సాక్షి, అమరావతి: జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్షపై మంత్రుల కమిటీ శుక్రవారం సమావేశమైంది. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, వందేళ్ల తర్వాత తొలిసారి ఈ తరహా సమగ్ర సర్వే జరుగుతుందన్నారు. జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్షతో భూ వివాదాలకు చెక్ పడుతుందని మంత్రులు అన్నారు. ఆధునిక డ్రోన్, రోవర్ల సహకారంతో భూ సర్వే నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
భూ సర్వేకు రాష్ట్రంలో 70 కోర్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. ముందుగా గ్రామాల సరిహద్దుల గుర్తింపునకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రులు వివరించారు. సమగ్ర సర్వే కోసం 12వేల మంది సిబ్బందికి శిక్షణ పూర్తి చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 736 గ్రామాల్లో ల్యాండ్ పార్సిల్ మ్యాప్‌లు సిద్ధం చేసినట్లు తెలిపారు. 70లక్షల అసెస్‌మెంట్లకు గానూ 13.7లక్షల అసెస్‌మెంట్ల పరిశీలన పూర్తయ్యిందని, సమగ్ర భూ సర్వే ద్వారా రెవిన్యూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేసినట్లు మంత్రులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment