సాక్షి, న్యూఢిల్లీ: భారత మహిళా షూటింగ్ రైజింగ్ స్టార్, తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ 2023 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారం ‘అర్జున అవార్డు’ను బుధవారం అందుకుంది. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ అవార్డును ఇషా సింగ్‌కు బహూకరించారు.
ఈనెల 9న రాష్ట్రపతి భవన్‌లో జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. అయితే అదే సమయంలో ఇషా జకార్తాలో ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడుతుండటంతో ఆమె హాజరుకాలేకపోయింది. ఇషాకు ‘అర్జున’ అందించిన అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ పారిస్ ఒలింపిక్స్ నుంచి ఇషా పతకంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment