కేంద్రంపై కేజ్రీ 'వార్'
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేసిన చర్యలకు ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఉడికిపోతున్నారు. వెనుకకు తగ్గేది లేదన్నట్లుగా ముందుకు పోతున్నారు. కేంద్రం తీరుపైనే ప్రత్యేకంగా చర్చించి ఒక తీర్మానం కూడా ప్రవేశపెట్టేందుకోసం మంగళ, బుధవారాల్లో అసెంబ్లీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలోనే ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ను సమర్ధిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధమంటూ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.
కొత్త నియామకాలు, బదిలీల విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మధ్య తీవ్ర వైరుధ్యాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశిష్ట అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్ కు ఉన్నాయంటూ కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడంతోపాటు, కేంద్రం తీరును ఎండగడుతూ తీర్మానం ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఎలాగైనా దానికి బదులు ని బజారుకీడువాలని ప్రయత్నిస్తున్నారు.