సాక్షి, విశాఖపట్నం: ఎల్‌జీ పాలిమర్స్ పరిసరాల్లో సాధారణ పరిస్థితి నెలకొని, పూర్తిగా అదుపులోకి వచ్చిందని మంత్రులు అవంతి శ్రీనివాస్, గుమ్మనూరు జయరామ్, ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మంత్రులు ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనా స్థలాన్ని శనివారం పరిశీలించారు. అనంతరం మంత్రి అవంతి శీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ఎల్‌జీ పాలిమర్స్ పరిసరాల్లో సాధారణ పరిస్థితి నెలకొందన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. వదంతులను నమ్మొద్దు, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అవంతి శ్రీనివాస్ చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. (గ్యాస్ లీక్ బాధితులు కోలుకుంటున్నారు: కన్నబాబు)
పరిస్థితి అదుపులో ఉంది: డీజీపీ గౌతమ్ సవాంగ్
ఎల్‌జీ పాలిమర్స్‌ను గ్యాస్ లీకేజీ ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీజీపీ గౌతమ్ సవాంగ్ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మధ్యాహ్నానికల్లా ఢిల్లీ నుంచి నిపుణుల బృందం వస్తుందని ఆయన చెప్పారు. నిపుణుల బృందం పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకుంటామని డీజీపీ తెలిపారు. బయట నుంచి కొంతమంది వచ్చి కావాలనే ఆందోళన చేస్తున్నారని ఆయన తెలిపారు. అధికారులు చేస్తున్న పనులకు ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. (అప్రమత్తతతోనే ముప్పు తప్పింది )
Comments
Please login to add a commentAdd a comment