
వీలైనంత త్వరలో మంత్రుల కమిటీ నివేదిక: షిండే
న్యూఢిల్లీ : తెలంగాణపై మంత్రుల కమిటీ వీలైనంత త్వరలో నివేదిక ఇస్తుందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. ఆయన తన నెలవారీ సమీక్ష నివేదికపై గురువారం మీడియాతో మాట్లాడారు. మంత్రుల కమిటీ శుక్రవారం సమావేశం కానున్నట్లు షిండే తెలిపారు. సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అయితే శీతాకాలం పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతారా అన్న ప్రశ్నకు షిండే సమాధానం దాటవేశారు. రాష్ట్రాన్ని విభజన నిర్ణయం అమలులో భాగంగా పరిష్కరించాల్సిన అంశాలపై దృష్టి సారించేందుకు ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందానికి ఎలాంటి కాలవ్యవధినీ నిర్ణయించకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.