anurag thakur
-
ఢిల్లీ ప్రజలపై బీజేపీ హామీల వర్షం
-
ఢిల్లీలో గెలుపే టార్గెట్.. బీజేపీ రెండో మేనిఫెస్టో విడుదల
సాక్షి, ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలనే క్రమంలో ఓటర్లకు కీలక హామీలు ఇస్తున్నాయి. ఇప్పటికే ఆప్, కాంగ్రెస్ హామీలు ఇవ్వగా తాజాగా బీజేపీ మరో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని హామీ ఇచ్చారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు స్పీడ్ పెంచాయి. ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. మరోవైపు.. ఓటర్లను తమవైపు ఆకర్షించేందుకు పార్టీలు పలు హామీలు ఇస్తున్నాయి. ఇక, తాజాగా బీజేపీ రెండో మేనిఫెస్టోలను విడుదల చేసింది. ఈ క్రమంలో బీజేపీ అధికారంలోకి వస్తే నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ‘సంకల్ప పత్రం’ విడుదల చేశారు ఎంపీ అనురాగ్ ఠాకూర్. అలాగే, ఢిల్లీలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు రూ.15 వేల ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటనలో తెలిపారు. దీంతో, విద్యార్థులకు బీజేపీ భారీ ఆఫర్ ప్రకటించింది.#WATCH | Delhi | Launching BJP's 'Sankalp Patra' for Delhi Assembly polls, BJP MP Anurag Thakur says," We will provide to the youth of Delhi one-time financial assistance of Rs 15,000 for preparation of competitive examinations and reimburse two-time travel and application fees.… pic.twitter.com/muyCpF8SJ7— ANI (@ANI) January 21, 2025 ఇదిలా ఉండగా.. అంతకుముందు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మొదటి మేనిఫెస్టోను ప్రకటించింది. ‘సంకల్ప పత్రం’ పార్ట్-1 పేరుతో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. గర్భిణీలకు రూ.21వేల ఆర్థిక సాయం, పేద కుటుంబాలకు సబ్సిడీపై ఎల్పీజీ (LPG subsidy) సిలిండర్లను రూ.500కే ఇస్తామని పేర్కొన్నారు. ‘మహిళా సమృద్ధి యోజన’ కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. వీటితోపాటు ప్రస్తుతం ఉన్న అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.మేనిఫెస్టో ఇలా.. గర్భిణీలకు రూ.21వేల ఆర్థిక సాయం. ఆరు పౌష్టికాహార కిట్లు. ప్రస్తుతం ఇస్తున్న మొదటి సంతానం సమయంలో రూ.5వేలు, రెండో సంతానానికి రూ.6వేలకు ఇవి అదనం‘మహిళా సమృద్ధి యోజన’ కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయంఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ అమలు. దీనికి అదనంగా రూ.5లక్షల ఆరోగ్య కవరేజీపేద కుటుంబీలకు రూ.500లకే ఎల్పీజీ సిలిండర్, ప్రతి హోలీ, దీపావళి (ఒకటి చొప్పున) పండగల సమయంలో ఉచితంగా గ్యాస్ సిలిండర్60-70ఏళ్ల వయోవృద్ధులకు రూ.2500 పెన్షన్, 70ఏళ్ల పైబడిన వారికి రూ.3000జేజే క్లస్టర్లలో అటల్ క్యాంటీన్ల ఏర్పాటు. రూ.5కే భోజనంసంక్షేమ పథకాల అమల్లో వస్తున్న అవినీతి ఆరోపణలపై దర్యాప్తు -
కుల గణన: అఖిలేష్ విమర్శలకు అనురాగ్ ఠాకూర్ కౌంటర్
ఢిల్లీ: లోక్‌సభలో కులగణనపై తాను చేసిన వ్యాఖ్యలపై ఎస్పీ చీఫ్, ఎంపీ అఖిలేష్ యాదవ్ చేసిన విమర్శలకు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కౌంటర్ ఇచ్చారు. అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై బుధవారం అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. ఇతరు కులాన్ని ఎలా అడుగుతారు? అని మండిపడ్డారు. కులం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయటం ఆమోదయోగ్యం కాదని విమర్శలు చేశారు.తాజాగా అఖిలేష్ యాదవ్ విమర్శలను బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ తిప్పికొట్టతారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా గతంలో అఖిలేష్ మాట్లాడిన రెండు వీడియోలు పోస్ట్ చేసి విమర్శలు చేశారు. రెండు వీడియోల్లో ఒకటి.. ఓ జర్నలిస్ట్‌ను అఖిలేష్.. అతని కులం ఏంటి? అని అడుగుతారు. మరో వీడియోలో లోక్‌సభలో కులం అంశంపై ప్రసంగిస్తారు. ఈ వీడియోలకు మీరు(అఖిలేష్ యాదవ్) ఎలా కులం గురించి అడుగుతారు? అని అనురాగ్ ఠాకూర్ కామెంట్ చేశారు.जाति कैसे पूछ ली अखिलेश जी ? pic.twitter.com/uaFujlDWrD— Anurag Thakur (@ianuragthakur) July 31, 2024 లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బుధవారం సైతం లోక్‌సభలో గందరగోళం చోటు చేసుకుంది. అనురాగ్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ నినాదాలు చేశారు. మోదీ సర్కారుపై విపక్షనేత రాహుల్‌గాంధీ చేసిన ‘చక్రవ్యూహం’వ్యాఖ్యలను మంగళవారం ఎంపీ అనురాగ్ ఠాకూర్ తీవ్రంగా ఖండించారు. ‘తమది ఏ కులమో కూడా తెలియని వారు కులగణన కోరుతున్నారు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సభలో తీవ్ర దుమారం రేపాయి. ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు.. రాహుల్‌ను ఉద్దేశించినవేనంటూ విపక్ష సభ్యులంతా మండిపడ్డారు. -
Parliament Session: లోక్‌సభలో కులకలం
న్యూఢిల్లీ: మోదీ సర్కారుపై విపక్షనేత రాహుల్‌గాంధీ చేసిన ‘చక్రవ్యూహం’ వ్యాఖ్యల తాలూకు వేడి లోక్‌సభలో మంగళవారం కూడా కొనసాగింది. ప్రభుత్వం తరఫున మాట్లాడిన బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ వాటిని తీవ్రంగా ఖండించారు. రాహుల్ తన ప్రసంగం పొడవునా ఆరితేరిన వక్తనని నిరూపించుకునేందుకు పాకులాడారని ఎద్దేవా చేశారు. ‘‘అందుకోసం అంకుల్ శామ్ (కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా) నుంచి తెచ్చుకున్న అరువు జ్ఞానాన్ని ప్రదర్శించారు. రాహుల్ రియల్ పొలిటీషీయన్ కాదు. కేవలం వీడియోల కోసమే ప్రసంగాలిచ్చే రీల్ పొలిటీషియన్. బహుశా విపక్ష నేత (ఎల్ఓపీ) అంటే దు్రష్పచార సారథి (లీడర్ ఆఫ్ ప్రాపగాండా) అని అపార్థం చేసుకున్నట్టున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘కొందరు పేరుకు మాత్రమే హిందువులు. మహాభారతంపై వారికున్నది కూడా మిడిమిడి జ్ఞానమే’’ అంటూ రాహుల్‌ను ఠాకూర్ ఎద్దేవా చేశారు. ఆ క్రమంలో ‘తమది ఏ కులమో కూడా తెలియని వారు కులగణన కోరుతున్నారు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సభలో తీవ్ర దుమారం రేగింది. అవి రాహుల్‌ను ఉద్దేశించినవేనంటూ విపక్ష సభ్యులంతా మండిపడ్డారు. ఒక వ్యక్తి కులం గురించి ఎలా మాట్లతాడతారంటూ సమాజ్‌వాదీ నేత అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. ఠాకూర్ వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులంతా వెల్‌లోకి దూసుకెళ్లారు. దాంతో ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. తర్వాత రాహుల్ మాట్లాడు తూ ఠాకూర్ వ్యాఖ్యలు తనకు ఘోర అవమానమన్నారు. ‘‘దళితులు, వెనకబడ్డ వర్గాల హక్కుల కోసం ఎవరు పోరాడినా ఇలాంటి అవమానాలు భరించాల్సిందే. అందుకే నన్నెంత తిట్టినా, అవమానించినా పట్టించుకోను. క్షమాపణలూ కోరబోను. అర్జునుడు పక్షి కన్నుపైనే దృష్టి పెట్టినట్టు నా దృష్టినంతా కులగణనపైనే కేంద్రీకరించాను. పోరు ఆపబోను. విపక్ష ఇండియా కూటమి ఎట్టి పరిస్థితుల్లోనూ దేశవ్యాప్తంగా కులగణన చేయించి తీరుతుంది’’ అని ప్రకటించారు. మీకో వైఖరే లేదు దళితులు, ఓబీసీల వెనకబాటుకు 1947 నుంచి దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెసే కారణమని ఠాకూర్ ఆరోపించారు. ఎన్ (నెహ్రూ), ఐజీ (ఇందిరాగాంధీ), ఆర్జీ1 (రాజీవ్‌గాం«దీ) అంటూ గాంధీ కుటుంబానికి చెందిన మాజీ ప్రధానులందరిపైనా విమర్శలు చేశారు. కాంగ్రెస్ దృష్టిలో ఓబీసీలు అంటే ఓన్లీ బ్రదర్–ఇన్–లా కమీషన్ అంటూ రాహుల్ బావ రాబర్ట్ వద్రాను ఉద్దేశించి ఆరోపణలు గుప్పించారు. ‘‘కులగణనపై కాంగ్రెస్‌కు ఓ వైఖరంటూ ఉందా? రాహుల్ కులగణన కావాలంటున్నారు. ఆయన తండ్రి రాజీవ్ గాంధీ మాత్రం ఓబీసీలకు రిజర్వేషన్లను వ్యతిరేకించారు. బోఫోర్స్ మొదలుకుని కామన్వెల్త్ క్రీడలు, 2జీ, గడ్డి, యూరి యా, బొగ్గు, నేషనల్ హెరాల్డ్... ఇలా కాంగ్రెస్ హయాంలో జరిగిన కుంభకోణాలకు అంతే లేదు’’ అంటూ దుయ్యబట్టారు. -
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
సిమ్లా: దేశంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. కాంగ్రెస్ మేనిఫెస్టోను విదేశీ శక్తులు ప్రభావితం చేస్తున్నాయని అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీకి పాకిస్తాన్ నుంచి మద్దతు లభిస్తుందని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ చాలా దిగజారిపోయిందని అన్నారు.సోమవారం హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో వినాశకరమైన వరదలు, వర్షాల సమయంలో చురుకైన పాత్ర పోషించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు.రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేస్తామని, వాయనాడ్ బరిలోకి దిగారు. ఇప్పుడు రాయ్‌బరేలీ నుండి పోటీ చేస్తున్నారు. రాయ్‌బరేలీ నుంచి కూడా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఠాకూర్ అన్నారు. తప్పుడు వాగ్దానాలతో ఎన్నికల్లో గెలుపొందడం అనే మూర్ఖుల స్వర్గంలో జీవించడం కాంగ్రెస్ లక్ష్యమని ఆయన అన్నారు. జూన్ 4న విడుదలయ్యే పోలింగ్ ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ కలలు చెదిరిపోతాయని పేర్కొన్నారు.అనురాగ్ ఠాకూర్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో హమీర్పూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో వచ్చిన నాలుగు లక్షల ఓట్ల కంటే ఈసారి మరింత ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ 400 సీట్లకు పైగా సొంత చేసుకుంటుందని కూడా అన్నారు. -
కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. సంపదను ముస్లింకు పంపిణీ చేస్తామంటున్న కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం ఉందని మండిపడ్డారు. శనివారం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హమీర్‌పూర్‌లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వెనక కాంగ్రెస్‌తో పాటు విదేశీ హస్తం ఉంది. మీ(ప్రజల) పిల్లల ఆస్తులను ముంస్లికు ఇవ్వనున్నారు. దేశానికి సంబంధించిన ఆణ్వాయుధాలను నాశనం చేయనున్నారు. కులం, మతం పేరుతో దేశం మొత్తాన్ని విభజించనున్నారు. టుక్డే-టుక్డే గ్యాంగ్ కాంగ్రెస్ చుట్టూ చేరి.. ఆ పార్టీ సిద్ధాంతాలను హైజాక్ చేస్తోంది. మీ( ప్రజలు) సంపద మీతోనా ఉండలా? లేదా ముస్లింలకు వెళ్లాలా? మీరే నిర్ణయం తీసుకోండి. మేము ముస్లింకు అన్ని హక్కులు సమానంగా కల్పించాం. కానీ, మత ప్రాతిపదికన మేము హక్కులు కల్పించలేదు. ఎందుకుంటే అవి ప్రజలందరి హక్కు’ అని మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.#WATCH | Hamirpur, Himachal Pradesh: Union Minister Anurag Thakur says, "In the Congress manifesto, along with the hand of the Congress, hands of foreign forces are also visible who want to give your children's property to Muslims, finish the nations nuclear weapons, divide the… pic.twitter.com/3dxJE6avvz— ANI (@ANI) April 27, 2024 అనురాగ్ ఠాకుర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన ఠాకుర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. -
‘ICEతో బీజేపీకి సంబంధం లేదు’
న్యూఢిల్లీ: ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్టుమెంట్, ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ),సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష్న్(సీబీఐ) స్వతంత్ర దర్యాప్తు సంస్థలని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ పదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవినీతిపరుడని దేశంలో ఒక్కరు కూడా ఆరోపణలు చేయాలేరన్నారు. ‘2013లో ఢిల్లీ సీఎం అసలు రాజకీయాల్లోకి అడుగుపెట్టనన్నారు. కాంగ్రెస్‌తో ఎట్టిపరిస్థితుల్లో జత కట్టనని అన్నారు. ఆప్, కాంగ్రెస్ పార్టీ వారి సొంతంగా ఏం సాధించలేదు. రోజూ కాంగ్రెస్, ఆప్ ప్రధాని మోదీని దూషిస్తారు వాళ్లు మోదీని ఎంత దూషిస్తే.. బీజేపీ అభ్యర్థులను ప్రజలు అంత ఎక్కువ మెజార్టీతో గెలిపించుకుంటారు’ అని అన్నారు. ‘ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు దర్యాప్తు సంస్థ ఈడీ తొమ్మిదిసార్లు సమన్లు జారీచేసింది. ఎందుకు హాజరు కాలేదు. మళ్లీ విలువల గురించి మాట్లాడతారు. ఆయన ఈడీ ఆఫీసుకు హాజరకాకపోతే.. ఈడీనే ఆయన ఇంటికి వెళ్లింది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆప్ ఒక్కసీటు కూడా గెలవలేదు. మళ్లీ 2024 ఎన్నికలో సైతం ఆప్ ఒక్కసీటు గెలవదు. ఈ రోజుకీ జైలులో ఉండి కూడా కేజ్రీవాల్ విలువల గురించి మాట్లాడుతున్నారు’ అని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శలు చేశారు. ఇక.. ‘ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, సీబీఐ’(ఐసీఈ) స్వతంత్ర సంస్థలని వాటి పని అవి చేసుకుంటూ వెళ్తాయని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో బీజేపీకి ఎటువంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఇండియా కూటమిపై కూడా కేంద్ర మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్షాల కూటమి నిజాయితీగా ఉంటే కూటమి పేరు ఎందుకు మార్చారు? అని ప్రశ్నించారు. వాళ్లు(కాంగ్రెస్) 2జీ, సబ్‌మెరైన్, బోగ్గు కుంభకోణాలు చేశారు. వారు ప్రజలకు ముఖం చూపించలేరు. ఆ తర్వాత దాణా కుంభకోణం చేసిన లాలు ప్రసాద్ యాదవ్‌ను కూటమిలోకి చేర్చుకున్నారు. జైలుకెల్లిన మంత్రులు, ప్రజాప్రతినిధులు కూటమిలో ఉన్నారు’ అని అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు. -
‘రబ్రీ 2.0’.. కేజ్రీవాల్ సతీమణిపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు
లిక్కర్ పాలసీ కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లడం, పార్టీలో కీలక నేతలు కూడా జైల్లో ఉండటంతో కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ అన్నీ తానై నడిపిస్తున్నారు. జైలు నుంచి కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని ఆమె ప్రజలకు చదివి వినిపించారు. ఈ క్రమంలో ఆమె ఢిల్లీ సీఎం అవుతారని మీడియా కథనాలు వస్తున్నాయి. జైలు నుంచి కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేయడంపై బీజేపీ తీవ్ర విమర్శలతో దాడి చేస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పాలన కొనసాగిస్తారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ప్రకటన ఢిల్లీ ప్రజలకు, చట్టానికి, ప్రజాస్వామ్యానికి అవమానకరమని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. ‘అప్పుడు బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్లినప్పుడు ఆయన సతీమణి రబ్రీదేవిని ముందు పెట్టి నడిపించారు. ఇప్పుడు రబ్రీ 2.0 సమయం వచ్చింది’ అన్నారు. -
అశ్లీలతతో నిండిన ఆ వెబ్‌సైట్స్, ఓటీటీ యాప్స్ బ్యాన్
అశ్లీలమైన, అసభ్యకరమైన చిత్రాలను ప్రచురించే 18 OTT ప్లాట్‌ఫారమ్‌లను నిరోధించేందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (I&B) వివిధ మధ్యవర్తుల సమన్వయంతో చర్య తీసుకుంది. 19 వెబ్సైట్లు, 18 యాప్‌లను తొలగించేసింది. ఈ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లతో అనుబంధించబడిన 57 సోషల్ మీడియా ఖాతాలను కూడా నిలిపేసింది. 'సృజనాత్మక వ్యక్తీకరణ' ముసుగులో అశ్లీలత, అసభ్యతతో కూడిన కంటెంట్‌ను ప్రచారం చేయవద్దని కేంద్ర సమాచార & ప్రసార మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. ఈ క్రమంలో అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రచురించే 18 OTT ప్లాట్‌ఫారమ్‌లను తాజాగా తొలగించినట్లు ఠాకూర్ ప్రకటించారు. బ్యాన్ అయిన ఓటీటీల జాబితా Dreams Films, Neon X VIP, MoodX, Voovi, Besharams, Mojflix, Yessma, Hunters, Hot Shots VIP, Uncut Adda, Rabbit, Fugi, Tri Flicks, Xtramood, Chikooflix, X Prime, Nuefliks, Prime Play. ఈ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం అవుతున్న కంటెంట్‌లో ఎక్కువ భాగం అశ్లీలతతో కూడి ఉంది. అంతే కాకుండా మహిళలను కించపరిచే విధంగా చిత్రీకరించిన పలు సినిమాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీటి వల్ల సమాజంలో సంబంధాలు దెబ్బతింటాయని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ ఓటీటీ యాప్‌లను కొన్ని కోట్ల మంది డౌన్లోడ్ చేసకుని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ యాప్స్‌తో పాటు వెబ్‌సైట్స్ భారత్‌లో బ్యాన్ అవుతాయి. IT చట్టంలోని సెక్షన్ 67, 67A, IPCలోని సెక్షన్ 292 మహిళల అసభ్య ప్రాతినిధ్యం (నిషేధం) చట్టం, 1986లోని సెక్షన్ 4ను ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా కంటెంట్ నిర్ధారించబడింది. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. -
ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం
-
సాకులు చెప్పలేదు.. ఉదయం 5.30 గంటలకే రోహిత్ ఇలా!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్య క్రీడా భారత్ రూపుదిద్దుకునే కార్యక్రమంలో చిత్తశుద్ధితో పాల్గొనడం రోహిత్ హుందాతనానికి నిదర్శనమని ప్రశంసించారు. కాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌తో రోహిత్ శర్మ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగింట మూడు విజయాలతో ట్రోఫీని కైవసం చేసుకున్న టీమిండియా.. ధర్మశాల వేదికగా గురువారం నుంచి నామమాత్రపు ఐదో టెస్టు ఆడనుంది. అయితే, నాలుగు- ఐదో టెస్టుకు మధ్య విరామం ఎక్కువగా ఉండటంతో రోహిత్ శర్మ సతీసమేతంగా అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొన్నాడు. గుజరాత్లో జరిగిన ఈ సెలబ్రేషన్స్ అనంతరం తిరిగి విధుల్లో చేరేందుకు ధర్మశాల(హిమాచల్ ప్రదేశ్)కు పయనం కావాల్సింది. అయితే, అంతకంటే ముందు భారత క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రాతినిథ్యం వహిస్తున్న హమీర్పూర్ నియోజకవర్గంలోని బిలాస్‌పూర్‌కు చేరుకున్నాడు. అక్కడ జరిగిన ఖేల్ మహాకుంభ్ 3.0 ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నాడు. రోహిత్ శర్మతో పాటు టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘‘ఖేల్ మహాకుంభ్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఉదయం ఐదున్నర గంటలకే రోహిత్ శర్మ ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాడు. ఒకవేళ రోహిత్ అనుకుంటే.. మార్చి 7న ఆరంభం కానున్న ఐదో టెస్టును సాకుగా చూపి ఇక్కడికి రాకుండా మా ఆహ్వానాన్ని తిరస్కరించి ఉండవచ్చు. కానీ అతడికి భవిష్య క్రీడా భారత్ ఇలాంటి కార్యక్రమాల నుంచే రూపుదిద్దుకుంటోందని తెలుసు. అందుకే ఇక్కడకు వచ్చాడు. అతడికి హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. కాగా ఈ ఈవెంట్ ఆరంభించిన అనంతరం రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ కాసేపు బ్యాట్ పట్టి క్రికెట్ ఆడుతూ సందడి చేశారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో బిలాస్‌పూర్‌కు దాదాపు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మశాలకు చేరుకున్నారు. చదవండి: 100th Test: అశ్విన్‌పై మాజీ స్పిన్నర్ సంచలన ఆరోపణలు Swung for the fences and had a blast with Hitman @ImRo45 and The Wall Rahul Dravid at the grand opening of #SansadKhelMahakumbh 3.0 at Luhnu Cricket Stadium, Bilaspur. Truly a game to remember! pic.twitter.com/ENRaSOr6Y8 — Anurag Thakur (मोदी का परिवार) (@ianuragthakur) March 5, 2024 -
PM Surya Ghar Muft Bijli Yojna: రూఫ్‌టాప్ సోలార్ రాయితీ 78 వేలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రూఫ్‌టాప్ సౌర విద్యుత్ పథకం ‘పీఎం–సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని అధ్యక్షతన మంత్రివర్గం గురువారం సమావేశమైంది. రూ.75,021 కోట్లతో అమలు చేసే ఈ పథకం కింద దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఇళ్లపై సౌర ఫలకాల ఏర్పాటుకు లబి్ధదారులకు రూ.78,000 వరకు రాయితీ ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలియజేశారు. కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లాకో మోడల్ సోలార్ గ్రామం రూప్‌టాప్ సౌర విద్యుత్ పథకాన్ని ప్రధాని మోదీ ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన ప్రారంభించారు. పథకం అమలులో భాగంగా 2 కిలోవాట్ల సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం ఆర్థిక సాయం అందిస్తుంది. 2 కిలోవాట్ల నుంచి 3 కిలోవాట్ల సోలార్ పవర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి అదనంగా మరికొంత ఆర్థిక సాయం అందజేస్తుంది. 3 కిలోవాట్ల వరకే పరిమితి విధించారు. ఒక కిలో వాట్ వ్యవస్థకు రూ.30 వేలు, 2 కిలోవాట్ల వ్యవస్థకు రూ.60 వేలు, 3 కిలోవాట్ల వ్యవస్థకు రూ.78 వేల చొప్పున కేంద్రం నుంచి రాయితీ లభిస్తుంది. లబ్ధిదారులు రాయితీ సొమ్ము కోసం నేషనల్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసే కంపెనీని పోర్టల్ ద్వారా ఎంపిక చేసుకోవచ్చు. కేంద్రం ఇచ్చే రాయితీ మినహా మిగిలిన పెట్టుబడి కోసం ఎలాంటి పూచీకత్తు లేకుండానే తక్కువ వడ్డీకే రుణం తీసుకొనే అవకాశం కలి్పంచారు. సౌర విద్యుత్‌పై గ్రామీణ ప్రజలకు అవగాహన కలి్పంచడానికి ప్రతి జిల్లాలో ఒక మోడల్ సోలార్ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూఫ్‌టాప్ సోలార్ పథకాన్ని ప్రమోట్ చేసే పట్టణ స్థానిక సంస్థలకు, పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్రం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. 2025 నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. 3 కిలోవాట్ల సౌర విద్యుత్ వ్యవస్థ నెలకు 300 యూనిట్లకుపైగా కరెంటును ఉత్పత్తి చేస్తుంది. 300 యూనిట్లు ఉచితంగా ఉపయోగించుకొని, మిగిలిన కరెంటును డిస్కమ్‌లకు విక్రయించి ఆదాయం పొందవచ్చు. పీఎం–సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన కింద సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి, రాయితీ పొందడానికి https:// pmsuryaghar.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పథకం ద్వారా కొత్తగా 17 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది. -
‘అర్జున’ అందుకున్న ఇషా
సాక్షి, న్యూఢిల్లీ: భారత మహిళా షూటింగ్ రైజింగ్ స్టార్, తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ 2023 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారం ‘అర్జున అవార్డు’ను బుధవారం అందుకుంది. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ అవార్డును ఇషా సింగ్‌కు బహూకరించారు. ఈనెల 9న రాష్ట్రపతి భవన్లో జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. అయితే అదే సమయంలో ఇషా జకార్తాలో ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడుతుండటంతో ఆమె హాజరుకాలేకపోయింది. ఇషాకు ‘అర్జున’ అందించిన అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ పారిస్ ఒలింపిక్స్ నుంచి ఇషా పతకంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. -
లిక్కర్ స్కాంలో కవిత.. ఎన్నికల వేళ ట్విస్ట్ ఇచ్చిన అనురాగ్ ఠాకూర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార బీఆర్ఎస్పై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేద్దామనుకుంటే.. ఆయన కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారని ఎద్దేవా చేశారు. తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాగా, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. అనంతరం.. హైదరాబాద్‌లోని కత్రియ హోటల్లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో క్రికెట్ వరల్డ్‌కప్ జరుగుతోంది. టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. తెలంగాణ ఎన్నికల సందర్భంగా నన్ను బ్యాట్స్‌మెన్‌గా ఇక్కడికి పంపించారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఎంతో దోచుకుంది. భారీగా అవినీతిలో కూరుకుపోయింది. రాజస్థాన్ సచివాలయంలో కోట్ల రూపాయలు, కిలోల కొద్దీ బంగారం దొరికింది. ఎన్నికల కోసం విదేశాల నుంచి డబ్బులను తెప్పిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది. ఎన్నికల కోసం విదేశాల నుంచి డబ్బు.. మహాదేవ్ యాప్ పేరిట కాంగ్రెస్ అవకతవకలకు పాల్పడుతోంది. మహాదేవ్ యాప్ పేరిట రూ.508 కోట్లు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్‌కు అందాయి. కాంగ్రెస్ గ్యారెంటీలు వర్క్ అవుట్ అవ్వడం లేదు. అబద్ధపు కాంగ్రెస్.. అబద్ధపు గ్యారెంటీలు. కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఎన్నికల కోసం విదేశాలు, మహాదేవ్ యాప్, కర్ణాటక నుంచి డబ్బులు తీసుకొస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ఆలస్యం చేయడం వల్లే ఎంతోమంది మరణించారు. పార్లమెంట్లో సోనియా, కాంగ్రెస్ నేతలు ఎలా వ్యవహరించారో నాకు తెలుసు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి చేస్తారని అనుకుంటే ఆయన కూడా నిరుద్యోగులను మోసం చేశారు. లిక్కర్ కేసులో అరెస్ట్ తప్పదు.. పదేళ్ల తర్వాత ఇప్పుడు పార్టీ పేరు మార్చి దేశ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. కేసీఆర్.. జాతీయ రాజకీయాలు చేద్దామనుకుంటే.. ఆయన బిడ్డ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో జాతీయ స్థాయి వార్తల్లో నిలిచారు. తెలంగాణలో అంత తిన్నా సరిపోలేదని బిడ్డను ఢిల్లీకి పంపాడు. లిక్కర్ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారు. తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరు. ప్రతీ ఒక్కరి నంబర్ వస్తుంది. అప్పుడు వాళ్లు కూడా జైలుకు పోవాల్సిందే. గొప్పలు చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది. కాళేశ్వరం బిగ్గెస్ట్ ఇంజినీరింగ్ బ్లండర్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదు.. పరివార్ సర్వీస్ కమిషన్. రాజస్థాన్‌లో గెహ్లాట్ సర్కార్ కాదు.. గెహ్ లూట్ సర్కార్. కాళేశ్వరం రూ. 80వేల కోట్ల ప్రాజెక్టు అయితే లక్ష కోట్ల కరప్షన్ జరిగిందని అంటున్నారని మంత్రి కేటీఆర్ అంటున్నారు.. అయితే, కరప్షన్ జరిగినట్లు ఒప్పుకున్నట్లే కదా. మరి ఎంత అవినీతి జరిగిందో ఆయన తన తండ్రి కేసీఆర్‌ను అడిగి చెప్పాలి. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి కాదు. కవిత పేరు ఢిల్లీ లిక్కర్ కేసులో ఉంది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రినే విడిచిపెట్టలేదు. కవితను ఎలా విడిచిపెడతాం’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ కోసమే కేఏ పాల్ పోటీచేయడం లేదా? రేవంత్‌రెడ్డి -
కేసీఆర్ ఫ్యామిలీపై కేంద్రమంత్రి అనురార్ ఠాకూర్ ఫైర్
-
పైరసీకి అడ్డుకట్ట వేస్తాం
‘‘పైరసీ కారణంగా ప్రతి ఏడాది వినోద రంగానికి రూ.20 వేల కోట్లు నష్టం వాటిల్లుతోంది. ఓ సినిమా నిర్మాణానికి పడ్డ కష్టం పైరసీ వల్ల వృథాగా పోతోంది. పైరసీని అడ్డుకోవడానికి కేంద్ర ప్రసార, సమాచార మంత్రిత్వ శాఖలో నోడల్ ఆఫీసర్స్‌ను నియమించడం జరిగింది’’ అని కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఇటీవల సినిమాటోగ్రఫీ చట్టం–1952లో సవరణలు చేసి, కొత్త బిల్లును పార్లమెంట్లో ఆమోదించిన విషయం తెలిసిందే. ఇందులో పైరసీని అరకట్టడం అనేది ఓ ప్రధానాంశం. ఈ విషయమై శుక్రవారం అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ– ‘‘ ముంబైలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కార్యాలయంలో,ప్రాంతీయ కార్యాలయాల్లో పైరసీ, డిజిటల్ పైరసీల ఫిర్యాదులను స్వీకరించేందుకు అధికారులను నియమించాం. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్న పైరేటెడ్ కంటెంట్‌పై నోడల్ ఆఫీసర్స్‌కు ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారులు 48 గంటల్లో ఆ కంటెంట్‌ను ఆ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ నుంచి తొలగించేలా చర్యలు చేపడతారు’’ అని చెప్పుకొచ్చారు. -
కేంద్ర ప్రభుత్వోద్యోగులకు 4 శాతం డీఏ
న్యూఢిల్లీ: పండుగ సీజన్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్‌ను 4 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులకు డీఏ వారి మూలవేతనంలో 46 శాతానికి చేరింది. అలాగే నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తర్వాత మీడియా సమావేశంలో వెల్లడించారు. డీఏ, డీఆర్ పెంపుతో 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతారని ఆయన తెలిపారు. వీటితో ఖజానాపై రూ.2,857 కోట్ల భారం పడనుంది. డీఏ పెంపు 2023 జూలై 1 నుంచి వర్తిస్తుంది. గత మార్చి, 2022 సెపె్టంబర్లో డీఏ, డీఆర్ 4 శాతం మేరకు పెరిగాయి. ఇక బోనస్ పెంపుతో లోకో పైలట్లు, గార్డులు, స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, పాయింట్స్ మెన్, ఇతర గ్రూప్– సి సిబ్బంది సహా 11.07 లక్షల మంది రైల్వే ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. దీని ద్వారా రైల్వేలపై రూ.1,969 కోట్ల ఆరి్ధక భారం పడనుందని ఠాకూర్ తెలిపారు. మరోవైపు చక్కెర ఎగుమతులపై నిషేధాన్ని అక్టోబర్ నెలాఖరును దాటి నిరవధికంగా కేంద్రం పొడిగించింది. భారత్ ప్రపంచంలో అతి పెద్ద చక్కెర తయారీదారు. రెండో అతి పెద్ద ఎగుమతిదారు. 2024–25 రబీ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి గోధుమలకు మద్దతు ధరను మరో రూ.150 మేర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2,125గా ఉంది. దీన్ని రూ.2,275కు పెంచినట్లుగా కేంద్రం ప్రకటించింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచి్చన తర్వాత ఈ స్థాయిలో మద్దతు ధరను పెంచడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో గోధుమలు సహా బార్లీ, ఎర్రపప్పు, శనగలు, కుసుమ, ఆవాల మద్దతు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎర్రపప్పు (మసూర్) ధర రూ.425 మేర పెంచడంతో క్వింటాల్ ధర రూ.6,425కి చేరింది. ఆవాలకు కనీస మద్దతు ధరను రూ.200 పెంచడంతో అది రూ.5,650కి చేరుకుంది. కుసుమలు క్వింటాల్ రూ.5,650గా ఉండగా, రూ.150 చొప్పున పెంచడంతో రూ.5,800లకు చేరింది. బార్లీ మద్దతు ధరను రూ.115 మేర పెంచడంతో ధర 1,735 నుంచి రూ.1,850కి చేరింది. శనగల «కనీస మద్దతు ధరను రూ.150 మేర పెంచారు. దీని ధర క్వింటాల్‌కు రూ.5,335 నుంచి రూ.5,440కి చేరింది. -
సినిమాలు... కళాకారులు సమాజంలో మార్పుకి సారథులు
‘‘జాతీయ అవార్డుల ప్రదానం భారతదేశంలోని భిన్నత్వాన్నీ, అందులో అంతర్లీనంగా ఉన్న ఏకత్వాన్నీ సూచిస్తోంది. సినిమా అనేది కేవలం వ్యాపారమో, వినోదమో కాదు... శక్తిమంతమైన మాధ్యమం. ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ఉపయోగ పడుతుంది. సమస్యల పట్ల సున్నితత్వాన్ని పెంచుతుంది. అర్థవంతమైన సినిమాలు సమాజంలోని, దేశంలోని సమస్యలను, విజయాలను ఆవిష్కరిస్తాయి. ముర్ము నుంచి పురస్కారం అందుకుంటున్న కీరవాణి సినిమాలు, కళాకారులు సమాజంలో మార్పుకు సారథులు. దేశం గురించి సమాచారం అందించడంతో పాటు ప్రజల మధ్య అనుబంధం పెరగడానికి సినిమా కారణం అవుతుంది. సమాజానికి ప్రతిబింబం, మెరుగుపరిచే మాధ్యమం సినిమాయే. ప్రతిభ ఉన్న ఈ దేశంలో సినిమాతో అనుబంధం ఉన్న ప్రతిభావంతులు ప్రపంచ స్థాయిలో కొత్త ప్రమాణాలను నెలకొల్పి, దేశ అభివృద్ధికి ముఖ్య కారణం అవుతారు’’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో మంగళవారం జరిగిన 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అవార్డులు అందించారు. 2021 సంవత్సరానికిగాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును నటి వహీదా రెహమాన్, ఉత్తమ నటుడి అవార్డును అల్లు అర్జున్ (పుష్ప), ఉత్తమ నటి అవార్డును ఆలియా భట్ (గంగూబాయి కతియావాడి), కృతీ సనన్ (మిమి) అందుకున్నారు. ఉత్తమ చిత్రం (రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ – హిందీ) అవార్డును దర్శకుడు ఆర్. మాధవన్, ఉత్తమ దర్శకుడిగా నిఖిల్ మహాజన్ (మరాఠీ ఫిల్మ్ – గోదావరి) అవార్డు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన ‘ఉప్పెన’కు దర్శకుడు బుచ్చిబాబు సన, నిర్మాత నవీన్ యెర్నేని పురస్కారాలు స్వీకరించారు. పూర్తి స్థాయి వినోదం అందించిన ఉత్తమ చిత్రం విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’కు నిర్మాత డీవీవీ దానయ్య తనయుడు దాసరి కల్యాణ్, దర్శకుడు రాజమౌళి అవార్డులు అందుకున్నారు. ఇదే చిత్రానికి ఉత్తమ బ్యాగ్రౌండ్ స్కోర్‌కి ఎంఎం కీరవాణి, నేపథ్య గాయకుడుగా ‘కొమురం భీముడో..’ పాటకు కాలభైరవ, యాక్షన్ డైరెక్షన్ కి కింగ్ సాల్మన్, కొరియోగ్రఫీకి ప్రేమ్ రక్షిత్, స్పెషల్ ఎఫెక్ట్స్‌కి వి. శ్రీనివాస మోహన్ పురస్కారాలు అందుకున్నారు. చంద్రబోస్ ఇంకా ఉత్తమ సంగీతదర్శకుడిగా ‘పుష్ప: ది రైజ్’కి దేవిశ్రీ ప్రసాద్, ‘కొండ΄పోలం’ చిత్రంలో ‘ధంధం ధం..’ పాటకు గాను ఉత్తమ రచయిత అవార్డును చంద్రబోస్, ఉత్తమ సినీ విమర్శకుడిగా పురుషోత్తమాచార్యులు (తెలుగు), ఇంకా పలు భాషలకు చెందిన కళాకారులు పురస్కారాలను స్వీకరించారు. ఈ వేదికపై వహీదా గురించి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ – ‘‘వహీదా చక్కని నటనా నైపుణ్యం, మంచి వ్యక్తిత్వంతో చిత్ర పరిశ్రమలో శిఖరాగ్రానికి చేరుకున్నారు. ఆలియా భట్ వ్యక్తిగత జీవితంలోనూ ఒక మహిళగా హుందాతనం, ఆత్మవిశ్వాసంతో తనదైన ముద్ర వేసుకున్నారు. మహిళా సాధికారత కోసం మహిళలే చొరవ తీసుకోవాలని సూచించేలా వహీదా ఉదాహరణగా నిలిచారు’’ అన్నారు. ‘‘ప్రపంచంలో మంచి కంటెంట్ హబ్‌గా భారత శక్తి సామర్థ్యాలను నిరూపించడానికి ఏవీజీసీ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్) రంగం ఉపయోగపడుతుంది’’ అన్నారు అనురాగ్ ఠాకూర్. కృతీ సనన్ సినిమా అనేది సమష్టి కృషి – వహీదా రెహమాన్ స్టాండింగ్ ఒవేషన్ మధ్య ఒకింత భావోద్వేగానికి గురవుతూ పురస్కారం అందుకున్న వహీదా రెహమాన్ మాట్లాడుతూ– ‘‘దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. నేనిక్కడ ఉన్నానంటే దానికి కారణం నేను భాగమైన ఈ అద్భుతమైన ఇండస్ట్రీ. అగ్రదర్శకులతో, నిర్మాతలతో, సాంకేతిక నిపుణులతో పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. మేకప్ ఆర్టిస్ట్స్, హెయిర్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్స్, డైలాగ్ రైటర్స్... ఇలా అందరి గురించి ప్రస్తావించాలి. ఈ అవార్డు తాలూకు ఆనందాన్ని అన్ని సినీ శాఖలవారితో పంచుకోవాలనుకుంటున్నాను. ఏ ఒక్కరో సినిమా మొత్తాన్ని రూ΄పోందించలేరు. సినిమా సమష్టి కృషి. ఇది పరిశ్రమ మొత్తానికి దక్కిన పురస్కారం’’ అన్నారు. జాతీయ స్థాయిలో అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. కమర్షియల్ సినిమా అయిన పుష్పకు అవార్డు దక్కడం మాకు నిజంగా డబుల్ అచీవ్మెంట్. – అల్లు అర్జున్ ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా తీయడం నా మొదటి లక్ష్యం. అలాంటి సినిమాలకు అవార్డులు రావడం బోనస్ లాంటిది. ముగ్గురు.. నలుగురు.. ఎంతో మంది టెక్నీషియన్లతో కలిసి చేసిన కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం... మా సినిమాకు ఆరు అవార్డులు రావడం ఆనందదాయకం. ‘ఆర్ఆర్ఆర్’ విడుదలైన తొలి రోజు ఎంతో ఉత్కంఠతో ఉన్న మాకు ప్రశంసలు రావడం మరచిపోలేని ఘటన. – దర్శకుడు రాజమౌళి ‘ఉప్పెన’ సినిమాకు జాతీయ స్థాయిలో అవార్డు రావడం హ్యాపీగా ఉంది. నిర్మాతలు నవీన్, రవి, మా గురువు సుకుమార్ వల్లే సాధ్యమైంది. వైష్ణవ్, కృతీ, విజయ్ సేతుపతి, దేవిశ్రీ ప్రసాద్‌లకు ధన్యవాదాలు. – దర్శకుడు బుచ్చిబాబు సన ‘ఆర్ఆర్ఆర్’లో పని చేయడం నాకో మంచి అవకాశం. ఇది దేవుడు ఇచ్చిన బహుమతి. రాజమౌళి నాకు గురువు. నాకింత గొప్ప అవకాశం ఇచ్చిన ఆయనకు ధన్యవాదాలు – స్టంట్ కొరియోగ్రాఫర్ కింగ్ సాల్మన్ -
త్వరలో ‘కింగ్ పిన్’ కేజ్రీవాల్ కూడా జైలుకు వెళ్తారు: అనురాగ్ ఠాకూర్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్‌ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఆప్ సర్కార్‌పై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన విమర్శలు చేశారు. ఇదే సమయంలో సీఎం కేజ్రీవాల్‌ను టార్గెట్ చేసి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. త్వరలోనే ఈ కేసులో ‘కింగ్ పిన్’(కేజ్రీవాల్) కూడా జైలులో ఉంటారని అన్నారు. అయితే, మంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కేజ్రీవాల్ నిజాయితీ సర్టిఫికెట్ ఇచ్చిన వారు జైల్లో ఉన్నారని, ఆయన కూడా త్వరలోనే జైలుకు వెళ్లారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆయన ముఖంలో టెన్షన్ కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం జైల్లో ఉన్నారు. ఆరోగ్య మంత్రి జైల్లో ఉన్నారు, ఇండియాలో అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు వచ్చిన వారే ఇప్పుడు అవినీతికి పాల్పడుతున్నారు అంటూ కౌంటరిచ్చారు. केजरीवाल पर जमकर भड़के अनुराग ठाकुर बोलें, इनके मंत्री से लेकर सांसद तक सब जेल में हैं।#anuragthakur #BJP #newliquorpolicy #SanjaySinghArrested #ManishSisodia pic.twitter.com/LAhuFaQTm3 — Chaupal Khabar (@ChaupalKhabar) October 5, 2023 లిక్కర్ స్కాం కేసులో ఇప్పటి వరకు బయట ఉన్న కేజ్రీవాల్ కూడా జైలుకు వెళ్తారు. ఆయన నెంబర్ కూడా వస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు. కానీ రెండు నెలల్లోనే అవినీతి కారణంగా రాష్ట్ర ఆరోగ్య మంత్రి పదవి నుండి వైదొలగవలసి వచ్చిందని ఠాకూర్ విమర్శించారు. ఇదిలా ఉండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టును ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. సంజయ్ సింగ్ అరెస్టు పూర్తిగా చట్టవిరుద్ధం. ఇది మోదీ భయాన్ని తెలియజేస్తోంది. ఎన్నికల వరకు ఇంకా చాలా మంది ప్రతిపక్ష నేతలను అరెస్టు చేస్తారు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం: నిందితుల జాబితాలో ఆప్! -
‘ఉజ్వల’ లబ్దిదారులకు మరో రూ.100 రాయితీ
న్యూఢిల్లీ: ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ కింద వంట గ్యాస్ సిలిండర్లపై రాయితీని మరో రూ.100 పెంచాలని కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయించింది. దీంతో ఒక్కో సిలిండర్‌పై మొత్తం రాయితీకి రూ. 300కు చేరుకుంది. ఉజ్వల యోజన కింద కేంద్ర ప్రభుత్వం పేద మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచి్చన సంగతి తెలిసిందే. ప్రతి ఏటా 12 రాయితీ సిలిండర్లు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఒక్కో సిలిండర్ (14.2 కిలోలు)పై రూ.200 చొప్పున కేంద్రం రాయితీ ఇస్తోంది. ఈ రాయితీని మరో రూ.100 పెంచినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. దీనివల్ల దేశవ్యాప్తంగా 9.6 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతాయని తెలియజేశారు. ఉజ్వల పథకం లబ్ధిదారులు ప్రస్తుతం ఒక్కో సిలిండర్ కోసం రూ.703 ఖర్చు చేస్తున్నారు. ఇకపై రూ.603 చొప్పున వెచి్చంచాల్సి ఉంటుంది. త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తాము అధికారంలోకి వస్తే రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఉజ్వల యోజన లబి్ధదారులకు సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం మరో రూ.100 పెంచడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఎన్నికల వేళ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..!
-
ఎన్నికల వేళ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఏపీ, టీఎస్ మధ్య..
సాక్షి, ఢిల్లీ: దేశంలో త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆసక్తికర నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక, బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ భేటీ అనంతరం కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి మీడియాకు కేటినెట్ నిర్ణయాలకు వెల్లడించారు. కేబినెట్ నిర్ణయాలు ఇవే.. ►ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని KWDT-2ట్రిబ్యునల్ కు కేంద్రం ఆదేశం. ప్రాజెక్ట్‌ల వారీగా నీటిని కేటాయించాలని ఆదేశం. ► ఉజ్వల గ్యాస్ సిలిండర్లపై మరో రూ.100 సబ్సిడీకి ఆమోదం. ► సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీ ఏర్పాటుకు ఆమోదం. రూ.889 కోట్లో వర్సిటీ ఏర్పాటు. ► తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు ఆమోదం. The government has raised subsidy amount for Pradhan Mantri Ujjwala Yojana beneficiaries from Rs 200 to Rs 300 per LPG cylinder: Union minister Anurag Thakur during a briefing on Cabinet decisions pic.twitter.com/Dvf7wXtXQT — ANI (@ANI) October 4, 2023 ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు సంబంధించిన మూడు అంశాలను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. పసుపు బోర్డు, ములుగులో గిరిజన యూనివర్సిటీ, కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు జరుగుతుంది. పసుపు బోర్డు కోసం రైతులు ఎన్నో ఏళ్లుగా ఆందోళన చేస్తున్నారు. జాతీయ పసుపు బోర్డు కోసం రైతులు చాలా రోజులుగా పోరాటం చేశారు. ఈరోజు జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 12 లక్షల టన్నుల పసుపు ఉత్పత్తి మన దేశంలో జరుగుతోంది అని అన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా నదీ జలాలపై పరిష్కారం చేశాం. విభజన చట్టం సెక్షన్-89కి లోబడే ఈ నిర్ణయం తీసుకున్నాం. ట్రిబ్యునల్ ప్రాజెక్ట్‌లవారీగా నీటి కేటాయింపులను చేస్తుంది. సొలిసిటర్ జనరల్ సూచనలతో కేంద్రం చర్యలు తీసుకుంది. ఉమ్మడి రాష్ట్రానికి గతంలో 800 టీఎంసీలు కేటాయించారు. 2013లో ట్రిబ్యునల్ రిపోర్టు వచ్చినా, గెజిట్ కాలేదు. 2015లో తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ వేసింది. తాజాగా నదీ జలాల అంశం పరిష్కారం కానుంది అని అన్నారు. దాదాపు 900 కోట్ల రూపాయలతో ములుగులో సమ్మక్క సారక్క సెంట్రల్ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం చేస్తాం. తెలంగాణ గిరిజనుల్లో 40 శాతం మాత్రమే అక్షరాస్యత ఉంది. గిరిజనుల బాగు కోసమే ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలపై పరిశోధన జరుగుతుంది. Government of India has notified the establishment of the National Turmeric Board. This Board will help increase awareness and consumption of turmeric and develop new markets internationally to increase exports. — ANI (@ANI) October 4, 2023 -
ముగ్గురు భారత అథ్లెట్లకు చైనా వీసా నిరాకరణ
న్యూఢిల్లీ: ఆసియా క్రీడలకు సంబంధించి అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వుషు పోటీల్లో పాల్గొనాల్సిన 11 మంది సభ్యుల భారత బృందంలో ముగ్గురికి చైనా ప్రభుత్వం వీసా నిరాకరించింది. ఈ ముగ్గురూ అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారే. అరుణాచల్‌ప్రదేశ్‌కు సంబంధించి భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వీసా నిరాకరణ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ముగ్గురు మహిళా వుషు ప్లేయర్లు నైమన్ వాంగ్సూ, ఒనిలు టెగా, మేపుంగ్ లంగులను భారత అథ్లెట్లుగా గుర్తించేందుకు చైనా నిరాకరించింది. దాంతో శుక్రవారం రాత్రి వీరు మినహా మిగిలిన ముగ్గురు ఆసియా క్రీడల కోసం చైనా బయల్దేరి వెళ్లారు. ఈ అంశంపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసియా క్రీడలకు హాజరయ్యేందుకు చైనాకు వెళ్లాల్సిన ఠాకూర్... తాజా పరిణామాలకు నిరసనగా తన పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. -
పొలిటికల్ మైలేజి కోసమే బిల్లు పెట్టారు: కపిల్ సిబాల్
న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశ్యంతో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో పార్లమెంటులో చర్చ కంటే ముందే బిల్లుపై కాంగ్రెస్ బీజేపీ నేతలు పరస్పర విమర్శలకు తెరతీశారు. దీనిపై కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ స్పందిస్తూ.. ఎన్నికలు సమీపిస్తున్నందునే బీజేపీ ఈ స్టంట్ చేసిందంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీ హయాంలో ఏంచేశారని అన్నారు. ఈసారైనా.. చాలా కాలంగా మరుగునపడిపోయిన బిల్లుకు మోక్షం కలిగిస్తూ బీజేపీ ప్రభుత్వ కేబినెట్ సోమవారమే బిల్లును ఆమోదించి మంగళవారం కొత్త పార్లమెంటు భవనంలో బిల్లును ప్రవేశపెట్టింది. గతంలో కూడా అనేక సార్లు ఈ బిల్లు తెరపైకి వచ్చినప్పటికీ బిల్లుకు మాత్రం ఆమోదం పొందలేదు. ప్రస్తుత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి సంఖ్యాబలం కూడా బాగానే ఉన్న నేపథ్యంలో ఈ బిల్లు ఈసారి గట్టెక్కే అవకాశాలు ఉన్నాయంటున్నాయి రాజకీయ వర్గాలు. కొత్త పార్లమెంట్ భవనంలో ఈ బిల్లుపై బుధవారం చర్చలు జరగనున్నాయి. ఎన్నికల వేళ.. ఇదిలా ఉండగా బిల్లుపై చర్చ జరగక ముందే పాలక ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి తెర తీశారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ బిల్లును ప్రవేశపెట్టి పొలిటికల్ మైలేజీ పొందాలని చూస్తోందంటూ కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ వ్యాఖ్యానించారు. మేము చారిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పి ప్రజలను ఓట్లు అడగాలన్నది వారి ఆలోచన అన్నారు. వారికి ఏ బిల్లుపై అంట చిత్తశుద్ధే ఉంటే బిల్లును 2014లోనే ప్రవేశ పెట్టి ఉండాల్సిందన్నారు. ఈ బిల్లుకంటే ముందే వారు జనగణన చేపట్టాల్సి ఉందని అన్నారు. మీరు చేసిందేంటి.. కపిల్ సిబాల్ వ్యాఖ్యలకు అనురాగ్ ఠాకూర్ బదులిస్తూ.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా 2008లో మొట్టమొదటిసారి ఈ బిల్లును ప్రవేశ పెట్టినప్పుడు మీరు న్యాయ శాఖ మంత్రిగా ఉన్నారు. మరి అప్పుడు మీరు చేసిందేంటి? ఆ తర్వాత ఏడాది ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ బిల్లుని ప్రవేశపెట్టినట్టు నటిస్తోందన్న విషయం మీకు కూడా తెలుసు కదా అని ప్రశ్నించారు. ఏదైతేనేం అప్పట్లో బిల్లును ఆమోదించకుండా ముసాయిదా చట్టాన్ని స్టాండింగ్ కమిటీకి పంపించారు. అసలు కాంగ్రెస్ పార్టీకి అప్పుడు, ఇప్పుడు ఈ బిల్లు పాస్ అవ్వాలన్న ఉద్దేశ్యమే లేదని అన్నారు. నేహరూ పరిపాలనలో గాని, ఇందిరా గాంధీ హయాంలో గాని, రాజీవ్ గాంధీ పాలనలో గానీ చివరికి సోనియా గాంధీ హయాంలో కూడా మహిళలకు వారు ప్రాధాన్యతనిచ్చిందే లేదని అన్నారు. ఇది కూడా చదవండి: వారిది 'జన ఆశీర్వాద యాత్ర'.. వీరిది 'జన ఆక్రోశ యాత్ర'.. -
PM Ujjwala Scheme: మరో 75 లక్షల ‘ఉజ్వల’కనెక్షన్లు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై)కింద అదనంగా 75 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.1,650 కోట్లు కేటాయించింది. దీంతోపాటు, ఈ కోర్ట్స్’ ప్రాజెక్టు మూడో దశకు అనుమతి మంజూరుచేసింది. ఇందుకు గాను రూ.7,210 కోట్లు వెచి్చంచాలని తీర్మానించింది. ఇటీవల ముగిసిన జీ20ని విజయవంతం చేసి, భారత్ ప్రతిష్టను ఇనుమడింప జేసిన ప్రధాని మోదీని ఈ సమావేశం అభినందించింది. ఈ వివరాలను భేటీ అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. కొత్తగా జారీ అయ్యే 75 లక్షల ఉజ్వల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లను 2023–24 నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరం వరకు అందజేస్తామని తెలిపారు. వీటితో కలిపి ఉజ్వల లబి్ధదారుల సంఖ్య 10.35 కోట్లకు చేరుకుంటుందన్నారు. దిగువ కోర్టుల్లో రికార్డుల డిజిటైజేషన్, క్లౌడ్ స్టోరేజీ, వర్చువల్ కోర్టుల ఏర్పాటు తదితరాల కోసం నాలుగేళ్లపాటు అమలయ్యే ఈకోర్ట్స్ ప్రాజెక్టు ఫేజ్–3కి రూ.7,210 కోట్లు కేటాయించేందుకు కూడా కేబినెట్ అంగీకరించిందని ఠాకూర్ చెప్పారు. ఇందులో భాగంగా 3,108 కోట్ల డాక్యుమెంట్లు డిజిటల్ రూపంలోకి మారుతాయని అంచనా. -
ప్రజలకు మంచి చేయడానికి ముందుకు రారు: అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ: సెప్టెంబర్ 18-22 వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు కోసం కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఎగిరి గంతేయాల్సింది పోయి ప్రతిపక్షాలన్నీ అనవసర విమర్శలు చేస్తున్నాయని.. ఒకేసారి అసెంబ్లీ స్థానాలకు, పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే బోలెడంత డబ్బును, సమయాన్ని ఆదా చేసుకోవచ్చు కదా అని సమాచార, ప్రచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. మా ప్రభుత్వం ఎప్పటినుంచో ఒకే దేశం ఒకే ఎన్నికలు గురించి చెబుతూనే ఉంది. మా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా దీన్ని ఆమోదించారు. ఇదే క్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒకకమిటీని కూడా వేశాము. ప్రతిపక్షాల అభిప్రాయాలను కూడా పరిగణన తీసుకోవాలన్న ఉదేశ్యంతో కమిటీలో వారికి కూడా స్థానం కల్పించాం. కానీ అధిర్ రంజాన్ చౌదరి ఈ కమిటీ నుంచి తప్పుకున్నారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో కూడా దీనిపై చర్చ ఉంటుంది. దీనికి కమిటీ సభ్యులు కూడా హాజరవుతారని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే విషయంలో మాట్లాడటానికి వారు ఎప్పుడూ ముందుకు రారు. విలువైన పార్లమెంట్ సమీవేశాల సమయాన్ని వృధా చేయడమే వారికున్న ఏకైక లక్ష్యం. మీరే చూశారు మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో వారు సమయాన్ని ఎలా వృధా చేశారో. అంతెందుకు గతంలో ఒకే దేశం.. ఒకే పన్ను విధానాన్ని తెరపైకి తీసుకొస్తూ జీఎస్టీ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినప్పుడు కూడా వారు ఇదే విధంగా గొడవ చేశారు. కానీ ఈరోజు ఒకే పన్ను విధానం వలన రూ.90,000 వచ్చే చోట రూ.1,60,000 ప్రభుత్వానికి ఆదాయం వస్తోందని అన్నారు. అదే విధంగా ఒకే దేశంలో ఒకే ఎన్నికల నిర్వహిస్తే మరింత డబ్బు ఆదా చేయవచ్చని.. బోలెడంత సమయం కలిసొస్తుందని అన్నారు. ఆ డబ్బును ప్రజల సంక్షేమానికి వినియోగించవచ్చని అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయకుండా సమాలోచన చేయాలని కోరుతున్నానన్నారు. ఇది కూడా చదవండి: చూస్తూ ఉండండి..సనాతన ధర్మమే గెలుస్తుంది : అమిత్ షా -
LPG Price Cut: మహిళలకు రూ. వేల కోట్ల రక్షాబంధన్ గిఫ్ట్
LPG price by Rs 400/cylinder బీజేపీ సర్కార్ హయాంలో ఇటీవలి కాలంలో వంట గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరిగి సామాన్యుడికి పెనుభారంగా మారడంతో బీజేపీ సర్కార్ తీవ్ర విమర్శల పాలైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్ల ధరను రూ. 200 తగ్గించింది. అలాగే పిఎం ఉజ్వల పథకం లబ్ధిదారులకు అదనంగా రూ.200 లభించనుంది. దీంతో PMUY ఖాతాదారులకందే సబ్సిడీ రూ.400 అయ్యింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ మహిళలకు అందించిన రక్షాబంధన కానుక అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియా సమావేశంలో వెల్లడించారు ఎల్పిజి సీలిండర్ ధర తగ్గింపు రాబోయే ఎన్నికలకు సంబంధించినదేనా అన్నదానిపై స్పందించిన ఠాకూర్ అలా అనుకుంటే ముందే తగ్గించే వాళ్లం అంటూ ఈ వాదనను తోసిపుచ్చారు. ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నా ప్రజల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సౌదీ CP (కాంట్రాక్ట్ ధరలు) ధరలను పరిశీలిస్తే, ఏప్రిల్ 2022 నుండి 303 శాతం పెరిగింది. కానీ తాము మాత్రం 63 శాతం మాత్రమే పెంచి కొంత ఉపశమనం కలిగించామంటూ వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజా తగ్గింపు నిర్ణయానికి ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కోట్లాది వినియోగదారుల ప్రయోజనం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే ఉజ్వల పథకం కింద 7.5 మిలియన్ కొత్త గ్యాస్ కనెక్షన్లకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి వెల్లడించారు. తాజా నిర్ణయంతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.6,100 కోట్లు కేటాయించామని, 2023-24 సంవత్సరానికి ఆర్థిక ప్రభావం రూ. 7,680 కోట్లుగా అంచనా వేశామన్నారు. కాగా ప్రస్తుతం న్యూఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ రూ. 1,103గా ఉంది. చివరిసారిగా ఈ ఏడాది మార్చి 1న సిలిండర్‌కు రూ. 50 పెరిగిన సంగతి తెలిసిందే. "Government has decided Rs 200 reduction in the price of domestic LPG cylinders for all LPG consumers" -Union Minister @ianuragthakur#CabinetDecisions #LPGcylinder pic.twitter.com/sfwTyxUlsN — PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) August 29, 2023 ఇప్పటివరకు దేశంలోని ప్రధాన నగరాల్లో 14.2 కేజీల వంట గ్యాస్ ధరలు హైదరాబాద్ రూ. 1,155.00 ముంబై రూ. 1,102.50 గుర్గావ్ రూ. 1,111.50 బెంగళూరు రూ. 1,105.50 చండీగడ్ రూ. 1,112.50 జైపూర్ రూ. 1,106.50 పాట్నా రూ. 1,201.00 కోలకత్తా రూ. 1,129.00 చెన్నై రూ. 1,118.50 నోయిడా రూ. 1,100.50 భువనేశ్వర్ రూ. 1,129.00 లక్నో రూ. 1,140.50 త్రివేండ్రం రూ. 1,112.00 -
రాహుల్ గాంధీకి మతి తప్పినట్లుంది.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రసంగం సమయంలో తను ప్రస్తావించిన ‘భరత మాత’మాటను తొలగించారంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. రాహుల్ గాంధీ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఆయన మతి తప్పినట్లుగా అనిపిస్తోందని జోషి వ్యాఖ్యానించారు. అన్ పార్లమెంటరీ మాటలను తొలగించామేతప్ప, భరతమాత అనే మాటను కాదని చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. మణిపూర్‌పై మేము(కేంద్రం) చర్చకు అంగీకరిస్తామని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు కలలో కూడా అనుకోని ఉండరు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పినట్లుగా, ఈ అంశంపై మనం సున్నితంగా వ్యవహరించాలి. ఈ రోజు రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు వింటుంటే ఆయన తన మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయారని అనిపిస్తోంది. రాహుల్ గాంధీ సభకు రాలేదు. మా సమాధానం వినలేదు.గ్రాండ్ ఓల్డ్ అని పిలవబడే పార్టీ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం చాలా దురదృష్టకరం’ అనిపేర్కొన్నారు. మరో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ..ఏదో హడావుడి చేయాలన్న రాహుల్ గాంధీ ప్రయత్నం మరోసారి ఫెయిల్, ఫ్లాప్ అయ్యిందంటూ ఎద్దేవా చేశారు. ‘రాహుల్ తప్పుడు భాషను వాడుతున్నారు. భరత మాత బిడ్డ ఎవరూ కూడా ఆమె హత్య గురించి మాట్లాడరు, ఆలోచించరు. దేశానికి అప్రతిష్ట తెచ్చేందుకే ఇలా మాట్లాడుతున్నారన్న విషయం రాహుల్ వాడిన భాషను చూస్తే స్పష్టంగా తెలుస్తుంది’అని ఆరోపించారు. చదవండి: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కవిత కరచాలనం #WATCH | Parliamentary Affairs Minister Pralhad Joshi says, "Congress & other opposition parties never thought that we would agree for a discussion on Manipur...Like PM Narendra Modi & Union Home Minister Amit Shah said we should be sensitive about the issue. Today, as well what… pic.twitter.com/SqhHrJkHge— ANI (@ANI) August 11, 2023 -
క్రీడల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులు
సాక్షి, న్యూఢిల్లీ: కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద పబ్లిక్, ప్రైవేట్ రంగాలకు చెందిన పలు సంస్థలు, వ్యక్తుల నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.34.35 కోట్లు నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ (ఎన్ఎస్డీఎఫ్)కు సమకూరినట్లు క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి గురువారం లిఖితపూర్వక సమాధానమిస్తూ.. క్రీడాకారులు, క్రీడాసంస్థలను ప్రోత్సహించేందుకు మంత్రిత్వ శాఖ ఏటా అందించే నిధులకు అదనంగా సీఎస్ఆర్ కింద కూడా ఎన్ఎస్డీఎఫ్కు నిధులు సమకూరుస్తున్నట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో సీఎస్ఆర్ ద్వారా రూ.43.88 కోట్లు సమకూర్చినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా క్రీడాకారులు, క్రీడా విభాగాల అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని మంత్రి చెప్పారు. ఈ–శ్రమ్‌లో ఏపీ నుంచి 80 లక్షల మంది అసంఘటిత కార్మికులు అసంఘటిత కార్మికుల వివరాలతో సమగ్రమైన జాతీయ డేటాబేస్ రూపొందించే లక్ష్యంతో కేంద్రం ప్రవేశపెట్టిన ఈ–శ్రమ్ పోర్టల్‌లో ఈ నెల 3వ తేదీకి ఆంధ్రప్రదేశ్ నుంచి 80,03,442 మంది పేర్లు, వివరాలను నమోదు చేసుకున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిస్తూ.. దేశవ్యాప్తంగా28,99,63,420 మంది అసంఘటిత కార్మికులు ఈ–శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారని చెప్పారు. పీఎం10 తగ్గింపు లక్ష్యం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్సీఏపీ)లో భాగంగా ఏపీలో నగరాలకు వార్షిక పర్టిక్యులేట్ మీటర్ (పీఎం10) తగ్గింపు లక్ష్యం విధించినట్లు కేంద్ర పర్యావరణశాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్చౌబే తెలిపారు. అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం నగరాలను ఎన్సీఏపీలో చేర్చామని, వాటికి 2022–23, 2023–24ల్లో నిధులు కేటాయించామని వైఎస్సార్సీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. -
సినీ కార్మి కుల కష్టాన్ని గుర్తించాలి
సాక్షి, న్యూఢిల్లీ: సినీ కార్మికుల కష్టాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కథానాయకులు రూ.కోట్లలో పారితోషికాలు అందుకుంటున్నారని, కార్మి కుల వేతనాలు మాత్రం అంతంతగానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సినీ కార్మికుల కష్టానికి తగ్గ ఫలం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సినిమాటోగ్రఫీ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు విజ్ఞప్తి చేశారు. గురువారం రాజ్యసభలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు, 2023పై ఆయన మాట్లాడారు. భారతీయ చలనచిత్ర రంగంలో వివిధ విభాగాల్లో రెండు లక్షల మందికిపైగా కార్మి కులు పనిచేస్తున్నారని తెలిపారు. చిత్ర నిర్మాణ వ్యయంలో మూడోవంతు పైగా భాగం కథానాయకుల పారితోషికాలకే సరిపోగా.. మిగిలిన మొత్తంతో చిత్రనిర్మాణం పూర్తి చేయాల్సి వస్తోందన్నారు. సెన్సార్ బోర్డ్ సరి్టఫికెట్ పొందిన చిత్ర నిర్మాత లేదా దర్శకుడిపై ఎలాంటి క్రిమినల్ కేసులు దాఖలు కాకుండా నిరోధించేలా సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణ చేయాలని కోరారు. రైల్వే అప్రెంటీస్లకు న్యాయం చేయండి నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (ఎన్సీవీటీ) చేసిన తప్పిదం కారణంగా వందలాది కోర్సు కంప్లీటెడ్ అప్రెంటిస్ అభ్యర్థులకు రైల్వే నియామకాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని విజయసాయిరెడ్డి తెలిపారు. ఎన్సీవీటీ పరీక్షకు హాజరు కాలేదన్న సాకుతో వారి నియామకాన్ని రైల్వే పెండింగ్‌లో పెట్టిందన్నారు. మానవతా దృక్పథంతో ఆ అభ్యర్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పైరసీ సైట్ల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలి:ఎంపీ నిరంజన్‌రెడ్డి విచ్చలవిడిగా పెరిగిపోతున్న పైరసీ సైట్ల నియంత్రణకు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. పటిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి భారతీయ సినిమా ఆర్థికంగా నష్టపోకుండా చూడాలన్నారు. పైరసీ సైట్లు సుమారు రూ.20 వేల కోట్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయన్నారు. గురువారం రాజ్యసభలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. ఆయా సైట్లను బ్లాక్‌చేయడం ద్వారా భారతీయ సినిమాను రక్షించొచ్చన్నారు -
808 ఎఫ్ఎం రేడియో స్టేషన్లకు త్వరలో ఈ వేలం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 284 నగరాల్లో 808 ఎఫ్ఎం రేడియో స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం త్వరలోనే ఈ వేలం నిర్వహించనుందని కేంద్ర సమాచార ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలోని 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 113 నగరాల్లో 388 ఎఫ్ఎం స్టేషన్లు నడుస్తున్నాయని చెప్పారు. కవరేజీ పెంచేందుకు గాను మారుమూల ప్రాంతాల్లోనూ రేడియో టవర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కమ్యూనిటీ రేడియోలు సహా రేడియో స్టేషన్లకు లైసెన్స్ జారీ ప్రక్రియను సులభతరం చేశామన్నారు. టయర్–2, 3 నగరాల్లోనూ విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఆలిండియా రేడియో ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల ద్వారా దేశంలోని భౌగోళిక ప్రాంతాన్ని 59 శాతం నుంచి 66 శాతానికి, జనాభాలో 68 నుంచి 80 శాతం మందికి సేవలందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. మారుమూల, గిరిజన, వామపక్ష తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాల్లోని వారికి ఉచితంగా 8 లక్షల డీడీ ఫ్రీ డిష్ సెట్ టాప్ బాక్సులను అందజేయనున్నామని తెలిపారు. -
ఓటీటీలో అలాంటివి అనుమతించం: కేంద్రం
ఢిల్లీ: సెన్సార్ కట్టింగుల బాధలేని ‘ఓటీటీ కంటెంట్’ విషయంలో కేంద్రం మరోసారి సీరియస్‌గా స్పందించింది. భారత సమాజాన్ని.. మత సంప్రదాయాలను కించపరిచేలా ఉన్న కంటెంట్‌ను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌కు సీరియస్‌గానే వార్నింగ్ ఇచ్చింది. ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ ప్రతినిధితులతో మంగళవారం కేంద్ర సమాచార & ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఢిల్లీలో భేటీ అయ్యారు. సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో భారతీయ సంస్కృతిని, సమాజాన్ని కించపరిచేలా ఉండే కంటెంట్‌ను ప్రభుత్వం అనుమతించబోదని వాళ్లకు స్పష్టం చేశారాయన. పాశ్చాత్య ప్రభావం, మన మతాలు.. సంప్రదాయాలను తప్పుగా స్మార్ట్ తెరపై చూపించే విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారాయన. ఇలాంటి వ్యవహారాలకు శిక్షలు కఠినంగా ఉండాలనే తాము యోచిస్తున్నట్లు తెలిపారాయన. దుర్మార్గపు ప్రచారంతో పాటు సైద్ధాంతిక పక్షపాతాల సాధనంగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించవద్దని మంత్రి ఈ సందర్భంగా ఓటీటీ ప్రతినిధులకు సూచించారు. ఓటీటీ ఉల్లంఘనలకు శిక్షాస్పద నిబంధనలను ఏర్పాటు చేయడం, ఇప్పటికే ఉన్న ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని బలోపేతం చేయడం, మరియు డిజిటల్ పైరసీని ఎదుర్కోవడంపై కూడా ఈ భేటీలో చర్చించారు. వీలైనంత త్వరగా సంబంధిత ప్రతిపాదనలతో తిరిగి కేంద్రం ముందుకు రావాలని వాళ్లను ఆయన కోరినట్లు తెలుస్తోంది. అయితే.. ఓటీటీకి సెన్సార్ ఉండాలనే అంశం గురించి మీడియా నుంచి మంత్రికి ప్రశ్న తలెత్తగా.. పరిశీలిస్తామంటూ ఆయన దాటవేత ధోరణి ప్రదర్శించారు. ఇదీ చదవండి: కళ్ల ముందు కనిపిస్తున్నా.. కలిసి ఉండేది కష్టమేనా? -
చెరకు ధర క్వింటాల్‌కు రూ.315
న్యూఢిల్లీ: చెరకు పంటకు ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్(ఎఫ్ఆర్పీ)ను క్వింటాల్‌కు రూ.10 చొప్పున పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. దీంతో ఈ ఏడాది అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే 2023–24 సీజన్లో సంవత్సరంలో క్వింటాల్ చెరకు ధర రూ.315కు పెరిగింది. చక్కెర మిల్లులు రైతులకు క్వింటాల్‌కు కనీసం రూ.315 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర కేబినెట్ సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగింది. ఎఫ్ఆర్పీని పెంచుతూ ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. 2022–23లో క్వింటాల్ చెరుకు ఎఫ్ఆర్పీ రూ.305 ఉండగా, ఈసారి రూ.315 కానుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. వ్యవసాయం, అన్నదాతల సంక్షేమానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. రైతన్నలకు మన ప్రధానమంత్రి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్(సీఏసీపీ) సిఫార్సుల ఆధారంగా చెరుకు ఎఫ్ఆర్పీని ఖరారు చేస్తుంటారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకుంటారు. 2014–15 సీజన్లో చెరకు ఎఫ్ఆర్పీ క్వింటాల్‌కు రూ.210 ఉండేది. 2013–14లో చక్కెర మిల్లులు రూ.57,104 కోట్ల విలువైన చెరకు పంటను కొనుగోలు చేశాయి. 2022–23లో రూ.1,11,366 కోట్ల విలువైన 3,353 లక్షల టన్నుల చెరకును సేకరించాయి. ఇండియాలో దాదాపు 5 కోట్ల మంది రైతులు చెరుకు సాగు చేస్తున్నారు. చక్కెర మిల్లుల్లో దాదాపు 5 లక్షల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు! దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పరిశోధనలకు మరింత ఊతం ఇవ్వడమే లక్ష్యంగా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్(ఎన్ఆర్ఎఫ్) ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై కేంద్ర మంత్రివర్గం ఆమోదం ముద్రవేసింది. ప్రధాని మోదీ అధ్యక్షత బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం వెల్లడించారు. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లు–2023ను త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టునున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ‘సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు చట్టం–2008’ స్థానంలో ఈ బిల్లును తీసుకొన్నట్లు వివరించారు. 2027–28 దాకా పరిశోధనల కోసం రూ.50,000 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇందులో రూ.14,000 కోట్లను వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వమే ప్రత్యక్షంగా ఖర్చు చేస్తుందన్నారు. మిగతా రూ.36,000 కోట్లను ప్రైవేట్ రంగ సంస్థలు, అంతర్జాతీయ పరిశోధక సంస్థల నుంచి సేకరిస్తామన్నారు. ఎన్ఆర్ఎఫ్ పాలక మండలికి ప్రధానమంత్రి నేతృత్వం వహిస్తారని, ఇందులో 15 నుంచి 25 మంది నిపుణులు, పరిశోధకులు సభ్యులుగా ఉంటారని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారు నేతృత్వంలో కార్యనిర్వాహక మండలి సైతం పని చేస్తుందన్నారు. ‘పీఎం–ప్రణామ్’కు ఆమోదం ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని పెంచడం, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన ‘పీఎం–ప్రణామ్’ కొత్త పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే యూరియా సబ్సిడీ పథకాన్ని మరో మూడేళ్లపాటు కొనసాగించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.3.68 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది. సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి రూ.1,451 కోట్ల రాయితీ ఇచ్చేందుకు ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అలాగే దేశంలో సల్ఫర్–కోటెడ్ యూరియా(యూరియా గోల్డ్)ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. నేలలో సల్ఫర్ లోపాన్ని సరిచేయడానికి ఈ యూరియా తోడ్పడుతుంది. నేల సారాన్ని కాపాడుకోవడమే ‘పీఎం–ప్రణామ్’ లక్ష్యమని కేంద్రం వెల్లడించింది. -
రాతపూర్వక హామీ.. ఓ మెట్టుదిగిన రెజ్లర్లు
సాక్షి, ఢిల్లీ: రెజ్లర్ల నిరసనలో.. కేంద్రంతో రెజ్లర్ల చర్చల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను ఎలాగైనా ఆ సీటు నుంచి దించే ఉద్దేశంతో నిరసనలు కొనసాగిస్తున్న రెజ్లర్లు.. కేంద్రం నుంచి లభించిన హామీతో ఓ మెట్టు దిగారు. జూన్ 15వ తేదీ దాకా ఆందోళనలను చేపట్టబోమని, అప్పటివరకు తమ నిరసన ప్రదర్శనలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కేంద్రం నుంచి రాతపూర్వక హామీ లభించినందువల్లే తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు బజరంగ్ పూనియా మీడియాకు వెల్లడించారు. బుధవారం కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో ఐదు గంటల పాటు రెజ్లర్లు భేటీ అయ్యారు. బ్రిజ్‌పై వచ్చిన ఆరోపణలపై జూన్ 15వ తేదీలోపు విచారణ పూర్తి చేయిస్తామని ఈ సందర్భంగా ఆయన రెజ్లర్లకు స్పష్టమైన రాతపూర్వక హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బజరంగ్ పూనియా బయటకు వచ్చాక మీడియాకు తెలిపాడు. మంత్రి చెప్పిన తేదీ వరకు నిరసనలను ఆపేస్తామని, అప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించకపోతే మాత్రం నిరసనలను ఉదృతం చేస్తామని పూనియా మీడియా ద్వారా తెలిపాడు. అలాగే కేంద్రంతో రెజ్లర్లు ఓ ఒప్పందానికి వచ్చారని, మైనర్ బాధితురాలు కూడా తన ఫిర్యాదును వెనక్కి తీసుకుందంటూ వస్తున్న కథనాలను పూనియా తోసిపుచ్చాడు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామే తప్ప.. వెనక్కి తగ్గబోమని ప్రకటించాడు. మరోవైపు రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికలను స్వతంత్రగా నిర్వహించాలని, బ్రిజ్ కుటుంబ సభ్యులెవరూ అందులో పాల్గొనకుండా చూడాలని కేంద్రాన్ని రెజ్లర్లు కోరినట్లు తెలుస్తోంది. వీటితో పాటు తమపై పెట్టిన కేసులను సైతం వెనక్కి తీసుకోవాలని మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను వాళ్లు కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మహిళా రెజ్లర్ల భద్రతను ప్రధానాంశంగా పరిగణిస్తామని, అలాగే.. వాళ్లపై ఎఫ్ఐఆర్లను వెనక్కి తీసుకుంటామని మంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం చర్చల సారాంశాన్ని మీడియాకు తెలిపారు. అయితే.. బ్రిజ్ అరెస్ట్‌పై మాత్రం ఇరువర్గాలు స్పందించకపోవడం గమనార్హం. ఇక ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఒక మైనర్‌తో పాటు ఆరుగురు రెజ్లర్ల ఫిర్యాదులు కూడా అక్కడే నమోదుకాగా.. ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజా పరిణామాలతో జూన్ 15వ తేదీలోపు ఆ దర్యాప్తు పూర్తి చేసి.. నివేదిక సమర్పించాలని కేంద్రం, ఢిల్లీ పోలీసులపై ఒత్తిడి తెచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. -
రెజ్లర్ల నిరసనపై నోరు విప్పిన కేంద్ర మంత్రి.. ఏమన్నారంటే!
ఢిల్లీ: భారత రెజ్లర్లకు న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నారు.. కానీ న్యాయ ప్రక్రియ తర్వాతే అది జరుగుతుందని కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగికంగా వేధించారని రెజ్లర్లు ఆందోళన చేపట్టి నెలదాటింది. పతకాలను గంగా నదిలో కలిపేస్తామని రెజ్లర్లు బెదిరించిన కొన్ని రోజుల తర్వాత అనురాగ్ ఠాకూర్ ఇలా స్పందించారు. 'ప్రభుత్వం నిష్పక్షపాత దర్యాప్తును ఆమోదిస్తుంది. బాధితులకు న్యాయం జరగాలని మనమందరం కోరుకుంటున్నాము. అయితే.. అది సరైన ప్రక్రియ ద్వారా జరుగుతుంది. పక్షపాతానికి అవకాశమే లేదు. నిందితుడు ఎంపీ అయినందున కొంత ఆలస్యమవుతుంది.' అని ఠాకూర్ అన్నారు. దర్యాప్తు వేగంగా జరగాలని అందరం కోరుకుంటున్నామన్నారు. రెజ్లర్ల ప్రతి డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించిందని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. బ్రిజ్ భూషణ్ సింగ్‌పై దర్యాప్తు చేయడానికి ఒక ప్యానెల్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 'రెజ్లర్ అయినా మహిళ అయినా.. ఏదైనా అఘాయిత్యం జరిగితే బాధితులకు సత్వర న్యాయం జరగాలి' అని ఆయన పేర్కొన్నారు. ఇదీ చదవండి:రెజ్లర్ల అంశంపై రైతు నాయకుల మధ్య వాగ్వాదం..అరుస్తూ..ఒకరికొకరు వేళ్లు చూపుతూ.. -
Wrestlers Protest: విచారణ ముగిసే వరకు వేచి ఉండండి!
నెలల తరబడి రెజ్లర్లంతా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేయడమే గాక తమ పతకాలను గంగా నదిలో విసిరేస్తామని హెచ్చరించారు కూడా. ఐనా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై నోరు మెదపలేదు. అలాంటిది తొలిసారిగా ఆ విషయమైన సాక్షాత్తు కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడటం విశేషం. రెజ్లర్లు రోజుకో డిమాండ్‌తో వస్తున్నారని ఆరోపణలు చేశారు. క్రీడను, క్రీడాకారులను బాధించే ఎటువంటి చర్య తీసుకోవద్దని పునరుద్ఘాటించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ..రెజ్లర్ల నిరసన చేసిన ప్రాంతానికి రాజకీయ నాయకులంతా పెద్ద ఎత్తున తరలివచ్చారని మండిపడ్డారు. అయినా ఇది రాజకీయాలు చేయడానికి వేదిక కాదని రెజ్లర్లే చెప్పారు కానీ వారంతా వచ్చారు. ఐనా తాను దీని గురించి పెద్దగా వ్యాఖ్యానించనన్నారు. ఢిల్లీ పోలీసుల దర్యాప్తు ముగిసే వరకు వేచి ఉండమని మాత్రమే అథ్లెట్లను కోరుతున్నా. ఢిల్లీ పోలీసులు సుప్రీం కోర్టుకు తెలియజేసేలా ఎఫ్ఆర్ దాఖలు చేశారు దర్యాప్తు వరకు పూర్తి అయ్యింది. దయచేసి క్రీడకు, ఆటగాళ్లకు హాని కలిగించే ఏ చర్య తీసుకోవద్దని విజ్ఞప్తిచేశారు. అలాగే ఈ సమస్యపై విచారకు కమిటీ వేయాలన్న రెజ్లర్ల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించింది. వారు నిరసన వ్యక్తం చేస్తున్న ఫెడరేషన్ చీఫ్‌ని కూడా తొలగించారు. అంతేగాదు క్రీడాకారుల శిక్షణ, క్రీడా మౌలిక వసతుల మెరుగుదలకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించింది. ఇప్పుడు కూడా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ ఆదేశాల మేరకు పనిచేస్తోంది అని అనురాగ్ ఠాకూర్ చెప్పుకొచ్చారు. ఆదివారం కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ టైంలో నిరసనకు యత్నించిన రెజ్లర్లపై పోలీసుల చర్యకు సంబంధించిన దృశ్యాలు యావత్తు దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేశాయి. ఆ తదనందర ఈ అంశంపై మొట్టమొదటిసారగా ప్రభుత్వం వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదిలా ఉండగా, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తనపై వచ్చిన ఆరోపణలు రుజువైతే ఎలాంటి శిక్షను స్వీకరించడానికైనా సిద్ధమేనని అన్నారు. ఒక్క ఆరోపణ రుజువైనా ఉరి వేసుకుంటానని చెప్పారు. రెజ్లర్లను ఉద్దేశిస్తూ.. మీ వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టుకి సమర్పించండి అని సవాలు కూడా విసిరారు సదరు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్. (చదవండి: కొందరు నేతలు ఆ వ్యాధితో బాధపడుతున్నారు.. ప్రధాని మోదీ కూడా!: రాహుల్) -
అతనికి ఎదురు నిలబడటం కష్టం! కేంద్ర క్రీడా మంత్రిపై ఆరోపణలు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా భారత్ రెజ్లర్లు జంతర్‌మంతర్ వద్ద నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు భారత ఏస్ రెజ్లర్ వినేష్ ఫోగట్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న శక్తిమంతమైన వ్యక్తికి చాలా కాలం పాటు వ్యతిరేకంగా నిలబడటం చాలా కష్టం అన్నారు. తాము నిరసన ప్రారంభించడానికి మూడు, నాలుగు నెలల ముందు ఆ అధికారిని కలిశామని చెప్పారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మహిళా అథ్లెట్లు లైంగిక వేధింపులకు గురవుతున్నారని, ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆవేదనకు గురవుతున్నామని ఆ అధికారికి వివరించి చెప్పామన్నారు. ఆ తర్వాత తాము నిరసనకు దిగిమని వెల్లడించింది వినేష్. ఈనేపథ్యంలోనే కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాగూర్‌పై ఫోగట్ సంచలన వ్యాఖ్యలు చేశారు వినేష్. కమిటీ వేసి విషయాన్ని అణిచివేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు. మేము ఆయనతో మాట్లాడాకే నిరసనకు దిగినట్లు చెప్పారు. ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఇదిలా ఉండగా రెజ్లర్ బజరంగ్ పునియా ఒలింపిక్స్ ఎంపికకు సంబంధించిన కొత్త నిబంధన విషయమై నిసనలు చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఒలింపిక్స్ గురించి కాదని తాము లైంగిక వేధింపులకు వ్యతిరేకంగానే నిరసన చేస్తున్నామని అన్నారు. ఇదిలా ఉండగా, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మాత్రం తాను రాజీనామా చేస్తే ఆరోపణలను అంగీకరించినట్లువుతుందన్నారు. అందుకు స్పందించిన వినేష్ ఫోగట్ తమకు కావాల్సింది న్యాయం అన్నారు. అతేగాదు మా మన్ కీ బాత్ వినండి మోదీ అని వినేష్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆఖరికి స్మృతి ఇరానీ కూడా మా గోడు వినడం లేదని ఆవేదనగా చెప్పారు. కాగా, ఇప్పటికే ఈ విషయమై బ్రిజ్ భూషణ్‌పై రెండు కేసులు నమోదు చేశారు పోలీసులు. (చదవండి: "న్యాయం మీ అంగీకారం కోసం వేచి ఉంది!": ప్రియాంక గాంధీ) -
ప్రజల గొంతు నొక్కేయగలరా?
న్యూఢిల్లీ: భారతదేశంలో ఉన్నంత భావ ప్రకటన స్వేచ్ఛ ప్రపంచంలో ఇంకెక్కడా లేదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు. దేశంలో బీజేపీ పాలనలో ప్రజల గొంతు నొక్కేస్తున్నారంటూ కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఇటీవల ఓ పత్రిక వ్యాసంలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అవి తనకు బాధ కలిగించాయన్నారు. ప్రజల గొంతును ఎవరూ నొక్కేయలేరని చెప్పారు. బుధవారం ‘మన్‌కీ బాత్ 100 జాతీయ సదస్సు’ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినెలా నిర్వహించే ఈ రేడియో కార్యక్రమం దేశానికి ఒక ఆశాదీపమన్నారు. దీనిద్వారా రాజకీయాలకు అతీతంగా మోదీ దేశానికి సందేశమిస్తున్నారని ప్రశంసించారు. కొందరు నాయకులు విదేశాలకు వెళ్లి, మన దేశాన్ని తూలనాడుతున్నారని మండిపడ్డారు. మోదీ హయాంలో ఎంతో అభివృద్ధి జరుగుతోందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. మన్ కీ బాత్ 100 కాఫీ టేబుల్ బుక్ తదితరాలను ధన్‌ఖడ్ విడుదల చేశారు. ముఖ్యమైన భావప్రసారం: ఆమిర్ ఖాన్ మన్ కీ బాత్ చాలా ముఖ్యమైన భావప్రసార కార్యక్రమమని బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ప్రశంసించారు. మన్ కీ బాత్ ద్వారా మోదీ దేశ ప్రజలతో అనుసంధానం అవుతున్నారని తెలిపారు. అత్యంత కీలకమైన అంశాలపై చర్చిస్తున్నారని, తన ఆలోచనలు పంచుకుంటూ చక్కటి సలహాలు, సూచనలు ఇస్తున్నారని అమీర్ ఖాన్ ప్రశంసించారు. -
రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్‌పై లైంగిక ఆరోపణలు.. రోడ్డెక్కిన రెజ్లర్లు
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్, వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ మళ్లీ ధర్నాకు దిగారు. మేరీకోమ్ కమిటీ నివేదిక బహిర్గతం చేయాలని, లైంగిక వేధింపులకు గురైన మహిళా రెజ్లర్లకు న్యాయం చేయాలని ‘జంతర్ మంతర్’ వద్ద చేపట్టిన ధర్నాలో డిమాండ్ చేశారు. మాజీ భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ రెజ్లర్లపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ గత జనవరిలో రెజ్లర్లు కొన్ని రోజులపాటు ధర్నాకు దిగారు. కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ వారితో చర్చలు జరిపి మేరీకోమ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీతో విచారణ జరిపింది. ఇటీవల కమిటీ నివేదిక క్రీడాశాఖకు సమర్పించినా దీన్ని బహిర్గతం చేయకపోవడం, చర్యలు తీసుకోకపోవడంతో రెజ్లర్లు మళ్లీ రోడ్డెక్కారు. -
కాంగ్రెస్ కుట్రలో రాహుల్ గాంధీ బాధితుడా? కేంద్ర మంత్రి సెటైర్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనర్హత వేటు విషయమై విపక్షాలన్ని ఏకమై వ్యతిరేకిస్తూ..నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఠాకూర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..పరువు నష్టం కేసులో రాహుల్‌ని అనర్హుడిగా ప్రకటించినప్పుడూ కాంగ్రెస్‌కి చెందిన ప్రముఖ న్యాయవాది ఎవరూ ఎందుకు సహాయం చేసేందుకు ముందుక రావడం లేదని ప్రశ్నించారు. గాందీని వదులుగా ఉండే ఫిరంగిలాంటి వారిని, నేరస్తుడని విమర్శించారు. రాహుల్‌పై వివిధ కోర్టలలో దాదాపు ఏడు పరువు నష్టం కేసులు ఉన్నాయన్నారు. అలాగే ఆయనపై అనర్హత వేటు పడటంలో ప్రభుత్వం ప్రమేయం గానీ, లోక్ సభ సచివాలయ పాత్ర గానీ లేదని తేల్చి చెప్పారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలు శిక్ష పడి, ఆ వెంటనే రాహుల్ అనర్హతకు గురయ్యారని ఠాకూర్ అన్నారు. ఈ కేసులో రాహుల్‌కి కాంగ్రెస్‌కి సంబంధించిన ప్రముఖ న్యాయవాదులెవరూ ఎందుకు సాయం చేయలేకపోయారని అడిగారు. ఒక వేళ ఇది ఉద్దేశ పూర్వకంగా జరిగిందా? లేదా కాగ్రెస్ కుట్రలో భాగమా? అని ప్రశ్నించారు. పవన్ ఖేరాను రక్షించడానికి కేవలం గంట వ్యవధిలోనే మొత్తం న్యాయవాదులందరూ రావడం జరిగింది. మరీ రాహుల్‌కి మద్దతుగా ఏ కాంగ్రెస్ నాయకుడు కోర్టుని ఆశ్రయించలేదే, అంటే దీనినిబట్టి రాహుల్‌పై కుట్ర పన్నుతుంది ఎవరూ అని కేంద్ర మంత్రి గట్టిగా నిలదీశారు. ఆయన సుప్రీంకోర్టుకి వ్రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) వంటి సంఘాలు, వ్యక్తులు, సంస్థలపై పరువువ నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయడం కొనసాగించారన్నారు. విలేకరుల సమావేశంలో ఓ జర్నలిస్టుతో కూడా రాహుల్ పరుషంగా మాట్లాడరన్నారు. తను పరుషంగా మాట్లాడతాడని కూడా చాలామందికి తెలియదని, గత 15 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అతని తప్పులను కవర్ చేసుకుంటూ వస్తోందని విమర్శులు గుప్పించారు. పైగా ఇలాంటి వ్యక్తి మళ్లా పత్రికా స్చేచ్ఛగా మాట్లాడతుంటారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ కుటుంబ ప్రభావం నుంచి బయటకు రాలేకపోతున్నారని అన్నారు. అలాగే అదానీ విషయంలో బీజేపీ డిఫెన్స్ ఉందన్న ఆరోపణలను తోసిపుచ్చారు. విదేశీ గడ్డపై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ పట్టుబడుతూ.. ఇలా రాహుల్ విషయంలో వ్యవహరిస్తోందన్న ఆరోపణలను సైతం ఖండించారు. అలాగే అదానీ అంశం గురించి ఆర్థిక మంత్రి నిర్శలా సీతీరామన్ కూడా సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుందని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇందులో దాచడానికి ఏమి లేదన్నారు. తమ సంస్థలు బలంగా ఉన్నాయని, వాటిని విశ్వసించమని నొక్కిచ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దేశ న్యాయవ్యవస్థ, పార్లమెంట్ కార్యకలాపాలు, ప్రజలు వీటిన్నికంటే గాంధీ కుటుంబానికే ప్రాధాన్యత ఇస్తోందంటూ అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. -
మనవాళ్ళు బంగారం
ఇది మన అమ్మాయిలు రాసిన కొత్త చరిత్ర. ఒకటీ రెండు కాదు... ఏకంగా నాలుగు స్వర్ణాలు. అదీ అంతర్జాతీయ పోటీల్లో! ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (ఐబీఏ) నిర్వహించిన మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో మన దేశ మహిళా బాక్సింగ్ జట్టు నాలుగు పసిడి పతకాలతో ప్రపంచమంతా తలతిప్పి చూసేలా చేసింది. ఢిల్లీలో జరిగిన ఈ పోటీల్లో శనివారం నీతూ ఘంఘాస్ (48 కిలోల విభాగం), స్వీటీ బూరా (81 కిలోలు) బంగారు పతకాలు సాధిస్తే, ఆదివారం మన తెలుగమ్మాయి నిఖత్ జరీన్ (50 కిలోలు), లవ్లీనా బొర్గొహైన్ (75 కిలోలు) పసిడి కాంతులు పూయించారు. మొత్తం నలుగురూ తమ బాక్సింగ్ పంచ్‌లతో బలమైన ప్రత్యర్థులను మట్టికరిపించి, దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు. నిన్నటి మేరీ కోమ్ వారసులుగా బాక్సింగ్‌లో మరింత మంది యువతులు ముందుకొచ్చిన చరిత్రాత్మక సందర్భం పతకాల సాక్షిగా వెల్లడైంది. హర్యానా ఆడపిల్ల నీతూ, తెలంగాణ యువతి నిఖత్, అస్సామ్ అమ్మాయి లవ్లీనా, హర్యానాకే చెందిన సీనియర్ క్రీడాకారిణి స్వీటీ... నలుగురూ దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు. స్వర్ణపతకం సాధించి తల్లి మెడలో దాన్ని అలంకరించాలని ఓ అమ్మాయి, బహుమతిగా వచ్చే పారితోషికంతో కొత్త మెర్సిడెస్ కారు కొని తల్లితండ్రులను తమ సొంతవూరు నిజామాబాద్‌కు తీసుకెళ్ళాలని మరో యువతి, సరైన ఫామ్‌లో లేవంటూ కొట్టిపారేసిన విమర్శకుల నోళ్ళు మూయించాలని ఇంకో వనిత, ఇష్టదైవతారాధన, ఆశీస్సులతోనే విశ్వవేదికపై విజయం సాధ్యమని భావించే వేరొక హర్యానా యువతి – ఇలా ఈ నలుగురిలో ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన ప్రేరణ. మొత్తం 13 దేశాల నుంచి వచ్చి, ప్రపంచపోరులో ఫైనల్స్‌కు చేరిన మహిళలు 24 మంది. వారిలో భారత మహిళా బాక్సింగ్ చతుష్టయం సత్తా చాటింది. భారత్‌తో పాటు ఒక్క చైనా నుంచే నలుగురు ఫైనల్స్‌కు చేరుకొని, స్వర్ణాల కోసం పోటీపడ్డారు. గత ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 3 పతకాలు సాధించిన భారత్ ఈసారి 4 పతకాలు గెలిచి, మునుపటి రికార్డును మెరుగుపరుచుకోవడం విశేషం. గత ఏడాది 52 కిలోల విభాగంలో వరల్డ్ టైటిల్ సాధించిన 26 ఏళ్ళ నిఖిత్ ఈసారి కొత్తగా 50 కిలోల విభాగం ఎంచుకొని, అందులో తన సత్తా చాటారు. గతంలో రెండుసార్లు ఏషియన్ ఛాంపియన్ అయిన వియత్నామ్‌కు చెందిన ప్రత్యర్థి నూయెన్ తీ తామ్‌పై ఫైనల్లో 5–0 తేడాతో విజయం సాధించారు. కీలకమైన ఆఖరి మూడు నిమిషాల ఆటలో, ప్రత్యర్థి చాలా దూకుడు మీద ఉన్నప్పుడు, శరీర దార్ఢ్యం, మానసిక బలం తోడుగా నిఖత్ ప్రతిష్ఠాత్మక ప్రపంచ పోటీల్లో వరుసగా రెండుసార్లు స్వర్ణాలు సాధించి, చరిత్రకెక్కారు. మేరీ లానే ఈశాన్య ప్రాంతం నుంచి వచ్చిన లవ్లీనా సైతం ఫైనల్లో రెండుసార్లు కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత అయిన ఆస్ట్రేలియాకు చెందిన గెయిట్లిన్ పార్కర్‌పై హోరాహోరీ పోరాడి, 5–2 తేడాతో గెలుపు కైవసం చేసుకున్నారు. ఎప్పుడూ ఎదురుదాడి అనే ఏకైక వ్యూహంతో సాగే నీతూ ఆటలో పరిస్థితి, ప్రత్యర్థిని బట్టి వ్యూహాన్ని మార్చుకొనే కళను అలవరుచున్నారు. బాక్సింగ్ మెలకువల్లో ఆరితేరిన నిఖత్ సైతం తాను పోటీపడ్డ ఒలింపిక్ వెయిట్ వర్గంలోని ప్రపంచ అగ్రశ్రేణి బాక్సర్లతో తలపడి, మెరుగైన ఆటతీరుతో దుమ్మురేపడం గమనార్హం. రానున్న ఆసియా క్రీడోత్సవాలకు సిద్ధం కావడానికీ, తప్పులు సరిదిద్దుకోవడానికీ ఈ ప్రపంచ బాక్సింగ్ పోటీలు మన అమ్మాయిలకు మంచి అవకాశమయ్యాయి. మరో 16 నెలల్లో ప్యారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో స్వర్ణమే ధ్యేయంగా ముందుకు సాగే ఊపు తెచ్చింది. నిజానికి, క్రీడల్లో మన దగ్గర ప్రతిభాపాటవాల కొరత లేదు. యువతరంలో బోలెడంత ఉత్సాహం, ఉత్తేజం ఉన్నాయి. అయితే, ఆ యువ క్రీడాప్రతిభను సరైన పద్ధతిలో తీర్చిదిద్ది, దోవలో పెట్టే వేదికలే ఎప్పుడూ కరవు. 2018లో క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ క్షేత్రస్థాయిలో క్రీడా సంస్కృతినీ, ప్రాథమిక వసతి సౌకర్యాలనూ పెంపొందించడానికి హిమాచల్‌ప్రదేశ్‌లో ‘ఖేల్ మహాకుంభ్’ను ప్రారంభించారు. క్రమంగా అది బిహార్, ఉత్తరప్రదేశ్, లద్దాఖ్, కశ్మీర్‌లలోని గ్రామాలకు విస్తరించింది. దేశంలో కనీసం 200 మంది దాకా ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లో ఈ ఖేల్ మహాకుంభ్‌ను నిర్వహిస్తూ వచ్చారు. ఇవన్నీ దిగువ, మధ్యాదాయ కుటుంబాల యువతుల కలలకు కొత్త రెక్కలు తొడిగాయి. సాంప్రదాయిక పురుషాధిక్య రంగంలోనూ మహిళలు పైకి రావడానికి దోహదపడ్డాయి. ‘బేటీ బచావో, బేటీ పఢావో’ తర్వాత పాలకుల ‘ఖేలో ఇండియా’ పథకం నవతరం ఆశలకు కొత్త ఊపిరి. మెరుగైన శిక్షణకు క్రీడా సామగ్రి అందుబాటులో ఉండే ఖేలో ఇండియా కేంద్రాలు గ్రామీణ యువతరానికి, ముఖ్యంగా యువతులకు వరం. మీడియా దృష్టిపెట్టని అనేక భారతీయ ఆటలు ఈ పథకంతో జనం ముందుకు వస్తున్నాయి. గ్రామీణ స్థాయిలోనే అథ్లెట్లకు ప్రోత్సాహం అందుతోంది. మగవారివే అనుకొనే క్రీడల్లోనూ మన వనితల జైత్రయాత్రకు ఇలాంటి ప్రయత్నాలు ఓ ఉత్ప్రేరకం. లింగభేదాల గోడలను బద్దలుకొట్టి, అందరికీ అభిమాన బాక్సర్‌గా నిఖత్ అవతరించడం అవిస్మరణీయం. గమనిస్తే, మన దేశపు ఒలింపిక్ పతకాల పట్టికలోనూ మహిళలే మహారాణులు. ఇంటా బయటా ఎన్నో సవాళ్ళను అధిగమించి, ఆరుసార్లు ప్రపంచ టైటిళ్ళు సాధించిన బాక్సర్ మేరీ కోమ్ ఆదర్శంగా మరిన్ని జాతి రత్నాలు వెలుగులోకి వచ్చాయి. 2008 ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన విజేందర్ సింగ్ విజయ గాథ తర్వాత మన పురుషుల బాక్సింగ్ కొంత స్తబ్దుగా మారినవేళ బాక్సింగ్‌ను భారత్‌కు పతకాల అడ్డాగా మార్చిన మహిళలూ మీకు జోహోర్లు! -
‘రాహుల్ అనర్హతవేటుపై.. కాంగ్రెస్‌లోనే జరిగిన కుట్ర!’
ఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై లోక్‌సభ ఎంపీగా అనర్హత వేటుపై బీజేపీ స్పందించింది. రాహుల్‌కు మద్ధతుగా వ్యాఖ్యలు చేసే క్రమంలో కాంగ్రెస్ నేతలు కేంద్రంలోని బీజేపీ, ప్రధాని మోదీపై విమర్శలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విమర్శలను బలంగా తిప్పికొట్టారు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అనురాగ్ ఠాకూర్లు. అసలు ఇది కాంగ్రెస్‌లోనే జరిగిన కుట్ర అని పేర్కొన్నారు వాళ్లు. శుక్రవారం సాయంత్రం న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ధర్మేంద్ర ప్రధాన్, అనురాగ్ ఠాకూర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘ఈ వ్యవహారంలో మీరు(రాహుల్ గాంధీ) లోతుగా వెళ్తేనే అసలు విషయాలు తెలుస్తాయి. మిమ్మల్ని అడ్డుతొలగించుకునేందుకు, పార్టీ నుంచి వదిలించుకునేందుకు ఎవరు కుట్ర పన్నారనేది మీకే అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీలో నిష్ణాతులైన న్యాయవాదులెందరో ఉన్నారు. అలాంటప్పుడు మీకు సలహా ఇవ్వడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదా? అని ఠాకూర్ ప్రశ్నించారు. అలాగే.. రాహుల్ గాంధీ కేవలం 21 లోక్‌సభ చర్చల్లో మాత్రమే పాల్గొన్నారని, 2009 నుంచి పార్లమెంటేరియన్‌గా ఉన్నప్పటికీ ప్రైవేట్ సభ్యుల బిల్లును ప్రవేశపెట్టడంలో ఘోరంగా విఫలమయ్యారని కేంద్ర మంత్రి ఠాకూర్ విమర్శించారు. అంతెందుకు రాహుల్ గాంధీ తన సొంత ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను చించివేసిన సంఘటనను కూడా ప్రస్తావించారు. రాహుల్‌కి ఇదేం కొత్త కాదని, ఇలాంటి ఏడు కేసుల్లో బెయిల్ మీద ఉన్న విషయాన్ని ప్రస్తావించిన ఠాకూర్.. జరగబోయే పరిణామాలను పట్టించుకోకుండా మాట్లాడడం రాహుల్‌కు అలవాటైన పనేనని విమర్శించారు. ఇక మరో కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి ఇలాంటి నేరాలు అలవాటయ్యాయని పేర్కొన్నారు. రాహుల్ చేసిన మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలను ప్రస్తావించిన ఆయన.. ఫ్యూడల్ మనస్తత్వం ఉంటేనే ఇలాంటి మాటలు మాట్లాడతారని రాహుల్‌పై మండిపడ్డారు. అంతకు ముందు మరో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ఈ పరిణామంపై స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ దేశ చట్టం కంటే ఉన్నతమైనవారా?. ఓబీసీ సమాజానికి చెందిన ఓ ఇంటిపేరును దుర్భాషలాడడం, అవమానించడం జాతీయ నాయకుడి పనా? అంటూ మండిపడ్డారాయన. -
మితిమీరితే ఒప్పుకోం.. ఓటీటీ కంటెంట్‌పై కేంద్రం సీరియస్!
ఇటీవల ఓటీటీలో అశ్లీలత, అసభ్య పదజాలంతో కూడిన కంటెంట్ పెరుగుతోందన్న సంగతి తెలిసిందే. సినిమాలకు ఉన్నట్లుగా సెన్సార్ కత్తెర ఓటీటీ కంటెంట్లకు లేకపోవడంతో వీళ్లు హద్దలు దాటి ప్రవర్తిస్తున్నారని కొందరి వాదన. అయితే తాజాగా దీనిపై కేంద్రం స్పందించింది. ఓటీటీకి ఇచ్చిన స్వేచ్ఛ క్రియేటివిటీ కోసమని.. అశ్లీలత, అసభ్య పదజాలం వాడేందుకు కాదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. ఎవరైనా పరిమితి దాటితే జోక్యం చేసుకోవడానికి ప్రభుత్వం వెనుకాడదని ఆయన ఘటుగా స్పందించారు. నాగ్‌పూర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చర్యలు తీసుకునేందుకు వెనకాడబోం ఓటీటీ ప్లాట్‌ఫారంలు చేస్తున్న దుర్వినియోగం, అశ్లీల కంటెంట్‌పై ఇటీవల ఫిర్యాదులు వచ్చాయన్న ఆయన.. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు. ఈ ప్లాట్‌ఫారంకు ఇచ్చిన స్వేచ్ఛ సృజనాత్మకత కోసం తప్ప అశ్లీలత లేదా దుర్వినియోగం కోసం కాదని, ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాడానికి సిద్ధంగా ఉందన్నారు. ఇందులో మార్పులు తీసుకురావడానికి నిబంధనల్లో ఏమైనా మార్పులు అవసరమవుతాయా అనే కోణాన్ని ఐటీశాఖ పరిశీలిస్తుందని తెలిపారు. వీటిపై ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో, నిర్మాతలు ముందుగా ఈ సమస్యను పరిష్కరించాలని మంత్రి సూచించారు. ఇటీవల వెబ్ సిరీస్ "కాలేజ్ రొమాన్స్" గురించి ఢిల్లీ హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజుల తర్వాత ఠాకూర్ వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. వెబ్ సీరిస్ కంటెంట్‌లో అసభ్యకర పదజాలం వంటి భాష విస్తృతంగా ఉన్నందున అవి ప్రజలను ప్రభావితం చేయగలదని కోర్టు పేర్కొంది. क्रिएटिविटी के नाम पर गाली गलौज, असभ्यता बर्दाश्त नहीं की जा सकती। ओटीटी पर बढ़ते अश्लील कंटेंट की शिकायत पर सरकार गंभीर है।अगर इसको लेकर नियमों में कोई बदलाव करने की ज़रूरत पड़ी तो @MIB_India उस दिशा में भी पीछे नहीं हटेगा। अश्लीलता, गाली गलौज रोकने के लिए कड़ी कार्यवाई करेगा। pic.twitter.com/6pOL66s88L — Anurag Thakur (@ianuragthakur) March 19, 2023 -
ప్రియాంక గాంధీ పెయింటింగ్‌కు రూ.2 కోట్లా?.. కాంగ్రెస్‌పై ఠాకూర్ ఫైర్..
న్యూఢిల్లీ: రూ.2కోట్ల పెయింటింగ్ కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ప్రియాంక గాంధీకి పలు ప్రశ్నలు సంధించారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్. యస్ బ్యాంక్ కో-ఫౌండర్ రాణా కపూర్‌ను ప్రియాంక వద్ద ఉన్న పెయింటింగ్‌ను రూ.2 కోట్లు పెట్టి కొనాలని ఎవరు బలవంతం చేశారని నిలదీశారు. ఇలా ఎన్ని పెయింటింగ్‌లను అమ్మారు? ఈ డబ్బు తీసుకుని ప్రతిఫలంగా పద్మభూషణ్ అవార్డులు ఇచ్చారా? ఇలా ఎంత డబ్బు సేకరించారు, ఎన్ని అవార్డులు ఇచ్చారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే మనీలాండరింగ్, ఉగ్ర నిధులపై నిఘా వహించే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(FATF) ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో భారత్‌లో ఓ ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి పెయింటింగ్‌ను రూ.2కోట్లు పెట్టి ఓ బ్యాంక్ సీఈఓ కొనుగోలు చేశారని, మనీ లాండరింగ్ ద్వారా ఈ లావాదేవీ జరిగిందని నివేదిక చెప్పింది. ఈ సమయంలో కేంద్రంలో కాంగ్రెసే అధికారంలో ఉంది. అయితే పార్టీ పేరును గానీ, పెయింటింగ్ కొనుగోలు చేసిన వ్యక్తి పేరును గానీ నివేదికలో ఎక్కడా ప్రస్తావించలేదు. అతని పేరు 'మిస్టర్ ఏ' అని మాత్రమే పేర్కొంది. అతను బ్యాంక్ సీఈఓగా ఉన్నప్పుడు నష్టాల్లో ఉన్న కంపెనీలకు కూడా రూ.వేల కోట్ల రుణాలు ఇచ్చాడని తెలిపింది. అయితే ఎస్ బ్యాంకు మాజీ సీఈఓ రానా కపూర్ రూ.2 కోట్లు పెట్టి ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్‌ను ప్రియాంక గాంధీ నుంచి బలవంతంగా కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నాడని ఈడీ ఛార్జిషీట్లో పేర్కొంది. ఈ డబ్బును గాంధీ కుటుంబం సోనియా గాంధీకి న్యూయార్క్‌లో చికిత్స కోసం ఉపయోగించిందని ఆయన చెప్పినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఎఫ్ఏటీఎఫ్ నివేదిక అనంతరం అనురాగ్ ఠాగూర్ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కుటుంబం అవినీతిలో రోజుకో కొత్త మోడల్ బయటపడుతోందని, ఇది సిగ్గుచేటని ధ్వజమెత్తారు. నేషనల్ హెరాల్డ్, వాద్రా ల్యాండ్ స్కామ్, ఇప్పుడు పెయింటింగ్ వ్యవహారం బయటపడిందని విమర్శించారు. గాంధీ కుటుంబం అవినీతి కథను ఓ కేస్ స్టడీగా ప్రపంచానికి తెలియజేశారని ఎద్దేవా చేశారు. #WATCH | "My question to Priyanka Gandhi is who forced Rana Kapoor to pay Rs 2 cr bribe to purchase a painting? Who is Mr R who was involved, whether it was painting for Padma Bhushan? How many Padma awards, paintings were sold & money was raised?": Union minister Anurag Thakur pic.twitter.com/FcFg5QYu0q — ANI (@ANI) March 13, 2023 చదవండి: భారత ప్రజాస్వామ్యం గురించి లండన్‌లో ప్రశ్నలా? రాహుల్‌కు మోదీ చురకలు -
...పగబట్టింది మన మీద అనుకుంటా సార్!
...పగబట్టింది మన మీద అనుకుంటా సార్! -
లక్ష చండీ మహాయజ్ఞం దేశానికి గర్వకారణం
సింహాచలం: భారత వైదిక చరిత్రలోనే కనీవినీ ఎరుగని లక్ష చండీ మహాయజ్ఞం కురుక్షేత్ర వేదికగా నిర్వహిస్తుండటం దేశానికి గర్వకారణమని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. విశాఖ శ్రీశారదాపీఠం పర్యవేక్షణలో హరియాణ రాష్ట్రం కురుక్షేత్రలోని గుంతీ ఆశ్రమంలో జరుగుతున్న లక్ష చండీ మహా యజ్ఞానికి శనివారం అనురాగ్ ఠాకూర్ సతీసమేతంగా హాజరయ్యారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ శంకరాచార్య సంప్రదాయ పీఠాల్లో గుర్తింపు పొందిన విశాఖ శ్రీశారదాపీఠం లక్ష చండీ మహాయజ్ఞాన్ని పర్యవేక్షిస్తుండటం, ఆ యజ్ఞంలో తాను పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అమ్మవారి ఆదేశం ఉంటే తప్ప ఇంత బృహత్తర కార్యక్రమం చేపట్టడం సాధ్యం కాదన్నారు. కాగా, శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని యజ్ఞభూమిలో శారదాపీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ రాజశ్యామల, చంద్రమౌళీశ్వరుల పీఠార్చన విశేషంగా నిర్వహించారు. 2,200 మంది బ్రాహ్మణులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఏకకాలంలో రుద్రం పఠించడంతో కురుక్షేత్ర ప్రాంగణమంతా శివ నామస్మరణతో మార్మోగింది. అలాగే యజ్ఞం నిర్వహణలో భాగంగా 6,976 చండీ పారాయణ హోమాలు పండితులు నిర్వహించారు. గుంతీమాత, స్వాత్మానందేంద్ర సరస్వతి ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. -
సహకారోద్యమం బలోపేతం!
న్యూఢిల్లీ: దేశంలో సహకార ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాబోయే ఐదేళ్లలో గ్రామ పంచాయతీల్లో 2 లక్షల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు(పీఏసీలు), పాడి–మత్స్య సహకార సంఘాలు ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైంది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా దాదాపు 99,000 పీఏసీలు ఉండగా, 63,000 మాత్రమే చురుగ్గా ఉన్నాయి. 1.6 లక్షల పంచాయతీల్లో పీఏసీలు లేవు. 2 లక్షల గ్రామాల్లో పాడి–మత్స్య సహకార సంఘాల్లేవు. అక్కడ వాటిని, తీర గ్రామాల్లో మత్స్య సహకార సంఘాలను ఏర్పాటు చేస్తారు. ఐదేళ్లలో 2 లక్షల బహుళ ప్రయోజనకర పీఏసీలు, పాడి–మత్స్య సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. దీంతో రైతుల ఆదాయం పెరగడంతోపాటు గ్రామాల్లో నూతన ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఉత్తర సరిహద్దుల్లో ‘భవ్య గ్రామాలు’ దేశ ఉత్తర సరిహద్దుల్లో ఉన్న గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం వైబ్రాంట్ విలేజెస్ ప్రోగ్రామ్(వీవీపీ) పేరిట నూతన పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2022–23 నుంచి 2025–26 దాకా మూడేళ్ల వ్యవధిలో రూ.4,800 కోట్లతో వీవీపీ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిక పథకం. ఇందులో రూ.2,200 కోట్లను రోడ్ల నిర్మాణం కోసం ఖర్చు చేస్తారు. ఈ పథకంతో సరిహద్దు గ్రామాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. వీవీపీ స్కీమ్‌తో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రం పాలిత ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలియజేసింది. షింకున్ లా సొరంగం కేంద్ర పాలిత ప్రాంతమైన లద్ధాఖ్లోని సరిహద్దు ప్రాంతాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించడానికి 4.1 కిలోమీటర్ల పొడవైన షింకున్ లా సొరంగం నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. నిమూ–పదామ్–దార్చా రోడ్డు లింక్‌లో రూ.1,681 కోట్లతో ఈ సొరంగం నిర్మిస్తారు. 2025 డిసెంబర్ నాటికల్లా నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో లద్ధాఖ్‌కు సులువుగా చేరుకోవడానికి ఈ టన్నెల్ ఉపయోగపడుతుందని వివరించారు. దేశ భద్రతకు సైతం ఈ ప్రాజెక్టు చాలా కీలకమని చెప్పారు. శ్రీనగర్–కార్గిల్–లేహ్ టన్నెల్ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామన్నారు. -
సెట్‌టాప్ బాక్స్‌ల్లేకుండానే టీవీ కార్యక్రమాలు
ముంబై: టీవీల్లో తయారీ సమయంలోనే శాటిలైట్ ట్యూనర్లు ఏర్పాటు చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీంతో సెట్‌టాప్ బాక్స్ అవసరం లేకుండానే ఉచితంగా 200 చానల్స్ వరకు వీక్షించే అవకాశం ఏర్పడుతుందన్నారు. టీవీల్లో శాటిలైట్ ట్యూనర్లను ఏర్పాటు చేయడం వల్ల ఉచిత టీవీ చానళ్లను చూడడానికి వీలవుతుంది. రేడియో చానళ్ల ప్రసారాలను కూడా వినొచ్చు. విండో వద్ద లేదంటే మేడ పైన చిన్న యాంటెన్నా ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ఇందుకు సంబంధించి నిర్ణయాన్ని ఇంకా తీసుకోవాల్సి ఉన్నట్టు మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ చెప్పారు. టీవీల్లో ఇన్‌బిల్ట్‌గా శాటిలైట్ ట్యూనర్ల విషయంలో ఆదేశాలు జారీ చేయాలంటూ టెలికం మంత్రి అశ్వని వైష్ణవ్‌కు గత డిసెంబర్లో అనురాగ్ సింగ్ ఠాకూర్ లేఖ కూడా రాయడం గమనార్హం. -
రెజ్లర్ల మీటూ ఉద్యమం..చర్చలు విఫలం!.. ఉత్కంఠ
న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్‌పై మీటూ ఆరోపణల దరిమిలా.. ఆయన్ని గద్దె దించడమే ధ్యేయంగా రెజ్లర్ల నిరసన కొనసాగుతోంది. గురువారం సాయంత్రం ఫెడరేషన్ అధికారులతో, ప్రభుత్వ ప్రతినిధులతో క్రీడామంత్రిత్వ శాఖ కార్యాయలంలో చర్చలు జరిగినప్పటికీ.. అవి విఫలం అయినట్లు స్పష్టమవుతోంది. చర్చలు సంతృప్తికరంగా సాగలేదని, స్పష్టమైన హామీలు లభించలేదని, అలాగే.. ఫెడరేషన్ చీఫ్‌ను తొలగించడంపైనా ప్రభుత్వం తరపున ఎలాంటి హామీ రాలేదని రెజ్లర్లు మీడియాకు వెల్లడించారు. మా దగ్గర ఐదుగురి నుంచి ఆరుగురు అమ్మాయిలు ఇప్పటికిప్పుడు సాక్ష్యం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. అతను(బ్రిజ్ భూషణ్) జైలుకు వెళ్లాల్సిందే. మా డిమాండ్లు నెరవేరేంత వరకు రెజ్లింగ్ బరిలోకి దిగేది లేదు. ఒకవేళ ప్రభుత్వం గనుక స్పందించకుంటే.. పోలీసుల దగ్గరికి వెళ్లాల్సి ఉంటుందని రెజర్లు వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్‌లు, ఈ నిరసనలకు నేతృత్వం వహించిన బజరంగ్ పూనియాలు చెప్తున్నారు. ఇదిలా ఉంటే.. చర్చలు విఫలమైన నేపథ్యంలో రాత్రి పది గంటల సంమయంలో నేరుగా క్రీడాశాఖ మంత్రి అనురాగ్ థాకూర్‌తో రెజ్లర్లు భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. Allegations levelled by wrestlers are serious in nature. Taking swift action, Govt of India sent a notice to WFI and sought a reply within 72 hours. I will try to meet the wrestlers after I reach Delhi. We will talk & listen to them: Union Sports Min Anurag Thakur, in Chandigarh pic.twitter.com/mNmdPyIiVR — ANI (@ANI) January 19, 2023 ఇక జంతర్ మంతర్ వద్ద గురువారం నాడు(రెండోరోజు) కొనసాగిన ధర్నాలో 200 మంది రెజ్లర్లు పాల్గొన్నారు. ప్రధాని మోదీపై ఉన్న నమ్మకంతోనే తాము న్యాయపరమైన చర్యలకు దిగట్లేదని వాళ్లు ప్రకటించారు. అయితే.. బీజేపీ ఎంపీ, ఒలింపియన్ అయిన బబితా ఫోగట్ దౌత్యంతో ప్రభుత్వంతో చర్చలకు ముందుకు వచ్చారు రెజ్లర్లు. మరోవైపు కేంద్ర క్రీడా శాఖ బుధవారం ఈ ఆరోపణలపై 72 గంటల్లో స్పందించాలని డబ్ల్యూఎఫ్ఐకి అల్టిమేటం జారీ చేసింది కూడా. ఇదిలా ఉంటే.. బీజేపీ ఎంపీ అయిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(66) .. తొలి నాళ్లలో రెజ్లరు కూడా. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను తోసిపుచ్చిన ఆయన.. నిజమని తేలితే ఆత్మహత్య చేసుకుంటానంటూ అంటున్నారు. వినేశ్ ఫోగట్(28) ఆరోపణలతో ఈ వ్యవహారంపై తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. తనకు ఆ పరిస్థితి ఎదురు కాకున్నా.. నేషనల్ క్యాంప్‌లో ఉన్న సుమారు 20 మందికి అలాంటి వేధింపులు ఎదురు అవుతున్నాయని, కోచ్‌లతో పాటు డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ కూడా ఈ వేధింపుల పర్వంలో భాగం అయ్యారంటూ ఫోగట్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. వాళ్ల కుటుంబ నేపథ్యాల దృష్ట్యా భయంతో ముందుకు రావడం లేదని, అందుకే తాను పోరాటానికి ముందుకు వచ్చి న్యాయం కోరుతున్నానని వెల్లడించారామె. ఆమెకు మద్దతుగా పలువురు రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద నిరసనకు తోడయ్యారు. మరోవైపు ఢిల్లీ మహిళా కమిషన్ ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను కోరింది. అదే సమయంలో క్రీడా మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది. నేషనల్ సైక్లింగ్ టీం కోచ్‌ను లైంగిక ఆరోపణలతో తొలగించి నెలలు గడవకముందే.. రెజ్లింగ్‌లో ఇలాంటి ఆరోపణలు రావడంతో క్రీడా రంగం దిగ్భ్రాంతికి లోనవుతోంది. హాలీవుడ్ నుంచి మొదలైన మీటూ ఉద్యమం.. ఆ తర్వాత ప్రపంచమంతా విస్తరించింది. భారత్‌లో 2018లో కొందరు నటీమణులు.. తాము లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామంటూ మీడియా ముందుకు వచ్చారు. దీంతో అప్పటి నుంచి మన దేశంలోనూ తరచూ మీటూ ఘటనలు తెరపైకి వస్తున్నాయి. -
గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కు రూ.19,744 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించడానికి గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం ఈ ఏడాది రూ.19,744 కోట్లు కేటాయించింది. ఈ మేరకు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ సమావేశానంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కేబినెట్ వివరాలను విలేకరులకు వెల్లడించారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా 2030 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు, 6 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయని తాము భావిస్తున్నట్టుగా చెప్పారు. వచ్చే అయిదేళ్లలో ఏడాదికి 50 లక్షల టన్నుల చొప్పున గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ఇప్పుడు కేటాయించిన రూ.20 వేల కోట్ల విలువైన ప్రోత్సాహకాలతో దాని ధర తగ్గుతుందని అన్నారు. కార్బన్ రహిత హైడ్రోజన్‌ను ఆటోమొబైల్స్ , ఆయిల్ రిఫైనరీలు, స్టీల్ ప్లాంట్లలో ఇంధనంగా వినియోగించవచ్చునని ఠాకూర్ చెప్పారు. ఈ మిషన్ కోసం ప్రాథమికంగా రూ.19,744 కోట్లు కేటాయించామని, స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైబ్రోజన్ ట్రాన్సిషన్ (సైట్) కార్యక్రమానికి రూ.17,490 కోట్లు, ఫైలెట్ ప్రాజెక్టులకు రూ.1,466 కోట్లు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి రూ.400 కో ట్లు, ఇతర అవసరాల కోసం రూ.388 కోట్లు ఖర్చు చేయడానికి కేబినెట్ అంగీకారం తెలిపిందని మంత్రి వివరించారు. ఈ మిషన్ సాకారమైతే ఇంధన రంగంలో భారత్ స్వయంప్రతిపత్తిని సాధిస్తుంది. -
2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి భారత్ సిద్ధం!
2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉన్నదని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీన్ని సాధించేందుకు ఇండియన్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి రోడ్‌మ్యాప్ ఇస్తామని చెప్పారు. జీ 20 ప్రెసిడెన్సీని భారత్ ఇంత పెద్ద స్థాయిలో నిర్వహించగలిగినప్పుడు..ఐఓఏతో కలిపి కేంద్ర ప్రభుత్వం ఒలింపిక్స్ నిర్వహించగలదని భావిస్తున్నట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఒలింపిక్స్‌కు పూర్తిగా సిద్ధమైన తర్వాతనే భారత్ బిడ్ వేస్తుందని ఆశిస్తున్నామన్నారు. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) క్రీడల నిర్వహణకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని.. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలతో ఆతిథ్య నగరంగా మారుతుందని ఠాకూర్ చెప్పారు. గతంలో 1982 ఆసియా క్రీడలు, 2010 కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇచ్చిందని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. ఇప్పుడు ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధమైందన్నారు. -
డీ–టు–ఎం బ్రాడ్‌కాస్ట్‌పై పరిశోధనలు.. విజయసాయి ప్రశ్నకు మంత్రి జవాబు
సాక్షి, న్యూఢిల్లీ: డైరెక్ట్–టు–మొబైల్ (డీ–టు–ఎం) బ్రాడ్కాస్ట్ టెక్నాలజీ అభివృద్ధి పరిశోధన దశలో ఉన్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ చెప్పారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. టెలివిజన్ కార్యక్రమాలను నేరుగా స్మార్ట్ఫోన్లకు ప్రసారం చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐఐటీ–కాన్పూర్ అభివృద్ధి చేస్తోందని తెలిపారు. డీ–టు–ఎం టెక్నాలజీపై పరిశోధన, అభివృద్ధి కోసం ఐఐటీ–కాన్పూర్‌తో ప్రసారభారతి ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. ఈ ఏడాది జూన్ 1న నిర్వహించిన సమావేశంలో ఐఐటీ–కాన్పూర్ డీ–టూ–ఎం టెక్నాలజీపై ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించి శ్వేతపత్రం విడుదల చేసిందని పేర్కొన్నారు. ఈ టెక్నాలజీని పరీక్షించడానికి బెంగళూరులో లైవ్ పీవోసీ టెస్టింగ్ సైట్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కామన్వెల్త్ గేమ్స్ నుంచి వైదొలగే ఆలోచన లేదు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడలను విస్తృతం చేస్తూ వాటిలో సమర్థత సాధించే లక్ష్యాలతో జాతీయ క్రీడా విధానాన్ని రూపొందించినట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. త్వరలో ఇంగ్లండ్‌లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ నుంచి వైదొలగే ఆలోచనేమీ లేదని చెప్పారు. త్వరితగతిన స.హ. చట్టం కేసుల పరిష్కారం సమాచారహక్కు చట్టం కింద దాఖలయ్యే కేసులను త్వరితగతిన పరిష్కరిస్తున్నట్లు పీఎంవో కార్యాలయం సహాయమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఇన్ఫర్మేషన్ కమిషన్లలో ఖాళీలను త్వరితగతిన భర్తీచేస్తూ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసినట్లు తెలిపారు. విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. ఆర్టీఐ ఫైలింగ్ ప్రక్రియను సరళతరం చేసే ప్రయత్నం జరిగిందని, తొలి అప్పీల్, మలి అప్పీల్, మూడో అప్పీల్‌కు కాలవ్యవధిని నిర్ణయించినట్లు చెప్పారు. సమాచారహక్కు చట్టం కింద 24 వేల మంది ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు. గత ఎనిమిదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే కేసులు త్వరితగతిన పరిష్కారం అవుతున్నట్లు రుజువవుతోందని చెప్పారు. ఎన్సీఏపీలో 11 పట్టణాలు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్సీఏపీ)లో ఆంధ్రప్రదేశ్‌లోని 11 పట్టణాలున్నాయని కేంద్ర అటవీ, పర్యావరణశాఖ సహాయమంత్రి అశ్వినికుమార్ చౌబే తెలిపారు. ప్రోగ్రామ్‌లో అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కర్నూలు నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరం పట్టణాలున్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమం అమలు నిమిత్తం ఆయా పట్టణాలకు రూ.232.36 కోట్లు బదిలీ చేశామని, ఏపీ కాలుష్యనియంత్రణ మండలి రూ.4.08 కోట్లు వినియోగించిందని తెలిపారు. అఖిల భారత సర్వీసుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు లేవు అఖిల భారత సర్వీసుల పదోన్నతుల్లో రిజర్వేషన్ల ప్రొవిజన్ లేదని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్.. వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రశ్నకు జవాబిచ్చారు. ఎస్టీల్లో చేర్చాలన్న సిఫార్సులను త్వరగా పరిశీలించాలి తమిళనాడు తరహాలో ఇతర రాష్ట్రాల్లోని కొన్ని వర్గాలను ఎస్టీల్లో చేర్చేందుకు చేసిన సిఫార్సులను త్వరగా జాతీయ ఎస్టీ కమిషన్ పరిశీలించి ఆయా వర్గాలను చేర్చాలని ఆర్.కృష్ణయ్య కోరారు. రాజ్యసభలో గురువారం ది కాన్స్టిట్యూషన్ (షెడ్యూల్డ్ ట్రైబ్స్) ఆర్డర్ (సెకండ్ అమెండ్మెంట్) బిల్లు–2022పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ బిల్లుకు వైఎస్సార్సీపీ పూర్తిగా మద్దతు తెలుపుతోందని చెప్పారు. ఆదివాసీల్లో అవిద్య, మూఢనమ్మకాలు, పేదరికం సహా అనేక అంశాలను తొలగించాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వానికి ఉందన్నారు. గిరిజనుల విద్య, అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేయాల్సి ఉందన్నారు.సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఎస్టీ న్యాయమూర్తులు లేని కారణంగా న్యాయవ్యవస్థలోను ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎస్టీల్లో చేర్చాలన్న వినతిని పునర్విచారించాలి ఏపీ, తెలంగాణల్లో బోయ, వాల్మీకి వర్గాలను షెడ్యూల్డ్ ట్రైబ్స్‌లో చేర్చాలన్న డిమాండ్ అనేక సంవత్సరాలుగా ఉందని బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చెప్పారు. ది కాన్స్టిట్యూషన్ (షెడ్యూల్డ్ ట్రైబ్స్) ఆర్డర్ (సెకండ్ అమెండ్మెంట్) బిల్లు–2022పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ కర్ణాటకలో బోయ, వాల్మీకిలను ఎస్టీలుగా గుర్తించారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో ఈ రెండు వర్గాలకు ఎస్టీ హోదా ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా లేదని చెప్పారు. దీనిపై గతంలో విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పునర్విచారణ చేయాలని కోరారు. -
'సొంత గడ్డపై భారత జట్టు ప్రపంచ కప్ గెలుస్తుంది’
న్యూఢిల్లీ: వచ్చే నెలలో సొంతగడ్డపై జరిగే హాకీ ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలుస్తుందని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ ఆతిథ్యమిచ్చే ఈ పురుషుల హాకీ టోర్నీ భువనేశ్వర్, రూర్కేలా వేదికలపై జనవరి 13 నుంచి 29 వరకు జరుగనుంది. వరల్డ్ కప్ ట్రోఫీ టూర్లో భాగంగా శుక్రవారం ట్రోఫీ రాజధాని నగరం ఢిల్లీకి చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ ‘ప్రపంచకప్ సమరం కోసం భారత జట్టు పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. 15 పోటీ జట్ల నుంచి ఎలాంటి సవాళ్లు ఎదురైనా ధీటుగా ఎదుర్కొంటుంది. భారత్ సన్నాహాలు, సన్నద్ధత చూస్తుంటే మరోసారి ప్రపంచ చాంపియన్ అవుతుందని అనిపిస్తుంది. జట్టు సభ్యులంతా కఠోరంగా శ్రమించారు. అందరూ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ప్రపంచకప్ మాత్రమే కాదు... పారిస్ ఒలింపిక్స్‌లోనూ భారత జట్టు సత్తా చాటుతుంది’ అని అన్నారు. ఒకప్పుడు హాకీలో భారత్‌కు ఘనచరిత్ర ఉంది. చివరి సారిగా భారత్ 47 ఏళ్ల క్రితం కౌలాలంపూర్ (1975)లో జరిగిన ప్రపంచకప్‌లో విజేతగా నిలిచింది. చదవండి: IND-W vs AUS-W: సిరీస్‌లో నిలవాలంటే.. గెలవాల్సిందే! భారత్ తుది జట్టు ఇదే? -
హిమాచల్‌లో బీజేపీ ఓటమి.. అనురాగ్ ఠాకూర్‌ను ఏకిపారేస్తున్న నెటిజన్లు!
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ పరాజయం పాలైంది. ప్రతి ఐదేళ్లకోసారి అధికార మార్పు సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కాంగ్రెస్‌కు పట్టంకట్టారు హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు. అయితే, అధికారంలో ఉండి కూడా బీజేపీ ఓడిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో కాషాయ దళం పరాజయం చెందడానికి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కారణమంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తున్నాయి. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన క్రమంలో అనురాగ్ ఠాకూర్‌పై ట్రోల్స్‌తో ఆయన ట్రెండింగ్‌లోకి వచ్చారు. రాష్ట్ర బీజేపీలో ఠాకూర్ అంతర్యుద్ధానికి తెరలేపారంటూ కొందరు కాషాయ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. I am presuming C. R. PATIL new BJP president on card. Great leader with thumping majority in Gujarat. Anurag Thakur should be sacked from BJP for family politics over and above party lines. — 🇮🇳🌞 GIREESH JUYAL 🇮🇳🌞जय श्री राम, (@juyal3405) December 8, 2022 బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వరాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లో ఈసారి రెబల్ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైంది. మొత్తం 68 స్థానాల్లో 21 ప్రాంతాల్లో బీజేపీ రెబల్ అభ్యర్థులు పోటీ చేశారు. రెండు చోట్ల మాత్రమే విజయం సాధించినప్పటికీ.. బీజేపీ అనుకూల ఓట్లు చీలిపోయాయని స్పష్టంగా తెలుస్తోంది. అదే కాంగ్రెస్ విజయానికి సాయపడింది. మరోవైపు.. ఈ ఎన్నికల్లో బీజేపీలో మూడు వర్గాలు ఏర్పడినట్లు స్పష్టమవుతోంది. అనురాగ్ ఠాకూర్, జేపీ నడ్డా, సీఎం జైరాం ఠాకూర్ వర్గం. దీంతో అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రెబల్స్ బరిలోకి దిగారు. ఎవరి వర్గం వారిని వారు గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేయటం పార్టీ ఓటమికి కారణమైంది. మరోవైపు.. బీజేపీలో కీలక నేత, మాజీ సీఎం ప్రేమ్‌కుమార్ థుమాల్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనకు ఈసారి టికెట్ ఇవ్వలేదు అధిష్ఠానం. దీంతో ఆయన కుమారుడు, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పార్టీకి వ్యతిరేకంగా పని చేసినట్లు కొందరు ఆరోపిస్తున్నారు. అనురాగ్ ఠాకూర్ సొంత జిల్లాలోనే ఐదు సీట్లలో బీజేపీ ఓడిపోవడం విమర్శలకు తావిచ్చింది. బీజేపీలో కీలక నేతలు ఉన్నప్పటికీ.. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఒక్కరే ప్రచారం చేసి హస్తం పార్టీకి ఘన విజయం సాధించిపెట్టారని ఓ నెజిటన్ కామెంట్ చేశారు. In a head to head contest, in Nadda's state, in Anurag Thakur's state, against the might of the BJP's money, media and institutions, Priyanka Gandhi has defeated Modi. — Dushyant A (@atti_cus) December 8, 2022 Choice of candidates by JP Nadia & Anurag Thakur is questionable If a rebel is winning means the rebel was right candidate Also the home state of BJP Chief Nadda? Any effects of that? Look at the effect of Narendra Modi on his Home State Gujarat If BJP means business then act — Flt Lt Anoop Verma (Retd.) 🇮🇳 (@FltLtAnoopVerma) December 8, 2022 ఇదీ చదవండి: ఛండీగఢ్ కాదు.. షిమ్లాలోనే! కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు?.. ఉత్కంఠ -
2017లో ‘అర్జున’ అవార్డుకు ఎంపిక.. ఇప్పుడు అందుకున్న పుజారా
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ చతేశ్వర్ పుజారా ఎట్టకేలకు ఐదేళ్ల తర్వాత తనకు ప్రకటించిన ‘అర్జున’ అవార్డును అందుకున్నాడు. క్రికెట్లో రాణిస్తున్న అతన్ని 2017లోనే భారత ప్రభుత్వం ఆ అవార్డుకు ఎంపిక చేసింది. కానీ టీమిండియా బిజీ షెడ్యూల్ వల్ల ఆ ఏడాది అందుకోలేకపోయాడు. ఢిల్లీలో ప్రస్తుతం సౌరాష్ట్ర తరఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న అతనికి కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ‘అర్జున’ పురస్కారం బహూకరించారు. దీనిపై స్పందించిన పుజారా తనను ప్రోత్సహించిన బోర్డు (బీసీసీఐ)కు, తన ఘనతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. చదవండి: IND vs NZ: వన్డే, టీ20ల్లో అయిపోయింది...ఇక టెస్టుల్లోకి సూర్యకుమార్! Thankful to @IndiaSports, @BCCI and @ianuragthakur to organise and handover the Arjuna Award belatedly, which I could not collect the year it was awarded to me due to my cricket commitments. Honoured and grateful🙏 pic.twitter.com/Dokz4ZP3Hs — Cheteshwar Pujara (@cheteshwar1) November 19, 2022 -
వారి వల్లే నేను ఈ స్థానంలో ఉన్నా.. చిరు ఎమోషనల్ ట్వీట్
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అవార్డు ప్రకటించటం పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ గౌరవం నాకు లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తనను ఎంపిక చేసినందుకు భారత ప్రభుత్వానికి మెగాస్టార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 2022 ఏడాది గానూ భారతీయ సినీ పరిశ్రమ గర్వించదిగిన వ్యక్తిగా చిరంజీవిని ఎంపిక చేస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. నాకు ఈ అవార్డు రావడానికి ప్రధానం కారణం నా అభిమానులేనని చిరు అన్నారు. నాపై ప్రేమ చూపిస్తున్న అభిమానులందరి వల్లే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ట్విటర్లో పోస్ట్ చేశారు. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకల్లో మెగాస్టార్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022 అవార్డు అందుకోనున్నారు. Greatly Delighted and Humbled at this honour, Sri @ianuragthakur ! My deep gratitude to Govt of India@MIB_India @IFFIGoa @Anurag_Office and all my loving fans only because of whom i am here today! https://t.co/IbgvDiyNNI — Chiranjeevi Konidela (@KChiruTweets) November 20, 2022 -
Viral Video: కేంద్ర మంత్రి చేసిన పనికి అంతా షాక్!
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బిలాస్పూర్ నియోజకవర్గం పరిధిలో ఆయన పర్యటిస్తుండగా.. ఆసక్తికర సంఘటన జరిగింది. నడి రోడ్డుపై బస్సు బ్రేక్‌డౌన్ అయ్యింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేంద్ర మంత్రి ఠాకూర్ కాన్వాయ్ సైతం నిలిచిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. విషయం తెలుసుకున్న ఆయన కారు దిగి అక్కడున్న వారితో కలిసి బస్సును వెనక్కి తోశారు. అనంతరం బస్సు డ్రైవర్, ప్రయాణికులతో కాసేపు మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ట్రాఫిక్ సర్దుకున్నాక అక్కడి నుంచి ప్రచారానికి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అంతకుముందు బిలాస్పూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఠాకూర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరోసారి భాజపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని గ్రామాల్లో రోడ్లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని పర్యటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. ‘ప్రాజెక్ట్ శక్తి’ పేరిట వచ్చే 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఇదీ చదవండి: షాకింగ్ రిపోర్ట్: కరోనాను మించిన వైరస్ తయారీలో పాక్-చైనా! -
పాకిస్తాన్‌కు వెళ్లేది లేనిది భారత ప్రభుత్వం నిర్ణయిస్తుంది: బీసీసీఐ కొత్త బాస్
పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాది (2023) సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్ వన్డే టోర్నీలో భారత్ పాల్గొనేది లేదంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన వ్యాఖ్యలు దూమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వివాదాస్పద అంశంపై తాజాగా బీసీసీఐ కొత్త బాస్ రోజర్ బిన్నీ స్పందించాడు. జై షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బిన్నీ ఓ ప్రకటన విడుదల చేశాడు. భారత జట్టు పాకిస్తాన్లో పర్యటించాలా వద్దా అన్న అంశం భారత ప్రభుత్వం పరిధిలోని అంశమని, ఈ విషయంలో కేంద్ర నిర్ణయాన్ని బీసీసీఐ ఫాలో అవ్వాల్సిందే తప్పించి, సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు భారత క్రికెట్ బోర్డుకు లేదని బీసీసీఐ అధ్యక్ష హోదాలో బిన్నీ వివరణ ఇచ్చాడు. ఈ విషయమై ప్రస్తుతానికి బీసీసీఐ కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించలేదని, ఒకవేళ కేంద్రం నుంచి ఏవైనా కీలక ఆదేశాలు వస్తే మీడియాకు తప్పక తెలియజేస్తామని స్పష్టం చేశాడు. కాగా, ఇదే అంశంపై కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా స్పందించాడు. భారత జట్టు పాకిస్తాన్లో పర్యటించాలంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని, ప్రస్తుతానికి ఈ విషయం కేంద్ర ప్రభుత్వం పరిశీలనలోకి రాలేదని ఆయన వివరించాడు. ఇదిలా ఉంటే, జై షా చేసిన ప్రకటనపై ఉలిక్కపడ్డ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. ఆసియా కప్ ఆడేందుకు భారత్ పాక్‌లో అడుగుపెట్టకపోతే, భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో పాక్ కూడా పాల్గొనబోదని బెదిరింపులకు దిగింది. -
ఇండియా ఎవరి మాట వినదు.. మా దేశానికి రమ్మని పాక్‌ను బతిమాలేది లేదు..!
పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాది జరుగబోయే ఆసియా కప్ వన్డే టోర్నీలో భారత్ పాల్గొనదంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. జై షా చేసిన ఈ ప్రకటనపై పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) తీవ్రంగా స్పందించింది. ఆసియా కప్‌లో పాల్గొనేందుకు భారత్.. పాకిస్తాన్లో అడుగుపెట్టకపోతే, ఇండియాలో జరిగే 2023 వన్డే వరల్డ్‌కప్‌ను తాము బాయ్‌కాట్ చేస్తామని పీసీబీ బెదిరింపులకు దిగింది. ఈ ఉదంతంపై తాజాగా భారత క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనమని ఎవరిని బతిమాలేది లేదని పాక్‌ను ఉద్దేశిస్తూ ఘాటుగా బదులిచ్చారు. వచ్చే వారికి భారత్ సాదరంగా స్వాగతం పలుకుతుందని.. రావడం, రాకపోవడం ఆయా జట్ల ఇష్టమని, ఈ విషయంపై స్పందించడం కూడా అనవసరమని పాక్‌కు సున్నితంగా మొట్టికాయలు వేశారు. భారత్ ఓ క్రీడా శక్తి అని, ప్రపంచ క్రికెట్ చరిత్రలో బీసీసీఐకి అత్యున్నత హోదా ఉందని, ఇదివరకే భారత్ ఎన్నో ప్రపంచకప్‌లను సమర్ధవంతంగా నిర్వహించిందని గుర్తు చేశారు. పాక్ బెదిరింపులకు భారత ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గేది లేదని, భారత్ ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరి మాట వినదని అవాక్కులు చవాక్కులు పేలుతున్న పాక్‌కు గట్టిగా కౌంటరిచ్చారు. పాక్‌లో పర్యటించే అంశం కేంద్ర హోం శాఖ పరిధిలోని అంశమని, అక్కడ భద్రతాపరమైన సమస్యలున్నాయని నిఘా వర్గాల సమాచారం అందిందని మంత్రి వివరించారు. చదవండి: IND vs BAN: ఏడేళ్ల తర్వాత బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా..! -
ఆ ఉద్యోగులకు దీపావళి కానుక.. 78 రోజుల బోనస్ ప్రకటించిన కేంద్రం
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించింది. పండగ సందర్భంగా 78 రోజుల బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈమేరకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. అయితే ఇది పర్మామెన్స్ ఆధారిత బోనస్ అని ఆయన స్పష్టం చేశారు. మొత్తం 11.27లక్షల మంది రైల్వే ఉద్యోగులు గరిష్ఠంగా రూ.17,951 పొందుతారని వివరించారు. నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు పర్మామెన్స్ ఆధారిత ఇన్సెంటివ్ ఇవ్వనున్నట్లు కేంద్రం ఇదివరకే తెలిపింది. అలాగే ఆయిల్ సంస్థలకు రూ.22వేల గ్రాంట్‌ను మంజూరు చేయనున్నట్లు ఠాకూర్ తెలిపారు. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్(సవరణ)బిల్లు-2022కి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. చదవండి: శశి థరూర్‌తో నన్ను పోల్చకండి.. మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు -
Mohammed Shami: షమీపై దారుణమైన ట్రోల్స్.. అతడు చేసిన తప్పేంటి?
Mohammed Shami- Dussehra- T20 World Cup 2022: సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత సెలబ్రిటీలు అభిమానులకు మరింత చేరువయ్యే అవకాశం దొరికింది. తమకు సంబంధించిన ప్రతీ అప్డేట్ను పంచుకోవడంతో పాటు.. పండుగ సమయాల్లో విష్ చేయడం పరిపాటిగా మారింది. అయితే, ఒక్కోసారి ఇలాంటి సమయాల్లో పోస్టులు ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నా.. హేటర్స్ నుంచి మాత్రం అదే స్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. దసరా శుభాకాంక్షలు.. షమీపై ట్రోల్స్ టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి ఇటీవల ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. విజయదశమి సందర్భంగా.. ‘‘దసరా శుభ సందర్భంగా... రాముడు మీకు సకల సంతోషాలు ప్రసాదించాలని, విజయాలనివ్వాలని కోరుకుంటున్నా. మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు’’ అని షమీ ట్వీట్ చేశాడు. ఇందుకు స్పందించిన నెటిజన్లు కొంతమంది.. ‘‘ధన్యవాదాలు షమీ భాయ్! మీకు కూడా పండుగ శుభాకాంక్షలు’’ అని సంతోషం వ్యక్తం చేయగా.. మరికొందరు మాత్రం అతడిని దారుణంగా ట్రోల్ చేస్తూ విద్వేషపు కామెంట్లు చేశారు. ఈ విషయంపై తాజాగా స్పందించిన కేంద్ర క్రీడా శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. షమీకి అండగా నిలబడ్డారు. షమీ చేసిన తప్పేంటి? ‘‘దసరా అనేది దేశవ్యాప్తంగా అందరూ కలిసి చేసుకునే పండుగ. భారత క్రికెటర్లు కూడా అంతా కలిసి పండుగ జరుపుకొంటారు. మహ్మద్ షమీ ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటే తప్పేంటి? అతడిని తప్పుబడుతున్న వారికి అందరూ కలిసి ఉండటం ఇష్టం లేనట్లే అనిపిస్తోంది. ఏదేమైనా దేశమంతా అన్ని పండుగలు కలిసి జరుపుకోవాలి. అంతా కలిసి ఉండాలి’’ అని అనురాగ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో స్వదేశంలో సిరీస్‌కు షమీ ఎంపికైనా కరోనా బారిన పడిన కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇక ప్రపంచకప్-2022 టోర్నీ నేపథ్యంలో స్టాండ్‌బై అతడికి అవకాశం దక్కింది. అయితే, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి దూరం కావడంతో షమీ అతడి స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. చదవండి: Ind Vs SA: పరుగులు సాధిస్తున్నా టీమిండియాలో చోటు దక్కడం లేదు! స్వీట్లు, చైనీస్ ఫుడ్ మానేశా! ఇకపై.. On the happy occasion of Dussehra, I pray that Lord Ram fills your life with lots of happiness, prosperity, and success. Happy Dussehra to you and your family. #mdshami11 #Dussehra pic.twitter.com/wsFk7M1Gj5 — Mohammad Shami (@MdShami11) October 5, 2022 -
బాలీవుడ్ నటికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. ప్రకటించిన కేంద్రం
సినిమా రంగంలో ఇచ్చే అత్యుత్తమ అవార్డు దాదా సాహెబ్ ఫాల్కే. తాజాగా ఈ అవార్డుకు బాలీవుడ్ సీనియర్ నటి పేరును ప్రకటించింది కేంద్రం. సీనియర్ నటి ఆశా పరేఖ్‌ను 2020 ఏడాదికి ఎంపిక చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఆమెను 1992లో భారత ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీరంగ ప్రవేశం చేసిన ఆశా పరేఖ్ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. (చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, ఆదిపురుష్ రిలీజ్ డేట్ చెప్పేసిన డైరెక్టర్) కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ 'దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ఆశా పరేఖ్‌కు ఇవ్వడం సంతోషకరం. ఆమె సుమారు 95 చిత్రాలలో నటించారు. 1998-2001 వరకు సీబీఎఫ్సీ ఛైర్ పర్సన్‌గా ఉన్నారు. సెప్టెంబర్ 30వ తేదీన జరిగే 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో అవార్డుతో సత్కరిస్తాం' అని అన్నారు. హేమా మాలిని, పూనమ్ ధిల్లాన్, టీఎస్ నాగభరణ, ఉదిత్ నారాయణ్, ఆశా భోంస్లేలతో కూడిన ఐదుగురు సభ్యుల జ్యూరీ ఆమె పేరును నామినేట్ చేసింది. -
యువతకు లక్షల ఉద్యోగాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువగా ఉందన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శల్లో వాస్తవం లేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే నాలుగున్నర లక్షల మంది యువతకు ఉద్యోగాలిచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. విశాఖలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఈ స్థాయిలో ఉద్యోగాలిచ్చారా? అని ప్రశ్నించారు. ప్రజా రంజకంగా పరిపాలిస్తున్న సీఎంపై కేంద్ర మంత్రి విమర్శలు హాస్యాస్పదమన్నారు. జగన్ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్న విషయాన్ని కేంద్ర మంత్రి తెలుసుకోకుండా సుజనాచౌదరి టీడీపీ కార్యాలయం నుంచి తెచ్చిన స్క్రిప్ట్‌ను చదవడం బాధాకరమన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను విక్రయించేందుకు కేంద్రం సిద్ధపడుతోందని, అందులో మీ కమీషన్ ఎంతో చెప్పాలన్నారు. ప్రత్యేక హోదాను ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పోలవరానికి రూ.2,900 కోట్లను ఇప్పటికీ చెల్లించలేదన్నారు. పవన్‌కల్యాణ్ పార్టీ కమ్మ జనసేన కాదని ఎలా అనగలమని ప్రశ్నించారు. సీఎం జగన్ దంపతులు ఎంతో గౌరవంగా చిరంజీవిని సాగనంపారన్న విషయాన్ని పవన్ తెలుసుకోవాలని సూచించారు. పెళ్లిళ్లు, పేరంటాలకు వచ్చి లోకేశ్ రాజకీయాలు చేయడం అవసరమా? అంటూ మంత్రి అమరనాథ్ ధ్వజమెత్తారు. -
సంక్షేమాభివృద్ధి పథకాలపై చర్చకు సిద్ధమా?
సాక్షి, అమరావతి: ‘దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలు.. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై చర్చకు సిద్ధమా?’ అని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాలు, ప్రసార సమాచార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్‌కు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. మూడేళ్లలో రెండు లక్షల మందికి రెగ్యులర్ ఉద్యోగాలు, 2.60 లక్షల మందికి వలంటీర్లుగా అవకాశం, 90 వేల మందికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలిచ్చి.. సీఎం జగన్ యువతకు బాసటగా నిలిచారని గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఈ తరహాలో ఉద్యోగాలిచ్చారా? అని నిలదీశారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. మోసం చేసిన మీరు నీతులు చెబుతారా? ► టీడీపీ కార్యాలయం నుంచి సుజనా చౌదరి తె చ్చిన స్క్రిప్టును కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ చదువుతూ.. సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేశారు. స్వతంత్ర భారతదేశ 75 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో కేవలం మూడేళ్లలోనే రూ.1.65 లక్షల కోట్లను డీబీటీ పద్ధతిలో లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్ జమ చేశారు. ► సంక్షేమ, సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌ను ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగానే కాకుండా తమ కుటుంబ సభ్యుడిగా చూస్తున్నారు. 2014 నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. ► రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైంది? రెవెన్యూ లోటు భర్తీ, కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటులోనూ కేంద్రం మోసం చేసింది. రాష్ట్ర ప్రజలను వంచించిన బీజేపీకి రాష్ట్రంలో ఓట్లు అడిగే నైతిక అర్హత లేదు. కాల్షీట్లు అమ్ముకున్న జన సేనాని ► చంద్రబాబుకు వీకెండ్ కాల్షీట్లు అమ్ముకున్న జనసేన అధ్యక్షుడు బుర్ర తక్కువ పవన్ కల్యాణ్.. రాజంపేట, తిరుపతి ప్రాంతాల్లో పనికిరాని మాటలు మాట్లాడారు. 2014లో జనసేనను చంద్రబాబుకు తాకట్టు పెట్టింది కాక.. ఇప్పుడు తనను నమ్మిన కొంత మంది కాపు సామాజిక వర్గం వారిని మళ్లీ చంద్రబాబుకు అమ్మేయడానికే వీకెండ్ నాటకాలాడుతున్నారు. వ్యవసాయం, కౌలు రైతుల గురించిన కనీస అవగాహన లేని పవన్.. సేద్యం గురించి మాట్లాడటం విడ్డూరం. 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పే దమ్ముందా? ► సీఎం జగన్ రైతులను రారాజులుగా చేస్తున్నారు. జన రంజక పాలన అందిస్తున్నందుకు 175కు 175 స్థానాల్లోనూ విజయం సాధించే దిశగా అడుగులేస్తున్నాం. 2019 ఎన్నికల్లో చంద్రబాబును చెప్పుతో కొట్టి 23 సీట్లకు పరిమితం చేసిన ప్రజలు.. 2024 ఎన్నికల్లో రెండు చెప్పులతో కొట్టి రాజకీయ సన్యాసం తీసుకునేలా చేయడం ఖాయం. -
లిక్కర్ కుంభకోణంలో సూత్రధారి కేజ్రీవాల్: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో లిక్కర్ కుంభకోణంపై అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), ప్రతిపక్ష బీజేపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. లిక్కర్ అక్రమాల వ్యవహారంలో అసలు సూత్రధారి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాలేనని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ దుయ్యబట్టారు. సీబీఐ దర్యాప్తును రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. విషయాన్ని పక్కదారి పట్టించొద్దని అన్నారు. ఆప్ నాయకుల అసలు రంగు బయపడిందని చెప్పారు. అనురాగ్ ఠాకూర్ శనివారం మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ సర్కారు ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుండడం చూసి ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టిందంటూ ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ఆప్ అసలు ఖాతా తెరవలేదని గుర్తుచేశారు. 2014, 2019 తరహాలో 2024లోనూ మోదీ నాయకత్వంలో బీజేపీ అద్భుత విజయం సాధించబోతోందని స్పష్టం చేశారు. చదవండి: ఓటర్ల జాబితాపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు లిక్కర్ కుంభకోణంలో తలెత్తుతున్న ప్రశ్నలకు ఆప్ నేతలు సమాధానం చెప్పాలని అనురాగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. ఆప్ ప్రభుత్వం రేవడీ(ఉచితాలు), బేవడీ(తాగుబోతులు) ప్రభుత్వంగా మారిపోయిందని ధ్వజమెత్తారు. కేబినెట్ ఆమోదం లేకుండా లిక్కర్ కంపెనీలకు రూ.144 కోట్ల మేర ఎందుకు లబ్ధి చేకూర్చారో చెప్పాలన్నారు. ఈ కేసులో మనీశ్ సిసోడియా మొదటి నిందితుడు అయినప్పటికీ అసలు సూత్రధారి కేజ్రీవాలేనని తేల్చిచెప్పారు. మనీశ్‌ను ‘మనీ ష్’గా అభివర్ణించారు. లంచాలు మింగేసి, అమాయకత్వం నటిస్తున్నారని విమర్శించారు. అరవింద్ కేజ్రీవాల్ ఎడమ భుజం సత్యేంద్ర జైన్ ఇప్పటికే జైలులో ఉన్నారని, కుడి భుజం మనీశ్ సిసోడియా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని ఠాకూర్ ఎద్దేవా చేశారు. అవినీతికి వ్యతిరేకం అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు అదే అవినీతిలో కూరుకుపోయిందన్నారు. చదవండి: ఐఐటీల్లో పెరిగిన విద్యార్థినులు -
24 గంటలు టైమ్ ఇస్తున్నా.. కేజ్రీవాల్‌కు కేంద్ర మంత్రి ఠాకూర్ సవాల్
Anurag Thakur.. దేశ రాజధాని ఢిల్లీలో పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ నేతల మధ్య మాటల వార్ నడుస్తోంది. కాగా, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలో ఇంట్లో సీబీఐ సోదాలు హాట్ టాపిక్ మారింది. ఈ నేపథ్యంలో ఆప్ నేతలు బీజేపై విరుచుకుపడుతున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఆప్ సర్కార్‌పై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి ఠాకూర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎక్సైజ్ పాలసీ స్కాంలో మనీష్ సిసోడియా తొలి నిందితుడే అయినా ఈ స్కాం ప్రధాన సూత్రధారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అని ఆరోపించారు. కేజ్రీవాల్ మీడియా ముందుకు వచ్చి 24 గంటల్లోగా తనకు జవాబివ్వాలని అనురాగ్ ఠాకూర్ సవాల్ విసిరారు. సిసోడియాకు కేవలం డబ్బు వ్యామోహంతో మనీ తీసుకుని మౌనంగా ఉంటున్నాడని.. మనీశ్ సిసోడియా తన పేరును ‘మనీ-ష్’గా మార్చుకోవాలని సెటైరికల్ కామెంట్స్ చేశారు. విలేకరుల సమావేశానికి హాజరైన మనీష్ సిసోడియాకు ముఖం చెల్లలేదని మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. మరోవైపు.. ఆప్ నేతలు మాత్రం బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రజలకు మంచి చేస్తే బీజేపీకి నచ్చదంటూ వ్యాఖ్యానించారు. అలాగే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో(2024 ఎన్నికల్లో) కేజ్రీవాల్, మోదీ మధ్యే పోటీ ఉంటుందని సిసోడియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇలా కేసుల్లో ఇరికిస్తున్నారని సిసోడియా మండిపడ్డారు. ఇది కూడా చదవండి: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు.. సీఎం పోస్టుకు రూ. 2,500 కోట్లు? -
బీజేపీతో ఆప్ ఢీ.. అందుకే సీబీఐ సోదాలు
న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ప్రధాన పోరు ఉంటుందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా వ్యాఖ్యానించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీకి సరైన ప్రత్యర్థి అరవింద్ కేజ్రీవాల్ అని పేర్కొన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో సీబీఐ పెద్ద ఎత్తున దాడులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆప్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేజ్రీవాల్ అంటే భయంతోనే.. ‘బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ స్కామ్ గురించి ఆలోచించడం లేదు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రధాన ప్రత్యర్థి అరవింద్ కేజ్రీవాల్ అవుతారని బీజేపీ భయపడుతోంద’ని మనీశ్ సిసోడియా వ్యాఖ్యానించారు. పూర్తి పారదర్శకంగా ఎక్సైజ్ పాలసీ ఉందని, ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. సీబీఐ అరెస్ట్ చేయొచ్చు తనను సీబీఐ అరెస్ట్ చేసే అవకాశముందని సిసోడియా వెల్లడించారు. నిర్బంధాలతో తమ పార్టీ మంచి పనులు చేయకుండా అడ్డుకోలేరని చెప్పారు. ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్‌ను ప్రశంసిస్తూ న్యూయార్క్ టైమ్స్ మొదటి పేజీలో ప్రచురించడంతోనే తమపై మోదీ సర్కారు కక్ష సాధిస్తోందని ఆయన పునరుద్ఘాటించారు. అసలు సూత్రధారి అరవింద్: ఠాకూర్ మద్యం కుంభకోణంలో మనీష్ సిసోడియా నిందితుడు మాత్రమేనని, అసలు సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. డబ్బులు వసూలు చేసి మౌనం దాల్చిన మనీశ్ సిసోడియా తన పేరును ‘మనీ-ష్’గా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. మోదీకి కేజ్రీవాల్ ప్రధాన ప్రత్యర్థి కాదని కొట్టిపారేశారు. 31 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు ఢిల్లీలోని సిసోడియా ఇంటితో పాటు, ఏడు రాష్ట్రాల్లోని మరో 31 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. మద్యం పాలసీ ఉల్లంఘనలపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో 15 మందిని నిందితులుగా పేర్కొన్నారు. 11 పేజీల నేరాభియోగ పత్రంలో అవినీతి, నేరపూరిత కుట్ర తదితర అభియోగాలు మోపారు. (క్లిక్: కేంద్రం, ఆప్ కుస్తీ) -
స్వల్పకాలిక రుణాలపై 1.5% వడ్డీ రాయితీ
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో రుణ వితరణను పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. రూ.3 లక్షలలోపు స్వల్పకాలిక వ్యవసాయ రుణాలపై 1.5 శాతం వడ్డీ రాయితీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమయ్యింది. ఈ భేటీ వివరాలను సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు తెలియజేశారు. సాగు కోసం తీసుకున్న స్వల్పకాలిక రుణాలపై 1.5 శాతం వడ్డీ రాయితీని పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. 2022–23 నుంచి 2024–25 వరకూ అన్ని రకాల బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, కంప్యూటరైజ్డ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి తీసుకున్న రూ.3 లక్షలలోపు రుణాలపై ఈ రాయితీ వర్తిస్తుందని అన్నారు. ఈ పథకం అమలు కోసం బడ్జెట్ కేటాయింపుల కంటే అదనంగా రూ.34,856 కోట్లు కేటాయించాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎరువులపై రాయితీ రూ.2 లక్షల కోట్లు దాటే అవకాశం ఉందని ఠాకూర్ చెప్పారు. వాస్తవానికి వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీని 2020 మే నెలలో నిలిపివేశారు. బ్యాంకులు 7 శాతం వడ్డీ రేటుతో రైతులకు రుణాలిస్తున్నాయి. ఆర్బీఐ ఇటీవల రెపో రేటును పెంచింది. దీంతో వ్యవసాయ రుణాలపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. అందుకే వడ్డీ రాయితీని మళ్లీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసీజీఎల్‌ఎస్‌కు మరో రూ.50,000 కోట్లు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ (ఈసీజీఎల్‌ఎస్)కు 2022–23 కేంద్ర బడ్జెట్లో రూ.4.5 లక్షల కోట్లు కేటాయించారు. ఈ పథకానికి మరో రూ.50,000 కోట్లు ఇవ్వనున్నారు. అదనపు సొమ్మును కోవిడ్‌తో దెబ్బతిన్న ఆతిథ్య, అనుబంధ రంగాలకు రుణాలిస్తారు. భారత్–ఫ్రాన్స్ ఒప్పందానికి ఆమోదం భారత రవాణా రంగంలో అంతర్జాతీయ రవాణా వేదిక(ఐటీఎఫ్) కార్యకలాపాలకు ఊతం ఇవ్వడానికి భారత్–ఫ్రాన్స్ మధ్య కుదిరిన ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 2022 జూలై 6న ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం రవాణా రంగంలో కర్బన ఉద్గారాలను తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇకపై అందరికీ టీకేడీఎల్ డేటాబేస్ సంప్రదాయ విజ్ఞాన డిజిటల్ లైబ్రరీ(టీకేడీఎల్) డేటాబేస్‌ను ఇకపై కేవలం పేటెంట్ అధికారులే కాదు సామాన్యులు ఉపయోగించుకోవచ్చు. జాతీయ, అంతర్జాతీయ యూజర్లకు దశలవారీగా ఈ డేటాబేస్‌ను అందుబాటులోకి తీసుకొస్తారు. చందారూపంలో రుసుము చెల్లించి వాడుకోవచ్చు. -
ఐదేళ్లలో కేంద్రం ప్రకటనల ఖర్చు రూ.3,339 కోట్లు
న్యూఢిల్లీ: 2017–18 నుంచి ఈ ఏడాది జూలై 12వ తేదీ దాకా.. ఐదేళ్లలో మీడియాలో ప్రకటనల కోసం రూ.3,339.49 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన గురువారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనల కోసం ఈ సొమ్ము వ్యయం చేసినట్లు పేర్కొన్నారు. ప్రింట్ మీడియాలో ప్రకటనలకు, రూ. 1,756.48, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలకు రూ.1,583.01 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. -
94 యూట్యూబ్ చానళ్లపై నిషేధం
న్యూఢిల్లీ: 2021–22లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న 94 యూట్యూబ్ చానళ్లు, 19 సామా జిక మాధ్యమ అకౌంట్లను మూసి వేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం–2000లోని సెక్షన్ 69ఏ ప్రకారం ఈ మేరకు చర్య తీసుకున్నట్లు ఆయన రాజ్యసభలో ప్రకటించారు. కోవిడ్‌కు సంబంధించి వ్యాపింపజేసే తప్పుడు సమాచారాన్ని కనిపెట్టేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్ కోవిడ్‌కు సంబంధించిన, చర్యలు తీసుకోదగ్గ 34,125 ప్రశ్నలకు స్పందించిందన్నారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తన సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో నకిలీ వార్తలకు సంబంధించిన 875 పోస్ట్‌లను తొలగించిందని ఠాకూర్ తెలిపారు. -
కాళేశ్వరం నిధులు దుర్వినియోగం!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వేలకోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని, ఆ నిధులు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కుటుంబం జేబుల్లోకి వెళ్లాయని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన దళితులు, అణగారిన వారి జీవితాలేమీ మారలేదని, కేసీఆర్ కుటుంబం మాత్రం బాగుపడిందని వ్యాఖ్యానించారు. అభివృద్ధి అంటే ఒక్క కేసీఆర్ కుటుంబానిదేనా.? అని ప్రశ్నిం చారు. ప్రారంభంలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు రూ.2.50 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, అందుకు ఈ ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలని అన్నా రు. రాష్ట్రంలో సాధారణ ప్రజలు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, శాంతిభద్రతలు లేకుంటే పెట్టుబడులు ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిపై ఫిర్యాదులు వస్తే దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేస్తాయని చెప్పారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన అనురాగ్ ఠాకూర్ శనివారం మీడియాతో మాట్లాడారు. మోదీ విశ్వసనీయతను తెలుసుకోవాలి ‘ఫామ్‌హౌస్‌లో పడుకునే సీఎం కేసీఆర్‌కు ప్రజల హృదయాల్లో స్థానం ఎలా సంపాదించుకోవాలో ఏం తెలుసు? ప్రధాని మోదీకి దేశంలో, అంతర్జాతీయంగా ఉన్న విశ్వసనీయత, ఆదరణ గురించి కేసీఆర్ తెలుసుకోవాలి. మోదీ రెండుసార్లు పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు’ అని ఠాకూర్ అన్నారు. కేసీఆర్ టూరిస్ట్లా తిరగాల్సిందే.. ‘బీజేపీ నాయకులు రాజకీయ టూరిస్ట్‌లంటూ కేసీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోతుంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ఆ తర్వాత ఆయన దేశవ్యాప్తంగా టూరిస్ట్లా తిరగొచ్చు. ఈ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు. ఆగ్రహం తో ఉన్నారు. టీఆర్ఎస్ నాయకులు, గూండాలు.. సామాన్యులను, బీజేపీ కార్యకర్తలను అణగదొక్కుతున్నారు. అరాచకాలు చేసిన వారిని ఈ ప్రభుత్వం కాపాడుతోంది. ఇంతకంటే ఒక ముఖ్యమంత్రికి సిగ్గుచేటైన విషయం ఏముంటుంది?’అని ప్రశ్నించారు. మీడియా రేటింగ్‌లకు సంబంధించి ఫిర్యాదులు అందితే సీరియస్‌గా పరిగణిస్తామన్నారు. -
టీఆర్ఎస్ నేతలవి చిల్లర రాజకీయాలు: కిషన్ రెడ్డి ఫైర్
తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రెండు పార్టీలకు చెందిన రాజకీయ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్.. సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బీజేపీకి వ్యతిరేకంగా కావాలనే టీఆర్ఎస్ ఫ్లెక్సీలు కట్టి, ర్యాలీలు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎంలు వెళ్లే రూట్స్‌లో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు పెట్టి రెచ్చగొడుతున్నారు. టీఆర్ఎస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్ లాంటి నాయకులకు ప్రధాని మోదీ పాపులారిటీ గురించి ఏం తెలుసు..?. తెలంగాణ సర్కార్ రూ. 2.50 లక్షల కోట్ల అప్పులు చేసింది. ప్రభుత్వం ఆ డబ్బులను కేసీఆర్ కుటుంబానికి తరలించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ జేబులు నింపుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోతుంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎన్నికల తర్వాత కేసీఆర్ విహారయాత్ర చేసుకోవచ్చు’’ అని అన్నారు. గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ప్రధాని మోదీ భయం పట్టుకుంది. తెలంగాణ ప్రజలను తప్పుడు హామీలతో కేసీఆర్ మోసం చేశారు’’ అని ఆరోపించారు. ఇది కూడా చదవండి: హెచ్ఐసీసీ వద్ద ఉద్రిక్తత.. పోలీసులు అలర్ట్ -
ఒలంపిక్ పతకం సాధిస్తా.. నాకు మరింత మద్దతు కావాలి: నిఖత్ జరీన్
సాక్షి, న్యూఢిల్లీ: వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ స్వర్ణ పతక విజేత నిఖత్ జరీన్‌కు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సన్మానం చేశారు. ఆమెతో పాటు ఇండియన్ బాక్సింగ్ అసోసియేషన్ నేతృత్వంలో పలువురు బాక్సర్లను సన్మానించారు. కాంస్య పతక విజేతలు మనీషా , పర్వీన్‌కు ఆయన సన్మానం చేశారు. ఈ సందర్భంగా నిఖత్ జరీన్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఒలంపిక్ పతకం సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించడం ఆనందంగా ఉంది. నా తదుపరి లక్ష్యం కామన్వెల్త్ పోటీలు. ఇక ఒలంపిక్ పతకం సాధించేందుకు రెట్టింపు కృషి అవసరం. ఇందుకు నాకు ఇంకా చాలా మద్దతు కావాలి. ముస్లిం మహిళగా ఈ క్రీడల్లో రాణించే అంశంపై ఇబ్బందులు ఎదురైనా అన్నింటినీ అధిగమించాను. మా నాన్న కేవలం ఆటపై మాత్రమే దృష్టి సారించమన్నారు. రోజూ ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటల పాటు సాధన చేశా. నా కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహం, స్పాన్సర్లు మద్దతుతో ఇక్కడి వరకు రాగలిగాను. 2014లో తెలంగాణ ప్రభుత్వం నాకు ఆర్థిక సహాయం చేసింది. ఒలంపిక్స్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని ఆశిస్తున్నా’’ అని జరీన్ పేర్కొన్నారు. చదవండి👉🏾IPL 2022- CSK: వచ్చే ఏడాది జడేజా కెప్టెన్‌గా ఉండబోడు.. 16 కోట్లు మిగులుతాయి.. కానీ! చదవండి👉🏾Hijab Row: హిజాబ్‌పై స్పందించిన నిఖత్ జరీన్.. ఆమె ఏమన్నారంటే..? -
అట్టహాసంగా కాన్స్ వేడుకలు: విదేశీ చిత్రాలకు కేంద్రమంత్రి ఆఫర్లు
75వ కాన్స్ చలన చిత్రోత్సవాలు ఫ్రాన్స్‌లో వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భారతదేశం ‘కంట్రీ ఆఫ్ హానర్’గా నిలిచింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. కాన్స్ వేదిక సాక్షిగా భారతదేశంలో చిత్రీకరించే విదేశీ చిత్రాలకు నగదు ప్రోత్సాహకాలను ప్రకటించారు అనురాగ్ ఠాకూర్. తొలి రోజు (మంగళవారం) చిత్రోత్సవాల్లో మన తారలు మెరిశారు. రెండో రోజూ ఇదే జోరు కొనసాగింది. కమల్‌హాసన్ ‘విక్రమ్’, మాధవన్ ‘రాకెట్రీ: ది నంబియార్’ చిత్రాల ట్రైలర్స్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దర్శకత్వంలోని ‘లే మస్క్’ స్క్రీనింగ్‌కి అర్హత పొందిన విషయం తెలిసిందే. మరిన్ని విశేషాలు ఈ విధంగా... ‘‘మా దగ్గర ఫిలిం ఇండస్ట్రీ లేదు. మా దగ్గర సిని‘మా’ (దేశంలో అమ్మని మా అని కూడా అంటారు కాబట్టి ‘మా’ పదాన్ని ఒత్తి పలుకుతూ)’’ ఉంది అని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. కాన్స్ చిత్రోత్సవాల్లో ‘ఇండియన్ పెవిలియన్’ని ప్రారంభించారు అనురాగ్ ఠాకూర్. ఈ వేదికపై 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫీ గోవా 2022) పోస్టర్ని ఆవిష్కరించారు. ‘‘భారతదేశంలో చెప్పడానికి చాలా కథలు ఉన్నాయి. ప్రపంచానికి ‘కంటెంట్ హబ్’గా మారే శక్తి సామర్థ్యాలు ఉన్న దేశం’’ అంటూ కాన్స్ చలన చిత్రోత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సందేశాన్ని కాన్స్ వేదికపై పంచుకున్నారు. ఇంకా అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ – ‘‘గడచిన 20 ఏళ్లల్లో షర్మిలా ఠాగూర్, ఐశ్వర్యా రాయ్, విద్యా బాలన్, శేఖర్ కపూర్ వంటి ఎందరో కాన్స్ ఫెస్టివల్లో జ్యూరీ సభ్యులుగా ఉన్నారు. ఈసారి ఆ గౌరవం దీపికా పదుకోన్‌కి దక్కింది. భారతదేశంలో చిత్రీకరించే విదేశీ చిత్రాలను ప్రోత్సహించే దిశగా తీసుకున్న నిర్ణయాలను ఈ వేదికపై ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాను. భారతదేశంలో విదేశీ చిత్రాల ఆడియో–విజువల్ కో–ప్రొడక్షన్, షూటింగ్ కోసం 260 వేల డాలర్ల (దాదాపు రూ. 2 కోట్లు) పరిమితితో 30 శాతం వరకు నగదు ప్రోత్సాహాన్ని అందిస్తాం. అలాగే దేశంలో జరిపే విదేశీ చిత్రాల షూటింగ్‌కు 15 శాతం లేదా అంతకంటే ఎక్కువ మంది భారతీయ సిబ్బందిని నియమిస్తే 65 వేల డాలర్ల (రూ. 50 లక్షలు) పరిమితితో అదనపు బోనస్ ఇస్తాం. భారతదేశాన్ని ప్రపంచంలోని కంటెంట్ హబ్‌గా మార్చడానికి, ఫిల్మ్ మేకింగ్, ఫిల్మ్ ప్రొడక్షన్, పోస్ట్–ప్రొడక్షన్ తదితర అంశాలకు భారతదేశాన్ని ప్రపంచానికి గమ్యస్థానంగా మార్చడానికి భారత ప్రభుత్వం చేయగలిగినదంతా చేస్తుంది. జాతీయ ఫిల్మ్ హెరిటేజ్ మిషన్ కింద భారత ప్రభుత్వం ప్రపంచంలోనే అతి పెద్ద ఫిల్మ్ రిస్టోరేషన్ ప్రాజెక్టును ప్రారంభించింది. దీనివల్ల దేశంలోని పలు భాషలకు చెందిన 2,200 చిత్రాలు తమ పూర్వ వైభవం సంతరించుకుంటాయి. భారతదేశం స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లు జరుపుకుంటున్నందున ఈ సంవత్సరం ప్రత్యేకమైనది. ఇది 75వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కావడం విశేషం. ఈ చిత్రోత్సవాల్లో భారతదేశం ‘గౌరవనీయమైన దేశం’గా అర్హత పొందింది కాబట్టి ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. ఈ 75వ కాన్స్ ఉత్సవాల్లో సృజనాత్మకతను, ప్రతిభను సెలబ్రేట్ చేసుకోవడానికి భారతదేశం, ఫ్రాన్స్ కలిశాయి’’ అన్నారు. అనురాగ్ ఠాకూర్‌తో కలసి ప్రముఖ నటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శక–నటుడు శేఖర్ కపూర్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తదితరులు రెడ్ కార్పెట్‌పై నడిచారు. 30 ఏళ్ల తర్వాత కాన్స్‌కి టామ్ క్రూజ్ హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ 1992లో కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొన్నారు. 30 ఏళ్ల తర్వాత ఈ వేడుకలకు హాజరయ్యారాయన. టామ్ క్రూజ్ నటించిన ‘టాప్ గన్: మేవరిక్’ చిత్రం కాన్స్ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కానుంది. 1986లో విడుదలైన ‘టాప్ గన్’కి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. తొలి భాగంలోనూ టామ్ క్రూజ్ హీరోగా నటించారు. స్టార్స్ స్టెప్పేస్తే... కాన్స్‌లో ‘ఇండియన్ పెవిలియన్’ ప్రారంభోత్సవంలో జానపద కళాకారుడు, సంగీత దర్శకుడు మామే ఖాన్ పాట పాడగా దీపికా పదుకోన్, తమన్నా, పూజా హెగ్డే, ఊర్వశీ రౌతేలా స్టెప్పులేశారు. కాన్స్ చిత్రోత్సవాలకు వెళ్ళాలనే నా కల నెరవేరింది. అనురాగ్ ఠాకూర్‌గారి వల్లే ఇది సాధ్యపడింది. విశేషం ఏంటంటే.. ఏదైనా బ్రాండ్‌ని ప్రమోట్ చేయడానికి నేనిక్కడికి రాలేదు. మన దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి వచ్చాను. భారతీయ నటిగా దేశాన్ని సెలబ్రేట్ చేయడానికి వచ్చాను. – పూజా హెగ్డే భారతదేశం చాలా ఏళ్లుగా ప్రపంచ చలనచిత్ర పరిశ్రమకు ఎంతో చేస్తూ వస్తోంది. దేశం స్వాతంత్య్రం పొందిన 75వ సంవత్సరంలో భారతదేశంతో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ భాగస్వామి కావడం నిజంగా అద్భుతం. – తమన్నా ఇండియా శిఖర సమాన ప్రయాణం మొదలైంది. ఇది ప్రారంభమే... భారతదేశం ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేకుండా, కాన్స్ చలన చిత్రోత్సవమే భారతదేశానికి వచ్చే రోజు వస్తుంది. - దీపికా పదుకోన్ View this post on Instagram A post shared by Global Pageant Buzz (@globalpageantbuzz) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) చదవండి 👇 ఆది పినిశెట్టి పెళ్లి వేడుకల్లో టాలీవుడ్ హీరోల డ్యాన్స్ సీరియల్ నటి వివాహం.. నెట్టింట వీడియో వైరల్ -
పరిస్థితులను బట్టి ‘ఏషియాడ్’పై నిర్ణయం: ఠాకూర్
ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనాలోని హాంగ్జౌ నగరంలో జరిగే ఆసియా క్రీడల్లో భారత్ బరిలోకి దిగుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమని... ఈ మెగా ఈవెంట్ సన్నాహాలపై ఆతిథ్య చైనా దేశం నుంచి ఫీడ్‌బ్యాక్ వచ్చాకే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ప్రస్తుతం చైనాలో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఒకవేళ కరోనా కేసులు నియంత్రణలోకి రాకపోతే మాత్రం ఆసియా క్రీడలు వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయి. -
సైనా X ‘బాయ్’
హైదరాబాద్: ఒలింపిక్ కాంస్యం, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత, కాంస్యాలు, కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో పతకాలతో పాటు సూపర్ సిరీస్ టోర్నీలలో లెక్క లేనన్ని విజయాలు... భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఘనత ఇది. అయితే ఇప్పుడు ఇదంతా గతం. 32 ఏళ్ల వయసులో ఫామ్ కోల్పోయి ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న సైనా మునుపటి ప్రదర్శన ఇవ్వలేకపోతోంది. అనామక, యువ షట్లర్ల చేతుల్లో వరుస పరాజయాలు ఎదుర్కొంటోంది. తాను ఆడిన గత ఆరు టోర్నీలలో ఆమె రెండో రౌండ్ దాటలేకపోయింది. కరోనా కాలాన్ని పక్కన పెడితే 2019నుంచి సైనా ఒకే ఒక్క టోర్నీలో సెమీఫైనల్ వరకు చేరగలిగింది. ఇలాంటి స్థితిలో రాబోయే పెద్ద ఈవెంట్లలో సైనాకు భారత బృందంలో చోటు దక్కడం కష్టంగా మారింది. తాజాగా ఆసియా, కామన్వెల్త్ క్రీడలతో పాటు ఉబెర్ కప్ సెలక్షన్ ట్రయల్స్‌కు కూడా సైనా దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అయితే ట్రయల్స్‌తో సంబంధం లేకుండా భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నేరుగా ఎంపిక చేసిన ప్లేయర్లలో కూడా సైనా పేరు లేదు. దాంతో ఆమె ‘బాయ్’పై విమర్శలకు దిగిం ది. ఈ నేపథ్యంలో మున్ముందు రాబోయే టోర్నీల్లో సైనా ఎలా భాగం కాబోతుందనేది ఆసక్తికరం. ఏం జరిగిందంటే... ఆసియా, కామన్వెల్త్ క్రీడలు, థామస్– ఉబెర్ కప్ కోసం నేటినుంచి ఆరు రోజుల పాటు ఈ నెల 20 వరకు సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు ‘బాయ్’ ప్రకటించింది. ఇందులో 120 మంది షట్లర్లు పాల్గొనబోతున్నారు. ట్రయల్స్‌కు ఇబ్బంది రాకూడదని కొరియా మాస్టర్స్ టోర్నీకి కూడా భారత్‌నుంచి ఎవరూ పాల్గొనకుండా ‘బాయ్’ జాగ్రత్తలు తీసుకుంది. అయితే తాను దీనికి హాజరు కావడం లేదని సైనా ఇప్పటికే ‘బాయ్’కు వెల్లడించింది. మరో వైపు సెలక్షన్స్‌కు ఒక రోజు ముందే గురువారం పై ఈవెంట్లలో నేరుగా పాల్గొనే ఆటగాళ్ల జాబితాను ‘బాయ్’ వెల్లడించింది. వరల్డ్ టాప్–15 ర్యాంక్‌లో ఉండటం అర్హతగా పేర్కొంటూ సింధు, శ్రీకాంత్, లక్ష్య సేన్, డబుల్స్ జోడి సాత్విక్–చిరాగ్‌లను ఎంపిక చేసింది. టాప్–15లో లేకపోయినా ఇటీవలి చక్కటి ప్రదర్శనకు గుర్తింపునిస్తూ హెచ్ఎస్ ప్రణయ్‌కు కూడా అవకాశం కల్పించింది. అయితే ఫామ్‌లో లేకపోయినా, తన ఘనతలు, అనుభవం దృష్ట్యా తనకూ నేరుగా అవకాశం లభిస్తుందని సైనా ఆశించి ఉండవచ్చు. కానీ అలా జరగలేదు. దీనిపై సైనా స్పందించింది. వరుస టోర్నీలతో అలసిపోవడం వల్లే తాను ట్రయల్స్‌కు రావడం లేదని... పరిస్థితి చూస్తుంటే ‘బాయ్’ ఉద్దేశపూర్వకంగానే తనను పక్కన పెట్టినట్లుగా ఉందని ఆమె విమర్శించింది. ట్విట్టర్లో తన వ్యాఖ్యలను ఆమె కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు కూడా ట్యాగ్ చేసింది. దీనిపై ‘బాయ్’ ఎలా స్పందిస్తుందో చూడాలి. ‘గత కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో నేను సాధించిన పతకాలను నిలబెట్టుకునే ఉద్దేశం నాకు లేదన్నట్లుగా కథనాలు వస్తున్నాయి. కానీ గత మూడు వారాలుగా వరుసగా యూరోపియన్ సర్క్యూట్లో టోర్నీలు ఆడటంతో పాటు ఆసియా చాంపియన్‌షిప్ కూడా ఉండటంతోనే నేను ట్రయల్స్‌కు హాజరు కావడం లేదు. రెండు వారాల వ్యవధిలో ఒక సీనియర్ ప్లేయర్ ఇలా వరుసగా ఆడటం చాలా కష్టం. గాయాల ప్రమాదం కూడా ఉంటుంది. సెలక్షన్స్‌కు తక్కువ వ్యవధి ఉండటంపై నేను ‘బాయ్’ను అడిగినా వారు స్పందించలేదు. నన్ను కామన్వెల్త్, ఆసియా క్రీడలనుంచి తప్పించడం వారికీ సంతోషం కలిగిస్తున్నట్లుంది. ప్రస్తుతం నా ప్రపంచ ర్యాంక్ 23. ఇటీవల ఆల్ ఇంగ్లండ్‌లో యమ గూచిని దాదాపుగా ఓడించాను. ఇండియా ఓపెన్‌లో ఒక్క పరాజయంతో ‘బాయ్’ నన్ను తక్కువ చేసి చూపిస్తోంది’. –సైనా నెహ్వాల్ -
ఐసీసీ చైర్మన్ పదవి.. బరిలో గంగూలీ, జై షాతో పాటు కేంద్ర మంత్రి..!
Anurag Thakur In ICC Chairman Race: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్‌గా గ్రెగ్ బార్ల్కే (న్యూజిలాండ్) పదవీకాలం ఈ ఏడాది నవంబర్‌తో ముగియనుండడంతో ఆ పదవి కోసం ఇప్పటి నుంచి పోటీ మొదలైంది. క్రికెట్‌కు సంబంధించి అత్యున్నతమైన ఈ పదవిని దక్కించుకునేందుకు బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ, ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు జై షా సహా ఓ కేంద్ర మంత్రి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మాజీ బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఐసీసీ చైర్మన్ గిరికి అర్హత సాధించగా.. బీసీసీఐ బాస్ హోదాలో గంగూలీ, ఐసీసీ ఆఫీస్ బేరర్‌గా జై షా సైతం ఈ పదవికి అర్హత కలిగి ఉన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక పదవిని దక్కించుకునేందుకు గంగూలీ ముందు నుంచే పావులు కదపగా.. తాజాగా జై షా, అనురాగ్ ఠాకూర్ సైతం ఐసీసీ పీఠాన్ని అధిరోహించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కాగా, ఐసీసీ చైర్మన్లుగా గతంలో నలుగురు భారతీయులు పని చేసిన సంగతి తెలిసిందే. తొలుత బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త జగ్మోహన్ దాల్మియా, ఆతరువాత మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్, చెన్నై సూపర్ కింగ్స్ అధినేత శ్రీనివాసన్, సీనియర్ న్యాయవాది శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్ హోదాలో పని చేశారు. చదవండి: రెచ్చిపోయిన హనుమ విహారీ.. సెంచరీ, హాఫ్ సెంచరీ సహా 216 పరుగులు..! -
మీడియా కమిషన్ ఏర్పాటు ఆలోచన లేదు: అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ: దేశంలో మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలేదీ లేదని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం రాజ్యసభలో తేల్చిచెప్పారు. మీడియాలో అవకతవకల విషయంలో ప్రభుత్వం తరచుగా భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరుపుతోందని, వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని ఉపయోగించుకుంటోందని వెల్లడించారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలో కమ్యూనికేషన్లు, ఐటీపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం తన నివేదికను గతంలో సమర్పించింది. మీడియాలో అవకతవకలను అరికట్టడానికి మీడియా కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. భారత్‌లో మీడియా విశ్వసనీయత, సమగ్రతను క్రమంగా కోల్పోతోందని పార్లమెంటరీ స్థాయీ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. మీడియా రంగంలో పెడ ధోరణులను నియంత్రించడానికి మీడియా కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాల్సిన అససరం ఉందని ప్రతిపాదించింది. -
పునరుత్పాదక ఇం‘ధన’ శక్తి
న్యూఢిల్లీ: మినీరత్న కంపెనీ భారత పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (ఐఆర్ఈడీఏ)కు రూ.1,500 కోట్ల నిధులను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనితోపాటు మహమ్మారి సమయంలో మారటోరియం విషయంలో రుణగ్రహీతలకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపులకు సంబంధించి బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు రూ.974 కోట్లు క్యాబినెట్ మంజూరు చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం అనంతరం విలేకరులతో సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాలను తెలిపారు. ఆర్బీఐ రుణ నిబంధనల నేపథ్యం. ఆర్బీఐ రుణ నిబంధనల నేపథ్యంలో ఐఆర్ఈడీఏ నిధుల కల్పన నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. తాజా క్యాబినెట్ నిర్ణయం నేపథ్యంలో, పునరుత్పాదక ఇంధన రంగానికి ఐఆర్ఈడీఏ తన రుణ సామర్థ్యాన్ని రూ.12,000 కోట్లకు పెంచుకోవడానికి వీలు కలుగుతుందని ఆయన తెలిపారు. ‘‘ పునరుత్పాదక ఇంధన రంగంలో ఐఆర్ఈడీఏ కీలక పాత్ర పోషిస్తోంది. పునరుత్పాదక శక్తికి ఆర్థిక సహాయం చేయడానికి ఈ సంస్థ ఏర్పాటయ్యింది. గత ఆరు సంవత్సరాల్లో దీని పోర్ట్‌ఫోలియో రూ. 8,800 కోట్ల నుంచి రూ.27,000 కోట్లకు పెరిగింది’’ అని ఠాకూర్ చెప్పారు. ‘అయితే ఆర్బీఐ తాజా రుణ నిబంధనల ప్రకారం, ఒక సంస్థ తన నికర విలువలో 20 శాతం మాత్రమే రుణం ఇవ్వబడుతుంది. ఐఆర్ఈడీఏ నికర విలువ రూ. 3,000 కోట్లు. దీని ప్రకారం ప్రస్తుతం రూ. 600 కోట్ల వరకు మాత్రమే రుణాలు ఇవ్వగలదు. తాజా కేబినెట్ నిర్ణయంతో సంస్థ నెట్‌వర్త్ రూ.4,500 కోట్లకు పెరుగుతుంది. దీనివల్ల సంస్థ తన రుణ సామర్థ్యాన్ని సంస్థ భారీగా పెంచుకోగలుగుతుంది’’ అని కేంద్ర మంత్రి వివరించారు. భారీ ఉపాధి కల్పనకు దోహదం: ఐఆర్ఈడీఏ కేబినెట్ నిర్ణయం వల్ల సంస్థలో ఏటా దాదాపు 10,200 ఉద్యోగాల కల్పనకు సహాయపడుతుందని ఐఆర్ఈడీఏ పేర్కొంది. అలాగే ఒక సంవత్సరంలో సుమారు 7.49 మిలియన్ టన్నుల సీఓ2కు సమానమైన ఉద్గారాల తగ్గింపుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని తెలిపింది. ఐఆర్ఈడీఏ ఎంఎన్ఆర్ఈ (మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ) నియంత్రణలో పనిచేస్తుంది. పునరుత్పాక ఇంధన రంగానికి రుణాలను అందించడానికిగాను బ్యాంకింగ్ యేతర ఫైనాన్షియల్ కంపెనీగా ఐఆర్ఈడీఏ 1987 ఏర్పాటయ్యింది. ఈ రంగ ప్రాజెక్ట్ ఫైనాన్షింగ్‌లో గడచిన 34 సంవత్సరాల్లో సంస్థ కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది. ఎస్బీఐకి రూ.974 కోట్లు మహమ్మారి కరోనా మొదటి వేవ్ సమయంలో 2020లో అమలు చేసిన రుణ మారటోరియంకు సంబంధించి రీయింబర్స్‌మెంట్‌గా (పునఃచెల్లింపులుగా) బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు రూ. 973.74 కోట్లు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి ఠాకూర్ తెలిపిన సమాచారం ప్రకారం, నిర్దిష్ట రుణ ఖాతాలలో రుణగ్రహీతలకు ఆరు నెలల పాటు చక్రవడ్డీ– సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం విషయంలో చెల్లింపులకు ఉద్దేశించి ఎక్స్‌గ్రేషియా పథకం కోసం బడ్జెట్ రూ.5,500 కోట్లు కేటాయించింది. ఇందులో 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.4,626 కోట్ల చెల్లింపులు జరిగాయి. రూ.1,846 కోట్ల అదనపు క్లెయిమ్స్ పెండింగులో ఉన్నాయి. -
రెండోరోజు ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్
-
చైనాకు గట్టి షాక్!.. కీలక స్కీమ్‌కు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: దేశీయంగా సెమీకండెక్టర్లు, డిస్ప్లే తయారీకి రూ.76 వేల కోట్ల విలువైన ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ) పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రి వర్గం పచ్చజెండా ఊపినట్లు అనురాగ్ ఠాకూర్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. భారతదేశాన్ని ఎలక్ట్రానిక్స్ కేంద్రంగా మార్చే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద వచ్చే 6 ఏళ్లలో రూ.76,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. భారత్‌లో సెమీకండెక్టర్ల తయారీకి అవసరమైన వ్యస్థలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పలు రకాల రాయితీలను ఇవ్వనున్నట్లు టెలికాం & ఐటీ మంత్రి అశ్వినీ వైష్నావ్ తెలిపారు. సెమీకండెక్టర్ వేఫర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఏర్పాటుకు అయ్యే మూలధన వ్యయంలో 25శాతం వరకు రాయితీ ఇవ్వనుంది. అదే విధంగా అసెంబ్లింగ్, ప్యాకింగ్,టెస్టింగ్, చిప్ డిజైన్ వంటి వాటికి ఇటువంటి రాయితీలనే ఇవ్వనున్నారు. కేంద్రం ఈ తీసుకున్న నిర్ణయంతో సెమీకండెక్టర్ల తయారీలో అగ్రగామిగా ఉన్న చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు. కేంద్రా క్యాబినెట్ ఆమోదం తెలపడంతో త్వరలో పాలసీ విధి విధానాలను పూర్తి స్థాయిలో రూపొందించడం, ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తిగా ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించడం మొదలైన ప్రక్రియను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ (మెయిటీ) ప్రారంభించనుంది. (చదవండి: రూపే డెబిట్ కార్డు, భీమ్ యూపీఐ యూజర్లకు కేంద్రం తీపికబురు!) ఉత్పాదన ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకాల ద్వారా దేశీయంగా తయారీ, ఎగుమతుల పరిధిని కేంద్రం గణనీయంగా విస్తరించింది. తాజా సెమీకండక్టర్ విధానంతో దేశీయంగా తయారీ కార్యకలాపాలు మరింతగా పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ముందుగా డిస్ప్లేల కోసం ఒకటి లేదా రెండు ఫ్యాబ్ యూనిట్లు, అలాగే విడిభాగాల డిజైనింగ్..తయారీ కోసం 10 యూనిట్లు ఏర్పాటవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వివరించాయి. అన్నింటికీ కీలకంగా చిప్.. మొబైల్ హ్యాండ్సెట్స్ మొదలుకుని ఆటోమొబైల్స్ దాకా అనేక ఉత్పత్తుల్లో సెమీ కండక్టర్లు(చిప్) కీలకంగా ఉంటున్నాయి. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌బడ్స్, వాషింగ్ మెషీన్ల వంటి అనేక ఉత్పత్తుల్లో వీటిని వినియోగిస్తున్నారు. సాధారణంగా శాంసంగ్, ఎన్ఎక్స్పీ, క్వాల్కామ్ వంటి చిప్ తయారీ సంస్థల కోసం తైవానీస్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్(టీఎంఎస్సీ)లాంటి కంపెనీలు వీటిని ఉత్పత్తి చేస్తున్నాయి. ఇలా తయారైన చిప్‌లను ఆయా కంపెనీలు పరీక్షించి, ప్యాకేజ్‌గా చేసి.. సిస్కో, షావొమీ వంటి పరికరాల ఉత్పత్తి కంపెనీలకు విక్రయిస్తున్నాయి. చిప్‌ల తయారీ ప్లాంట్లను ఫ్యాబ్స్ లేదా ఫౌండ్రీలుగా వ్యవహరిస్తారు. (చదవండి: సర్వీసు చార్జీల పేరుతో ఎస్బీఐ భారీగా వడ్డీంపు..!) -
రూపే డెబిట్ కార్డు, భీమ్ యూపీఐ యూజర్లకు కేంద్రం తీపికబురు
న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి కేంద్రం ప్రభుత్వం రూపే డెబిట్ కార్డు, భీమ్ యూపీఐ యూజర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. ఈ ప్రత్యేక పథకానికి నేడు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ఐ అండ్ బి మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ పథకం ఏప్రిల్ 1, 2021 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఖజానా మీద సుమారు రూ.1300 కోట్ల మేర భారం పడనుంది. భీమ్-యూపీఐ ద్వారా రూ.2,000 కంటే తక్కువ విలువ లావాదేవీలు చేసే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. దేశంలో డిజిటల్ చెల్లింపు వ్యవస్థను బలోపేతం చేయడానికి బ్యాంకులు రూపే డెబిట్ కార్డు, భీమ్-యుపీఐ ద్వారా డిజిటల్ లావాదేవీలను చేసేవారికి ప్రోత్సాహకలు అందించనున్నాయి. దేశంలో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను మరింత బలోపేతం చేయడానికి ఇది దోహదపడుతుందని మంత్రివర్గం పేర్కొంది. బ్యాంకు సేవలు అందుకోలేనివారు, దిగువ వర్గాలకు డిజిటల్ చెల్లింపులను అందుబాటులోకి తేవడానికి కేంద్రం ప్రయత్నిస్తుంది. ఈ డిజిటల్ ఏకొ సిస్టమ్ లో పేద ప్రజలను భాగస్వామ్యం చేయాలని చూస్తుంది. (చదవండి: సర్వీసు చార్జీల పేరుతో ఎస్బీఐ భారీగా వడ్డీంపు..!) -
Rohit-Virat: ఆట కంటే ఆటగాళ్లెవరూ గొప్ప కాదు.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
Anurag Thakur Comments On Rohit And Virat Equation: టీమిండియా కెప్టెన్ల(విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ) వ్యవహారంపై సోషల్‌మీడియా వేదికగా రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆట కంటే ఆటగాళ్లు గొప్పవాళ్లేమీ కాదంటూ రోహిత్, విరాట్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రోహిత్ అయినా విరాట్ అయినా బీసీసీఐ నిర్ణయాన్ని గౌరవించి, దానికి కట్టుబడి ఉండాలన్న అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ వ్యవహారాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. కాగా, టీమిండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమిస్తూ బీసీసీఐ ప్రకటించిన అనంతరం రోహిత్, విరాట్ల మధ్య గ్యాప్‌పై సోషల్‌మీడియాలో రకారకాల కథనాలు ప్రచారమయ్యాయి. అయితే, ఈ విషయమై తాజాగా విరాట్ స్పందించాడు. రోహిత్‌తో తనకెటువంటి విభేదాలూ లేవంటూ క్లారిటీ ఇచ్చాడు. రోహిత్ సారధ్యంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమంటూ ప్రకటించాడు. అయితే, ఈ సందర్భంగా కోహ్లి మరో బాంబ్ పేల్చాడు. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించేముందు బీసీసీఐ బాస్ గంగూలీ తనను సంప్రదించాడన్న వార్తలు అవాస్తవమని, వన్డే కెప్టెన్సీ తొలగింపుపై చివరి నిమిషంలో నాకు సమాచారమిచ్చారని, ఈ విషయంలో బీసీసీఐ తనతో ఎటువంటి సంప్రదింపులు జరపలేదని మరో చర్చకు తావిచ్చేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: Virat Kohli: గంగూలీపై కోహ్లి సంచలన వ్యాఖ్యలు.. నేను వన్డే కెప్టెన్ కాదని చెప్పారు! -
సాగు చట్టాల ఉపసంహరణకు కేబినెట్ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: మూడు నూతన వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లు–2021కు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తొలిరోజే ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమయ్యింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. రైతులు వ్యతిరేకిస్తున్న మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోనున్నట్లు మోదీ ఈ నెల 19న అకస్మాత్తుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. చట్టాల ఉపసంహరణకు సంబంధించిన లాంఛనాలను కేబినెట్ పూర్తిచేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. మంత్రివర్గ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో ప్రారంభం కాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ చట్టాలను ఉపసంహరించడానికి చేయడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. పంటలకు కనీస మద్దతు(ఎంఎస్పీ)తోపాటు ఇతర కీలకం అంశాలపై నిర్ణయాలు తీసుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు. దీనిపై కేబినెట్లో చర్చించారా? అని ప్రశ్నించగా.. అనురాగ్ ఠాకూర్ సమాధానమివ్వలేదు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 29న ప్రారంభమై, డిసెంబర్ 23న ముగుస్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ మాటలకు, చేతలకు మధ్య కచ్చితంగా పొంతన ఉంటుందని చెప్పడానికి సాగు చట్టాల ఉపసంహరణ బిల్లును కేబినెట్లో ఆమోదించడమే ఒక చక్కటి నిదర్శనమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 80 కోట్ల మందికి లబ్ధి పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేసేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనను(పీఎంజీకేఏవై) మరో నాలుగు నెలలపాటు పొడిగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి 2022 వరకూ పథకాన్ని కొనసాగిస్తారు. పథకం ఐదో దశను అమలు చేస్తారు. జాతీయ ఆహార భద్రతా చట్టం(ఎన్ఎఫ్ఎస్ఏ), అంత్యోదయ అన్న యోజన ప్రాధాన్యతా కుటుం బాల పథకం పరిధిలోని లబ్ధిదారులందరికీ ఈ పథకం కింద నెలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొ ప్పున ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేసా ్తరు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం(డీబీటీ) పరిధి లోకి వచ్చే పేదలకు కూడా ఈ ప్రయోజనం చేకూరుతుంది. 80 కోట్ల మందికిపైగా రేషన్ కార్డుదారులు లబ్ధి పొందనున్నారు. పథకం ఐదో దశలో అదనంగా రూ.53,344.52 కోట్లమేర రాయితీ అవసరమని అంచనా. ఈ దశలో లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి మొత్తం 1.63 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు అవసరం. ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) కింద ఇచ్చే రేషన్ సరుకులకు ఇవి అదనం. ‘ఓ–స్మార్ట్’కు రూ.2,177 కోట్లు భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖకు చెందిన పలు పథకాల సమాహారమైన సముద్ర సేవలు, మోడలింగ్, అనువర్తన, వనరులు, సాంకేతికత (ఓ–స్మార్ట్) కార్యక్రమాన్ని 2021–26లో రూ.2,177 కోట్లతో కొనసాగించడానికి కేంద్ర కేబినెట్ అంగీకరించింది. ఈ పథకం కింద ఏడు ఉప పథకాలున్నాయి. సముద్ర సాంకేతికత, సముద్ర మోడలింగ్, అడ్వైజరీ సర్వీసులు (ఓఎంఏఎస్), సముద్ర పరిశీలక నెట్వర్క్ (ఓఓఎస్), సముద్ర నిర్జీవ వనరులు, సముద్ర జీవ వనరులు, సముద్ర పర్యావరణం (ఎంఎల్‌ఆర్‌ఈ), కోస్తా పరిశోధన, నిర్వహణ, పరిశోధక నౌకల నిర్వహణ వంటివి ఉన్నాయి. ఈ ఉప పథకాలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ(ఎన్ఐఓటీ)–చెన్నై, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఐఎన్సీఓఐఎస్)–హైదరాబాద్, నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ ఓషియన్ రిసెర్చ్ (ఎన్సీపీవోఆర్)–గోవాతోపాటు పలు జాతీయ సంస్థలు అమలు చేస్తాయి. ఏసీఆర్‌ఓఎస్‌ఎస్ కొనసాగింపు 14వ ఆర్థిక సంఘం నుంచి తదుపరి 2021–2026 ఆర్థిక సంఘం వరకూ అట్మాస్పియర్ క్లైమేట్ రీసెర్చ్–మోడలింగ్ అబ్జర్వింగ్ సిస్టమ్స్, సర్వీసెస్ (ఏసీఆర్‌ఓఎస్‌ఎస్) కొనసాగింపునకు కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. దీనికి రూ.2,135 కోట్లు అవసరమని అంచనా వేసింది. విద్యార్థులకు రూ.3,054 కోట్ల స్టైపెండ్ కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్(నాట్స్)లో భాగంగా 2021–22 నుంచి 2025–26 వరకూ శిక్షణ పొందే అప్రెంటీస్లకు స్టైపెండ్ కింద రూ.3,054 కోట్లు ఇవ్వాలని కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) నిర్ణయించింది. విద్యుత్ పంపిణీ ప్రైవేట్‌కు.. కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ(డీఎన్‌హెచ్), డయ్యూ డామన్(డీడీ)లో విద్యుత్ పంపిణీ వ్యాపారాన్ని ప్రైవేట్‌పరం చేయడానికి స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ) ఏర్పాటు చేయడం, అత్యధిక వేలంపాటదారుకు కొత్తగా ఏర్పాటైన కంపెనీ తాలూకూ ఈక్విటీ షేర్లు విక్రయించడంతోపాటు ఉద్యోగులు బాధ్యతలు నెరవేర్చడం కోసం ట్రస్టు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రైవేటీకరణ ప్రక్రియ డీఎన్‌హెచ్, డీడీకి చెందిన 1.45 లక్షలకు పైగా విద్యుత్ వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించడానికి తోడ్పడుతుందని కేబినెట్ ఆశిస్తోంది. -
81 కోట్ల రేషన్ కార్డు దారులకు కేంద్రం శుభవార్త!
న్యూఢిల్లీ: రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా మహమ్మారి కారణంగా పెద ప్రజలకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద అందిస్తున్న ఉచిత రేషన్ కార్యక్రమాన్ని మార్చి 2022 వరకు పొడగిస్తున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ 'ఉచిత రేషన్ కార్యక్రమాన్ని 2022 మార్చి వరకు అందించడానికి 'ప్రధాని గరీబ్ కళ్యాణ్ అన్నా యోజనను పొడిగించాలని కేంద్రం కేబినెట్ నిర్ణయించినట్లు ఠాకూర్ తెలిపారు. గతేడాది కోవిడ్-19 వల్ల విధించిన లాక్డౌన్ దృష్ట్యా పెదప్రజలకు ఉచితంగా రేషన్ అందించడానికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన(పీఎంజీకెఏవై)ని మార్చి 2020లో ప్రకటించారు. 2020 ఏప్రిల్‌లో ఈ పథకం మొదలైంది. కరోనా సెకండ్ వేవ్కారణంగా ఈ ఏడాది జూన్ వరకు పొడగించారు. ఆ తర్వాత కరోనా పరిస్థితుల వల్ల పేదలు ఇబ్బంది పడకుండా.. జూన్‌లో మరో ఐదు నెలలు( 2021 నవంబర్ 30 వరకు) పొడిగించారు. ఇప్పుడు మళ్లీ మరో నాలుగు నెలలు పొడగించారు. దేశవ్యాప్తంగా జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఎ) కింద గుర్తించిన 81 కోట్ల రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్ నుంచి ఉచితంగా రేషన్ సరఫరా చేస్తుంది. ప్రతి నెల 5 కిలోల ఆహార ధాన్యాలను(గోధుమ/బియ్యం) ఉచితంగా పంపిణీ చేస్తుంది. Cabinet decides to extend additional free 5-kg foodgrains scheme by four months till March 2022: Union Minister Anurag Thakur — Press Trust of India (@PTI_News) November 24, 2021 (చదవండి: వర్క్‌ఫ్రమ్ హోం.. గూగుల్‌కు ఉద్యోగుల ఝలక్!) -
పల్లెపల్లెకూ మొబైల్
సాక్షి, న్యూఢిల్లీ: తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మొబైల్ సేవలు లేని గ్రామాలకు 4జీ సేవలు అందించడానికి కేంద్రం సన్నద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాల్లో 1,218 గ్రామాలు సహా దేశవ్యాప్తంగా 44 ఆకాంక్ష (యాస్పిరేషనల్) జిల్లాల్లోని 7,287 గ్రామాలకు 4జీ సేవలు అందించడంలో భాగంగా యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్ఓఎఫ్) పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీలు బుధవారం సమావేశమయ్యాయి. అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. యూఎస్ఓఎఫ్ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ , ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశాల్లోని 44 ఆకాంక్ష జిల్లాల్లో 7,287 గ్రామాల్లో సుమారు రూ.6,466 కోట్ల అంచనా వ్యయంతో 4జీ ఆధారిత మొబైల్ సేవలు అందించనున్నట్లు తెలిపారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాల అనంతరం ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ... ఏపీలోని ఆకాంక్ష జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, కడపల్లోని మారుమూల గ్రామాలకు మొబైల్ సేవలు విస్తరించనున్నట్లు తెలిపారు. విశాఖ జిల్లాలో 1,054, విజయనగరంలో 154, కడప జిల్లాలో 10 గ్రామాల్లో మొబైల్ సేవల విస్తరణకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని తెలిపారు.మొత్తంగా 18 నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. సాధ్యసాధ్యాలు పరిగణనలోకి తీసుకొని పరిగణలోకి తీసుకొని సాధ్యమైనంత ఎక్కువగా సోలర్ పవర్ బ్యాటరీలు ద్వారా టెలికాం టవర్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. 2022 వరకు పీఎంజీఎస్‌వై పథకం ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) పథకం ఫేజ్ 1, 2 లను సెప్టెంబరు 2022 వరకూ కొనసాగించనున్నట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. రూ.33,822 కోట్లతో గిరిజన, మారుమూల ప్రాంతాల్లో 32,152 కి.మీ.ల మేర రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. మైదాన ప్రాంతాల్లో 500 పైగా, ఈశాన్య, పర్వత ప్రాంతాల్లో 250పైగా జనాభా ఉన్న గ్రామాలకు రహదారుల అనుసంధానం నిమిత్తం కేంద్రం పీఎంజీఎస్‌వైను ప్రారంభించింది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు రహదారుల అనుసంధానం (ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఏ) ద్వారా 9 రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో 4,490 కిలోమీటర్ల మేర రహదారిలో 105 వంతెనలు ఇప్పటికే పూర్తిచేశామన్నారు. 5,714 కిలోమీటర్ల రహదారి, 358 వంతెనలు పూర్తి కావాల్సి ఉండగా మరో 1,887 కిలోమీటర్ల రహదారి, 40 వంతెనల నిర్మాణాలకు అనుమతులు వచ్చినట్లు తెలిపారు. ఈ పథకాన్ని మార్చి 2023 వరకు కొనసాగించడం ద్వారా ఈశాన్య రాష్ట్రాలు, పర్వత ప్రాంతాల రాష్ట్రాల్లోని మిగిలిన పనులు పూర్తి కానున్నాయని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. -
Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం(ఎంపీ ల్యాండ్స్) నిధుల పునరుద్ధరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన భాగం కోసం ఈ పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు కేంద సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన భాగానికి ఈ పథకాన్ని పునరుద్ధరించినట్లు తెలిపారు. 2025-26 వరకు ఈ పథకం కొనసాగుతుందని పేర్కొన్నారు. చదవండి: ఏ సీఎంకి రాని కష్టం మిజోరాం ముఖ్యమంత్రికే: కేంద్రానికి లేఖ దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి ఒక్కో ఎంపీకి రూ. 2 కోట్ల చొప్పున ఒకే విడుదలో అందనున్నాయని పేర్కొన్నారు. 2022- 2023 ఆర్థిక సంవత్సరం నుంచి ఏడాదికి రూ. 5 కోట్లు.. రెండు విడతలుగా రూ. 2.5 కోట్ల చొప్పునమంజూరు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే గతేడాది ఏప్రిల్‌లో కేంద్రం ఎంపీ ల్యాండ్స్‌ను కరోనా మహమ్మారి కారణంగా నిలిపి వేసింది. ఈ నిధులను కోవిడ్ ఆరోగ్య సేవలకు వినియోగిస్తామని పేర్కొంది. చదవండి: లోక్‌సత్తా, ఎఫ్డీఆర్ ఆరోగ్య నమూనాలో ఏముందంటే... అలాగే పత్తి కొనుగోలు కోసం కాటన్ కార్పొరేషన్‌కు భారీగా నిధులు విడుదల చేసింది. పత్తి మద్దతు ధర కోసం రూ. 17,408 కోట్ల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే విధంగా గిరిజన నాయకుడు, స్వతంత్ర్య సమర యోధుడు బిర్సా ముండా జన్మదినమైన నవంబర్ 15ను జనజాతీయ గౌరవ్ దివస్‌గా ప్రకటించాలని క్యాబినెట్ నిర్ణయించింది. గిరిజన ప్రజల అద్భుతమైన చరిత్ర, సంస్కృతి, విజయాలను జరుపుకోవడానికి నవంబర్ 15 నుంచి నవంబర్ 22 వరకు వారం రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించాలని కేంద్ర మంత్రి మండలి నిర్ణయించిందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. -
Anurag Thakur: ‘కామన్వెల్త్’పై హెచ్ఐ ఎలా నిర్ణయిస్తుంది?
Anurag Thakur Comments On Hockey India Decison: వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్ గేమ్స్ నుంచి భారత హాకీ జట్లు తప్పుకుంటున్నట్లు హాకీ ఇండియా (హెచ్ఐ) తీసుకున్న ఏకపక్ష నిర్ణయం చెల్లదని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. జాతీయ క్రీడా సమాఖ్యలు ఇలాంటి కీలక అంశాలపై ప్రభుత్వాన్ని లేదంటే సంబంధిత శాఖను సంప్రదించాలన్నారు. నిర్ణయాధికారాన్ని ప్రభుత్వానికే వదిలేయాలని... జట్లు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాయని, క్రీడా సమాఖ్యలకు కాదని ఠాకూర్ అన్నారు. చదవండి: CSK Vs DC: చెన్నై అడుగు టైటిల్ వైపు -
కలకత్తా హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
-
‘టాప్స్’ కొనసాగిస్తాం: అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ: విశ్వ క్రీడల్లో పతక విజేతలను తయారు చేసేందుకు ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్’ (టాప్స్)ను కొనసాగిస్తామని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. 2024–పారిస్, 2028–లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ క్రీడల వరకు ‘టాప్స్’ను పొడిగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. భారత ఒలింపిక్ సంఘం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో టోక్యో పతక విజేతలకు అనురాగ్ ఠాకూర్ ప్రోత్సాహకాలు అందజేశారు. ఐఓఏ స్వర్ణ విజేత నీరజ్ చోప్రాకు రూ. 75 లక్షలు, ‘రజత’ విజేతలు మీరాబాయి, రవి లకు రూ. 50 లక్షలు చొప్పున, కాంస్యాలు గెలిచిన సింధు, లవ్లీనా, బజరంగ్‌లకు రూ. 25 లక్షలు చొప్పున, హాకీ టీమ్ ఈవెంట్లో కాంస్యం గెలిచిన జట్టు సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున బహూకరించారు. -
టోక్యో పారా ఒలింపిక్స్‌కు పయనమైన భారత బృందం
న్యూఢిల్లీ: టోక్యో పారా ఒలింపిక్స్‌కు భారత బృందం పయనమైంది. 54 మందితో టోక్యోకు భారత బృందం బయల్దేరింది. ఆటగాళ్లకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వీడ్కోలు పలికారు. పారా ఒలింపిక్స్‌లో 9 క్రీడాంశాల్లో భారత ఆటగాళ్లు పోటీపడనున్నారు. ఈనెల 27న ఆర్చరీతో భారత్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. కాగా రియో పారా ఒలింపిక్స్ 2016లో చైనా 105 స్వర్ణాలు, 81 రజతాలు, 51 కాంస్యాలు కలిపి మొత్తంగా 237 పతకాలు సాధించింది. ఇక బ్రిటన్ 64, ఉక్రెయిన్ 41, అమెరికా 40 స్వర్ణాలు సాధించాయి. బ్రెజిల్ 14 బంగారం పతకాలు సాధించి ఎనిమిదో స్థానంలో నిలువగా.. భారత్ రెండు స్వర్ణాలు, ఒక రజతం, కాంస్యం సాధించి 42వ స్థానంలో నిలిచింది. -
టోక్యో ఒలింపిక్స్ విజేతలకు క్రీడాశాఖ సత్కారం
-
బాయ్స్.. మీరు సాధించేశారు.. ఇక కేకలే!
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీతో జరిగిన కాంస్య పతక పోరులో గెలుపొందిన భారత పురుషుల హాకీ జట్టుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత ఒలింపిక్ పతకంతో తిరిగి వస్తున్నందుకు భారతీయుల గుండెలు ఉప్పొంగిపోతున్నాయి. సోషల్ మీడియా ద్వారా పలువురు ఈ విజయం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వెల్డన్ బాయ్స్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సరికొత్త చరిత్రకు నాంది: భారత రాష్ట్రపతి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ భారత పురుషుల హాకీ జట్టును అభినందించారు. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్ పతకం గెలిచినందుకు శుభాకాంక్షలు తెలిపారు. అద్భుతమైన నైపుణ్యం, ప్రతిభాపాటవాలు, అంకితభావంతో ఈ గెలుపు సాధ్యమైందని కొనియాడారు. గురువారం నాటి చారిత్రాత్మక విజయం భారత హాకీ చరిత్రలో మరో సరికొత్త యుగానికి నాంది అని, క్రీడల పట్ల యువత ఆసక్తి పెంచుకునే విధంగా స్ఫూర్తినిస్తుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Congratulations to our men's hockey team for winning an Olympic Medal in hockey after 41 years. The team showed exceptional skills, resilience & determination to win. This historic victory will start a new era in hockey and will inspire the youth to take up and excel in the sport — President of India (@rashtrapatibhvn) August 5, 2021 ప్రతి భారతీయుడి మనసులో గుర్తుండే జ్ఞాపకం ‘‘చరిత్రాత్మకం! ప్రతీ భారతీయుడి మనసులో ఈ జ్ఞాపకం ఎల్లప్పుడూ నిలిచి పోతుంది. కాంస్య పతకంతో స్వదేశానికి తిరిగి వస్తున్న భారత పురుషుల హాకీ జట్టుకు శుభాకాంక్షలు. ఈ ఘనత సాధించి జాతి మొత్తాన్ని గర్వపడేలా చేవారు. ముఖ్యంగా యువతకు స్ఫూర్తినిచ్చారు. హాకీ జట్టు మనకు గర్వకారణం’’ ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా మన్‌ప్రీత్ సేనను కొనియాడారు. Historic! A day that will be etched in the memory of every Indian. Congratulations to our Men’s Hockey Team for bringing home the Bronze. With this feat, they have captured the imagination of the entire nation, especially our youth. India is proud of our Hockey team. 🏑 — Narendra Modi (@narendramodi) August 5, 2021 ఇక కామ్‌గా ఎలా ఉండగలం ‘‘భారత్‌కు శుభాకాంక్షలు. అబ్బాయిలు.. మీరు సాధించేశారు! ఇక మేం నిశ్శబ్దంగా ఎలా ఉండగలం. ఆద్యంతం ఆధిపత్యం కనబరుస్తూ.. ఒలింపిక్ చరిత్రలో మరోసారి భారత విజయాన్ని మరోసారి లిఖించింది పురుషుల హాకీ జట్టు. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం’’ అని కేంద్ర క్రీడా శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ హర్షం వ్యక్తం చేశారు. A BILLION CHEERS for INDIA 🇮🇳! Boys, you’ve done it ! We can’t keep calm !#TeamIndia 🥉! Our Men’s Hockey Team dominated and defined their destiny in the Olympic history books today, yet again ! We are extremely proud of you!#Tokyo2020 pic.twitter.com/n78BqzcnpK — Anurag Thakur (@ianuragthakur) August 5, 2021 -
పీవీ సింధుకు కేంద్రం ఘన సత్కారం
ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో తెలుగుతేజం పీవీ సింధు కాంస్య పతకం సాధించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం స్వదేశానికి చేరుకున్న సింధును కేంద్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. సింధు కాంస్యం సాధించడంలో ముఖ్యపాత్ర పోషించిన ఆమె కోచ్ పార్క్ తై సేంగ్‌ను కూడా ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, నిర్మలా సీతారామన్, కిషన్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పీవీ సింధుకు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన అనంతరం ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకొని వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ ఈ ఘట్టాన్ని ఆవిష్కరించిన రెండో భారత ప్లేయర్‌గా, తొలి మహిళగా సింధు చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు అభిమానులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఇక రేపు(బుధవారం) 11.30 గంటలకు పీవీ సింధు ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనున్నది. -
రూ.750 కోట్లతో లడఖ్‌లో కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు
కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో కేంద్ర విశ్వవిద్యాలయ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఈ రోజు(జూలై 22) ఆమోదం తెలిపినట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ కేంద్ర విశ్వవిద్యాలయాన్ని రూ.750 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు మొదటి దశను నాలుగేళ్లలో పూర్తి చేస్తామని అని అన్నారు. లడఖ్ ప్రాంత అభివృద్ది కోసం లడఖ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎల్ఐడీసీఓ) ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రివర్గం ప్రకటించినట్లు మంత్రి క్యాబినెట్ నిర్ణయాలను ప్రకటిస్తూ తెలిపారు. లడఖ్‌లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు వీలుగా సెంట్రల్ యూనివర్సిటీస్ యాక్ట్ 2009ను సవరించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. "ఈ విశ్వ విద్యాలయాన్ని స్థాపించడం వల్ల ఉన్నత విద్యా రంగంలో ప్రాంతీయ అసమతుల్యతలను తొలగిస్తుంది. అలాగే, ఈ ప్రాంతంలో మేధో వృద్ధికి సహాయపడుతుంది, ఉన్నత విద్య వ్యాప్తికి సహాయపడుతుంది. ఈ ప్రాంతంలోని ఇతర విద్యా సంస్థలకు కేంద్రీయ విశ్వ విద్యాలయం ఒక నమూనాగా నిలుస్తుంది" అని ఠాకూర్ తెలిపారు. రాబోయే సెంట్రల్ యూనివర్సిటీ అధికార పరిధి లేహ్, కార్గిల్ తో సహా మొత్తం లడఖ్ ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. ఎల్ఐడీసీఓ కార్పొరేషన్ "లడఖ్‌లో పరిశ్రమలు, పర్యాటకం, రవాణా సేవలు, స్థానిక ఉత్పత్తులు, హస్తకళల మార్కెటింగ్ అభివృద్ధిని చూసుకోవడంతో పాటు ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయనున్నట్లు" మంత్రి తెలియజేశారు. 25 కోట్ల అధీకృత వాటా మూలధనంతో కంపెనీల చట్టం కింద కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు ఠాకూర్ తెలిపారు. కార్పొరేషన్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడటంతో పాటు స్థానికంగా యువతకు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని మంత్రి తెలిపారు. అలాగే ఉక్కు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి ఆమోదం తెలిపింది. వచ్చే ఐదేళ్లలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కింద రూ.6,322 కోట్లను కేటాయించారు. ఎండ్ టూ ఎండ్ తయారీకి ఈ పథకం ప్రోత్సాహాన్ని అందిస్తుంది. -
Tokyo Olympics: చీర్4ఇండియా.. రెహ్మాన్, అనన్య సాంగ్ అదిరిందిగా
Tokyo Olympics India Song: ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందాన్ని ఉత్సాహపరిచే పాటను కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం విడుదల చేశాడు. ‘చీర్4ఇండియా’ పేరుతో ఈ పాట భారతీయ శ్రోతలను అలరించనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ఈ ప్రత్యేక పాటకు సంగీతం అందించగా... యువ గాయని అనన్య బిర్లా ఆలపించారు. అధికారిక పాట విడుదల సందర్భంగా మంత్రి ఠాకూర్ మాట్లాడుతూ అందరూ ఈ పాటను వినాలని, తమ వారికి షేర్ చేయాలని అలా యావత్ భారత్ ఈ పాట ద్వారా తమ వాణి వినిపించాలని, భారత బృందానికి మద్దతుగా నిలవాలని కోరారు. కరోనా నేపథ్యంలో భారత క్రీడాకారుల సన్నాహాలకు ఎదురైన ఇబ్బందులు, అధిగమించిన తీరు ప్రతిబింబించే విధంగా ఈ పాట ఉందని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) చీఫ్ నరీందర్ బాత్రా చెప్పారు. ఈ పాటను రూపొందించిన రెహ్మాన్, సింగర్ అనన్యకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా, టోక్యో ఒలింపిక్స్‌కు భారత్ నుంచి మొత్తం 228 మంది బృందం వెళ్లనుంది. ఇందులో 119 మంది అథ్లెట్లు 85 విభాగాల్లో పోటీపడనున్నారు. 119 మంది అథ్లెట్లలో 67 మంది పురుషులు, 52 మంది మహిళలు ఉన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత మంగళవారం సమావేశమైన విషయం తెలిసిందే. అథ్లెట్లలో స్ఫూర్తి నింపడం కోసం మోదీ వారితో మాట్లాడారు. ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లు అంచనాలను అందుకుంటూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని పిలుపునిచ్చారు. మీ వెనక దేశం మొత్తం అండగా ఉందని, క్రీడా వేదికపై భారత పతాకం రెపరెపలాడించాలని కోరారు. జులై 23 నుంచి విశ్వక్రీడలు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
-
Team Modi: బాధ్యతల్లో కొత్త మంత్రులు
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్లో కొత్తగా చేరిన అశ్వినీ వైష్ణవ్, అనురాగ్ ఠాకూర్, మన్సుఖ్ మాండవియా తదితరులు తమకు కేటాయించిన శాఖల మంత్రులుగా గురువారం బాధ్యతలు చేపట్టారు. మాజీ ఐఏఎస్ అధికారి అశ్వినీ వైష్ణవ్‌కు అత్యంత కీలకమైన రైల్వే శాఖతోపాటు కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖలను కూడా కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి సేవ చేసే అవకాశాన్ని తనకు కల్పించారని అన్నారు. ప్రధాని ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పారు. రైల్వే, టెక్స్టైల్స్ శాఖల సహాయ మంత్రిగా దర్శనా విక్రమ్ జర్దోష్ చార్జ్ తీసుకున్నారు. అనురాగ్ ఠాకూర్ సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని మోదీ తనకు పెద్ద బాధ్యత కట్టబెట్టారని, చిత్తశుద్ధితో పనిచేస్తానని ఠాకూర్ అన్నారు. ఇక గుజరాత్‌కు చెందిన మన్సుఖ్ మాండవియా ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ బాధ్యతలు స్వీకరించారు. ఉక్కు శాఖ మంత్రిగా రామచంద్రప్రసాద్ సింగ్, న్యాయ శాఖ మంత్రిగా కిరణ్ రిజిజు, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రిగా భూపేంద్ర యాదవ్, సామాజిక న్యాయం, సాధికారిత శాఖ మంత్రిగా వీరేంద్ర కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఇదే శాఖలో సహాయ మంత్రులుగా ప్రతిమా భౌమిక్, ఎ.నారాయణస్వామి బాధ్యతలు తీసుకున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా జితేంద్రసింగ్, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా జి.కిషన్‌రెడ్డి, ఎంఎస్ఎంఈ మంత్రిగా నారాయణ్ రాణే, మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రిగా పురుషోత్తం రూపాల బాధ్యతలు స్వీకరించారు. విద్యా శాఖ సహాయ మంత్రిగా సుభాష్ సర్కార్, మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా ముంజపారా మహేంద్రభాయ్ బాధ్యతలు చేపట్టారు. విద్యుత్ శాఖ మంత్రిగా రాజ్‌కుమార్ సింగ్, టెక్స్టైల్ శాఖ మంత్రిగా పీయూష్ గోయల్, పునరుత్పాదక ఇంధన వనరులు, రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రిగా భగవంత్ ఖుబా, ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా భగవత్ కిషన్‌రావు కరాడ్, రక్షణ శాఖ సహాయ మంత్రిగా అజయ్ భట్ బాధ్యతలు స్వీకరించారు. -
క్రీడల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు
న్యూఢిల్లీ: కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆ శాఖను నిర్వహించిన కిరణ్ రిజుజు ఇతర శాఖకు బదిలీ కావడంతో ఆయన ఈ బాధ్యతలను చేపట్టారు. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2021కు సరిగ్గా రెండు వారాల ముందు కేంద్ర క్రీడల శాఖకు కొత్త మంత్రి వచ్చారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అనురాగ్ ఠాకూర్‌కు ఈ అవకాశం లభించింది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 46 ఏళ్ల అనురాగ్ ఠాకూర్‌కు ఇదివరకే క్రీడలతో అనుబంధముంది. ఆయన గతంలో 2016 మే నుంచి 2017 ఫిబ్రవరి వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు. అంతకుముందు బీసీసీఐ సెక్రటరీగా, హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ బోర్డు కార్యదర్శిగా పనిచేసిన అనుభవం అతనికుంది. ఇదిలా ఉంటే, ఈనెల 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో వేదికగా విశ్వక్రీడలు జరగనున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా గతేడాదిగా వాయిదా పడుతూ వస్తున్న ఒలింపిక్స్‌ను జులై నెలలో ఎలాగైనా నిర్వహించాలని నిర్వాహకులు పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం మంత్రివర్గంతో అత్యవసరంగా సమావేశమై జపాన్ ప్రధాని యొషిహిదె సుగా టోక్యోలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీంతో ఒలింపిక్స్ నిర్వహణపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు ఒలింపిక్స్ కోసం భారత్ నుంచి బయలదేరనున్న అథ్లెట్లు .. ఎప్పుడూ వెళతామో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నారు. దానికి తోడు కొత్త క్రీడా మంత్రి రావడంతో ఏం జరుగుతుందోనన్న అయోమయంలో ఉన్నారు. -
రూ.400 వ్యాక్సిన్‌ను 1500కు అమ్ముకుంటున్నరు: కేంద్ర మంత్రి
ఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకుర్ వ్యాక్సిన్ల విషయంలో రాజస్తాన్, పంజాబ్ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును గురువారం ట్విటర్లో తప్పుబట్టారు. ఎంతో శ్రమకోర్చి తాము వ్యాక్సిన్లు కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేస్తుంటే రాజస్తాన్, పంజాబ్ రాష్ట్రాలు మాత్రం బ్లాక్ మార్కెట్ దందాను విచ్చలవిడిగా ప్రోత్సహిస్తూ ''వన్ టూకా ఫోర్ పాలసీ''ని ఆచరిస్తున్నాయని మండిపడ్డారు. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని.. అందుకే వ్యాక్సిన్ల పేరుతో రాష్ట్రాలను దోచుకునే పనిలో ఉన్నారని విమర్శించారు. తయారీదారుల నుంచి తాయు కొనే ఒక్కో డోసును రాష్ట్రాలకు రూ. 400లకు అమ్ముతున్నామన్నారు. కానీ పంజాబ్, రాజస్తాన్ ప్రభుత్వాలు అక్కడి ప్రైవేటు ఆసుపత్రులకు ఒక్కో డోసును రూ. 1060కి అమ్ముకోగా.. అవి ప్రజలకు చేరే సమయానికి వాటి ధర రూ. 1500 దాటుతుందని.. అలా ఆయా ప్రభుత్వాలే బ్లాక్‌మార్కెట్ దందాను ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది కాంగ్రెస్‌కు అత్యంత ఇష్టమైన ''వన్ టూకా ఫోర్ పాలసీ'' అని తెలిపారు. కాగా పంజాబ్‌తో పోలిస్తే రాజస్తాన్ ప్రభుత్వం రెండు అడుగులు ముందుందన్నారు. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 11.50 లక్షల వ్యాక్సిన్లను వృధా చేశారని.. అవన్నీ అక్కడి చెత్తకుప్పల్లో దర్శనమిస్తున్నాయని మండిపడ్డారు. అయితే వారు వ్యాక్సిన్ల వృధా పేరుతో ప్రజల్లో తమకున్న నమ్మకాన్ని కూడా పోగొట్టుకుంటున్నారని పేర్కొన్నారు. కాగా అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: కరోనా పేషెంట్ల మరుగుదొడ్లు కడిగిన చిన్నారి.. వీడియో వైరల్ టీకాలు లేకుండానే వ్యాక్సినేషన్ కేంద్రాలా? कांग्रेस राज में.. कहीं वैक्सीन की कालाबाज़ारी तो कहीं कचरे में वैक्सीन। करने वाला कौन ? गांधी परिवार के खासमख़ास मुख्यमंत्री @capt_amarinder जी व @ashokgehlot51 जी समझिए कैसे..👇🏻 1/3 — Anurag Thakur (@ianuragthakur) June 3, 2021 -
కరోనా కాలంలో కొత్త కంపెనీల జోరు
2020 ఏప్రిల్ నుండి 2021 ఫిబ్రవరి వరకు 1,38,051 కొత్త కంపెనీలు నమోదయ్యాయని అలాగే 10,113 కంపెనీల కార్యకలాపాలు దెబ్బతిన్నాయని ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపార. లోక్‌సభలో కంపెనీల చట్టం, 2013 ప్రకారం సోమవారం అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ప్రజా తనిఖీ కోసం కూడా ఈ వివరాలను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన వెబ్ సైట్ www.mca.gov.inలో లభిస్తాయని ఠాకూర్ చెప్పారు. అలాగే, పెట్రోల్, డీజిల్‌పై పన్నుల ద్వారా కేంద్రానికి సమకూరే ఆదాయం గడిచిన ఆరేళ్లలో 300 శాతం పెరిగిందని ప్రభుత్వం లోక్‌సభకు వెల్లడించింది. ఈ మేరకు పార్లమెంట్ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. చదవండి: వ్యాక్సిన్ పంపిణీలో ముందున్న భారత్ -
రెండేళ్లుగా రూ. 2000 నోట్ల ముద్రణను నిలిపేశాం..
న్యూఢిల్లీ: 2016లో నోట్ల రద్దు తర్వాత తొలిసారి చలామణిలోకి వచ్చిన రూ.2000 నోటు ముద్రణను నిలపివేసినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. గత రెండేళ్లుగా రూ.2000 నోటును ముద్రించడం ఆపివేసినట్లు సోమవారం జరిగిన లోక్‌సభ సమావేశాల్లో కేంద్రం ప్రకటించింది. ఈ అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 2018, మార్చి 30నాటికి మొత్తం 336.2 కోట్ల రూ.2000 నోట్లు చెలామణిలో ఉన్నాయని, 2021, ఫిబ్రవరి 26 నాటికి వీటి సంఖ్య 249.9 కోట్లకు తగ్గిందని మంత్రి పేర్కొన్నారు. లావాదేవీల డిమాండ్ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటుందని మంత్రి తెలిపారు. కాగా, నల్లధనానికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో 2016లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి రూ.2000 నోటును చలామణిలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
నవ్వులే నవ్వులు
అనురాగ్ కొణిదెన, అవికాగోర్ జంటగా సత్యం ద్వారపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. జెమిని ఎఫ్ఎక్స్ సమర్పణలో క్రిషి క్రియేషన్స్ పతాకంపై కోటేశ్వరరావు నిర్మిస్తుండగా, అవికా గోర్ మరో నిర్మాత. తొలి సీన్‌కి సి. కళ్యాణ్ క్లాప్ కొట్టారు. చిత్ర సమర్పకులు పీవీఆర్ మూర్తి మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ, యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న చిత్రమిది. తమిళం, కన్నడలో హిట్టయిన ఓ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘నిర్మాణ సంస్థను ప్రారంభించి, జెమిని వారితో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు అవికా. ‘‘ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే చిత్రం ఇది’’ అన్నారు అనురాగ్. ‘‘మార్చి 4న తొలి షెడ్యూల్ ఆరంభిస్తాం. ఆగస్టులో సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు సత్వం ద్వారపూడి. ‘‘ఈ సినిమా ద్వారా ప్రతిభావంతులైన గాయనీ– గాయకులకు చాన్స్ ఇస్తాం’’ అన్నారు సంగీత దర్శకుడు శక్తికాంత్. ఈ చిత్రానికి కెమెరా: రఘు. -
త్వరలో క్రిప్టోకరెన్సీ బిల్లు
న్యూఢిల్లీ: రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ త్వరలో కేంద్ర కేబినెట్‌కు క్రిప్టోకరెన్సీ బిల్లును పంపనున్నట్లు సమాధానమిచ్చారు. క్రిప్టోకరెన్సీకి సంబంధించిన లావాదేవీలను ప్రాసెస్ చేయకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బిఐ) 2018లో బ్యాంకులను నిషేధించింది. అయితే, గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. "బిట్కాయిన్లు, ఇతర క్రిప్టోకరెన్సీల వినియోగంపై ఆర్బిఐ త్వరలో విధివిధానాలను తెలియజేస్తామని ప్రకటించింది. కానీ ఇది ఒక సమస్యాత్మకమైన అంశం. క్రిప్టోకరెన్సీని భారత్‌లో అరికట్టడానికి కేంద్ర ఆర్థికశాఖ ఏదైనా బిల్లును తీసుకొచ్చే అవకాశం ఉందా?" అని కర్ణాటక భాజపా ఎంపీ కె.సి.రామమూర్తి రాజ్యసభలో అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానంగా ఠాకూర్ మాట్లాడుతూ.. "ఆర్బిఐ, సెబి వంటి రెగ్యులేటరీ సంస్థలకు క్రిప్టోకరెన్సీలను నేరుగా నియంత్రించడానికి ఎటువంటి చట్టపరమైన అధికారాలు లేవు. ఎందుకంటే క్రిప్టోకరెన్సీ ఆస్తులు, సెక్యూరిటీలు, వస్తువు కాదు. ప్రస్తుత చట్టాలు ఈ అంశాన్ని పరిష్కరించడానికి సరిపోవు. అందుకే ప్రభుత్వం దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిపుణులతో చర్చించాం. అతి త్వరలోనే కేంద్ర కేబినెట్ ముందుకు ఈ బిల్లును తీసుకొస్తాం" అని ఠాకూర్ చెప్పారు. చదవండి: కుమారుడి ఫోటో షేర్ చేసిన ఎలోన్ మస్క్ మాస్టర్ కార్డు వినియోగదారులకు శుభవార్త! -
నీతి ఆయోగ్ సూచన మేరకే పెట్టుబడుల ఉపసంహరణ
సాక్షి, హైదరాబాద్: నీతి ఆయోగ్ సూచన మేరకే విశాఖ స్టీల్ ప్లాంట్ సహా దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ వెల్లడించారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ వల్ల ఎవరికీ నష్టం జరగదని, అవసరమైతే కంపెనీ ఉద్యోగులతో మాట్లాడతామన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ వల్ల దేశానికి, ఉద్యోగులకు, కంపెనీ అభివృద్ధికి ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో కేంద్రం పారదర్శకమైన విధానాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ నిర్ణయాన్నిబట్టి అన్ని కంపెనీలను కేంద్రం అమ్మేస్తోందనే భావన, ప్రచారం సరైంది కాదన్నారు. కేంద్ర బడ్జెట్లోని అంశాలను వివరించేందుకు చేపడుతున్న ప్రచారంలో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ నేతలు కె.లక్ష్మణ్, డి.ప్రదీప్ కుమార్, జంగారెడ్డి, కృష్ణ సాగర్‌రావు, డా. ప్రకాశ్‌రెడ్డిలతో కలసి అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడారు. కంపెనీల పనితీరు ప్రాతిపదికనే... ప్రభుత్వరంగ కంపెనీల పనితీరును కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రాధాన్యత–ప్రాధాన్యేతర, వ్యూహాత్మక–వ్యూహాత్మకేతర అంశాల ప్రాతిపదికన నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వివరించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ, ఏపీకి ఎలాంటి నష్టం జరగలేదని, తాము సహకార సమాఖ్య విధానాన్ని నమ్ముతామన్నారు. తెలంగాణ, ఏపీకి అనేక ప్రాజెక్టులు కేటాయించినట్లు చెప్పారు. బడ్జెట్లో తెలంగాణలోని రైల్వే లైన్లకు కేటాయింపులున్నాయని, ప్రస్తుతం రూ. 29 వేల కోట్ల పనులు జరుగుతున్నాయన్నారు. అలాగే 2,111 కి.మీ. నిడివిగల రోడ్ల నిర్మాణం కోసం రూ. 20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద రూ. 13 ,990 కోట్లు వచ్చాయని, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు 15 ఆర్థిక సంఘం నిధుల కింద రూ. 9,172 కోట్లు వస్తాయని, ఆత్మనిర్భర భారత్ కింద తెలంగాణకు రూ. 400 కోట్లు ఏటా వస్తాయని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. పోలవరానికి నిధుల కేటాయింపులు... కేంద్రం ఇచ్చిన హామీ మేరకు ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు నిధులిచ్చామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. పోలవరానికి ఒప్పందం మేరకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. స్టార్టప్‌లు, ఇతరత్రా రూపాల్లో ఇస్తున్న ప్రోత్సాహకాల ద్వారా తెలంగాణ, ఏపీకి ఎంతో మేలు జరుగుతుందన్నారు. పెట్రో ఉత్పత్తులపై కేంద్ర పన్నుల కన్నా రాష్ట్ర పన్నులే ఎక్కువ ఉన్నాయన్న విషయాన్ని గమనించాలన్నారు. గ్యాస్ ధర అంతర్జాతీయ మార్కెట్ విలువను బట్టి మారుతూ ఉంటుందన్నారు. పన్నులు పెంచని బడ్జెట్ సాక్షి, హైదరాబాద్: పేదలపై ఎలాంటి ఆర్థిక భారం మోపకుండా ఈ ఏడాది బడ్జెట్ రూపొందించామని కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. కోవిడ్‌తో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో పన్నులు పెంచకుండా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పించినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో శనివారం బడ్జెట్–2021పై జరిగిన చర్చలో మంత్రి పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనురాగ్సింగ్తోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొ న్నారు. ఠాకూర్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి వేగంగా ఉందని, నెలకు సగటున రూ.లక్ష కోట్లు జీఎస్టీ వసూలు అవుతోందన్నారు. గతేడాది కంటే ఈసారి 34 శాతం అధికంగా మూలధన వ్యయం పెంచామని స్పష్టం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు సమం చేసే దిశగా మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దేశంలో అతిత్వరలో 3 ఆటోమొబైల్ తయారీ కేంద్రాలు రాబోతున్నాయని తెలిపారు. స్క్రాపింగ్ పాలసీతో మరింత మైలేజీ గల వాహనాలను కొనుగోలు చేయవచ్చన్నారు. కొత్త వ్యవసాయ చట్టం రైతులకు లాభం చేకూరుస్తుందని, కానీ ప్రతిపక్ష పార్టీలు రైతులను తప్పుదోవపట్టిస్తున్నాయన్నారు. ఇన్నేళ్లలో రైతుల కోసం ఏ ప్రభుత్వం మోదీ ప్రభుత్వం మాదిరిగా ఖర్చు చేయలేదని వివరించారు. బడ్జెట్ పట్ల సీఎం, మంత్రులు సంతోషంగానే ఉన్నారు సాక్షి, హైదరాబాద్: ‘కేంద్ర బడ్జెట్‌తో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందిలేదు. సీఎం, మంత్రులు సంతోషంగానే ఉన్నారు. వాళ్లు బడ్జెట్‌పై ఏమీ మాట్లాడలేదు, స్పందించలేదు కదా. బడ్జెట్ బాగోలేదంటూ సీఎం మీకు ఫోన్‌చేసి చెప్పలేదు కదా’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ వ్యాఖ్యానించారు. శనివారం బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం సందర్భంగా బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులపై కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్‌ను ప్రశ్నించినప్పుడు సంజయ్ ఈవిధంగా స్పందించారు. -
బడ్జెట్ హల్వా బడ్జెట్ కూర్పు ప్రారంభం
న్యూఢిల్లీ: కేంద్ర వార్షిక బడ్జెట్ కూర్పు కార్యక్రమం సంప్రదాయ హల్వా వేడుకతో శనివారం ప్రారంభమైంది. నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. హల్వా వేడుకలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది బడ్జెట్ పత్రాల కూర్పులో పాల్గొంటారు. గతంలో ఈ వేడుకలో పాల్గొన్న వారంతా ఆర్థిక శాఖ కార్యాలయం బేస్మెంట్లోకి వెళ్లి, బడ్జెట్ముద్రణలో పాలుపంచుకునేవారు. ఈసారి కోవిడ్ దృష్ట్యా బడ్జెట్ ప్రతుల ముద్రణను రద్దు చేశారు. పార్లమెంట్ సభ్యులకు ఈ దఫా డిజిటల్ రూపంలో బడ్జెట్ వివరాలను అందజేయనున్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక ఇలా చేయడం ఇదే మొదటిసారి. ‘కేంద్ర బడ్జెట్‌ను మొట్టమొదటిసారిగా పేపర్‌లెస్ రూపంలో ఇస్తున్నాం. ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంట్లో ప్రవేశపెడతాం’అని ఆర్థిక శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. భారీ కఢాయిలో తయారు చేసిన హల్వాను బడ్జెట్ తయారీలో పాల్గొనే సిబ్బందికి పంచారు. నిర్మల బడ్జెట్ పత్రాలను చూసేందుకు రూపొందించిన మోబైల్ యాప్‌ను ప్రారంభించారు. బడ్జెట్æ పోర్టల్ నుంచి దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 1 నుంచి వివరాలను చూడవచ్చు. -
'రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించాం'
ఢిల్లీ : ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. ఈ సందర్భంగా బుగ్గన మీడియాతో మాట్లాడారు.' పోలవరంకు నిధులతో పాటు జీఎస్టీ బకాయిలు, వివిధ పథకాలకు సంబంధించిన నిధులపై చర్చించాము. రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ , పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరాము. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ మరోసారి ప్రస్తావించాం. రాష్ట్రానికి రూ. మూడు వేల కోట్లకు పైగా జీఎస్టీ బకాయిలు రావాల్సి ఉంది. పోలవరం పై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులను రీయింబర్స్ చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశాం. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయన కూడా ఈ అంశాలన్నింటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం బకాయిలను కేంద్రం త్వరగా విడుదల చేస్తే బాగుంటుంది. మేం ప్రతిపాధించిన అన్ని అంశాలపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారు. బకాయిల చెల్లింపు లు అనేది ఒక నిరంతర ప్రక్రియలాగా కొనసాగుతూనే ఉంటుంది.' అంటూ తెలిపారు. కాగా బుగ్గన వెంట ఎంపీలు కృష్ణదేవరాయలు, కోటగిరి శ్రీధర్ , సలహాదారు అజయ్ కల్లం తదితరులు ఉన్నారు. -
ఇన్ఫ్రా అభివృద్ధిపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కేంద్రం మరింతగా దృష్టి పెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ఇవి బహుళ విధాలుగా సానుకూల ప్రభావాలు చూపగలవని ఆయన వివరించారు. భారత్ స్వయం సమృద్ధమైన దేశంగా తీర్చిదిద్దుకోవాలంటే ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చినట్లుగా ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాను నిర్మించుకోవడం కీలకమని ఠాకూర్ వివరించారు. మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేందుకు, పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేందుకు వచ్చే అయిదేళ్లలో ఇన్ఫ్రా ప్రాజెక్టులకు రూ. 111 లక్షల కోట్ల మేర పెట్టుబడులు అవసరమంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ గత నెలలో అంచనా వేసింది. ఈ నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
రాష్ట్రాలకు రుణ పరిమితి పెంపు..
న్యూఢిల్లీ : రాష్ట్రాలకు రుణ పరిమితి 3 నుంచి 5 శాతానికి పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థికి మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రుణ పరిమితిని 3 నుంచి 3.5 శాతం పెంచుకునేందుకు ఎలాంటి షరతులు వర్తించబోవని స్పష్టం చేశారు. అయితే కొన్ని షరతులతో 3.5 నుంచి 5 శాతం వరకు రుణ పరిమితిని పెంచుకునే అవకాశం కల్పించారు. రుణ పరిమితి పెంపు వల్ల రాష్ట్రాలకు రూ. 4.28 లక్షల కోట్లు అదనంగా అప్పులు తెచ్చుకునే అవకాశం లభిస్తుందన్నారు. కరోనా ప్రభావం నుంచి ఆర్థిక రంగాన్ని గట్టెక్కించడానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయం సమృద్ధి భారతం పేరిట రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఆఖరి విడత ప్యాకేజీ వివరాలను ఆదివారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. కోవిడ్ దృష్ట్యా రాష్ట్రాలు ఆదాయాన్ని కోల్పోతున్నాయని అన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలను ఆదుకునేందకు అన్నివిధాలా చర్యలు తీసకుంటున్నామని చెప్పారు. రూ. 11,092 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులను ఇప్పటికే అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. జీతభత్యాల చెల్లింపులో రాష్ట్రాలకు ఓవర్‌డ్రాఫ్ట్ తీసకునే అవకాశం కల్పించడంతో పాటుగా.. ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకునే అవకాశాన్ని 52 రోజులకు పెంచినట్టు వెల్లడించారు. పన్ను ఆదాయం కింద రాష్ట్రాలకు రూ. 46 వేల కోట్ల కేటాయింపులు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే చాలా రంగాల్లో సంస్కరణలకు సంబంధించి ప్రకటనలు చేశామని నిర్మల గుర్తుచేశారు. ప్రాణం ఉంటేనే.. ప్రపంచం ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాటలను గుర్తుచేశారు. పేదలకు ఇబ్బంది కలగకుండా మూడు నెలలకు సరిపడా రేషన్ సరఫరా చేశామని చెప్పారు. పీఎం కిసాన్ పథకం ద్వారా 8.19 కోట్ల మందికి రూ. 2వేల చొప్పున ఇచ్చామని వెల్లడించారు. జన్‌ధన్ ఖాతాల ద్వారా 20 కోట్ల మంది మహిళలకు నగదు బదిలీ చేశామన్నారు. నిర్మాణ రంగంలో పనిచేసే 2.20 కోట్ల మంది కూలీలకు ఆర్థిక సహాయం అందించామని.. భవన నిర్మాణ కార్మికుల ఖాతాల్లో రూ. 3,995 కోట్లు జమచేశామని చెప్పారు. ఉజ్వల యోజన ద్వారా 6.81 కోట్ల ఫ్రీ సిలిండర్లు సరఫరా చేశామని మంత్రి తెలిపారు. 12 లక్షల మంది ఈపీఎఫ్ ఖతాదారులు ఒకేసారి నగదు విత్ డ్రా చేసుకున్నారని వెల్లడించారు. దేశంలో వైద్య సదుపాయాల ఏర్పాటుకు రూ. 15 వేల కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ఇప్పటికే 51 లక్షల పీపీఈ కిట్లు, 87 లక్షల ఎన్-95 మాస్క్‌లు సరఫరా చేశామన్నారు. వైద్య రంగంలో పనిచేసే సిబ్బంది రూ. 50 లక్షల బీమా సౌకర్యం అందిస్తున్నట్టు తెలిపారు. కోవిడ్ రిలీఫ్ ఫండ్ కింద రాష్ట్రాలకు రూ. 4,113 కోట్లు అందజేశామని తెలిపారు. ఆర్థిక మంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్యం కోసం ల్యాబ్‌ల ఏర్పాటు జిల్లా స్థాయిలో ప్రతి ఆస్పత్రిలో డిస్ఇన్పెక్షన్ సెంటర్ల ఏర్పాటు ఆన్లైన్ ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహించడంలో భాగంగా వన్ క్లాస్, వన్ డిజిటిల్ పేరుతో డిజిటల్ పాఠాలు. త్వరలోనే టీవీ, రేడియోల ద్వారా ఆన్లైన్ పాఠాలు దేశవ్యాప్తంగా వైద్య సదుపాయాల ఏర్పాటుకు రూ. 15 వేల కోట్లు కేటాయించాం. గ్రామీణ ఉపాధి హామీ పనులకు అదనంగా మరో రూ. 40 వేల కోట్లు -
ఆర్థికశాఖ సహాయ మంత్రిపై ట్విటర్లో విమర్శలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకుర్పై ట్విటర్లో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికుల ప్రభావం చూపించబోదని మార్చి నెలలో ఆయన ట్విటర్లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తోంది. ఈ కష్ట కాలంలో దెబ్బతింటున్న దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ప్రధాని మోదీ ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పేరిట రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. (నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్ : నేడు వ్యవ‘సాయం’) ఇక ఈ ప్యాకేజీలో భాగంగా చిన్న సంస్థలు, బ్యాకింగ్‌యేతర ఆర్థిక సంస్థలు, రియల్టీ మొదలైన కొన్ని రంగాలకు దక్కే ప్రయోజనాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఆమె ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో వివరించారు. కాగా అదే సమయంలో ఈ ఆర్థిక ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకుర్ హింది భాషలో అనువదించి చెప్పారు. దీంతో కరోనా వైరస్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు ప్రతికుల ప్రభావం ఉండదని గతంలో మంత్రి అనురాగ్ ఠాకుర్ చేసిన చేసిన ట్విట్‌ను గుర్తు చేస్తూ నెటిజన్లు పలు విమర్శలు చేస్తున్నారు. -
2 వేల రూపాయల నోటుపై క్లారిటీ
న్యూఢిల్లీ: రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపివేతపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సోమవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘రూ.2 వేల నోట్ల ముద్రణ ఆపే విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని వివరించారు. ‘రూ.2 వేల నోట్లకు చిల్లర కొరతతో వినియోగదారులకు ఇబ్బందిగా మారింది. దీంతో, రూ.500, రూ.200 నోట్లుంచేందుకు ఏటీఎంలను సిద్ధం చేయాలని ఎస్బీఐ, ఇండియన్ బ్యాంక్ తమ అధికారులను ఆదేశించాయి’ అని వివరించారు. చారిత్రక కట్టడాల్లో చోరీలు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా శ్రీ ఆనందవల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న నంది విగ్రహం, కర్ణాటకలోని సదాశివస్వామి గుడిలో రాగి కలశం చోరీకి గురయ్యాయని సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ లోక్‌సభకు తెలిపారు. రక్షిత చారిత్రక కట్టడాల వద్ద 280 మౌలిక సౌకర్యాల కల్పన ప్రాజెక్టులకు అనుమతులిచ్చినట్లు చెప్పారు. (చదవండి: కమల్‌ను కాపాడిన ‘కరోనా’) -
‘కడపలో బ్యాంక్ శాఖలను తగ్గించలేదు’
న్యూఢిల్లీ : నీతి అయోగ్ ఎంపిక చేసిన ఆశావహ జిల్లాల్లో ఒకటైన కడపలో బ్యాంక్ శాఖలను తగ్గించలేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయాన్ని తెలిపారు. పలు రకాల ఆర్థిక సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసురావడం ఆశావహ జిల్లాల అభివృద్ధి కార్యక్రమంలో ఒక ప్రధాన అంశమని వివరించారు. ఎంపిక చేసిన ఆశావహ జిల్లాలో ప్రతి లక్షమందిలో ముద్ర రుణాలు పొందిన లబ్దిదారుల సంఖ్య, ప్రతి లక్ష మందిలో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద తెరిచిన ఖాతాలు, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన్, అటల్ పెన్షన్ యోజన పథకాల కింద నమోదైన లబ్దిదారుల సంఖ్యే ఆ జిల్లా అభివృద్ధికి ప్రామాణికంగా పరిగణించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. కడప జిల్లాల్లో బ్యాంక్ శాఖలను కుదించడం వాస్తవం కాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) కన్వీనర్ అందచేసిన వివరాల ప్రకారం 2017లో కడప జిల్లాలో వివిధ బ్యాంక్‌లకు చెందిన 378 శాఖలు ఉండగా 2019లో వాటి సంఖ్య 380కి పెరిగిందని చెప్పారు. అలాగే కడప జిల్లాలో 724 మంది బిజినెస్ కరస్పాడెంట్స్ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నారని కూడా ఆయన తెలిపారు. ఎల్ఐసీ ఆర్థికంగా దృఢంగా ఉంది భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఆర్థిక పరిస్థితిపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ కొట్టిపారేశారు. ఎల్ఐసీ ఆర్థికంగా దృఢంగా ఉందని మంగళవారం ఆయన రాజ్యసభలో ప్రకటించారు. ఎల్ఐసీ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. ఎల్ఐసీకి సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వదంతులు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని తెలిపారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ, డెవలప్మెంట్ అథారిటీ నిర్దేశించిన సాల్వెన్సీ మార్జిన్ (1.50) కంటే ఎల్ఐసీ సాల్వెన్సీ మార్జిన్ (1.60) అధికంగా ఉన్నట్టు మంత్రి వెల్లడించారు. అలాగే పాలసీల సంఖ్య, మొదటి ఏట ప్రీమియం చెల్లింపుల్లో అత్యధిక మార్కెట్ షేర్ కూడా ఎల్ఐసీదేనని తెలిపారు. ఈ ఏడాది జనవరి 31 నాటికి దేశవ్యాప్తంగాఎల్ఐసీతో సహా 24 బీమా సంస్థలు విక్రయించిన మొత్తం పాలసీలలో 77.61 శాతం ఒక్క ఎల్ఐసీనే విక్రయించిందన్నారు. మొదటి ఏట పాలసీ చెల్లింపులలో 70.02 శాతం మార్కెట్ షేర్ ఎల్ఐసీదేనని చెప్పారు. ఎల్ఐసీ క్రమం తప్పకుండా ప్రభుత్వానికి డివిడెంట్ చెల్లిస్తూ వస్తోందని పేర్కొన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,610.74 కోట్లు ఎల్ఐసీ డివిడెండ్ కింద ప్రభుత్వానికి చెల్లించినట్టు తెలిపారు. -
అవసరమైతే మరిన్ని బ్యాంకుల విలీనం
న్యూఢిల్లీ: అవసరమైన పక్షంలో మరిన్ని బ్యాంకులను విలీనం చేసే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. 2024–25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలన్న లక్ష్యం సాకారమయ్యేందుకు.. కన్సాలిడేషన్ ద్వారా ఏర్పడే అంతర్జాతీయ స్థాయి బ్యాంకులు తోడ్పడగలవని ఆయన చెప్పారు. భారీ బ్యాంకులతో పెద్ద సంఖ్యలతో ప్రజలకు ఆర్థిక సేవలు, మెరుగైన పథకాలు అందించేందుకు వీలవుతుందని మంత్రి పేర్కొన్నారు. కేంద్రం గతేడాది ఏకంగా 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగింటిగా విలీనం చేసే ప్రతిపాదన ప్రకటించిన సంగతి తెలిసిందే. విలీనాల కారణంగా 2017లో 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కు తగ్గనుంది. 2017 ఏప్రిల్‌లో అయిదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2019లో విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ)లో విలీనం చేశారు. ఎల్ఐసీ లిస్టింగ్‌తో పారదర్శకత .. ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ లిస్టింగ్ చేయడం ద్వారా సంస్థలో మరింత పారదర్శకత పెరగగలదని ఠాకూర్ చెప్పారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన 2020–21 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రతిపాదన చేశారు. ఎల్ఐసీలో కొన్ని వాటాలతో పాటు ఐడీబీఐ బ్యాంకులో వాటాల విక్రయం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 90,000 కోట్ల దాకా సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. ప్రభుత్వానికి ప్రస్తుతం ఎల్ఐసీలో 100 శాతం, ఐడీబీఐ బ్యాంకులో 46.5 శాతం వాటాలు ఉన్నాయి. అటు రుణ పునర్వ్యవస్థీకరణ వెసులుబాటుతో గతేడాది దాదాపు అయిదు లక్షల లఘు, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ప్రయోజనం చేకూరిందని ఠాకూర్ చెప్పారు. తాజాగా రుణ పునర్వ్యవస్థీకరణ వ్యవధిని వచ్చే ఏడాది మార్చి 31 దాకా పొడిగిస్తూ బడ్జెట్లో ప్రతిపాదించారు. -
‘కాల్చి వేయండి’ అన్నా చర్య తీసుకోరా!?
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బహిరంగ ప్రచారానికి ఈ రోజు చివరి రోజు కావడంతో పాలకపక్ష ఆప్, బీజేపీ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌తోపాటు ఆప్ పార్టీ ముఖ్య నేతలు వీధి వీధిన ప్రచారం చేస్తుండగా, బీజేపీ తరఫున అమిత్ షా, మోదీలతోపాటు ‘దేశ ద్రోహులను కాల్చేయండి’ అని బీజేపీ కార్యకర్తలకు పిలుపునివ్వడం ద్వారా మూడు రోజులపాటు ఎన్నికల ప్రచారానికి దూరమైన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తిరిగి ప్రచారానికి వచ్చారు. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా షహీన్ బాగ్‌లో ఆందోళన చేస్తున్న వారంతా దేశద్రోహులని వారిని కాల్చేయండంటూ అనురాగ్ ఠాకూర్ పిలుపునిచ్చిన అనంతరం మూడు చోట్ల ఆందోళనకారులపై కాల్పులు జరిగాయి. ‘మా పిల్లలను ఎవరో తప్పుదోవ పట్టించడంతో గందరగోళంలో కాల్పులు జరిపారు’ అని మరో బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ సమర్థించారు. ఇంత బహిరంగంగా హింసాకాండను ప్రోత్సహిస్తున్న పార్టీ నాయకులను బీజేపీ అధిష్టానం కనీసం మందలించక పోవడం ఏమిటని ఎన్నికల ప్రచారంలో ఆప్ నాయకులు నిలదీస్తున్నారు. ‘పౌరసత్వం నిరూపణకు డాక్యుమెంట్లు అడిగితే వారిని కొట్టండి’ అనే అభ్యంతరకర వ్యాక్యం కర్ణాటక ముస్లిం పాఠశాలలో వేసిన ఓ నాటకంలో ఉన్నందుకు తొమ్మిది నుంచి పన్నేండేళ్ల పిల్లలను ఐదు రోజులపాటు పోలీసులు ఇంటరాగేట్ చేయడంతోపాటు, దేశ ద్రోహం కేసు కింద ఓ టీచర్‌ను, ఓ పేరెంట్ను అరెస్ట్ చే యడాన్ని ఆప్ నేతలు ప్రస్తావిస్తున్నారు. ‘సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నోరు విప్పితే దేశద్రోహం కేసు పెడతారా? అదే ఆందోళనకారులను కాల్చేయండంటూ పిలుపునిస్తే ఎలాంటి చర్య తీసుకోరా?’ ఇదేమి ప్రజాస్వామ్యం అని ఆప్ నేతలు ప్రశ్నిస్తున్నారు. (చదవండి: షహీన్ బాగ్‌పై మరో నకిలీ వీడియో!) -
త్వరలో జీఎస్టీ బకాయిల చెల్లింపు
-
త్వరలో జీఎస్టీ బకాయిల చెల్లింపు
సాక్షి, న్యూఢిల్లీ : వివిధ రాష్ట్రాలకు బకాయిపడిన జీఎస్టీ పరిహారాన్ని రెండు విడతల్లో పూర్తిగా చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తమ రాష్ట్రాలకు జీఎస్టీ వాటా, ఐజీఎస్టీ కింద చెల్లించాల్సిన పరిహారాలు ఇంతవరకూ రాలేదని పలువురు ఎంపీలు సోమవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ వివరణ ఇచ్చారు. అన్ని రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారాన్ని రెండు విడతలుగా చెల్లిస్తామని ఆయన బదులిచ్చారు. జులై 1, 2017 నుంచి జీఎస్టీ అమలుకాగా ఇప్పటివరకూ జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు రూ 2,10,969 కోట్లు విడుదల చేశామని, గత ఏడాది అక్టోబర్-నవంబర్‌కు సంబంధించిన జీఎస్టీ చెల్లింపులు బకాయి పడ్డాయని చెప్పారు. రెండు నెలలకు కలిపి ఒకసారి జీఎస్టీ చెల్లింపులు చేపడుతున్నామని, 2019 సెప్టెంబర్ వరకూ బకాయిల చెల్లింపులను ఇప్పటివరకూ క్లియర్ చేశామని అన్నారు. జీఎస్టీ అమలు సందర్భంగా నూతన పన్ను వ్యవస్థ వల్ల రాష్ట్రాలకు వాటిల్లే పన్ను నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి : ఏప్రిల్ 1 నుంచి మరింత ఈజీగా జీఎస్టీ.. -
ఠాకూర్, వర్మలపై ఈసీ వేటు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్‌లపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి వీరిని తొలగించాలని బీజేపీని ఈసీ ఆదేశించింది. వీరిరువురిని స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకూ తక్షణమే తొలగించాలని బీజేపీని ఆదేశిస్తూ ఈసీ ఓ ప్రకటన జారీ చేసింది. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఠాకూర్, వర్మలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జాతి విద్రోహులను కాల్చివేయాలని ఠాకూర్ పాల్గొన్న సభలో నినాదాలు మిన్నంటగా, సీఏఏను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో నిరసనకు దిగిన ఆందోళనకారులను ఉద్దేశించి వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘లక్షలాది మంది అక్కడ (షహీన్‌బాగ్) గుమికూడారు..వారు ఎప్పుడైనా మీ ఇళ్లలోకి వచ్చి మీ అక్కాచెల్లెళ్లు, కుమార్తెలపై హత్యాచారాలకు తెగబడవచ్చు..రేపు మిమ్మల్ని మోదీజీ, అమిత్ షాలు కూడా కాపాడలేర’ని అన్నారు. చదవండి : ‘వారు ఇళ్లలోకి వచ్చి హత్యాచారాలు చేస్తే దిక్కెవరు’ -
‘బిర్యానీ కాదు..బుల్లెట్ దించాలి’
బెంగళూర్ : సీఏఏను వ్యతిరేకిస్తూ సాగుతున్న ఆందోళనల నేపథ్యంలో బీజేపీ మంత్రులు, సీనియర్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపుతుంటే తాజాగా కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వైఖరికి తాను మద్దతిస్తానంటూ జాతి విద్రోహులకు బిర్యానీ కాదు బుల్లెట్ రుచిచూపాలని కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి సీటీ రవి అన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్న ర్యాలీలో జాతి విద్రోహులను కాల్చిపారేయాలనే నినాదాలు మిన్నంటిన క్రమంలో ఈ వివాదంపై కర్ణాటక మంత్రి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ దుమారం రేపుతోంది. జాతి విద్రోహులపై అనురాగ్ ఠాకూర్ ప్రకటనను వ్యతిరేకిస్తున్నవారిపై మంత్రి మండిపడ్డారు. ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, యాకూబ్ మెనన్‌ల మృతిని వ్యతిరేకిస్తూ, తుక్డే తుక్డే గాయంగ్‌ను సమరిస్తూ, సీఏఏపై దుష్ప్రచారం సాగిస్తున్నవారే అనురాగ్ ఠాకూర్ ప్రకటనతో విభేదిస్తున్నారని నిప్పులు చెరిగారు. జాతి వ్యతిరేకులకు బిర్యానీ తినిపించడం కాదని, వారికి బుల్లెట్ రుచిచూపాలని మంత్రి రవి ట్వీట్ చేశారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. చదవండి : సీఏఏపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్ -
చిట్‌ఫండ్’కు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: చట్టబద్ధ చిట్‌ఫండ్స్ కంపెనీలకు సంబంధించిన కీలక సవరణ బిల్లుకు బుధవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. చిట్స్ నిర్వహిస్తున్న వ్యక్తి తీసుకునే కమీషన్‌ను ప్రస్తుతం ఉన్న 5% నుంచి 7 శాతానికి పెంచుతూ ఈ బిల్లులో ప్రతిపాదన ఉంది. అలాగే, చిట్ మొత్తాన్ని మూడు రెట్లు పెంచుకునే అవకాశం కూడా కల్పించారు. ‘ది చిట్‌ఫండ్స్ (అమెండ్మెంట్)బిల్, 2019’పై కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ మాట్లాడుతూ.. చిట్‌ఫండ్స్‌ను అనధికార, అనియంత్రిత డిపాజిట్ పథకాలు, లేదా పోంజీ స్కీమ్స్‌తో పోల్చకూడదని పేర్కొన్నారు. ఒకరు లేదా నలుగురి లోపు వ్యక్తులు నిర్వహించే చిట్స్ గరిష్ట మొత్తాన్ని రూ. 1 లక్ష నుంచి రూ. 3 లక్షలకు పెంచేలా.. నలుగురు లేదా ఆపై సంఖ్యలో నిర్వాహకులున్న చిట్‌ఫండ్ సంస్థల్లో చిట్స్ మొత్తాన్ని రూ. 6 లక్షల నుంచి రూ. 18 లక్షలకు పెంచేలా ఈ బిల్లులో ప్రతిపాదనలున్నాయి. చిట్‌ఫండ్ నిర్వాహకుడి కమిషన్‌ను 5% నుంచి పెంచి 7% చేశారు. ‘చిట్ అమౌంట్’ను ఇకపై ‘గ్రాస్ చిట్ అమౌంట్’ అని, డివిడెండ్‌ను ‘షేర్ ఆఫ్ డిస్కౌంట్’ అని, ‘ప్రైజ్ అమౌంట్’ను ‘నెట్ చిట్‌ఫండ్’ అని పేర్కొనాలని బిల్లులో స్పష్టం చేశారు. కనీస మొత్తం (బేస్ అమౌంట్) రూ. 100 అని పేర్కొన్న నిబంధనను తొలగిస్తూ ఆ కనీస మొత్తాన్ని నిర్ధారించే అవకాశాన్ని రాష్ట్రాలకు కల్పించారు. అవసరమనుకుంటే, చిట్‌ఫండ్ వినియోగదారులు చిట్ మొత్తానికి బీమా చేయించుకోవచ్చు కానీ వినియోగదారులపై భారం మరింత పెరుగుతుందనే ఆలోచనతో.. బీమాను కచ్చితం చేయాలనుకోవడం లేదని బిల్లుపై చర్చ సందర్భంగా అనురాగ్ ఠాకూర్ తెలిపారు. -
చింతపండుపై జీఎస్టీని మినహాయించాం
సాక్షి, ఢిల్లీ: ఎండబెట్టిన చింతపండుపై జీఎస్టీని మినహాయించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ మేరకు ఎండబెట్టిన చింతపండుపై జీఎస్టీని మినహాయించాని విజ్ఞప్తి చేస్తూ జూలై 24న కేంద్ర ఆర్థిక శాఖకు వైఎస్సార్ సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లేఖ రాశారు. దీనిపై సెప్టెంబర్ 20న పనాజీలో జరిగిన జీఎస్టీ 37వ మండలి సమావేశంలో విస్తృతంగా చర్చించి ఎండబెట్టిన చింతపండుపై జీఎస్టీని మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు వేమిరెడ్డికి అనురాగ్ ఠాకూర్ గురువారం ప్రత్యుత్తరం పంపారు. సెప్టెంబర్ 30 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్టు తెలిపారు. -
బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ!
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఎన్నిక కావడం దాదాపుగా ఖాయమైంది. కార్యదర్శిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తనయుడు జై షా వ్యవహరిస్తారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ ధుమాల్ బోర్డు కోశాధికారిగా ఎంపిక కానున్నారు. పోటీ లేకుండా ఏకగ్రీవంగా కీలక పదవులు దక్కించుకునేందుకు క్రికెట్ వర్గాలు, కేంద్ర రాజకీయ వర్గాల మధ్య గత కొంత కాలంగా సుదీర్ఘ చర్చలు కొనసాగాయి. చివరకు ఆదివారం సాయంత్రం ఈ ఒప్పందం ఖరారైంది. ఈ నెల 23న బోర్డు ఎన్నికలు జరగాల్సి ఉండగా, నామినేషన్ల దాఖలుకు నేడు ఆఖరి తేదీ. అయితే తాజా సహకారం నేపథ్యంలో పోటీ లేకుండా వీరందరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఢిల్లీలో శనివారం అమిత్ షాను గంగూలీ కలవడంతోనే గంగూలీ బోర్డు అధ్యక్షుడు ఖాయమని వినిపించింది. అయితే 2021 బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో తనకు మద్దతునివ్వాలని షా కోరగా... గంగూలీ హామీ ఇవ్వలేదని తెలిసింది. దాంతో శ్రీనివాసన్ వర్గానికి చెందిన బ్రిజేష్ పటేల్ పేరు అధ్యక్షుడిగా తెరపైకి వచి్చంది. అయితే చివరకు ఎక్కువ సంఘాలు బ్రిజేష్ అభ్యరి్థత్వాన్ని వ్యతిరేకించడంతో గంగూలీకి మార్గం సుగమమైంది. ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్... బోర్డు అధ్యక్షుడిగా 2020 సెపె్టంబర్ వరకు మాత్రమే కొనసాగగలడు. ఆ తర్వాత నిబంధనల ప్రకారం అతను ‘విరామం’ తీసుకోక తప్పదు. -
పరిశీలనలో వెనుకబడిన జిల్లాల నిధులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్‌లోని ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఉద్దేశించిన నాలుగో విడత నిధుల విడుదల ప్రభుత్వ పరీశీలనలో ఉన్నట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ థాకూర్ చెప్పారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ మంత్రి ఈ విషయం తెలిపారు.మఒడిస్సాలోని కలహండి, బోలంగీర్, కోరాపుట్ జిల్లాలు, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతానికి ప్రకటించిన ప్యాకేజీ మాదిరిగా ఆంధ్ర ప్రదేశ్‌లోని ఏడు వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని విభజన చట్టంలో ఎక్కడా పేర్కొనలేదని అన్నారు. అయితే ఈ జిల్లాల అభివృద్ధికి ఆర్థికంగా ఆలంబన ఇవ్వాలని నీతి అయోగ్ చేసిన సిఫార్సు మేరకే ప్రతి జిల్లాకు 300 కోట్ల రూపాయలు చొప్పున మొత్తం 2100 కోట్ల నిధులను విడతల వారీగా విడుదల చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. దీనికి అనుగుణంగానే 2014-15, 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరాలలో మూడు వాయిదాల కింద రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు కలిపి 1050 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో నాలుగో విడత నిధుల విడుదలకు అవసరమైన అమోదం లభించలేదు. పొరపాటున నాలుగో విడత కింద విడుదల చేసిన 350 కోట్లను తిరిగి వాపసు తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. ఈ నాలుగో విడత నిధుల విడుదల ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు. -
పట్టు వస్త్రంలో బడ్జెట్ కాపీతో ఆర్థికమంత్రి సీతారామన్
-
లైవ్ అప్డేట్స్: రూపాయి సుంకం.. నడ్డివిరిచేదే..!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఒక మహిళా ఆర్థిక మంత్రి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది ప్రప్రథమం. గతంలో ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ ఆర్థిక మంత్రిగా అదనపు బాధ్యతలు చేపట్టారు. పూర్తిస్థాయి తొలి మహిళా ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టి రికార్డులకెక్కిన నిర్మలా సీతారామన్ తన మొదటి చిట్టాపద్దులో సంస్కరణలకు పెద్దపీట వేశారు. తన తొలి బడ్జెట్లో బ్రాహ్మాండమైన, సంచలనమైన నిర్ణయాలు తీసుకోనప్పటికీ.. దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని.. సమీకృత ఆర్థికావృద్ధి దిశగా పలు ప్రతిపాదనలు చేశారు. ముఖ్యంగా సంపన్నులపై ఎక్కువ పన్ను భారాన్ని మోపుతూ.. గ్రామీణ భారతాన్ని, వ్యవసాయ రంగాన్ని ఊతమిచ్చేలా నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలపై లీటరకు రూ. 1 సెస్ విధించడం, బంగారం, ఇతర విలువైన అభరణాలపై కస్టమ్స్ సుంకాన్ని 10 నుంచి 12.5 శాతానికి పెంచడం మధ్యతరగతి మీద ప్రభావం చూపించేదే. ఇక వార్షికంగా రూ. రెండు నుంచి ఐదు కోట్ల ఆదాయ వర్గాలకు వర్తించే పన్నును మూడుశాతం పెంచిన నిర్మల.. రూ. 5 కోట్లు కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నవారికి ఏడుశాతం పెంచారు. ఇక, ప్రభుత్వ రంగ బ్యాంకులకు బడ్జెట్లో పెద్ద ప్రాధాన్యమే లభించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన సహాయం కింద ఈ ఏడాది రూ. 70వేల కోట్లు అందించనున్నట్టు తెలిపారు. ఇక, నిర్మల తన చిట్టాపద్దుల్లో తెలుగు రాష్ట్రాలను పూర్తిగా విస్మరించారు. ప్రస్తుత బడ్జెట్లో తెలుగు రాష్ట్రాల ప్రస్తావనే లేదు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టు గురించి కానీ, నూతన రాజధాని నిర్మాణానికి నిధులు గురించి కానీ, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు అంశాన్ని కానీ ఆమె పేర్కొనలేదు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ లైవ్ అప్డేట్స్ ఇవి.. ఇది కార్పొరేట్ కంపెనీల బడ్జెట్.. కేంద్ర బడ్జెట్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శలు కురిపించారు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద, మధ్యతరగతి, సామాన్య ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని విధంగా బడ్జెట్ రూపొందించారని పేర్కొన్నారు. జాతీయ ప్రాజెక్టు పోలవరానికి నిధుల కేటాయింపు ఊసేలేదని, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇవ్వాల్సిన ప్యాకేజీని విస్మరించారని అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించలేదని, విశాఖ రైల్వే జోన్, ఇతర ప్రాజెక్టులకు నిధులు ఊసే లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.1 చొప్పున సుంకం విధించడం సామన్యుని నడ్డి విరచడమేనని దుయ్యబట్టారు. ఇది కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా తయారు చేసిన బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. ఇంధన ధరల పెరుగుదలవల్ల రవాణా రంగంపై పెనుభారం పడి ధరల భారం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ చేతిలో ఆర్థికమంత్రి కీలు బొమ్మ.. కేంద్ర బడ్జెట్లో విద్యా, ఉద్యోగాల్లో ఎలాంటి ప్రోత్సహకాలు ఇచ్చే పథకాలు లేవని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు రూపాయి పన్ను చెల్లిస్తే తిరిగి కేవలం 65 పైసలు మాత్రమే ఇక్కడివారికి కేటాయిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల నేతలు కేంద్రం వైఖరిని ఖండించాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతున్నా కేసులకు భయపడి సీఎం కేసీఆర్ పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలను నోరుమెదపనీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దక్షిణాదికి చెందిన వ్యక్తి అయినా ప్రధాని మోదీ చేతిలో కీలుబొమ్మ అయ్యారని ఎద్దేవా చేశారు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు ఒరిగింది సున్నా... కేంద్ర బడ్జెట్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పెదవి విరిచారు. బడ్జెట్ నిరాశపరిచిందని, ఏపీకి ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదని ఆయన అన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపించిందని, బడ్జెట్లో ఏపీకి అదనంగా ఇచ్చిందేమీ లేదన్నారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలుకు నిధుల విషయంలోనూ అన్యాయం జరిగిందని, బడ్జెట్లో ఏపీకి ఒరిగింది సున్నా అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయిస్తున్నారనే దానిపై స్పష్టత లేదని ఆయన అన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ఏ పోరాటానికైనా తాము సిద్ధమన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్లో ప్రశ్నిస్తామని విజయసాయి రెడ్డి తెలిపారు. బడ్జెట్‌పై ప్రధాని మోదీ హర్షం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ సమృద్ధి, ప్రజల స్వావలంబన దిశగా ఈ బడ్జెట్ కృషి చేస్తుందని ఆయన కొనియాడారు. ఈ బడ్జెట్ ద్వారా పేదలకు మంచి జరుగుతుందని, యువత మంచి భవిష్యత్తు లభిస్తుందన్నారు. నవభారత నిర్మాణం కోసం ఈ బడ్జెట్ రోడ్డుమ్యాపు రూపొందించిందని, నిర్మాణాత్మక సంస్కరణల ద్వారా దేశ వ్యవసాయ ముఖచిత్రాన్ని ఇది మార్చబోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తు పట్ల ఆశావాదంతో ఈ బడ్జెట్ రూపొందిందని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలోని హైలైట్స్.. బంగారం, పెట్రోల్‌పై పన్నుల మోత తన తొలి బడ్జెట్లో బంగారం, పెట్రో ఉత్పత్తులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్నుల మోత మోగించారు. బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని 10 నుంచి 12.5 శాతానికి పెంచారు. దీంతో బంగారం ధరలు పెరిగే అవకాశముంది. ఇక, పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరగనున్నాయి. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులపై ప్రతి లీటర్‌పై ఒక రూపాయి సెస్ అదనంగా విధిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. రోడ్లు, మౌలిక వసతుల కల్పన కోసం ఈ సెస్‌ను విధిస్తున్నట్టు ప్రకటించారు. ఇక, ఏడాదికి రూ. ఐదు కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి అదనంగా ఏడు శాతం పన్ను విధించారు. నిజాయితీగా పన్ను చెల్లిస్తున్న వారికి అభినందనలు ప్రత్యక్ష పన్నుల ఆదాయం రూ. 7 లక్షల కోట్లకుపైగా పెరిగింది రూ. 11.37 లక్షల కోట్లకు చేరిన ప్రత్యక్ష పన్నుల ఆదాయం రూ. 400 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలకు 25శాతం కార్పొరేట్ పన్ను మినహాయింపు తగ్గనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు.. ఎలక్ట్రిక్ వాహనాలు కొంటే ఆదాయపన్ను మినహాయింపు స్టార్టప్‌లకు ఐటీ పరిశీలన నుంచి మినహాయింపు తగ్గనున్న గృహ రుణాల వడ్డీ రూ. 45 లక్షలలోపు గృహ రుణాలపై అదనంగా రూ. లక్షన్నర వడ్డీ తగ్గింపు నూతనంగా ఇల్లు కొనుగోలు చేసేవారికి రూ. 3.5 లక్షల వడ్డీ రాయితీ పాన్ కార్డుకు బదులు ఆధార్ కార్డు.. ఇకపై ఆధార్ కార్డు లేదా ప్యాన్ కార్డుతో ఐటీ రిటర్న్స్ చెల్లించవచ్చు ఏడాదికి బ్యాంక్ నుంచి నగదు విత్‌డ్రాయల్స్ కోటి దాటితే రెండు శాతం టీడీఎస్ పన్ను డిజిటల్ లావాదేవీలను పెంచేదిశగా ఈ మేరకు చర్యలు వినియోగదారుల డిజిటల్ పేమెంట్స్‌పై చార్జీల ఎత్తివేత రూ. 2 కోట్ల వార్షిక ఆదాయం దాటిన వారిపై 3శాతం సర్‌చార్జ్ ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి రూ. 5 లక్షలకు పెంపు మహిళా నాయకత్వానికి ప్రోత్సాహం మహిళల నాయకత్వానికి ప్రోత్సాహం కల్పిస్తాం మహిళల ఆర్థిక స్వావలంబన, వారు పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు ‘నారీ-నారాయణీ’ పథకం డ్వాక్రా మహిళలకు రూ. 5వేల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం స్వయం సహాయక బృందాలకు కూడా ముద్రా యోజన వర్తింపు ప్రతి స్వయం సహాయక బృందంలో ఒక మహిళకు రూ. లక్ష వరకు రుణం బ్యాంకింగ్ రంగంలో ప్రక్షాళన చేపడుతాం బ్యాంకింగ్ రంగంలో నిరర్థక ఆస్తులు రూ. లక్ష కోట్లకు తగ్గాయి నాలుగేళ్లలో రూ. 4 లక్షల కోట్ల నిరర్ధక ఆస్తులు రికవరీ చేశాం పెట్టుబడులు పెంచేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 70వేల కోట్లు కేటాయిస్తున్నాం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకు ప్రాధాన్యం.. ఎన్‌బీఎఫ్‌సీలకు వన్ టైం క్రెడిట్ గ్యారెంటీ కల్పిస్తాం రెండో కోట్లమంది గ్రామీణ యువతకు శిక్షణ దేశంలో మెగా మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లు ఏర్పాటు చేస్తాం. బ్యాటరీ, సౌరశక్తి రంగంలో విదేశీ కంపెనీలకు అనుమతి ఇస్తాం ప్రధానమంత్రి డిజిటల్ సాక్షరత యోజన ద్వారా 2 కోట్లమంది గ్రామీణ యువతకు శిక్షణ దేశవ్యాప్తంగా 256 జిల్లాలకు జలశక్తి అభియాన్ పథకం మీడియా, యానిమేషన్, విమానాయాన రంగంలో వ్యూహాత్మక ఎఫ్‌డీఐలపై పరిశీలన చిల్లర వ్యాపారులకు నూతన ఫించన్ పథకం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ. కోటి వరకు రుణ సదుపాయం ఉడాన్ పథకంతో చిన్న చిన్న పట్టనాలకు విమానాయాన సౌకర్యం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ. కోటి వరకు రుణ సదుపాయం ఉడాన్ పథకంతో చిన్న చిన్న పట్టనాలకు విమానాయాన సౌకర్యం స్టార్ట్అప్ల కోసం ప్రత్యేక టీవీ చానల్ స్టార్ట్అప్ల కోసం ప్రత్యేక దూరదర్శన్ టీవీ చానల్ స్టాండప్ ఇండియా పథకం కింద బలహీన వర్గాల యువతకు శిక్షణ ఇస్తాం ఇళ్లలో వాడిన నీటిని పునర్వినియోగం కింద సాగునీరుగా మార్చి పంటలకు మళ్లిస్తాం భారతీయ పాస్‌పోర్టు ఉన్న ఎన్నారైలందరికీ ఆధార్ కార్డుల కేటాయింపు ఎన్ఆర్ఐలు 180 రోజులు ఎదురుచూడకుండా సత్వరమే ఆధార్ కార్డులు కొత్తగా 18 దేశాల్లో భారతీయ ఎంబసీల ఏర్పాటు 2019-20లో కొత్తగా నాలుగు ఎంబసీలు ఏర్పాటు చేస్తాం 17 ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం మౌలిక రంగం అభివృద్ధికి ఐడియాస్ స్కీం తీసుకొస్తాం ఆదివాసీ, గిరిజనుల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను డిజిటల్రూపంలో భద్రపరుస్తాం ఉజ్వలా ఇండియా పథకం కింద 35 కోట్ల ఎల్ఈడీ బల్బుల పంపిణీ ఎల్ఈడీ బల్బులతో రూ. 18,341 కోట్లు మిగులు పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టులు మరిన్ని పెంచుతాం పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుల్లో అమెరికా, చైనా తర్వాత భారత్ నిలిచింది వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుంది ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పిస్తాం రిజర్వ్ బ్యాంక్ పరిధిలోకి హౌసింగ్ ఫైనాన్స్ సెక్టార్ సరికొత్త అంతరిక్ష శక్తిగా భారత్ ప్రపంచంలోనే భారత్ సరికొత్త అంతరిక్ష శక్తిగా అవతరిస్తోంది ఇస్రో సేవలను వాణిజ్యపరంగానూ వృద్ధి చేసేందుకు ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేస్తున్నాం స్టాక్ మార్కెట్లో ఎన్నారైలూ పెట్టుబడులు పెట్టేందుకు వెసులుబాటు కల్పిస్తాం ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు ఉన్నత విద్యాకేంద్రంగా ఎదిగేందుకు భారత్‌కు ఎన్నో అవకాశాలు మన ఉన్నత విద్యాసంస్థల్లోకి విదేశీ విద్యార్థులు రాక మరింత పెరగాలి స్టడీ ఇన్ ఇండియా పథకంలో భాగంగా విదేశీ విద్యార్థులు ఇక్కడ చదివే అవకాశం ఏడాదిలోగా ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు శాస్త్ర సాంకేతిక రంగంలో జాతీయ పరిశోధన సంస్థ ఏర్పాటు ఖేలో ఇండియా ద్వారా దేశవ్యాప్తంగా క్రీడలకు ప్రోత్సాహం తక్కువ అద్దెకు ఇల్లు రెంట్ తీసుకునేలా ఆదర్శ అద్దె విధానం దేశవ్యాప్తంగా మెట్రో రైలు సర్వీసులను మరో 300 కిలోమీటర్ల మేర పెంచుతాం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 650 కిలోమీటర్ల మెట్రోమార్గం అందుబాటులో ఉంది అక్టోబర్ 2 నాటికి దేశవ్యాప్తంగా బహిరంగ మలమూత విసర్జనను నిషేధిస్తాం విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునేవారికి ప్రత్యేక శిక్షణ ఇస్తాం కార్మిక సంక్షేమం కోసం 4 లేబర్ కోడ్స్ వేర్వేరు కార్మిక చట్టాలను వృవస్థీకృతం చేసి.. నాలుగు కోడ్లుగా రూపొందిస్తాం కార్మిక చట్టాల సరళీకరణ.. కార్మిక సంక్షేమం కోసం నాలుగు లేబర్ కోడ్లు నాలుగు కోడ్ల కిందకు అన్ని కార్మిక చట్టాలు తీసుకొస్తాం ప్రతి ఇంటికీ తారునీరు అందిస్తాం పల్లెలు, పెదలు, రైతులపై ప్రత్యేక దృష్టి పెట్టాం.. లక్షా25వేల కిలోమీటర్ల రహదారిని అభివృద్ధి చేస్తాం పర్యావరణహితంగా 30 వేల కిలోమీటరల రహదారిని మార్చుతాం దేశవ్యాప్తంగా సురక్షిత తాగునీరు అందిస్తాం దేశవ్యాప్తంగా 256 జిల్లాలలో జలశక్తి అభియాన్ పథకం అమలు చేస్తాం 2020లో ప్రతి పల్లెలో ప్రతి ఇంటికి తారునీరు అందిస్తాం రైతుల ఆదాయం రెండింతలు చేసే విధానాలు అమలుచేస్తాం పెట్టుబడి లేకుండా వ్యవసాయ పథకం.. ఈ పథకం కింద రైతులకు శిక్షణ ఇస్తాం మూడేళ్లలో విద్యుత్, ఎల్పీజీ గ్యాస్ సౌకర్యం లేని ఇల్లు ఉండదు పేదలకు ఇల్లు నిర్మించే గడువును 114 రోజులకు తగ్గింపు ప్రయాణానికి ఒక ఒకే కార్డు ఇక దేశవ్యాప్తంగా అన్ని ప్రజా రవాణా వ్యవస్థల్లో ప్రయాణానికి ఒకే కార్డును ప్రవేశపెడతాం ఒకే కార్డుతో బస్సు, రైలు, విమానం, మెట్రోల్లో ప్రయాణం చేసే సౌలభ్యం కల్పిస్తాం ఒకే గ్రిడ్ కిందకి అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్పత్తి, సరఫరాను తీసుకొస్తాం పేద, మధ్యరగతి వర్గాలకు తక్కువ ధరకు గృహ సదుపాయం కల్పిస్తాం గ్రామాలను పట్టణాలతో అనుసంధానం చేయడానికే భారత్ మాల పథకం అద్దెకుండే వారి హక్కుల పరిరక్షణకు కొత్త చట్టం తీసుకొస్తాం దేశవ్యాప్తంగా మూడు కోట్లమంది చిన్న వ్యాపారులకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తాం ఎలక్ట్రిక్ బైక్‌లు, కార్లు కొనేవారికి రాయితీలు ఐదేళ్లలో మనం సాధించిన పేటెంట్ల సంఖ్య మూడు రెట్లకు పెరిగింది బలమైన దేశం కోసం.. బలమైన పౌరుడు అనే విధానంతో ముందుకెళ్తాం లక్ష్యసాధనలో నమ్మకముంటే ఏదో ఒక మార్గం దొరుకుతుంది బలమైన గాలులు వీచినా దీపం వెలుగుతుంది ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నిర్మించే దిశగా సాగుతున్నాం సంస్కరణలు, పనితీరు, మార్పు దిశగా ముందుకెళ్లడం మా విధానం మా ప్రభుత్వ ప్రాధాన్య అంశాల్లో ఉపాధి, ఉద్యోగ కల్పన కీలకం మేకిన్ ఇండియాను మా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది తక్కువ అధికారం, ఎక్కువ పరిపాలన పద్ధతిలో నడుస్తున్నాం భారత్ ఇంజినీరింగ్ సామర్థ్యాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటాం ఎలక్ట్రిక్ బైక్‌లు, కార్లు, వాహనాలు కొనేవారికి రాయితీలు కల్పిస్తాం అంతర్గత నదీ జలరవాణాను అభివృద్ధి చేసి రవాణాకు వినియోగిస్తాం గంగానదిలో ప్రస్తుతం చేస్తున్న జలరవాణాను నాలుగింతలు పెంచుతాం చట్టబద్ధంగా వచ్చే ఆదాయాలను మేం చిన్నచూపు చూడబోం. పాలసీ స్తంభన, లైసెన్స్ కోటా కంట్రోల్ పరిపాలన వంటి రోజులు ఇప్పుడు లేవు. భారత కార్పొరేట్ సంస్థలే భారత్‌కు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. జాతి సంపదను పెంచుతున్నాయి. పరస్పర విశ్వాసంతో మనం వృద్ధి సాధించగలం. నిరంతర ఆర్థికావృద్ధి సాధ్యమవుతుంది. భారత్‌మాలా, సాగర్మాలా, ఊడాన్ వంటి పథకాలు గ్రామీణ, పట్టణ భారతాల మధ్య ఉన్న దూరాన్ని కలుపుతున్నాయి. మన రవాణా మౌలిక వసతులు ఎంతో మెరుగవుతున్నాయి. 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు మనకు 55 ఏళ్లు పట్టింది. కానీ, హృదయంలో విశ్వాసం, నమ్మకం, ఆశావాదం, ఆకాంక్షతో కృషి చేసి.. గత ఐదేళ్లలో మన ఆర్థిక వ్యవస్థకు ఒక టిలియన్ డాలర్లను జోడించాము. ప్రస్తుత సంవత్సరంలోనే భారత ఆర్థిక వ్యవస్థ మూడు ట్రిలియన్ డాలర్లకు చేరుకోనుంది. ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనది. ఐదేళ్ల కిందట ఈ విషయంలో మనం దేశం 11వ స్థానంలో ఉంది. చాణక్య నీతి సూత్రాన్ని వల్లించిన నిర్మల ‘కార్య పురుష కరే న లక్ష్యం సంపదయతె’ అని చాణక్య నీతి సూత్రం చెబుతుంది. దృఢ సంకల్పంతో చేసే కృషి లక్ష్యాన్ని చేరుతుందని దాని అర్థం ఉర్దూ సూక్తిని ఉటంకించిన నిర్మల బడ్జెట్ ప్రసంగంలో భాగంగా నిర్మలా సీతారామన్ ఉర్దూ సూక్తిని ఉటంకించారు. ‘ యకీన్ హో తో కోహి రస్తా నిఖల్‌తా హై, హవా కీ ఉత్ భి లే కర్ చిరాగ్ జల్తా హై’ అని పేర్కొన్నారు. నవ, సుస్థిర భారతానికి పట్టం.. నవ, సుస్థిర భారతానికి ఇటీవలి ఎన్నికలు పట్టం కట్టాయి. ఓటర్లు పెద్దసంఖ్యలో ముందుకొచ్చి ఓటు వేశారు. పనిచేసే ప్రభుత్వానికి ఆమోదం తెలుపుతూ.. ప్రతి వర్గం ముందుకొచ్చి ఓటేసింది. నవ భారత రూపకల్పనకు ప్రణాళికలు రచిస్తున్నాం నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తమ తొలి హయాంలో పనిచేసే ప్రభుత్వంగా నిలిచింది. కేంద్ర-రాష్ట్ర సంబంధాల మెరుగుదల, సహకార సమాఖ్యవాదం, జీఎస్టీ కౌన్సిల్, ద్రవలోటు నియంత్రణ విషయంలో క్రమశిక్షణ వంటి అంశాల్లో దృఢ సంకల్పంతో ప్రధాని మోదీ కృషి చేశారు. నిర్మతా సీతారామన్ వినూత్న నిర్ణయం తొలిసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తనదైన ముద్ర వేశారు. బ్రిటిష్ సంప్రదాయానికి స్వస్తి చెప్తూ.. ఆమె పట్టు వస్త్రంలో బడ్జెట్ ప్రసంగ కాపీని పార్లమెంటుకు తీసుకొచ్చారు. గతంలో బ్రిటిష్ సంప్రదాయాన్ని పాటిస్తూ బ్రీఫ్‌కేస్‌లో బడ్జెట్ ప్రసంగ కాపీని పార్లమెంటుకు తెచ్చేవారు. దీనికి ముగింపు పలికిన నిర్మల.. పట్టు వస్త్రానికి రాజముద్ర వేసి.. బడ్జెట్ ప్రసంగ కాపీని పార్లమెంటుకు తీసుకొచ్చారు. కేంద్ర కేబినెట్ ఆమోదం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ బడ్జెట్ 2019ని ఆమోదించింది. మరికాసేపట్లో ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్ 2019 పత్రులు పార్లమెంటుకు చేరుకున్నాయి. Delhi: Copies of #Budget2019 have been brought to the Parliament. Finance Minister Nirmala Sitharaman will present the Budget in Lok Sabha at 11 AM today. pic.twitter.com/Rmj4UJPteC — ANI (@ANI) July 5, 2019 దేశ బడ్జెట్‌ను పార్లమెంటులో సమర్పించనున్న నేపథ్యంలో పార్లమెంటు ఆవరణలో కేంద్ర కేబినెట్ భేటీ అయింది. దేశ బడ్జెట్‌ను పార్లమెంటులో సమర్పించనున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ భేటీ అయింది. మరికాసేపట్లో కేంద్ర కేబినెట్ బడ్జెట్‌ను ఆమోదించనుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర పార్లమెంటుకు చేరుకున్నారు. మరికాసేపట్లో నిర్మల బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ముందుగా రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌ను కలిశారు. బడ్జెట్‌ను సమర్పించే ముందు ఆర్థికమంత్రి రాష్ట్రపతిని కలువడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా బడ్జెట్ కాపీలను ఆమె రాష్ట్రపతికి అందించారు. నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తమ తొలి హయాంలో పనిచేసే ప్రభుత్వంగా నిలిచింది. కేంద్ర-రాష్ట్ర సంబంధాల మెరుగుదల, సహకార సమాఖ్యవాదం, జీఎస్టీ కౌన్సిల్, ద్రవలోటు నియంత్రణ విషయంలో క్రమశిక్షణ వంటి అంశాల్లో దృఢ సంకల్పంతో ప్రధాని మోదీ కృషి చేశారు. -
‘బడ్జెట్ హల్వా’ తయారీ
న్యూఢిల్లీ: ‘బడ్జెట్ హల్వా’ఉత్సవం శనివారం సాయంత్రం ఇక్కడి ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం నార్త్‌బ్లాక్‌లో జరిగింది. సాధారణంగా బడ్జెట్ పత్రాల ముద్రణను హల్వా తయారీతో ఆరంభిస్తారు. ఈ ఆనవాయితీలో భాగంగానే వచ్చే నెల 5న ప్రవేశపెట్టే బడ్జెట్‌కు సంబంధించిన పత్రాల ముద్రణను ప్రారంభించే కార్యక్రమానికి ముందు హల్వా ఉత్సవం చోటు చేసుకుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్, రెవెన్యూ కార్యదర్శి అజ్ భూషణ్ పాండే, దీపమ్ కార్యదర్శి అతను చక్రవర్తి, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హల్వా సంరంభంలో భాగంగా పెద్ద కడాయిలో హల్వాను తయారు చేసి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు, బడ్జెట్ తయారీకి సంబంధించిన సిబ్బందికి వడ్డించారు. ఈ సిబ్బంది... బడ్జెట్ తయారీ నుంచి లోక్‌సభలో ప్రవేశపెట్టేవరకూ ఆర్థిక మంత్రిత్వ శాఖ భవనంలోనే ఉంటారు. బయటి ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధాలు ఉండవు. ఉన్నతాధికారులకు మాత్రమే ఇంటికి వెళ్లడానికి అనుమతి ఉంటుంది. ఆర్థిక నిపుణులతో ప్రధాని భేటి.. ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థికవేత్తలు, పారిశ్రామిక నిపుణులతో శనివారం సమావేశమయ్యారు. నీతి ఆయోగ్ నిర్వహించిన ఈ సమావేశంలో ఆర్థిక వేత్తలు, వివిధ పరిశ్రమల నిపుణులు పాల్గొన్నారు. వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్, గణాంకాలు, పథకాల అమలు శాఖ సహాయ మంత్రి ఇంద్రజిత్ సింగ్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్‌లు కూడా హాజరయ్యారు. -
ట్విటర్‌కు పది రోజులు గడువు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ సోషల్ మీడియా సంస్థలకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై నియమించిన పార్లమెంటరీ కమిటీ సమన్లు జారీ చేసింది. సోమవారం (ఫిబ్రవరి 25)న ట్విట్ర్ అధికారులతో చర్చించిన కమిటీ రాబోయే పార్లమెంటు ఎన్నికలు విదేశీ సంస్థల చేత ప్రభావితం కావు అనే హామీ ఇవ్వాలని, ఇదే అంశంపై భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)తో మరింత సన్నిహితంగా చర్చలు జరపాలని కమిటీ చైర్మన్, ఎంపీ అనురాగ్ ఠాకూర్ కోరారు. ఈ అంశాలపై రాత పూర్వకంగా స్పందించేందుకు ట్విటర్ సీఈవో జాక్ డోర్సేతోపాటు ఇతర సీనియర్ అధికారులకు 10రోజులు గడువును ఇచ్చారు. అవసరమైతే ఇదే విషయంపై మరోసారి సమన్లు జారీ చేసే అవకాశం ఉందని కూడా ఆయన సూచించారు. సోషల్ మీడియా వేదికలపై 'పౌరుల హక్కులను పరిరక్షించడం' అనే అంశంపై వారి అభిప్రాయాలను తెలిపేందుకు వాట్సాప్‌తోపాటు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లక ప్రతినిధులకు కూడా సమన్లు జారీ చేసింది. మార్చి 6వ తేదీన ఆయా సంస్థలకు చెందిన సీనియర్లు కమిటీ ముందు హాజరుకావాలని కోరారు. రాబోయే లోక్ సభఎన్నికల్లో సోషల్ మీడియా సంస్థలు ఎటువంటి ప్రభావాలు చూపించకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అనురాగ్ ఠాకూర్ కోరారు. సోషల్ మీడియా సంస్థలు.. ఎన్నికల సమస్యలపై ఎన్నికల సంఘంతో కలిసి పనిచేయాలన్నారు. అంతకుముందు ట్విటర్ వైస్ ప్రెసిడెంట్,పబ్లిక్ పాలసీ హెడ్ కోలిన్ క్రోవెల్‌తో కమిటీ దాదాపు మూడున్నర గంటలపాటు చర్చించింది. ఈ సమావేశంలో సీఈవో జాక్ డోర్సీ రాసిన లేఖను అనురాగ్ ఠాకూర్ చదివి వినిపించినట్టు తెలుస్తోంది. కాగా సోషల్ మీడియాలో పౌరుల హక్కుల పరిరక్షణ కోసం బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో పార్లమెంటరీ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ నెల ఒకటవ తేదీన ట్విటర్ సంస్థకు ప్రభుత్వం సమన్లు కూడా జారీ చేసింది. సమయం తక్కువగా ఉందంటూ ట్విటర్ అధికారులు నిరాకరించడంతో, సమావేశం వాయిదా పడుతూ వచ్చింది. వాస్తవానికి ఈ మీటింగ్ తొలుత ఫిబ్రవరి7నుంచి 11వ తేదీకి వాయిదా పడింది. అనంతరం ట్విటర్ అధికారులు గైర్హాజరుకావడంతో పార్లమెంటరీ కమిటీ 15రోజుల్లో కమిటీ హాజరు కావాలంటూ అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. Twitter will appear before the Parliamentary Commitee today 25th Feb. Facebook, WhatsApp, Instagram will appear on 6th March. https://t.co/0sIOhVZIdZ — Anurag Thakur (@ianuragthakur) February 25, 2019 -
ట్విటర్ సీఈఓకు ఊరట..!
సాక్షి, న్యూఢిల్లీ : సమాచార సాంకేతికతపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్యానెల్ నిర్ణయంతో ట్వీటర్ సీఈవో జాక్ డోర్సేకు ఊరట లభించింది. ప్యానెల్ ఎదుట డోర్సే హాజరు కావాల్సిన అవసరం లేదని వెల్లడించింది. అతని తరపున కంపనీ పబ్లిక్ పాలసీ హెడ్ కోలిన్ క్రోవెల్ హాజరు కావొచ్చని లోక్‌సభ సభ్యుడు అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్ తెలిపింది. సోషల్ మీడియాలో పౌరుల సమాచారం లీక్ అవుతుందనే భయాల నేపథ్యంలో ట్విట్టర్ సీఈవోతోపాటు ఇతర ఉన్నత అధికారులు ఫిబ్రవరి 25లోగా తమముందు హాజరుకావాలని ప్యానెల్ అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. (ట్విటర్‌కు పార్లమెంటరీ కమిటీ అల్టిమేటం) అయితే, జాక్ డోర్సే కాకుండా అతని తరపున ట్విటర్ ఇండియా ప్రతినిధులు ప్యానెల్ ఎదుట హాజరయ్యేందుకు ఫిబ్రవరి 11న పార్లమెంటుకు వెళ్లినప్పటికీ వారిని కలిసేందుకు సభ్యులు నిరాకరించారు. సంస్థ సీఈఓ నేరుగా హాజరు కావాలని ప్యానెల్ తేల్చిచెప్పింది. దాంతో జాక్ డోర్సే ప్యానెల్ ఎదుట హాజరవుతాడని అందరూ భావించారు. అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాల్లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఫేస్బుక్, ట్విటర్ వంటి సోషల్ మీడియా సంస్థల్లో యూజర్ల డాటా లీక్ కావడాన్ని, ఆ సమాచారాన్ని ఎన్నికల్లో ఒక రాజకీయ పక్షానికి అనుకూలంగా ఉపయోగించుకున్నట్టు కథనాలు వచ్చిన నేపథ్యంలో ఈమేరకు భారత ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఐటీపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్యానెల్ ట్విటర్ సీఈఓ తమ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ప్యానెల్ తాజా నిర్ణయంతో కోలిన్ క్రోవెల్ ఇండియాకు రానున్నారు. (ట్విట్టర్ రెక్కలు కత్తిరిస్తారా?) -
ట్విటర్‌కు పార్లమెంటరీ కమిటీ అల్టిమేటం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్‌కు పార్లమెంటరీ కమిటీ షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో పౌరహక్కుల పరిరక్షణ విషయమై ట్విట్టర్ సీఈవోతోపాటు ఇతర ఉన్నత అధికారులు 15 రోజుల్లోగా తమముందు హాజరుకావాలని అల్టిమేటం జారీ చేసింది. సమాచార సాంకేతికతపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని పార్లమెంటురీ కమిటీ ఈ మేరకు సోమవారం నిర్ణయం తీసుకుంది. ట్విటర్ అంతర్జాతీయ విభాగం సీఈవో జాక్ డొర్సేతోపాటు ఉన్నతాధికారులు తమ ముందు హాజురు కావాల్సిందేనని, వారు హాజరయ్యేవరకు ఇతర ట్విటర్ అధికారులను తము కలువబోమని పార్లమెంటరీ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ట్విటర్ ఇండియా ప్రతినిధులు సోమవారం పార్లమెంటరీ కమిటీ ముందు హాజరవ్వడానికి పార్లమెంటుకు వెళ్లినప్పటికీ.. వారిని కలిసేందుకు కమిటీ నిరాకరించింది. అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాల్లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఫేస్బుక్, ట్విటర్ వంటి సోషల్ మీడియా సంస్థల్లో యూజర్ల డాటా లీక్ కావడాన్ని, ఆ సమాచారాన్ని ఎన్నికల్లో ఒక రాజకీయ పక్షానికి అనుకూలంగా ఉపయోగించుకున్నట్టు కథనాలు వచ్చిన నేపథ్యంలో ఈమేరకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ముఖ్యంగా రైట్‌వింగ్ వాదుల అభిప్రాయల పట్ల ట్విటర్ పక్షపాతపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై స్పందించిన ట్విటర్.. తమ వేదికపై ప్రజల రాజకీయ అభిప్రాయాల పట్ల ఎలాంటి పక్షపాతమూ చూపించడం లేదని స్పష్టత ఇచ్చింది. -
‘పాక్‌కు నయా పైసా కూడా చెల్లించొద్దు’
న్యూఢిల్లీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు భారత్ పైసా కూడా చెల్లించాల్సిన అవసరంలేదని బీసీసీఐ మాజీ చీఫ్ అనురాగ్ ఠాకూర్ స్పష్టంజేశారు. ద్వైపాక్షిక సిరీస్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ బీసీసీఐపై పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) దాదాపు రూ. 500 కోట్ల నష్టపరిహారానికి దావా వేసింది. ఈ కేసుపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వివాద పరిష్కార ప్యానెల్ సోమవారం నుంచి దుబాయ్‌లో విచారణ జరపనుంది. ఈ మేరకు అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘పాక్‌కు పైసా కూడా చెల్లించొద్దు. ఉగ్రవాదులకు మద్దతిచ్చే చర్యలను పాక్ ఆపితే.. ఆ తర్వాత ఆ దేశంతో క్రికెట్ ఆడే విషయం ఆలోచిస్తాం’ అని అనురాగ్ పేర్కొన్నారు. మరొకవైపు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘నాకు తెలిసినంత వరకు ఈ వివాదాన్ని పీసీబీ, బీసీసీఐ పరిష్కరించుకుంటే బాగుంటుంది. ఐసీసీ జోక్యం అవసరం లేదు. పాక్‌తో ఆడాలని బీసీసీఐ ఎప్పట్నుంచో భావిస్తోంది. కొన్ని కారణాల వల్ల పాక్‌తో ఆడేందుకు ప్రభుత్వ అనుమతి అవసరం అవుతోంది. తటస్థ వేదికల విషయానికి వస్తే ఆసియా, ఐసీసీ ట్రోఫీల్లో పాక్‌తో భారత్ తలపడుతూనే ఉంది. పాక్‌కు డబ్బులు చెల్లించే ప్రసక్తే లేదు’ అని శుక్లా అన్నారు. -
'బాధ్యతల నుంచి తప్పించుకోను'
న్యూఢిల్లీ: గత కొన్ని నెలలుగా భారత క్రికెట్ కు దూరమైన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తన రీ ఎంట్రీపై స్పందించారు. భారత క్రికెట్ తన సేవలు అవసరమని కోరితే అందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. తనది బాధ్యతల్ని నుంచి తప్పించుకునే మనస్తత్వం కాదని ఈ సందర్భంగా అనురాగ్ పేర్కొన్నారు. 'బాధ్యతల్ని తప్పించుకోను.నా అవసరం ఉందని భారత క్రికెట్ గుర్తిస్తే బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా'అని అనురాగ్ తన మనసులో మాట వెల్లడించారు. 'అనురాగ్ మళ్లీ భారత్ క్రికెట్ లోకి రావాలి. అతని అవసరం భారత్ క్రికెట్ కు ఉంది'అని గంగూలీ వ్యాఖ్యానించాడు. ఇటీవల గంగూలీ పుట్టినరోజు సందర్భంగా అనురాగ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ క్రమంలోనే గంగూలీ సోషల్ మీడియా ద్వారా అనురాగ్ తిరిగి భారత్ క్రికెట్ లోకి రావాలన్నారు. గత ఆరు నెలల క్రితం లోధా కమిటీ సిఫారుసుల అమలుకు సంబంధించి నాన్చుడి ధోరణి అవలంభించిన అనురాగ్ తన అధ్యక్ష పదవిని కోల్పోయారు. మరొకవైపు అబద్ధపు ప్రమాణం చేసి కోర్టు ఉల్లంఘనకు పాల్పడ్డారు. అయితే కొన్ని రోజుల క్రితం అనురాగ్ నేరుగా సుప్రీంకోర్టుకు హాజరై కోర్టు ఉల్లంఘనకు సంబంధించి క్షమాపణ తెలియజేయడంతో ఆ కేసు నుంచి విముక్తి పొందారు. -
ఠాకూర్ క్షమాపణను అంగీకరించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణ వ్యవహారంలో భేషరతుగా క్షమాపణ కోరుతూ బోర్డు మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ దాఖలు చేసిన అఫిడవిట్‌ను కోర్టు ఆమోదించింది. గతంలో ఆయన కోర్టుకు తప్పుడు ప్రమాణపత్రం సమర్పించినందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుం దని, భేషరతుగా క్షమాపణ చెప్పకపోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే కోర్టు సూచన మేరకు శుక్రవారం ఆయన స్వయంగా హాజరయ్యా రు. దీంతో ఠాకూర్‌పై ఉన్న కోర్టు ధిక్కరణ కేసును కోర్టు ఉపసంహరించుకుంది. మరోవైపు పరిపాలక కమిటీకి రామచంద్ర గుహ, విక్రమ్ లిమయే చేసిన రాజీనామాలను కోర్టు ఆమోదించింది. -
ఠాకూర్ క్షమాపణలను అంగీకరించిన సుప్రీం
న్యూఢిల్లీ: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ చెప్పిన బేషరతు క్షమాపణలను సుప్రీం కోర్టు శుక్రవారం అంగీకరించింది. కోర్డు సూచనల మేరకు ఠాకుర్ ‘ తప్పుడు సాక్ష్యం ఇవ్వాలనే ఉద్దేశం నాకెంతమాత్రం లేదు. అనుకోకుండా కొంత సమాచార లోపం కారణంగానే ఇదంతా జరిగింది. అందుకే ఎలాంటి సంకోచం లేకుండా స్పష్టంగా, బేషరతుగా కోర్టుకు క్షమాపణలు చెబుతున్నాను’ అని గురువారం తన అఫిడవిట్లో పేర్కొన్న విషయం తెలిసిందే. అంతకు ముందు సుప్రీం కోర్టు లోధా ప్యానెల్ ప్రతిపాదనల అమలు విషయంలో తప్పుడు ప్రమాణపత్రం దాఖలు చేసినందుకు ఠాకూర్ పై సుప్రీం సీరియస్ అయింది. కోర్టు ధిక్కరణ కేసును తప్పించుకోవాలంటే భేషరతుగా మరోసారి క్షమాపణ పత్రాన్ని కోర్టుకు సమర్పించాలని ఈనెల 7న ఆదేశించింది. బీసీసీఐ స్వయంప్రతిపత్తి విషయంలో ఎవరూ జోక్యం చేసుకోకుండా చూడాలంటూ 2016, ఆగస్టులో ఠాకూర్ ఐసీసీకి లేఖ రాశారు. అయితే ఈ విషయంలో తాను ఎవరికీ లేఖ రాయలేదని నాడు కోర్టుకు తప్పుడు అఫిడవిట్ అందించారు. -
ఠాకూర్ క్షమాపణ చెప్పారు
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ బేషరతుగా క్షమాపణ చెప్పారు. ఉద్దేశ పూర్వకంగా అత్యున్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించలేదని ఆయన తెలిపారు. గతంలో లోధా ప్యానెల్ ప్రతిపాదనల అమలు విషయంలో తను కోర్టులో తప్పుడు ప్రమాణపత్రం దాఖలు చేసినందుకు సుప్రీం కోర్టు సీరియస్ అయిన విషయం తెలిసిందే. కోర్టు ధిక్కరణ కేసును తప్పించుకోవాలంటే భేషరతుగా మరోసారి క్షమాపణ పత్రాన్ని కోర్టుకు సమర్పించాలని ఈనెల 7న ఆదేశించింది. ‘కోర్టుకు తప్పుడు సాక్ష్యం ఇవ్వాలనే ఉద్దేశం నాకెంతమాత్రం లేదు. అనుకోకుండా కొంత సమాచార లోపం కారణంగానే ఇదంతా జరిగింది. అందుకే ఎలాంటి సంకోచం లేకుండా స్పష్టంగా, బేషరతుగా కోర్టుకు క్షమాపణలు చెబుతున్నాను’ అని తన అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే కోర్టు సూచనల మేరకు నేడు (శుక్రవారం) ఆయన స్వయంగా హాజరుకావాల్సి ఉంది. బీసీసీఐ స్వయంప్రతిపత్తి విషయంలో ఎవరూ జోక్యం చేసుకోకుండా చూడాలంటూ 2016, ఆగస్టులో ఠాకూర్ ఐసీసీకి లేఖ రాశారు. అయితే ఈ విషయంలో తాను ఎవరికీ లేఖ రాయలేదని నాడు కోర్టుకు తప్పుడు అఫిడవిట్ అందించారు. -
'భారత్ క్రికెట్‌కు నీ అవసరం ఉంది'
న్యూఢిల్ల్లీ:భారత క్రికెట్ కంట్రోలో బోర్డు(బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తిరిగి మళ్లీ భారత్ క్రికెట్ లోకి రావాలని సౌరవ్ గంగూలీ ఆకాంక్షించాడు. భారత్ క్రికెట్ కు అనురాగ్ అవసరముందని పేర్కొన్న గంగూలీ.. మళ్లీ భారత్ క్రికెట్ పరిపాలనలో ఆయన్ను చూస్తామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. గత రెండు రోజుల క్రితం సౌరవ్ గంగూలీ 45వ పుట్టినరోజు సందర్బంగా అనురాగ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 'డియర్ గంగూలీ.. నీకు జన్మదిన శుభాకాంక్షలు.. నీకు ఇదొక మంచి సమయం. యువ క్రికెటర్లకు నీవు మరింత ఆదర్శవంతంగా ఉండాలి'అంటూ అనురాగ్ ట్వీట్ చేశాడు. దానికి గంగూలీ బదులిస్తూ.. థాంక్యూ యూ అనురాగ్, నీవు భారత క్రికెట్ లోకి తిరిగి వస్తావని అనుకుంటున్నా. నీ అవసరం భారత క్రికెట్ కు ఉంది'అంటూ ట్వీట్ చేశాడు. ఈ ఏడాది జనవరిలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్ష పదవి నుంచి అనురాగ్ వైదొలిగిన సంగతి తెలిసిందే. భారత క్రికెట్ ప్రక్షాళనలో భాగంగా లోధా కమిటీ సిఫారుసులో వెనుకడుగు వేసిన అనురాగ్ ను సుప్రీంకోర్టు తప్పించింది. దాంతో భారత్ క్రికెట్ వ్యవహారాలకు అనురాగ్ ఠాకూర్ దూరం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు నియమించిన వినోద్ రాయ్ నేతృత్వంలోని పరిపాలక కమిటీ భారత క్రికెట్ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. -
ఠాకూర్.. క్షమాపణ చెప్పు
♦ సుప్రీం కోర్టు ఆదేశం న్యూఢిల్లీ: కోర్టు ఉల్లంఘన కేసులో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలా అయితేనే ఆయనపై ఉన్న కేసు నుంచి ఉపశమనం పొందుతారని తేల్చింది. గతంలో ఠాకూర్ దాఖలు చేసిన క్షమాపణ పత్రాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదని, మరోసారి స్పష్టమైన పద్ధతిలో ఎలాంటి షరుతుల్లేని క్షమాపణ కోరుతూ ఒక పేజీతో కూడిన అఫిడవిట్‌ను దాఖలు చేయాలని జస్టిస్ దీపక్ మిశ్రా, ఏఎమ్ ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం సూచించింది. అలాగే ఈనెల 14న జరిగే తదుపరి విచారణకు ఆయన స్వయంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. -
కోహ్లినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
హమిర్పూర్:భారత క్రికెట్ కోచ్ పదవి నుంచి అనిల్ కుంబ్లే వైదొలగడానికి కెప్టెన్ విరాట్ కోహ్లినే అనడం ఎంతమాత్రం సరికాదని అంటున్నారు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్. ఈ ఉదంతంలో కోహ్లినే టార్గెట్ చేస్తూ ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారో తనకు అర్ధం కావడం లేదన్నారు. 'అనిల్ కుంబ్లే కోచ్ గా తప్పుకున్న తరువాత విరాట్ కోహ్లిని ఎటువంటి కారణం లేకుండా టార్గెట్ చేశారు. కుంబ్లే వైదొలగడానికి విరాట్ అనే చర్చను ఇకనైనా ఆపితే మంచిది. వచ్చే 10 ఏళ్లలో భారత్ క్రికెట్ ను కొత్త ఎత్తులకు తీసుకెళ్లే సత్తా కోహ్లికి ఉంది. ప్రస్తుతం అనవసరంగా కోహ్లిని బలపశువుని చేయడానికి యత్నిస్తున్నారు. భారత్ క్రికెట్ లో ఇలా జరగడం మొదటిసారేమీ కాదు. గతంలో కూడా చాలాసార్లు కెప్టెన్లు, మాజీ కెప్టెన్లు బలైపోయారు. ఇప్పుడు విరాట్ కోహ్లి లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి ప్రస్తుత క్రికెట్ బోర్డు పెద్దలు సమాధానం చెప్పాల్సి ఉంది' అని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఈ తరహా వివాదాల్ని అంతకుముందు క్రికెట్ బోర్డు చాలా చాక్యంగా పరిష్కరించిందని అనురాగ్ అన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారత జట్టులో ఏమైనా సమస్యలున్నా అవి ఎప్పుడూ బయటకు లీక్ కాలేదన్నారు. -
సుప్రీం కోర్టుకు ఠాకూర్ క్షమాపణ
న్యూఢిల్లీ: అసత్య ప్రమాణం కేసులో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సుప్రీం కోర్టుకు బేషరతు క్షమాపణ చెప్పారు. ఉద్దేశపూర్వకంగా తాను కోర్టుకు ఎలాంటి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయలేదని ఆయన కోర్టుకు తెలిపారు. ‘కోర్టుకు నేను బేషరతుగా క్షమాపణ చెబుతున్నాను. అలాగే మరో అఫిడవిట్లో వాస్తవ పరిస్థితులను వివరించడం జరిగింది. తప్పుడు సమాచారం ఇవ్వడం నా ఉద్దేశం కాదు’ అని జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన బెంచ్‌కు ఠాకూర్ తరఫున సీనియర్ లాయర్ పీఎస్ పట్వాలియా తెలిపారు. ఈకేసు తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 17కు వాయిదా వేసింది. అయితే ఈ విచారణకు అనురాగ్ ఠాకూర్ వ్యక్తిగత హాజరుకు మినహాయింపునిచ్చింది. బోర్డు ప్రక్షాళన కోసం జస్టిస్ ఆర్ఎం లోధా సూచించిన ప్రతిపాదనల అమలులో నిర్లక్ష్యం వహించినందుకు జనవరి 2న బోర్డు అధ్యక్షుడిగా ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను పదవుల నుంచి తొలిగించిన విషయం తెలిసిందే. అలాగే ఈ సంస్కరణల అమలును అడ్డుకునేందుకు జోక్యం చేసుకోవాల్సిందిగా ఐసీసీకి ఠాకూర్ లేఖ రాశారు. అయితే అలాంటిదేమీ జరగలేదని తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ధిక్కారణ కిందికి వస్తుందని, క్షమాపణ చెప్పని పక్షంలో జైలుకెళ్లాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించింది. మరోవైపు రాష్ట్ర క్రికెట్ సంఘాలతో సమావేశం జరిగేందుకు అనుమతివ్వాలని బీసీసీఐ తరఫున హాజరైన న్యాయవాది కపిల్ సిబాల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే లోధా సంస్కరణలు అమలు చేసేదాకా ఇలాంటివి జరిగేందుకు అంగీకరించవద్దని పరిపాలనా కమిటీ (సీఓఏ) తరఫు న్యాయవాది పరాగ్ త్రిపాఠి కోర్టును కోరారు. -
సుప్రీంకోర్టుకు బేషరతుగా క్షమాపణ
అసత్య ప్రమాణం కేసులో భారత క్రికెట్ సంఘం (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోమవారం బేషరతుగా సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పారు. బీసీసీఐ సంస్కరణలకు ఉద్దేశించి జస్టిస్ లోధా కమిటీ సమర్పించిన సిఫారసులు అమలు విషయంలో సుప్రీంకోర్టుకు అబద్ధపు సాక్ష్యాన్ని చెప్పడంతో బీసీసీఐ అధ్యక్షుడు ఠాకూర్, కార్యదర్శి అజయ్ శిర్కేలపై జనవరి 2న అత్యున్నత న్యాయస్థానం వేటువేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్ 17కు వాయిదా వేసింది. అయితే, విచారణకు వ్యక్తిగత హాజరు విషయంలో ఆయనకు మినహాయింపునిచ్చింది. బీసీసీఐ ప్రక్షాళనకు ఉద్దేశించి లోధా కమిటీ ఇచ్చిన సిఫారసుల అమలును అడ్డుకుంటున్నారనే ఆరోపణలపై ఠాకూర్‌పై సుప్రీంకోర్టు కోర్టుధిక్కరణ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఠాకూర్‌ను, శిర్కేను పదవినుంచి తొలగించడమే కాదు.. వారిపై అబద్ధపు సాక్ష్యం, కోర్టు ధిక్కార కేసులు ఎందుకు మోపకూడదు తెలుపాలంటూ షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఈ క్రమంలోనే ఠాకూర్ బేషరతుగా సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పారు. -
ప్రక్షాళన మొదలైంది
బీసీసీఐ ఢిల్లీ, పుణే కార్యాలయాల మూసివేత ఠాకూర్ నియామకాలపై కొరడా టీమిండియా మీడియా మేనేజర్ నిషాంత్ రాజీనామా కార్యరంగంలోకి దిగిన సీఓఏ న్యూఢిల్లీ: బీసీసీఐ వ్యవహారాల పర్యవేక్షణ కోసం సుప్రీం కోర్టు నియమించిన నూతన పరిపాలక కమిటీ (సీఓఏ) కార్యాచరణకు దిగింది. బోర్డు ప్రక్షాళనలో భాగంగా ఢిల్లీ, పుణేలో ఉన్న అధ్యక్ష, కార్యదర్శుల కార్యాలయాలను మూసేయాల్సిందిగా ఆదేశించింది. వీటిని మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, మాజీ కార్యదర్శి అజయ్ షిర్కే ఉపయోగించేవారు. దీంతో అక్కడున్న సిబ్బందిపై కూడా వేటు వేయాలని నిర్ణయించింది. జస్టిస్ ఆర్ఎం లోధా ప్యానెల్ సూచించిన ప్రతిపాదనల అమలులో నిర్లక్ష్యం వహించినందుకు అనురాగ్ ఠాకూర్, షిర్కేలపై సుప్రీం కోర్టు వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా వారు ఉపయోగించుకున్న ఆఫీస్లపై వినోద్ రాయ్ నేతృత్వంలోని కమిటీ దృష్టి సారించింది. గత నెల 30న అత్యున్నత న్యాయస్థానం నియమించిన అనంతరం ఈ కమిటీ తీసుకున్న తొలి నిర్ణయం ఇదే. ‘ఇప్పుడు బీసీసీఐకి అధ్యక్షుడు, కార్యదర్శి లేరు. కాబట్టి వారి కార్యాలయాలతో ఉపయోగమేంటి? అలాంటప్పుడు పనిచేయని కార్యాలయాల్లో సిబ్బంది ఉండి ఏం చేస్తారు? అందుకే వెంటనే వాటిని మూసేసి వెళ్లిపోవాల్సిందిగా తెలిపాం. గత బుధవారం మేం తొలిసారిగా సమావేశమైనప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని కమిటీ సభ్యుల్లో ఒకరైన మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జీ వివరించారు. టీమిండియా మేనేజర్ రాజీనామా... భారత జట్టు మీడియా మేనేజర్ నిషాంత్ అరోరా ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీకి చెందిన బీసీసీఐ ఆఫీస్‌ను మూసేయాల్సిందిగా కమిటీ ఆదేశించడంతో అక్కడి సిబ్బంది అయిన నిషాంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆయన్ని ప్రధాన కార్యాలయం ముంబై నుంచి విధులు నిర్వర్తించే అవకాశం ఇచ్చినా తిరస్కరించారు. తనకు చిన్నపిల్లలున్నారని, ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లి పనిచేయలేనని నిషాంత్ తేల్చి చెప్పారు. 18 నెలల క్రితం బాధ్యతలు స్వీకరించిన ఆయన జట్టు తరఫున ఆస్ట్రేలియా, అమెరికా, వెస్టిండీస్ల్లో పర్యటించారు. మరోవైపు ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌లో వివరాలను నిషాంత్ రహస్యంగా అనురాగ్ ఠాకూర్‌కు చేరవేస్తున్నట్టు కూడా కమిటీ దృష్టికి వచ్చింది. ‘ఢిల్లీలోని అధ్యక్ష కార్యాలయాన్ని మూసేయాలని మాత్రమే మేం చెప్పాం. దీంతో అక్కడి సిబ్బంది కూడా వెళ్లాల్సి ఉంటుంది. అయితే మేం ప్రత్యేకంగా నిషాంత్ పేరును ప్రస్తావించలేదు. ఆయన ఢిల్లీ ఆఫీస్ సిబ్బంది అయితే తప్పుకోవాల్సిందే. కానీ ఒకవేళ మీడియా మేనేజర్ ఒప్పందం స్వతంత్రమైనదైతే బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటారు. నిషాంత్ స్థానంలో మరొకరిని కూడా ఆయనే నియమిస్తారు’ అని డయానా ఎడుల్జీ తెలిపారు. -
నారిమన్ స్థానంలో అనిల్ దివాన్
న్యూఢిల్లీ: బీసీసీఐ పాలనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కొత్త సభ్యులను ఎంపిక చేసే కమిటీ నుంచి ఫాలి నారిమన్ తప్పుకున్నారు. ఆయన స్థానంలో సీనియర్ కౌన్సిల్ అనిల్ దివాన్‌ను సుప్రీం కోర్టు ఎంపిక చేసింది. గతంలో తాను బీసీసీఐకి న్యాయవాదిగా పనిచేశానని, దీంతో ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. జస్టిస్ ఆర్ ఎం లోధా ప్యానెల్ సంస్కరణల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను సుప్రీం కోర్టు తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బోర్డు పరిపాలనను చూసేందుకు జనవరి 19లోగా సమర్థులైన వ్యక్తులను ఎంపిక చేసేందుకు నారిమన్, గోపాల్ సుబ్రమణియన్లను అమికస్ క్యూరీగా సోమవారం నియమించింది. -
వెళ్లగొట్టారు...
బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులపై సుప్రీం కోర్టు వేటు ఠాకూర్, షిర్కేలను తప్పిస్తూ ఉత్తర్వులు లోధా కమిటీ సిఫారసులు అమలు చేయని ఫలితం అనర్హులైన ఇతర ఆఫీస్ బేరర్లూ ఇదే జాబితాలోకి! భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), దేశ అత్యున్నత న్యాయస్థానానికి మధ్య గత కొంత కాలంగా సాగుతున్న ‘సంఘర్షణ’కు ఎట్టకేలకు సంచలన తీర్పుతో తెర పడింది. క్రికెట్ ప్రక్షాళన కోసమంటూ చేసిన సిఫారసులను అమలు చేయమంటూ పదే పదే తాము చెప్పినా పట్టించుకోని బీసీసీఐపై సుప్రీం కోర్టు కన్నెర్ర చేసింది. సమస్యకు కారణంగా మారిన ‘మూల స్థంభాల’ను ఒక్క ఆదేశంతో కుప్పకూల్చింది. బోర్డు అధ్యక్షుడు ఠాకూర్, కార్యదర్శి షిర్కేలను పదవుల నుంచి తప్పించింది. ఒకవైపు లోధా కమిటీ సిఫారసులు అమలు చేయకుండా నాన్చుడు ధోరణి కనబరుస్తూ సర్వం తానేగా వ్యవహరించడంతోపాటు, మరోవైపు తన చర్యలతో సుప్రీం కోర్టుతోనే తలపడేందుకు సిద్ధపడిన బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ చివరకు అవమానకరంగా నిష్క్రమించాల్సి వచ్చింది. ఆయనకు తోడుగా కార్యదర్శి అజయ్ షిర్కే కూడా అదే మార్గంలో బయటకు వెళ్లక తప్పలేదు. అనూహ్య పరిణామాల మధ్య ఇద్దరు ‘పెద్దలు’ తప్పుకున్న నేపథ్యంలో బీసీసీఐలో మున్ముందు వచ్చే మార్పులు ఆసక్తికరం. న్యూఢిల్లీ: లోధా కమిటీ సిఫారసులను అమలు చేయకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్న బీసీసీఐకి భారత అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను పదవుల నుంచి తొలగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. సుదీర్ఘ కాలంగా సాగిన వాదప్రతివాదాలు, వాయిదాల అనంతరం సుప్రీం తన తీర్పును ప్రకటించింది. లోధా కమిటీ ప్రతిపాదించిన అన్ని అంశాలను ఇకపై బీసీసీఐ ఆఫీస్ బేరర్లు, బోర్డు అనుబంధ సంఘాలు పాటించాల్సిందేనని, దానికి విరుద్ధంగా వ్యవహరించే వారు ఎవరైనా సరే పదవులు కోల్పోతారని సుప్రీం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి వారంతా హామీ పత్రం దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. చీఫ్ జస్టిస్ తీరథ్ సింగ్ (టీఎస్) ఠాకూర్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. బీసీసీఐని నడిపించేందుకు కొత్త పరిపాలకులతో కూడిన కమిటీని సుప్రీం ఈ నెల 19న ప్రకటిస్తుంది. ఇందులో సభ్యుల కాగల అర్హత ఉన్నవారి పేర్లను ప్రతిపాదించాలంటూ ప్రభుత్వ న్యాయవాదులు గోపాల్ సుబ్రహ్మణియమ్, ఫాలీ ఎస్ నారిమన్‌లకు కోర్టు సూచించింది. అప్పటి వరకు మాత్రం బోర్డులో సీనియర్ ఉపాధ్యక్షుడు అయిన వ్యక్తి అధ్యక్షుడిగా, సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి కార్యదర్శిగా తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తారు. అయితే సీఈఓ హోదాలో రాహుల్ జోహ్రి ఇప్పటి కే రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. రెండేళ్ల తర్వాత... 2013 ఐపీఎల్ సందర్భంగా బయటపడ్డ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంతో దోషులకు శిక్షలు ఖరారు చేసే విషయంలో జనవరి 2015లో జస్టిస్ రాజేంద్ర మల్ (ఆర్ఎం) లోధా కమిటీ ఏర్పాటైంది. దీంతో పాటు బీసీసీఐ మరింత సమర్థంగా పని చేసేలా మార్పులు సూచించే బాధ్యత కూడా సుప్రీం కోర్టు ఈ కమిటీకే అప్పగించింది. ఏడాది తర్వాత 2016 జనవరిలో బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటూ లోధా కమిటీ పలు ప్రతిపాదనలు చేసింది. చర్చోపచర్చలు, వాదనల తర్వాత గత ఏడాది జులై 18న లోధా సూచించిన వాటిలో ఎక్కువ భాగం ప్రతిపాదలను ఆమోదించిన సుప్రీం కోర్టు వీటిని పాటించాల్సిందంటూ బోర్డును ఆదేశించింది. అయితే ఎన్ని హెచ్చరికలు చేసినా, ఎన్నోసార్లు మళ్లీ మళ్లీ సమయం ఇచ్చినా కూడా బీసీసీఐ దీనిని పట్టించుకోలేదు. పైగా తమ రాష్ట్ర సంఘాలు అభ్యంతరం చెబుతున్నాయంటూ లోధా కమిటీకి తగిన విధంగా సహకరించలేదు. అధ్యక్షుడు ఠాకూర్ అయితే తన మాటలు, చేతల్లో లెక్కలేనితనాన్ని ప్రదర్శించారు. ఇది సుప్రీంకు మరింత ఆగ్రహం తెప్పించింది. చివరకు ఈ పరిణామాలు ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం కఠిన ఆదేశాలు జారీ చేసేందుకు దారి తీశాయి. మరోవైపు అసత్య ప్రమాణం చేసినందుకు, కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు తమపై ఎందుకు చర్య తీసుకోరాదో కూడా వివరణ ఇవ్వాలని కూడా ఠాకూర్, షిర్కేలను సుప్రీం ఆదేశించింది. నాకు ఇబ్బంది లేదు: షిర్కే సుప్రీం ఇచ్చిన తీర్పుతో కార్యదర్శి పదవిని కోల్పోవడాన్ని అజయ్ షిర్కే తేలిగ్గా తీసుకున్నారు. ‘దీనిపై ఏమని స్పందిస్తాం. నన్ను తప్పిస్తున్నట్లు సుప్రీం చెప్పింది కాబట్టి బోర్డులో నా పాత్ర ముగిసింది. ఈ పదవితో నాకేమీ వ్యక్తిగత అనుబంధం లేదు. సభ్యులకు మద్దతుగా నిలబడాలి కాబట్టి సిఫారసులు అంగీకరించలేకపోయాం. అప్పట్లో పదవి ఖాళీగా ఉండి నా అవసరం ఉండటంతో నన్ను తీసుకున్నారు. ఇప్పుడు వెళ్లిపోవడానికి ఎలాంటి బాధా లేదు. నేను చక్కబెట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ పరిణామాల వల్ల మున్ముందు ప్రపంచవ్యాప్తంగా మన దేశం పరువు పోకూడదని కోరుకుంటున్నా’ అని షిర్కే అన్నారు. రిటైర్డ్ జడ్జీలకు బెస్టాఫ్ లక్! వ్యంగ్యంగా స్పందించిన ఠాకూర్ సుప్రీం కోర్టుతో నేరుగా తలపడే సాహసం చేసి తన పదవిని పోగొట్టుకున్న అనురాగ్ ఠాకూర్ మరోసారి తన అసహనాన్ని ప్రదర్శించారు. తీర్పుపై స్పందిస్తూ ఆయన వ్యంగ్య రీతిలో వ్యాఖ్యానాలు చేశారు. ‘ఇది నా వ్యక్తిగత పోరు కాదు. ఒక క్రీడా సంఘం స్వతంత్రతకు సంబంధించిన అంశం. అందరు పౌరుల్లానే నేనూ సుప్రీం కోర్టును గౌరవిస్తాను. ఒకవేళ రిటైర్డ్ జడ్జీలు బీసీసీఐని సమర్థంగా నడిపిస్తారని సుప్రీం కోర్టు భావిస్తే వారికి బెస్టాఫ్ లక్ చెబుతున్నా. వారి నేతృత్వంలో భారత క్రికెట్ ఇంకా బాగుంటుందని నమ్ముతున్నా. సౌకర్యాలు, స్థాయి, క్రికెటర్లపరంగా చూసినా కూడా ప్రపంచంలోనే బీసీసీఐ అత్యుత్తమంగా నిర్వహించబడుతున్న సంస్థ’ అని ఠాకూర్ చెప్పారు. ► ‘నేను ఉత్తర్వుల పట్ల సంతృప్తిగా ఉన్నా. ఇకపై బోర్డు మళ్లీ సరైన దారిలో నడుస్తుందని ఆశిస్తున్నా’ – బిషన్ సింగ్ బేడి ► ‘సుప్రీం ఉత్తర్వులను బోర్డు అమలు చేయని ఫలితాన్ని ఇప్పుడు ఠాకూర్, షిర్కే అనుభవిస్తున్నారు’ – జస్టిస్ ముకుల్ ముద్గల్ ►‘ముంబై క్రికెట్‌కు ఇదో విషాదకరమైన రోజు. ముంబై ఎంతో మంది గొప్ప ఆటగాళ్లను అందించింది. 41 సార్లు రంజీ చాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు ఓటింగ్ హక్కు లేదనడం బాధాకరం’ – శరద్ పవార్ ► ‘సుప్రీంకోర్టు తీర్పు శిరోధార్యం. మేం పాటిం చాల్సిందే’ – నిరంజన్ షా -
సుప్రీం అలా భావిస్తే.. ఆల్ ద బెస్ట్
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాలతో బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసనకు గురైన అనురాగ్ ఠాకూర్ స్పందించారు. రిటైర్డ్ న్యాయమూర్తుల సారథ్యంలో బీసీసీఐ మెరుగ్గా ఉంటుందని సుప్రీం కోర్టు భావిస్తే సంతోషమని, పగ్గాలు చేపట్టబోయే వారికి అభినందనలంటూ ఠాకూర్ వ్యాఖ్యానించారు. లోధా కమిటీ సిఫారుసులను అమలు చేయకపోవడాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు.. బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు అనురాగ్ ఠాకూర్, అజయ్ షిర్కేలను తొలగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశాలను తాను గౌరవిస్తున్నానని ఠాకూర్ అన్నారు. బీసీసీఐ స్వయం ప్రతిపత్తి కోసం తాము పాటుపడ్డాము కానీ వ్యక్తిగత పోరాటం కాదని వ్యాఖ్యానించారు. అత్యుత్తమ క్రీడా సంఘంగా బీసీసీఐ పేరుపొందిందని, బోర్డు సాయంతో రాష్ట్ర క్రీడా సంఘాలు మెరుగైన క్రికెట్ సదుపాయాలు కల్పించిందని చెప్పారు. ప్రపంచ క్రికెట్లో బీసీసీఐకి ప్రత్యేక స్థానముందని అన్నారు. తమ కంటే మాజీ న్యాయమూర్తులు బీసీసీఐని మెరుగ్గా నడిపించగలరని సుప్రీం కోర్టు భావిస్తే తాము స్వాగతిస్తామని చెప్పారు. -
'బీసీసీఐతో నా అనుబంధం ముగిసింది'
న్యూఢిల్లీ:లోధా కమిటీ సిఫారుసులను అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీంకోర్టు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలు తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై అనురాగ్ ఠాకూర్ ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనం పాటిస్తుండగా, షిర్కే మాత్రం తన అసంతృప్తి వ్యక్తం చేశారు. 'బీసీసీఐలో నా పాత్ర ముగిసింది. ఇందులో క్షమాగుణం ఏమీ ఉండదు. బీసీసీఐని వదిలి నన్ను వెళ్లిపోమని సుప్రీం ఆదేశించింది. అక్కడితో బీసీసీఐలో నా పాత్ర ముగిసింది. ఇంకేమీ ఉండదు కూడా' అని షిర్కే తెలిపారు. తనకు ప్రత్యేకమైన కోరికలు కూడా ఏమీ లేవని పేర్కొన్న షిర్కే.. బీసీసీఐలో కొత్తగా బాధ్యతలు స్వీకరించేవారు బాగా పరిపాలిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. బీసీసీఐతో తనకు వ్యక్తిగత సంబంధం ఏమీ లేదన్నారు. ఈ పదవిని వదిలేయడం వల్ల తనకు ఏమీ నష్టం ఉండదన్నారు. తనకు చాలా పనులున్నాయని, వాటిని చూసుకునే సమయం కూడా ఆసన్నమైందన్నారు. గతంలో తాను ఈ పదవిని చేపట్టేబోయే ముందు చాలా అభ్యంతరాలు వచ్చిన విషయాన్ని షిర్కే ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ఇక బీసీసీఐతో తన అనుబంధం ముగిసిపోయిందని యూకేలో ఉన్న షిర్కే ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొన్నారు. ధా కమిటీ సిఫారుసుల అమల్లో వెనకడుగు వేస్తూ వచ్చిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కు సుప్రీంకోర్టు దిమ్మ తిరిగే షాకిచ్చింది. బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను తొలగిస్తూ సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడించింది. ఈ కేసును ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసిన సుప్రీం.. సోమవారం ఎట్టకేలకు తుది తీర్పును ప్రకటించింది. లోధా కమిటీ సిఫారుసులను కచ్చితంగా అమలు చేయాల్సేందేనంటూ సుప్రీంకోర్టు పదే పదే చెప్పినా, వాటిని బోర్డు అధ్యక్షుడిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ మాత్రం సీరియస్‌గా తీసుకోలేదు. ప్రధానంగా కూలింగ్ ఆఫ్ పిరియడ్, ఒక రాష్ట్రానికి ఒకే ఓటు అనే లోధా సిఫారుసును వ్యతిరేకిస్తూ వచ్చారు. లోధా పేర్కొన్న కొన్ని సిఫారుసులను అమలు చేయడం కష్టసాధ్యమంటూ చెబుతూ వచ్చారు. దాంతో సుప్రీంకోర్టు ఎట్టకేలకు బీసీసీఐ కొరడా ఝుళిపించింది. ఈ మేరకు బోర్డులో ప్రధాన పదవుల్లో ఉన్న అనురాగ్, షిర్కేలను తొలగిస్తూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. -
బీసీసీఐ కొత్త బాస్ ఎవరు?
న్యూఢిల్లీ:ఇప్పటివరకూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడిగా ఉన్న అనురాగ్ ఠాకూర్‌పై సుప్రీంకోర్టు వేటు వేసిన నేపథ్యంలో ఇప్పుడు కొత్త బాస్ ఎవరు అనే దానిపై ఆసక్తి నెలకొంది. ప్రధానంగా 70 ఏళ్ల పైబడిన వారు బోర్డులో ఉండకూడదంటూ లోధా సిఫారుసుల నేపథ్యంలో ఆ యువ బాస్ ఎవరూ అనే దానిపై చర్చ సాగుతోంది. ఆ అత్యున్నత పదవిని ఎవరు అధిరోహిస్తారనే అంశంపై క్రికెట్ వర్గాల్లో అప్పుడే చర్చ మొదలైంది. ప్రపంచ క్రికెట్లో బీసీసీఐ చాలా శక్తిమంతమైన బోర్డు కాగా భారత క్రికెట్ కార్యకలాపాలకు సంబంధించి బీసీసీఐ అధ్యక్ష పదవి చాలా కీలకం. ఐసీసీ సంబంధాలతో సహా ఐపీఎల్ నిర్వహణ, జాతీయ సెలెక్షన్ కమిటీ, జట్టు ఎంపిక తదితర వ్యవహారాల్లో బీసీసీఐ చీఫ్ పాత్ర కీలకం. భారత క్రికెట్లో ఐదు జోన్లు ఉన్నాయి. రొటేషన్ పద్దతి ప్రకారం మూడేళ్లకోసారి ఒక్కో జోన్ నుంచి బీసీసీఐ చీఫ్‌ను ఎన్నుకుంటారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈస్ట్‌జోన్ కు చెందిన అనురాగ్ తన పదవిని కోల్పోవాల్సి వస్తుంది. గతంలో ఈస్ట్‌జోన్ నుంచి బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న శశాక్ మనోహర్ రాజీనామా తరువాత అనురాగ్ ఆ పదవిని అలంకరించారు. ఆ జోన్లో ఉన్న ఆరు క్రికెట్ అసోసియేషన్లు అనురాగ్‌కు మద్దతివ్వడంతో అనురాగ్ బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే ఇప్పుడు ఈస్ట్ జోన్ నుంచి సరైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సౌరవ్ గంగూలీగానే కనబబడతోంది. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ.. బీసీసీఐ బాస్ పగ్గాలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సభ్యుల్లో గంగూలీనే ముందు వరసలో ఉన్నాడు. టీఎస్ మాథ్యూ, గౌతమ్ రాయ్‌లు ఉన్నా వారు వెస్ట్ జోన్ కు చెందిన వారు కావడంతో గంగూలీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. బోర్డు అధ్యక్షుడి కొత్త నియమకానికి కొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రస్తుత చర్చపై గంగూలీ ఎలా స్పందిస్తాడో చూడాలి. -
అనురాగ్ అవుట్!
న్యూఢిల్లీ:లోధా కమిటీ సిఫారుసుల అమల్లో వెనకడుగు వేస్తూ వచ్చిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కు సుప్రీంకోర్టు దిమ్మ తిరిగే షాకిచ్చింది. బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను తొలగిస్తూ సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడించింది. ఈ కేసును ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసిన సుప్రీం.. సోమవారం ఎట్టకేలకు తుది తీర్పును ప్రకటించింది. లోధా కమిటీ సిఫారుసుల అమలు చేయకపోవడమే కాకుండా, ఆ సిఫారుసులను అడ్డుకునేందుకు అనురాగ్ ఠాకూర్ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)ని ఆశ్రయించారంటూ అతనిపై పిటిషన్ దాఖలైంది. బీసీసీఐలో ‘కాగ్’ అధికారి నియామకం ప్రభుత్వ జోక్యం కిందికి వస్తుందని తెలుపుతూ లేఖ రాయాలని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్సన్ను ఠాకూర్ కోరినట్లు కోర్టు దృష్టికి వచ్చింది. అయితే అనురాగ్ దాఖలు చేసిన అఫిడవిట్లో మాత్రం ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. దాంతో డిసెంబర్ 16వ తేదీన విచారణలో అనురాగ్ పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిలో భాగంగా టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం కేసును ఈరోజు విచారించిన తరువాత బోర్డు అధ్యక్షుడు అనురాగ్, కార్యదర్శి షిర్కేలపై వేటు వేసింది. లోధా కమిటీ సిఫారుసులు అమలు చేయనందుకు ఆ ఇద్దర్ని బోర్డు నుంచి తొలగిస్తున్నట్లు తీర్పులో పేర్కొంది. లోధా కమిటీ సిఫారుసులను కచ్చితంగా అమలు చేయాల్సేందేనంటూ సుప్రీంకోర్టు పదే పదే చెప్పినా, వాటిని బోర్డు అధ్యక్షుడిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ మాత్రం సీరియస్‌గా తీసుకోలేదు. ప్రధానంగా కూలింగ్ ఆఫ్ పిరియడ్, ఒక రాష్ట్రానికి ఒకే ఓటు అనే లోధా సిఫారుసును వ్యతిరేకిస్తూ వచ్చారు. లోధా పేర్కొన్న కొన్ని సిఫారుసులను అమలు చేయడం కష్టసాధ్యమంటూ చెబుతూ వచ్చారు. దాంతో సుప్రీంకోర్టు ఎట్టకేలకు బీసీసీఐ కొరడా ఝుళిపించింది. ఈ మేరకు బోర్డులో ప్రధాన పదవుల్లో ఉన్న అనురాగ్, షిర్కేలను తొలగిస్తూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే వీరిస్థానంలో కొత్త వారిని సుప్రీంకోర్టు ఎంపిక చేసే అవకాశాలు కనబడుతున్నాయి. -
ఆగ్రహమా?... ‘అనురాగ’మా!
నేడు తేలనున్న అనురాగ్ ఠాకూర్, బీసీసీఐ భవిష్యత్ లోధా ప్యానెల్ సంస్కరణల అమలుపై తుది తీర్పు న్యూఢిల్లీ: ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), లోధా ప్యానెల్ మధ్య జరుగుతున్న కేసు విచారణలో నేడు (సోమవారం) సుప్రీం కోర్టు తుది తీర్పునివ్వనుంది. అలాగే కోర్టులో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బోర్డు చీఫ్ అనురాగ్ ఠాకూర్ విషయంలోనూ కోర్టు ఏం చెబుతుందనేది వేచిచూడాల్సిందే. బీసీసీఐలో ‘కాగ్’ నియామకంపై అయిష్టంగా ఉన్న ఠాకూర్.. దీన్ని ప్రభుత్వ జోక్యంగా భావిస్తూ లేఖ రాయాలని ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్‌కు గతంలో లేఖ రాశారు. అయితే కోర్టుకు సమర్పించిన తన అఫిడవిట్లో ఠాకూర్ ఈ విషయాన్ని పేర్కొనలేదు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు అసత్య ప్రమాణం చేసినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకుంటే కేసు విచారణకు ఆదేశిస్తే జైలుకెళ్లాల్సి ఉంటుందని ఘాటుగా బదులిచ్చింది. అంతేకాకుండా వారం రోజుల్లో మరో అఫిడవిట్‌ను దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. అలాగే ప్రస్తుతమున్న పాలక వర్గం లోధా ప్యానెల్ ప్రతిపాదనలను అమలు చేయడం లేదు కాబట్టి వీరి స్థానంలో సమర్థులైన ముగ్గురి పేర్లను సూచించాల్సిందిగా బీసీసీఐని కోరింది. మరోవైపు లోధా ప్యానెల్ సూచించిన ప్రతిపాదనలను అమలు చేయడం సాధ్యం కాదని, ఈ విషయంలో రాష్ట్ర క్రికెట్ సంఘాలను ఒత్తిడి చేయలేమని బీసీసీఐ తమ అఫిడవిట్లో కోర్టుకు తెలిపింది. అయితే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ మంగళవారమే పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తుది తీర్పు ఇస్తారా? మరోసారి వాయిదాకు మొగ్గు చూపుతారా? అనేది తేలాల్సి ఉంది. -
అనురాగ్ ఠాకూర్ భవితవ్యం తేలేది రేపే?
న్యూఢిల్లీ: లోధా కమిటీ సిఫారుసుల అమలులో భాగంగా భారత క్రికెట్ కంట్రలో బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఈ కేసును ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసిన సుప్రీం.. రేపు తీర్పును వెల్లడించే అవకాశాలు కనబడుతున్నాయి. లోధా కమిటీ సిఫారుసులను అడ్డుకునేందుకు అనురాగ్ ఠాకూర్ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)ని ఆశ్రయించారంటూ అతనిపై పిటిషన్ దాఖలైంది. బీసీసీఐలో ‘కాగ్’ అధికారి నియామకం ప్రభుత్వ జోక్యం కిందికి వస్తుందని తెలుపుతూ లేఖ రాయాలని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్సన్ను ఠాకూర్ కోరినట్లు కోర్టు దృష్టికి వచ్చింది. అయితే అనురాగ్ దాఖలు చేసిన అఫిడవిట్లో మాత్రం ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. దాంతో డిసెంబర్ 15వ తేదీన విచారణలో అనురాగ్ పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవేళ అనురాగ్ చెప్పేది అసత్య ప్రమాణం అని తేలితే జైలు కెళ్లాల్సి వస్తుందంటూ సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. కోర్టును మభ్యపెట్టేలా పదేపదే ప్రవర్తిస్తున్నందుకు విచారణకు ఆదేశిస్తే జైలుకెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. 'ప్రతీ దశలోనూ విచారణకు ఆటంకాలు సృష్టిస్తున్నావు. 70 ఏళ్ల తర్వాత కూడా అందరూ పదవులను అనుభవిద్దామని అనుకుంటున్నారు. ఇది చాలా లాభదాయకమైన వ్యాపారం అయిపోయింది. అందుకే అంతా ఇంతలా ఎగబడుతున్నారు'అని సుప్రీం కోర్టు ఆనాటి విచారణలో మండిపడింది. ఈ కేసును సుప్రీంకోర్టు రేపు విచారించే అవకాశం ఉంది. ఒకవేళ రేపు కేసును పూర్తిస్థాయిలో విచారించిన పక్షంలో ఎల్లుండి తీర్పును వెలువరించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ కేసులో తీర్పు బీసీసీఐకి వ్యతిరేకంగా వస్తే మాత్రం ప్రస్తుత బోర్డు పరిస్థితి, అందులోని సభ్యుల పరిస్థితి డైలమాలో పడటం ఖాయంగా కనబడుతోంది. -
నంబర్ వన్ జట్టుకు కెప్టెన్ అయినప్పటికీ..
న్యూఢిల్లీ :గత రెండు రోజుల క్రితం అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రకటించిన టెస్టు జట్టులో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి స్థానం దక్కకపోవడంపై బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ జాబితాను ప్రకటించే ముందు మారిన పరిస్థితులను ఒకసారి ఐసీసీ పరీశీలిస్తే బాగుండేదని అనురాగ్ సూచించారు. ఇటీవల కాలంలో భారత్ ఘన విజయాలను సాధించడమే కాదు.. టెస్టుల్లో నంబర్ వన్‌గా ఉందనే విషయం గుర్తు చేశారు. ఒక నంబర్ వన్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న వ్యక్తికి టెస్టు జట్టులో స్థానం దక్కకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ' ఈ జాబితాను ప్రకటించే ముందు మారిన పరిస్థితులను ఐసీసీ ఒకసారి పరిగణలోకి తీసుకుంటే బాగుండేదనేది నా భావన. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ ఆటగాళ్లు ప్రదర్శన కాకుండా, గత జనవరి నుంచి వచ్చే జనవరి వరకూ ఆటగాళ్ల ప్రతిభను పరిగణలోకి తీసుకుంటే బాగుండేది. దాంతో పాటు ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్‌ను కూడా సమీక్షించాలి. టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్ గా ఉండి, ఆ జట్టుకు కెప్టెన్ గా ఉన్న కోహ్లికి ఐసీసీ ప్రకటించిన టెస్టు జట్టులో చోటు లభించకపోవడం బాధాకరం. కాకపోతే ఐసీసీ వన్డే కెప్టెన్ గా కోహ్లిని ఎంపిక చేయడం మాత్రం నిజంగా శుభవార్తే. రాబోవు సీజన్లో ఐసీసీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాత జట్టులను ప్రకటిస్తుందని అనుకుంటున్నా'అని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్ 14 నుంచి మొదలుకొని 2016 సెప్టెంబర్ 20 వరకూ మాత్రమే ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణలోకి తీసుకున్నారు. ఈ సమయంలో ఎనిమిది టెస్టు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 45.10 సగటుతో 451 పరుగులు చేశాడు. ఈ 12 నెలల సమయంలో కోహ్లి కేవలం ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ మాత్రమే సాధించాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో కోహ్లి సెంచరీ, హాఫ్ సెంచరీలు మాత్రమే చేసి పెద్దగా ఆకట్టుకోలేదు. అదే సమయంలో రూట్ 14 టెస్టు మ్యాచ్‌లు ఆడి 55.30 సగటుతో 1272 పరుగులు నమోదు చేశాడు. ఇందులో 9 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలు ఉన్నాయి. దాంతో మాంచెస్టర్‌లో పాకిస్తాన్ తో జరిగిన టెస్టులో 254 పరుగులు చేసి ఆ ఏడాదిని(ఐసీసీ పరిగణలోకి తీసుకున్న సమయం ప్రకారం) ఘనంగా ముగించాడు. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ తరువాత విరాట్ కోహ్లి ఖాతాలో రెండు డబుల్ సెంచరీలు చేరాయి. న్యూజిలాండ్ తో తొలి టెస్టులో డబుల్ సెంచరీ చేసిన విరాట్.. ఇటీవల ఇంగ్లండ్ తో ముగిసిన ఐదు టెస్టుల సిరీస్‌లో కూడా ద్విశతకం సాధించాడు. ఈ క్రమంలోనే ఆ రెండు టెస్టు సిరీస్‌ల్లో 80.33 సగటుతో 964 పరుగులు చేశాడు. విరాట్ ఆడిన వరుసగా ఆడిన ఆరుటెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించడం ఇక్కడ విశేషం. ప్రస్తుతం ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్ లో కోహ్లి రెండో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్, ఇంగ్లండ్ సిరీస్‌ల అనంతరం కోహ్లి ఏకంగా 12 స్థానాలకు పైగా మెరుగుపరుచుకుని రెండో స్థానానికి చేరాడు. -
మార్పులు అనివార్యం!
సుప్రీం తుది తీర్పు కోసం వేచి చూస్తున్నాం ప్రపంచ క్రికెట్ అభివృద్ధిలో బీసీసీఐది ప్రధాన పాత్ర ఐసీసీ టెస్టు జట్టులో కోహ్లిని ఎలా విస్మరిస్తారు? బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులు ఆటగాళ్లకు ఏమాత్రం మంచిది కాదని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అన్నారు. వచ్చే నెల 2 లేదా 3 తర్వాత బోర్డులో చాలా మార్పులు జరగవచ్చని ఆయన సూత్రపాయంగా వెల్లడించారు. లోధా ప్యానెల్ సూచించిన ప్రతిపాదనల అమలు విషయంలో సుప్రీం కోర్టు జనవరి మొదటి వారంలో తుది తీర్పునివ్వనుంది. కోర్టు తీర్పు ఇచ్చే వరకు వేచి చూడాల్సిందేనని, ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఎలాంటి వ్యాఖ్యలు చేయనని అన్నారు. ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్) ప్రమోషనల్ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మీడియాతో పలు అంశాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... ⇒ ప్రస్తుతం భారత క్రికెట్లో నెలకొన్న పరిస్థితి ఆటకే కాకుండా ఆటగాళ్లకు కూడా ఏమంత మంచిది కాదని మాకు తెలుసు. మేం ఇప్పుడు సమస్యల్లో ఉన్నాం. జనవరి 3 వరకు వేచి చూడాల్సిందే. ఆ తర్వాత చాలా మార్పులు ఉండే అవకాశం ఉంది. ఒక్కోసారి ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. వాటిని దీటుగా ఎదుర్కోవాల్సిందే. అయితే అన్నింటికీ సానుకూల పరిష్కారం లభిస్తుందనుకుంటున్నాను. ⇒ ప్రభుత్వం నుంచి నయా పైసా కూడా స్వీకరించకుండా బీసీసీఐ సొంతంగా సౌకర్యాలను సమకూర్చుకుంది. అయినా కొంత మంది మాజీ ఆటగాళ్లు మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మా దగ్గర భారీగా నిధులున్నా కూడా వాటిని ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొంది. ఇందుకు కోర్టు అనుమతి కావాలి. ⇒ బోర్డు సభ్యులకు గరిష్ట వయస్సు, ఒక రాష్ట్రం ఒక ఓటు, పదవులను అధిష్టించేందుకు కూలింగ్ పీరియడ్ వంటి లోధా ప్యానెల్ ప్రతిపాదనలను అమలు చేయడం అంత సులువుకాదు. ⇒ భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి ఈ ఏడాది ఐసీసీ తమ ఉత్తమ టెస్టు జట్టులో చోటివ్వాల్సింది. ప్రస్తుతం అతడి ఫామ్‌ను లెక్కలోకి తీసుకుంటే కచ్చితంగా అతను ఆ జట్టులో ఉండాలి. భారత జట్టు టెస్టుల్లో నంబర్‌వన్‌గా ఉన్నప్పుడు ఆ కెప్టెన్‌ను ఎందుకు ఎంపికచేయరు? ఐసీసీ ఓసారి ఈ విషయంలో దృష్టి సారిం చాలి. అయితే అశ్విన్ ప్రతిభను గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది ⇒ ఐసీసీ వర్కింగ్ గ్రూపులో బీసీసీఐని చేర్చకపోవడాన్ని తప్పుబడుతున్నాను. ఆ సమావేశంలో నేనూ పాల్గొన్నాను. బీసీసీఐ ఉంటేనే విశ్వవ్యాప్తంగా క్రికెట్‌ను పటిష్ట పరిచే అవకాశముంటుందని ఆ సమావేశంలో ప్రతి ఒక్కరు కోరుకున్నారు. ఒకవేళ ఎవరైనా బీసీసీఐ లేకున్నా తాము ముందుకెళతామని భావిస్తే... ప్రపంచ క్రికెట్‌కు భారత్ అవసరమన్న సంగతి గుర్తుంచుకోవాలి. -
అసత్య ప్రమాణం చేయలేదు: అనురాగ్
జైపూర్: భారత న్యాయవ్యవస్థపై తనకు గౌరవం ఉందని... తాను ఎలాంటి అసత్య ప్రమాణం చేయలేదని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ వివరణ ఇచ్చారు. కాబట్టి జైలుకు వెళ్లాలనే ప్రశ్న తలెత్తదని స్పష్టం చేశారు. లోధా కమిటీ సిఫారసులను చర్చించి అమలు చేసే దిశగా ఆ కమిటీ తమకు సమయమే ఇవ్వడం లేదని ఆయన తెలిపారు. ‘ఇప్పుడీ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఇప్పటికే కమిటీ సిఫారసులపై పలుమార్లు సమావేశమై చర్చించాం. వీటిలో 85 శాతం అమలు చేస్తున్నాం. మిగిలిన మూడు, నాలుగు ప్రతిపాదలపైనే తేల్చాల్సి ఉంది. ఇవి ఆచరణలో సాధ్యం కావు. అయినా వీటిపై కూడా కూలంకశంగా చర్చించి నిర్ణయం తీసుకుందామనుకున్నా... ఆ దిశగా లోధా కమిటీ మాకు సమయమే ఇవ్వట్లేదు’ అని ఠాకూర్ చెప్పారు.