Sushilkumar Shinde
-
శివశంకర్ కృషితోనే న్యాయశాఖలో బడుగులకు ప్రాతినిధ్యం
గన్ ఫౌండ్రి: నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా స్వయంకృషితో పి.శివశంకర్ ఉన్నత స్థాయికి చేరుకున్నారని పలువురు ప్రముఖులు కొనియాడారు. అణగారిక వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి శివశంకర్ మరో అంబేడ్కర్ అని అభివర్ణించారు. గురువారం ఇక్కడి రవీంద్రభారతిలో ‘ఉత్తుంగ తరంగాలకు ఎదురీదిన ఓ విజేత జీవితావిష్కరణ’పేరిట కేంద్ర మాజీమంత్రి పి.శివశంకర్ ఆత్మకథ గ్రంథావిష్కరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్ షిండే మాట్లాడుతూ న్యాయశాఖలో బడుగు, బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కోసం అప్పట్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి పి.శివశంకర్ తీసుకున్న నిర్ణయాలు ఎన్నో మార్పులు తీసుకు వచ్చాయని గుర్తుచేశారు. నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తరఫున సుప్రీంకోర్టులో పలు కేసులలో న్యాయవాదిగా శివశంకర్ అద్భుతంగా వాదించి ఆమెపై వచ్చిన ఆరోపణలను కొట్టివేయించగలిగారని గుర్తుచేశారు. కర్ణాటక మాజీ సీఎం వీరప్ప మొయిలీ మాట్లాడుతూ కేంద్ర న్యాయ, మానవ వనరుల శాఖల మంత్రిగా ఆయన చేసిన సేవలు ఎనలేనివని కీర్తించారు. ఆయన ఆత్మకథ బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుందని అన్నారు. నిరుపేద బాల్యం నుంచి అనేక ఆటుపోట్లను అధిగమిస్తూ ఉన్నత లక్ష్యాన్ని చేరుకున్న శివశంకర్ విజయప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు. ఆయనతో అప్పట్లో పనిచేసినటువంటి అనుభవాలు, జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలగౌడ, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేతలు కేవీపీ రాంచందర్‌రావు, రఘువీరారెడ్డి, శివశంకర్ సతీమణి లక్ష్మి, కుమారుడు డాక్టర్ వినయ్, పుస్తక తెలుగు అనువాదకర్త వల్లీశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
మాజీ సీఎం కుమార్తెపై తప్పుడు ప్రచారం
ముంబై: ఏ మాత్రం సంబంధం లేని కేసులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే కుటుంబాన్ని, ఆయన రెండో కుమార్తె ప్రీతి ష్రాఫ్‌ను సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు. ప్రీతి ఇంటిపేరు (ష్రాఫ్) కలిగిన మరో మహిళను చేసిన తప్పును ఆమె చేసినట్టుగా నెటిజెన్లు మెసేజ్‌లు పెట్టారు. సోషల్ మీడియాలో వచ్చిన వదంతులు షిండే కుటుంబంలో కలకలం రేపాయి. చివరకు ప్రీతి, ఆమె భర్త మీడియా ముందుకు వచ్చిన వివరణ ఇవ్వడంతో తప్పుడు ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. గత సోమవారం పుణెలో కారు నడుపుకొంటూ వెళ్తున్న ఓ మహిళ ఫుట్‌పాత్‌పై నిల్చున్నవారిని ఢీకొట్టడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ యాక్సిడెంట్ చేసింది రియల్ ఎస్టేట్ వ్యాపారి భార్య సుజాత జయప్రకాశ్ ష్రాఫ్ కాగా నెటిజెన్లు షిండే కుమార్తె ప్రతీ ఫ్రాష్ చేసినట్టుగా భావించారు. ప్రీతి ఫుట్‌పాత్‌పై ఉన్నవారిపై కారు నడిపి ఇద్దరి మరణానికి కారణమయ్యారంటూ సోషల్ మీడియాలో మెసేజ్‌లు పంపారు. ఏం జరిగిందంటూ షిండే కుటుంబ సభ్యుల స్నేహితులు ఆరా తీశారు. ఈ పుకార్లు విని షిండే కుటుంబ సభ్యులు షాకయ్యారు. కాంగ్రెస్ నేత, వ్యాపారవేత్త రాజ్ ష్రాఫ్‌ను ప్రీతి వివాహం చేసుకున్నారు. రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ రూమార్లపై ఎలా స్పందించాలో అర్థంకావడం లేదని అన్నారు. ఏం జరిగిందో తెలుసుకోకుండా, ప్రమాదానికి కారణం ఎవరో తెలుసుకోకుండా తమపై సోషల్ మీడియాలో ఎవరు ఎందుకిలా తప్పుడు ప్రచారం చేశారు? కనీసం పేపర్లో వచ్చిన వార్తను కూడా చదవకుండా తమపై నిందలు వేస్తారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఈ దుష్ప్రచారాన్ని ఆపి, నిందితులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పుణె పోలీస్ కమీషనర్‌ను ఆయన కోరారు. -
శ్రీ విద్యానికేతన్ అందరికీ ఆదర్శం
మోహన్‌బాబు పుట్టినరోజు వేడుకల్లో కేంద్ర మాజీ హోంమంత్రి షిండే చంద్రగిరి: శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలకే ఆదర్శంగా నిలుస్తోందని కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండే అన్నారు. తిరుపతికి సమీపంలోని శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల వార్షి కోత్సవం ప్రముఖ సినీనటుడు డాక్టర్ ఎం.మోహన్ బాబు జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుశీల్‌కుమార్ షిండే మాట్లాడుతూ దేశంలో విద్యావ్యవస్థ పటిష్టం కావాల్సిన అవ సరం ఉందన్నారు. మోహన్‌బాబు విద్యావ్యవస్థను గౌరవించి 25 శాతం పేదలకు ఉచితంగా విద్యను అందించడం ప్రశంసనీయమని అన్నారు. క్రమశిక్షణతో పాటు విద్యార్థుల ఉన్నతికి పునాది వేస్తున్న ఏకైక సంస్థ శ్రీవిద్యానికేతన్ అని తెలిపారు. -
'ఆయన ఇప్పటికైనా రాజీనామా చేయాలి'
హైదరాబాద్: విద్యార్థులను తన పిల్లల్లా చూడాల్సిన హెచ్‌సీయూ వీసీ అప్పారావు వారిపట్ల వివక్ష చూపారని కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే విమర్శించారు. అప్పారావు ఇప్పటికైనా రాజీనామా చేయాలని, లేదంటే కేంద్ర ప్రభుత్వం వీసీ పదవి నుంచి ఆయన్ను తొలగించాలని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ వచ్చిన షిండే.. రోహిత్ తల్లి రాధికను పరామర్శించారు. హెచ్‌సీయూలో ఎమర్జెన్సీ వాతావరణం ఉందని, రోహిత్‌ది ఆత్మహత్య కాదు, సంస్థాగత హత్య అని విద్యార్థులు.. షిండే దృష్టికి తీసుకువచ్చారు. షిండేతో దళిత, యువజన సంఘాల నేతలు భేటీ అయ్యారు. షిండే మాట్లాడుతూ.. 'రోహిత్ ఆత్మహత్య జరిగిన రోజునే వీసీగా అప్పారావు తప్పుకోవాల్సింది. ఆయనపై అట్రాసిటీ కేసు పెట్టిన పోలీసులు ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు?దళితులను అణచివేయాలని కేంద్రం చూస్తోంది. విద్యార్థుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది' అని అన్నారు. ఈ కార్యక్రమంలో షిండేతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, మహారాష్ట్ర ఎంపీ రాజీవ్ సతావ్ పాల్గొన్నారు. -
ఆ అవసరం లేదు!
సాక్షి, ముంబై: వచ్చే శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం మార్చాల్సిన అవసరం లేదని మాజీ కేంద్ర మంత్రి సుశీల్‌కుమార్ షిండే అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత షిండే మొదటిసారిగా షోలాపూర్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శాసనసభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో నేతృత్వం మారిస్తే పార్టీకి మరింత నష్టం తప్పదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూసిననంత మాత్రాన శాసనసభ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని భావించడం సరైన అభిప్రాయం కాదన్నారు. శాసనసభ ఎన్నికల్లో 1974 నుంచి శాసనసభ, రాజ్యసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేశానని, పోటీచేసిన ప్రతిసారీ తనను విజయం వరించిందన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభంజనం ఉన్నప్పటికీ షోలాపూర్ వాసులు తనకు భారీగా ఓట్లు వేశారు. మోడీ ప్రమాణ స్వీకారోత్సవం గురించి మాట్లాడుతూ... ఆ రోజు జరిగిన ఉత్సవానికి సార్క్ దేశాల ప్రముఖులను ఆహ్వానించడం గర్వించదగ్గ విషయమన్నారు. ఇలా ఆహ్వానించడంవల్ల వివిధ దేశాలతో భారత్ సంబంధాలు మరింత బలపడతాయని, అంతర్జాతీయ స్థాయిలో మన భారత్ పేరు మార్మోగుతుందన్నారు. అలా ఆహ్వానించడం ఆయన గొప్పతనమని కొనియాడారు. మోడీ ప్రమాణస్వీకార ముహూర్తాన్ని ఆలస్యంగా వెల్లడించడంతోనే తాను కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని, అయితే మోడీని అభినందించి, శుభాకాంక్షలు తెలిపానన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు తలెత్తిన పరిస్థితిపై మాట్లాడుతూ... ‘లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ వర్గీయుల నుంచి ముప్పు పొంచి ఉందని నాకు ముందే సమాచారం అందింది. దీంతో అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి ఒకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశాను. చిన్న చిన్న సభలు, సమావేశాలు నిర్వహించాను. 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఎన్నికల సమయంలో రెండు రోజులకు మించి ఎప్పుడూ బస చేయలేదు. కానీ మొదటిసారి 12 రోజులు షోలాపూర్ నియోజకవర్గంలోనే మకాం వేశాను. అయినప్పటికీ పార్టీ వర్గీయులు మోసం చేయడంవల్ల మొదటిసారి పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింద’ని షిండే ఆవేదన వ్యక్తం చేశారు. -
అస్సాంలో పేట్రేగిన మిలిటెంట్లు... 23 మంది మృతి
* ఏకే 47 తుపాకులతో విరుచుకుపడ్డ ముష్కరులు * చివురుటాకుల్లా వణికిన కోక్రాఝర్, బక్సా జిల్లాలు * కనిపిస్తే కాల్చివేతకు ప్రభుత్వం ఆదేశం.. గువాహటి: అస్సాంలో బోడోలాండ్ తీవ్రవాదులు పేట్రేగిపోయారు. బోడోలాండ్ ప్రాంతం పరిధిలోని రెండు అత్యంత సున్నితమైన జిల్లాల్లో భీకర దాడులకు తెగబడ్డారు. గురువారం అర్ధరాత్రి నుంచి జరిపిన విచక్షణా రహిత కాల్పుల్లో మొత్తం 23 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు చిన్నారులు, 11మంది మహిళలు ఉన్నారు. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ హఠాత్పరిణామంతో ఉలిక్కిపడ్డ అస్సాం సర్కారు ఆయా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది. వివరాలు.. ఎన్డీఎఫ్బీ-ఎస్(నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్-సొంగ్‌బిజిత్)కు చెందిన 40 మంది మిలిటెంట్లు శుక్రవారం తెల్లవారుజామున కోక్రాఝర్ జిల్లాలోని బలపరా-1 గ్రామంలోని మూడు ఇళ్లలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. వీరిలో మైనారిటీ వర్గానికి చెందిన ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. పొరుగున ఉన్న బక్సా జిల్లాలో గురువారం అర్ధరాత్రే తొలుత దాడులకు దిగిన మిలిటెం ట్లు.. జరిపిన కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోగా, పలువురు గాయపడ్డారు. ఇదే జిల్లాలో మరో వ్యక్తిని కూడా మిలిటెంట్లు కాల్చి చంపారు. బక్సా జిల్లాలోని నాంకేఖాద్రాబరి, నయాంగురి గ్రామాల్లో బుల్లెట్ల ధాటికి ప్రాణాలు కోల్పోయిన 12 మంది మృత దేహాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వీరిలో ఐదుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారన్నారు. ఇదే జిల్లాలోని మానస్ జాతీయ పార్కు సమీపంలో బేకి నదీ ఒడ్డున ఉన్న మైనార్టీ వర్గాలకు చెందిన 70 ఇళ్లను మిలిటెంట్లు తగలబెట్టారు. ఈ ఘటనలతో ఉలిక్కిపడ్డ అస్సాం సర్కారు కోక్రాఝర్, బక్సా జిల్లాల్లో కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా చిరాంగ్ జిల్లాలో నిరవధిక కర్ఫ్యూ విధించింది. అలాగే బక్సా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం 6 నుంచి తెల్లవారు జామున 4గంటల వరకు కర్ఫ్యూ విధించారు. ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో ఫోన్లో మాట్లాడి అదనపు బలగాలను పంపాలని కోరారు. రాష్ట్రానికి అన్నిరకాలుగా సాయం చేస్తామని షిండే చెప్పారు. దాడులకు పాల్పడిన ఎన్డీఎఫ్బీ మిలిటెంట్లపై ఉక్కుపాదం మోపాలని కేంద్రం ఆదేశించింది. -
భజనపరులు
షోలాపూర్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మన్ననలు పొందే ప్రయత్నం చేస్తున్నారే తప్ప ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు పనిచేయడం లేదని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. షోలాపూర్‌లోని పార్క్ మైదానంలో బుధవారం సాయంత్రం బీజేపీ అభ్యర్థి శరద్ బాన్సోడేకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. గత 60 సంవత్సరాలుగా అధికారంలో చెలామణి అవుతున్న కాంగ్రెస్‌కు అహంకారం విపరీతంగా పెరిగిపోయిందని మోడీ అన్నారు. ఈ సారి ఎన్ని కుయుక్తులు పన్నినా సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, మిత్రపక్షమైన ఎన్సీపీలకు అధికారం దక్కదని దుయ్యబట్టారు. గత వేసవి కాలంలో నీరు లేక విలవిలలాడుతున్న రైతులు, పంటలకు నీరు కావాలని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌ను కోరితే అసభ్యకరమైన పదజాలం వాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వారి అహంకారానికి ఇది పరాకాష్ట అన్నారు. ‘డీఎఫ్ కూటమి నేతలకు దేశభక్తి అవసరం లేదు. కేవలం సోనియాకు భజన చేయడమే వారికి కావాలి. అందుకే సుశీల్‌కుమార్ షిండేకు ముఖ్యమంత్రి, గవర్నర్, కేంద్ర మంత్రి పదవులు లభించాయ’ని మోడీ అన్నారు. ఎల్బీటీ అంటే లూటో బాటో ట్యాక్స్ ప్రజలు, వ్యాపారులను ఇబ్బందులు పెట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్థానిక సంస్థల పన్ను (ఎల్బీటీ)ని లూటో బాటో ట్యాక్స్‌గా మోడీ అభివర్ణించారు. తాము అధికారంలోకి రాగానే ప్రజలకు తలనొప్పిగా మారిన పన్నులను సమీక్షించి వెంటనే సవరిస్తామని హామీ ఇచ్చారు. షోలాపూర్ జిల్లాలో ఉన్న రెండు లోక్‌సభ నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎన్నో హామీలు ఇచ్చినా శరద్ పవార్ ఏ ఒక్కటీ చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ మాయమాటలకు మోసపోకుండా బీజేపీకే పట్టం కట్టబెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆవినీతికి వ్యతిరేకంగా అర్డినెన్స్‌లు తీసుకొచ్చామని చెబుతున్న కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో అవినీతి, కుంభకోణాల్లో ఇరుక్కున్న వారికి టికెట్లు ఇవ్వడం వెనుక మతలబేమిటి అని ప్రశ్నించారు. దేశప్రజలకు ఏమి కావాలో, తాము ఏం చేయదల్చుకున్నామో ఇప్పటికే పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో స్పష్టం చేశామని చెప్పారు. అందులో చేర్చిన ప్రతి అంశానికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ వాగ్దానాలు చేసింది. అయితే ఏ వస్తువుల ధరలు తగ్గాయని సభికులను మోడీ ప్రశ్నించారు అందుకు లేదు లేదు అంటూ వారినుంచి సమాధానం వచ్చింది. ఇక వారికి గుణపాఠం చెప్పే సమయం వచ్చిందని, ప్రజలను దోచుకుంటున్న కాంగ్రెస్‌ను గద్దె దింపాలంటే బీజేపీనే గెలిపించాలని కోరారు. తమ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించి ఉంది. కాంగ్రెస్‌ను ఇంటిదారి పట్టించేందుకే దేశంలోని 26 ప్రాంతీయ పార్టీలు తమతో జతకట్టాయని మరోసారి గుర్తు చేశారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని చేసినా ఎన్డీఏ విజయాన్ని ఆపలేరన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకుడు కల్పనా గిరి తన భార్యను హత్య చేశాడని, అలాంటి పార్టీనే మహిళలకు భద్రత కల్పిస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. సభలో ఫడ్నవీస్‌తోపాటు స్థానిక, ప్రాంతీయ పదాధికారులు హాజరయ్యారు. ప్రచార సభకు దాదాపు 70 వేలకుపైగా జనం, కార్యకర్తలు తరలివచ్చారు. -
ప్రధాని అభ్యర్థిని నేను కాను
పింప్రి, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిని తాను కాదని, అందుకు అన్నివిధాలా అర్హుడైన వ్యక్తి రాహుల్ గాంధీయేనని, అదే కాంగ్రెస్‌లోని అందరి అభిప్రాయమని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే అన్నారు. పుణే కాంగ్రెస్ అభ్యర్థి విశ్వజీత్ కదమ్ తరఫున ప్రచారం చేసేందుకు నగరానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ పై వాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో తిరిగి యూపీఏ కూటమికే ప్రజలు పట్టం కడతారని జోస్యం చెప్పారు. ప్రధానిని ఎన్నుకునే అధికారం పార్లమెంటు సభ్యులందరికీ ఉన్నప్పటికి సోనియా నిర్ణయానుసారంగానే పార్టీ సభ్యులు నడుచుకుంటారని, రాహుల్ గాంధికి లేని అర్హతలు ఏంటో తమకు కనిపించడం లేదన్నారు. విద్యావంతుడు, నీతిమంతుడు, తెలివితేటలున్న రాహుల్ ప్రభుత్వాన్ని నడిపంచడంలో దిట్ట అని కితాబిచ్చారు. 2004లో కూడా బీజేపీ.. భారత్ వెలిగిపోతోం దంటూ ప్రచారం చేసుకున్నారని, ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని, ఈసారి కూడా బీజేపీ చెప్పుకుంటున్న గొప్పలన్నీ ఎన్నికల తర్వాత పటాపంచలవుతాయని, తిరిగి యూపీఏ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు. అప్పట్లో వాజ్‌పేయి సభలకు జనం భారీగా హాజరయ్యేవారని, ఇప్పుడు మోడీ సభలకు హాజరవుతున్నారని, చివరకు తమ కష్టాలను తీర్చే కాంగ్రెస్ పార్టీకే వారు ఓటేస్తారని చెప్పారు. మోడీపై వ్యంగ్యాస్త్రాలు.. గుజరాత్ అల్లర్లకు సంబంధించి నరేంద్ర మోడీకి ఇప్పటి వరకు ఏ కోర్టూ క్లీన్చిట్ ఇవ్వలేదని, ఇప్పటికీ స్పెషల్ ఇన్వెస్ట్‌గేషన్ టీమ్‌లు ఆ కేసు గురించి దర్యాప్తు చేస్తూనే ఉన్నాయన్నారు. అల్లర్ల భాధితులు ఇప్పటికీ కోర్టుల్లో దావాలు వేస్తున్న సంగతి పాపం మోడీకి తెలియదు కాబోలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అప్పటి అల్లర్లను ఉద్దేశించి వాజ్‌పేయి.. రాజధర్మాన్ని పాటించాలని సలహా ఇచ్చిన సంగతి మోడీకి గుర్తు లేదా? అన్ని ప్రశ్నించారు. ప్రధాని అయ్యే అభ్యర్థి మచ్చలేని మనిషిగా ఉండాలన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను మోడీ.. మోసపూరిత మేనిఫెస్టుగా పేర్కొనడాన్ని తప్పుబడుతూ 128 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను మోసగించలేదని, అనేక వాగ్దానాలను నెరవేర్చిందన్నారు. అంతర్గత పోరు వద్దు... కాంగ్రెస్-ఎన్సీపీ కార్యకర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవద్దని, ఇరు పార్టీల కార్యకర్తలు కలసికట్టుగా ప్రచారంలో పాల్గొనాలని షిండే కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో మంత్రులుగా పని చేస్తున్న తనకు, శరద్ పవార్‌కు మధ్య ఎప్పుడు ఎటువంటి మనస్పర్థలు రాలేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తూనే రామమందిరం నిర్మిస్తామని, రాముని ముందే ప్రతిజ్ఞ చేశారని, అధికారంలోకి రాగానే మర్చిపోయారని ఎద్దేవా చేశారు. అందుకే రాముడు శపించడంతో అధికారానికి దూరమయారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆహరభద్రత, మహిళా సంరక్షణ చట్టాన్ని తెచ్చామని, మోడీ కలలుగంటున్న ప్రధాని పదవి.. కలగానే మిగిలి పోతుందని, అశ పడడం తప్పు కాకపోయినా అత్యాశ తగదని చురకలంటించారు. ఈ ప్రచారంలో రాష్ట్ర మంత్రి పతంగ్‌రావు కదమ్, నగర మేయర్ చంచలా కోర్రే, ఉప మేయర్ బందు గైక్వాడ్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్వొకేట్ అభయ్ ఛాజేడ్, ఎమ్మెల్యేలు శరద్ రణపిస్, మోహన్ జోషి, రమేష్ బాగవే, బాపు పరారే, జయకుమార్ గోరే, మాజీ ఎమ్మెల్యే చంద్రకాంత్ ఛాజేడ్, బాలాసాహెబ్ శివార్కర్, కమల డోలే పాటిల్, రతన్ లాడ్ సోనాగ్రా, గోపాల్ చెవారీ తదితరులు పాల్గొన్నారు. -
‘ఆహార భద్రత’ ఘనత మాదే
భివండీ, న్యూస్‌లైన్: ఇతర దే శాలపై ఆధారపకుండా ఆహార భద్రత పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కిందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఉద్ఘాటించారు. భివండీ లోక్‌సభ నియోజకవర్గంలోని అంజూర్ఫాటా ప్రాంతంలో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి చవాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆహార భద్రత పథ కం వల్ల రూ.2 లక్షల 40 వేల కోట్ల విలువచేసే ధాన్యాన్ని మనమే ఎగుమతి చేశామన్నారు. కాంగ్రెస్ హయాంలోనే పేద కుటుంబాలు బాగుపడుతున్నాయన్నారు. ‘మహిళలు, దళితులకు పూర్తి భద్రత కల్పిస్తున్నాం. కొందరు గిట్టనివారు మా పార్టీపై దుష్ర్పచారం చేస్తున్నారు’అని తెలిపారు. బాలికలకు వసతి గృహాలు, సాంకేతిక, ఇతర కళాశాలు నిర్మించడంవల్ల విద్యార్థినుల సంఖ్య బాగాపెరిగిందన్నారు. ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్, ఎన్సీపీల నేత త్వంలోని తమ పాటుపడుతోందన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వం అందరితో మమేకమై అభివృద్ధి బాటలో దూసుకెళుతుందని చవాన్ పేర్కొన్నారు. ‘ప్రస్తుతం ఫిరాయింపుల బెడద పెరిగిపోవడంతో కార్యకర్తలు ఆందోళనలో పడిపోయారు. ఎవరి తరఫున ప్రచారం చేయాలి? ఎవరికి అండగా నిలబడాలి? తదితర విషయాలను తేల్చుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల్లో నెలకొన్న గందరగోళాన్ని దూరం చేయడానికే ఇక్కడికి వచ్చాను’ అని అన్నారు. అనంతరం జిల్లా ఇంచార్జీ మంత్రి గణేశ్ నాయిక్ ప్రసంగిస్తూ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. అక్కడి నుంచి వేలాదిసంఖ్యలో పశువులు గడ్డి కోసం ఈ రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. దీన్ని బట్టి గుజరాత్ ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందనే విషయాన్ని తేలికగా అర్ధం చేసుకోవచ్చన్నారు. ఇదిలాఉండగా ముఖ్యమంత్రి చవాన్ నిర్ధేశించిన సమయానికంటే సుమారు మూడు గంటలు ఆలస్యంగా సభా ప్రాంగణానికి రావడంతో కార్యకర్తలు కొంత అసహనానికి గురయ్యారు. సురేష్ టావ్రేకి కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభ టికెట్ ఇవ్వాలని ఈ సందర్భంగా కార్యకర్తలు డిమాండ్‌చేస్తూ చవాన్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున విశ్వనాథ్ పాటిల్‌ని అభ్యర్థిగా ఖరారు చేశారు. కార్యకర్తల ఒత్తిడికి తలొగ్గి చవాన్ అభ్యర్థిని మారుస్తారా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. కాగా కాంగ్రెస్, ఎన్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు మాజీ ఎమ్మెల్యే యోగేష్ పాటిల్, ఎమ్మెల్యేలు ఆనంద్బాయి ఠాకూర్, ఇర్ఫాన్ బురే, మహాదేవ్ చౌగులే, సహాయ మంత్రి సతేజ్ పాటిల్, కాంగ్రెస్ ప్రతినిధి మహాదేవ్ శేలార్, వేలాదిమంది కార్యకర్తలు హాజరయ్యారు. -
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే అణచేస్తాం: షిండే
షోలాపూర్(మహారాష్ట్ర): కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలోని ఒక వర్గం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా దుష్ర్పచారం చేస్తోందని, ఇలాంటి తప్పుడు కథనాలను వెంటనే ఆపకపోతే ఆ వర్గం మీడియాను అణచేస్తామని హెచ్చరించారు. షిండే ఆదివారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న షోలాపూర్‌లో యూత్ కాంగ్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. ‘నాలుగు నెలలుగా ఎలక్ట్రానిక్ మీడియాలోని ఓ వర్గం నాకు, కాంగ్రెస్‌కు సంబంధించిన వార్తలకు మసిపూసి మారేడుకాయ చేస్తోంది. మా పార్టీని అనవసరంగా రెచ్చగొడుతోంది. దీన్ని ఆపకపోతే అణచేస్తాం’ అని అన్నారు. -
ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు
-
ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు
ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో షిండే విభజనకు రెండు మూడు నెలలు సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు మరింత సమయం పట్టే అవకాశముందని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే చెప్పారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలోనే జరగవచ్చని ఓ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ‘‘విభజన ప్రక్రియ పూర్తవడానికి జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ మాదిరిగా కనీసం మరో రెండు లేదా మూడు నెలలు పట్టవచ్చు. సాధారణ ఎన్నికలు ఆలోపే వస్తున్నందున అవి ఉమ్మడి రాష్ట్రంలోనే జరగవచ్చు’’ అని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా లోక్‌సభతో పాటే ఎన్నికలున్న విషయాన్ని ప్రస్తావించగా, అవి కూడా సమైక్య రాష్ట్రంలోనే జరగవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఎన్నికల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయమన్నారు. విభజన ప్రక్రియ త్వరితగతిన పూర్తవుతుందని ప్రధాని చెప్పారని గుర్తు చేయగా, అది కొంత సమయం తీసుకుంటుందని షిండే అన్నారు. ‘‘కొత్తగా ఏర్పాటయ్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయాల్సిన ఆర్థిక సాయంపై అధ్యయనం చేయాల్సి ఉంది. ప్రధాన ప్రతిపక్షం ఇప్పటికే ఇందుకు డిమాండ్ చేసింది. కాబట్టి అధ్యయనం జరగాలి’ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధింపుపై ఇప్పటికైతే స్పష్టత లేదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే అందుకు వున్న అవకాశాలను పార్టీ పరిశీలిస్తుందన్నారు. తదుపరి సీఎం ఎవరని ప్రశ్నించగా.. దానిపై తనెలాంటి అభిప్రాయాలూ లేవని, పార్టీయే నిర్ణయిస్తుందని బదులిచ్చారు. -
18 తర్వాతే లోక్‌సభలో తెలంగాణ బిల్లు?
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను లోక్ సభలో ప్రవేశపెట్టే విషయంపై గందరగోళం నెలకొంది. ఈ నెల 13న లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ కోర్‌కమిటీ నిర్ణయించినా అవకాశాలు తక్కువగా ఉన్నట్టు సమాచారం. ఈ నెల 18 తర్వాతే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశముందని పీటీఐ వార్త సంస్థం వెల్లడించింది. ఈ మేరకు విశ్వసనీయం వర్గాల నుంచి సమాచారం అందినట్టు పేర్కొంది. కాగా లోక్ సభలో టీ బిల్లు ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. తెలంగాణ బిల్లు ఆర్థికపరమైనదా? కాదా? అన్న అంశాలతోపాటు పార్లమెంటు ఉభయ సభలలో ఏ సభలో ముందు ప్రవేశపెట్టాలి, ఎప్పుడు ప్రవేశపెట్టాలనేదానిపై కోర్ కమిటీ సమావేశంలో చర్చించారు. సమావేశం ముగిసిన తరువాత కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్‌ను కలిశారు. ఆరుగురు ఎంపీలు రాయపాటి సాంబశివరావు, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్ కుమార్, ఎ.సాయి ప్రతాప్, లగడపాటి రాజగోపాల్, జి.వి.హర్ష కుమార్‌లను పార్టీ నుంచి బహిష్కరించినట్లు తెలిపారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే వారిని సస్పెండ్ చేయాలని షిండే స్పీకర్‌ను కోరారు. 13న తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు హోం శాఖ వర్గాలు తెలిపాయి. అయితే, 18 తర్వాత అయితే బాగుంటుందని లోక్ సభ బీఏసీలో వినతులు వచ్చాయి. -
ఆప్ వీడియో ఎఫెక్ట్: ముగ్గురు పోలీసులు సస్పెండ్!
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విడుదల చేసిన వీడియో ముగ్గురు పోలీసుల సస్పెన్షన్ కు దారి తీసింది. ఓ వ్యక్తిని పోలీసులు కొడుతున్న దృశ్యాలతో ఉన్న వీడియోను ఆప్ శుక్రవారం విడుదల చేసింది. ఆప్ విడుదల చేసిన వీడియోలో ఓ వ్యక్తిని చితకబాదుతూ.. ఆతని పర్సును తీసుకుని.. డబ్బులు గుంజుకున్న దృశ్యాలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ పోలీసుల తీరుకు నిరసనగా కేజ్రివాల్ చేపట్టిన ధర్నా సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. కెమెరాకు చిక్కిన పోలీసులపై చర్య తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు విజ్క్షప్తి చేస్తూ ఆన్ లైన్ లో వీడియోను పోస్ట్ చేశారు. జనవరి 12 తేదిన దేశరాజధాని లోని ఎర్రకోట వద్ద పోలీసుల ప్రవర్తను రికార్డ్ చేశామని ఆప్ ప్రతినిధులు తెలిపారు. ఢిల్లీ పోలీసులు అరాచకానికి మారుపేరు. ఢిల్లీ పోలీసుల క్రూరత్వం గురించి తరచుగా వింటునే ఉంటాం. అలాంటి వార్తలకు సాక్ష్యంగా నిలిచింది ఈ వీడియో అని ఆప్ వర్గాలు వెల్లడించాయి. దేశ రాజధానిలో పెచ్చరిల్లుతున్న హింసపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. -
శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు: షిండే
న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన గురువారమిక్కడ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో ఎలాంటి సందేహాలకు తావు లేదన్నారు. ఈనెల 30వ తేదీ కల్లా బిల్లుపై అసెంబ్లీ నుంచి అభిప్రాయం వస్తుందో...రాదో చూడాలని షిండే అన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు(తెలంగాణ బిల్లు)పై శాసనసభలో చర్చించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒక వారం మాత్రమే గడువు ఇచ్చారు -
ఢిల్లీ సర్కారు పరిధిలో పోలీస్
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీస్ శాఖను రాష్ర్ట ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఆయన శుక్రవారం సాయంత్రం హోంమంత్రితో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రాజధానిలో నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందన్నారు. ఢిల్లీ పోలీస్ శాఖ రాష్ట్ర పరిధిలో లేకపోవడంతో నేరాల నియంత్రణలో జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వారిని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తే నగరంలో జరిగే ప్రతి నేరానికి వారు బాధ్యత వహించేలా చర్యలు తీసుకోగలమన్నారు. షిండేతో భేటీ అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు.‘అవసరమనుకుంటే ఎన్డీఎంసీ ప్రాంతం,లూటియన్స్ జోన్లను కేంద్ర నియంత్రణలో ఉంచుకుని, మిగిలిన నగర శాంతి భద్రతల పర్యవేక్షణ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని షిండేను కోరామన్నారు. అలాగే నగరంలో డెన్మార్క్ మహిళపై సామూహిక అత్యాచారం, మాలవీయనగర్‌లో డ్రగ్ రాకెట్‌పై దాడులు, పశ్చిమ ఢిల్లీలో మహిళ అనుమానాస్పద మృతి కేసులకు సంబంధించి నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశామన్నారు. కాగా వీరి డిమాండ్ల సాధ్యాసాధ్యాలను పరిశీలించి త్వరలోనే సమాచారమిస్తానని షిండే తమకు హామీ ఇచ్చారని కేజ్రీవాల్ తెలిపారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు మనీష్ సిసోడియా, సోమ్‌నాథ్ భారతి, రాఖీ బిర్లా ఉన్నారు. -
''షిండే హోం మంత్రిగా పనికిరాడు''
''హోం మంత్రిగా సుశీల్ కుమార్ షిండే ఏమాత్రం పనికిరాడు. ఆయన కంటే ఆర్థికమంత్రి చిదంబరం వంద రెట్లు నయం''.. ఈ మాటలన్నది ఎవరో కాదు. సాక్షాత్తు కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా నిన్న మొన్నటివరకు పనిచేసిన ఆర్.కె. సింగ్!! ఢిల్లీ పోలీసుల బదిలీలు, పోస్టింగులలో కలగజేసుకుంటున్నారంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలోను, దావూద్ ఇబ్రహీంను ఇండియాకు రప్పించడంలో అమెరికా సాయం చేస్తోందంటూ తప్పుడు సమాచారం ఇచ్చినందుకు షిండే రాజీనామా చేసే అవకాశముందా అని టీవీ చానళ్ల విలేకరులు ఆర్కే సింగ్‌ను ప్రశ్నించగా ఆయనీ ఘాటు సమాధానం ఇచ్చారు. హోం మంత్రిగా చిదంబరం వందరెట్లు నయమని ఇటీవలే బీజేపీలో చేరిన ఆర్కే సింగ్ చెప్పారు. దావూద్ ఇబ్రహీం విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చి అనవసరంగా దేశాన్ని తప్పుదోవ పట్టించారని షిండేపై విరుచుకుపడ్డారు. ఎఫ్‌బీఐ సమావేశాల్లో తాను కూడా పాల్గొన్నానని, కానీ తాము సాయం చేస్తామని వాళ్లు ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. తనకు, షిండేకు భేదాభిప్రాయాలున్న విషయం ప్రధానమంత్రితో సహా అందరికీ తెలుసన్నారు. అయితే, రిటైరైన తర్వాత ఆర్కే సింగ్‌కు కొత్తగా ఉద్యోగం ఏదీ ఇవ్వలేదన్న దుగ్ధతోనే ఆయనీ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి వి. నారాయణసామి అన్నారు. ఇది చాలా దురదృష్టకరమని, ప్రభుత్వంలో ఉన్నత పదవిలో పనిచేసిన ఆయనకు చాలా పత్రాల గురించి తెలుసని, ఎలాంటి ఆధారం లేకుండా అనవసరంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. షిండే మాటల మనిషి కాదు, చేతల మనిషని నారాయణసామి కితాబిచ్చారు. ఆర్కేసింగ్ పదవిలో ఉండగా ఈ ఆరోపణలు చేసి ఉంటే వాటికి విలువ ఉండేదని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. -
మత ప్రాతిపదికన ఉగ్ర సమీక్షలా?
హోంమంత్రి షిండేపై నరేంద్ర మోడీ ధ్వజం ఉగ్రవాదులకు మతం ఉంటుందా? కాంగ్రెస్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలంటూ మండిపాటు పణజీ (గోవా) నుంచి సాక్షి ప్రతినిధి: మైనారిటీలపై నమోదైన ఉగ్రవాద కేసులను సమీక్షించాలంటూ అన్ని రాష్ట్రాలను కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే కోరడంపై బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. యూపీఏ ప్రభుత్వం బరితెగించి మత రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఉగ్రవాదులకు మతం ఉంటుందా? అని ప్రశ్నించారు. ఆదివారం గోవా రాజధాని పణజీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోడీ... కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ‘నేరాలకు పాల్పడే వారిని అరెస్టు చేసేటప్పుడు వారిలో ముస్లింలు ఉండకుండా చూడాలని షిండే అన్ని రాష్ట్రాలకూ లేఖలు రాశారు. ఇదేం విధానం? నేరానికి పాల్పడే వ్యక్తిని అరెస్టు చేయాలా వద్దా అని అతని మతం నిర్దేశించాలా? కాంగ్రెస్ ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోంది’ అని తూర్పారబట్టారు. ఈ అంశంపై షిండే అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాయడాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లగా తనకేమీ తెలియదనడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. కేసుల ఉపసంహరణ అధికారం కేవలం జడ్జీలకే ఉంటుందని...ఈ విషయంలో షిండేను ఎవరో తప్పుదోవ పట్టించి ఉంటారన్నారు. అధికారమిస్తే సమాఖ్య వ్యవస్థ బలోపేతం కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ దేశానికి భారంగా మారాయని, 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండింటి నుంచి దేశానికి విముక్తి కల్పించాలని మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో దేశం 50 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ తప్పులను సరిదిద్దడంతోపాటు సమాఖ్య వ్యవస్థను పటిష్టం చేస్తామని, రాజ్యంగ సంస్థల ప్రతిష్టలను ఇనుమడింప చేస్తామని, దేశ ప్రజలకు జవాబుదారిగా ఉంటామని హామీ ఇచ్చారు. జయంతి ట్యాక్స్ గురించి ఇప్పుడే వింటున్నా... వివిధ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల మంజూరు కోసం లంచాలు డిమాండ్ చేశారనే ఆరోపణలతో ఆ శాఖ పదవికి రాజీనామా చేసిన జయంతీ నటరాజన్‌పై మోడీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇన్‌కం ట్యాక్స్, సేల్స్‌ట్యాక్స్ గురించి తనకు తెలుసుగానీ ‘జయంతి ట్యాక్స్’ అంటే ఏమిటో ఈమధ్యే తెలిసిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయన్నారు. కాగా, మోడీ ఆరోపణలను జయంతి తోసిపుచ్చారు. మీడియాకు చురకలు దేశంలో వార్తాచానళ్లు, పత్రికలకు ఢిల్లీ రాజకీయాలు తప్ప ఏమీ కనిపించడంలేదని పరోక్షంగా ఆమ్ ఆద్మీ పార్టీకి అధిక ప్రచారం కల్పించడాన్ని మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. నిరాడంబరతకు మారుపేరైన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఒకవేళ ఢిల్లీలో ఉండి ఉంటే దేశానికి ఆయన గురించి తెలిసి ఉండేదన్నారు. మీడియా కొన్నేళ్లపాటు తనను దూరం పెట్టినా ప్రజల మనసును గెలుచుకోగలిగానని చెప్పుకొచ్చారు. ‘టీవీలో కనిపించే వ్యక్తి కావాలో లేక వారిని ముందుకు నడిపించే వ్యక్తి కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి’ అని అన్నారు. గోవాకు ప్రత్యేక హోదా ఇవ్వాలి: పారికర్ గోవా సీఎం పారికర్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కేంద్రం మూసేసిన మైనింగ్‌ను పునఃప్రారంభించాలని మోడీని కోరారు. అంతకుముందు బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో 270 స్థానాలు సాధిస్తామని...గోవాలోని రెండు లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని ప్రజలను కోరారు. -
శరద్ పవార్ ప్రధాని అయితే సంతోషిస్తా: షిండే
-
పవార్ పీఎం అయితే సంతోషమే:షిండే
సోలాపూర్: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రధాని అయితే తనకన్నా సంతోషపడే వ్యక్తి ఎవరూ ఉండరని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. మరాఠా దినపత్రిక ఎడిటర్స్ తో సమావేశమైన షిండే ఈ మేరకు వ్యాఖ్యానించారు. 'నా రాజకీయ గురువు పవార్ ప్రధాని అయితే ఆనందపడే వ్యక్తుల్లో నేనే ప్రధముడ్ని. రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రధాని అయితే బాగుంటుదనుకుంటారు. 1992 నుంచి ఆయన ప్రధాని కావడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు' అని షిండే తెలిపారు. కాగా, కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సమస్యల నుంచి తమ పార్టీ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ గట్టెక్కిస్తారన్నారు. రెండు విధానాలపై మాట్లాడానికి కారణాలు లేవని, ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గత 20 సంవత్సరాల నుంచి పవార్ ప్రధాని అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని, ఢిల్లీ రాజకీయాలు కారణంగా తన రాజకీయ గురువు భంగపడ్డారని షిండే పేర్కొన్నారు. -
కేజ్రీవాల్‌కు తెలియకుండానే భద్రత: షిండే
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు తెలియకుండానే ఆయనకు భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. భద్రత వద్దని ఆయన ఎన్నిసార్లు చెప్పినా కల్పించామనే అన్నారు. వీవీఐపీలకు, ప్రమాదంలో ఉన్నవారికి భద్రత కల్పించడం ప్రభుత్వ విధి అని, అందుకే హోం మంత్రిత్వశాఖ ఇలా చేస్తోందని ఆయన చెప్పారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కాగానే ఆయనకు భద్రత ఇవ్వడం మొదలైందని షిండే వివరించారు. ఇప్పుడు ఆయనకు తెలియకుండానే భద్రత కల్పిస్తున్నామని తన నెలవారీ విలేకరుల సమావేశంలో షిండే చెప్పారు. భద్రతా సంస్థలు మూడుసార్లు కేజ్రీవాల్‌కు భద్రత కల్పిస్తామని కోరగా, ఆయన ఇప్పటికే రెండుసార్లు తిరస్కరించారని తెలిపారు. ఢిల్లీ పోలీసులే కేజ్రీవాల్‌కు భద్రత కల్పిస్తున్నారని, అలాగే ఆయన నివాస ప్రాంతంలోను, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యలయం వద్ద భద్రతా ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా ఘజియాబాద్ ఎస్పీని ఢిల్లీ పోలీసు కమిషనర్ ఆదేశించారని షిండే తెలిపారు. యూనిఫాంలో కాకపోయినా.. మఫ్టీలో అయినా సరే భద్రత కల్పించాల్సిందేనన్నారు. -
ప్రత్యర్థి ఎవరైనా నేనే గెలుస్తా: షిండే
షోలాపూర్, న్యూస్‌లైన్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తన గెలుపు తథ్యమని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ధీమా వ్యక్తం చేశారు. బుధవారం అక్కల్కోట్ తాలూకా విహాన్నూర్ గ్రామంలో బీఎస్ఎఫ్ భవన సముదాయానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా ఏ అభ్యర్థి బరిలోకి దిగినా, విజయాన్ని మాత్రం ఆపలేరని అన్నారు. తప్పకుండా తానే గెలుస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ప్రత్యర్థి అభ్యర్థుల గురించి ఎక్కువగా ఆలోచించనని, పార్టీ అప్పగించిన విధిని మాత్రమే నిర్వహిస్తానన్నారు. బీజేపీ తరపున శరద్‌బన్‌సోడే అయినా, మరొకరు అయినా తనకు వచ్చిన నష్టం ఏమీ లేదని తెలిపారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఎస్ఎఫ్ ముఖ్య అధికారులు, హోంశాఖ ఉన్నత అధికారులు, స్థానిక శాసనసభ్యుడు సిద్రామప్ప పాటిల్, మాజీ మంత్రి సిద్దరాం మేత్రేలతో పాటు కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. -
అవకతవకలు లేనే లేవు
ముంబై : అత్యంత ఎత్తయిన ఆదర్శ్ భవనంలో ఫ్లాట్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన వార్తలను కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే కొట్టిపారేశారు. సోమవారం రాత్రి నగరంలోని కాందివలి ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇవన్నీ నిరాధార ఆరోపణలన్నారు. ‘ఆదర్శ్ హౌసింగ్ సొసైటీలో ఫ్లాట్ల కేటాయింపునకు సంబంధించి ఎటువంటి అవతవకలు జరగలేదు. కార్గిల్ అమర జవాన్ల కుటుంబాలకు ఇందులో రిజర్వేషన్ ఏమీ లేదు’ అని అన్నారు. కాగా ఆదర్శ్ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ద్విసభ్య కమిషన్ తప్పుపట్టిన మాజీ ముఖ్యమంత్రుల జాబితాలో షిండే పేరు కూడా ఉంది. శీతాకాల సమావేశాల సందర్భంగా నాగపూర్‌లో గత ఏడాది డిసెంబర్ 20వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం ద్విసభ్య కమిషన్ సమర్పించిన నివేదికను తిరస్కరించిన సంగతి విదితమే. అయితే ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ద్విసభ్య కమిషన్ చేసిన సిఫార్సులలో కొన్నింటిని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా రాష్ర్ట ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టాయి. రాజకీయ నాయకులకు అనుకూలంగా, ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా ఉన్న సిఫారసులను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిదంటూ విమర్శించాయి. బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జేఏ పాటిల్ నేతృత్వంలోని ద్విసభ్య కమిషన్ దివంగత ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, అశోక్‌చవాన్, శివాజీరావ్ నీలంగేకర్ పాటిల్‌ల తీరును తన నివేదికలో తప్పుబట్టిన సంగతి విదితమే. -
లోక్‌పాల్ బిల్లును రాజ్యసభలో వెంటనే చర్చిస్తాం: షిండే
అవినీతిని అంతం చేసే లోక్‌పాల్ బిల్లును రాజ్యసభలో వీలైనంత వెంటనే చర్చకు చేపడతామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. రాలెగావ్ సిద్ధి గ్రామంలో అన్నాహజారే ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరుకున్న నేపథ్యంలో షిండే హడావుడిగా ఈ ప్రకటన చేశారు. లోక్‌పాల్ బిల్లును వెనువెంటనే రాజ్యసభలో చర్చకు చేపట్టాలని సెలెక్ట్ కమిటీ ఇప్పటికే నోటీసు కూడా ఇచ్చిందన్నారు. ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి వి.నారాయణ సామి నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ ఈ మేరకు నోటీసు పంపినట్లు షిండే చెప్పారు. లోక్‌పాల్ బిల్లును లోక్‌సభ ఇప్పటికే ఆమోదించి, రాజ్యసభకు పంపింది. రాజ్యసభలోని సెలెక్ట్ కమిటీ బిల్లుకు 13 సవరణలు సూచించింది. వాటిని ప్రభుత్వం పరిశీలిస్తోందని షిండే తెలిపారు. లోక్‌పాల్ బిల్లును వెంటనే అమలు చేయాలన్న ఏకైక డిమాండుతో అన్నా హజారే మళ్లీ ఆమరణ దీక్ష ప్రారంభించడం వల్లే సర్కారులో కదలిక వచ్చిందని అంటున్నారు. -
ఈ సమావేశాల్లోనే మూడు కీలక బిల్లులు: షిండే
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. శీతాకాలపు సమావేశాల్లో , తెలంగాణ బిల్లు, జన లోక్ పాల్ బిల్లు, కమ్యూనల్ వాయెలెన్స్ బిల్లులను సభలో ప్రవేశపెడుతామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. మూడు బిల్లులపై మాకు స్పష్టత ఉంది. బిల్లులను తీసుకువస్తాం అని మీడియా సమావేశంలో వెల్లడించారు. జన లోక్ పాల్ బిల్లును లోకసభ లోఆమోదించాం. ఆతర్వాత రాజ్యసభకు పంపితే.. వారు సెలక్ట్ కమిటీకి పంపారు. అయితే బిల్లుకు కొన్నిసవరణలను కమిటీ సూచించింది. ప్రస్తుతం ఆ బిల్లు రాజ్యసభలో పెండింగ్ లో ఉంది. జన లోక్ పాల్ బిల్లుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని నోటీసు పంపాం అని షిండే తెలిపారు. కమ్యూనల్ వాయెలెన్స్ బిల్లుపై చర్చలు జరిగాయి.. తీర్మానం పెండింగ్ లో ఉంది అన్నారు. -
రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయలేదు: షిండే
ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నుంచి తనకు సిఫారసు అందలేదని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో ఏ పార్టీకి స్సష్టమైన మెజారిటీ లభించని సంగతి తెలిసిందే. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 8 స్తానాలకే పరిమితం కావడంతో తాము పోషించే పాత్ర ఏమి లేదు అని షిండే వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి పాలనకు జంగ్ ఎలాంటి సిఫారసులు చేయలేదు అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. బీజేపీ 31 స్థానాల్లో గెలుపొందగా, ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాల్లో విజయం సాధించింది. అయితే బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రతిపక్ష పాత్ర వహించడానికి మొగ్గు చూపడంతో ఢిల్లీలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. -
తెలంగాణ?.. రాయలా?.. ఇంకా సస్పెన్సే!
* కసరత్తు ముగించి బిల్లు సిద్ధం చేసిన జీవోఎం * నివేదిక, నోట్లతో పాటు నేడు కేబినెట్‌కు సమర్పణ * జీవోఎం సిఫార్సు ఏమిటన్న దానిపై ఇంకా గోప్యతే * సాయంత్రం ఐదింటికి కేబినెట్ సమావేశంలో చర్చ * ‘రాయల’, తెలంగాణపై భేటీలోనే తుది నిర్ణయం * బిల్లును ఆమోదిస్తే ఆ వెంటనే రాష్ట్రపతికి సిఫార్సుపై పెదవి విప్పని షిండే, సభ్యులు * ఫక్తు రాజకీయ కోణంలో చూస్తున్న కాంగ్రెస్ * చివరి క్షణం దాకా లాభనష్టాల బేరీజే లక్ష్యం? * రాయల తెలంగాణ, తెలంగాణ ఆప్షన్లు రెండూ ఇచ్చిన మంత్రుల బృందం! సాక్షి, న్యూఢిల్లీ: విభజన పర్వంలో ఓ అంకం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ ఏర్పాటుచేసిన మంత్రుల బృందం(జీవోఎం) ఎట్టకేలకు తన పని పూర్తి చేసింది. విభజనకు అనుసరించాల్సిన విధివిధానాల ఆధారంగా రూపొందించిన సిఫార్సులతో కూడిన నివేదికకు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు-2013కు, కేబినెట్ నోట్‌కు బుధవారం జరిపిన చివరి భేటీలో జీవోఎం ముద్ర వేసింది. గురువారం సాయంత్రం ఐదింటికి జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మూడింటినీ టేబుల్ ఐటెమ్‌గా పెడతారని తెలియవచ్చింది. కేబినెట్ వాటిపై చర్చించి ఆమోదం తెలపడంతో పాటు ఆ వెంటనే, అంటే గురువారమే రాష్ట్ర విభజన బిల్లును రాష్ట్రపతికి కూడా పంపుతుందని సమాచారం. గంట పాటు జరిగిన జీవోఎం భేటీ అనంతరం బుధవారం రాత్రి షిండే మీడియా ముందుకొచ్చి క్లుప్తంగా మాట్లాడారు. ‘‘జీవోఎంను ఏర్పాటు చేస్తూ అక్టోబర్ 3న కేంద్ర కేబినెట్ మాకిచ్చిన బాధ్యతను నేటితో పూర్తిచేశాం. మేం సిఫార్సులు చేశాం. వాటిపై గురువారం కేబినెట్ చర్చిస్తుంది’’ అని చెప్పడంతో సరిపెట్టారు. తెలంగాణ, రాయల తెలంగాణల్లో దేనికి సిఫార్సు చేశారంటూ విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఎలాంటి బదులూ ఇవ్వకుండానే వెనుదిరిగారు. జీవోఎం సిఫార్సు ఏమిటన్నది మరో 24 గంటల్లోపే తేటతెల్లమయ్యేదేనని తెలిసి కూడా ఇంతగా గోప్యత పాటించడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. రెండు ఆప్షన్లలో దేనితో తనకు రాజకీయంగా కొద్దో గొప్పో ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందన్న కోణంలో లాభనష్టాల బేరీజులో, తుది విడత మల్లగుల్లాల్లో కాంగ్రెస్ అధిష్టానం తలమునకలుగా ఉన్నట్టు సమాచారం. అందుకే, ఈ అంశంపై అస్పష్టతను గురువారం సాయంత్రం దాకా కొనసాగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన వంటి అత్యంత కీలకాంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఫక్తు రాజకీయ ప్రయోజన కోణంలోనే చూస్తోందన్నది తాజా వైఖరితో మరోసారి స్పష్టమైందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాలతో కలిపి 12 జిల్లాలతో కూడిన ‘రాయల తెలంగాణ’ ఏర్పాటుకు జీవోఎం ఆమోదముద్ర వేసినట్టు విస్తృతంగా ప్రచారం జరుగుతున్నా అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు. 12 జిల్లాలతో కూడిన రాయల తెలంగాణ, 10 జిల్లాలతో కూడిన తెలంగాణఅంటూ రెండు ఆప్షన్లనూ నివేదికలో జీవోఎం పొందుపరిచిందని, అంతిమ నిర్ణయాన్ని కేబినెట్‌కు విడిచిపెట్టిందని మరికొన్ని వర్గాల కథనం. దాంతో విభజన ఎలా ఉండాలనే విషయమై జీవోఎం కచ్చితంగా చేసిన సిఫార్సు ఏమిటనే దానిపై సందిగ్ధత నెలకొంది. నదీ జలాల పర్యవేక్షణ మండళ్లకు సంబంధించి కృష్ణా, గోదావరితో పాటు పెన్నా నదిని కూడా చేర్చినట్టు సమాచారం. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సరిగ్గా ముందురోజు జీవోఎం తన కసరత్తును ముగించడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశాల్లో పార్లమెంటులో బిల్లు పెడతారా, లేదా అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీవోఎం తన పనిని ముగించి చేతులు దులుపుకోవడంతో ఇక మీదట ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే టీఆర్ఎస్తో పాటు తెలంగాణలోని పలువురు కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నా రాయల తెలంగాణ ఏర్పాటుకే జీవోఎం సిఫార్సు చేసిందని హోం శాఖ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. అంతేగాక, ‘‘317డి అధికరణాన్ని రెండు రాష్ట్రాలకూ వర్తింపజేయాలని కూడా జీవోఎం సిఫార్సు చేసింది. రాజ్యాంగ సవరణ ఆవశ్యకత తలెత్తకుండా ఉండేందుకు గాను బిల్లు పేరును కూడా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు అని కాకుండా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బిల్లుగా మార్చాలని కూడా సిఫార్సు చేసింది’’ అని పీటీఐ తెలిపింది. ఆస్తులు-అప్పులు, జల వనరుల పంపకం, రాష్ట్రాల సరిహద్దుల నిర్ణయం, ప్రభుత్వాధికారుల క్యాడర్ల విభజన తదితర అంశాలకు కూడా జీవోఎం తుది మెరుగులు దిద్దినట్టు పేర్కొంది. కేబినెట్ నుంచి వెంటనే రాష్ట్రపతికి: జైరాం రాష్ట్ర విభజన ప్రతిపాదనను అక్టోబర్ 3న కేంద్ర కేబినెట్ ఆమోదించి ఏర్పాటుచేసిన జీవోఎం ఇప్పటివరకూ పలు సమావేశాలు నిర్వహించి, ఇదిగో అదిగో నివేదికను ఖరారు చేస్తున్నామంటూ చెబుతూ వచ్చిన విషయం విదితమే. మంగళవారం రాత్రి జరిగిన అసంపూర్ణ భేటీ తర్వాత కేంద్ర హోంమంత్రి షిండే చెప్పిన ప్రకారం బుధవారం రాత్రి 8 గంటలకు నార్త్ బ్లాక్‌లోని హోం శాఖ కార్యాలయంలో జీవోఎం ‘చిట్టచివరి భేటీ’ నిర్వహించింది. షిండే ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సభ్యులు ఎ.కె.ఆంటోనీ, పి.చిదంబరం, జైరాం రమేశ్, వీరప్ప మొయిలీ, నారాయణసామి పాల్గొనగా, గులాం నబీ ఆజాద్ గైర్హాజరయ్యారు. షిండే, జైరాం, నారాయణసామి ఒకే వాహనంలో భేటీకి రావడం విశేషం. అంతకుముందు వారు సోనియాగాంధీ నివాసానికి వెళ్లి నివేదిక అంశాలపై చివరిసారిగా చర్చించారని, ఆమె సమ్మతి తర్వాత నేరుగా నార్త్ బ్లాక్‌కు చేరుకున్నారని తెలుస్తోంది. జీవోఎం సమావేశం గంటలోపే ముగిసింది. ఆ తర్వాత కూడా షిండే, జైరాం దాదాపు గంటపాటు లోపలే గడిపారు. సభ్యులంతా ఆమోదించిన సిఫార్సులకు తుది మెరుగులు దిద్ది తుది నివేదికను, బిల్లును సిద్ధం చేశారు. అన్ని నిర్ణయాలూ తీసుకున్నామని, తుది సమావేశం పూర్తయిందని భేటీ అనంతరం ఆంటోనీ కార్యాలయం లోపల మీడియాకు చెప్పారు. ఒక బిల్లు, ఒక నివేదిక సిద్ధమయ్యాయని కార్యాలయం బయట మొయిలీ విలేకరులకు తెలిపారు. అయితే నివేదిక, ముసాయిదా బిల్లు స్వరూపంపై మీడియా ఎంతగా ప్రశ్నించినా సభ్యులెవరూ స్పందించలేదు. చివరగా బయటికొచ్చిన జైరాం కూడా తెలంగాణ, రాయల తెలంగాణలపై ఏమీ చెప్పలేదు. నివేదిక, బిల్లు వెంటనే కేబినెట్‌కు వెళ్తాయని, ఆ వెంటనే వాటిని రాష్ట్రపతికి పంపుతారని మాత్రమే చెప్పారు. అయితే బిల్లును పరిశీలించేందుకు, అసెంబ్లీకి పంపేందుకు రాష్ట్రపతి ఎంత సమయం తీసుకుంటారో చెప్పడానికి జీవోఎం సభ్యులతో పాటు హోం శాఖ వర్గాలు కూడా నిరాకరించాయి. వీలైనంత త్వరగా అసెంబ్లీకి పంపవచ్చన్నది కాంగ్రెస్, ప్రభుత్వ వర్గాల అంచనా. -
ఇది జిఓఎం ఆఖరి సమావేశం కాదు: షిండే
ఢిల్లీ: రాష్ట్ర విభజనకు సంబంధించి ఏర్పడిన కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) రేపటి సమావేశం ఆఖరి సమావేశం కాదని ఆ బృందానికి నేతృత్వం వహిస్తున్న కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. రేపు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జిఓఎం సుదీర్ఘ సమావేశం జరుగుతుంది. ఎవరికీ అన్యాయం జరగకుండా సమస్యలను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. ఈ ఉదయం కేంద్ర మంత్రులు జైరామ్ రమేష్, జైపాల్ రెడ్డి షిండేతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం(యుటి) చేయాలన్న ఆలోచనకు జైపాల్ రెడ్డి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కొందరు జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 10.30కు షిండేను కలిశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను పెంచాలని వారు షిండేను కోరారు. రేపు ఉదయం సీమాంధ్ర మంత్రులతో జైరాం రమేష్ సమావేశమవుతారు. ఇదిలా ఉండగా, జిఓఎం తుది సమావేశం విషయమై సుశీల్ కుమార్ షిండే, జైరామ్ రమేష్ గతంలో పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేశారు. అదే తుది సమావేశమని జైరాం రమేష్ అంటే, అది చివరిది కాదని షిండే చెప్పారు. మరికొన్ని సమావేశాలు జరుగుతాయని కూడా ఆయన తెలిపారు. ఇప్పుడు కూడా షిండే ఇది తుది సమావేశం కాదని చెబుతున్నారు. -
ఇది జిఓఎం ఆఖరి సమావేశం కాదు: షిండే
-
‘శీతాకాలం’లోనే టీ-బిల్లు: షిండే
* పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పెడతామని వెల్లడి * 18న కీలక సమావేశాలు జరపనున్న జీవోఎం * రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో, సీఎంతో భేటీలు * 20న ముసాయిదా నివేదికకు తుది మెరుగులు * వీలైతే అదే రోజున కేబినెట్‌కు తెలంగాణ బిల్లు! * శరవేగంగా సాగుతున్న విభజన ప్రక్రియ సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు బిల్లు పార్లమెంట్‌కు ఎప్పుడు వస్తుందనే విషయమై సాగుతున్న ఊహాగానాలకు, నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. బిల్లును రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే గురువారం స్వయంగా వెల్లడించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 5న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజనపై కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం(జీవోఎం) కేబినెట్‌కు నివేదిక సమర్పించడానికి శరవేగంగా ప్రక్రియను ముందుకు తీసుకెళ్తోంది. ఇందుకోసం ఈ నెల 11 నుంచి వరుస భేటీలు నిర్వహిస్తున్న జీవోఎం తాజాగా గురువారం సాయంత్రం దాదాపు నాలుగు గంటల పాటు కార్యదర్శుల స్థాయి ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించింది. ఏడు శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో వరుసగా సమావేశమై ఆయా శాఖల నివేదికలపై చర్చించింది. ప్రధానంగా ఆర్థిక, హోం, న్యాయ శాఖల ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షల్లో విభజనతో ముడిపడిన అత్యంత కీలకాంశాలు- హైదరాబాద్ ప్రతిపత్తి, 371-డి, ఆస్తులు-అప్పులు, రెవెన్యూ పంపకంపై విస్తృతంగా చర్చించింది. ముసాయిదా బిల్లు అంశాలపై న్యాయశాఖ ఉన్నతాధికారులతో లోతుగా మాట్లాడింది. ఇక్కడితో శాఖలన్నింటితో చర్చల కసరత్తును దాదాపుగా ఓ కొలిక్కి తీసుకొచ్చిన జీవోఎం ఈ నెల 18న మూడు కీలక భేటీలు జరపనుంది. ఆ రోజు ఉదయం10.30కు తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులతో, 11.30కు సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులతో, 12.30కు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ కానుంది. విభజనపై వారి సూచనలు, సలహాలు, అభిప్రాయాలను విన్న మీదట ముసాయిదా నివేదిక తయారు చేసి.. 20న తుది మెరుగులు దిద్దుతోంది. 21న కేంద్ర కేబినెట్ సమావేశంలోనే నివేదికను చర్చకు పెట్టవచ్చని, ఇందుకోసమే 20న జీవోఎం చివరి సమావేశాన్ని నిర్వహించనుందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. 26కల్లా అసెంబ్లీకి బిల్లు అనుకున్న రీతిలోనే అన్నీ జరిగితే, కేబినెట్ సమావేశంలో నివేదికను ఆమోదించి బిల్లును ఒకటి రెండు రోజుల్లోపే రాష్ట్రపతికి పంపనున్నారు. రాష్ట్రపతి నుంచి బహుశా 26కల్లా రాష్ర్ట శాసనసభకు బిల్లు చేరుతుందని హస్తినలో ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ అభిప్రాయంతో బిల్లు వెనక్కి వచ్చిన వెంటనే అంతిమంగా శీతాకాల సమావేశాల్లో బిల్లును కచ్చితంగా ఏ రోజున పెట్టాలనేదానికి కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ ఆదేశాల మేరకు ముహూర్తాన్ని కేంద్రం నిర్ణయిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. బాలల చిత్రోత్సవం వల్లే కిరణ్ రాలేకపోయారు హోం శాఖ కార్యాలయం ఉన్న నార్త్‌బ్లాక్‌లో ఈ సమీక్షా సమావేశాల్లో పాల్గొనడానికి సాయంత్రం 4 గంటలకు చేరుకున్న షిండే.. కార్యాలయం లోపల కొందరు విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ బిల్లుపై నెలకొన్న సందిగ్ధతకు, ఉత్కంఠకు ఫుల్స్టాప్ పెట్టారు. జీవోఎం ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుంది, బిల్లును ఎప్పుడు తీసుకొస్తారనే ప్రశ్నించగా, తమకప్పగించిన పనిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని, శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో బిల్లు పెడతామని పునరుద్ఘాటించారు. గురువారం జీవోఎంతో చర్చలకు రావాల్సిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఎందుకు రాలేదని అడగ్గా బాలల చలనచిత్రోత్సవమే కారణమని షిండే చెప్పారు. ‘‘ఆయన్ను మేం 18న కలుస్తాం. సీఎంతో భేటీ తర్వాత మా నివేదిక తయారీపై దృష్టి పెడతాం’’ అని చెప్పారు. ఈ నెల 21న జరిగే కేబినెట్ సమావేశంలో తెలంగాణపై మీ నివేదికను చర్చకు పెడతారా అని ప్రశ్నించగా, ఆ సంగతి తాను చెప్పలేనంటూ శీతాకాల సమావేశాల్లో బిల్లు వస్తుందని పునరుద్ఘాటించారు. అధికారులకు షిండే ఆదేశాలు జీవోఎంకు అప్పగించిన పని రానున్న కొద్ది రోజుల్లో పూర్తికానున్నందున కేబినెట్‌కు సమర్పించాల్సిన నివేదిక రూపకల్పనకు సన్నాహాలను చకచకా చేయాలని హోంశాఖ ఉన్నతాధికారులను షిండే ఆదేశించినట్టు తెలిసింది. దాంతో జీవోఎంకు వివిధ శాఖల నుంచి అందిన నివేదికలు, అభిప్రాయాలు, సూచనలన్నింటినీ వారు క్రోడీకరిస్తున్నారని సమాచారం. అధికారులు ఒక పద్ధతి ప్రకారం వాటికి సమగ్ర రూపమిస్తున్నారని, వీటి ఆధారంగానే ముసాయిదా నివేదిక తయారవుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ముసాయిదా నివేదిక తయారయ్యాక జీవోఎం దాన్ని పరిశీలించి చివరగా అవసరమనుకున్న మార్పుచేర్పులు చేస్తుందని, ఆ తుది మెరుగులు పూర్తయ్యాయంటే అది కేబినెట్‌కు వెళ్లిపోతుందని చెప్పాయి. ఈ ప్రక్రియ మొత్తాన్ని రానున్న వారంలోపే జీవోఎం పూర్తి చేస్తుందని ఆ వర్గాలు వివరించాయి. -
మా హయాంలోనే టి-బిల్లు
* హోం మంత్రి షిండే స్పష్టీకరణ * ఈ శీతాకాల సమావేశాల్లో బిల్లు పెడతారా అంటే సమాధానం దాటవేత * పార్లమెంట్లో బిల్లు ఆమోదంపై నేనేం మాట్లాడలేను * మాకిచ్చిన పనిని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేస్తాం * ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పరిధిపై అనేక ప్రతిపాదనలు వచ్చాయి.. పరిశీలిస్తున్నాం * 371డిపై జీవోఎం సిఫార్సుల మేరకే ప్రభుత్వ చర్యలు సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత యూపీఏ ప్రభుత్వ హయాం 2014లో ముగిసేలోగానే రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో పెడతామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలిపారు. అయితే, ఈ బిల్లును రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పెడతారా లేదా అనే అంశంపై ప్రశ్నలకు ఆయన స్పష్టంగా బదులివ్వలేదు. ‘‘బిల్లు వస్తుంది, మా హయాం ముగిసేలోగానే...’’ అని మాత్రమే చెప్పారు. షిండే సూటిగా చెప్పకపోవడంతో శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టడంపై సందిగ్ధత నెలకొంది. హోంశాఖ నెలవారీ నివేదిక విడుదల కోసం ఢిల్లీలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో షిండే రాష్ట్ర విభజనకు సంబంధించిన పలు ప్రశ్నలకు బదులిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ప్రకారం బిల్లును పార్లమెంట్లో పెడతామని, అక్కడ ఆమోదం పొందే అంశంపై తానేం మాట్లాడలేనని అన్నారు. అయితే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే టీ-బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వార్తాసంస్థ తెలిపింది. విభజనపై కేబినెట్ తమకు అప్పగించిన పనిని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయడానికి మంత్రుల బృందం(జీవోఎం) ప్రయత్నిస్తోందని షిండే అన్నారు. ఎప్పటిలోగా బిల్లు అసెంబ్లీకి వెళ్తుందన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ‘‘ప్రక్రియ నడుస్తోంది. ఇది కాగానే మేం కేబినెట్‌కు నివేదిస్తాం. అక్కడి నుంచి రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి నుంచి బిల్లు రాష్ట్ర అసెంబ్లీకి వెళ్తుంది’’ అని చెప్పారు. రాష్ట్ర విభజనకు తాను అంగీకరించలేదని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా, ‘‘చూడండి... సీఎం ఇప్పటివరకు నన్ను కలవలేదు. ఆయన కలిసినపుడు, నేను మాట్లాడతాను’’ అని అన్నారు. విభజనకు ముందు పలు సమస్యలను పరిష్కరించడం అవసరమని, ఇప్పటివరకూ వచ్చిన ప్రతిపాదనలన్నింటినీ జీవోఎం పరిశీలిస్తుందని చెప్పారు. గతంలో పలుమార్లు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించామని, మంగళ, బుధవారాల్లో మరోసారి జరుపుతున్నామని, అందులో అన్ని పార్టీలతో అనేక అంశాలపై చర్చిస్తామని, పార్టీల అభిప్రాయం తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 18న రాష్ట్రానికి చెందని కేంద్ర మంత్రులతో సమావేశమవుతామని వెల్లడించారు. హైదరాబాద్‌పై పలు ప్రతిపాదనలు.. హైదరాబాద్‌పై అనేక ప్రతిపాదనలు జీవోఎం ముందుకు వచ్చాయని, వాటన్నింటినీ జీవోఎం పరిశీలిస్తోందని షిండే చెప్పారు. ఆర్టికల్ 371డీ విషయంలో జీవోఎం సిఫార్సుల ఆధారంగానే ప్రభుత్వ చర్యలు ఉంటాయని ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. హైదరాబాద్‌లో ఏ పరిధివరకు ఉమ్మడి రాజధానిగా పరిగణిస్తారని ప్రశ్నించగా, రెవెన్యూ జిల్లావరకు పరిగణించాలని, కమిషనరేట్‌నే తీసుకోవాలని రకరకాల ప్రతిపాదనలు, అభిప్రాయాలు తమ ముందుకు వచ్చాయని, వాటిని తాము పరిశీలిస్తున్నామన్నారు. ఈ విషయంలో శ్రీకృష్ణ కమిటీ కూడా పలు ప్రతిపాదనలు చేసిందని, ప్రతి అంశాన్నీ జీవోఎం పరిశీలిస్తోందని చెప్పారు. శాంతిభద్రతలను కొంత కాలంపాటు కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టుకునే ఆలోచన ఉందా అని అడగ్గా, ఈ విషయం ఇంకా పరిశీలనలోనే ఉందని, తుది నిర్ణయం తీసుకోలేదని ఆయనన్నారు. కార్యదర్శులతో అన్నీ చర్చిస్తున్నాం.. కేంద్ర మంత్రిత్వశాఖల కార్యదర్శులతో జీవోఎం పలు సమస్యలపై సవివరంగా చర్చిస్తోందని షిండే తెలిపారు. చర్చలు ఎంతవరకు వచ్చాయనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ‘‘తెలంగాణ, ఆంధ్ర... రెండు ప్రాంతాలకు చెందిన సమస్యల్ని జీవోఎం పరిశీలిస్తోంది. నీళ్ల సమస్య ఉంది. విద్యుత్ సమస్య ఉంది. విద్యారంగం సమస్య ఉంది. ఆర్థికాంశాలు ఉన్నాయి. ఇంకా ఇతర సమస్యలున్నాయి. వీటన్నింటినీ నిశితంగా చూడాల్సి ఉన్నందున జీవోఎం విధివిధానాలకు లోబడి నివేదికలివ్వాలని ఆయా మంత్రిత్వశాఖలను మేం లోగడ కోరాం. ఆ మేరకు ఆయా శాఖలు నివేదికలు ఇచ్చాయి. అయితే మరింత లోతుగా సమస్యల్ని పరిశీలించి అర్థం చేసుకోవడం కోసం ఆయా శాఖల కార్యదర్శులను మాతో సమావేశానికి ఆహ్వానించాం. ఈరోజు వారితో మాట్లాడాం... ఇచ్చిన నివేదికల్ని లోతుగా అధ్యయనం చేస్తున్నాం’’ అని అన్నారు. బిల్లు ఎప్పుడు అసెంబ్లీకి వెళ్తుందని మళ్లీ అడగ్గా, ‘‘నేను ముందు చెప్పిన సమాధానాన్నే మళ్లీ చెప్తాను. సాధ్యమైనంత త్వరగా మా ప్రక్రియ పూర్తిచేస్తాం. తర్వాత బిల్లు వెళ్తుంది’’ అని అన్నారు. -
'ఆమ్ ఆద్మీ' విదేశీ నిధులపై విచారణ: షిండే
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక భూమిక పోషిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి ఆదిలోనే ముక్కుతాడు బిగించేందుకు కాంగ్రెస్ పార్టీ యత్నిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి సమకూరే విదేశీ నిధులపై విచారణ జరిపించేందుకు సన్నద్ధమైంది. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే సోమవారం మీడియాతో మాట్లాడారు. క్రేజీవాల్ నేతృత్వంలోని ఏర్పడిన ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చే నిధులపై ఇప్పటికే చాలా ఫిర్యాదులు వచ్చాయని, ఈ అంశంపై దర్యాప్తుకు ఆదేశించినట్లు షిండే తెలిపారు. ఆ పార్టీకి విదేశాల నుంచి నిధులు వస్తే ఎక్కడ నుంచి వస్తున్నాయి, దానికి ఆధారాలేమిటి తదితర అంశాలపై దృష్టి సారించినట్లు షిండే తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ లో జరుగనున్న తరుణంలో పూర్తి స్థాయి విచారణ ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
5లోపు స్పందించండి
-
5లోపు స్పందించండి
* జీవోఎం విధివిధానాలపై అభిప్రాయాలు చెప్పండి * రాష్ట్రంలోని 8 పార్టీలకు హోం శాఖ లేఖలు * అవి స్పందించిన తర్వాతే అఖిలపక్ష సమావేశం * అనంతరం ఇరు ప్రాంత ఎంపీలతో ప్రత్యేక భేటీ? సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్ర మంత్రుల బృందానికి నిర్దేశించిన విధివిధానాలపై అభిప్రాయాలు తెలపాల్సిందిగా రాష్ట్రానికి చెందిన 8 రాజకీయ పార్టీలను కేంద్ర హోం శాఖ కోరింది. వాటిపై నవంబర్ 5లోగా సూచనలు, సలహాలను ఆహ్వానిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, మజ్లిస్‌లకు లేఖలు రాసింది. జీవోఎం విధివిధానాల ప్రతిని లేఖకు జత చేసింది. అక్టోబర్ 30వ తేదీ వేసి ఉన్న రెండు పేజీల లేఖ పలు పార్టీల కార్యాలయాలకు గురువారం ఫ్యాక్స్ ద్వారా అందింది. లేఖను పార్టీలకు పోస్టు ద్వారా కూడా పంపుతామని హోం శాఖ వర్గాలు తెలిపాయి. నవంబర్ 7న జీవోఎం మూడో భేటీ జరగనుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో విభజన విధివిధానాలపై అభిప్రాయాలు వెల్లడించడానికి పార్టీలకు నవంబర్ 5 వరకు గడువిచ్చారు. అఖిలపక్ష సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేయాలనే అంశంపై పార్టీలన్నీ అభిప్రాయం వెల్లడించాక నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలిపారు. గురువారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అనంతరం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వెల్లడించారు. ‘అఖిలపక్షం తేదీని ఇంకా ఖరారు చేయలేదు. దాన్ని ఎప్పుడు నిర్వహించేదీ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నింటి అభిప్రాయాలు తెలుసుకున్నాక ప్రకటిస్తాం’ అని పేర్కొన్నారు. విభజన ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా జరగడం లేదంటూ రాష్ట్రపతికి, ప్రధానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాసిన లేఖలపై స్పందించేందుకు షిండే నిరాకరించారు. కాంగ్రెస్ ఎంపీ వెల్లడించారు. ‘అఖిలపక్షం తేదీని ఖరారు చేయలేదు. ఎప్పుడు నిర్వహించేదీ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నింటి అభిప్రాయాలు తెలుసుకున్నాక ప్రకటిస్తాం’ అని పేర్కొన్నారు. విభజన ప్రక్రియ రాజ్యంగబద్ధంగా జరుగడం లేదంటూ రాష్ట్రపతికి, ప్రధానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాసిన లేఖలపై స్పందించేందుకు షిండే నిరాకరించారు. కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ వివేక్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఆయనను కలిశారు. ఆలస్యానికి తావు లేకుండా విభజన ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టేలా చూడాలని కోరారు. ఎంపీలతోనూ ప్రత్యేక సమావేశం జీవోఎం విధివిధానాలపై అఖిల పక్షం నిర్వహించిన అనంతరం రాష్ట్ర ఎంపీల నుంచి అభిప్రాయం సేకరించాలని హోం శాఖ యోచిస్తోంది. అఖిలపక్షం తర్వాత ఒకట్రెండు రోజుల్లో వారితో సమావేశం ఏర్పాటు చేసే అవకాశముంది. గురువారం తనను కలిసిన పలువురు ఎంపీల వద్ద షిండే ఈ మేరకు ప్రస్తావన చేసినట్టు తెలిసింది. రాష్ట్రానికి చెందిన కేంద్ర మత్రులతో ఉమ్మడిగా సమావేశం నిర్వహించాలని భావిస్తున్నట్లు కూడా షిండే తెలిపినట్టు సమాచారం. తెలంగాణ ఎంపీలు ఒకరిద్దరు దీనికి అభ్యంతరం చెప్పారు. ‘‘కేంద్ర మంత్రుల్లో మా ప్రాంత ప్రాతినిధ్యం కేవలం మూడే. సీమాంధ్ర నుంచి 10 మంది ఉన్నారు. కాబట్టి కేంద్ర మంత్రులతో కాకుండా ఇరు ప్రాంతాల ఎంపీలు, మంత్రులతో కలిపి సమావేశం నిర్వహించండి’’ అని కోరారు. అందుకు షిండే సానుకూలత వ్యక్తం చేసినట్టు వారు చెబుతున్నారు. నివేదిక ఇచ్చిన సీపీఐ: సీపీఐ ఇప్పటికే ఢిల్లీలో షిండేను కలిసి తమ నివేదికను అందజేసిన విషయం తెలిసిందే. సీపీఎం ఎలాంటి నివేదికా ఇవ్వకూడదని నిర్ణయించగా బీజేపీ ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. అయితే సీమాంధ్ర బీజేపీ నేతలు బుధవారం ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి నివేదికను అందజేశారు. తెలంగాణ నేతలు శనివారం ఢిల్లీ వెళుతున్నారు. ఇరు ప్రాంతాల నివేదికలనూ పరిశీలించాక పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. రాజ్యాంగ పరిధికి లోబడే విభజన: షిండే రాష్ట్ర విభజన ప్రక్రియ సాగుతున్న తీరు, అనుసరిస్తున్న విధానంపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే గురువారం వివరణ ఇచ్చారు. ప్రణబ్‌తో ఆయన గంటకు పైగా భేటీ అయ్యారు. బుధవారం కూడా ఆయన రాష్ట్రపతిని కలవడం తెలిసిందే. విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతోందంటూ ముఖ్యమంత్రి కిరణ్ లేఖలు రాయడమే గాక విభజన ప్రక్రియ తీరుపై రాష్ట్రపతికి పెద్ద సంఖ్యలో ఇ-మెయిల్స్, వినతులు, ఫిర్యాదులు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో విభజన ప్రక్రియ సాగుతున్న తీరును రాష్ట్రపతికి షిండే వివరించినట్టు తెలిసింది. రాజ్యంగ పరిధిలో, న్యాయ సూత్రాలకు అనుగుణంగానే ముందుకెళుతున్నామని చెప్పారంటున్నారు. చట్టసభల సంప్రదాయాన్ని పాటించే అంశంపై రాష్ట్రపతి ఆరా తీశారని సమాచారం. ‘విభజన తీర్మానాన్ని అసెంబ్లీకి పంపే అవకాశం లేదు. బిల్లును మాత్రం అసెంబ్లీ అభిప్రాయం కోరే నిమిత్తం పంపిస్తాం’ అని ఆయనకు షిండే తెలిపారంటున్నారు. నవంబర్ 5న ప్రణబ్ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కిరణ్ సహా పలు పార్టీల పెద్దలు ఆయన్ను కలిసే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే ఆయన షిండేను పిలిచి విభజన ప్రక్రియపై వివరణ తీసుకున్నారని హోం శాఖ వర్గాలంటున్నాయి. పార్టీలకు హోం శాఖ లేఖ సారాంశం... ‘‘ఆంధ్రప్రదేశ్‌ను విభజించి నూతన రాష్ట్రం తెలంగాణను ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ ఈ అక్టోబర్ 3న నిర్ణయం తీసుకోవడం మీకు తెలిసిందే. విభజనకు సంబంధించి వివిధ అంశాలపై సిఫార్సులు చేసేందుకు కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ఏర్పాటైంది. అన్ని భాగస్వామ్య పక్షాల నుంచి సలహాలను ఇ-మెయిల్ లేదా పోస్టు ద్వారా స్వీకరించాలని జీవోఎం నిర్ణయించింది. నియమ నిబంధనలు, షరతుల మేరకు పలు అంశాలకు సంబంధించి మీ పార్టీ సూచనలను జీవోఎంకు తెలియజేయవచ్చు. వాటిని నవంబర్ 5లోగా రాతపూర్వకంగా నాకు పంపవచ్చు. వాటిని స్వీకరించాక మీ పార్టీ ప్రతినిధులతో జీవోఎం చర్చిస్తుంది. దానికి సంబంధించిన తేదీ, సమయం తదితర వివరాలను మీకు ప్రత్యేకంగా తెలియజేస్తుంది’’ -
కార్టూన్
అఖిలపక్షం అంటున్నారు...! మళ్లీ హోంమంత్రి మారుతున్నారా ఏంటి సార్! -
మళ్లీ అఖిలపక్షం: షిండే వెల్లడి
* జీఓఎం విధివిధానాలపై సూచనల కోసమే * 7న జీఓఎం భేటీకి ముందే అఖిలపక్ష భేటీకి అవకాశం * ‘భాగస్వాముల’ అభిప్రాయ సేకరణకు జీఓఎం నిర్ణయం * కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ అనంతరం వెల్లడించిన షిండే * కోర్ కమిటీ భేటీకి ముందు రాష్ట్రపతిని కలిసిన షిండే సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన వివిధ అంశాలను చర్చించేందుకు వచ్చే వారంలో రాష్ట్రానికి చెందిన అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందం (జీఓఎం) నవంబర్ 7వ తేదీన మలివిడత సమావేశం కానున్న నేపథ్యంలో.. జీఓఎం భేటీకి ముందే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించే అవకాశముందని ఆయన చెప్పారు. షిండే బుధవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. మంత్రుల బృందం విధివిధానాల్లోని వివిధ అంశాలపై అఖిలపక్ష భేటీ చర్చించి, సూచనలు చేస్తుందని వివరించారు. షిండే నేతృత్వంలోనే ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం ఇప్పటికే రెండు సార్లు సమావేశమైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ విభజనతో నదీ జలాల పంపిణీ, విద్యుత్, ఆస్తుల పంపకం, సరిహద్దుల గుర్తింపు అంశాలపై ఆ భేటీల్లో చర్చలు జరిపింది. జీఓఎం అనుసరించాల్సిన మార్గం, పద్ధతులపైనా చర్చించింది. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయం మేరకు.. విభజనపై కేంద్ర కేబినెట్‌కు నివేదించే తన సిఫారసులను రూపొందించటంలో అన్ని ముఖ్యమైన అంశాలపైనా భాగస్వాముల అభిప్రాయాలను జీఓఎం తీసుకుంటుంది. కోర్ కమిటీ నిర్ణయం మేరకే కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక విభాగమైన కోర్ కమిటీ భేటీలో మెజారిటీ నేతల నుంచి వ్యక్తమైన అభిప్రాయాల మేరకే రాష్ట్ర విభజనపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ నివాసంలో బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2.30 గంటల వరకు కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ప్రధానితో పాటు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, హోంమంత్రి షిండే, రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ, ఆర్థికమంత్రి చిదంబరం, న్యాయమంత్రి సల్మాన్‌ఖుర్షీద్, సోనియా రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్‌లు ఈ భేటీలో పాల్గొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయంటూ సర్వేలు వెల్లడిస్తున్న నేపథ్యంలో.. రానున్న ఎన్నికల మీద కోర్ కమిటీలో చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్ర విభజన విషయంలో ప్రస్తుత పరిస్థితిని, హోంశాఖ పరిధిలో చేపడుతున్న చర్యలను, మంత్రుల బృందం పరిశీలనలో ప్రగతిని షిండే ఈ భేటీలో వివరించారని తెలిసింది. రాజ్యాంగంలోని 371(డి) అధికరణ, విభజన ప్రక్రియలో అనుసరించాల్సిన న్యాయ పరమైన అంశాల గురించి న్యాయశాఖ మంత్రి సల్మాన్‌ఖుర్షీద్ వివరించినట్లు చెప్తున్నారు. ఇదే క్రమంలో తెలంగాణ ఏర్పాటుపై మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలనే నిర్ణయం కూడా కోర్ కమిటీలో తీసుకున్నట్లు సమాచారం. కోర్ కమిటీ భేటీ అనంతరం షిండే విలేకరులతో మాట్లాడారు. విభజనకు సంబంధించి మంత్రుల బృందానికి అన్ని పార్టీలు అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. అన్ని పార్టీలు నివేదికలు సమర్పించిన తర్వాత.. మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసే అవకాశముందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మంత్రుల బృందానికి నివేదికలు సమర్పించడానికి నవంబర్ 5 వరకు గడువు ఉన్న విషయం విదితమే. గడువు ముగిసిన తర్వాత నాలుగైదు రోజుల్లోపే సమావేశం ఉండే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. రాష్ట్రపతి ప్రణబ్‌తో షిండే భేటీ కోర్ కమిటీ సమావేశానికి ముందు షిండే రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా జరగడం లేదంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాసిన లేఖలను ప్రణబ్‌ముఖర్జీ హోం శాఖకు పంపించిన నేపథ్యంలో.. ఈ అంశం మీద కూడా చర్చ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. -
హోం మంత్రి షిండేపై సోనియా ఆగ్రహం?
పాట్నాలో వరుస పేలుళ్ల సంఘటన తర్వాత బాలీవుడ్ చిత్రానికి సంబంధించిన ఆడియో కార్యక్రమానికి హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే హాజరవ్వడం వివాదస్పదమైంది. ఆడియో కార్యక్రమానికి షిండే హాజరుకావడంపై బీజేపీ మండిపడింది. ప్రభుత్వ వ్యవహారాల కన్నా కేంద్ర మంత్రులకు ఇతర కార్యక్రమాలపై మోజు ఉందని బీజేపీ ఆరోపించింది. అయితే ఆడియో విడుదల కార్యక్రమానికి షిండే హాజరవ్వడంపై యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సోనియాగాంధీతో షిండే సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సోనియాగాంధీతో షిండే సమావేశంలో 10 జన్ పథ్ లో సుమారు 20 నిమిషాలపాటు సాగిందని.. వివారాలు ఇంకా బయటకు పొక్కలేదని తెలుస్తోంది. బాలీవుడ్ తార కంగనా రనౌత్ నటించిన 'రజ్జో' చిత్రం ఆడియో కార్యక్రమం ముంబైలో ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి షిండే హాజరయ్యారు. ఆదివారం పాట్నాలో నరేంద్ర మోడీ పాల్గొన్న సభలో వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. గతంలో ఢిల్లీలో పేలుళ్లు జరిగినప్పడు అప్పటి కేంద్ర హోంమంత్రి శివరాజ్ పాటిల్ దుస్తులు మార్చుకోవడం కూడా వివాదస్పదమైన సంగతి తెలిసిందే. -
షిండే తీరును తప్పుబట్టిన బీజేపీ
లక్నో/న్యూఢిల్లీ: పాట్నా వరుస బాంబు పేలుళ్లు జరిగిన వెంటనే కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే బాలీవుడ్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరవడాన్ని ప్రతిపక్ష బీజేపీ తప్పుబట్టింది. పరిపాలనను నిర్లక్ష్యం చేయడం కేంద్ర మంత్రులకు అలవాటుగా మారిందని బీజేపీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి విమర్శించారు. పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని షిండే పరిశీలిస్తారని అనుకున్నామని, కానీ ఆయన సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరయ్యారని తెలిపారు. అంతేకాకుండా ఆలస్యంగా కార్యక్రమానికి వచ్చినందుకు క్షమాపణ చెప్పారని వెల్లడించారు. 26/11 దాడులు జరిగినప్పుడు అప్పటి కేంద్ర హోంమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీజేపీ అధికార ప్రతినిధి సిద్దార్థనాథ్ సింగ్ ఢిల్లీలో అన్నారు. షిండే కూడా ఇప్పుడు ఇదే దారిలో పయనిస్తున్నారని విమర్శించారు. బాధితులను పరామర్శించడం మాని పంక్షన్లకు వెళతారా అంటూ ధ్వజమెత్తారు. -
పార్లమెంటు భేటీలోపే నివేదిక: సుశీల్‌కుమార్‌షిండే
జీవోఎం అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి షిండే ప్రకటన విభజనకు సంబంధించిన అన్ని అంశాలనూ జీవోఎం పరిశీలిస్తోంది వచ్చే నెల 7వ తేదీన మంత్రుల బృందం మళ్లీ సమావేశమవుతుంది వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో హోంశాఖ కార్యదర్శి భేటీ విభజనపై నిర్దిష్ట సిఫారసులు, సూచనలతో నివేదికలివ్వాలని సూచన సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన విధివిధానాలను ఖరారు చేసేందుకు ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందే కేంద్ర మంత్రివర్గానికి తన నివేదికను సమర్పిస్తుందని జీవోఎం అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ప్రకటిం చారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాన్ని, విభజనతో తలెత్తే సమస్యలకు పరిష్కారాలపై దృష్టి సారిస్తున్న జీవోఎం ఇప్పటికే రెండుసార్లు సమావేశమైందని, వచ్చే నెల ఏడో తేదీన మరోసారి సమావేశం అవుతుందని ఆయన పేర్కొన్నారు. షిండే శుక్రవారం నార్త్ బ్లాక్‌లో తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనతో ముడివడి ఉన్న అన్ని అంశాలపైనా జీవోఎం అన్నిమార్గాల్లో సమాచారాన్ని సేకరిస్తోందని చెప్పారు. త్వరలో తమకు అప్పగించిన బాధ్యతలను పూర్తిచేస్తామన్నారు. డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం కావచ్చునని భావిస్తున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందుగానే మంత్రివర్గానికి జీవోఎం నివేదిక సమర్పిస్తుందని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఎప్పటిలోగా ఏర్పాటు చేయగలుగుతారని విలేకరులు అడిగిన ప్రశ్నకు మాత్రం ఆయన సూటిగా జవాబివ్వలేదు. తెలంగాణ బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించి రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటవుతుందన్నారు. ‘‘కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ఒక ప్రత్యేక, నిర్దేశిత విధానం ఉంది.. ఆ ప్రక్రియ పూర్తికావాలి కదా!’’ అని వ్యాఖ్యానించారు. ‘పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెడతారా?’ అన్న మరో ప్రశ్నకు.. ‘‘పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావటానికి ముందే కేంద్ర మంత్రుల బృందం నివేదిక కేబినెట్‌కు చేరుతుంది’’ అని సమాధానం చెప్పారు. అయితే.. జీవోఎం నివేదిక వచ్చే నెలాఖరులోగానే కేబినెట్‌కు చేరవచ్చునని.. ఆ తర్వాత రాష్ట్రపతి ద్వారా రాష్ట్ర శాసనసభ అభిప్రాయం కోసం పంపించే రాష్ట్ర విభజన బిల్లు తిరిగి వచ్చిన తర్వాతే అది పార్లమెంటుకు వెళ్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నవంబర్ 7న సమావేశం కానున్న జీవోఎం నెలాఖరులోగానే మరో సమావేశాన్ని నిర్వహించి నివేదికకు తుది రూపమిచ్చే అవకాశాలున్నాయని ఈ వర్గాలు వెల్లడించాయి. వివిధ శాఖల కార్యదర్శులతో గోస్వామి భేటీ... ఇదిలావుంటే.. రాష్ట్ర విభజన అంశంపై శుక్రవారం వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో హోంశాఖ కార్యదర్శి అనిల్‌గోస్వామి సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి కేంద్ర మంత్రుల బృందం పరిశీలనకు సమర్పించాల్సిన నివేదికలను తదుపరి జీవోఎం సమావేశానికి ముందుగానే తమ మంత్రిత్వశాఖకు అందజేయాలని ఆయన ఆయా అధికారులను కోరినట్లు తెలిసింది. విభజన తర్వాత ఏర్పాటయ్యే ఆంధ్రప్రధేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీజలాలు, విద్యుచ్ఛక్తి, సహజవనరుల పంపిణీ, ఆస్తులు, అప్పుల పంపిణీ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీల వంటి అంశాలపై సంబంధిత మంత్రిత్వశాఖల నివేదికల్లో నిర్దిష్టమైన సిఫారసులు, ప్రత్యామ్నాయాలను కూడా పొందుపరచాలని గోస్వామి సూచించినట్లు సమాచారం. హోంశాఖ కార్యాలయంలో దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక, న్యాయ మంత్రిత్వశాఖల కార్యదర్శులతో పాటు జలవనరులు, విద్యుత్, ఆరోగ్య, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖల కార్యదర్శులు, సిబ్బంది శాఖ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. -
రాహుల్ భద్రతకు ఎప్పటికీ ముప్పే: షిండే
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎప్పటికీ ముప్పు పొంచి ఉంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల కుమార్ షిండే అన్నారు. ఆయన భద్రత కోసం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని, ఎస్పీజీ రక్షణ కూడా కల్పిస్తున్నామని షిండే చెప్పారు. తన నాయనమ్మ, నాన్నల మాదిరిగా తనను కూడా ఏదో ఒకరోజు చంపుతారని రాహుల్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో మంత్రి స్పందించారు. అంతకుముందు ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా స్పందిస్తూ రాహుల్‌కు పటిష్ట భద్రత కల్పిస్తామని చెప్పారు. దేశంలో రాజకీయాలకు దిగజారిపోతున్నందుకు తనతో పాటు అందరూ ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బీజేపీ అధికారం కోసం విచ్ఛిన్న రాజకీయాలను ప్రేరేపిస్తోందని, ఇలాంటి రాజకీయాల వల్లే తన నాయనమ్మ, నాన్నను హత్య చేశారని రాహుల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
పాక్‌కు దీటుగా జవాబిస్తాం: షిండే
జమ్మూ/న్యూఢిల్లీ: కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే మండిపడ్డారు. పాక్‌కు దీటుగా జవాబిస్తామన్నారు. మంగళవారం రాత్రి ఆర్ఎస్ పురా సెక్టార్లో పాక్ రేంజర్ల కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను మృతిచెందడం, ముగ్గురు జవాన్లు, ఒక పౌరుడు గాయపడిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందిచారు. పాక్ సైన్యం కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ 82 ఎంఎం మోర్టార్లు, భారీ ఆయుధాలతో సెక్టర్లో కనీసం 20 చోట్ల కాల్పులకు దిగినట్టు సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు. జమ్మూ, కాశ్మీర్ సరిహద్దులకు అదనంగా బీఎస్ఎఫ్ బలగాలను తరలిస్తామని షిండే ఢిల్లీలో చెప్పారు. 2003 నుంచి జరిగిన కాల్పుల ఉల్లంఘనల్లో ఇదే అతిపెద్ద సంఘటన అన్నారు. సరిహద్దుల్లో భద్రతపై షిండే మంగళవారం కాశ్మీర్లో పర్యటించివచ్చిన నేపథ్యంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవల కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాట్లు పెరిగిపోవడంపై షిండే ఆందోళన వ్యక్తంచేశారు. గతనెలలో సాంబా ప్రాంతంలో ఉగ్రవాదులు చేసిన దాడిని అడ్డుకోవడంలో సైన్యం వైఫల్యంపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. సెప్టెంబర్ 26న సాంబావద్ద లష్కరే ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఒక లెఫ్టినెంట్ కల్నల్ స్థాయి అధికారి సహా పదిమంది సైనికులు మృతిచెందడం తెలిసిందే. మంగళవారం కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాతోపాటు ఆర్మీ అధికారులతో షిండే భేటీ అయ్యారు. సాంబా తరహా ఘటన పునరావృతం కాబోదని ఆర్మీ అధికారులు షిండేకు హామీ ఇచ్చారు. -
పాక్ మరో సారి కాల్పుల ఉల్లంఘన : జవాన్ మృతి
భారత్- పాక్ సరిహద్దుల్లో కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే పర్యటించి 24 గంటలు గడవ లేదు. పాక్ మరోసారి భారత్ సరిహద్దుల్లోని ఆర్ ఎస్ పురా, పర్గవాల్ సెక్టార్‌లోని బీఎస్ఎఫ్ పోస్ట్‌లు, గ్రామాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపింది. ఆ ఘటనలో బీఎస్ఎఫ్ జవాన్ మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం అర్థరాత్రి నుంచి దాదాపు ఆరు గంటల పాటు పాక్ బలగాలు ఎడతెరిపి లేకుండా కాల్పులు జరిపారని సీనియర్ పోలీసు అధికారి బుధవారం వెల్లడించారు. క్షతగాత్రులు మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఇరుదేశాల సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ సమీపంలోని భారత్ భూభాగంపై పాక్ భద్రతా దళాలు తరుచుగా కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. అంతేకాకుండా భారత్‌లో పాక్ తీవ్రవాదుల చోరబాట్లు అధికమైనాయి. ఈ నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి షిండే భారత్, పాక్ సరిహద్దుల్లో మంగళవారం పర్యటించిన సంగతి తెలిసిందే. అలాగే స్థానిక భద్రత దళ ఉన్నతాధికారులతో ఆయన పరిస్థితిని సమీక్షించారు. అందులోభాగంగా బీఎస్ఎఫ్ సిబ్బందితో షిండే ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 200 సార్లకు పైగా పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించిందని ఈ సందర్భంగా షిండే తెలిపారు. -
చొరబాట్ల వెనుక సయీద్: సుశీల్‌కుమార్ షిండే
సాంబా: జమ్మూ కాశ్మీర్‌లోని భారత్-పాక్ సరి హద్దుల వద్ద ఈ ఏడాది పెరుగుతున్న చొరబాట్లు ఆందోళన కలిగిస్తున్నాయని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే అన్నారు. చొరబాటు యత్నాలు పెరగడం వెనుక లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ హ స్తం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. నియంత్రణ రేఖ వద్ద బీఎస్ఎఫ్ ఔట్‌పోస్టులపై పాక్ బలగాలు కాల్పులు జరిపిన నేపథ్యంలో మంగళవారం షిండే భారత్-పాక్ సరిహద్దుల వద్ద ఏరియల్ సర్వే నిర్వహించారు. పాక్‌లో ఉంటున్న సయీద్ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి, వారిని జమ్మూ కాశ్మీర్ వైపు పంపుతున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని షిండే మీడియాతో చెప్పారు. ఉభయ దేశాల డీజీఎంవోల సమావేశంలో కాల్పుల విరమణ ఉల్లంఘన అంశాన్ని తప్పక ప్రస్తావించనున్నట్లు చెప్పారు. మళ్లీ పాక్ కాల్పులు: సరిహద్దుల వద్ద పరిస్థితిపై షిండే సమీక్ష జరిపి వెళ్లిన కొద్ది గంటలకే పాక్ బలగాలు మంగళవారం రాత్రి ఎల్ఓసీ వద్ద మళ్లీ కాల్పులు జరిపాయి. జమ్మూ జిల్లాలోని ఆర్నియా సబ్ సెక్టారు వద్ద రాత్రి భారత స్థావరాలతో పాటు జనావాసాలపైనా మోర్టార్ తూటాలను కురిపించాయి. -
పాక్ మరోసారి కాల్పుల ఉల్లంఘన
పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఆ దేశ భద్రత దళాలు నిన్న సాయంత్రం భారత్- పాక్ సరిహద్దు రేఖ వెంబడి ఆర్.ఎస్.పురా సెక్టర్పై కాల్పులకు తెగబడిందని సరిహద్దు భద్రత దళానికి చెందిన ఉన్నతాధికారి మంగళవారం ఇక్కడ వెల్లడించారు. దాంతో భారత్ భద్రత దళాలు వెంటనే అప్రమత్తమైనాయని చెప్పారు. ఈ రోజు తెల్లవారుజాము వరకు ఇరువైపులా కాల్పుల ప్రక్రియ కొనసాగిందని తెలిపారు. అయితే భారత్- పాక్ సరిహద్దు వెంబడి పొరుగుదేశం పాకిస్థాన్ తరచుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకోని కేంద్ర హోం శాఖ మంత్రి షిండేతోపాటు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా మంగళవారం నియంత్రణ రేఖ వెంబడి పర్యటించి, పరిస్థితి సమీక్షించనున్నారు. దాదాపు 10 ఏళ్ల క్రితం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఏడాది జనవరి నుంచి ఇరుదేశాల సరిహద్దుల్లోని భారత్ సైనిక శిబిరాలపై కాల్పులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే. -
ఎల్ఓసీలో పర్యటించనున్న హోం మంత్రి షిండే
పొరుగుదేశం పాకిస్థాన్ గతంలో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమిస్తున్న నేపథ్యంలో భారత హోంశాఖ మంత్రి సుశీష్ కుమార్ షిండే మంగళవారం నియంత్రణ రేఖ (ఎల్ఒసీ) వెంబడి పర్యటించనున్నారు. అందుకోసం ఈ రోజు ఉదయం న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో జమ్మూ కాశ్మీర్ చేరుకుంటారు. ఎల్ఓసీ వెంబడి భద్రత పరిస్థితులను ఈ సందర్బంగా షిండే ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి సరిహద్దు రేఖ వెంబడి తరచుగా పాకిస్థాన్ భద్రత దళాలు కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో జోక్యం చేసుకోవాలని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కేంద్రాన్ని కోరారు. ఈ సందర్భంగా షిండే భారత్, పాక్ సరిహద్దుల్లోని ఎల్ఓసీ వెంబడి ఈ రోజు పర్యటించనున్నారు. 2003లో భారత్, పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అయితే ఈ ఏడాది జనవరి నుంచి నేటి వరకు 136 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించిన సంగతి తెలిసిందే. -
విభజనకు చంద్రబాబే లేఖ ఇచ్చారు.. వెళ్లి అడగండి: షిండే
తెలంగాణపై కేంద్ర మంత్రుల బృందం శనివారం ఇక్కడ సమావేశమయ్యే ముందు హై డ్రామా సాగింది. సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే రాగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు వేణుగోపాల్ రెడ్డి, శివప్రసాద్, నిమ్మల కిష్టప్ప, నారాయణ ఆయనను అడ్డుకున్నారు. రాష్ట్ర విభజన వల్ల అనేక సమస్యలు వస్తాయని టీడీపీ ఎంపీలు షిండేకు వివరించారు. షిండే స్పందిస్తూ.. చంద్రబాబే విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారని స్పష్టం చేయడంతో వారు షాక్ తిన్నారు. కావాలంటే వెళ్లి చంద్రబాబునే అడగండంటూ చెప్పారు. సీమాంధ్ర సమస్యలను పరిశీలిస్తామని హామి ఇచ్చిన షిండే అక్కడి నుంచి నిష్ర్కమించారు. -
18 హెలికాప్టర్లు, 12 విమానాలు సిద్ధం: సుశీల్ కుమార్ షిండే
ఫైలిన్ తుపాన్ బాధితులకు సహాయక, పునరావాస చర్యలు చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే చెప్పారు. 18 హెలీకాప్టర్లు, 12 విమానాలు, రెండు యుద్ధ నౌకల్ని అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో అవరసమైన చోట వీటిని మోహరించినట్టు షిండే చెప్పారు. ఒడిషాలో 5.5 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో లక్ష మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు మంత్రి తెలియజేశారు. ఒడిషాలో ఎనిమిది, ఆంధ్రప్రదేశ్‌లో మూడు జిల్లాల్లో ఫైలిన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. మొత్తం 500 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. -
'దిగ్విజయ్ మాటొకటి.. షిండే ప్రకటన మరొకటి'
రాష్ట్రం అల్లకల్లోలంగా మారినా కేంద్రం ఏమాత్రం పట్టించుకోకుండా చోద్యం చూస్తోందని వైఎస్ఆర్ సీపీ నేత కొణతాల రామకృష్ణ విమర్శించారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ ఒక ప్రకటన చేస్తే, కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే మరో ప్రకటన చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. తెలంగాణ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నేతలను తప్పుదారి పట్టిస్తున్నారని కొణతాల ఆరోపించారు. తీర్మానాన్ని ఓడిద్దామంటూ రాజీనామా చేయకుండా అడ్డుపడుతున్నారని చెప్పారు. తెలంగాణపై కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల బృందాన్ని వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. రెండో ఎస్సార్సీ అన్న కాంగ్రెస్ పార్టీయే యూటర్న్ తీసుకుని మాకు స్పష్టత లేదని విమర్శించడం విడ్డూరమన్నారు. ఫైలిన్ తుఫాన్ ముప్పు నేపథ్యంలో రాష్ట్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం, అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని కొణతాల కోరారు. -
చంద్రబాబును ఖాళీ చేయించేందుకు కోర్టుకెళ్లమన్న షిండే
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కార్యాలయమైన ఏపీ భవన్లో అనుమతి లేకుండా నిరాహార దీక్ష కొనసాగించడంపై జోక్యం చేసుకునేందుకు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే నిరాకరించారు. చంద్రబాబును ఖాళీ చేయించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించాలని సూచించారు. కోర్టు ఆదేశాలిస్తే తాము సహకరిస్తామని షిండే చెప్పారు. చంద్రబాబు వైఖరిని మాత్రం షిండే తప్పుపట్టారు. రాష్ట్ర అతిథి గృహంలో ఓ మాజీ ముఖ్యమంత్రి నిరాహార దీక్ష చేయడాన్ని తాను తొలిసారి చూస్తున్నానని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన దీక్షను విరమించి స్వరాష్ట్రానికి వెళ్లాలని సూచించారు. కాగా దీక్షకు అనుమతి లేదంటూ ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు పైకి నోటీసులిచ్చినా, దీక్ష విజయవంతవుయ్యేందుకు తమ వంతుగా సహకరిస్తున్నారు. ఏపీభవన్‌లోని సుమారు 40 గదులను చంద్రబాబు దీక్షకు వచ్చిన నేతలకే కేటాయించినట్లు సమాచారం. -
వీలైనంత త్వరలో మంత్రుల కమిటీ నివేదిక: షిండే
న్యూఢిల్లీ : తెలంగాణపై మంత్రుల కమిటీ వీలైనంత త్వరలో నివేదిక ఇస్తుందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. ఆయన తన నెలవారీ సమీక్ష నివేదికపై గురువారం మీడియాతో మాట్లాడారు. మంత్రుల కమిటీ శుక్రవారం సమావేశం కానున్నట్లు షిండే తెలిపారు. సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే శీతాకాలం పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతారా అన్న ప్రశ్నకు షిండే సమాధానం దాటవేశారు. రాష్ట్రాన్ని విభజన నిర్ణయం అమలులో భాగంగా పరిష్కరించాల్సిన అంశాలపై దృష్టి సారించేందుకు ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందానికి ఎలాంటి కాలవ్యవధినీ నిర్ణయించకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. -
అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం: షిండే
-
రాష్ట్ర విభజన, పంపకాలపై మంత్రుల బృందం భేటీ
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తోంది. రాష్ట్ర విభజన విధివిధానాల గురించి మంత్రుల బృందం నిర్ణయించనుంది. తెలంగాణపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం తొలిసారిగా శుక్రవారం సమావేశంకానుంది. ఈ ప్యానెల్లో సభ్యుడిగా ఉన్న కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే బుధవారం ఈ విషయం వెల్లడించారు. తెలంగాణ, సీమాంధ్ర సరిహద్దులు, పంపకాలను నిర్ధారించనుంది. సాగునీరు, నదీజలాల పంపిణీ నుంచి కొత్త రాష్ట్రాల్లో చట్ట సభ నియోజకవర్గాలు, న్యాయ, ఆర్థిక, ఇతర పరిపాలన విభాగాలకు సంబంధించి కూలంకుషంగా చర్చించి నివేదిక సమర్పించనుంది. ఇరు ప్రాంతాల్లోనూ వెనుకబడిన ప్రాంతాలు, జిల్లాల అభివృద్దిపై దృష్టి కేంద్రీకరించనుంది. ఇరు రాష్ట్రాలకు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండనున్న హైదరాబాద్ గడువు తర్వాత తెలంగాణలో అంతర్భాగంగా ఉంటుంది. దీంతో సీమాంధ్ర ప్రాంతానికి కొత్త రాజధాని విషయం గురించి మంత్రుల బృందం చర్చించే అవకాశముంది. -
ఏపీలో రాష్ట్రపతి పాలన విధించం: షిండే
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన విధించే అవకాశం లేదని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే మంగళవారం న్యూఢిల్లీలో స్పష్టం చేశారు.ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులను నిత్యం గమనిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుపులోకి తీసుకువస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సీమాంధ్రలో ఉద్యమం చెలరేగిన నేపథ్యంలో ఆ ప్రాంత కేంద్రమంత్రులు రాజీనామాలను ఆమోదించే ప్రసక్తే లేదని సుశీల్ కుమార్ షిండే ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
సీమాంధ్రకు న్యాయం చేస్తాం: సుశీల్‌కుమార్ షిండే
సీమాంధ్ర ప్రాంత సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే అన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజల్లో నెలకొన్న అభద్రతాభావం, ఆందోళనలు తమ దృష్టికి వచ్చాయని వెల్లడించారు. సీమాంధ్ర ప్రజలందరికీ న్యాయం చేస్తామని షిండే చెప్పారు. అన్ని ప్రాంతాలవారికి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు చిరంజీవి, పళ్లంరాజు, పురంధేశ్వరి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సోమవారం సాయంత్రం ఆయనను కలిశారు. తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలు, నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. -
ఇదంతా సహజమే.. : షిండే
రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇలాంటి మనోభావాలు సహజమేనని, ఇలాంటప్పుడు అవతలి వారిని ఓదార్చడం తప్ప మరేమీ చేయలేమని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. ఏ ఒక్కరూ ఈ మనోభావాలకు అతీతులు కారని ఆయన చెప్పారు. వారందరికీ నచ్చజెప్పేందుకు తాము ప్రయత్నిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే నక్సలైట్ల సమస్య పెచ్చుమీరుతుందన్న వాదనలను ప్రస్తావించగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నక్సలైట్లను అణచి వేయడంలో మంచి రికార్డు ఉందని, రెండు రాష్ట్రాలుగా అయిన తర్వాత కూడా దాన్ని కొనసాగిస్తారన్న విశ్వాసం తనకుందని షిండే తెలిపారు. ప్రస్తుతానికి కేవలం తెలంగాణ గురించే తప్ప, మరో రాష్ట్ర విభజన గురించి ఏమీ ఆలోచించట్లేదని అన్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల విభజన గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయనీ సమాధానం ఇచ్చారు. తెలంగాణ నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు. అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. -
టీ మంటలు
తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో జిల్లాలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. కేంద్ర వైఖరిని నిరసిస్తూ విద్యార్ధి, ఉద్యోగ జేఏసీ నాయకులు రోడ్డెక్కారు. రెండు నెలలుగా మొక్కవోని దీక్షతో సమైక్య పోరాటం సాగిస్తున్నా కేంద్రం లేక్క చేయకపోవడం పై ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా మూడు రోజులు బంద్ చేపట్టనున్నారు. సాక్షి, కడప: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ కేంద్ర మంత్రివర్గం గురువారం తీసుకున్న నిర్ణయంపై జిల్లాలో ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటించగానే కడ ప ఏడురోడ్ల కూడలిలో ఉద్యమకారులు దిష్టిబొమ్మలు, టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. ఆల్మెవా అధ్యక్షుడు డాక్టర్ ఫరూఖ్ ఆధ్వర్యంలో భారీగా టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులో మునిసిపల్ కమిషనర్ వెంకటకృష్ణతో పాటు మరో 50మంది జేఏసీ నేతలు పుట్టపర్తి సర్కిల్లో గురువారం రాత్రి రోడ్డుపైనే నిద్రపోయారు. కేంద్ర ప్రభుత్వం తమను రోడ్డుపైన పడేసిందని నిరసన ద్వారా తెలిపారు. స్వర్ణముఖి ట్రావెల్స్‌కు చెందిన ఓ ప్రైవేటు బస్సు అద్దాలను ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆందోళనకారులు ధ్వంసం చేశారు. బద్వేలులో రాత్రి 8 గంటల ప్రాంతంలో ఉపాధ్యాయులు భజన చేస్తూ నిరసన తెలిపారు. రైల్వేకోడూరులో తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాజంపేట నాలుగురోడ్ల కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. నిరసన ర్యాలీ చేపట్టారు. ఏపీ ఎన్జీవో నేతలు, విద్యార్థి సంఘం నాయకులు తెలంగాణనోట్ పేరుతో ప్రతులను కాల్చివేశారు. కేంద్రం ప్రకటించిన నిర్ణయంపై జిల్లావాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తం: కేబినెట్ నోట్ ఆమోదం పొందిన క్రమంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులను అప్రమత్తం చేశారు. కడప నగరంతో పాటు అన్ని పట్టణ కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. గురువారం సాయంత్రం డీజీపీ ప్రసాదరావు, జిల్లా ఎస్పీ మనీశ్కుమార్తో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించి అప్రత్తంగా ఉండాలని ఆదేశించారు. కేంద్రం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో మూడురోజులు, ఏపీఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో 48 గంటలు నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చారు. రెడ్ అలర్ట్ కడప అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు సంబంధించిన తెలంగాణ నోట్ కేంద్ర ప్రభుత్వ కేబినెట్ ముందుకు వచ్చిన నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ ప్రసాద్‌రావు నుంచి జిల్లా ఎస్పీకి ఆదేశాలు అందాయి. జిల్లా ఎస్పీ మనీష్‌కుమార్ సిన్హాతో కూడా డీజీపీ నేరుగా ఫోన్లో మాట్లాడి సూచనలు చేసినట్లు సమాచారం. దీంతో గురువారం మధ్యాహ్నం నుంచే జిల్లాలోని అన్ని కూడళ్లలో ప్రత్యేక పోలీసు బలగాలతో పాటు ఆయా పోలీసు స్టేషన్ల అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నేటి నుంచి 72 గంటల బంద్ కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ : కేంద్ర కేబినెట్లో తెలంగాణా నోట్‌కు ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకిస్తూ జిల్లాలో 72 గంటల బంద్ చేపట్టనున్నట్లు వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణా నోట్ తయారు కాలేదంటూ ప్రకటనలు చేస్తూ ఒక్కసారిగా కేబినెట్లో టీ నోట్ ప్రవేశ పెట్టడం ద్వారా కేంద్రం దొంగ దెబ్బ తీసిందన్నారు. జిల్లాలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్జీవోలు, ఉపాధ్యాయులు, కార్మికులు ఈ బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. -
ఇటు దసరా శోభ.. అటు దగాపడ్డ క్షోభ
తెలంగాణకు రాజముద్ర పడింది. ఆంధ్రప్రదేశ్‌ను విభజించి, 10 జిల్లాలతో కూడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ రాజధానిగా ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ప్రతిపాదించిన కేబినెట్ నోట్‌ను గురువారం ప్రధానమంత్రి మన్మో„హన్‌సింగ్ నేతృత్వంలో జరిగిన మంత్రవర్గ సమావేశం ఆమోదించింది. తద్వారా రాష్ట్ర విభజనకు, దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు అధికారికంగా కేంద్రం శ్రీకారం చుట్టింది. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రెండింటికీ పదేళ్ల పాటు హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉండాలన్న ప్రతిపాదనను కూడా కేంద్రం ఆమోదించింది. విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు 9 మంది మంత్రులతో కూడిన కేంద్ర మంత్రుల బృందాన్ని (జీఓఎం) ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించేందుకు అవసరమైన చట్ట, పాలనాపరమైన యంత్రాంగం రూపకల్పనతో పాటు నదీజలాలు, జల వనరులు, విద్యుత్ పంపిణీ వంటి విభజనతో ఉత్పన్నమయ్యే అన్ని అంశాలు, సమస్యలను లోతుగా అధ్యయనం చేసి, వాటికి పరిష్కార మార్గాలు చూపడమే గాక సమైక్య రాష్ట్రంలోని రెండు ప్రాంతాల ప్రజల భద్రత, రక్షణ, ప్రాథమిక హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను సూచించే బాధ్యతను జీఓఎంకు అప్పగించారు. అలాగే విభజన అనంతరం కోస్తాంధ్ర, రాయలసీమలతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన రాజధాని ఏర్పాటు కోసం కేంద్రం ఆర్థికంగా ఎలాంటి సహాయాన్ని, ఎంతమేరకు అందజేయాలన్న అంశాన్ని కూడా జీఓఎం చూస్తుంది. రెండు రాష్ట్రాల్లోని వెనకబడ్డ ప్రాంతాలు, జిల్లాల ప్రత్యేక అవసరాలను తీర్చడంతో పాటు వాటి అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను కూడా సిఫార్సు చేస్తుంది. వీటితో పాటు విభజన ప్రక్రియలో భాగంగా మున్ముందు తలెత్తే అన్ని అంశాలనూ అది పరిశీలిస్తుంది. అనంతరం కేంద్రానికి సమగ్ర నివేదికను జీఓఎం సమర్పిస్తుంది. అంతేగాక ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన సమగ్రమైన బిల్లును కూడా అదే తయారు చేస్తుంది. దాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించాక రాష్టప్రతికి పంపుతారు. అనంతరం బిల్లును ఆయన అసెంబ్లీ అభిప్రాయం కోసం పంపుతారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక దాన్ని రాష్టప్రతి తన ఆమోదంతో పార్లమెంటులో ప్రవేశపెడతారు. పార్లమెంటు ఆమోదించి, దానిపై రాష్టప్రతి ఆమోద ముద్ర కూడా పడగానే 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుంది. మొత్తంమీద తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) చేసిన తీర్మానానికి దాదాపుగా నకలు మాదిరిగానే కేబినెట్ నోట్ తయారైంది. అయితే గురువారం నాటి కేబినెట్ నోట్‌ను సంప్రదాయానికి విరుద్ధంగా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం లేకుండానే ఆమోదించడం విశేషం. నిజానికి నోట్‌ను ముందుగా అసెంబ్లీకి పంపుతామని గతంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా ప్రకటించడం తెలిసిందే. కానీ అలా అసెంబ్లీ తీర్మానంతో సంబంధం లేకుండానే నేరుగా బిల్లును తయారు చేసి రాష్టప్రతికి నివేదించాలని నిర్ణయించారు. కేబినెట్ నిర్ణయాన్ని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, ఎంఎం పళ్లంరాజు భేటీలోనే వ్యతిరేకించారని, తెలంగాణకు చెందిన మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి గట్టిగా సమర్థించారని సమాచారం. శరద్‌పవార్, అజిత్‌సింగ్ తెలంగాణ ఏర్పాటును సమర్థించారని సమాచారం. మిగతా మం త్రుల్లో కూడా చాలామంది సీమాంధ్రలో ఉద్యమం నడుస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూనే, మంత్రివర్గ నిర్ణయాన్ని అమలు చేయక తప్పదని అన్నారని తెలిసింది. చివరగా ప్రధాని మాట్లాడుతూ, ఏ ప్రాంతానికీ ఎలాంటి అన్యాయమూ జరగకుండా చూసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదంటూ హామీ ఇచ్చినట్టు సమాచారం. ‘‘చాలామందిలో అభ్యంతరాలు, ఆందోళనలుండటం నిజమే. వాటన్నింటినీ జీఓఎం చూసుకుంటుంది. దాని విధి విధానాలను కూడా చాలా కచ్చితంగా నిర్ధారించాం’’ అంటూ ఆయన చెప్పినట్టు తెలిసింది. జీఓఎంకు ఆరు వారాల కాల వ్యవధి ఇచ్చినట్టు సమాచారం. పార్లమెంటు శీతాకల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని మాత్రం కేబినెట్ నిర్ణయించిందని తెలిసింది. ఆ సమావేశాలు నవంబర్ 20-23 తేదీల మధ్య ప్రారంభమయేలా ఉన్నం దున జీఓఎం పరిశీలన, నివేదిక, బిల్లు తయారీ ఆలోగా పూర్తి కావాల్సి ఉంటుంది. నివేదిక, బిల్లు తయారీకి జీఓఎంకు ఆరు వారాల గడువును మంత్రివర్గం ఇచ్చిం దంటూ వస్తున్న వార్తలు దీన్ని బలపరుస్తున్నాయి. మరోవైపు, సీమాంధ్రకు చెందిన మరో కేబినెట్ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ తల్లి గురువారమే మరణించారు. దాంతో ఆయన మంత్రివర్గ సమావేశానికి వెళ్లలేకపోయారు. కర్నూలు, అనంతపురం జిల్లాలతో కూడిన రాయల తెలంగాణపై సాగిన ఊహాగానాలకు కేబినెట్ తాజా నిర్ణయంతో తెర పడింది. ఆంటోనీ కమిటీ ఊసు లేకుండానే... సీమాంధ్రుల్లో తలెత్తిన ఆందోళనలను, వారి అభ్యంతరాలను పరిష్కరించేందుకంటూ ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీతో నిమిత్తం లేకుండానే నోట్ ఆమోదం, జీఓఎం ఏర్పాటు చకచకా జరిగిపోవడం విశేషం! అయితే కమిటీని సలహాలు, సూచనల కోసం జీఓఎం పిలిచి చర్చిస్తుందని చెబుతున్నారు. మరోవైపు నోట్‌ను కేబినెట్ ముందు పెట్టేముందు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అంగీకారాన్ని షిండే తీసుకున్నట్టు తెలుస్తోంది. కళంకిత ప్రజాప్రతినిధులను కాపాడేందుకు రూపొందించిన ఆర్డినెన్స వ్యవహారంలో రాహుల్ చేతిలో ప్రధానికి ఎదురైన చేదు అనుభవం దృష్ట్యా ఆయన ఈ జాగ్రత్త తీసుకున్నట్టు చెబుతున్నారు! కేబినెట్ నిర్ణయంతో విభేదించే అసంతృప్తవాదులెవరైనా పార్టీని వీడవచ్చంటూ అధిష్టానం కుండబద్దలు కొట్టినట్టూ తెలుస్తోంది. అయితే, ఇది రాహుల్ నిర్ణయమేనని చెప్పడంద్వారా సీమాంధ్ర మంత్రుల నోటికి ముందుగానే తాళం వేసిందంటున్నారు. సహకరించండి: దిగ్విజయ్ తెలంగాణ, సీమాంధ్రల్లోని కాంగ్రెస్ నేతలందరూ పార్టీ అధిష్టానం తీసుకున్న విభజన నిర్ణయానికి సహకరించాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ కోరారు. ‘‘ఆంటోనీ కమిటీ కూడా జీఓఎంకు తన నివేదికను అందజేస్తుంది. తెలంగాణ, సీమాంధ్రల్లోని అందరు నేతలనూ సంప్రదించిన మీదటే అధిష్టానం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి దానికి సహకరించాల్సిందిగా సీమాంధ్ర ఎంపీలకు విజ్ఞప్తి చేస్తున్నా’’ అన్నారు. టేబుల్ ఐటంగా... ముందస్తుగా మంత్రులందరికీ పంపిన ఎజెండాలో భాగంగా కాకుండా, గురువారం సాయంత్రమే టేబుల్ ఐటం కింద తెలంగాణ నోట్ అంశాన్ని మంత్రివర్గంలో చర్చకు తీసుకున్నారు. అయితే, అసలు ఎజెండాను పూర్తిగా పక్కన పెట్టి ముందు తెలంగాణ అంశాన్నే మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది! సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.15 దాకా దాదాపు గంటా 45 నిమిషాల పాటు మల్లగుల్లాలు పడింది. నోట్ వివరాలను, తెలంగాణ డిమాండ్ పూర్వాపరాలను హోం మంత్రి షిండే కేబినెట్‌కు వివరించారు. ‘‘తెలంగాణ డిమాండ్ 50 ఏళ్లుగా ఉంది. చాలాసార్లు దీనిపై పలు నిర్ణయాలు కూడా జరిగాయి. చివరికి తెలంగాణ ఏర్పాటుకు 2009 డిసెంబర్ 9న కేంద్రం నిర్ణయం కూడా ప్రకటించింది. కానీ తర్వాతి పరిణామాల దృష్ట్యా శ్రీకృష్ణ కమిటీ వేయడం, అది అందరితో లోతుగా చర్చించి, రాష్టమ్రంతా పర్యటించి నివేదిక ఇవ్వడం జరిగింది. దానిపైనా ఏకాభిప్రాయం రాకపోవడంతో తర్వాత రెండుసార్లు కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పార్టీలతో అఖిలపక్షం నిర్వహించాం’’ అంటూ పూర్వాపరాలను ఏకరువు పెట్టారు. విభజన యోచనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని కూడా ఈ సందర్భంగా షిండే చెప్పినట్టు తెలిసింది! తెలంగాణకు దాదాపుగా ఏకాభిప్రాయం వచ్చింది కాబట్టి రాష్ట్ర ఏర్పాటుకు కేబినెట్‌కు ప్రతిపాదిస్తున్నామన్నారు. జీఓఎంలో కేంద్ర హోం, ఆర్థిక, న్యాయ, జల వనరులు, విద్యుత్, ఇంధన వనరులు, వైద్య-ఆరోగ్య తదితర శాఖల మంత్రులుంటారు. వ్యతిరేకించిన కావూరి, పళ్లంరాజు కేబినెట్ నోట్‌పై ముందుగా కావూరి దాదాపు 25 నిమిషాలు మాట్లాడారు. కేంద్రం తొందరపడి విభజన నిర్ణయం తీసుకుంటోందని ఆయన అన్నట్టు తెలిసింది. ‘‘నేను ఇన్ని దశాబ్దాలుగా నిబద్ధతతో కాంగ్రెస్‌లోనే ఉన్నాను. కాబట్టి పార్టీ నుంచి నేను బయటికి వెళ్లకపోవచ్చు. కానీ ఈ నిర్ణయం, ప్రతిపాదన నాకు చాలా బాధ కలిగిస్తున్నాయి. దీనితో ఏకీభవించలేను, ఆమోదించలేను. నన్ను క్షమించండి’’ అన్నారని సమాచారం. పళ్లంరాజు కూడా ఇదే వాదన విన్పించారు. తర్వాత తెలంగాణ ఏర్పాటుకు మద్దతుగా జైపాల్ అరగంట పాటు మాట్లాడారు. ఇది ఎప్పుడో 2009లోనే జరిగిపోయిన నిర్ణయమని మరో మంత్రి జైరాం రమేశ్ అన్నారు. ‘‘దీనిపై ఇప్పుడు మంత్రివర్గంలో ఇంత చర్చ అనవసరం. నిర్ణయం అమలులో జాప్యం జరిగిన కొద్దీ సీమాంధ్రలో ఉద్యమం ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు’’ అన్నట్టు తెలిసింది. ఇదేమీ కొత్త విషయం కాదని, తెలంగాణ డిమాండ్ వాస్తవికమైనది కాబట్టి దాన్ని అమలు చేయడం మాత్రమే ప్రస్తుతం చేయగలిగిన పని అని శరద్ పవార్ అన్నారు. అలాగైతే మహారాష్ట్ర నుంచి విదర్భను కూడా విడదీస్తారా అని పళ్లంరాజు, కావూరి ప్రశ్నించగా, ‘‘ఆ పరిస్థితి వస్తే దాన్ని మేం హాండిల్ చేస్తాం’’ అని పవార్ బదులిచ్చారు. ఉత్తరప్రదేశ్‌ను కూడా విభజించి హరితప్రదేశ్‌ను ప్రత్యేక రాష్ట్రం చేయాలని అజిత్‌సింగ్ కోరినట్టు సమాచారం. పార్టీ నిర్ణయానికి మద్దతు పలుకుతున్నానంటూ ఆర్థిక మంత్రి చిదంబరం ఏకవాక్యంతో సరిపెట్టారంటున్నారు. -
అమాయక ముస్లింలను నిర్బంధించొద్దు: షిండే
న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై పోరు పేరుతో అమాయక ముస్లిం యువతను అక్రమంగా నిర్బంధించకూడదని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే సోమవారం రాష్ట్రాలను ఆదేశించారు. ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి వస్తే బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈమేరకు ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. దీనిపై రాజకీయ దుమారం రేగింది. ఇది ఓటు బ్యాంకు రాజకీయమని విపక్షాలు దుయ్యబట్టాయి. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ ఆదేశమిచ్చారని బీజేపీ మండిపడింది. మతం పేరుతో దేశాన్ని విభజించేందుకు ప్రయత్నించిన షిండేను వెంటనే పదవి నుంచి తప్పించాలని, ఆదేశాన్ని వాపసు తీసుకోవాలని డిమాండ్ చేసింది. షిండే దీన్ని తోసిపుచ్చారు. తన రోజువారీ విధుల్లో భాగంగానే సీఎంలకు లేఖ రాశానని ఢిల్లీలో విలేకర్లతో అన్నారు. లేఖలో ఏముందంటే.. : పోలీసులు అమాయక ముస్లిం యువతను వేధిస్తున్నారంటూ కేంద్రానికి ఫిర్యాదులు వచ్చాయని షిండే తన లేఖలో తెలిపారు. ‘మైనారిటీ వర్గాల యువకులు తమను ఉద్దేశపూర్వకంగా లక్ష్యం చేసుకుని, తమను ప్రాథమిక హ క్కులకు దూరం చేస్తున్నారని భావిస్తున్నారు. అమాయకులను అనవసరంగా వేధించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. ఉగ్రవాద కేసుల విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టులను సంప్రదించి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలని పేర్కొన్నారు. ఇతర పెండింగ్ కేసులకంటే వీటికే ప్రాధాన్యమివ్వాలని సూచించారు. మాలెగావ్ పేలుళ్ల కేసులో ఐదేళ్లు జైల్లో గడిపిన 9 మంది ముస్లింలకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలూ లేవని జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించిన నేపథ్యంలో షిండే లేఖ రాశారు. ఇదిలాఉండగా, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా షిండే లేఖ రాశారని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు విమర్శించారు. -
దాడి గురించి సమాచారం సేకరిస్తున్నాం: షిండే
జమ్ము కాశ్మర్ రాష్ట్రంలో గురువారం ఉదయం జరిగిన ఉగ్రవాద దాడి గురించి పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. పోలీసు స్టేషన్‌తో పాటు ఆర్మీ క్యాంపుపై కూడా ఉగ్రవాదులు దాడి చేసినట్లు తెలుస్తోందని, ఈ దాడిలో ఒక లెఫ్టినెంట్ కల్నల్ కూడా మరణించారని షిండే తెలిపారు. ఉగ్రవాదుల దాడి విషయాన్ని ఆయన ఖండించారు. సరిహద్దుల్లో శాంతిభద్రతల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని, ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సమావేశం ఉన్న నేపథ్యంలో కూడా ఇలాంటి దాడి జరగడం దారుణమని షిండే వ్యాఖ్యానించారు. -
ఎవరి వాదన వారిదే
-
మహిళల్ని గౌరవించకపోవడం సిగ్గుచేటు: మన్మోహన్ సింగ్
దేశంలో మహిళలకు సముచిత గౌరవం దక్కకపోవడం సిగ్గుచేటని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. మహిళల భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ వారిపై అఘాయిత్యాలకు పాల్పడకుండా మగవాళ్లు దృక్పథం మార్చుకోవాలని సూచించారు. సోమవారం ఆరంభమైన జాతీయ సమైక్య మండలి (ఎన్ఐసీ) సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. మహిళలపై దౌర్జన్యాలను అరికట్టేందుకు తగిన సూచనలు రూపొందించాలని సూచించారు. 'మహిళలు స్వేచ్ఛగా తిరగగలిగినపుడే ఏ దేశమైనా పురోగతి సాధించగలదు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడకుండా అందరూ తప్పనిసరిగా వైఖరి మార్చుకోవాలి' అని ప్రధాని అన్నారు. ఇదే సమావేశంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ.. మహిళల్ని గౌరవించకుండా ఏ సమాజం కూడా అభివృద్ధి చెందలేదని చెప్పారు. మహిళల రక్షణకు కోసం ప్రభుత్వం కఠిన చట్టాల్ని రూపొందించిందని తెలిపారు. -
ఆ హింస వెనుక పార్టీలు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో చోటుచేసుకున్న మతఘర్షణల వెనుక కొన్ని రాజకీయ పార్టీల హస్తం ఉండొచ్చని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే పేర్కొన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశంలో మరిన్ని మతఘర్షణలు జరిగే ప్రమాదముందని హెచ్చరించారు. ‘ముజఫర్‌నగర్ హింసపై పూర్తి నివేదికలు అందేవరకు నేను రాజకీయ కుట్రల గురించి మాట్లాడను. అయితే ఘర్షణల్లో రాజకీయ పార్టీల ప్రమేయం ఉంది’ అని బుధవారమిక్కడ విలేకర్లతో అన్నారు. ఎన్నికల నేపథ్యంలో మతహింస జరిగే అవకాశాలున్నాయని 11 రాష్ట్రాలను అప్రమత్తం చేశామన్నారు. ఎస్పీ, బీజేపీ పరస్పర విమర్శలు.. లక్నో/ఆగ్రా: ముజఫర్‌నగర్ ఘర్షణలపై బీజేపీ, ఎస్పీలు పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నాయి. బీజేపీ యూపీలో నరేంద్ర మోడీ తరహా ‘గుజరాత్ పాలన’ కోసం, మతసామరస్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని ఎస్పీ సీనియర్ నేత అబూ ఆసీం అజీ ఆరోపించారు. అల్లర్లకు ఎస్పీదే బాధ్యతని బీజేపీ ప్రతినిధులు సుధాంశు త్రివేదీ, విజయ్ పట్నాయక్‌లు ఆరోపించారు. మరోపక్క.. యూపీలోని ఎస్పీ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని పలు ముస్లిం సంఘాలు ఢిల్లీలో డిమాండ్ చేశాయి. -
దావుద్ అరెస్ట్ కు యూఎస్ తో జాయింట్ ఆపరేషన్: షిండే
1993 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి, పలు కేసుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంను పట్టుకునేందుకు భారత్ పక్కా ప్రణాళికను రూపొందిస్తోంది. పాకిస్థాన్ లో తలదాచుకున్నట్టు వస్తున్న వార్తలను ఆధారంగా చేసుకుని దావుద్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దావూద్ ను వేటాడేందుకు అమెరికా ప్రభుత్వ సహాకారం తీసుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. ఇప్పటికే కొంత మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేశాం. మరికొంత మంది సరిహద్దుల్లో మరణించారు. అయితే దావూద్ ను అరెస్ట్ చేసేందుకు అమెరికా ఎఫ్ బీఐ తో సంప్రదింపులు జరుపుతున్నాం అని షిండే తెలిపారు. ఇప్పటికే దావూద్ పై రెడ్ కార్నర్ నోటిస్ ఉంది. అమెరికాతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టాలని ప్లాన్ చేస్తున్నాం. అందుకు యూఎస్ అటార్ని జనరల్ ఎరిక్ హోల్డర్ సమ్మతి తెలిపారు. అని షిండే వెల్లడించారు. -
హైదరాబాద్‌పై మూడు రకాల ప్రతిపాదనలు
కేంద్ర హోంమంత్రి షిండే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి ఏపీలో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన విధించే అవకాశం లేదు అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదు సోనియా చెప్పిన ప్రభుత్వ కమిటీ గురించి నాకు తెలీదు ‘టీ-బిల్లు’ ఎప్పుడు పెడతామో కొద్ది కాలం వేచిచూడండి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ విషయంలో రెండు, మూడు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే వెల్లడించారు. ఆ అంశాలేమిటనేది చెప్పేందుకు నిరాకరించారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలన్న ప్రతిపాదన వాటిలో ఉందా అనే విషయంపై ఈ దశలో తాము ఏమీ చెప్పలేమన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర హోంశాఖ రూపొందిస్తున కేబినెట్ నోట్ ఎప్పటిలోగా సిద్ధమౌతుందన్న ప్రశ్నకు.. త్వరలోనే కేబినెట్‌కు సమర్పిస్తామని బదులిచ్చారు. తెలంగాణ బిల్లును ఎప్పుడు పార్లమెంటులో ప్రవేశపెడతారన్న ప్రశ్నకు కూడా ‘వేచి చూడండి’ అని మాత్రమే బదులిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని.. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం లేదని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ నెలవారీ నివేదిక విడుదల చేస్తూ షిండే శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ నిర్ణయం, ఆంధ్రప్రదేశ్‌లో పరిణామాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణపై ఒక నిర్ణయం తీసుకుంది. దీనిపై తీర్మానాన్ని రూపొందించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. ఒక ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు ఈ అంశం ప్రభుత్వం వద్దకు రావటంతో రెండో దశ మొదలయింది’ అని షిండే పేర్కొన్నారు. విభజనకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలు, శనివారం సీమాంధ్ర ప్రభుత్వోద్యోగుల భారీ బహిరంగ సభపై ప్రభుత్వానికి పూర్తి సమాచారం ఉందన్నారు. ఎన్జీవోల సభ సందర్భంగా చిన్నపాటి సంఘటనలు మినహా శాంతిభద్రతల పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. అఖిలపక్ష కమిటీ ప్రతిపాదనేదీ లేదు: విభజనతో తలెత్తే సమస్యలపై నేతల అభిప్రాయాలను తెలుసుకునేందుకే ఏర్పాటైన ఆంటోనీ కమిటీ సిఫారసులు వచ్చిన తర్వాత ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకుంటుందని బదులిచ్చారు. ప్రభుత్వ స్థాయిలో అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని, గతంలో అన్ని పక్షాలతో అనేకసార్లు జరిపిన చర్చల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఏకాభిప్రాయం వచ్చినందునే సీడబ్ల్యూసీ తెలంగాణపై నిర్ణయం తీసుకుందని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ కమిటీ గురించి తనకు తెలియదన్నారు. రాష్ట్రాన్ని విభజించవద్దని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తాజాగా మరోసారి కేంద్ర హోంమంత్రికి లేఖ రాయటం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సీమాంధ్ర ప్రాంతంలో యాత్ర నిర్వహిస్తుండటం గురించి ప్రస్తావించగా.. మొదట్లో రెండు పార్టీలు, తర్వాత కమ్యూనిస్టు పార్టీ (సీపీఎం) మినహా అన్నీ తెలంగాణ డిమాండ్‌ను సమర్థించాయని.. నిర్ణయం జరిగిన తర్వాత ఏ పార్టీ అయినా తమ వైఖరిని మార్చుకుంటే తానేం చేయగలనని షిండే వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజల మధ్య పెరుగుతున్న విద్వేషాలకు ఎప్పుడు తెరదించుతారని ప్రశ్నించగా.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, హోంశాఖ నివేదిక కేంద్ర మంత్రివర్గానికి చేరిన తర్వాత ఈ సమస్యలన్నింటిపై దృష్టి సారిస్తామన్నారు. కాంగ్రెస్ అధిష్టానం, యూపీఏ ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పలేదని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఆ మూడు ప్రత్యామ్నాయాలివే..! కేబినెట్ నోట్లో కేంద్ర హోంశాఖ హైదరాబాద్‌పై కింది 3 ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించనున్నట్లు ఉన్నతస్థాయి వర్గాల ద్వారా తెలిసింది. ఈ మూడు ప్రత్యామ్నాయాలూ హోంశాఖ కేంద్రానికి చేయబోయే సూచనలు మాత్రమే. దీనిపై.. త్వరలో మంత్రుల బృందం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) తుది నిర్ణయం తీసుకుంటుంది. అవేమిటంటే... 1. హైదరాబాద్‌ను రెండు రాష్ట్రాలకూ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించటం 2. కేంద్ర పాలిత ప్రాంతంగా చేయటం 3. హైదరాబాద్‌లో శాంతిభద్రతల పర్యవేక్షణను (పోలీసింగ్‌ను) ఢిల్లీ తరహాలో కేంద్ర హోంశాఖ నియంత్రణలోకి తీసుకురావటం -
20 రోజుల్లో కేబినెట్‌కు నోట్
-
20 రోజుల్లో కేబినెట్‌కు నోట్ - తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై షిండే
కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో నెల రోజులుగా సమైక్యోద్యమం ఉధృతంగా సాగుతున్నప్పటికీ రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను మరో 20 రోజుల్లోగా కేంద్ర మంత్రివర్గ పరిశీలనకు సమర్పించబోతున్నట్టు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించారు. కేంద్ర మంత్రివర్గ తీర్మానం కోసం హోం శాఖ సమర్పించాల్సిన నివేదికను సిద్ధం చేస్తున్నట్టు సోమవారం పార్లమెంట్ ప్రాంగణంలో తనను కలసిన విలేకరులకు ఆయన స్పష్టం చేశారు. అది మరో 20 రోజుల్లో మంత్రివర్గం ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నామన్నారు. ‘‘మంత్రివర్గ ఆమోదం కోసం నోట్ తయారవుతోంది. సిద్ధమయ్యాక దాన్ని కేంద్ర న్యాయ శాఖ ఆమోదానికి పంపిస్తాం. న్యాయ శాఖ ఆమోదించాక 20 రోజుల్లోగా కేంద్ర మంత్రివర్గ పరిశీలనకు సమర్పిస్తాం’’ అని తెలియజేశారు. నోట్ రూపకల్పనలో ఎలాంటి జాప్యమూ జరగడం లేదని ఒక ప్రశ్నకు బదులుగా షిండే చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీల నిర్ణయాన్ని అమలు చేయడానికి సంబంధించి కేంద్ర మంత్రివర్గానికి సమర్పించాల్సిన నోట్‌ను రూపొందించడంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, ఆ దృష్టితోనే హోం శాఖ ఆచితూచి వ్యవహరిస్తోందని వివరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు 2009 డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటనకు కొనసాగింపుగా రాష్ట్రంలోని పార్టీలతో, ప్రజాసంఘాల ప్రతినిధులతో జరిపిన విసృ్తత సంప్రదింపులు, పార్టీల లిఖితపూర్వక అభిప్రాయాల ప్రాతిపదికన రాష్ట్ర విభజనను సూచిస్తూ హోం శాఖ నివేదిక సిద్ధమవుతున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలియవచ్చింది. ‘‘ఆ ప్రతిపాదనను ఆమోదిస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం తీర్మానించనుంది. ఆ వెంటనే రాష్ట్ర విభజనతో ఉత్పన్నం కాగల కీలక సమస్యల అధ్యయనానికి కేంద్ర మంత్రివర్గ ఉపసంఘాన్ని (జీఓఎం) ఏర్పాటు చేస్తూ, విభజనపై చర్చించి అభిప్రాయాలు తెలపాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని కోరుతూ మరో తీర్మానాన్ని కూడా ఆమోదిస్తుంది’’ అని హోం శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. విభ జనపై అసెంబ్లీ నిర్ణయం, అభిప్రాయం ఎలా ఉన్నా కేంద్రం మాత్రం తన నిర్ణయంతో ముందుకెళ్తుందని స్పష్టం చేశాయి. విభజనతో ఉత్పన్నమయ్యే సమస్యలను పరిశీలించి, సీమాంధ్రుల భయాందోళనలను తొలగించేందుకు ఏర్పాటైన కాంగ్రెస్ కమిటీ సారథి ఏకే ఆంటోనీయే కేంద్ర మంత్రుల ఉప సంఘానికీ చైర్మన్‌గా ఉండవచ్చని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ కమిటీ సభ్యులైన వీరప్ప మొయిలీతో పాటు షిండే, కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, ఆరోగ్య మంత్రి గులాంనబీ ఆజాద్, మానవ వనరుల మంత్రి పళ్లంరాజు (రాజీనామా చేయకపోతే) కూడా ప్రభుత్వ కమిటీలో ఉండవచ్చని అధికార వర్గాల సమాచారం. సీమాంధ్ర ప్రజలను సంతృప్తిపరిచే ప్రయత్నంలో భాగంగా విభ జన సమస్యల పరిశీలనకు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్సింగ్ వేస్తామన్న ప్రభుత్వ కమిటీ ఇదే కావచ్చంటున్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రుల రాజీనామా వ్యూహం తమ అభ్యంతరాలను, నిరసనలను అధిష్టానం బేఖాతరు చేస్తుండడంతో తీవ్ర నిరాశ, నిసృ్పహలకు లోనవుతున్న సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు కూడా విభజన ప్రతిపాదనను కేంద్రం ఆమోదించిన మరుక్షణమే మంత్రివర్గం నుండి వైదొలగాలని భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలియవచ్చింది. సోమవారం షిండే ప్రకటన తర్వాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో వారంతా సమావేశమయ్యారు. పదవులను త్యజించాల్సిన ముహూర్తంపైనే చ ర్చించినట్టు సమాచారం. మంగళవారం ఆంటోనీ కమిటీతో భేటీలో ఇదే విషయాన్ని స్పష్టం చేయాలని కూడా సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు భావిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని, సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలనే డిమాండ్‌తో పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ఆగస్టు 5న అవి ప్రారంభమైనప్పటి నుంచీ సీమాంధ్ర ఎంపీలు స్తంభింపజేస్తుండటం, ఇప్పటికే ఐదేసి రోజుల చొప్పున రెండుసార్లు సస్పెన్షన్‌కు గురవడం తెలిసిందే. కిరణ్, బొత్సలకూ పిలుపు సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలను మంగళవారం రాత్రి ఏడింటికి గురుద్వారా రకబ్గంజ్ రోడ్‌లోని కాంగ్రెస్ వార్ రూమ్‌లో సమావేశానికి ఆంటోనీ కమిటీ ఆహ్వానించింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలతో కూడా రేపే కమిటీ విడిగా భేటీ కానుంది. ఆదివారం రాత్రి హస్తిన చేరిన బొత్స కూడా దీన్ని ధ్రువీకరించారు. -
20 రోజుల్లో తెలంగాణ తీర్మానం: షిండే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులోగా భాగంగా సీడబ్ల్యూసీ తీర్మానాన్ని కేంద్ర మంత్రివర్గం ముందుకు తీసుకురానుంది. 20 రోజుల్లో తెలంగాణ తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకొస్తామని హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర హోంశాఖ ‘కేబినెట్ నోట్’ రూపకల్పనపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. అయితే.. ఈ ముసాయిదా నోట్ రూపకల్పనకు ఎలాంటి తుది గడువూ లేదని హోంశాఖ వర్గాలు చెప్పాయి. ఈ ప్రక్రియలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉన్నందున కొంత సమయం పడుతుందని పేర్కొన్నాయి. కేబినెట్ ముసాయిదా నోట్‌ను ఒక పత్రంగా వ్యవహరిస్తూ.. ‘అత్యంత రహస్యం (టాప్ సీక్రెట్)’ గా వర్గీకరించటం జరుగుతుందని హోంశాఖ వర్గాలు తెలిపాయి. -
భత్కల్ ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు
-
బ్రీచ్ కాండీ ఆసుపత్రి నుంచి షిండే డిశార్జ్
బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఊపిరితిత్తుల సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే (72) ను ఈ రోజు ఉదయం ఆసుపత్రి నుంచి డిశార్జ్ చేశారని ఆయన కుమార్తె, షోలాపుర్ ఎమ్మెల్యే ప్రీతి షిండే ఆదివారం ముంబైలో వెల్లడించారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. మరో ఐదారు రోజుల్లో ఆయన విధులకు హాజరవుతారని పేర్కొన్నారు. అప్పటి వరకు ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారన్నారు. ఉపిరితిత్తులు కొద్దిగా పెరగడంతో షిండేకు ఈనెల 4వ తేదీన బ్రిచ్ క్యాండీ ఆసుపత్రిలో వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించిన సంగతి తెలిసిందే. -
కేంద్ర హోం మంత్రి షిండేకు శస్త్రచికిత్స
కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయనకు ఊపిరితిత్తుల సంబంధిత ఆపరేషన్ జరిగినట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 71 ఏళ్ల షిండే గతరాత్రి బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేరారు. అయితే షిండే అనారోగ్యానికి సంబంధించిన వివరాలు వెల్లడికాలేదు. ఒకట్రెండు రోజుల్లో ఆయన డిశ్చార్జి అయ్యే అవకాశముంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు షిండే హాజరుకానున్నారు. అయితే ఎప్పడు ఆయన ఢిల్లీకి వెళతారనేది తెలియలేదు. శస్త్ర చికిత్స తర్వాత తన తండ్రి బాగానే ఉన్నారని షిండే కుమార్తె, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రణితి తెలిపారు. ఆస్పత్రిలో చేరడానికి ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చౌహాన్, ప్రధాన కార్యదర్శి జయంత్ బాంటియా, ఇతర ఉన్నతాధికారులను శనివారం షిండే కలిశారు. హజ్ హౌస్‌లో చవాన్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. వర్లీలో నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు.