ministers committee
-
అందరికీ నాణ్యమైన డేటా
న్యూఢిల్లీ: నాణ్యమైన డేటా ప్రజలందరికీ అందుబాటులోకి రావాలని, ఈ విషయంలో సాంకేతిక ప్రజాస్వామీకరణ ఒక ముఖ్యమైన సాధనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. డేటాను అందించడంలో అంతరాలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం వారణాసిలో జరిగిన జీ20 దేశాల డెవలప్మెంట్ మంత్రుల సదస్సులో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. భారత్‌లో డిజిటలీకరణ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిందని, ఈ రంగంలో తమ అనుభవాన్ని భాగస్వామ్య దేశాలతో పంచుకొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అవసరంలో ఉన్నవారికి రుణాలు సులభంగా లభించేలా ఆర్థిక సంస్థల్లో సంస్కరణలు రావాలని ఆకాంక్షించారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి, వనరుల సమర్థ కేటాయింపునకు, ప్రజలకు పాలనాపరమైన సేవలు మెరుగ్గా అందించడానికి అత్యంత నాణ్యమైన డేటా అవసరమని వివరించారు. ప్రజా సాధికారతకు, డేటాను ప్రజలకు అందించడానికి టెక్నాలజీని విస్తృతంగా వాడుకుంటున్నామని వెల్లడించారు. నగరాలు, పట్టణాలే కాదు, మారుమూల ప్రాంతాల్లో ఉండేవారికి సైతం నాణ్యమైన డేటాను అందించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ధి లక్ష్యాలు సాధిద్దాం కోవిడ్ మహమ్మారి వ్యాప్తి వల్ల ప్రపంచ దేశాలు ఆర్థికాభివృద్ధిలో వెనుకంజ వేశాయని మోదీ గుర్తుచేశారు. అభివృద్ధి లక్ష్యాల సాధనకు కలిసికట్టుగా కృషి చేయడం మన బాధ్యత అని సూచించారు. మన ప్రయత్నాలనీ పారదర్శకంగా, సమగ్రంగా ఉండాలన్నారు. అభివృద్ధి లక్ష్యాల సాధనకు పెట్టుబడులు పెంచాలని చెప్పారు. చాలా దేశాలు అప్పుల ముప్పును ఎదుర్కొంటున్నాయని, ఈ సమస్య పరిష్కారానికి మార్గాలు కనిపెట్టాలని పిలుపునిచ్చారు. భారత్‌లో వందకుపైగా లక్ష్యిత జిల్లాల్లో ప్రజల జీవనాన్ని మరింత మెరుగుపర్చడానికి చర్యలు చేపట్టామని ప్రధానమంత్రి వివరించారు. ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అవి ఇప్పుడు అభివృద్ధి ఉత్ప్రేరకాలుగా మారాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ డెవలప్మెంట్ మోడల్‌ను అధ్యయనం చేయాలని జీ20 దేశాల మంత్రులకు నరేంద్ర మోదీ సూచించారు. ప్రకృతిని ఆరాధించడం భారత్‌లో ఒక సంప్రదాయంగా వస్తోందన్నారు. వాతావరణ మార్పుల నియంత్రణకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. లింగ సమానత్వం, మహిళా సాధికారతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేవారు. తమ దేశంలో మహిళా సాధికారతకు ఎలాంటి పరిమితులు లేవన్నారు. సమాజంలో మార్పునకు, ప్రగతికి మహిళలే సారథులని తేల్చిచెప్పారు. అభివృద్ధి ఎజెండాను వారే నిర్దేశిస్తారని అన్నారు. కాశీని సందర్శించండి ప్రజాస్వామ్యానికి తల్లిలాంటి భారత్‌లో వారణాసి అత్యంత పురాతన నగరమని ప్రధాని మోదీ తెలియజేశారు. విజ్ఞానానికి, చర్చకు, సంవాదానికి, సంస్కృతికి, ఆధ్యాత్మికతకు వారణాసి కొన్ని శతాబ్దాలుగా ముఖ్యమైన కేంద్రంగా వెలుగొందుతోందని హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజల కలయికకు ఇదొక కూడలి అని చెప్పారు. భారత్‌లోని భిన్నమైన సంస్కృతి సంప్రదాయాలను ఇక్కడ చూడొచ్చని అన్నారు. సదస్సు జరిగే గదులకే పరిమితం కాకుండా కాశీ నగరాన్ని సందర్శించాలని, కాశీ స్ఫూర్తిని అనుభూతి చెందాలని జీ20 దేశాల మంత్రులకు మోదీ విజ్ఞప్తి చేశారు. గంగా హారతిని, సారనాథ్‌ను తిలకిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించే ప్రేరణ కచ్చితంగా లభిస్తుందని తెలిపారు. వారణాసి తన సొంత నియోజకవర్గమని తాను ఈ మాట చెప్పడం లేదని మోదీ వ్యాఖ్యానించారు. -
‘మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం’
సాక్షి, అమరావతి: మున్సిపల్ శాఖలో పెండింగ్‌లో ఉన్న రూ. 511 కోట్ల బిల్లులను పూర్తిగా చెల్లించినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. CFMS ప్రకారం చెల్లించడం వల్ల కాస్త ఆలస్యం జరిగిందన్నారు మంత్రి. టీడీపీ ప్రభుత్వ హయాంలో CFMS విధానం తీసుకొచ్చారన్నారు. ‘స్వచ్ఛంద్ర కార్పోరేషన్ ద్వారా 2 వేల కోట్ల పనులు జరుగుతున్నాయి. పన్నుల విధానంలో సంస్కరణలతో మున్సిపాలిటీలకు ఆదాయం పెరిగింది. అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకంగా ప్రభుత్వం పనులు చేపడుతోంది. మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. ఉద్యోగ సంఘాలతో గత సమావేశంలో కీలక చర్చలు జరిగాయి. ఉద్యోగుల పెండింగ్ బిల్స్ పై చర్చ జరిగింది. జీపీఎస్ విధానంపై ఉద్యోగ సంఘాలకి పవర్ పాయింట్ ద్వారా వివరించాం. పాత పెన్షన్ వల్ల కలిగే నష్టాలు...జిపిఎస్ ఉపయోగాలు వివరించాం. ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందిస్తాయని ఆశిస్తున్నాం. ఈ సమావేశంలో కూడా కీలక అంశాలపై చర్చ జరగనుంది’ అని పేర్కొన్నారు. -
ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం కీలక భేటీ!
అమరావతి: ఉద్యోగ సంఘాలతో ఈరోజు(సోమవారం) సాయంత్రం మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. నేటి సాయంత్రం గం. 4.30ని.లకు మంత్రుల కమిటీ సమావేశం అవ్వనుంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మార్చి 7వ తేదీన జరిగిన సమావేశంలో నిర్ణయాలు ఇప్పటికే ప్రభుత్వం అమలు చేయగా, ఈరోజు మరికనని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ మేరకు 13 ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం ఆహ్వానించింది. -
మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల భేటీ.. మంత్రి బొత్స ఏమన్నారంటే?
సాక్షి, అమరావతి: ఉద్యోగుల సమస్యలపై చర్చించామని, టైమ్‌లైన్ ప్రకారం ప్రతి సమస్యను పరిష్కరించాలని నిర్ణయించామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల సమావేశం జరిగింది. అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ, ఒక్కొక్క జీవోను వరుసగా విడుదల చేస్తామని, ఉద్యోగుల బకాయిల్లో 70 శాతం చెల్లించాం.. సీపీఎస్‌పై మరోసారి చర్చిస్తామని ఆయన తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై చర్చించాం.. దాని అమలుకు స్పష్టమైన విధివిధానాలను రూపొందిస్తామని మంత్రి పేర్కొన్నారు. హెల్త్‌కార్డుల కంట్రిబ్యూషన్‌ను ట్రస్టుకు మళ్లించాలని నిర్ణయించాం: వెంకట్రామిరెడ్డి ‘‘ఉద్యోగుల పెండింగ్ బకాయిల్లో రూ.5,820 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. పెండింగ్ డీఏలలో ఒక డీఏను చెల్లిస్తామని చెప్పారని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి అన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వారం రోజుల్లో ఒక డీఏ ఉత్తర్వులు ఇస్తామని ప్రకటించారు. సీపీఎస్ రద్దు చేయాలని కోరాం. 2004కు ముందు నోటిఫికేషన్లో భర్తీ అయిన వారికి ఓపీఎస్ పరిధిలోకి తెస్తామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్య పరిష్కారానికి టైమ్‌లైన్ కోవాలని కోరాం. సెప్టెంబర్ లోపు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఉత్తర్వులు ఇస్తామన్నారు. కొత్త పీఆర్సీని నియమించాలని కోరాం. ఉద్యోగుల హెల్త్‌కార్డుల కంట్రిబ్యూషన్‌ను ట్రస్టుకు మళ్లించాలని నిర్ణయించాం’’ అని వెంకట్రామిరెడ్డి అన్నారు. చదవండి: ‘అవినాష్‌ను అనుమానించదగ్గ ఆధారాలు సీబీఐ దగ్గర లేవు’ -
సీఎం మా ఆవేదన అర్థం చేసుకున్నారు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల ఆవేదనను సీఎం వైఎస్ జగన్ పెద్ద మనసుతో అర్థం చేసుకుని, సమస్యలను సానుకూలంగా పరిష్కరించారని పీఆర్సీ సాధన సమితి నేతలు ప్రశంసించారు. మంత్రివర్గ ఉప సంఘంతో శుక్ర, శనివారాల్లో జరిపిన చర్చలు సఫలీకృతమవడంతో శనివారం రాత్రి పీఆర్సీ సాధన సమితి సమ్మెను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. ఆదివారం పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు, కె.వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, కె.సూర్యనారాయణ, ప్రసాద్ తదితరులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంతో సమావేశమై కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. మంత్రుల కమిటీ సిఫార్సుల మేరకు సీఎం హెచ్ఆర్ఏ శ్లాబులను పెంచారని, సీసీఏ (సిటీ కాంపెన్సేటరీ అలవెన్సు) కొనసాగించడంతో పాటు పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఇవ్వడానికి అంగీకరించారని తెలిపారు. దీని వల్ల రూ.1,330 కోట్ల భారం ఖజానాపై పడుతుందన్నారు. పీఆర్సీ ప్రకటనతో రూ.10,247 కోట్లు.. తాజాగా మంత్రుల కమిటీ ప్రతిపాదనలను సీఎం ఆమోదించడం ద్వారా అదనంగా రూ.1,330 కోట్లు వెరసి రూ.11,577 కోట్ల భారం ఖజానాపై పడుతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా ఉన్నప్పుడు ఎవరూ అడగకుండానే సీఎం 27% ఐఆర్ ఇచ్చారని గుర్తు చేశారు. కరోనా ప్రభావం వల్ల రాష్ట్ర ఆదాయం ఏటా రూ.20 వేల కోట్ల మేర తగ్గిందని.. దానివల్ల ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ను 23%కి మించి ఇవ్వలేకపోతున్నామని సీఎం ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు అర్థం చేసుకోవాలని కోరారు. ఉద్యోగుల మనోభావాలను సీఎం గౌరవించారు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల మనోభావాలను సీఎం గౌరవించి.. సమస్యలను సానుకూలంగా పరిష్కరించినందుకు కృతజ్ఞతలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించినంత మేరకు సీఎం చేయగలిగినంత చేశారు. ఫిట్మెంట్ మినహా మిగతా సమస్యలను పరిష్కరించారు. భవిష్యత్‌లో ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చించి.. పరిష్కరించడానికి మంత్రుల కమిటీని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తామని చెప్పడం అభినందనీయం. మేము మంత్రుల కమిటీతో చర్చించేందుకు అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో కలిసి కమిటీని ఏర్పాటు చేస్తాం. ప్రతి నెలా ఒక రోజున ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై.. సమస్యలపై చర్చిస్తానని సీఎం చెప్పారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే నిర్ణయాల్లో సంఘాల నేతలకు భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు. మంత్రుల కమిటీ సిఫార్సులను ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆమోదించి.. ఇప్పుడు భిన్నంగా మాట్లాడటం తగదు. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, రెవెన్యూ సర్వీసెస్ అసోషియేషన్ అధ్యక్షుడు సీఎం చేయగలిగినంత చేశారు గత నెల 7న సీఎం వైఎస్ జగన్ పీఆర్సీ ప్రకటన చేశాక ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు ఉద్యమం చేయడం వెనుక ఆవేదనను అర్థం చేసుకున్నందుకు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. పీఆర్సీ సాధన సమితితో చర్చించి.. మంత్రుల కమిటీ చేసిన సిఫార్సులను సీఎం ఆమోదించారు. హెచ్ఆర్ఏ శ్లాబులు పెంచారు. అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఇచ్చేందుకు అంగీకరించారు. రూ.5,400 కోట్లకుపైగా ఐఆర్ రికవరీని రద్దు చేశారు. సీపీఎస్ రద్దుకు మార్చి 31 నాటికి రోడ్ మ్యాప్ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడంపై స్పష్టత ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు చర్చించేందుకు మంత్రుల కమిటీని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి నెలా ఒక రోజు ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమవుతానని సీఎం చెప్పారు. కరోనా మహమ్మారి ప్రభావం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వల్లే ఉద్యోగులు ఆశించిన మేరకు ప్రయోజనం చేకూర్చలేకపోతున్నానని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించిన మేరకు ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ చేయగలిగినంతా చేశారు. మంత్రుల కమిటీ సిఫార్సులకు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆమోదం తెలిపి, సంతకాలు కూడా చేసి.. ఇప్పుడు భిన్నంగా మాట్లాడటం సరి కాదు. కష్టకాలంలోనూ సమస్యలను సానుకూలంగా పరిష్కరించిన అంశాన్ని గుర్తించాలి. –బండిశ్రీనివాసరావు,ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు, పీఆర్సీ సాధన సమితి నేత వేతనాలు పెరిగే పీఆర్సీ ఇది.. సమస్యలను పరిష్కరించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. గత నెల 7న పీఆర్సీ ప్రకటన చేసినప్పటి నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు ఆవేదనతో ఆగ్రహం వ్యక్తం చేసినందుకు సీఎం వైఎస్ జగన్‌కు క్షమాపణలు చెబుతున్నాం. తెలంగాణతో సమానంగా హెచ్ఆర్ఏ శ్లాబ్‌లను పెంచారు. సీసీఏ కొనసాగించారు. ఐఆర్ రికవరీని రద్దు చేశారు. ప్రతి ఉద్యోగి వేతనం పెరుగుతుంది. సమస్యల పరిష్కారం కోసం చేసిన సమ్మెలు ఇప్పటిదాకా ఫలవంతమైన దాఖలాలు లేవు. 1986లో 53 రోజులకుపైగా ఉద్యోగులు సమ్మె చేసినా సమస్యలు పరిష్కారం కాకపోగా.. సమ్మె కాలాన్ని రెగ్యులరైజ్ చేయాలని కోరాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1999లో ఉపాధ్యాయుల అప్రెంటీస్‌పై 23 రోజులు చేసిన సమ్మె కూడా ఫలవంతం కాలేదు. ఇప్పుడు సమ్మెకు వెళ్లాల్సిన పరిస్థితి ఉత్పన్నం కానివ్వకుండా.. కేవలం రెండు రోజుల్లోనే మంత్రుల కమిటీని ఏర్పాటు చేసి.. సమస్యను సానుకూలంగా పరిష్కరించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. సీపీఎస్ రద్దుపై రోడ్ మ్యాప్ ప్రకటిస్తామని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీ్దకరణ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించారు. మంత్రుల కమిటీ సిఫార్సులను ఆమోదించిన ఉపాధ్యాయ సంఘాల నేతలు.. ఇప్పుడు భిన్నంగా మాట్లాడటం సరి కాదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఇరు పక్షాల తరఫున మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు. – కె.వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఈ పరిస్థితిలో ఇది బెస్ట్ ప్యాకేజీ దేశంలో ఎక్కడా లేని రీతిలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. కేంద్రం తరహాలో పదేళ్లకు ఓ సారి కాకుండా ఐదేళ్లకు ఓ సారి వేతన సవరణ సంఘాన్ని (పీఆర్సీ) ఏర్పాటు చేయడానికి సీఎం అంగీకరించారు. దీని వల్ల 2023లో కొత్త పీఆర్సీని ఏర్పాటు చేస్తారు. సీపీఎస్ రద్దుకు రోడ్ మ్యాప్‌ను మార్చి 31లోగా ప్రకటిస్తామని సీఎం చెప్పారు. జగన్ ప్రభుత్వం చేసిందనే రీతిలో సీపీఎస్ సమస్యను పరిష్కరిస్తామని సీఎం చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై స్పష్టత ఇస్తామన్నారు. హెచ్ఆర్ఏ శ్లాబులను పెంచడంతో పాటు అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఇచ్చేందుకు అంగీకరించారు. సీసీఏను కొనసాగించేందుకు ఆమోదం తెలిపారు. ఐఆర్ రికవరీని రద్దు చేయడం ప్రశంసనీయం. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు ఎవరూ అడగకుండానే 27 శాతం ఐఆర్ ఇవ్వడం వల్ల.. ఫిట్మెంట్ అంతకంటే ఎక్కువ ఇస్తారని ఉద్యోగులు ఆశించారు. కరోనా ప్రభావం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినింది. అందువల్ల ఫిట్మెంట్ 23 శాతానికి మించి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించిన మేరకు చేయగలిగినంత చేసిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. ఇది ఉద్యోగులకు ఇచ్చిన బెస్ట్ ప్యాకేజీ. ఉపాధ్యాయ సంఘాల నేతలు మంత్రల కమిటీ సిఫార్సులను అంగీకరించి, ఇప్పుడు తద్భిన్నంగా మాట్లాడటం తగదు. – కె.సూర్యనారాయణ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, పీఆర్సీ సాధన సమితి నేత మాకు మంచి చేయాలనే కసి ముఖ్యమంత్రిలో ఉంది రాష్ట్రంలో ఇప్పటికే 1.80 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు 1.30 లక్షలు, ఆర్టీసీ ఉద్యోగులు 60 వేల మంది కలిపితే మొత్తం 3,70 లక్షల మంది సీపీఎస్ కిందకు వస్తారు. మొత్తం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల్లో 70 శాతం సీపీఎస్ ఉద్యోగులే. 2019 ఎన్నికల ప్రచారంలో సీపీఎస్‌ను రద్దు చేస్తానని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చినప్పుడు ఉన్న చిత్తశుద్ధే ఇప్పుడూ కన్పిస్తోంది. మార్చి 31 నాటికి సీపీఎస్ రద్దుకు రోడ్ మ్యాప్‌ను ప్రకటిస్తామని సీఎం చెప్పారు. ఇచ్చిన హామీని అమలు చేయాలనే కసి సీఎం వైఎస్ జగన్‌లో బలంగా ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల మనోభావాలను గౌరవించి, చేయగలిగినంతా చేసిన సీఎంకు కృతజ్ఞతలు. – ప్రసాద్, సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, పీఆర్సీ సాధన సమితి నేత -
ఈ ప్రభుత్వం మీది: ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పీఆర్సీ సాధన సమితి సమావేశమైంది. మంత్రివర్గ ఉప సంఘంతో రెండు రోజులపాటు సుదీర్ఘంగా జరిగిన చర్చలు ఫలించడంతో పీఆర్సీ సాధన సమితి సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ప్రభుత్వం తమ కోరికలను మన్నించడంతో సమ్మెలోకి వెళ్లడం లేదని నేతలు ప్రకటించారు. చర్చలు సఫలం కావడంతో ఆదివారం సీఎం జగన్‌తో ఉద్యోగ సంఘాలు ప్రత్యేకంగా భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా.. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఇంత మేలు చేసినందుకు సీఎం వైఎస్ జగన్‌కు ఉద్యోగ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగ సంఘాలతో సీఎం ►ఈ ప్రభుత్వం మీది. మీ సహకారంతో మంచి చేయగలుగుతున్నాను ►ఆర్థిక పరిస్థితుల వల్ల, కరోనా ప్రభావం వల్ల మీరు ఆశించినంత రీతిలో ఇవ్వలేకపోవచ్చు ►కాని ఎంతమేర మేలు చేయగలుగుతామో అన్నిరకాలుగా చేశాం ►రాజకీయాలు ఇందులోకి వస్తే.. వాతావరణం దెబ్బతింటుంది ►రాజకీయాలకు తావు ఉండకూడదు ►ఏదైనా సమస్య ఉంటే.. అనామలీస్ కమిటీకూడా ఉంది ►ఎప్పుడైనా మీరు మీ సమస్యలను చెప్పుకోవచ్చు ►ఉద్యోగ సమస్యలపై మంత్రుల కమిటీ కొనసాగుతుంది ►ఏ సమస్య ఉన్నా.. వారికి చెప్పుకోవచ్చు ►ప్రభుత్వం అంటే ఉద్యోగులది ►అంత దూరం పోవాల్సిన అసరం లేకుండా కూడా పరిష్కారం చేయొచ్చు ►ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి ►నిన్న మంత్రుల కమిటీ నాతో టచ్‌లోనే ఉంది ►నా ఆమోదంతోనే వీటన్నింటినీ కూడా మీకు చెప్పడం జరిగింది ►ఐ.ఆర్. ఇచ్చిన 30 నెలల కాలానికి గానూ, 9 నెలల ఐ.ఆర్‌ను. సర్దుబాటు నుంచి మినహాయింపు వల్ల రూ.5400కోట్లు భారం పడుతోంది ►హెచ్.ఆర్.ఏ రూపంలో అదనంగామరో రూ.325 కోట్లు భారం పడుతోంది ►అదనంగా భారం పడేది కాకుండా రికరింగ్ వ్యయం రూపేణా హెచ్.ఆర్.ఏ వల్ల రూ.800 కోట్లు, అడిషనల్‌క్వాంటమ్‌పెన్షన్, సీసీఏ రూపంలో మొత్తంగా రూ.1330 కోట్లు భారం పడుతోంది. ►మొత్తంగా రూ.11,500 కోట్లు రికరింగ్‌గా భారం పడుతోంది. ఆర్థికంగా పడే భారం ఇది ►మీకు తెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ వివరాలు చెప్తున్నాను ►రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా... మీరు ఈ ప్రతిపాదనలకు అంగీకరించినందుకు ధన్యవాదాలు. మనం ఒక్కటిగా కలిసి ముందుకు సాగుదాం ►ఈ పరిస్థితులు ఈ మాదిరిగా ఉండకపోయి ఉంటే... మీ అందర్నీ మరింత సంతోషపెట్టేవాడిని ►దురదృష్టవశాత్తూ అలాంటి పరిస్థితులు లేవు. రాష్ట్ర ఆదాయాలు బాగా పడిపోయాయి ►మినిమం టైం స్కేలు వర్తింపు చేశాం, అన్నిరకాలుగా ఆయా జీతాలు పెంచాం ►ఇలాంటి పరిస్థితుల్లో ఈ చర్చలు జరిగాయి ►మీరు లేకపోతే నేను లేను. పారదర్శకంగా, అవినీతి లేకుండా బటన్ నొక్కి ప్రజలకు ఇవ్వగలుగుతున్నాను. ఇది మీ వల్లే సాధ్యపడుతోంది ►భావోద్వేగాలకు పెద్దగా తావు ఇవ్వకండి. ఏదైనా సమస్య ఉంటే.. మీరు చెప్పుకోండి ►రాబోయే రోజుల్లో సీపీఎస్‌మీద గట్టిగా పనిచేస్తున్నాం ►అన్ని వివరాలూ తీసుకుని గట్టిగా పనిచేస్తున్నాం ►వివరాలు ఖరారైన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులతో వాటిని పంచుకుంటాను ►ఇవాళ మీరు కొత్తపద్దతిలోతీసుకుంటున్న పెన్షన్ మంచిగా పెరిగేలా చూస్తాను ►ఉద్యోగులకు ఎవ్వరూ చేయని విధంగా జగన్ చేశాడు అనే పరిస్థితిలోకి వెళ్లేలా.. రిటైర్ అయిన తర్వాత మీకు మంచి జరిగేలా ఆ దిశగా అడుగులు వేస్తున్నాం ►భిన్నంగా ఎలా చేయాలో కూడా గట్టిగా ఆలోచనలు చేస్తున్నాం ►అందులో మిమ్మల్ని భాగస్వాములను చేస్తాను ►కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నాం. దీనిపై ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాం. అన్ని విషయాలు కూడా మీకు తెలియజేస్తాను ►30వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇస్తున్నాం ►సబ్జెక్టుల వారీగా టీచర్లను తీసుకువస్తున్నాం ►అందరూ కలిసికట్టుగా భావితరాలకు మంచి రాష్ట్రాన్ని అందిద్దాం ►ఎక్కడైనా కూడా తక్కువ చేస్తున్నాం అనిపించినప్పుడు.. అలా ఉండకూడదని కొన్ని చర్యలు తీసుకున్నాం ►దీంట్లో భాగంగానే రిటైర్‌మెంట్‌వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం ►24 నెలల జీతం రూపేణా మరోచోట మంచి జరుగుతుందనే ఉద్దేశంతోమీరు అడగకపోయినా మేం చేశాం ►అలాగే ఇళ్లస్థలాల విషయంలోకూడా మీరు అడగకపోయినా నిర్ణయం తీసుకున్నాం ►ప్రభుత్వం ఎప్పుడూ మీతో ఉంటుంది. ఏ సమస్యపైనైనా చర్చకు సిద్ధం ►మీరు చెప్పేవి వినడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది చదవండి: రాష్ట్ర ప్రభుత్వంతో పీఆర్సీ స్టీరింగ్ కమిటీ నేతల చర్చలు సఫలం -
ఉద్యోగులకు 'ఐఆర్' రికవరీపై క్లారిటీ
-
AP: మంత్రుల కమిటీతో ముగిసిన ఉద్యోగ సంఘాల భేటీ
సాక్షి, విజయవాడ: ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. సమస్య పరిష్కారం దిశగా చర్చలు కొనసాగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మంత్రుల కమిటీ చర్చిస్తోంది. పలు డిమాండ్లపై ఇరుపక్షాలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చించిన ఉద్యోగ సంఘాలు చర్చించాయి. దాదాపు నాలుగున్నర గంటల పాటు సమావేశం కొనసాగింది. ఈ భేటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పేర్నినాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీఎస్ సమీర్ శర్మ, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ పాల్గొన్నారు. స్టీరింగ్ కమిటీ తరపున 20 మంది ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. చదవండి: (సీఎం వైఎస్ జగన్ సమక్షంలో మంత్రుల కీలక చర్చ) -
‘ద్వారాలు తెరిచే ఉన్నాయి.. చర్చలకు రండి’
సాక్షి, తాడేపల్లి: ఉద్యోగులు ఏది కావాలంటే అది చేసిన ప్రభుత్వం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. 2008, 2018 డీఎస్సీలను పరిష్కరించి టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చింది మన సీఎం జగన్ అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ‘ఉద్యోగులకు మేలు చేసే ముఖ్యమంత్రి మనకు ఉన్నారు. ఇంకా ద్వారాలు తెరిచే ఉన్నాయి.. చర్చలకు రండి. మీరంతా మా కుటుంబ సభ్యులు...ఎవరికీ అన్యాయం జరగదు. ఉద్యోగులకు ప్రమోషన్స్ అనేక ఇచ్చారు. ఏది కావాలంటే అది చేసిన ప్రభుత్వం మనది. ఇంత దాకా రావాల్సిన అవసరమే లేదు...మంచి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ సమస్య అయినా మంత్రుల కమిటీ ముందు చర్చించండి. ఉద్యోగ సంఘాలకు అత్యంత గౌరవం ఇచ్చే ముఖ్యమంత్రి.. వైఎస్ జగన్. ఉద్యోగ సంఘాలు ఓట్ల గురించి కాదు.. సమస్య గురించి మాట్లాడాలి’ అని మంత్రి హితవు పలికారు. -
‘ఉద్యోగులకు మేలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’
గుంటూరు: ఉద్యోగుల సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. తాము చర్చలకు అవకాశం ఇవ్వడం లేదనేది అబద్ధమని, ఉద్యోగులు సహకరించాలని సీఎం వైఎస్ జగన్ చెప్పిన విషయాన్ని సుచరిత గుర్తుచేశారు. జిన్నా టవర్ వద్ద సర్వమత ప్రార్థనలు చేసిన సుచరిత.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘కమిటీ కూడా వేశాం. ఉద్యోగులకు మేలు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది. చర్చలకు సహకరించండి’ అని పేర్కొన్నారు. -
ఉద్యోగులతో మంత్రుల కమిటీ సమావేశం
తాడేపల్లి: మంత్రుల కమిటీతో చర్చలకు హాజరు కాబోమని పట్టుబట్టిన ఉద్యోగ సంఘాలు పట్టువిడుపు ప్రదర్శించాయి. ఈ మేరకు మంగళవారం మంత్రుల కమిటీతో పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులు చర్చల్లో పాల్గొన్నారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణలతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు ఈ సమవేశంలో పాల్గొనగా, పీఆర్సీ స్టీరింగ్ కమిటీ నుంచి వెంకట్రామిరెడ్డి, కె ఆర్ సూర్యనారాయణ, బొప్పరాజు, బండి శ్రీనివాస్ చర్చల్లో పాల్గొన్నారు. -
ఉద్యోగ సంఘాలను ఆహ్వానించిన మంత్రుల కమిటీ
సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాల నాయకులతో సంప్రదింపులకు మంత్రుల కమిటీ ఆహ్వానించింది. రేపు(సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయం రెండో బ్లాక్‌కు రావాలంటూ ఉద్యోగ సంఘాల నాయకులకు సమాచారం ఇచ్చింది. ఉద్యోగులతో సంప్రదింపులకు, వారికి నచ్చజెప్పడానికి మంత్రులు బుగ్గన, బొత్స, పేర్నినాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్ సమీర్ శర్మలతో ఒక కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఢిల్లీ పర్యటనలో మంత్రి బుగ్గన, సీఎస్ ఉన్నందున మిగిలిన ముగ్గురూ.. ఉద్యోగులతో సంప్రదింపులకు అందుబాటులో ఉండనున్నారు. చదవండి: గ్రామ వలంటీర్లకు ప్రమాద బీమా -
‘వన్‌టైమ్ సెటిల్మెంట్’ అమలు సమీక్షకు మంత్రుల కమిటీ
సాక్షి, అమరావతి: పేదల గృహ రుణాలకు సంబంధించిన వన్‌టైమ్ సెటిల్మెంట్ స్కీం అమలును సమీక్షించేందుకు మంత్రుల కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో డిప్యూటీ సీఎం(రెవెన్యూ శాఖ) ధర్మాన కృష్ణదాస్, మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు సభ్యులుగా ఉంటారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ వారానికి ఒకసారి ఈ పథకంపై సమీక్షించాల్సి ఉంటుంది. అలాగే అవసరమైన చర్యలను వివరిస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి. -
ఏపీ: సమగ్ర సర్వేతో భూ వివాదాలకు చెక్: మంత్రులు
సాక్షి, అమరావతి: జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్షపై మంత్రుల కమిటీ శుక్రవారం సమావేశమైంది. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, వందేళ్ల తర్వాత తొలిసారి ఈ తరహా సమగ్ర సర్వే జరుగుతుందన్నారు. జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్షతో భూ వివాదాలకు చెక్ పడుతుందని మంత్రులు అన్నారు. ఆధునిక డ్రోన్, రోవర్ల సహకారంతో భూ సర్వే నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భూ సర్వేకు రాష్ట్రంలో 70 కోర్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. ముందుగా గ్రామాల సరిహద్దుల గుర్తింపునకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రులు వివరించారు. సమగ్ర సర్వే కోసం 12వేల మంది సిబ్బందికి శిక్షణ పూర్తి చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 736 గ్రామాల్లో ల్యాండ్ పార్సిల్ మ్యాప్‌లు సిద్ధం చేసినట్లు తెలిపారు. 70లక్షల అసెస్మెంట్లకు గానూ 13.7లక్షల అసెస్మెంట్ల పరిశీలన పూర్తయ్యిందని, సమగ్ర భూ సర్వే ద్వారా రెవిన్యూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేసినట్లు మంత్రులు వెల్లడించారు. -
ఏపీ: కరోనాపై మంత్రుల కమిటీ భేటీ
సాక్షి, విజయవాడ: కరోనా నియంత్రణ చర్యలపై చర్చించడానికి విజయవాడ ఆర్అండ్బి కార్యాలయంలో మంత్రుల కమిటీ సమావేశమైంది. మంత్రులు ఆళ్లనాని, బొత్స సత్యనారాయణ, సుచరిత, బుగ్గన రాజేంద్రనాథ్, కురసాల కన్నబాబు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, అదనపు సీఎస్ పీవీ రమేష్, వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి పాల్గొన్నారు. (కరోనా : కేంద్ర బలగాలు రావట్లేదు) కోవిడ్ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కోసం ఐదుగురు మంత్రులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కన్వీనర్‌గా ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సభ్యులుగా.. మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి బొత్స, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, హోం శాఖ మంత్రి సుచరిత సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయడం, వైరస్ వ్యాప్తి చెందకుండా వివిధ దశల్లో తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ ఎప్పటికప్పుడు సమావేశమై సమీక్షిస్తుంది. కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర స్థాయిలో వివిధ విభాగాల ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి కమిటీని సర్కార్ నియమించింది. ఈ మేరకు సీఎస్ నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ వ్యాప్తి నిరోధం, క్వారంటైన్లో ఉన్నవారి పర్యవేక్షణ, లాక్డౌన్ అమలు వంటివి పటిష్టంగా అమలు చేయడానికి ఈ కమిటీని వేసినట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సీఎస్ నీలం సాహ్ని చైర్‌పర్సన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కో చైర్మన్‌గానూ, కన్వీనర్‌గానూ ఉంటారు. సభ్యులుగా డా.పీవీ రమేష్, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, రెవెన్యూ, పౌరసరఫరాలు, మార్కెటింగ్, రవాణా శాఖల ముఖ్య కార్యదర్శులు, సీఎంవో ముఖ్య కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్య రాజ్, సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డి, సమాచార పౌరసంబంధాల ఎక్స్ అఫీషియో స్పెషల్ సెక్రటరీలు ఉంటారు. -
ఇళ్ల స్థలాల కేటాయింపుపై మంత్రుల కమిటీ
సాక్షి, అమరావతి : ప్రభుత్వ ఉద్యోగులు, అడ్వకేట్లు, జర్నలిస్టులతో పాటు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించే అంశంపై ఏపీ ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ సీఎం పల్లి సుభాష్ చంద్రబోస్‌ను నియమించింది. సభ్యులుగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వం జోవో జారీ చేసింది. పుజారులు, ఇమామ్‌లు, పాస్టర్లకు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు విధివిధానాలను రూపొందించి నివేదిక అందించాల్సిందిగా ఉపసంఘానికి ప్రభుత్వం ఆదేశించింది. -
బదిలీలు ఆన్లైన్!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో టీచర్ బదిలీలు ఇక ఆన్లైన్ విధానంలో జరగనున్నాయి. ప్రభుత్వం ఈ దిశగా యోచిస్తోంది. ఈ వేసవి సెలవుల్లోనే అందుకు శ్రీకారం చుట్టే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటివరకు కౌన్సెలింగ్ విధానంలో బదిలీలు చేస్తున్నారు. అయితే ఇందులో అనేక అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో ఆన్లైన్ బదిలీల వైపు ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. శనివారం సచివాలయంలో జరిగిన సమావేశంలో ఈటల రాజేందర్, కె.తారకరామారావు, జి.జగదీశ్‌రెడ్డిలతో కూడిన మంత్రుల కమిటీ కూడా ఇదే విషయాన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలకు తెలిపింది. అందుకు ఉపాధ్యాయ సంఘాలు సైతం అంగీకరించాయి. ఈ భేటీలో టీచర్లకు సంబంధించిన 36 రకాల సమస్యలు, డిమాండ్లపై చర్చించారు. గతంలో జరిగిన బదిలీల్లో అవకతవకల కారణంగా ముగ్గురు డీఈవోలు సస్పెండ్ అయ్యారని, దాంతో ప్రభుత్వం అభాసుపాలైందని మంత్రుల కమిటీ పేర్కొన్నట్లు తెలిసింది. కోర్టులో ఉన్న సర్వీసు రూల్స్ అంశంపై వాదించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిని నియమించేందుకు కమిటీ స్పష్టమైన హామీ ఇచ్చిందని సంఘాలు తెలిపాయి. ఈలోగా సర్వీసు రూల్స్ సమస్య పరిష్కారం కాకపోతే పాత రూల్స్ ప్రకారం ఎవరి మేనేజ్మెంట్లో వారికి పదోన్నతులు ఇచ్చేందుకు చర్యలు చేపడతామని వెల్లడించిందని వివరించాయి. వీటితోపాటు ఇతర సమస్యల పరిష్కారం పట్ల మంత్రుల కమిటీ సానుకూలత వ్యక్తం చేసిందని సంఘాల నేతలు వెల్లడించారు. ఆర్థిక భారంతో కూడుకున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి రోటీన్‌గా చేయాల్సిన అంశాల్లో పీఆర్సీ ఉందని, ఇందుకు సంబంధించి కమిషన్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని మంత్రుల కమిటీ తెలిపింఇ. ఒకవేళ నివేదిక, అమలు ఆలస్యమైతే మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటిస్తామని పేర్కొన్నట్లు సంఘాల నేతలు చెప్పారు. అలాగే ప్రతి మండలంలో ఐదెకరాల స్థలం కలిగిన పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్‌గా అభివృద్ధి చేసి, క్లస్టర్ హాస్టళ్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు పేర్కొన్నారు. సర్వీసు రూల్స్, బదిలీలు, పీఆర్సీ ఏర్పాటు, ఇతర సమస్యల పరిష్కారంపైనా ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలన్నింటనీ క్రోడీకరించి సీఎంకు నివేదిక అందజేస్తామని పేర్కొంది. ఈ సమావేశంలో మండలి చీఫ్ విప్ సుధాకర్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్, జేసీటీయూ నాయకులు రఘనందన్, అంజిరెడ్డి, రఘుశంకర్‌రెడ్డి, మల్లయ్య, అంజిరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డి, సదానంద్ గౌడ్, చావ రవి, మైస శ్రీనివాస్, ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి వీరాచారి తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే పరిష్కారిస్తాం: మంత్రి ఈటల రాజేందర్ ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లను ఐదు రకాలుగా విభజించాం. అందులో ఒకటి రొటీన్‌గా చేయాల్సినవి. బదిలీలు, పదోన్నతులు, విద్యార్థులు ఉన్న చోటికి టీచర్లను పంపించడం. వీటి పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది. రెండోది న్యాయ వివాదాలతో ముడిపడిన అంశాలు. ముఖ్యంగా సర్వీసు రూల్స్ అంశం కోర్టులో ఉంది. ఇందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టే రాష్ట్రపతి ఆమోదం తీసుకువచ్చాం. సీఎం దృష్టికి తీసుకువెళ్లి కేసుపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిని నియమిస్తాం. మూడోది పాఠశాలల్లో సదుపాయాల కల్పన. ఇందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇంకా> చేస్తాం. నాలుగోది ఆర్థిక భారంతో కూడిన అంశాలు. ఎన్టీఆర్ హయాంలో రూ.398 వేతనంతో నియమించిన టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చే అంశంపై సానుకూలంగా ఉన్నాం. పీఆర్సీ నియామకం చేయాల్సిందే. దానిపై సానుకూలంగా ఉన్నాం. ఐదో అంశం సీపీఎస్. దీనిపై ముఖ్యమంత్రికి అవగాహన ఉంది. గత ప్రభుత్వాలు వెట్టి చాకిరీ చేయించుకున్నాయి. ఇప్పుడు అలా లేదు. ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చాం. కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలను పెంచాం. పండిట్, పీఈటీ సమస్యలు పరిష్కరిస్తాం. ప్రభుత్వం, ఉద్యోగులు వేర్వేరు కాదు. రాబోయే కాలంలో ఈ సంబంధం మరింత బలోపేతమై కొనసాగుతుంది. విద్యా సంవత్సరం ప్రారంభంలోగా వీలైనన్ని సమస్యలు పరిష్కరిస్తాం. సానుకూలంగా స్పందించారు: సరోత్తంరెడ్డి, పీఆర్టీయూ–టీఎస్ అధ్యక్షుడు సీపీఎస్ రద్దుపై సీఎంతో చర్చిద్దామని చెప్పారు. ఏకీకృత సర్వీసు రూల్స్ అంశం హైకోర్టులో ఉంది. సుప్రీం న్యాయవాదిని నియమించి జూన్ 6న వాదనలు వినిపించాలని కోరాం. అందుకు సానుకూలంగా స్పందించారు. బదిలీలు, పదోన్నతులు పాఠశాలలు ప్రారంభం కావడానికి ముందే చేపట్టాలని, అందుకు న్యాయపరమైన ఇబ్బందులు ఉంటే ఆయా అంశాలపై దృష్టి సారించాలన్నాం. 2003 డీఎస్సీ టీచర్ల సమస్యపై చర్చించాం. వేసవిలో మధ్యాహ్న భోజనం విధులు నిర్వర్తించిన టీచర్లకు 24 రోజుల ఈఎల్స్పై చర్చించాం. కమిటీ ప్రతి సమస్యను పరిష్కరించేలా సానుకూలంగా స్పందించింది. 34 డిమాండ్లలో ఒకటే పరిష్కారం అయింది. మిగతా వాటిని పరిష్కరించాలని విన్నవించాం. ఎయిడెడ్, కేజీబీవీ మోడల్ గిరిజన టీచర్ల సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లాం. పాత జిల్లాల ప్రకారం బదిలీలకు ఒకే: భుజంగరావు, ఎస్టీయూ అధ్యక్షుడు త్వరలో సీఎంతో సమావేశం నిర్వహించేందుకు ఓకే చెప్పారు. ఆర్థిక పరమైన సమస్యలపైనా సీఎంతో చర్చిద్దామన్నారు. కచ్చితంగా బదిలీలను పాత జిల్లాల ప్రకారమే చేస్తామని హామీ ఇచ్చారు. హెచ్ఎంలకు అదనపు బాధ్యతలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఒక్క స్కూల్ ఉండేలా చూడమని కోరాం. ఎస్సీ, ఎస్టీ టీచర్లకు ఉన్నత చదువులకు వెళ్లే ఉత్తర్వులను అమలు చేస్తామన్నారు. మేనేజ్మెంట్ వారీగా పదోన్నతులను హెడ్ మాస్టర్లకే పరిమితం చేయకుండా కిందిస్థాయి టీచర్ల వరకు వర్తింపజేయాలని కోరాం. పీఆర్సీ ఏర్పాటుకు ఓకే: నర్సిరెడ్డి, యూటీఎఫ్ అధ్యక్షుడు వీటిని ప్రాథమిక చర్చలుగా భావిస్తున్నాం. సానుకూల దృక్ఫథంతో ఉన్నాం. పాఠశాలల అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రికి పూర్తి అధికారాలు ఇవ్వాలన్నాం. ఆర్థిక సమస్యల విషయంలో మాత్రమే సీఎం చొరవ తీసుకొని వెంటనే చర్యలు చేపట్టాలి. పీఆర్సీ, ఐఆర్ ఇస్తామన్నారు. స్వాగతిస్తున్నాం. -
రాష్ట్ర అవతరణ వేడుకలపై మంత్రుల కమిటీ భేటీ
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో బుధవారం మంత్రుల కమిటీ సమావేశమైంది. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సంబంధించి సన్నాహాలపై మంత్రుల కమిటీ సమావేశం అయినట్టు తెలిసింది. ఈ సమావేశానికి మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, ఈటెల రాజేందర్, కేటీఆర్, చందులాల్, జూపల్లి కృష్ణారావు, చీఫ్ సెక్రటరీ, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
భూసేకరణకు మంత్రుల కమిటి నియామకం
-
భూసేకరణకు మంత్రుల కమిటి నియామకం
హైదరాబాద్: ఏపి రాజధాని నిర్మాణం నిమిత్తం భూసేకరణ(లాండ్ పూలింగ్) కోసం రాష్ట్ర ప్రభుత్వం మంత్రి వర్గం ఉపసంఘాన్ని నియమించింది. ఈ కమిటీలో ఆరుగురు మంత్రులు సభ్యులుగా ఉంటారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, నీటిపారుదల, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ, సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు, సమాచార పౌరసంబంధాలు, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాధ రెడ్డిలకు ఈ కమిటీలో స్థానం దక్కింది. మంత్రి అచ్చెన్నాయుడు పేరును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తికి ఈ కమిటీలో స్థానం లభించలేదు. ** -
మాటల్లో కోటలు..చేతలు నీటిమూటలు
సాక్షి, రాజమండ్రి :‘వట్టిమాటలు కట్టిపెట్టి, గట్టిమేలు తలపెట్టవోయ్’ అని మహాకవి అంటే.. ‘వట్టిమాటల ఊకదంచి, గట్టిమేలు ఎగ్గొట్టవోయ్’ అంటున్నారు ప్రస్తుత పాలకులు. రైతులకు, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణమాఫీ వాగ్దా నం నుంచి గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామన్న ప్రకటన వరకూ చంద్రబాబు సర్కారు తీరు.. మాటలతో కోటలు కట్టి, చేతల్లో ఇసుక పిచ్చుకగూళ్లు చూపే తంతులా ఉంది. గత పుష్కరాల కన్నా రెట్టింపు యాత్రికులు వస్తారని, కుంభమేళా స్థాయిలో నిర్వహిస్తామని మంత్రులు గొప్పలు చెప్పారు. అయితే.. సర్కారు వ్యవహరిస్తున్న తీరు మాత్రం అందుకు అనుగుణంగా లేదు. పుష్కరాలకు ఏడాది ముందే ఏర్పాట్లు ప్రారంభించాలన్న డిమాండ్ మేరకు ఈ నెల 8న రాజమండ్రిలో మంత్రుల కమిటీ సమావేశం నిర్వహించి చేతులు దులుపుకొంది. భారీ ప్రతిపాదనలతో వచ్చిన వివిధ శాఖల అధికారులు తెల్లముఖాలు వేసేలా చేసింది. తాజాగా ఆ ప్రతిపాదనల్లో భారీగా కోత పెట్టి, కుదించి పంపాల్సిందిగా ప్రభుత్వం ఉ భయగోదావరి జిల్లాల కలెక్టర్లను ఆదేశించడంతో అధికారులు.. తమ శాఖ కు ఎంత వస్తుందో, ఏ పనులు చేయా లో అన్న అయోమయాన్ని ఎదుర్కొం టున్నారు. ఈ మాత్రం దానికి ఇంత హడావుడి చేయాలా అని నిట్టూరుస్తున్నారు. ‘మేం అడిగినన్ని నిధులు ఇవ్వక్కరలేదు. ఓ అయిదు కోట్లు ఇస్తే చా లు.. ఘాట్ల వద్ద ఏర్పాట్లు చేసి, పు ష్కరాలు అయ్యాయి అనిపించేస్తాం’ ఓ శాఖ ఉన్నతాధికారి ఆవేదనతో అ న్న మాటలివి. ఈ పుష్కరాలు ప్రత్యేకమైనవని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం అందుకు తగిన నిధులిచ్చే విషయంలో వెనుకాడుతోంది. జిల్లావ్యాప్తంగా ర హదారులు ఛిద్రమయ్యాయి. స్నాన ఘట్టాల్లో గత పుష్కరాలకు చేసిన ఏర్పాట్లు శిథిలం అవుతున్నాయి. సుమారు 110 ఘాట్లు అవసరం కా గా 60 లోపే అందుబాటులో ఉన్నా యి. మరి పోటెత్తే యాత్రికులకు సదుపాయాలు ఎలా కల్పించాలన్నది అధికారుల ఆవేదన. మరో పక్క దేవాదాయ శాఖ ఆధీనంలోని ఆలయాల ఆదాయాన్ని పుష్కర ఏర్పాట్లకు మళ్లించాలన్న మంత్రుల కమిటీ సూచనలపై కూడా నిరసన వ్యక్తమవుతోంది. ఈ సూచన ఆలయాల నిర్వాహక కమిటీలకు రుచించడం లేదు. గిరి గీసుకున్న సర్కారు.. పుష్కరాల నిర్వహణకు ఆకాశమే హ ద్దంటూనే ఆర్థిక మంత్రి యనమల ప్ర భుత్వం రూ.వంద కోట్లు కేటాయిస్తుం దని వెల్లడించారు. దీనిని బట్టి ఎం త అవసరం ఉన్నా మరో వంద కోట్లు దాటి రాదని స్పష్టమవుతోంది. ఉభ య గోదావరి జిల్లాలో అధికారులు సుమారు 1100 కోట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.ఒక్క రాజమం డ్రి నగర పాలక సంస్తే రూ. 270 కోట్లు కావాల ని కోరుతోంది. కానీ వీటిలో పది నుం చి 15 శాతం ఇచ్చేందుకు మాత్రమే సర్కారు సుముఖంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రతిపాదనలను కుదిం చి పం పాలన్న ప్రభుత్వాదేశాల మేరకు జిల్లా కలెక్టర్ నీతూకుమారి ఆయా శాఖల అధికారులతో సమాలోచనలు జరుపుతున్నారు. ప్రతిపాదించిన పనులు కే వలం పుష్కరాల్లో యాత్రికులకు సదుపాయాలు కల్పించేవే కావాలన్న మంత్రుల కమిటీ సూచనను గుర్తు చేస్తున్నారు. దీంతో పనుల్లో వేటిని ఉం చాలి, వేటిని తొలగించాలనే సందిగ్ధం అధికారులను పీడిస్తోంది. వారి ఆశలూ అడియాసలే.. ‘పుష్కరాలకు భారీగా నిధులు విడుదల అవుతాయి. పనుల్లో పెత్తనం మనదే. పనులు చేయించిన ఘనతా మనకే’ అనుకున్న ఎమ్మెల్యేల ఆశలపై కూడా ప్రభుత్వం నీళ్లు జల్లింది. ఇప్పటికే రాజమండ్రి సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు కనీసం రూ.500 కోట్లయినా వారి ప్రాంతాలకు రాబట్టాలని ఆశించారు. కానీ రాష్ట్రంలోని గోదావరి పరీవాహక ప్రాంతం మొత్తం మీద పుష్కరాల నిర్వహణకు రూ.100 కోట్లు ఇస్తామని ఆర్థిక మంత్రి చెప్పడంతో వారి ఆశ వేసవి గోదారిలా సన్నగిల్లిపోయింది. -
ముచ్చటగా మూడోసారి జీవోఎం భేటీ
-
ముచ్చటగా మూడోసారి జీవోఎం భేటీ
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన కోసం ఏర్పడ్డ మంత్రుల బృందం (జీవోఎం) మరికాసేపట్లో సమావేశం కాబోతున్నది. ముచ్చటగా మూడోసారి జరగబోతున్న ఈ సమావేశంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రభుత్వ శాఖలు సమర్పించిన విభజన నివేదికలను పరిశీలించనున్నారు. దీని తర్వాత రాజకీయపార్టీలతో నేరుగా ఈ నెల 12న సమావేశమై వారి సలహాలు సూచనల్ని మంత్రుల బృందం స్వీకరించనున్నది. విభజనలో పాలుపంచుకుంటున్న ప్రభుత్వ శాఖలన్నీ తీరికలేకుండా నివేదికలు రూపొందిస్తున్నాయి. తాజా సమాచారంతో నివేదికలను అప్డేట్ చేయాలని మంత్రుల బృందం సూచించడంతో దానికి అనుగుణంగా శాఖలన్నీ నివేదికలను మంత్రుల బృందానికి అందజేస్తున్నాయి. రెండు రాష్ట్రాలకు సంబంధి ఆయా శాఖల తరఫున ఆస్తులెన్ని? అప్పులెన్ని? ఉద్యోగులెందరు? వనరులెన్ని ఉన్నాయి?...మొదలైన అంశాలతో రూపొందించిన ఫార్మాట్లో శాఖలు నివేదికలు తయారు చేస్తున్నాయి. ఇక రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే సమైక్యవాదుల డిమాండ్లను ఖాతరు చేయని కేంద్రం రాష్ట్ర విభజన ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళుతోంది. విభజనను అడ్డుకోవడానికి సీమాంధ్ర కాంగ్రెస్, టిడిపి ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదనే విషయం తెలిసిందే. దాంతో సీమాంధ్ర ప్రాంతం ఉద్యమవేడితో రగిలిపోతోంది. సీమాంధ్ర ప్రజలను సంతృప్తి పరిచేందుకు భారీ ప్యాకేజి ఇవ్వనున్నారు. కొత్త రాజధాని నిర్మాణానికి భారీగా నిధులు ఇచ్చేందుకు అవసరమైన ప్రతిపాదనలపై ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది. విభజనను స్వాగతిస్తూ కొత్త రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు నిధులు అడిగిన విషయం తెలిసిందే. మంత్రుల బృందంలోని ఏడుగురు మంత్రులు ఇప్పటికే పని విభజన చేసుకొని ఆయా శాఖల కార్యదర్శులతో నిత్యం అందుబాటులో ఉంటున్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేసే యంత్రాంగంపైనా, శాంతిభద్రతల పరిస్థితిపైనా టాస్క్‌ఫోర్స్ ఇచ్చిన నివేదికను జీవోఎం పరిశీలనకు తీసుకోనుంది. విభజన సమస్యల్లో మరో ప్రధాన సమస్య జలవనరుల పంపిణీ. దీనిపై చట్టబద్దమైన వాటర్ బోర్డును ఏర్పాటు చేసే విషయంపై ఓ నిర్ణయానికి రానున్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అంశాల్లో న్యాయం కోసం ఉద్దేశించిన ఆర్టికల్ 371 డి..లాంటి అంశాలపై న్యాయశాఖ ఇచ్చే సలహాలు స్వీకరించనున్నారు. 371 డిని రెండు రాష్ట్రాల్లో కొనసాగించాలనే ప్రతిపాదనలుఎలానూ ఉన్నాయి. వీటికి జీవోఎం పచ్చజెండా ఊపే అవకాశముంది ఇక విద్యుత్ పంపిణీపై కేంద్ర విద్యుత్‌శాఖ చేసిన ప్రతిపాదనల్ని చర్చించనున్నారు...ఈ సమావేశం తర్వాత జరగబోయే మరో ప్రధాన కార్యక్రమం ఈ నెల 12న రాష్ట్రానికి చెందిన రాజకీయపార్టీలతో మంత్రుల బృందం భేటీ అవుతోంది. ఈ భేటీలో ఆయా పార్టీల సూచనల్ని నేరుగా స్వీకరించాలని నిర్ణయించారు. -
ముగిసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం
-
మంత్రుల కమిటీపై నమ్మకం లేదు: పల్లంరాజు
అన్నవరం : రాష్ట్ర విభజనపై ఏర్పాటు చేసిన జీవోఎం (కేంద్ర మంత్రుల బృందం) మీద నమ్మకం లేదని కేంద్ర మంత్రి పల్లం రాజు అన్నారు. ఆయన సోమవారం అన్నవరంలో సత్యనారాయణ స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లంరాజు మాట్లాడుతూ అంటోనీ కమిటీ నివేదిక రాకుండానే ....తెలంగాణ నోట్ కేబినెట్ ముందుకు రావటం బాధాకరమన్నారు. తాను ఎప్పటికీ సమైక్యవాదినేనని పల్లంరాజు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరపకుండా ఢిల్లీలో కూర్చొని నిర్ణయాలు తీసుకోవటం తగదని అన్నారు. మరోవైపు మూడున్నర నెలలుగా జిల్లాకు దూరంగా ఉన్న పల్లంరాజు ఎట్టకేలకు సోమవారం జిల్లాలో అడుగు పెట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడ్డ సమయంలో జిల్లాలో అడుగు పెట్టేందుకు ధైర్యం చాలక ముఖం చాటేసిన ఆయన ఇప్పుడు మాత్రం ఎందుకు వస్తున్నారని సమైక్యవాదులు ప్రశ్నిస్తున్నారు. అలుపెరగకుండా జీతాలను వదులుకుని, కుటుంబ కష్టాలను సైతం ఖాతరు చేయని వేలాది మంది ఉద్యోగులతో పాటు సమాజంలోని వివిధ వర్గాలు 75 రోజులుగా జిల్లాలో సాగిస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమం కంటికి కనబడలేదా అని విమర్శిస్తున్నారు. ఆయన పర్యటనను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కాగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పల్లంరాజు నివాసం వద్ద కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. -
మంత్రుల కమిటీని బహిష్కరించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కేంద్రం నియమించిన మంత్రుల కమిటీని ప్రజ లు, ప్రజాప్రతినిధులందరూ బహిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు ఇచ్చింది. ఆ బృందానికి సహకరిస్తే విభజనకు అంగీకరించినట్లే అవుతుందని పేర్కొంది. ఈమేరకు పలు తీర్మానాలు చేసింది. వివరాలను వేదిక అధ్యక్షుడు జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి శుక్రవారమిక్కడ విలేకరులకు తెలిపారు. ‘‘కేంద్ర కేబినెట్ నిర్ణయానికి ఎలాంటి ప్రాతిపదిక లేదు. సాధారణంగా రాష్ట్రాన్ని విభజించాలంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌గానీ, లేదా ఏ ఇతర కమిషన్‌గానీ, లేదంటే తమ రాష్ట్రాన్ని విభజించాలంటూ శాసనసభ తీర్మానంగానీ ఉంటేనే వాటిని ప్రాతిపదికగా తీసుకోవాలి. ప్రాతిపదిక లేనప్పుడు విభజించేందుకు నిర్ణయం తీసుకునే హక్కులేదు. ఇంతకుముందు రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఫజల్అలీ కమిషన్ ఒక ప్రాతిపదికగా ఉంది. దాని నివేదిక ఆధారంగానే పార్లమెంట్లో సుదీర్ఘంగా చర్చించాక ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ముందుగా బిల్లు రూపంలో రాష్ట్రపతికి పంపారు. రాష్ట్రపతి దానిని రాష్ట్రాలకు పంపించారు. అక్కడినుంచి తీర్మానాలు తీసుకుని ఆ తరువాత పార్లమెంటులో బిల్లు ఆమోదించారు. దీన్నిబట్టి రాష్ట్రం ఏర్పాటుచేయాలంటే ఒక ప్రాతిపదిక ఉండాలని విదితమవుతోంది’’ అని ఆయన స్పష్టం చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఆధారంగా విభజన జరుపుతున్నామని ప్రభుత్వం చెప్పొచ్చని, కానీ ఇంతవరకు ఆ నివేదికను పార్లమెంటులో పెట్టలేదు.. అసెంబ్లీలోనూ చర్చించలేదని గుర్తుచేశారు. జాతి విశాల ప్రయోజనాలదృష్ట్యా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఆ కమిటీ స్పష్టంగా చెప్పిందని, ఆ నివేదికను ఏ ప్రాతిపదికన తిరస్కరించారని ప్రశ్నించారు. సుప్రీంలో సవాలు చేస్తాం.. కేంద్ర కేబినెట్ తీర్మానం, మంత్రుల బృందం నియామకాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయాలని తీర్మానించినట్టు జస్టిస్ లక్ష్మణరెడ్డి తెలిపారు. తమ న్యాయపోరాటానికి మద్దతుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు సమైక్యాంధ్రను బలపరుస్తూ ప్రమాణపత్రాలివ్వాలని కూడా తీర్మానించామని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర కోఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి, హైకోర్టు న్యాయవాది వి.రామకృష్ణ, పి.జె.ప్రకాశ్, పి.రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
విభజన ప్రక్రియ ప్రారంభమైంది: జీఎంవో
న్యూఢిల్లీ : తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వేసిన మంత్రుల బృందం సమావేశంపై కేంద్ర హోంశాఖ శుక్రవారం ప్రెస్‌నోట్ విడుదల చేసింది. రాష్ట్ర విభజనకు సంబంధించిన ప్రక్రియను గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఖరారు చేసింది. అన్ని సమస్యలను నిష్పక్షపాతంగా పరిష్కరిస్తుందని.... ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంత్రుల బృందం హామీ ఇస్తుందని పేర్కొంది. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటుందని, మంత్రుల బృందం అనువైన సిఫార్సులు చేస్తుందని, విధివిధానాలకు సంబంధించి నోడల్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్లను ఖరారు చేసినట్లు జీఎంవోలో తెలిపింది. విభజన సమాచారాన్ని పంపించాలని ప్రభుత్వాన్ని ఆదేశించామని.... ఈ ప్రక్రియ తక్షణమే మొదలు అవుతుందని జీఎంవో ప్రెస్‌నోట్‌లో తెలిపింది. రాష్ట్ర విభజనకు సంబంధించి ఏర్పాటు చేసిన మంత్రుల బృందం శుక్రవారమిక్కడ ఢిల్లీలో సమావేశమైంది. హోం శాఖ కార్యాలయం ఈ జరిగిన తొలి సమావేశానికి ఐదుగురు మంత్రులు మాత్రమే హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా రక్షణ మంత్రి ఆంటోని, విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా ఆర్థిక మంత్రి చిదంబరం ఈ భేటీకి రాలేదు. హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు గులాంనబీ ఆజాద్, జైరామ్ రమేశ్, వీరప్ప మొయిలీ, నారాయణస్వామి పాల్గొన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి మొత్తం 11 అంశాలను పరిశీలించాలని మంత్రుల కమిటీకి నిర్దేశించింది .రాష్ట్ర విభజనకు సంబంధించిన ప్రాథమిక విధివిధానాలను మంత్రులు కమిటీ పరిశీలించింది. ఈ నెల 19న మరో దఫా సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది. -
విభజన ప్రక్రియ ప్రారంభమైంది: జీఎంవో
-
తెలంగాణపై మంత్రుల కమిటీ తొలి భేటీ
న్యూఢిల్లీ : తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ శుక్రవారం తొలిసారి సమావేశం అయ్యింది. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కార్యాలయంలో ఈ భేటీ జరుగుతోంది. సమావేశానికి జైరాం రమేష్, నారాయణ స్వామి, గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ హాజరు అయ్యారు. అయితే షిండే అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి అనారోగ్య కారణాలతో ఆంటోనీ, విదేశీ పర్యటనలో ఉన్న చిదంబరం అందుబాటులో లేరు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ .... ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలపై చర్చించనుంది. కాగా విభజన ప్రకటన, భగ్గుమన్న సీమాంధ్ర, రెండు నెలలకు పైగా తీవ్ర ఉద్యమం, ఊరూ వాడా ఏకమైనా కేంద్రం నుంచి కనీస స్పందన కరువైంది. దీనికి తోడు రాష్ట్రానికి వరుస అవమానాలు తప్పటం లేదు.. ఏకపక్షంగా విభజన నిర్ణయమన్న విమర్శలను పట్టించుకోకుండా తాను ఏం చేయదలుచుకుందో,.... అదే నిర్ణయాన్ని అమలు చేసేందుకు కేంద్రం మొండిగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సీడబ్ల్యూసీ నిర్ణయం, క్యాబినెట్ ముందుకు టీ నోట్, విభజనకు మంత్రుల కమిటీ, విధివిధానాలు ఇలా ఏ దశలోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజల మనోగతాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకున్న దాఖలాలు కనిపించటం లేదు. తాజాగా ఏడుగురు మంత్రులతో విభజన కమిటీని ఏర్పాటు చేసినా, విధివిధానాలు ఖరారు చేసినా ముఖ్యమంత్రికి కానీ, ప్రభుత్వానికి కనీస సమాచారం లేదు. దానికి సంబంధించిన నోట్ కాపీని కూడా ప్రభుత్వానికి పంపలేదు. విభజన ప్రక్రియలో ప్రతి సమాచారం రాష్ట్రం నుంచి అధికారులు అందించాల్సి ఉంటుంది. మంత్రుల కమిటీ మొదటి సమావేశం జరుగుతున్నా ఎలాంటి సమాచారం లేదు. దీంతో నోట్ కాపీ అధికారికంగా అందుతుందని భావించిన ప్రభుత్వ వర్గాలు నివ్వెరపోతున్నాయి. మొదట్లో పదిమంది మంత్రులతో కమిటీ, రాష్ట్రానికి చెందిన వారికి కూడా చోటు ఉంటుందని చెప్పినా, అవన్నీ పక్కన పెట్టి, తాము తీసుకున్న నిర్ణయాన్ని వీలైనంత తొందరగా అమల్లో పెట్టే వారినే కమిటీలో నియమించారనే ప్రచారం జరుగుతోంది.. అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని కూడా కనీసం పరిగణలోకి తీసుకోకపోవటం దారుణమని అధికారిక వర్గాలు అంటున్నాయి. -
వీలైనంత త్వరలో మంత్రుల కమిటీ నివేదిక: షిండే
న్యూఢిల్లీ : తెలంగాణపై మంత్రుల కమిటీ వీలైనంత త్వరలో నివేదిక ఇస్తుందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. ఆయన తన నెలవారీ సమీక్ష నివేదికపై గురువారం మీడియాతో మాట్లాడారు. మంత్రుల కమిటీ శుక్రవారం సమావేశం కానున్నట్లు షిండే తెలిపారు. సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే శీతాకాలం పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతారా అన్న ప్రశ్నకు షిండే సమాధానం దాటవేశారు. రాష్ట్రాన్ని విభజన నిర్ణయం అమలులో భాగంగా పరిష్కరించాల్సిన అంశాలపై దృష్టి సారించేందుకు ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందానికి ఎలాంటి కాలవ్యవధినీ నిర్ణయించకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. -
అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం: షిండే
-
తెలుగువారు లేకుండా విభజన కమిటీనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కేంద్రం నియమించిన మంత్రుల కమిటీని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, కమిటీని ఆమోదించేది లేదని మంత్రులు కాసు కృష్ణారెడ్డి, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు. బుధవారం వారు సీఎల్పీ కార్యాలయం వద్ద వేర్వేరుగా మాట్లాడారు. తెలుగు రాష్ట్ర విభజనకు ఏర్పాటైన కమిటీలో తెలుగువారెవ్వరికీ చోటు లేకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాన్ని ఇతరులు విభజించడం దుర్మార్గమైన చర్య అని దుయ్యబట్టారు. ‘‘మేము ముందు నుంచి సమైక్యవాదులమే. కమిటీలో కొన్ని ముఖ్యమైన అంశాలను పొందుపర్చలేదు. ఈ కమిటీ ఏవిధంగా పనిచేస్తుందో తెలియదు. రాష్ట్రానికి వస్తుందో రాదో కూడా స్పష్టతలేదు. 70 రోజులుగా అన్ని వర్గాల ప్రజలు ఉద్యమం చేస్తున్నా పట్టించుకోకుండా కమిటీని ఏర్పాటుచేయడం ఏమిటి? దీన్ని ఎదిరించి తీరుతాం. కేంద్రం నిర్ణయాన్ని మార్చుకోవాలి’’ అని కాసు కృష్ణారెడ్డి అన్నారు. అసెంబ్లీకి తీర్మానం రావాల్సిందేన ని, దాన్ని తామంతా ఓడించి తీరుతామని చెప్పారు. రాజీనామాలపై సీఎం అభీష్టానానికి వదిలేశామని, ఆయన త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారని ఏరాసు ప్రతాప్‌రెడ్డి చెప్పారు. మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ.. జీఓఎంలో పదిమంది సభ్యులుంటారని కేబినెట్లో తీర్మానించారని, ఇపుడు ఏడుగురికే పరిమితం చేశారన్నారు. కేబినెట్ నిర్ణయాన్ని ఎలా మారుస్తారో అర్థం కావడం లేదని చెప్పారు. గందరగోళం మయంగా ఉన్న విభజనను ఆపాలని కోరుతున్నామని, తెలుగువారికి సంబంధం లేకుండా విభజనను చేయడం సరికాదని అయన పేర్కొన్నారు. -
'పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తామని కిరణ్ చెప్పారు'
-
'పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తామని కిరణ్ చెప్పారు'
న్యూఢిల్లీ : సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళనలు విరమించాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ మరోసారి విజ్ఞప్తి చేశారు. సమ్మె విరమణ కోసం ఏపీ ఎన్జీవోలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చర్చలు జరుపుతున్నట్లు ఆయన బుధవారమిక్కడ తెలిపారు. విద్యుత్ సంకోభంపై ముఖ్యమంత్రితో ఈరోజు ఉదయం మాట్లాడినట్లు దిగ్విజయ్ చెప్పారు. అత్యవసర సర్వీసులకు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు ఆయన చెప్పారన్నారు. పార్టీలన్నీ సమ్మతం తెలిపాకే తెలంగాణాపై ముందడుగు వేశామని, ఇప్పడు వైఖరి మార్చుకోవడం తగదన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో మంత్రుల బృందం పర్యటిస్తుందని....సీమాంధ్రుల సమస్యలు మంత్రి వర్గ కమిటీకి తెలియ జేయవచ్చునని అన్నారు. తెలంగాణపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని, అయితే పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటామని చెప్పారన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఈరోజు ఉదయం దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై చర్చించినట్లు తెలిపారు.