darmana krishna das
-
‘రాజకీయాల్లో పవన్ కల్యాణ్ హాస్య నటుడిలా తయారయ్యాడు’
సాక్షి, శ్రీకాకుళం: పవన్ కల్యాణ్ గురించి మాట్లాడి అనవసరంగా పెద్దవాడిని చేస్తున్నారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శనివారం జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ కల్యాణకు రాజకీయ చతురత, అనుభవం ఏముందని సూటిగా ప్రశ్నించారు. రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి గురించి ఇన్నిసార్లు మాట్లాడాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. పవన్‌కు స్థిరత్వం లేదని, బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తూ తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ ఓట్లు వేయించాడని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ పరిణితి చెందిన రాజకీయవేత్త కాదని, పవన్ నామమాత్రమైన ఓట్లు మాత్రమే ప్రభావితం చేయగల నాయకుడని మండపడ్డారు. అసందర్భ ప్రేలాపన, అవసరంలేని వాగుడు పవన్‌కు వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు. పవన్ వ్యవహార శైలిని ప్రజలు హర్షించడం లేదని, సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తులే పవన్ కల్యాణ్‌ను వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉందిన ఎద్దేవా చేశారు. తనకున్న అభిమానులతో కలిసి పార్టీ పెట్టి కాలక్షేపం చేస్తున్నాడని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ అవసరానుకూలంగా మారిపోయే సైడ్ యాక్టర్ ఎద్దేవా చేశారు. ఒకసారి టీడీపీతో, మరోసారి బీజేపీతో కలిసి పవన్ రకరకాల విన్యాసాలు చేస్తున్నాడని మండిపడ్డారు. -
ఏపీ: సమగ్ర సర్వేతో భూ వివాదాలకు చెక్: మంత్రులు
సాక్షి, అమరావతి: జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్షపై మంత్రుల కమిటీ శుక్రవారం సమావేశమైంది. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, వందేళ్ల తర్వాత తొలిసారి ఈ తరహా సమగ్ర సర్వే జరుగుతుందన్నారు. జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్షతో భూ వివాదాలకు చెక్ పడుతుందని మంత్రులు అన్నారు. ఆధునిక డ్రోన్, రోవర్ల సహకారంతో భూ సర్వే నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భూ సర్వేకు రాష్ట్రంలో 70 కోర్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. ముందుగా గ్రామాల సరిహద్దుల గుర్తింపునకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రులు వివరించారు. సమగ్ర సర్వే కోసం 12వేల మంది సిబ్బందికి శిక్షణ పూర్తి చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 736 గ్రామాల్లో ల్యాండ్ పార్సిల్ మ్యాప్‌లు సిద్ధం చేసినట్లు తెలిపారు. 70లక్షల అసెస్మెంట్లకు గానూ 13.7లక్షల అసెస్మెంట్ల పరిశీలన పూర్తయ్యిందని, సమగ్ర భూ సర్వే ద్వారా రెవిన్యూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేసినట్లు మంత్రులు వెల్లడించారు. -
ఏపీ: ప్రజలను చూసి.. కాన్వాయ్ ఆపి
భామిని: ప్రజల కష్టాలు గుర్తించడంలో ముఖ్యమంత్రి జగనన్న బాటలో మంత్రులు పయనిస్తున్నారు. శుక్రవారం భామిని మండలం చిన్నదిమిలి వద్ద రోడ్డుకు పక్కగా గ్రానైట్ క్వారీ బాధితులైన కాలనీవాసులు తమ సమస్య చెప్పేందుకు ఎదురు చూస్తుండగా ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, జనవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, పాలకొండ ఎమ్మెల్యే కళావతిలు తమ కాన్వాయి ఆపారు. వినతులు స్వీకరించి సమస్యలు విన్నారు. క్వారీ పేలుళ్లు, పరిహారం విషయమై కలెక్టర్‌కు సూచనలిస్తామని హామీ ఇచ్చారు. కాగా, మంత్రులు పర్యటనను విజయవంతం చేసిన ప్రజలు, అధికారులకు పాలకొండ ఎమ్మెల్యే కళావతి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాను సస్యశ్యామలం చేసే నేరడి–బ్యారేజ్ నిర్మాణానికి తాము ఆటంకం కాదని చెప్పిన ఒడిశా రైతులను అభినందించారు. -
అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో దౌర్జన్యం
సాక్షి, శ్రీకాకుళం: అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో దౌర్జనానికి పాల్పడ్డారని, కింజరాపు అప్పన్నను భయబ్రాంతులకు గురిచేశారని డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు చెప్పిన మాటలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల కమిషనర్ అచ్చెన్నాయుడుపై చర్యలు తీసుకోమని ఆదేశించారని, అచ్చెన్నాయుడు అరెస్టుపై టీడీపీ నేతలు బురద జల్లుతున్నారని అన్నారు. ఎన్నికలకు వైస్సార్సీపీ ఎప్పుడూ భయపడదని, ప్రజలు పెద్ద ఎత్తున వైస్సార్సీపీ మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజరంజక పాలన జరుగుతుందని పేర్కొన్నారు. దౌర్జన్యలు అక్రమాలకు టీడీపీ నేతలు పాల్పడి వైస్సార్సీపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులను భయపెట్టే విధంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారని, పోలీసులను మీ అంతు చూస్తామని హెచ్చరిస్తున్నారని తెలిపారు. -
ఆయన మంత్రివర్గంలో పని చేయడం అదృష్టం
సాక్షి, విజయవాడ: మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నెరవేరుస్తూ బలహీనవర్గాలకి అండగా ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జ్యోతిరావు పూలే విగ్రహానికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తదితరులతో కలిసి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పూల మాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాలకి ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలె అని గుర్తు చేశారు. పూలే ఆశయాలని తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని సీఎం వైఎస్ జగన్ బలహీనవర్గాలని బ్యాక్‌బోన్‌గా చూస్తున్నారని తెలిపారు. ఎన్నో సంక్షేమ పధకాలతో బలహీన వర్గాలకి అండదండగా నిలబడిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వమన్నారు. చదవండి: మూడు జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే బలహీనవర్గాలకి 56 కార్పోరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది అని కొనియాడారు. ఇంగ్లీష్ మీడియం, అమ్మఒడి లాంటి సంక్షేమ పధకాలతో సీఎం వైఎస్ జగన్ బలహీనవర్గాల జీవితాలలో పెను మార్పులు తీసుకువచ్చారని గుర్తుచేశారు. మహిళలకి 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా సీంఎ జగన్ బీసీ మహిళల జీవితాలలో వెలుగులు నింపారన్నారని తెలిపారు. విద్యకి అత్యధిక ప్రాధాన్యతనివ్వడం ద్వారా బీసీలు ఉన్నత చదువులు అభ్యసించడానికి అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు. బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడిన సీఎం జగన్ మంత్రివర్గంలో పనిచేయడం మా అదృష్టమని తెలిపారు. బలహీనవర్గాలకి అండగావుంటున్న తమ ప్రభుత్వానికి మహాత్మా జ్యోతిరావు పూలె ఆశీస్సులు ఉంటాయని చెప్పారు. -
‘ఆ నిజం నమ్మడం కష్టంగా ఉంది’
సాక్షి, కృష్ణా జిల్లా/చిత్తూరు: గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతి పట్ల పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సంతాపం తెలిపారు. సినీ పరిశ్రమలో నలభై ఏళ్ల సినీ ప్రస్థానంలో నలభై వేల పాటలు 11 భాషలలో పాడి, నలభై సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచంలోనే ఒక అరుదైన రికార్డు సృష్టించారని ఆయన తెలిపారు. బాలు కుటుంబ సభ్యులకు భగవంతుడు మనో ధైర్యం ప్రసాదించాలని మంత్రి కొడాలి నాని ప్రార్థించారు. ధర్మాన కృష్ణదాస్ దిగ్ర్భాంతి.. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణం పట్ల డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సినీ లోకానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని, అనేక భాషలలో పాటలు పాడి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న బాలు లేని లోటు ఎన్నటికి పూడ్చలేనిదని తెలిపారు. ఆయన మృతి కలిచివేసింది: ఎమ్మెల్యే రోజా గాన గంధర్వుడు, తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతి కలిచివేసిందని ఏపీఐఐసీ చైర్ పర్సన్, ఎమ్మెల్యే రోజా దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తన నాన్న గారి స్నేహితుడిగా చిన్నప్పటి నుండి తమ కుటుంబానికి ఆయన ఆత్మీయులేనని, వారు లేరన్న నిజం నమ్మడం కష్టంగా ఉందని రోజా పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు రోజా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రత్యేక ముద్ర వేసుకున్నారు: టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరుమల: ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతి పట్ల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఎస్పీ బాలు బహు భాషల్లో కొన్ని వేల గీతాలు ఆలపించారని ఆయన చెప్పారు. బాలు లేని లోటు భారతీయ సినీ ప్రపంచానికి, సంగీత అభిమానులకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు. సినీ సంగీత ప్రపంచంలో ఆయన ప్రత్యేక ముద్ర వేసుకున్నారని ఆయన చెప్పారు. ఎస్పీ బాలు కుటుంబ సభ్యులకు వైవీ సుబ్బారెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎస్పీ బాలు మృతి బాధాకరం: ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం బాధాకరమని టీటీడీ మాజీ చైర్మన్, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తనకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. ఎస్పీ బాలు కుటుంబ సభ్యులకు భూమన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
‘తుపాను హెచ్చరికలపై అప్రమత్తం చేయాలి’
సాక్షి, శ్రీకాకుళం: తుపాను హెచ్చరికలపై ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. తీర ప్రాంతాల్లో అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వలలు, పడవలు నష్టపోకుండా ముందస్తుగా తరలించాలన్నారు. ఆరుబయట పంటలను కాపాడుకునేందుకు, వ్యవసాయశాఖ సూచనలు పాటించాలని పేర్కొన్నారు. -
గ్యాస్ లీక్ పరిస్థితి అదుపులో ఉంది: అవంతి శ్రీనివాస్
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ పరిసరాల్లో సాధారణ పరిస్థితి నెలకొని, పూర్తిగా అదుపులోకి వచ్చిందని మంత్రులు అవంతి శ్రీనివాస్, గుమ్మనూరు జయరామ్, ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మంత్రులు ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనా స్థలాన్ని శనివారం పరిశీలించారు. అనంతరం మంత్రి అవంతి శీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ఎల్జీ పాలిమర్స్ పరిసరాల్లో సాధారణ పరిస్థితి నెలకొందన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. వదంతులను నమ్మొద్దు, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అవంతి శ్రీనివాస్ చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. (గ్యాస్ లీక్ బాధితులు కోలుకుంటున్నారు: కన్నబాబు) పరిస్థితి అదుపులో ఉంది: డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎల్జీ పాలిమర్స్‌ను గ్యాస్ లీకేజీ ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీజీపీ గౌతమ్ సవాంగ్ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మధ్యాహ్నానికల్లా ఢిల్లీ నుంచి నిపుణుల బృందం వస్తుందని ఆయన చెప్పారు. నిపుణుల బృందం పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకుంటామని డీజీపీ తెలిపారు. బయట నుంచి కొంతమంది వచ్చి కావాలనే ఆందోళన చేస్తున్నారని ఆయన తెలిపారు. అధికారులు చేస్తున్న పనులకు ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. (అప్రమత్తతతోనే ముప్పు తప్పింది ) -
చిత్తశుద్ధి నిరూపించుకున్నారు
-
చంద్రబాబుకు మంత్రి కృష్ణదాస్ సవాల్..
సాక్షి, శ్రీకాకుళం: లక్ష కోట్ల రాజధాని ఏపీ అభివృద్ధికి దోహదపడదని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అధికార వికేంద్రీకరణ కోరుతూ ఆదివారం శ్రీకాకుళంలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు ప్రతిపాదిస్తే రాష్ట్రం శాశ్వతంగా సుభిష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారని చెప్పారు. పవన్‌కల్యాణ్ స్థిరత్వం లేని నాయకుడు అని.. రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారని విమర్శించారు. చంద్రబాబు మద్దతుతో కొంతమంది మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు దమ్ముంటే నరసన్నపేటలో తనపై పోటీ చేసి గెలవాలని కృష్ణదాస్ సవాల్ విసిరారు. .. టీడీపీ బ్రిడ్జి పార్టీలా వ్యవహరిస్తోంది.. టీడీపీ చేస్తోన్న అమరావతి దీక్షలను దొంగ దీక్షలుగా వైఎస్సార్సీపీ నేత కిల్లి కృపారాణి అభివర్ణించారు. అధికార వికేంద్రీకరణకు రాష్ట్ర ప్రజలంతా మద్దతు పలుకుతున్నారని పేర్కొన్నారు. బీజేపీకి టీడీపీ బ్రిడ్జి పార్టీలా వ్యవహరిస్తోందని విమర్శించారు. విరాళాలు ఎందుకు సేకరిస్తున్నారు.. అమరావతి ఉద్యమం పేరుతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు డ్రామాలాడుతున్నారని ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ ధ్వజమెత్తారు. విరాళాలు ఎందుకు సేకరిస్తున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. ఆయన రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకుంటే బుద్ధి చెబుతాం.. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే చంద్రబాబుకి తగిన బుద్ధి చెబుతామని ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు హెచ్చరించారు. చంద్రబాబు పక్షపాత వైఖరి వలనే ఉత్తరాంధ్ర తీవ్రంగా నష్టపోయిందని మండిపడ్డారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తోన్న కృషిని చంద్రబాబు ఓర్వలేక అమరావతి ఉద్యమం ముసుగులో డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. -
‘అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవేకు రూ.100 కోట్లు’
సాక్షి, అమరావతి: అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే కోసం రూ.100 కోట్లు కేటాయించామని రాష్ట్ర ఆర్అండ్బి శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన సోమవారం ఈ అంశంపై శాసన మండలిలో మాట్లాడారు. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవేకు అవసరమైన మేరకు మరిన్ని నిధులు కేటాయించేందుకు సిద్థంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. దీనిని అత్యంత ముఖ్యమైన హైవేగా ప్రభుత్వం భావిస్తోందని కృష్ణదాస్ వెల్లడించారు. ఈ హైవే కోసం భూమిని సేకరించాల్సి ఉందని చెప్పారు. దీని నిర్మాణం కోసం ఇప్పటికే భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చామని మంత్రి తెలిపారు. అటవీశాఖ నుంచి కూడా అనుమతులు తీసుకుంటున్నామని కృష్ణదాస్ గుర్తు చేశారు. ట్రాఫిక్ అవసరాలను బట్టి హైవే ఎన్ని లైన్లతో వుండాలనేది పరిగణలోకి తీసుకుంటున్నామని మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. -
క్షమాపణ చెబితే గౌరంగా ఉంటుంది..
-
కులంతో కాదు కష్టంతో..
సాక్షి, అరసవల్లి: చట్ట సభల్లో చేసిన శాసనాలను అమలు పరిచే బాధ్యత ఉద్యోగులందరి మీద ఉందని, ఈ విషయం లో ఉద్యోగులంతా రాష్ట్ర బంగారు భవిష్యత్ కోసం కష్టపడి పనిచేయాలని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కోరారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) తొలి మహా సభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన ఈ మహాసభలో కీలక నేతలంతా ప్రసంగించారు. చరిత్రలో ఎంతోమంది ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని, వారిని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని స్పీకర్ సూచించారు. మహాసభలను సిక్కోలు నుంచి ప్రారంభించడం శుభసూచికమని అన్నారు. కులం తో కాకుండా కష్టంతో పైకి రావాలని అక్కడ పెట్టిన కొటేషన్లను ఉద్దేశిస్తూ అన్నారు. సమన్వయమే బలంగా పనిచేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే ఐఆర్ ప్రకటించారని, అలాగే పదవీ విరమణ అయ్యేలోగా ఇళ్ల నిర్మాణాలను కూడా ఉద్యోగులు చేపట్టుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుందన్నారు. ఉద్యోగులు అడిగిన మేరకు అన్ని డిమాండ్ల పరిష్కారానికి తాను ముఖ్యమంత్రితో చర్చిస్తానని భరోసా ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమం ముఖ్యం.. అనంతరం రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడారు. ఈ సంఘాన్ని వైఎస్ జగన్ హయాంలోనే 103వ సంఘంగా గుర్తించినట్లు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఏపీ ఎన్జీఓ సంఘ నేతలు స్వార్థ రాజకీయాలు చేశారని విమర్శించారు. అశోక్ బాబు వంటి వారు ఉద్యోగులను వాడుకున్నారని ఘా టుగా వ్యాఖ్యానించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నంబర్ వన్ సంఘంగా.. శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మా ట్లాడుతూ ఉద్యోగుల మద్దతుతోనే రాష్ట్రం లో బలంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చింద ని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులకు స్నేహపూర్వకంగా నడుస్తుందన్నారు. సీఎం జగన్‌కు ఉద్యోగులంతా సహకరించాలని కోరారు. సూర్యనారాయణ లాంటి మంచి, నిజాయితీ గల వ్యక్తి ఉద్యోగులందరికీ నాయకుడిగా ఉం డడం మంచి పరిణామమని, ఈ సంఘం రాష్ట్రంలో నంబర్ వన్‌గా నిలుస్తుందనే నమ్మకం తనకుందన్నారు. హక్కులతో పాటు బాధ్యతలు కూడా తలకెత్తుకోవాలని కోరారు. ఎన్జీవో నేత అక్రమాలకు కేరాఫ్ ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్జీవో నేత చౌదరి పురుషోత్తం నాయుడు అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిపోయాడని, ఆయన అసలు ప్రభుత్వ ఉద్యోగ విధులే ఎక్క డా నిర్వర్తించరని, సొంతంగా పేపర్ నడుపుకుంటూ, ఉద్యోగులకు బెదిరింపులు చేస్తూ అక్ర మాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఉద్యోగుల సంక్షేమం పూర్తిగా మరిచిపోయి తన స్వ లాభం కోసం దందాలు నడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. బదిలీల సమయంలో సచివాలయంలో దళారీగా పనిచేశారని ఆరోపించారు. ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఏపీజీఈఏ రాష్ట్ర సంఘ అధ్యక్షుడు కె.రామసూర్యనారాయణ మాట్లాడుతూ రాజకీయాలకు అ తీతంగా, నిజాయితీగా పనిచేస్తామని, అయితే ప్రస్తుతం ఉద్యోగుల సంక్షేమంపై సానుకూలంగా వ్యవహరిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ప్రకటించడంతో పాటు ఉద్యోగులందరికీ ఇళ్లు ఇ స్తామని సీఎం ప్రకటించారని, ఈ విషయంలో ఉద్యోగులకు ఇంటి స్థలాలు కాకుండా కేవలం ఇళ్లు మాత్రమే ఇవ్వాలని కోరారు. స్థలాలిస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అవకాశముం టుందని, గతంలో గచ్చిబౌలిలోని 487 ఎకరాల స్థలాల వ్యవహారాన్ని గుర్తుచేశారు. జిల్లాలో ఎన్జీవో సంఘ నేతలు సంఘాన్ని అడ్డం పెట్టుకుని మాఫియా నడుపుతున్నారని, భారీగా అక్రమాలు చేశారని, ఉద్యోగులెవరైనా తమ మాట వినకపోతే, తమ సొంత మీడియాలోనే వార్తలు రాయించుకుని బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి జి.ఆస్కారరావు మాట్లాడుతూ ఇంత వరకు ఉద్యోగ సం ఘాల పేర్లతో అక్రమాలకు తెగబడ్డారని, దీన్ని నిలువరించేందుకు అలాగే స్వచ్ఛందంగా ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేయడానికే ఈ సంఘం ఏర్పడిందని వివరించారు. జిల్లాలో ఎన్జీవో సంఘ నేతల అక్రమాలు త్వరలోనే బయటపెడతామని, గత బదిలీల వ్యవహారంపై బహిరంగ విచారణకు తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. సమావేశంలో ఏపీజీఈఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఐ.రఘుబాబు, సంఘ రాష్ట్ర కార్యవర్గం పింగళి గిరిధర్, డి.శ్రీకాంత్‌రాజు, వినయ్మోహ జిల్లా సంఘ అధ్యక్షుడు నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ జి.సీతారాం, జిల్లా గౌరవాధ్యక్షుడు కిలారి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. మహాసభ ముగింపు సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా కార్యవర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు. వినతుల వెల్లువ సీపీఎస్ రద్దు కోరుతూ ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘ నేతలు ఎం.సురేష్, ప్రధాన కార్యదర్శి రెడ్డి సూరిబాబు, తదితరులు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు వినతిపత్రం సమర్పించారు. అలాగే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కె.రామసూర్యనారాయణకు స్థానిక ఆర్డబ్ల్యూఎస్ విబాగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ల్యాబ్ అసిస్టెంట్లు సంఘాల ప్రతినిధులు పి.సురేష్, కె.సత్యన్నారాయణ, లోకేశ్వరరావులు వినతిపత్రం సమర్పించి కోరారు. -
క్రీడల్లో సిక్కోలు నెంబర్ వన్
రణస్థలం/రణస్థలం రూరల్: ఒలింపిక్స్, కామ న్వెల్త్, ఆసియా క్రీడల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 25మంది క్రీడాకారులు పాల్గొనడం అరుదైన విషయమని, ప్రశంసనీయమని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావు పేర్కొన్నారు. మండలంలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన క్రీడా వికాస కేంద్రాన్ని (ఇండోర్ మినీ స్టేడియం) ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అధ్యక్షతన మంత్రులు ముత్తంశెట్టి, ధర్మాన కృష్ణదాస్‌లు ప్రారంభించారు. అనంతరం కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ క్రీడాకారులకు తలమానికం అయిన కోడి రామ్మూర్తి స్టేడియంను గత ప్రభుత్వం విస్మరించిందని, సీఎం జగన్‌తో మాట్లాడి 2020లో స్టేడియంను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అలాగే పైడిభీమవరంలో పరిశ్రమలు అధికంగా ఉన్నందున కార్పొరేట్ సామాజిక బాధ్యతగా రూ.10 లక్షల వ్యయంతో జిమ్ ఏర్పాట య్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్‌కు సూచించారు. అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం ఆలయాలను, భావనపాడు, ఉద్దానం కొబ్బరి తోటలను పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతామన్నారు. క్రీడా వికాస కేంద్రానికి వైఎస్సార్ క్రీడా వికాస కేంద్రంగా పేరు పెడుతున్నామని తెలిపారు. 14 రోజులపాటు సాగిన అసెంబ్లీ సమావేశాల్లో నవరత్నాలతోసహా 19 బిల్లులు ఆమోదించామని, ప్రభుత్వ వచ్చిన రెండు నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్న ఘనత దేశంలో ఒక్క సీఎం జగన్మోహన్రెడ్డికే దక్కిందన్నారు. క్రీడాకారుల కీర్తి శాశ్వతం.. మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ క్రీడలతోనే ఆరోగ్యవంతమైన సమాజం స్థాపన సాధ్యమవుతుందన్నారు. రాజకీయ నాయకులకు ఐదేళ్లపాటే పదవీ కాలం ఉంటుందని, అదే క్రీడాకారులుగా రాణిస్తే ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుందన్నారు. కరణం మల్లేశ్వరి, పీవీ సింధు, సచిన్ టెండూల్కర్ వంటి క్రీడాకారులు ప్రపంచానికి గుర్తింపు తెచ్చారని తెలిపారు. వచ్చే బడ్జెట్లో క్రీడలకు అధిక నిధులు కేటాయించేలా చూడాలని క్రీడాశాఖమంత్రికి సూచించారు. సీఎం జగన్మోహన్రెడ్డిలాంటి నాయకుడు మరో 30 ఏళ్లు సీఎంగా కొనసాగాలన్నారు. ఇవే తన చివరి ఎన్నికలని, వచ్చేసారి మళ్లీ పోటీ చేయనని, అయినా జీవితాంతం జగన్ అండగా నిలుస్తానని అన్నారు. ఎంపీ బెల్లాన చంధ్రశేఖర్ మాట్లాడుతూ వైఎస్సార్ క్రీడావికాస కేంద్రంలో వాలీబాల్, 200 మీటర్ల ట్రాక్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలకు కోచ్‌ను నియమించాలని కోరారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ఎచ్చెర్ల మండలంలోని పొన్నాడ సమీపంలో 5 ఎకరాల్లో పార్కు ఏర్పాటు చేయాలని, ఎస్.ఎం.పురం పెద్ద చెరువును పర్యాటకంగా అభివృద్ధి పర్చాలని కోరారు. జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఎమ్మెల్సీ రఘువర్మ మాట్లాడారు. క్రీడా వికాస కేంద్రాన్ని త్వరితగతిన పూర్తి చేసినందుకు ఇంజనీర్లు, కాంట్రాక్టకు షీల్డ్‌లు ఇచ్చి దుశ్సాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, సెట్‌శ్రీ సీఈవో వి.వి.ఆర్.ఎస్ మూర్తి, డీఎస్డీవో బి. శ్రీనివాసరావు, కోచ్ శ్రీధర్, అంబేడ్కర్ యూనివర్సిటీ పీడీ శ్రీనివాసరావు, ఆర్డీవో ఎం.వి.రమణ, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
ప్రగతి వైపు అడుగులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనిచేస్తోందని, జిల్లా సర్వతోముఖాభివృద్ధికి వడివడిగా అడుగులు వేస్తోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జిల్లా కేంద్రం లోని పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం 73వ స్వాతంత్య్ర వేడుకలు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆ యన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించా రు. ‘స్పందన’ ద్వారా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపిస్తున్నామని అన్నారు. ఇ ప్పటివరకు 13,201 అర్జీల్లో 11,062 అర్జీ లు పరిష్కరించారని తెలిపారు. ఇటీవల వచ్చిన వంశధార, నాగావళి వరదల్లో ప్రకృతి విపత్తును కూడా సమర్థంగా ఎదుర్కొన్నామని తెలిపారు. ప్రభుత్వ పథకాలకు ప్రజలకు పారదర్శకంగా అందించడానికి వలంటీర్ల వ్యవస్థకు రూపకల్ప న చేశామని తెలిపారు. వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశామని, ఈ ఏడాది ఖరీఫ్‌లో 2.40 హెక్టార్లలో పంట వేయడానికి ప్రణాళిక వేసినట్లు వివరించారు. జలాశయాల అభివృద్ధికి ని ర్ణయాలతో పాటు రైతులకు విత్తనాలను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపా రు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామన్నారు. అక్టోబర్ నుంచి రైతు భరోసా.. అక్టోబర్ నుంచి రైతు భరోసా మొదలవుతుందని, ఈ పథకం ద్వారా రైతుకు రూ.12, 500 అందుతుందని తెలిపారు. రానున్న నాలు గేళ్లలో దాదాపు 3,29,000 రైతు కుటుంబాలకు దీని ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. అలాగే ఇరవై వేల మంది కౌలు రైతులకు కూడా భరోసా కల్పించినట్లు వివరించారు. ఈ ఏడాది జిల్లాలో రూ.2,171 కోట్ల పంట రుణాలు, రూ. 1030 కోట్ల టెర్మ్ రుణాలు అం దించడానికి లక్ష్యంగా చేసుకున్నామని చెప్పారు. ఉద్యాన పంటల అభివృద్ధి, బిందు, తుంపర సేద్యాలపై స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయని పేర్కొన్నారు. పాడి రైతులకు దాణా అందించేందుకు 2612 ఎకరాల్లో మేలురకం పశుగ్రాసం పెంచుతున్నామని తెలిపారు. జల వనరుల అభివృద్ధి కింద వంశధార, మహేంద్ర తనయ పనుల కోసం రూ.1536 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఆఫ్‌షోర్ ప్రాజెక్టు 2020కి పూర్తవుతుందని చెప్పారు. తాగునీటి కోసం ఇప్పటి వరకు రూ.305.51 కోట్లు ఖర్చు చేశామన్నారు. వంశధార ఎడమకాలువకు రూ.543 కోట్లు, నారాయణపురం ఆనకట్టకు జైకా నిధులు రూ.112 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఆరోగ్య శ్రీకి ప్రాధాన్యత.. ఆరోగ్య శ్రీ సేవలకు ప్రాధాన్యమిస్తున్నామని, మాతాశిశు మరణాలు తగ్గించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. శిథిలావస్థకు చేరిన ఆస్పత్రుల పునరుద్ధరణకు రూ.4.70 కోట్లు కేటాయించామని, రూ.2.27 కోట్లతో కొత్త భవనాలు కడుతున్నామని చెప్పారు. రిమ్స్ వార్డులను సీఆర్ఎస్ కింద అభివృద్ధి చేస్తున్నామన్నారు.వెయ్యి రూపాయల ఖర్చు దాటిన వైద్యాన్ని వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కార్యక్రమం ద్వారా చేస్తామన్నారు. విద్యపై కూడా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. 161 డిజటల్ క్లాస్‌లు, 284 పాఠశాలల్లో వెర్టికల్ తరగతులు మం జూరు చేసినట్లు తెలిపారు. ట్రిపుల్ ఐటీ తరగతుల నిర్వహణ, మెరుగైన వసతి కోసం చర్యలు చేపట్టినట్లు చెప్పారు. వచ్చే ఏడాది జనవరి నుంచి జగనన్న అమ్మ ఒడి అమలులోకి వస్తుందన్నారు. తాగునీటికి ప్రత్యేక ప్రణాళిక.. తాగునీటి వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, కిడ్నీ ప్రభావిత ప్రాంతా ల్లో ఏడు ఆర్వో ప్లాంటులు, గిరిజన ప్రాంతాల్లోనూ, ఇతర ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు వైఎస్సార్ ఆసరా ద్వారా ఆదుకుంటున్నామని వివరించారు. నవరత్నాల్లోని ఓ భాగమైన ఈ పథకం ద్వారా 2019 ఏప్రిల్ 11 నాటికి చెల్లించాల్సిన రుణ మొత్తాన్ని మహిళా సంఘాలకు నాలుగు విడతల్లో చెల్లిస్తామని, అందుకు రూ.1385.61 కోట్లు 48,171 సంఘాలకు అందజేయనున్నామని అన్నారు. నాంది కార్యక్రమం ద్వారా న్యూట్రిన్ బిస్కెట్లు, నువ్వుల ఉండలు వంటి వాటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇళ్ల పట్టాల పంపిణీ.. జిల్లాలోని నిరుపేదలైన లక్ష కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని, ఉగాది నాటికి కార్యక్రమం జరుగుతుందని దాసన్న అన్నారు. తిత్లీలో నిరాశ్రయులైన 10,767 కుటుంబాలకు వైఎ స్సార్ గృహనిర్మాణ పథకం ద్వారా 269.18 కోట్లతో ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే ఉపాధి లోనూ జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో ఉందని తెలిపారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు గాను 114 ఎంఎస్ఎంఈలు రూ. 49 కోట్లతో స్థాపించి, 1160 మందికి ఉపాధి కల్పించామని అన్నారు. నవరత్నాలను అమలు చేస్తున్నామని, కిడ్నీ బాధితులకు పింఛన్ మొత్తం పెంచామని గుర్తు చేశారు. దశల వారీ గా పింఛను మొత్తం పెంచుకుంటూ పోతామని, 60 ఏళ్లు నిండిన వారికి కూడా పింఛను అందిం చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపా రు. భవనాలు, రహదారుల అభివృద్ధికి రూ. 860 కోట్లు కేటాయించామని తెలిపారు. పనులు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. పంచా యతీ రాజ్ విబాగం ద్వారా రూ.56.65 కోట్లతో 19 రహదారులకు టెండర్లు పిలిచామని తెలిపా రు. 436 అంగన్వాడీ భవనాలు ఎన్ఆర్ఈజీ ఎస్ నిధులలో నిర్మిస్తున్నామన్నారు. రైతులకు పగటి పూట నాణ్యంగా 9 గంటల పాటు విద్యు త్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. టూరిజంలో వేగం.. ప్రగతి కార్యక్రమాలతోపాటు టూరిజంను కూ డా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి అన్నారు. టెంపుల్ టూరిజం, కళింగపట్నం, శివసాగర్ బీచ్, జగతిపల్లి రిసార్ట్సు, గిరిజన మ్యూజియం, దేవాలయాలు మాస్టర్ ప్లాన్ రూపొందించనట్లు చెప్పారు. అలాగే జిల్లాలో 1.20 కోట్ల మొక్కలు నాటుతున్నామని, హరిత వాతావరణం తీసుకువస్తామని చెప్పారు. క్రీడలకు ప్రాధాన్యత, జాబ్‌మేళాల నిర్వహణలోనూ ముందంజలో ఉన్నామని సోదాహరణంగా వివరించారు. ప్రజల సంతృప్త స్థాయిని పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అంతకుముందు ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. సాయుధ దళాల గౌరవ వంద నం స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. ఆయనతో పాటుగా కలెక్టర్ జె.నివాస్, ఏఎస్పీ అమ్మిరెడ్డి, ఐటీడీఏ పీవో సీ ఎం సాయికాంత్ వర్మ, ట్రైనీ కలెక్టర్ భరత్‌తేజ, జేసీ పి.రజనీకాంతారావు, డీఆర్ఓ కె.నరేంద్ర ప్రసాద్, ఆర్డీఓ ఎంవీ రమణ, వైఎస్సార్సీపీ ఎంపీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాసరావు, ధర్మాన పద్మప్రియ, డ్వామా పీడీ హెచ్ కూర్మారావు, డీఆర్డీఏ పీడీ ఎ.కళ్యాణ చర్రవర్తి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. క్రికెటర్ వెంకటేశ్వరరావుకు గౌరవం.. వజ్రపుకొత్తూరు: ఉద్దానం రామకృష్ణాపురానికి చెందిన అంధ క్రికెటర్ దున్న వెంకటేశ్వరరావుకు ప్రతిభకు తగ్గ గౌరవం దక్కింది. గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన స్వాంతంత్య్ర దినోత్సవంలో రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వెంకటేశ్వరరావును అవార్డుతో అభినందించారు. రెండేళ్లుగా భారత జట్టు విజయాల్లో వెంకటేశ్వరరావు కీలక పాత్ర పోషిస్తున్నారు. కలెక్టర్ జె.నివాస్, ఎస్పీ అమ్మిరెడ్డి, ఇతర జిల్లా అధికారులు క్రికెటర్ వెంకటేశ్వరరావును అభినందించారు. దీనిపై ఆ గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు చింత జనార్ధనరావు, చింత హేమారావు, దున్న కృష్ణారావు తదితరులు ఆనందం వ్యక్తం చేశారు. -
ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తాం
-
డిసెంబర్ 31కి కనకదుర్గ ఫ్లైఓవర్ పూర్తి
భవానీపురం (విజయవాడ పశ్చిమ): డిసెంబర్ 31 నాటికి విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేసి నూతన సంవత్సర కానుకగా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఈ మేరకు కాంట్రాక్టు సంస్థకు ఆదేశాలిచ్చామన్నారు. ఆదివారం ఆయన దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఉన్నతాధికారులతో కలసి విజయవాడలో పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ– హైదరాబాద్ మార్గంలో ప్రయాణించే ప్రజలకు కనకదుర్గ ఫ్లై ఓవర్ అత్యంత ప్రాముఖ్యమైనదన్నారు. అందుకే తొలి ప్రాధాన్యతగా ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ సూచించారని చెప్పారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేసే క్రమంలో నెల రోజులపాటు కింద రోడ్డు మార్గంలో కొన్ని చోట్ల ట్రాఫిక్‌ను నిలిపేయాల్సి వస్తుందని, ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో ఐదేళ్లకు కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. రోడ్లు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ.. ఫ్లైఓవర్ నిర్మాణం నిమిత్తం కేంద్ర ప్రభుత్వం (నేషనల్ హైవేస్) నుంచి ఇప్పటి వరకు రూ. 233 కోట్లు విడుదలయ్యాయని, మరో రూ. 100 కోట్లు రావల్సి ఉందన్నారు. భూ సేకరణ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 114 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ఫ్లైఓవర్‌కు వయాడక్ట్ వంటి అదనపు పనులు చేయటం వలన రూ. 25 కోట్ల మేర అదనపు భారం పడిందని తెలిపారు. ఇప్పటికి దాదాపు 85 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఎస్ఈ జాన్ మోషే, ఆర్అండ్బీ ఈఎన్సీ రాజీవ్‌రెడ్డి, కేంద్ర ప్రభుత్వ రీజనల్ రవాణా అధికారి ఎస్కే సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్సీపీ గెలుపే లక్ష్యంగా పని చేస్తాం
-
హ్యాట్రిక్ విజయాలు వీరి సొంతం
సాక్షి, శ్రీకాకుళం : ఆటలోనైనా.. ఎన్నికల్లో అయినా హ్యాట్రిక్ విజయాలు సాధించడం గొప్ప విషయమే. క్రికెట్ ఆటలోనే ఎక్కువ హ్యాట్రిక్ ప్రస్తావన వస్తుంది. వరుసగా మూడు వికెట్లు తీస్తే హ్యాట్రిక్ అని బౌలర్‌ను ఆకాశానికి ఎత్తేస్తారు. అలాంటిది ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధిస్తే.. అంతకన్నా గొప్ప విషయమే. అందరికీ ఇది సాధ్యం కాదు. అన్ని వేళలా ప్రజలకు అండగా ఉంటూ.. వారి మెప్పు పొందిన వారికే ఇలాంటి రికార్డు దక్కుతుంది. ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు విజయం సాధించిన వారు అరుదుగా ఉంటారు. ఆ ఖ్యాతి దక్కించుకున్నవారు శ్రీకాకుళం జిల్లాలో 17 మంది ఉన్నారు. ఆనాటి తరం నాయకులు గౌతులచ్చన్న, లుకలాపు లక్ష్మణదాసు, పోతుల గున్నయ్య, శిమ్మ జగన్నాథం, తమ్మినేని పాపారావు, కింజరాపు ఎర్రన్నాయుడు, నిమ్మక గోపాలరావులతో పాటు ఈ తరంలో కూడా చాలామంది ఉన్నారు. రాష్ట్రంలో తొలి మహిళా స్పీకరుగా గుర్తింపు పొందిన కావలి ప్రతిభా భారతి ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి వరుసగా 1985, 89, 94, 99 ఎన్నికల్లో విజయం సాధించారు. 2004లో వైఎస్ఆర్ ప్రభంజనంలో ఓటమి పొందారు. నరసన్నపేట నియోజకవర్గం నుంచి శిమ్మ జగన్నాథం 1955 నుంచి 1972 వరకూ వరుసగా గెలుపొందారు. ధర్మాన కృష్ణదాసు 2004, 2009, 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం పొంది హ్యాట్రిక్ నమోదు చేశారు. శ్రీకాకుళం నియోజకర్గం నుంచి గుండ అప్పలసూర్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులు వరుస విజ యాలు సాధించారు. అప్పలసూర్యనారాయణ 1985 నుంచి 1999 వరకూ వరుస ఎన్నికల్లో విజయం సాధించా రు. 2004 నుంచి ఆయనకు అపజయాలు పలకరిస్తున్నాయి. ధర్మాన ప్రసాదరావు 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. నరసన్నపేట నుంచి 1999లో ప్రత్యర్థి బగ్గు లక్ష్మణరావుపై గెలవగా, 2004, 09 ఎన్నికల్లో వరుసగా శ్రీకాకుళం నుంచి గుండ అప్పలసూర్యనారయణపై విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. పాతపట్నం నియోజకవర్గం నుంచి కలమట మోహనరావు ఐదుసార్లు గెలుపొందారు. 1978లో గెలిచి అనంతరం ఒకసారి ఓటమి పొందారు. తరువాత ఎన్నికల్లో 89, 94, 99, 2004ల్లో వరుసగా విజయం సాధించి ఆ నియోజకవర్గంలో తనదైన ముద్ర వేశారు. లుకలావు లక్ష్మణదాసు ఐదుసార్లు గెలుపొందగా పాతపట్నం (ద్విసభ్య) నియోజకవర్గం నుంచి 1952, 55, 62ల్లో గెలుపొంది హ్యాట్రిక్ నమోదు చేశారు. జిల్లాలో మొదట హ్యాట్రిక్ విజయం సాధించింది ఈయనే.. ఆమదాలవలస నుంచి తమ్మినేని సీతారాం 1998, 85,ఎన్నికల్లో గెలిచి 89లో ఓటమి పొందారు. 1991 లో జరిగిన ఉప ఎన్నికల్లో రాజకీయ కురువృద్ధుడు బొడ్డేపల్లి రాజగోపాలరావును ఓడించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన తమ్మినేని 1994, 99 ఎన్నికల్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. పార్వతీపురం ప్రాంతానికి చెందిన పోతుల గున్నయ్య 1952లో చీపురుపల్లి, 55లో పాతపట్నం, 62లో కొత్తూరు, 67లో పాతపట్నం నియోజకవర్గాల నుంచి వరుసగా గెలుపొందారు. కింజరాపు ఎర్రన్నాయుడు 1983 నుంచి 94 వరకూ వరుసగా విజయాలు సాధించారు. 83, 85 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. 89లో టీడీపీ టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్‌గా పోటిచేసి ఘనవిజయం నమోదు చేశారు. 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో హరిచ్చంద్రపురం నుంచి అరంగేట్రం చేసిన కింజరాపు అచ్చన్నాయుడు 99, 2004, సంవత్సరాల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. ఇచ్ఛాపురం నుంచి ఎంవీ కృష్ణారావు 1983, 85, 89 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. కొత్తూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి నిమ్మక గోపాలరావు నాలుగుసార్లు గెలిచారు. 1972లో రాజకీయంలో ప్రవేశించిన ఆయన 1989, 94, 99 సంవత్సరం ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. అంతకు ముందు 1983లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత 1985లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పొందారు. కిమిడి కళా వెంకటరావు కూడా 1983, 85, 89 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. పూర్వపు నగిరికటకం (ప్రస్తుతం ఆమదాలవలస) నియోజకవర్గం నుంచి తమ్మినేని పాపారావు కూడా హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు. గౌతు లచ్చన్న సోంపేట నియోజకవర్గం నుంచి ఐదు సార్లు వరుసగా విజయం పొందారు.అలాగే ఈయన కుమారుడు గౌతు శ్యామసుందర శివాజీ కూడా నాలుగుసార్లు గెలుపొందారు. -
హామీలు అమల్లో టీడీపీ విఫలం
ధర్మాన కృష్ణదాసు ధ్వజం సమర దీక్ష పోస్టర్ ఆవిష్కరణ నరసన్నపేట : ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ హామీలు అమలులో పూర్తిగా విఫలమ య్యారని వైఎస్సార్ సీపీ బీసీ విభాగం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు అన్నారు. వచ్చే నెల 3,4 తేదీల్లో అమరావతిలో పార్టీ అధ్యక్షుడు జగన్‌మ్మోహనరెడ్డి చేపట్టే సమర దీక్షకు సంబంధించిన పోస్టర్లను ఆయన గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు పాలన తీరును దుయ్యబట్టారు. ఏ ప్రజలకు ఇచ్చిన హామీలతో అధికారానికి వచ్చారో వారినే మరిచి సీఎం ఇష్టానుసారంగా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటీ సవ్యంగా అమలు చేయలేదన్నారు. రుణ మాఫీ పేరిట రైతులను తీవ్రంగా మోసం చేశారని పేర్కొన్నారు. రుణ మాఫీ కాకపోగా వాడుకున్న రుణం వడ్డీతో కలపి తడిసిమొపెడు అవుతోందని అన్నారు. డ్వాక్రా రుణాల వ్యవహారంలో కూడా చంద్రబాబు మహిళలను దారుణంగా మోసం చేశారని అన్నారు. ఈవిధంగా చేయడం చంద్రబాబు నైజమన్నారు. డ్వాక్రా రుణాలు అన్నింటినీ మాఫీ చేస్తామన్న బాబు.. సీఎం అయిన తరువాత నోటికొచ్చినట్లు మాట్లాడుతూ చివరికి అప్పులపాలు చేస్తున్నారని కృష్ణదాసు ధ్వజమెత్తారు. ప్రస్తుతం డ్వాక్రా సభ్యుల ఖాతాల్లో వేసిన మూడు వేల రూపాయలు కూడా మూలధనం అట అని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాలకు ఆయన మోసం చేశారని పేర్కొన్నారు. మోసపోయిన ప్రజలకు అండగా ఉంటూ వారి తర ఫున జగన్మోహన్రెడ్డి దీక్షకు దిగుతున్నారని..ఈ దీక్షల్లో అంతా పాల్గొనాలని కోరారు. పోస్టరు ఆవిష్కరణలో నరసన్నపేట సొసైటీ అధ్యక్షుడు సురంగి నర్సింగరావు, వైఎస్సార్ సీపీ నాయకులు ఆరంగి మురళి, యాళ్ల కృష్ణంనాయుడు, పతివాడ గిరీశ్వరరావు, యాళ్ల బైరాగినాయుడు, బొబ్బాది ఈశ్వరరావు, మొజ్జాడ శ్యామ్, దండి జయప్రకాష్, యాబాజీ రమేష్ పాల్గొన్నారు. -
రేపటి నుంచి వైఎస్ఆర్ జనభేరి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి గురు, శుక్రవారాల్లో జిల్లాలో పర్యటిస్తారు. వైఎస్ఆర్ జనభేరి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఆయన ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ ప్రొగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశీల రఘురాం, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పరిశీలకుడు కొయ్యా ప్రసాద్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వారు చెప్పిన వివరాల ప్రకారం జగన్మోహన్రెడ్డి విజయనగరం పర్యటన ముగించుకొని బుధవారం రాత్రి రాజాం, పొందూరు మీదుగా శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశిస్తారు. గురువారం ఉదయం పలాస పట్టణంలోని పలు ప్రాంతాల్లో రోడ్‌షో నిర్వహిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు టెక్కలి చేరుకుంటారు. అక్కడి వైఎస్ఆర్ కూడలిలో జరిగే వైఎస్ఆర్ జనభేరి బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ఇచ్ఛాపురం చేరుకొని ఆ రాత్రి అక్కడ బస చేస్తారు. శుక్రవారం ఉదయం ఇచ్ఛాపురం పట్టణంలో రోడ్‌షో నిర్వహిస్తారు. మధ్యాహ్నం విశాఖపట్నం చేరుకొని, అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళతారు. -
సమైక్యాంధ్ర పరిరక్షణకే శంఖారావం
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణకే వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సమైక్య శంఖారావం కార్యక్రమాన్నిచేపడుతున్నారని పార్టీ నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమైక్యశంఖారావం పేరిట జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారని వివరించారు. సమైక్యాంధ్ర విషయంలో మొదటినుంచి స్పష్టమైన వైఖరితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పయనిస్తోందన్నారు. కాంగ్రెస్, టీడీపీలు రెండు నాల్కల ధోరణి అవలంబిస్తూ ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నాయని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రానికి ఇచ్చిన విభజన లేఖను ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని ప్రశ్నించారు. జిల్లాలోని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్త వై.వి.సూర్యనారాయణ మాట్లాడుతూ పార్లమెంట్లో టీ బిల్లు ఆమోదం పొందకుండా ఉండేందుకు జగన్మోహన్రెడ్డి వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఆయా పార్టీల నాయకుల మద్దతు కూడగడుతున్నారన్నారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు హనుమంతు కిరణ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల ఎంతోమందికి ఉపాధిలేకుండా పోతోందన్నారు. శ్రీకాకుళం పట్టణ శాఖ అధ్యక్షుడు ధర్మాన ఉదయ్‌భాస్కర్ మాట్లాడుతూ సమన్యాయమంటూ టీడీపీ తెలుగు ప్రజలను వంచిస్తోందన్నారు. పార్టీ నేత ఎన్ని ధనుంజయ్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షను గౌరవించకుండా చంద్రబాబు విభజనకు వంతపాడడం దురదృష్టకరమన్నారు. అనంతరం సమైక్య శంఖారావం పోస్టర్లను కృష్ణదాస్ తదితరులు ఆవిష్కరించారు. పార్టీ నేతలు చింతాడ గణపతిరావు, మహమ్మద్ సిరాజుద్దీన్, లావేటి శ్యాం పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పని సరి!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ కానుంది. స్వార్థ ప్రయోజనాల కోసం అంటిపెట్టుకొని ఉండేవారు తప్ప మిగిలినవారంతా ఆ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా దివంగత సీఎం డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో జిల్లాలో అన్నీ తానై కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు త్వరలోనే వైఎస్ఆర్సీపీలోకి రానున్నారు. ఈ విషయమై తన అనుచరులు, మద్దతుదారుల అభిప్రాయం తీసుకుని తుది నిర్ణయం ప్రకటిం చనున్నారు. పార్టీలోకి ఆయనను సాదరంగా ఆహ్వానిస్తామని వైఎస్ఆర్సీపీ జిల్లా క న్వీనర్ ధర్మాన కృష్ణదాస్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పారు. ఈ నేపథ్యం లో ఈ నెల 15న అంపోలు వద్ద ఉన్న శారద ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలోని తోటలో తమ అనుచరులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు ధర్మాన ప్రసాదరావు తనయుడు రామ్‌మనోహర్‌నాయుడు శుక్రవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. దీనికి రాజకీయ సమాలోచన సభ అని పేరు పెట్టారు. వైఎస్ఆర్సీపీలో చేరే తేదీని ఈ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి జిల్లాలోని 10 నియోజకవర్గాలకు చెందిన 3 వేల మందిని ఆహ్వానించినట్టు సమాచారం. ఈ నెలాఖరులోగా వైఎస్ఆర్సీపీలో చేరాలని ధర్మాన వర్గీయులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌పై నిప్పులు చెరగనున్న ధర్మాన అంపోలు సమావేశంలో చేసే ప్రసంగంలో ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీ తీరుపై నిప్పులు చెరగనున్నారని తెలుస్తోంది. ఒకనాడు సిద్ధాంతాల కోసం పనిచేసిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇప్పుడు అధికారం కోసం ఏ విధంగా ఠ మొదటి పేజీ తరువాయి దిగజారుతున్నారనే అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేయనున్నట్లు తెలిసింది. అధికారంలో ఉన్నంతకాలం పార్టీ బలహీన పడటం ప్రజాస్వామ్యంలో సహజమని, అయితే అధికారాన్ని విడిచిపెట్టేందుకు ఏమాత్రం సిద్ధంగా లేని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన సహా దేనికైనా సిద్ధపడుతోందని, తమకు ప్రత్యర్థులుగా ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలతోనూ జతకట్టేందుకు సైతం వెనుకాడటం లేదనే అంశంపై వివరణాత్మక ప్రసంగం చేసేందుకు ధర్మాన సిద్ధమైనట్లు సమాచారం. అదే సమయంలో కాంగ్రెస్సే సర్వస్వమనుకున్న తనను హైకమాండ్ పెద్దలు ముద్దాయిగా మార్చడం వెనుక కారణాలేమిటనే విషయాన్ని కూడా వివరించనున్నట్లు తెలిసింది. ధర్మాన బాటలోనే టీడీపీ నేతలు కూడా.. ధర్మాన ప్రసాదరావు బాటలోనే నడవాలని తెలుగుదేశం పార్టీ నేతలు కొందరు నిర్ణయించుకున్నటు ్టసమాచారం. ధర్మాన చేరిన రోజున అదే వేదికపై వైఎస్ఆర్సీపీలో చేరేందుకు వీరంతా సిద్ధమవుతున్నట్టు తెలిసింది. టీడీపీలో ఇప్పటికే రెండు వర్గాలు ఉన్నాయి. కిమిడి కళావెంకట్రావు వర్గం ఒకటి కాగా, కింజరాపు రామ్మోహన్నాయుడు వర్గం మరొకటి. ఈ రెండు వర్గాలను పక్కన బెట్టాలనుకుంటున్న వారు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అనేకమంది గ్రామ సర్పంచ్‌లు వైఎస్ఆర్సీపీలో చేరగా మరి కొందరు చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. డీసీసీపై పట్టుకు వర్గ పోరాటం ధర్మాన ప్రసాదరావు వైఎస్ఆర్ సీపీలో చేరాలనే నిర్ణయానికి రావడంతో జిల్లా కాంగ్రెస్‌పై పట్టు సాధించేందుకు కేంద్ర మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి, రాష్ట్ర మంత్రి కోండ్రు మురళీ మోహన్‌లు వర్గ పోరుకు సిద్ధమయ్యారు. తొలుత డీసీసీ కార్యాలయం ఇందిర విజ్ఞాన్ భవన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. డీసీసీ కార్యాలయంలో ధర్మానకు ప్రత్యేక గది ఉంది. ఈ గదిలోని సీట్లో ఆయన తప్ప మరెవరూ కూర్చోరు. కృపారాణి సాహసించకపోయినా కోండ్రు మురళీ మాత్రం ఇటీవల ధర్మాన కూర్చునే సీట్లో ఆసీనులయ్యారు. తద్వారా పార్టీలో పరిస్థితి మారిందనే సంకేతాలను మురళి పార్టీ శ్రేణులకు ఇచ్చారు. దీంతో ధర్మాన వెళ్లాక పార్టీలో ఉండటం వృథా అని పలువురు నేతలు, కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు. ఆయనను కాదని కాంగ్రెస్‌లోనే ఉండేవారు ఎవరూ శ్రీకాకుళంలో లేరని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో డీసీసీ కార్యాలయం వెలవెలబోవటం ఖాయమంటున్నారు. చెబుతున్నారు. ధర్మాన సహాయ సహకారాలతో మంత్రులైనవారు రాజకీయంగా ఆయనను ఎదుర్కొనే పరిస్థితి లేదని స్పష్టం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మరింత బలోపేతం ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. ధర్మాన కృష్ణదాస్ నాయకత్వంలో జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో పార్టీ కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం బూత్ కమిటీలను చురుకుగా ఏర్పాటు చేస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు తదితరుల చేరికతో జిల్లాలో తిరుగులేని శక్తిగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించటం ఖాయమని పరిశీలకులు చెబుతున్నారు. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తున్న వైఎస్ఆర్సీపీకి.. దివగంత వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో లబ్ధిపొందినవారు, కొత్త ఓటర్లుగా నమోదైన యువతతో సహా మెజారిటీ ప్రజలు ఓట్లు వేస్తారని విశ్లేషిస్తున్నారు. ఫలితంగా అన్ని నియోజకవర్గాల్లోను పార్టీ విజయ ఢంకా మోగిస్తుందని స్పష్టం చేస్తున్నారు.