'ఆమ్ ఆద్మీ' విదేశీ నిధులపై విచారణ: షిండే
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక భూమిక పోషిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి ఆదిలోనే ముక్కుతాడు బిగించేందుకు కాంగ్రెస్ పార్టీ యత్నిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి సమకూరే విదేశీ నిధులపై విచారణ జరిపించేందుకు సన్నద్ధమైంది. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే సోమవారం మీడియాతో మాట్లాడారు. క్రేజీవాల్ నేతృత్వంలోని ఏర్పడిన ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చే నిధులపై ఇప్పటికే చాలా ఫిర్యాదులు వచ్చాయని, ఈ అంశంపై దర్యాప్తుకు ఆదేశించినట్లు షిండే తెలిపారు.
ఆ పార్టీకి విదేశాల నుంచి నిధులు వస్తే ఎక్కడ నుంచి వస్తున్నాయి, దానికి ఆధారాలేమిటి తదితర అంశాలపై దృష్టి సారించినట్లు షిండే తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ లో జరుగనున్న తరుణంలో పూర్తి స్థాయి విచారణ ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.