భారత స్టార్ షూటర్ మనూ భాకర్.. మూడో ఒలింపిక్ పతకానికి చేరువైంది. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఫైనల్‌కు చేరుకుంది. అయితే, భారత్‌కే చెందిన మరో షూటర్ ఇషా సింగ్ మాత్రం ఈ ఈవెంట్లో నిరాశపరిచింది.
కాగా తొలుత.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలిచిన మనూ భాకర్ ప్యారిస్‌లో భారత్ పతకాల తెరిచింది. అనంతరం సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లోనూ కాంస్య పతకం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
తద్వారా ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన భారత ప్లేయర్‌గా 22 ఏళ్ల మనూ చరిత్ర సృష్టించింది. తాజాగా గురువారం నాటి 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో 600కు గాను మనూ 590 పాయింట్లు సాధించింది.
తద్వారా క్వాలిఫయర్స్ రౌండ్‌లో రెండో స్థానంలో నిలిచి మెడల్ రౌండ్‌కు అర్హత సాధించింది. ఇక తెలంగాణ షూటర్ ఇషా సింగ్.. 581 పాయింట్లకే పరిమితమై 18వ స్థానంతో సరిపెట్టుకుని.. ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది.
చదవండి: అందమైన ప్రయాణం.. జీర్ణించుకోలేని ఓటమి.. ఇకపై: పీవీ సింధు పోస్ట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment