్రగతి భారత్ ఫౌండేషన్’ వారికి వెయ్యి రుపాయల విలువైన నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో ప్రగతి భారత్ ఫౌండేషన్‌కు గౌరవ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ పాల్గొని పారిశుద్ధ్య కార్మికులకు సరుకులను పంపిణీ చేశారు. (రజినీ రియాలిటీ షోకు అత్యధిక రేటింగ్) ఈ సందర్బంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని పారిశుద్య కార్మికులకు కూడా ఉచితంగా నిత్యావసర సరుకులు అందివ్వబోతున్నట్లు వెల్లడించారు. పోలీసులకు, హోంగార్డులకు, జర్నలిస్టులకు సైతం ప్రగతి భారత్ ఫౌండేషన్ తరపున నిత్యావసర సరుకులు అందించనున్నామన్నారు. విశాఖలో చిక్కుకుపోయిన ఇతర రాష్ట్రాల వారికి ట్రస్ట్ తరపున భోజన సదుపాయం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. తక్కువ ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్డ్రంలోని నిరుపేద కుటుంబాలని ఆదుకుంటున్నారని ప్రశంసించారు. (పీఎం కేర్స్‌కు యువీ విరాళం ) భౌతిక దూరంతో కరోనాను నియంత్రించగలం లాక్డౌన్ సమయంలో ప్రభుత్వం పేదలకు అండగా నిలిచిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సీఎం పిలుపుకి స్వచ్చంద సేవా సంస్థలు స్పందించి.. పేదలని ఆదుకోవడానికి ముందుకు రావటం అభినందనీయమన్నారు. బౌతిక దురాన్ని పాటించడం ద్వారా కరోనా నియంత్రించగలమన్నారు. విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలబడం హర్షనీయమన్నారు. లాక్డౌన్ కాలంలో వీరికి నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేస్తున్న ప్రగతి భారత్ ఫౌండేషన్‌ను అభినందించారు. ప్రభుత్వం తరపున కూడా అండగా ఉండాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది అని ప్రశంసించారు. (కరోనా షాక్ : జూలోని పులికి పాజిటివ్) -
కరోనా: అన్ని జిల్లాల్లోనూ విస్తృత చర్యలు
సాక్షి, అమరావతి: కోవిడ్ -19 నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే అన్ని రకాల రవాణా వ్యవస్థల్ని రద్దు చేసిన ప్రభుత్వం.. అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేసింది. తాజాగా అంతర్ జిల్లా సరిహద్దులను కూడా మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు పౌరుల కదిలికలపై పూర్తి స్ధాయిలో ఆంక్షలు విధించింది. కరోనా మహమ్మారి ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో కఠినమైన ఆంక్షలు విధించాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. (‘లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు’) ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరింత పక్కాగా అమలు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లతోపాటు ఆరోగ్య సిబ్బంది, వైద్యులు కరోనా వైరస్‌పై నిరంతరం క్షేత్రస్ధాయిలో సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేస్తున్నారు. ప్రజలను పూర్తిగా ఇళ్లకే పరిమితం చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను పోలీసు యంత్రాంగం పక్కాగా అమలు చేయడంతోపాటు.. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పౌర సంచారాన్ని నియంత్రించింది. ఈ సంందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలపై ఓ నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది. ‘ప్రతి పౌరుడు వారియర్‌గా పోరాడాలి’ విజయనగరం జిల్లా: భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్ధంలోని సీతారామస్వామి ఆలయంలో యథావిధిగా ఉగాది, శ్రీరామ నవమి వేడుకలను నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్, నెల్లిమర్ల ఎంఎల్ఏ బడ్డుకొండ అప్పలనాయుడు తెలిపారు. రామతీర్ధం ఆలయంలో వేడుకల నిర్వహణపై ఎమ్మెల్యే, ఆలయ అధికారులతో జిల్లా కలెక్టర్ మంగళవారం తన ఛాంబర్లో సమావేశాన్ని నిర్వహించారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఈ వేడుకలకు భక్తులకు ప్రవేశం లేదని.. అయితే యథావిధిగా ఆలయ పూజారులు, ముఖ్యుల మధ్య ఉగాది వేడుకలు, శ్రీరామనవమి కల్యాణం జరుగుతాయని వారు తెలిపారు. కరోనా వ్యాధి వ్యాప్తిని నియంత్రించేందుకు నేటి నుంచి జిల్లాలో 144 వ సెక్షన్ అమల్లో ఉంటుందని, అలాగే వ్యక్తుల మధ్య సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాల్సి ఉందన్నారు. విదేశాల నుండి వచ్చిన వారి నుండే స్థానికులకు కరోనా వ్యాధి సంక్రమిస్తున్నందున వారిపై ప్రత్యెక పర్యవేక్షణ ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ చెప్పారు. వారు తమ ఇళ్ళ నుండి బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ లో ఉంచాలని మండల స్థాయి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సీఎంవో నుంచి వచ్చిన సమాచారం మేరకు జిల్లాకు 321 మంది వివిధ దేశాల నుండి వచ్చారు. వారిలో ఆయా మండలాలు, పట్టణాల్లో ఎంత మంది వాస్తవంగా ఉన్నదీ మండల అధికారులు, మునిసిపల్ అధికారులు మరో సారి మండలం, పట్టణం, గ్రామం వారీగా తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని చెప్పారు. జిల్లాలో కరోనా వ్యాధి నియంత్రణలో భాగంగా రెండు డివిజన్లలో ఐదు క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెంచి విక్రయిస్తున్నట్టు జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చిందని.. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకి పంపిస్తామన్నారు. పోలీస్, రెవిన్యూ, మునిసిపల్ శాఖలు సంయుక్తంగా ఇటువంటి వారిపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని ఏ ప్రాంతంలోనూ ప్రజలు సామూహికంగా.. పంచాంగ శ్రవణం, ఉగాది వేడుకలు నిర్వహించడానికి అనుమతి లేదని కలెక్టర్ స్పష్టం చేసారు అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ పశ్చిమ గోదావరి లాక్డౌన్ కరానోపై పోరాటంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలను చైతన్యపరుస్తున్నారని కలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని వెల్లడించారు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఈ నెల 31 వరకూ లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. లాక్ డౌన్‌కు ప్రజలంతా సహకరించాలి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలకు అవసరమైన కూరగాయాలు అందుబాటులో ఉన్నాయని కూడా చెప్పారు. రేపటి నుంచి ఏలూరు ఇండోర్ స్టేడియం, అల్లూరి సీతారామరాజు స్టేడియంలో రైతు బజార్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. (పాలకుల నిర్లక్ష్యం ఖరీదు కరోనా!) నిత్యావసర వస్తువులు, కూరగాయల కొనుగోలు సమయంలో ప్రజలు ఒకరి నుంచి మరొకరు వీలైనంత సామాజిక దూరం పాటించాలని సూచించారు. ప్రతి షాపులోనూ, రైతు బజార్లలోనూ ధరల బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే నిత్యావసర వస్తువుల వాహనాలకు ఆయా జిల్లా కలెక్టర్ల అనుమతి ఉంటేనే జిల్లాలోకి అనుమతిస్తామని చెప్పారు. రైతు బజార్లు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ తెరిచి ఉంటాయని, పెట్రోల్ బంకుల్లో ఉదయం11 గంటల వరకూ విక్రయాలు జరుగుతాయని పేర్కొన్నారు. తహసీల్దార్లతో జేసీ వెంకట్రామిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ఈ నెల 29న రేషన్ సరుకుల పంపిణీకి ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారి చేసినట్లు తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖాధికారులతోనూ, డిస్ట్రిక్ రెస్పాన్స్ టీమ్తోనూ జేసీ-2 తేజ్ భరత్ సమావేశం అప్రమత్తంగా ఉండాలన్నారు. విధులకు గైర్హాజరు కావొద్దని వైద్య ఆరోగ్యశాఖాధికారులకు స్పష్టం చేశారు. అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారి వివరాలను 1800 233 1077 టోల్ ఫ్రీ నెంబరుకు చెప్పాలని జిల్లా వాసులకు జేసీ -2 సూచించారు. ఏలూరులో తెరిచి వున్న షాపులను మూయించిన కలెక్టర్ ముత్యాలరాజు జిల్లాలో పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వస్తున్న జనాలను పోలీసులు వెనక్కి పంపిస్తున్నారన్నారు. కరోనా పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లా అంతా లాక్ డౌన్ • వెలవెలబోయిన ఏలూరు, భీమరం, పాలకొల్లు, తాడేపల్లి గూడెం బస్టాండ్లు • ప్రధాన కూడళ్లు, రహదారులు నిర్మానుష్యం • తెరుచుకోని షాపింగ్ మాల్స్, వాణిజ్య సముదాయాలు • జిల్లాలో అన్ని ప్రాంతాల్లోనూ బ్లీచింగ్ చల్లించిన అధికారులు వైఎస్ఆర్ కడప జిల్లా ముఖ్యాంశాలు కడప రైతు బజార్లో జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, జాయింట్ కలెక్టర్ గౌతమిలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరల పట్టీలను పరిశీలించి, నిర్ణీత ధరలకే వినియోగదారులకు అమ్మాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించి ధరలను పెంచితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వ్యాపారులను హెచ్చరించారు. మధ్యాహ్నం కడప ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ పరిశీలించారు. ఐసోలేషన్ కొత్త వార్డుల ఏర్పాట్లను పరిశీలించారు. ఇప్పటికే ఐపిలో ఉన్న ఐసోలేషన్ వార్డులను, త్రోట్ స్వాబ్ శాంపిల్స్ తీసే రూములను పరిశీలించారు. అనుమానిత కేసులకు ఎలాంటి సర్వీసులను నిర్వహిస్తున్నారో.. కరోనా నోడల్ అధికారి డా.సురేశ్వర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అలాగే సర్జికల్ ఐసియు విభాగంలో సర్జికల్, పోస్ట్ ఆపరేటీవ్, పోస్ట్ ఆపరేటీవ్ ఆర్థ్రో యూనిట్లను పరిశీలించి అక్కడి పరిస్థితులను జీజీహెచ్ పర్యవేక్షకులు డా.గిరిధర్‌ను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కడప జడ్పీ కార్యాలయం వద్ద కరోనా నియంత్రణ పై నగర ప్రజలకు కడప డీఎస్పీ సూర్యనారాయణ అవగాహన కల్పించారు. "జనతా కర్ఫ్యూ" కొనసాగింపు వల్ల, సామాజిక దూరం, స్వచ్చంద గృహ నిర్బంధం వల్ల కలిగే ఫలితాలను వివరించారు. నగరంలో పలు చోట్ల పోలీసు అధికారులు రోడ్లపైనే అవగాహన కల్పిస్తున్నారు. లాక్డౌన్లో భాగంగా.. జిల్లాలో మూడవ రోజు "జనతా కర్ఫ్యూ" ఆశించిన మేరకు జరుగుతోంది. రెండవ రోజుతో పోలిస్తే మంగళవారం రోడ్డుపై జన సంచారం చాలా తక్కువగా కనిపిస్తోంది. కర్ఫ్యూ నిర్వహణ పోలీసుల కనుసన్నల్లో నిక్కచ్చిగా సాగుతోంది. చెక్ పోస్టుల్లో వాహనాల తనికీలు విస్తృతంగా జరుగుతున్నాయి. మార్కెట్లు షాపింగ్ కాంప్లెక్సులు మూతపడ్డాయి. నిత్యావసర సరుకుల అంగళ్ళు తప్ప ఉదయం 9 గంటల తర్వాత మూతపడ్డాయి. మద్యం, మాంసం దుకాణాలు రెండురోజులుగా పూర్తిగా మూతపడ్డాయి. నగరంలోని కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మానుష్యంగా ఉంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల కలాపాలు స్తంభించాయి. కీలకమైన శాఖల్లో షిఫ్టు విధానంలో విధులు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా.. అన్ని మండలాల్లో కూడా ఇదే పరిస్థితి. గ్రామ స్థాయిలో వైద్యాధికారులు పర్యవేక్షణలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, గ్రామ వాలంటీర్లు ఇంటింటి సర్వే ద్వారా ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల నుండి వచ్చిన వారి వివరాలను క్షుణ్నంగా జల్లెడ పడుతున్నారు. శ్రీకాకుళం: • కరోనా వ్యాప్తి నివారణకు సామాజిక బాధ్యతతో దాతలు విరాళాలు అందించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ పిలుపునిచ్చారు. ఆర్ట్స్ స్వచ్చంధ సంస్ధ, పి.వి.రామ్మోహన్ ఫౌండేషన్, డా.దానేటి శ్రీధర్, లయన్స్ శ్రీకాకుళం సెంట్రల్ శాఖ మంగళ వారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సామాజిక బాధ్యత క్రింద విరాళాలు అందజేసారు. జిల్లాలో స్వీయ గృహనిర్భందంలో ఉన్నవారికి 14 రోజులకు సరిపడే నిత్యావసర సరుకులను అందజేయుటకు, కరోనా బాధితులకు ఇతర సహాయ చర్యలు చేపట్టుటకు ఈ నిధులను ఉపయోగించుట జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. • కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా స్వీయ నిర్భంద గదులు (క్వారంటైన్) సిద్ధం చేసామని కలెక్టర్ జె నివాస్ చెప్పారు. విదేశాల నుండి 13 మంది సోమవారం జిల్లాకు రాగా, వారందరిని నిర్భంద గదులలో పెట్టామని తెలిపారు. వారితోపాటు ఈ నెల 21 తరువాత వచ్చిన మరో ఐదుగురిని ..మొత్తంగా 18 మందిని నిర్భంద గదుల్లో పెట్టామని పేర్కొన్నారు. మొత్తంగా ఇప్పటివరకు జిల్లాకు 859 మంది విదేశాల నుండి రాగా.. వారిలో ఇంకా 14 రోజుల గడువు పూర్తి కాని వారు 259 మంది వరకు మాత్రమే ఉన్నారని అన్నారు. • జిల్లా వ్యాప్తంగా రాకపోకలు నిషేధించామని, 144వ సెక్షన్ అమలులో ఉందని, జిల్లా యంత్రాంగం, పోలీసుల సూచనలు పాటించాలని ప్రజలను కోరారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన 52 మందిపై సోమ వారం కేసులు నమోదు చేసారని ఆయన తెలిపారు. • కరోనా ప్రభావం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ప్రజలకు, మీడియా మిత్రులకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఎక్కడా 5 గురు కంటే ఎక్కువ మంది గమిగూడరాదని.. అలాగే ప్రజలు ఇళ్ళ నుండి బయటకు రావద్దంటూ జిల్లా ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. • కరోనా వార్తలు కవరేజ్ చేయునపుడు వైరస్ సోకకుండా వ్యక్తి గత ముందుజాగ్రత్తలు తీసుకోవాలని మీడియా మిత్రులకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద కేసులు ఉన్నట్లు గుర్తించినా హడావిడిగా కవరేజికి వెళ్లవద్దని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కవరేజిలో ప్రభుత్వం సూచించిన నియమాలను పాటించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా .... • నెల్లూరు టౌన్ లో పాజిటివ్ కేసు కల్గిన వ్యక్తిని ఆసుపత్రి నుంచి ఇంటికి పంపారు • జిల్లా లో లాక్ డౌన్ ప్రకటించినందున ప్రజలు ఇళ్లలోనే ఉంటూ సహకరిస్తున్నారు • జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంది • జిల్లా కలెక్టర్ సూచన మేరకు ప్రజలు సకాలంలో పనులు ముగించుకుని త్వరగానే ఇళ్లకు • జిల్లా వ్యాప్తంగా రైతుబజార్లలో నిత్యవసరాలకు ఇబ్బంది లేకుండా ప్రజలకు అందుబాటులో సరుకులు • అధికారుల సూచన మేరకు ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు • ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో ఎవరూ లేరు • ముందస్తుగా స్వీయ గృహ నిర్భంధంలో ముగ్గురు (3) ఉన్నారు • హోం ఐసోలేషన్ లో 760 మంది ఉన్నారు • జిల్లాలో కొత్త కేసులు ఏమీ నమోదు కాలేదు • జిల్లా కలెక్టర్ వి.శేషగిరిబాబు ఆదేశాలతో నెల్లూరు కిమ్స్ ఆసుపత్రి లో 40 బెడ్స్ తో ప్రత్యేక ఐసోలేషన్ వార్డు • అత్యవసర సమయంలో వినియోగించుకోవడానికి వెంటిలేషన్ సౌకర్యం కల్పించారు • అత్యవసరాల కోసం, కాంటాక్ట్ ఫోన్ నెంబర్స్...0861 2326755,744,776,766,772 • కరోనా హెల్ప్ లైన్ నంబర్, 9618232115..టోల్ ఫ్రీ నెంబర్,1800 425 6773, 0861 2349991 కృష్ణాజిల్లా కరోనా నేపథ్యంలో కృష్ణ జిల్లా మొత్తం లాక్ డౌన్ లో ఉండిపోయింది. దీంతో రోడ్లన్నీ బోసిపోయాయి.సోమవారం కొంతమంది ప్రజలు రోడ్లపైకి రాగా మంగళవారం మాత్రం పోలీసుల హెచ్చరికలతో రోడ్లపైకి రాకుండా ఇంట్లోనే ఉండిపోయారు. ఉదయం మాత్రం నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం నగరాలకు వచ్చారు. కలెక్టర్ గారు కంట్రోల్ రూంలో ఉంటూ పరిస్థితులను సమీక్షించారు. మొత్తం 1153 మంది విదేశాల నుంచి జిల్లాకు రాగా, ఒక పాజిటివ్ కేసు నమోదు అయింది. 1092 మంది హోం ఐసోలేషన్ లో ఉండగా,14 మంది అనుమానితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 6 మంది ఆసుపత్రి నుంచి డిచార్జ్ అయ్యారు. విజయవాడ డివిజన్ విజయవాడలో ఉదయం మినహాయిస్తే 9 గంటల తరువాత పోలీసులు నగరంలోకి వచ్చే దారులన్నీ దిగ్బంధం చేశారు. దీంతో బయటి నుంచి ఎవరూ నగరంలోకి వచ్చే అవకాశం లేకుండాపోయింది. వన్ టౌన్లో పాజిటివ్ కేసు నమోదు కావడంతో మొత్తం 30 వార్డులపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఆయా వార్డులలో ఉన్న వారు అవసరానికి ఇంటి నుంచి ఒకరు మాత్రమే బయటకు రావాలని మిగిలిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదని ఆదేశాలిచ్చారు. ఆయా వార్డుల్లో వాలెంటరీలు, వైద్య సిబ్బంది వార్డు వాసులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. విజయవాడ డివిజన్ మొత్తం 16 క్వారైంటిన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. విజయవాడ సెంటర్, ఈస్ట్, వెస్ట్ లలో వంద పడకల చోప్పన ఏర్పాటు చేశారు. గుడివాడ డివిజన్: పోలీసులు లాక్ డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేశారు. అత్యవసరమైన వారిని మినహా ఎవరినీ రోడ్లపైకి రానివ్వలేదు. ఉదయం 6 నుంచి 10 వరకు నిత్యావసర వస్తువుల కొనుగోలుకు బయకు వచ్చేందుకు అవకాశం ఇవ్వడంతో కూరగాయల కొనుగోలు కోసం రైతు బజారులో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. డిఎస్పి సత్యానందం, ఆర్డివో జి శ్రీనివాసులు డివిజన్ ప్రాంతాలలో పర్యటించి 144 సెక్షన్ అమలను పర్యవేక్షించారు. మంత్రి శ్రీ కొడాలి నానీ డిఎస్పి, ఆర్డివోలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం రైతుబజారు వద్ద భారీ సంఖ్యలో ప్రజలు ఉండడాన్ని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రైతు బజారును ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేయడంతో పాటు వీలైనన్ని మొబైల్ రైతుబజార్లను ఏర్లాటు చేయాలని మంత్రి ఆదేశించారు. గుడివాడకు చెందిన ఒక కుటుంబం తమ కుమారుడు లండన్‌లోనే ఉండిపోయాడని, భారత్‌కు రప్పించాలని మంత్రికి విజ్ఞప్తి చేయగా.. ముఖ్యమంత్రితో మాట్లాడుతానని, భయపడకుండా ఉండాలని ధైర్యం చెప్పారు. ఇక144 సెక్షన్ అతిక్రమణకు సంబంధించి 1 కేసులు నమోదు అయిందని, గుడివాడ డివిజన్లో మొత్తం 202 మంది విదేశాల నుంచి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వారందరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నారని చెప్పారు. గుడివాడ పట్టణంలో 29 మంది విదేశాల నుంచి వచ్చిన వారు ఉండగా.. వీరందరికీ ప్రతిరోజు వైద్య సిబ్బంది పరీక్షలు వారి ఇంటివద్దకే వెళ్లి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం గుడివాడ ఏరియా హస్పటల్ లో 10 పడకల ఐసోలేషన్ వార్డు ఉండగా గుడివాడలోనే హోమియో హాస్పిటల్ లో 100 పడకల ఐసోలేషన్ వార్డు, కైకలూరు లో చైతన్య టెక్నో స్కూల్ లో 100 పడకలు, పామర్రు సమీపంలోని కూచిపూడి వద్ద వరస సంజీవనీ ఆసుపత్రిలో 100 పడకల వార్డులను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అంతేగాక ఆయా వార్డుల్లో వైద్య సిబ్బందిని త్వరలోనే కేటాయించనున్నట్లు చెప్పారు. న్యూజివీడు డివిజన్... న్యూజివీడు డివిజన్ లో లాక్ డౌన్ పూర్తి స్థాయిలో అధికారులు అమలు చేస్తున్నారు. ఉదయం నిత్యావసర వస్తువుల కోనుగోలు కోసం ప్రజలు బయటకు వచ్చారు. 10 గంటల తరువాత రోడ్లన్నీ నిర్మానుషంగా మారిపోయాయి. సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తిరువూరు సమీపంలో రాష్ట్ర సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన భద్రతను పర్యవేక్షించారు. . అనంతరం మండల కార్యాలయంలో పోలీసులు, వైద్య సిబ్బంది, అధికారులతో సమీక్ష నిర్వహించారు. . డివిజన్లో మొత్తం 301 మంది విదేశాల నుంచి వచ్చారు. వీరందరూ హోం ఐసోలేషన్ లో ఉన్నారు. . న్యూజివీడు, గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రులలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. కాగా మచిలీపట్నం డివిజన్లో ఉదయం 6 నుంచి 9 వరకు బయటకు వచ్చేందుకు అనుమతి ఉండడంతో ప్రజలు భారీ సంఖ్యలో రైతు బజారు వద్దకు చేరారు. దీంతో ఎస్పీ రవీంద్ర బాబు గారు ఏఎస్పీ, మున్సిపల్ కమిషనర్, ఆర్డివలతో సమావేశమై రైతు బజారును ప్రజలకు అందుబాటులో ఉండేలా పది ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఏఎస్పి, ఆర్డివోలతో కలిసి నగరంలో పర్యటించి లాక్ డౌన్‌ను పర్యవేక్షించారు. రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేయడంతో వీధులన్నీ జనసంచారం లేక బోసిపోయాయి. డివిజన్లో విదేశాల నుంచి మొత్తం 72 మంది వచ్చారు. వారందరూ హోం ఐసోలేషన్ లో ఉన్నారు. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో 20 పడకల ఐసోలేషన్ సెంటర్‌ను పెడన నియోజకవర్గంలో 18 పడకల ఐసోలేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా.. 1. కరోనా గురించి తాజా అప్ డేట్ : ఇప్పటి వరకు జిల్లాలో ఎటువంటి పాజిటివ్ కేసు నమోదు కాలేదు..మొతం 21 మంది అనుమానుతుల్లో 5గురికి నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది..మిగితా 16 మందికి రిపోర్టు రావాల్సి ఉంది..జిల్లా అంతటా అధికారులు కరోనా వ్యాధి ప్రభలకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.. ప్రజలని అప్రమత్తం చేస్తూ కరోనా నివారణ చర్యలు చేపడుతున్నారు 2. పాజిటివ్ కేసుల సంఖ్య: 0 3. నెగెటివ్ కేసుల సంఖ్య : 5 4. ఐసోలేటెడ్ వార్డుల సంఖ్య: 05 5. ఈ వార్డుల్లో దాదాపు 200 బెడ్స్‌ను ABCలుగా వర్గీకరించారు.. దాదాపు 2500 మంది విదేశాల నుంచి జిల్లాకు వచ్చినట్లు సమాచారం.. వీరిలో 100మందిని B కేటగిరిలో, మరో 53 మందిని C కేటగిరీలో మిగితా వారిని A కేటగిరీ గృహ నిర్బంధ రక్షణ లో ఉంచినట్లు సమాచారం. 6. రవాణా వ్యవస్థ పనితీరు: జిల్లాలో 100శాతం లాక్ డౌన్ అమలౌతుంది..ఎక్కడిక్కడ చెక్ చేస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు. 7. నిత్యవసర రేట్ల గురించి: సాధారణంగా నే ఉన్నాయి. 8. ఆరోగ్యశాఖ అధికారుల పనితీరు: రౌండ్ ది క్లాక్ పనిచేస్తున్నారు.. జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 9. పోలీసుల పనితీరు: స్ట్రాంగ్ ఉంది. ద్విచక్ర వాహనాలను కూడా కట్టడి చేస్తూ ఎక్కువ మంది గుమి కూడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. 10. కలెక్టర్ సమీక్షలు ( డివిజన్ వైజ్) : జిల్లాలోని దేవాలయాలు, మసీదులు, చర్చ్ ల వద్ద ఉండే బిచ్చగాళ్ల బాగోగులు, ఆరోగ్యం గురించి వాళ్లని స్వచ్ఛంద సేవా సంస్థలు (NGOs)కి అప్పగించే విధంగా ఈరోజు వాళ్లతో సమావేశమై తగిన చర్యలు తీసుకటున్నారు.. జిల్లాలో 16 కరోనా మేనేజ్మెంట్ టీంలను ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన చర్యలు, ముఖ్యంగా కమ్యూనికేషన్, రవాణా, శానిటేషన్, ఆర్ధికపరమైన అంశాలు,నిత్యవసత సరుకులు వంటి వాటికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు.. జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కరోనా మీద ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ఆధికారులకు తగిన విధంగా సూచనలిస్తూ కరోనా కట్టడికి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. విశాఖపట్నంజిల్లా • విశాఖలో హైఅలెర్ట్ ప్రకటించిన జిల్లా యంత్రాంగం • జిల్లాలో 20 కమిటీలు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్న కలెక్టర్ • అత్యవసర సేవల వాహనాలకు మాత్రమే అనుమతి • నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు • హోం క్వారంటైన్ లో ఉన్నవారు బయటకు వస్తే కేసులు • ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేలా విశాఖ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు :08912590102 • అందుబాటులోకి ప్రభుత్వ కార్యాలయం నంబర్లు (విశాఖ DM & HO ఆఫీస్) : 9949379394, 9666556597 విశాఖ జిల్లాలో ఇప్పటి వరకు ప్రభుత్వ దృష్టిలో కి వచ్చిన కరోనా బాధితులు • కరోనా పాజిటివ్ కేసులు : 3 • ఐసోలేషన్ లో ఉన్నవారి సంఖ్య : 31 • ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల సంఖ్య : 12 కరోనా నివారణకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సందర్శించిన మంత్రులు విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్‌లో కరోనా నివారణకు ఏర్పాటు చేసిన కరోనా కంట్రోల్ రూంను మంగళవారం తనిఖీ చేసిన AP డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య, శాఖ మంత్రి ఆళ్ల నాని, విశాఖపట్నం ఇంచార్జి మంత్రి కె కన్నబాబు, టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్, కంట్రోల్ రూమ్ పని తీరు... విశాఖపట్నం జిల్లాలో ఇప్పటివరకు ఎన్ని కరోనా అనుమానితులు కేసులు నమోదు అయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నుంచి మంత్రి ఆళ్ల నాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా రానున్న రోజులు చాలా కీలకమని, ఎప్పటికప్పుడు, కరోనా వైరస్ నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి అదేశించారు. మంత్రుల సమీక్ష... విశాఖ జిల్లాలో 3 పాజిటివ్ కేసులు నమోదు, కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు. విశాఖ కరోనా నియంత్రణ సోమవారం ఆయన అధికారులతో, వైద్య ఆరోగ్య శాఖతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. కరోనా నియంత్రణలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని, కరోనా నియంత్రణకు ప్రజలు సామజిక దూరం పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలకు ఎన్ని పనులు ఉన్నా ఇంట్లోనే ఉండాలని, ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. కరోనా నియంత్రణకు విశాఖలో 20 కమిటీలు నియమించామని, విదేశాలనుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా రిపోర్ట్ చేయాలని చెప్పారు. నిబంధనలను పాటించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, రైతు బజార్లలో అధిక ధరలకు అమ్మితే లైసెన్సులు రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇక మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. కరోనాను చంద్రబాబు రాజకీయానికి వాడుకుంటున్నారు మండిపడ్డారు. చంద్రబాబు ధోరణి ఆక్షేపణీయమని, కరోనాను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న బాబు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ధ్వజమెత్తారు. కరోనాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి 2 గంటల కోసారి సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు రాజకీయాలు మానుకోవాలని తాము ప్రచారం కంటే పని చేయడానికే ప్రాధాన్యతనిస్తామని మంత్రి పేర్కొన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కరోనాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. విశాఖ ప్రజలకు నిత్యావసర వస్తువులు పూర్తిస్థాయిలో అందిస్తామని చెప్పారు. పేదలకు ఎలాంటి మేలు చేయాలో ప్రతిదీ చేస్తామని, పేదలను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. లాక్ డౌన్ కు ప్రజలు సహకరించాలని, అవసరం లేకుండా ప్రజలు రోడ్ల పైకి రావొద్దని సూచించారు. ఇక కరోనాపై మీడియా అవాస్తవాలు ప్రచారం చేయొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. కరోనా విలయం : చైనాపై భారీ పరిహారం కోరుతూ కేసు ప్రకాశం జిల్లా కరోనా వైరస్‌ను ఎదుర్కొవటానికి జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ పేర్కొన్నారు. ప్రకాశంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒంగోలులోని భాగ్యనగర్‌కు చెందిన మహిళా సాధికారిత భవనాన్ని క్యారంటైన్ కేంద్రంగా మార్చారమని చెప్పారు. వైరస్ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలు అర్ధం చేసుకుని సహకరించాలన్నారు. నిత్యవసరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు బజార్లను ఏర్పాట్లు చేశామన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలని పిలుపు నిచ్చారు. ముందస్తు జాగ్రత్త చర్యలతో వ్యాధిని పూర్తిగా అరికట్టవచ్చని కలెక్టర్ సూచించారు. జనతా కర్ఫూ స్ఫ్యూర్తితో జిల్లా ప్రజలు మార్చి 31 వరకు స్శచ్ఛంధ ఈ కర్ఫ్యూ పాటించాలని కోరారు. నిత్యవసరాల కోసం ఇంటికి ఒకరు చొప్పున మాత్రమే వచ్చి సరుకులు కొనుగోలు చేయాలన్నారు. ఈ రోజు నుంచి మంగళవారం వరకు జిల్లాలో 144 వ సెక్షన్ అమలు చేస్తున్నామని చెప్పారు. జనసంచారాన్ని, వాహనాల నియంత్రణను పూర్తిగా అరికడతామన్నారు. విదేశీ ప్రాంతాల నుంచి 576 మంది వ్యక్తులు జిల్లాకు వచ్చారని వారందర్నీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని తెలిపారు. జిల్లాను ఏడు జోన్లుగా విభజించి ఉప కలెక్టర్లతో ఏడు బృందాలను నియమించామని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ను జిల్లా నుంచి తరిమికొట్టడానికి ప్రజలంతా ఇళ్లలోనే ఉండి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. -
విశాఖలో కోలుకుంటున్న కోవిడ్ బాధితుడు
సాక్షి, విశాఖపట్నం/గన్నవరం/వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ)/నెల్లూరు అర్బన్: విశాఖలో కోవిడ్ బారినపడిన వృద్ధుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ శుక్రవారం స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చిన ఆ వృద్ధుడికి గురువారం కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆయన నివాసం ఉంటున్న అల్లిపురం ప్రాంతం మొత్తాన్ని వైద్యారోగ్య శాఖ తమ ఆధీనంలోకి తీసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచే అల్లిపురం వివేకానంద కాలనీలో బ్లీచింగ్, ఫాగింగ్ పనులు చేపట్టారు. వార్డు వలంటీరు, ఏఎన్ఎం, ఆశావర్కర్ ఒక టీమ్‌గా మొత్తం 141 బృందాల్ని ఏర్పాటు చేశారు. బాధితుడి సన్నిహితులు 11 మందిని క్వారంటైన్‌కు తరలించారు. ఫ్రాన్స్ నుంచి వచ్చిన విద్యార్థిని హైదరాబాద్‌కు తరలింపు ఫ్రాన్స్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఓ విద్యార్థినిని కోవిడ్ వైద్య పరీక్షల అనంతరం శుక్రవారం అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్‌కు చెందిన సంజనారాజ్ ఉన్నత చదువుల నిమిత్తం ఫ్రాన్స్‌కు వెళ్లింది. కృష్ణా జిల్లాలోని సన్నిహితుల ఇంటికి వెళ్లేందుకు ఎయిరిండియా విమానంలో 19వ తేదీ రాత్రి గన్నవరం చేరుకుంది. విమానాశ్రయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ యువతితోపాటు ఇతర దేశాల నుంచి వచ్చిన మరో ఐదుగురు విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. వీరికి వైరస్ లక్షణాలు నిర్ధారణ కానప్పటికీ ఇంటర్నేషనల్ టెర్మినల్‌లోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. స్వీయ గృహ నిర్బంధంలో ఉండేందుకు ఐదుగురిని అంబులెన్స్‌లో వారి స్వస్థలాలకు పంపారు. అలాగే విజయవాడ పాతబస్తీకి చెందిన హేమంత్ (23) ఉన్నత విద్య అభ్యసించేందుకు ఏడాది క్రితం పారిస్ వెళ్లాడు. కోవిడ్ ప్రభావంతో ఈ నెల 16న విజయవాడ వచ్చాడు. రెండు రోజులుగా అతడు జ్వరంతో బాధపడుతుండటంతో వైద్యులు అతడిని శుక్రవారం ఆస్పత్రికి తరలించారు. అబుదాబి నుంచి వచ్చిన ఆరుగురు నెల్లూరు ఆస్పత్రికి తరలింపు కాగా, అబుదాబి (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) నుంచి శుక్రవారం చెన్నై ఎయిర్‌పోర్టుకు, అక్కడ నుంచి నెల్లూరు చేరుకున్న ఆరుగురిని పరీక్షల నిమిత్తం అధికారులు సర్వజనాస్పత్రికి తరలించారు. వీరంతా ఉభయగోదావరి, విశాఖ జిల్లాలకు చెందినవారు. -
‘అతను చనిపోయాడన్న వార్తలు అవాస్తవం’
సాక్షి, విశాఖపట్నం : జిల్లా వ్యాప్తంగా కరోనా వైరస్‌కు సంబంధించి అప్రమత్తంగా ఉన్నామని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. విశాఖ నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులన్నింటిలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విశాఖలో కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తి క్షేమంగానే ఉన్నాడని చెప్పారు. ఐసోలేషన్ వార్డులో బాధితుడికి చికిత్స కొనసాగుతుందని వెల్లడించారు. అతను చనిపోయాడనే వార్తలు అవాస్తమని.. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. విశాఖ నగరంలో క్వారంటైన్ కోసం నాలుగు వేల బెడ్స్ని సిద్ధం చేస్తున్నామన్నారు. ఇందులో 500 పైగా బెడ్స్ని ఐసోలేషన్ కోసం వినియోగించుకోనున్నట్టు చెప్పారు. విశాఖలో ఒక పాజిటివ్ కేసు నమోదైందని.. ఈ నేపద్యంలో 115 బృందాలతో మరొకసారి కొన్ని ప్రాంతాలలో ఇంటింటి సర్వే చేపడుతున్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి నెలాఖరువరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్, మాల్స్ మూసివేశామన్నారు. కరోనాపై ఎవరూ భయాందోళనలు చెందవద్దని.. కరోనాపై ప్రజలకి అవగాహన కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. విద్యార్థులు ఇంటి వద్దే ఉండాలి : ఏయూ రిజిస్టార్ కరోనా దృష్ట్యా ఆంధ్ర్ర యూనివర్సిటీ, దాని అనుబంధ కళాశాలలు, హాస్టళ్లు మూతపడ్డాయి. హాస్టళ్లను ఖాళీ చేయించిన అధికారులు 9 వేల మందికి పైగా విద్యార్థులను, పరిశోధకులను స్వస్థలాలకు తరలించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు యూజీసీ ఆదేశాల ప్రకారం మార్చి 31వరకు విద్యార్థులతోపాటు, టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు సెలవు ప్రకటిస్తున్నట్టు రిజిస్టార్ కృష్ణమోహన్ తెలిపారు. మార్చిలో యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్టు స్పష్టం చేశారు. మార్చి 31 తర్వాత సమీక్ష అనంతరం తదుపరి కార్యచరణ ప్రకటిస్తామన్నారు. స్వస్థలాలకు వెళ్లిన విద్యార్థులు బయట తిరగకుండా ఇంటి వద్దే ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దు : మంత్రి అవంతి కరోనా వైరస్‌పై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రజలను కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా నగరంలోని వివిధ రంగాల ప్రతినిధులతో శుక్రవారం మంత్రి అవంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్‌కు అతిగా భయపడవద్దని, అలా అని నిర్లక్ష్యం కూడా వహించవద్దని తెలిపారు. కరోనా వైరస్ గాలి ద్వారా సోకదని.. ఒకరినొకరు ముట్టుకోవడం వలన వ్యాపిస్తుందని చెప్పారు. మార్చి 31వ తేదీ వరకు అత్యవసర పని ఉంటే తప్ప నగరవాసులు బయటకు రావద్దని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రజలంతా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. పెళ్లిలు, ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకుంటే మంచిదని సూచించారు. ప్రజలు సభలు, సమావేశాలకు దూరంగా ఉండాలని కోరారు. విద్యాసంస్థలు తప్పకుండా సెలవులు ప్రకటించాలన్నారు. చదవండి : ప్రముఖ బాలీవుడ్ సింగర్‌కు కరోనా పాజిటివ్ తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా -
‘నీతి నిజాయితీ ఉంటే డీజీపీకి ఫిర్యాదు చేయాలి’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు తనకు అనుకూలమైన వారితో స్థానిక ఎన్నికలు వాయిదా వేయించారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రెండు రోజులు సమయం ఉంటే ఎన్నికలు పూర్తయ్యేవి అని ఆయన తెలిపారు. కోర్టు చెప్పిన తీర్పును చంద్రబాబు వక్రీకరిస్తున్నారని అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. సుప్రీం కోర్టు ఎన్నికలు వాయిదా వేసి, ఎన్నికల కోడ్‌ను ఎలా కొనసాగిస్తారని ఎలక్షన్ కమిషన్‌ను ప్రశ్నిందన్నారు. గ్లోబల్ ప్రచారం చేసి స్థానిక ఎన్నికలు వాయిదా వేయించారని అవంతి మండిపడ్డారు. నకిలీ లేఖను సృష్టించి, ఎన్నికల కమిషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వానికి రాశారని ఆయన ధ్వజమెత్తారు. (పచ్చ మీడియాకు లెటర్ ఎందుకు పంపారు!) నిమ్మగడ్డ రమేష్ తనకు ఆ లేఖతో సంబంధం లేదని చెబుతున్నారు, కానీ ఆయనకు నీతి నిజాయితీ ఉంటే దీనిపైన డీజీపీకి ఫిర్యాదు చేసి లేఖ రాసిన వారిమీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరాలన్నారు. ఆ లేఖ వెనుక పెద్ద కుట్ర ఉందని అవంతి శ్రీనివాస్ ఆగ్రహించారు. గ్రూప్ మీటింగ్ పెట్టొద్దని ఎన్నికల కమిషన్ చెప్పిందని చంద్రబాబు అంటున్నారు. కానీ అమరావతిలో మీరు ఎలా ధర్నాలు చేస్తున్నారని ఆవంతి సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు మనస్తత్వం మార్చుకుని దుష్ప్రచారం చేయడం మానుకోవాలని అవంతి హితవు పలికారు. చంద్రబాబు రాష్ట్రం పరువు ప్రతిష్టలు, బ్రాండ్ ఇమేజ్ పోయే విధంగా చేస్తున్నారని అవంతి శ్రీనివాస్ దుయ్యబాట్టారు. (ఎన్నాళ్లు తప్పించుకుంటావ్ బాబూ?) -
జీవీఎంసీ ఎన్నికలు: వైఎస్సార్సీపీ తొలి జాబితా
-
విశాఖలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు
-
ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు టీడీపీ కుట్ర..
-
చంద్రబాబుకు మంత్రి అవంతి సవాల్
సాక్షి, విశాఖపట్నం: ‘పులివెందుల నుంచి ఒక్కరు వచ్చినట్లు నిరూపించకపోతే.. చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా’ అంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ సవాల్ విసిరారు. ఆయన నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమన్నారు. ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు తన స్వార్థం కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకి ప్రభుత్వం పూర్తిగా రక్షణ కల్పించిందని.. పోలీసులపై చంద్రబాబు,లోకేష్ విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. పోలీసులు చట్టానికి లోబడే పనిచేస్తారని తెలిపారు. ఇళ్లకి వచ్చి దౌర్జన్యాలు చేస్తామని లోకేష్ అనడం దారుణమన్నారు. ఆయన వ్యాఖ్యల వల్లే ఉత్తరాంధ్ర ప్రజలు చంద్రబాబును అడ్డుకున్నారని పేర్కొన్నారు. అన్ని జిల్లాలు, ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అవంతి చెప్పారు.(ఉరిమిన ఉత్తరాంధ్ర) ఆ విషయంపై తేల్చిచెప్పాలి.. విశాఖ పరిపాలన రాజధానికి టీడీపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతారో లేదో తేల్చి చెప్పాలన్నారు. విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు అమరావతికే మద్దతు తెలిపితే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ‘‘చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. ఆయనపై ఉత్తరాంధ్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. మండు టెండలో ఆరు గంటల పాటు ప్రజలు ధర్నా చేశారు. పోలీసులు, మహిళలపై చంద్రబాబు తీరు దారుణంగా ఉంది. లోకేష్ సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని’’ అవంతి శ్రీనివాస్ తీవ్రంగా దుయ్యబట్టారు. మండలిలో ‘మూడు రాజధానుల బిల్లుల’ను టీడీపీ వ్యతిరేకించడంపై ఉత్తరాంధ్ర ప్రజలు ఆవేశంగా ఉన్నారన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులని చంద్రబాబు అనుకున్నారని..కానీ ఇది ఉద్యమాలకు పుట్టినిల్లు అని అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. (ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు) -
‘ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు బాబు ప్లాన్’
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర ప్రజలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవమానిస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పబ్లిసిటీ కోసమే చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని, ఎల్లో మీడియాతో విశాఖపై దుష్పచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. కాగా ప్రజలను రెచ్చగొట్టి బాబు అబ్ది పొందాలని చూస్తున్నారని, ఇప్పటికైన ఆయన తీరు మార్చుకోవాలన్నారు. బాబుకు విశాఖ ప్రజల ఓట్లు కావాలి కానీ.. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కు మాత్రం వ్యతిరేకి అన్నారు. అమరావతితో పాటు రాష్ట్రం బాగుపడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరుకుంటుంటే.. బాబు మాత్రం తాను మాత్రమే బాగుపడాలని కోరుకుంటున్నారన్నారు. అభివృద్ధి అంతా హైదరాబాద్‌లో కేంద్రీకరించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి జరగలేదన్నారు. ఇక సీఎం జగన్‌కు మంచిపేరు వస్తుందనే బాబు అభివృద్ధి వికేంద్రీకరణను అడ్డుకుంటున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. పెల్లుబికిన ప్రజాగ్రహం.. విశాఖకు జైకొడితేనే.. ఇక ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అని, ఆయనకు అమరావతి తప్ప రాష్ట్రాభివృద్ధి అవసరం లేదని ధ్వజమెత్తారు. ఇక బాబుపై ప్రజాగ్రహం పెల్లుబికిందని అందుకే ఎయిర్‌పోర్టులో బాబును ప్రజలు అడ్డుకున్నారని విమర్శించారు. అరగంట పాటు విమానాశ్రమంలో ఉండాలని పోలీసులు సూచించినా బాబు పట్టించకోలేదన్నారు. ప్రజలను రెచ్చగొట్టి అబ్ధిపోందేందుకు చంద్రబాబు ప్రణాళికలు చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. -
సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభం
సాక్షి, ప్రకాశం: ‘సీఎం కప్’ పేరుతో క్రీడా పోటీలు జరపడం ఆనందదాయకమని రాష్ట్ర ఇంధన, అటవీ, శాస్త్ర, పర్యావరణ, సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతోపాటు ఉద్యోగాల్లో కోటా కూడా ఉంటుందన్నారు. ఆదివారం ఉదయం ఆయన ఒంగోలులోని స్థానిక మినీ స్టేడియంలో క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్చి 7, 8వ తేదీల్లో జిల్లాలో జరిగే బీచ్ ఫెస్టివల్ క్రీడల పోటీలో అందరూ ఉత్సాహంగా పాల్గొనాలన్నారు.(‘సీఎం కప్ పేరుతో క్రీడలు నిర్వహిస్తాం’) ఈ కార్యక్రమానికి హాజరైన పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు మీద క్రీడలు జరపడం ఇదే తొలిసారని సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థి శక్తి ఏంటో తనకు బాగా తెలుసన్నారు. సీఎం జగన్ ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని పేర్కొన్నారు. ఆటలు పిల్లల హక్కని.. ఆడించకపోతే స్కూళ్ల మీద విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేయండని సూచించారు. ఇక మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావిస్తూ.. సీఎం జగన్ మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. దీనిపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ రాజధాని విషయంలో టీడీపీ అనవసర ఆరోపణలు చేస్తుందని విమర్శించారు. ‘మొన్న కేంద్రం ఒప్పుకోదన్నారు.. నేడు నేవీకి అభ్యంతరం అన్నారు.. రేపు అమెరికాకు, చంద్రమండలానికి అభ్యంతరం అంటారు. చంద్రబాబు అభ్యంతరాలు మాకు అక్కర్లేదు, రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమ’ని అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు.(కార్పొరేట్ శక్తులకు బీజేపీ ఊడిగం) -
‘సీఎం కప్ పేరుతో క్రీడలు నిర్వహిస్తాం’
సాక్షి, తిరుమల: సీఎం కప్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక క్రీడాకారులను ప్రోత్సహించేలా క్రీడలు నిర్వహిస్తామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆయన శనివారం తిరుమల శీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని వేడుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో క్రీడలు నిర్వహించి ఫైనల్‌ను విజయవాడ లేదా వైజాగ్‌లో నిర్వహిస్తామని అవంతి పేర్కొన్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా బహుమతి అందచేస్తామని ఆయన తెలిపారు. ప్రైజ్‌మనీ కింద మొదటి బహుమతి రూ. 5 లక్షలు, రెండవ బహుమతి రూ. 2 లక్షలు, మూడవ బహుమతి రూ. 1 లక్ష క్రీడకారులకు అందచేస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. (అరకు ఉత్సవ్ పోస్టర్‌ను విడుదల చేసిన అవంతి శ్రీనివాస్) -
అరకు ఉత్సవ్ పోస్టర్‌ను విడుదల చేసిన అవంతి శ్రీనివాస్
-
వికేంద్రీకరణతోనే ప్రగతి
మూడు రాజధానుల నినాదం రాష్ట్రమంతటా మార్మోగింది. పాలన, అధికార వికేంద్రీకరణ ఉపయోగా లను చాటుతూ సదస్సులు నిర్వహిం చారు. పలుచోట్ల ర్యాలీలు కొనసాగాయి. మూడు రాజధానులకు మోకాలడ్డుతూ చంద్రబాబు చేస్తున్న రాద్ధాంతంపై ప్రజాసంఘాల నేతలు, మేధావులు విరుచుకుపడ్డారు. – సాక్షి నెట్వర్క్ విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ స్నాతకోత్సవ మందిరంలో ‘అధికార వికేంద్రీకరణతో అభివృద్ధి’ అనే అంశంపై బుధవారం సదస్సు నిర్వహించారు. విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల సమానాభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తిప్పల నాగిరెడ్డి, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు హాజరై సంఘీభావం తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎన్నార్ కళాశాలలో ‘పరిపాలన వికేంద్రీకరణ–రాష్ట్రాభివృద్ధి’ అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు మేధావులు, విద్యార్థి సంఘాల నేతలు హాజరై మూడు రాజధానుల ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యమని ఘంటాపథంగా చెప్పారు. కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు గోకరాజు వెంకట నర్సింహరాజు, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఫ్రొఫెసర్ డాక్టర్ పి.రామకృష్ణంరాజు, ఓఎన్జీసీ రిటైర్డ్ జనరల్ మేనేజర్ పి.విజయకుమార్, డీఎన్నార్ పాలకవర్గ కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు), విద్యావేత్త అలుగు ఆనందశేఖర్ తదితరులు మాట్లాడారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ గుంటూరు నాగార్జున యూనివర్సిటీలోని అంబేడ్కర్ విగ్రహానికి విద్యార్థులు వినతిపత్రం సమర్పించారు. మూడు రాజధానులకు మద్దతుగా రైతులు, యువత ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలోని కానూరు నుంచి ఉయ్యూరు సెంటర్ వరకు భారీ ర్యాలీ జరిగింది. ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారధి, జోగి రమేష్, కైలే అనిల్‌కుమార్, దూలం నాగేశ్వరరావు పాల్గొని సంఘీభావం తెలిపారు. చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విప్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. -
అరకు ఉత్సవాల పోస్టర్ విడుదల
సాక్షి, విశాఖపట్నం : అరకు ఉత్సవాల పోస్టర్‌ను పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ బుధవారం విశాఖలో విడుదల చేశారు. ఈ నెల 29 నుంచి రెండు రోజులపాటు జరిగే ఉత్సవాల కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేయగా.. నేడు ఉత్సవాల షెడ్యూల్‌ను మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవితో పాటు అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. -
టీడీపీ నేతలను నిలదీయండి: మంత్రి అవంతి
సాక్షి, విశాఖపట్నం: గత ఐదేళ్ల టీడీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని.. టీడీపీ నేతలు త్వరలో చేపట్టనున్న జన చైతన్య యాత్రలో వారిని నిలదీయాలని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖ నార్త్, కంచరపాలెంలో మూడవ విడత వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉత్తర నియోజకవర్గంలో ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే ఎక్కడని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ముందుంటారని తెలిపారు. ఆయన హామీలను కేవలం 8 నెలల్లో అమలు చేసి చూపిస్తున్నారని పేర్కొన్నారు. కంటి వెలుగు ద్వారా జిల్లాలో నాలుగు లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించామని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు.(ప్రజల దృష్టి మళ్లించేందుకే.. ఆ యాత్ర) -
పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది: మేకపాటి
సాక్షి, విశాఖపట్నం: పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించే వాతావరణం విశాఖలో ఉందని, ఇక్కడ చక్కటి వనరులు ఉన్నాయని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. విశాఖలోని నోవాటెల్ హోటల్లో యునైటేడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(యుఎన్‌ఐడీఓ), డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ)తో మంగళవారం జరిగిన అవగాహన సదస్సులో మంత్రితో పాటు పరిశ్రమల, ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరుకుంటున్నారని, అందుకే అభివృద్ధిని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేవారికి కేవలం 48 గంటల్లో అన్ని అనుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామన్నారు. పారిశ్రామికాభివృద్ధి ప్రణాళిక, ప్రచార ఆవశ్యకత, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల నవీకరణ, పర్యావరణ వ్యవస్థ, వాణిజ్య తదితర అంశాలపై నేడు ఈ సదస్సులో చర్చించనున్నట్లు మంత్రి తెలిపారు. పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇక రేపు(బుధవారం) విశాఖలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పర్యటించనున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటు నియోజకవర్గాల వారిగా నైపుణ్య శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్యాలయాలు, విశ్వవిద్యాలయాల్లో పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేసే విద్యా విధానంతో ముందుకు వెళ్తున్నామన్నారు. పారదర్శకత పాలన రాష్ట్రంలో ఉందని, వైఎస్సార్ నవోదయ పథకంతో వందలాది సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. 2024నాటికి పారిశ్రామిక అభివృద్ధి సూచిలో రాష్ట్రం ముందుంటుందన్నారు. ఆహార ఉత్పత్తులు వాణిజ్యం పెంచడంతో పాటు వ్యవసాయ రంగ అభివృద్ధికి బాటలు వేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే విశాఖ ప్రపంచ స్థాయి మహానగరంగా అవతరిస్తుందని తాను నమ్ముతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. -
అందుకే గతంలో కేంద్రం నిధులు ఆపేసింది..!
-
అందుకే గతంలో కేంద్రం నిధులు ఆపేసింది..!
సాక్షి, విశాఖపట్నం: పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. టీడీపీ నేతలు భూ సేకరణను అడ్డుకుంటున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. శనివారం ఆయన విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా పారదర్శకంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు. జిల్లాలో లక్షా 75వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇస్తామన్నారు. వైఎస్సార్ నవశకంలో 16 రకాల సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆర్పీలకు మరో వారం రోజుల్లో జీతాలు చెల్లిస్తామని.. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా చెల్లిస్తామని ఆయన పేర్కొన్నారు. (బాబు బండారం బయటపడటంతో ఎదురుదాడి) స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ రాజకీయాలు చేస్తోందని మంత్రి అవంతి మండిపడ్డారు. చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో ఐటీ సోదాలు చేస్తే రూ.2 వేల కోట్లు అవినీతి బయటపడిందన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ల అవినీతి ప్రధాని మోదీ దృష్టికి కూడా వెళ్లిందని పేర్కొన్నారు. రాష్ట్రానికి నిధులు లేవంటునే మరో వైపు దోచుకున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు,లోకేష్ దోపిడీ వల్లే కేంద్రం గతంలో నిధులు ఆపేసిందన్నారు. పక్క రాష్ట్రాల్లో బీజేపీని ఓడించడానికి చంద్రబాబు డబ్బులు పంపారన్నారు. రెండున్నర లక్షల కోట్లు అప్పులు చేసి చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాలకు చేకూర్చుకున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శించారు. (బాబును కాపాడాలనేదే పచ్చపత్రికల తాపత్రయం) -
తక్షణం బాబు, లోకేశ్‌ల పాస్‌పోర్టులు తీసుకోవాలి