ఆప్ వీడియో ఎఫెక్ట్: ముగ్గురు పోలీసులు సస్పెండ్!
ఆప్ వీడియో ఎఫెక్ట్: ముగ్గురు పోలీసులు సస్పెండ్!
Published Fri, Jan 24 2014 8:16 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విడుదల చేసిన వీడియో ముగ్గురు పోలీసుల సస్పెన్షన్ కు దారి తీసింది. ఓ వ్యక్తిని పోలీసులు కొడుతున్న దృశ్యాలతో ఉన్న వీడియోను ఆప్ శుక్రవారం విడుదల చేసింది. ఆప్ విడుదల చేసిన వీడియోలో ఓ వ్యక్తిని చితకబాదుతూ.. ఆతని పర్సును తీసుకుని.. డబ్బులు గుంజుకున్న దృశ్యాలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ పోలీసుల తీరుకు నిరసనగా కేజ్రివాల్ చేపట్టిన ధర్నా సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
కెమెరాకు చిక్కిన పోలీసులపై చర్య తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు విజ్క్షప్తి చేస్తూ ఆన్ లైన్ లో వీడియోను పోస్ట్ చేశారు. జనవరి 12 తేదిన దేశరాజధాని లోని ఎర్రకోట వద్ద పోలీసుల ప్రవర్తను రికార్డ్ చేశామని ఆప్ ప్రతినిధులు తెలిపారు. ఢిల్లీ పోలీసులు అరాచకానికి మారుపేరు. ఢిల్లీ పోలీసుల క్రూరత్వం గురించి తరచుగా వింటునే ఉంటాం. అలాంటి వార్తలకు సాక్ష్యంగా నిలిచింది ఈ వీడియో అని ఆప్ వర్గాలు వెల్లడించాయి. దేశ రాజధానిలో పెచ్చరిల్లుతున్న హింసపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement