ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్‌ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఆప్ సర్కార్‌పై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన విమర్శలు చేశారు. ఇదే సమయంలో సీఎం కేజ్రీవాల్‌ను టార్గెట్ చేసి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. త్వరలోనే ఈ కేసులో ‘కింగ్ పిన్’(కేజ్రీవాల్) కూడా జైలులో ఉంటారని అన్నారు.
అయితే, మంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కేజ్రీవాల్ నిజాయితీ సర్టిఫికెట్ ఇచ్చిన వారు జైల్లో ఉన్నారని, ఆయన కూడా త్వరలోనే జైలుకు వెళ్లారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆయన ముఖంలో టెన్షన్ కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం జైల్లో ఉన్నారు. ఆరోగ్య మంత్రి జైల్లో ఉన్నారు, ఇండియాలో అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు వచ్చిన వారే ఇప్పుడు అవినీతికి పాల్పడుతున్నారు అంటూ కౌంటరిచ్చారు.
केजरीवाल पर जमकर भड़के अनुराग ठाकुर बोलें, इनके मंत्री से लेकर सांसद तक सब जेल में हैं।#anuragthakur #BJP #newliquorpolicy #SanjaySinghArrested #ManishSisodia pic.twitter.com/LAhuFaQTm3
— Chaupal Khabar (@ChaupalKhabar) October 5, 2023
లిక్కర్ స్కాం కేసులో ఇప్పటి వరకు బయట ఉన్న కేజ్రీవాల్ కూడా జైలుకు వెళ్తారు. ఆయన నెంబర్ కూడా వస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు. కానీ రెండు నెలల్లోనే అవినీతి కారణంగా రాష్ట్ర ఆరోగ్య మంత్రి పదవి నుండి వైదొలగవలసి వచ్చిందని ఠాకూర్ విమర్శించారు.
ఇదిలా ఉండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టును ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. సంజయ్ సింగ్ అరెస్టు పూర్తిగా చట్టవిరుద్ధం. ఇది మోదీ భయాన్ని తెలియజేస్తోంది. ఎన్నికల వరకు ఇంకా చాలా మంది ప్రతిపక్ష నేతలను అరెస్టు చేస్తారు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం: నిందితుల జాబితాలో ఆప్!
Comments
Please login to add a commentAdd a comment