Isha singh
-
Olympics: మూడో పతకానికి చేరువైన మనూ భాకర్
భారత స్టార్ షూటర్ మనూ భాకర్.. మూడో ఒలింపిక్ పతకానికి చేరువైంది. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఫైనల్‌కు చేరుకుంది. అయితే, భారత్‌కే చెందిన మరో షూటర్ ఇషా సింగ్ మాత్రం ఈ ఈవెంట్లో నిరాశపరిచింది.కాగా తొలుత.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలిచిన మనూ భాకర్ ప్యారిస్‌లో భారత్ పతకాల తెరిచింది. అనంతరం సరబ్జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లోనూ కాంస్య పతకం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తద్వారా ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన భారత ప్లేయర్‌గా 22 ఏళ్ల మనూ చరిత్ర సృష్టించింది. తాజాగా గురువారం నాటి 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో 600కు గాను మనూ 590 పాయింట్లు సాధించింది. తద్వారా క్వాలిఫయర్స్ రౌండ్లో రెండో స్థానంలో నిలిచి మెడల్ రౌండ్‌కు అర్హత సాధించింది. ఇక తెలంగాణ షూటర్ ఇషా సింగ్.. 581 పాయింట్లకే పరిమితమై 18వ స్థానంతో సరిపెట్టుకుని.. ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది.చదవండి: అందమైన ప్రయాణం.. జీర్ణించుకోలేని ఓటమి.. ఇకపై: పీవీ సింధు పోస్ట్ వైరల్ -
పారిస్‌కు మన లేడీస్..
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్ వేదికపై మరోసారి హైదరాబాదీ అమ్మాయిలు దేశఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయనున్నారు. పారిస్‌లో జరగనున్న 2024 ఒలింపిక్ పోటీలు శుక్రవారం నుంచే ప్రారంభం కానున్నాయి. ఈసారి ఒలింపిక్స్‌లో మొత్తంగా 117 మంది భారతీయ అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఈ భారత క్రీడాకారుల బృందంలో 47 మంది మహిళా అథ్లెట్లు ఉండగా.. అందులో నలుగురు హైదరాబాదీలే ఉండటం గమనార్హం.ముఖ్యంగా ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు టేబుల్ టెన్నిస్‌లో పతకం సాధించలేదు. అయితే ఈసారి హైదరాబాద్ నుంచి ఒలింపిక్స్ వెళ్లిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిని శ్రీజ ఆకులపై అంచనాలు పెరిగాయి. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో శ్రీజ ఆకుల, శరత్ కమల్‌తో కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. భారత బ్యాడ్మింటన్ దిగ్గజం 2016, 2020 ఒలింపిక్స్‌లో దేశానికి పతకాలను సాధించిపెట్టి భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన పీవీ సింధు కచి్చతంగా పతకంతోనే తిరిగొస్తుందని దేశమంతా దీమాగా ఉంది.రెండుసార్లు వరల్డ్ చాంపియన్‌షిప్ నెగ్గిన మరో అథ్లెట్ నిఖత్ జరీన్ భారతీయ బృందంలో స్టార్ ప్లేయర్‌గా పారిస్ వెళ్లింది. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా ఆమె బంగారు పతకాన్ని సాధించింది. ఇదే ఏడాది ఏషియన్ గేమ్స్‌లోనూ కాంస్యం సాధించింది. 13 ఏళ్ల వయస్సులో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ కేటగిరిలో నేషనల్ చాంపియన్‌గా నిలిచిన హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్‌పై కూడా భారత్ ఎన్నో ఆశలు పెట్టుకుంది.ఏషియన్‌గేమ్స్‌లో రజత పతకంతో రాణించిన ఇషా ఒలింపిక్స్‌లో దేశానికి పతకాన్ని ఖాయం చేస్తుందని క్రీడా ప్రముఖులు అభిలాíÙస్తున్నారు. ఈసారి పారిస్ ఒలింపిక్స్‌లో మాజీ ఒలింపిక్స్ పతక విజేత, హైదరాబాదీ పీవీ సింధూనే ఫ్లాగ్ బేరర్స్‌గా ఇండియన్ ఒలింపిక్ కమిటీ ప్రకటించడం విశేషం. పారిస్ ఒలింపిక్స్ నేపథ్యంలో మన క్రీడాకారులకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, ప్రముఖులు, సెలబ్రిటీల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
‘అర్జున’ అందుకున్న ఇషా
సాక్షి, న్యూఢిల్లీ: భారత మహిళా షూటింగ్ రైజింగ్ స్టార్, తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ 2023 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారం ‘అర్జున అవార్డు’ను బుధవారం అందుకుంది. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ అవార్డును ఇషా సింగ్‌కు బహూకరించారు. ఈనెల 9న రాష్ట్రపతి భవన్లో జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. అయితే అదే సమయంలో ఇషా జకార్తాలో ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడుతుండటంతో ఆమె హాజరుకాలేకపోయింది. ఇషాకు ‘అర్జున’ అందించిన అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ పారిస్ ఒలింపిక్స్ నుంచి ఇషా పతకంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. -
‘అర్జున’తో అందలం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం ‘అర్జున’ అవార్డు ప్రదాన కార్యక్రమం మంగళవారం రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. వేర్వేరు క్రీడాంశాల్లో సత్తా చాటి ఈ పురస్కారానికి ఎంపికైన భారత ఆటగాళ్లు దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దీనిని సగర్వంగా అందుకున్నారు. భారత క్రికెట్ జట్టు స్టార్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీతో పాటు తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ అర్జున అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు. జకార్తాలో ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడుతున్న కారణంగా తెలంగాణ షూటర్ ఇషా సింగ్ ఈ అవార్డును అందుకోలేకపోయింది. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ‘ఖేల్‌రత్న’ అవార్డుకు ఎంపికైన టాప్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్), చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర) కూడా ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. వీరిద్దరు ప్రస్తుతం కౌలాలంపూర్‌లో జరుగుతున్న మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పాల్గొంటున్నారు. భారత మహిళా చెస్ గ్రాండ్‌మాస్టర్, తమిళనాడు అమ్మాయి ఆర్. వైశాలి, రెజ్లర్ అంతిమ్ పంఘాల్, అథ్లెట్ పారుల్ చౌదరి, భారత కబడ్డీ జట్టు కెపె్టన్, తెలుగు టైటాన్స్ జట్టు స్టార్ ప్లేయర్ పవన్ కుమార్ సెహ్రావత్ కూడా అర్జున పురస్కారాన్ని అందుకున్నారు. పారా ఆర్చర్ శీతల్ దేవి అవార్డు అందుకుంటున్నప్పుడు ప్రేక్షకులు పెద్ద ఎత్తున చప్పట్లతో అభినందించగా... వీల్‌చైర్‌లో కూర్చుకున్న పార్ కనోయిస్ట్ ప్రాచీ యాదవ్ వద్దకు వెళ్లి స్వయంగా రాష్ట్రపతి అవార్డు అందించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంధ క్రికెటర్ అజయ్ కుమార్ రెడ్డి కూడా అర్జున అవార్డును అందుకోగా... ఆంధ్రప్రదేశ్‌కే చెందిన స్విమ్మర్ మోతుకూరి తులసీ చైతన్య టెన్జింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారాన్ని స్వీకరించాడు. విజయవాడ సిటీ స్పెషల్ బ్రాంచ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న 34 ఏళ్ల తులసీ చైతన్య కాటలీనా చానెల్, జిబ్రాల్టర్ జలసంధి, పాక్ జలసంధి, ఇంగ్లిష్ చానెల్, నార్త్ చానెల్లను విజయవంతంగా ఈది తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. 2023 సంవత్సరానికి ఇద్దరికి ‘ఖేల్ రత్న’... 26 మందికి ‘అర్జున’... ఐదుగురికి ‘ద్రోణాచార్య’ రెగ్యులర్ అవార్డు... ముగ్గురికి ‘ద్రోణాచార్య’ లైఫ్‌టైమ్... ముగ్గురికి ‘ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్’ అవార్డులు ప్రకటించారు. ప్రతి ఏటా జాతీయ క్రీడా దినోత్సవం (ఆగస్టు 29న) ఈ అవార్డులను అందజేస్తారు. అయితే ఆ సమయంలో హాంగ్జౌ ఆసియా క్రీడలు జరుగుతుండటంతో అవార్డుల ఎంపికతోపాటు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేశారు. -
ఇషా డబుల్ ధమాకా
జకార్తా: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నమెంట్లో తొలి రోజు భారత షూటర్లు అదరగొట్టారు. నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో కలిపి మొత్తం ఆరు పతకాలు గెల్చుకున్నారు. అంతేకాకుండా రెండు పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌లు కూడా ఖరారయ్యాయి. తెలంగాణ యువ షూటర్ ఇషా సింగ్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో బంగారు పతకాలు సొంతం చేసుకుంది. ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఇషా సింగ్ భారత్‌కు ఒలింపిక్ బెర్త్ అందించింది. ఎనిమిది మంది షూటర్లు ఎలిమినేషన్ పద్ధతిలో పోటీపడ్డ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ఇషా సింగ్ 243.1 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. తలత్ కిష్మలా (పాకిస్తాన్; 236.3 పాయింట్లు) రజతం, భారత్‌కే చెందిన రిథమ్ సాంగ్వాన్ (214.5 పాయింట్లు) కాంస్యం కైవసం చేసుకున్నారు. భారత్‌కే చెందిన మరోషూటర్ సురభి రావు 154 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. అంతకుముందు క్వాలిఫయింగ్‌లో రిథమ్, సురభి రావు 579 పాయింట్లతో వరుసగా మూడు, ఐదు స్థానాల్లో నిలువగా... ఇషా సింగ్ 578 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్‌లో రిథమ్, సురభి, ఇషా సింగ్ సాధించిన స్కోరు ఆధారంగా భారత జట్టుకు టీమ్ విభాగంలో బంగారు పతకం లభించింది. భారత బృందం మొత్తం 1736 పాయింట్లు స్కోరు చేసింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ వరుణ్ తోమర్ స్వర్ణ పతకం నెగ్గడంతోపాటు భారత్‌కు పారిస్ ఒలింపిక్ బెర్త్‌ను ఖరారు చేశాడు. ఇదే ఈవెంట్లో మరో భారత షూటర్ అర్జున్ సింగ్ చీమా రజత పతకం నెగ్గాడు. ఎనిమిది మంది షూటర్లు పాల్గొన్న ఫైనల్లో వరుణ్ 239.6 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలువగా... అర్జున్ 237.3 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. వరుణ్, అర్జున్ సింగ్, ఉజ్వల్ మలిక్‌లతో కూడిన భారత బృందం 1740 పాయింట్లతో టీమ్ విభాగంలో పసిడి పతకాన్ని గెల్చుకుంది. ఇప్పటి వరకు భారత్ నుంచి 15 మంది షూటర్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత్ నుంచి 15 మంది షూటర్లు బరిలోకి దిగారు. -
బుల్లెట్ దిగింది...
చైనా గడ్డపై భారత తుపాకీ గర్జించింది. ఒకే రోజు మన షూటర్లు ఏకంగా ఏడు పతకాలతో అదరహో అనిపించారు. స్టెతస్కోప్‌ను వదిలేసి రైఫిల్ ఎత్తిన సిఫ్ట్ కౌర్ సామ్రా కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి పసిడి పతకం సొంతం చేసుకుంది. తెలంగాణ టీనేజ్ షూటర్ ఇషా సింగ్ డబుల్ ధమాకా సృష్టించింది. పిస్టల్ ఈవెంట్లో ఇషా సభ్యురాలిగా ఉన్న భారత జట్టు స్వర్ణ పతకంతో మెరిపించగా... వ్యక్తిగత విభాగంలో ఇషా రజత పతకంతో మురిపించింది. స్కీట్ ఈవెంట్లో అనంత్ జీత్ సింగ్ రెండు పతకాలతో భారత బృందంలో ఆనందాన్ని రెట్టింపు చేశాడు. సెయిలింగ్‌లో విష్ణు శరవణన్ కాంస్య పతకం గెలిచాడు. మహిళల వుషు సాండా ఈవెంట్లో రోషిబినా దేవి ఫైనల్ చేరి... పురుషుల టెన్నిస్ డబుల్స్‌లో సాకేత్ మైనేని–రామ్‌కుమార్ జోడీ సెమీఫైనల్ చేరి పతకాలను ఖాయం చేసుకున్నారు. వెరసి ఆసియా క్రీడల్లో నాలుగో రోజు భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి ఎనిమిది పతకాలు చేరాయి. ఓవరాల్‌గా 22 పతకాలతో భారత్ ఏడో స్థానంలో ఉంది. హాంగ్జౌ: గురి తప్పని లక్ష్యంతో భారత షూటర్లు ఆసియా క్రీడల్లో పతకాల మోత మోగించారు. బుధవారం ఏకంగా ఏడు పతకాలతో తమ సత్తా చాటుకున్నారు. ఈ ఏడు పతకాల్లో రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్య పతకాలు ఉండటం విశేషం. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో సిఫ్ట్ కౌర్ సామ్రా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సిఫ్ట్ కౌర్ 469.6 పాయింట్లు స్కోరు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 467 పాయింట్లతో బ్రిటన్ షూటర్ సియోనైడ్ మెకింటోష్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డును 22 ఏళ్ల సిఫ్ట్ కౌర్ బద్దలు కొట్టింది. ఇదే ఈవెంట్లో భారత్‌కే చెందిన ఆశి చౌక్సీ 451.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించకుంది. ప్రపంచ చాంపియన్ కియోంగ్‌యు జాంగ్ (చైనా; 462.3 పాయింట్లు) రజతం కైవసం చేసుకుంది. అంతకుముందు క్వాలిఫయింగ్‌లో సిఫ్ట్ కౌర్, ఆశి చౌక్సీ, మానిని కౌశిక్‌లతో కూడిన భారత జట్టు 1764 పాయింట్లు సాధించి రజత పతకాన్ని సాధించింది. పంజాబ్‌లోని ఫరీద్కోట్ ప్రాంతానికి చెందిన సిఫ్ట్ కౌర్ ఒకవైపు వైద్య విద్యను అభ్యసిస్తూ రైఫిల్ షూటింగ్లో కొనసాగింది. అయితే షూటింగ్లో అంతర్జాతీయ స్థాయిలో సిఫ్ట్ కౌర్‌కు మంచి ఫలితాలు వస్తుండటంతో ఏడాది తర్వాత ఆమె వైద్య విద్యకు బ్రేక్ ఇచ్చి పూర్తిస్థాయిలో ఈ క్రీడపై దృష్టి సారించింది. ఆమె సరైన నిర్ణయమే తీసుకుందని తాజా ఫలితం నిరూపించింది. అంతకుముందు మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లోనూ భారత షూటర్లు ఇషా సింగ్, రిథమ్ సాంగ్వాన్, మనూ భాకర్ త్రయం మెరిసింది. క్వాలిఫయింగ్‌లో ఇషా, రిథమ్, మనూ 1759 పాయింట్లు స్కోరు చేసి టీమ్ విభాగంలో పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఇషా, మనూ భాకర్ వ్యక్తిగత విభాగం ఫైనల్‌కూ అర్హత సాధించారు. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ 34 పాయింట్లు సాధించి రజత పతకాన్ని గెలిచింది. మనూ భాకర్ 21 పాయింట్లతో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. పురుషుల స్కీట్ ఈవెంట్లో భారత్‌కు టీమ్ విభాగంలో కాంస్యం, వ్యక్తిగత విభాగంలో రజతం లభించాయి. అనంత్ జీత్ సింగ్, గురుజోత్ సింగ్, అంగద్ వీర్‌సింగ్ బాజ్వాలతో కూడిన భారత జట్టు క్వాలిఫయింగ్‌లో 355 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఆరుగురు పోటీపడ్డ వ్యక్తిగత విభాగం ఫైనల్లో అనంత్ జీత్ 58 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని హస్తగతం చేసుకున్నాడు. -
ఇషా–శివ జోడీకి స్వర్ణం
బకూ (అజర్బైజాన్): ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది. శుక్రవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఇషా సింగ్ –శివా నర్వాల్ జోడీ పసిడి పతకం సొంతం చేసుకుంది. తెలంగాణకు చెందిన ఇషా సింగ్... హరి యాణాకు చెందిన శివా నర్వాల్ ఫైనల్లో 16–10తో తర్హాన్ ఇలేదా–యూసుఫ్ డికెచ్ (తుర్కియే) ద్వయంపై విజయం సాధించారు. ఫైనల్‌ను మొత్తం 13 రౌండ్లపాటు నిర్వహించారు. ఒక్కో రౌండ్లో ఇరు జట్ల షూటర్లు రెండేసి షాట్లు లక్ష్యం దిశగా సంధిస్తారు. అత్యధిక పాయింట్లు సాధించిన జోడీకి రెండు పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. భారత జోడీ ఎనిమిది రౌండ్లలో నెగ్గగా, తుర్కియే జంట ఐదు రౌండ్లలో గెలిచింది. అంతకుముందు 65 జోడీలు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో ఇషా సింగ్–శివా నర్వాల్ ద్వయం 583 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్‌లో... తర్హాన్–యూసుఫ్ జోడీ 581 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాయి. 580 పాయింట్లతో జియాంగ్ రాన్‌జిన్–జాంగ్ బౌవెన్ (చైనా), హనియె–సాజద్ (ఇరాన్) జంటలు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచి కాంస్య పతక పోరుకు అర్హత పొందాయి. కాంస్య పతక మ్యాచ్‌లో రాన్‌జిన్–జాంగ్ బౌవెన్ ద్వయం 17–7తో హనియె–సాజద్ జంటను ఓడించింది. మరోవైపు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత జోడీలకు నిరాశ ఎదురైంది. మెహులీ–ఐశ్వరీ ప్రతాప్ సింగ్ జోడీ 630.2 పాయింట్లు సాధించి తొమ్మిదో స్థానంలో... రమిత –దివ్యాంశ్ జంట 628.3 పాయింట్లు సాధించి 17వ స్థానంలో నిలిచాయి. టాప్–4లో నిలిచిన జోడీలు మాత్రమే స్వర్ణ, రజత, కాంస్య పతకాల మ్యాచ్‌లకు అర్హత సాధిస్తాయి. మహిళల స్కీట్ టీమ్ ఈవెంట్లో పరీనాజ్ ధలివాల్, గనీమత్ సెఖోన్, దర్శన రాథోడ్ బృందం 351 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో నిలిచింది. 8 ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ గెలిచిన స్వర్ణ పతకాలు. గతంలో అభినవ్ బింద్రా (2006; 10 మీటర్ల ఎయిర్ రైఫిల్), మానవ్‌జిత్ సింగ్ (2006; ట్రాప్), తేజస్విని సావంత్ (2010; మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్), ఓంప్రకాశ్ (2018; 50 మీటర్ల పిస్టల్), అంకుర్ మిట్టల్ (2018; డబుల్ ట్రాప్), రుద్రాం„Š (2022; 10 మీటర్ల ఎయిర్ రైఫిల్), రుద్రాం„Š , అర్జున్ బబూటా, అంకుశ్ జాదవ్ బృందం (2022; 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్) ఈ ఘనత సాధించారు. -
క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తమ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో పలువురు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారని తెలిపారు. గురువారం బీఆర్కేఆర్ భవన్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో ప్రముఖ షూటర్ ఈషా సింగ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగిలయ్యలకు ఒక్కొక్కరికి 600 గజాల ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ పత్రాలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అందజేశారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర క్రీడాకారుల ప్రతిభను గుర్తించి ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. షూటర్ ఈషా సింగ్, బాక్సర్ నిఖత్ జరీన్‌లు వివిధ క్రీడాపోటీల్లో తెలంగాణ ప్రతిభను చాటి చెప్పారని, వారికి రూ. 2 కోట్ల చొప్పున ప్రభుత్వ నజరానాతో పాటు 600 చదరపు గజాల ఇంటి స్థలాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి గౌరవిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం త్వరలో నూతన స్పోర్ట్స్ పాలసీని తీసుకురానున్నట్లు వెల్లడించారు. పాలమూరుకు చెందిన కిన్నెర కళాకారుడు మొగిలయ్య ప్రతిభను తెలంగాణ ప్రభుత్వమే తొలుత గుర్తించి గౌరవించిందని అన్నారు. ఆయనకు కుటుంబ పోషణకోసం నెలకు రూ. 10 వేలు ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. కిన్నెర కళను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన తరువాతే కేంద్రం మొగిలయ్యకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించిందన్నారు. ఈ సందర్భంగా కోటి రూపాయల నజరానాతో పాటు ఇంటి స్థలం పట్టా పత్రాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని.. తదనుగుణంగా ఆయన కోరుకున్న చోట ఇంటి స్థలం ఇస్తున్నామని తెలిపారు. కాగా, తన కళను గుర్తించి గౌరవించడంతో పాటు ఇంటి స్థలం, కోటి రూపాయలు ఇచ్చిన మహనీయుడు కేసీఆర్ అని కిన్నెర మొగిలయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. కొందరికి జూబ్లీహిల్స్.. మొగిలయ్యకు బీఎన్ రెడ్డి నగర్‌లోనా? పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర కళాకారుడు మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయింపుపై అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజు అసహనానికి గురయ్యారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా బాలరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు చెప్పకుండానే మొగిలయ్యకు ఇంటి స్థలం పంపిణీ చేశారని, స్థానిక శాసనసభ్యుడిగా స్థలం పంపిణీ కార్యక్రమం గురించి తనకు సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జాతి, ఖ్యాతిని జాతీయ.. అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన క్రీడాకారులు, కళాకారులకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో స్థలాలు ఇచ్చారని, మొగిలయ్యకు మాత్రం బీఎన్‌రెడ్డి నగర్లో ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. అయితే, తదనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో తనకు విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం గురించి తనకు ముందస్తు సమాచారం లేకపోవడంపై మాత్రమే మంత్రి సహాయక సిబ్బందిపై తాను ఆగ్రహం వ్యక్తం చేశానని బీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. -
ఇషాకు రజతం.. జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్ విజేత ఎవరంటే!
National Shooting Championship 2022: జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ రజత పతకం సాధించింది. జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్లో 13–17తో హరియాణాకు చెందిన ఒలింపియన్ మను భాకర్ చేతిలో ఇషా ఓడిపోయింది. దీంతో ఆమె వెండి పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే.. సీనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కర్ణాటక షూటర్ టీఎస్ దివ్య విజేతగా నిలిచింది. కాగా భోపాల్‌లో సోమవారం ఈ టోర్నీ ముగిసింది. చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. అక్షర్‌కు నో ఛాన్స్! ఆల్‌రౌండర్ అరంగేట్రం Cristiano Ronaldo: వద్దనుకుంటే పుట్టిన బిడ్డ! ఎంతటి మొనగాడివైతేనేం! ఎన్ని రికార్డులు ఉన్నా ఏం లాభం? మరీ ఇలా... పర్లేదులే! -
Asian Airgun Championship 2022: భారత్ ఖాతాలో మరో నాలుగు స్వర్ణాలు
డేగూ (కొరియా): ఆసియా ఎయిర్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. బుధవారం జరిగిన నాలుగు ఈవెంట్స్‌లోనూ భారత షూటర్లు స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నారు. జూనియర్ మహిళల 10 ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ 15–17తో భారత్‌కే చెందిన మనూ భాకర్ చేతిలో ఓడిపోయి రజతం దక్కించుకుంది. సీనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో రిథమ్ సాంగ్వాన్ 16–8తో భారత్‌కే చెందిన పలక్‌పై గెలిచి పసిడి పతకం సొంతం చేసుకుంది. సీనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఫైనల్లో శివ నర్వాల్, నవీన్, విజయ్‌వీర్‌లతో కూడిన భారత జట్టు 16–14తో కొరియా జట్టును ఓడించి బంగారు పతకం సాధించింది. జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఫైనల్లో సాగర్, సామ్రాట్ రాణా, వరుణ్ తోమర్లతో కూడిన భారత జట్టు 16–2తో ఉజ్బెకిస్తాన్ జట్టుపై గెలిచి స్వర్ణం కైవసం చేసుకుంది. మరో రెండు రోజులు ఉన్న ఈ ఈవెంట్లో ఇప్పటి వరకు భారత్‌కు 21 స్వర్ణ పతకాలు లభించాయి. -
ఇషా జట్టుకు స్వర్ణం
కైరో (ఈజిప్ట్): ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్లో భారత షూటర్ల పసిడి వేట కొనసాగుతోంది. ఈ మెగా ఈవెంట్లో తాజాగా భారత్‌కు మరో మూడు స్వర్ణ పతకాలు లభించాయి. జూనియర్ మహిళల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్, వర్షా సింగ్, శిఖా నర్వాల్‌లతో కూడిన భారత జట్టు పసిడి పతకం గెలిచింది. ఫైనల్లో భారత్ 16–6తో చైనా జట్టును ఓడించింది. జూనియర్ మహిళల ఎయిర్ రైఫిల్ టీమ్ ఫైనల్లో తిలోత్తమా సేన్, నాన్సీ, రమితాలతో కూడిన భారత జట్టు 16–2తో చైనా జట్టుపై గెలిచి స్వర్ణం నెగ్గింది. జూనియర్ పురుషుల ఎయిర్ రైఫిల్ టీమ్ ఫైనల్లో శ్రీ కార్తీక్ శబరి రాజ్, దివ్యాంశ్ సింగ్ పన్వర్, విదిత్ జైన్‌లతో కూడిన భారత జట్టు 17–11తో చైనా జట్టుపై గెలిచి బంగారు పతకం సాధించింది. ఇప్పటి వరకు ఈ టోరీ్నలో భారత్ 9 స్వర్ణాలు, 3 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 20 పతకాలతో రెండో స్థానంలో ఉంది. -
ISSF World Championship: ఇషా పసిడి గురి
కైరో (ఈజిప్ట్): ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ షూటర్ ఇషా సింగ్ స్వర్ణ పతకం సాధించింది. శనివారం జరిగిన జూనియర్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఇషా సింగ్ చాంపియన్ గా అవతరించింది. ఫైనల్లో ఇషా 29 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. సిజువాన్ ఫెంగ్ (చైనా; 26 పాయింట్లు) రజతం, మిరియమ్ జాకో (హంగేరి; 18 పాయింట్లు) కాంస్యం గెలిచారు. పురుషుల జూనియర్ 25 మీటర్ల పిస్టల్, స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్స్‌లో భారత్‌కే చెందిన ఉదయ్‌వీర్ సిద్ధూ పసిడి పతకాలు సొంతం చేసుకున్నాడు. పిస్టల్ విభాగంలో ఉదయ్‌వీర్ 580 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. మాస్ట్రోవలెరియో (ఇటలీ; 579 పాయింట్లు) రజతం, లియు యాంగ్పన్ (చైనా; 577 పాయింట్లు) కాంస్యం సాధించారు. స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్లో ఉదయ్‌వీర్ 568 పాయింట్లు స్కోరు చేసి అగ్ర స్థానాన్ని దక్కించుకున్నాడు. సమీర్ (భారత్; 567 పాయింట్లు) కాంస్యం గెలిచాడు. -
National Games 2022: ఈ బంగారు పతకం ప్రత్యేకం: ఇషా సింగ్
National Games 2022: నేషనల్ గేమ్స్-2022లో మహిళల షూటింగ్ 25 మీటర్ల పిస్టల్ విభాగంలో తెలంగాణ షూటర్ ఇషా సింగ్ చాంపియన్‌గా నిలిచింది. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో ఇషా 26 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణం దక్కించుకుంది. రిథమ్ సాంగ్వాన్ (హరియాణా; 25 పాయింట్లు) రజత పతకం, అభిద్న్యా (మహారాష్ట్ర; 19 పాయింట్లు) కాంస్యం గెలిచారు. ఈ క్రీడల్లో తెలంగాణకిది రెండో స్వరం. ఆర్టిస్టిక్ సింగిల్ ఫ్రీ స్కేటింగ్‌లో రియా సాబూ బంగారు పతకం గెలిచింది. ఇక జాతీయ క్రీడల్లో పసిడి పతకం గెలిచిన అనంతరం ఇషా సింగ్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేనెంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. నేషనల్ గేమ్స్‌లో గోల్డ్ గెలవడం నాకెంతో ప్రత్యేకం. స్వర్ణం గెలిచేందుకు దగ్గరవుతున్న తరుణంలో నా మనసులో కలిగిన భావోద్వేగాల గురించి చెప్పడం కష్టం. ముఖ్యంగా చివరి రెండు షాట్లు’’ అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైంది. అదే విధంగా ఈ ఈవెంట్ తన రాష్ట్రం తెలంగాణకు ఒలింపిక్స్ వంటిదంటూ ఉద్వేగపూరిత ట్వీట్ చేసింది. కాగా జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో పసిడి గెలిచిన ఇషా సింగ్‌కు తెలంగాణ సర్కారు రూ. 2 కోట్ల నగదు బహుమతి ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: National Games 2022: ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా కెప్టెన్లే! ప్రేమా..పెళ్లి.. కవలలు.. మూడేళ్ల తర్వాత.. RSWS 2022 Final: శ్రీలంకను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడిన ఇండియా లెజెండ్స్.. వరుసగా రెండోసారి #NationalGames2022. Won first gold 🏅 Olympic event for my state Telangana 25msportspistol.@TelanganaCMO @MPsantoshtrs @RaoKavitha @KTRTRS @jayesh_ranjan @suldeep @Media_SAI @DGSAI pic.twitter.com/0weXDCjq5p — Esha Singh (@singhesha10) October 1, 2022 -
బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషాసింగ్‌కు తెలంగాణ సర్కార్ భారీ నజరానా
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ క్రీడల్లో విజేతలకు తెలంగాణ సర్కార్ భారీ నజరానా ప్రకటించింది. తెలంగాణకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషా సింగ్‌లకు రూ. 2కోట్ల చొప్పున నగదు బహుమతి ప్రకటించింది. నగదు బహుమతితో పాటు ఇంటిస్థలం కూడా కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవలే ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌లో స్వర్ణం గెలిచి నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. ఇక దేశం తరపున నిఖత్ జరీన్ ఐదో మహిళా బాక్సింగ్ చాంపియన్‌గా నిలిచింది. ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్‌కప్ షూటింగ్ పోటీల్లో ఈషా సింగ్ గోల్డ్ మెడల్ సాధించింది. సీఎం కెసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగదు బహుమతితో పాటు వీరికి బంజారాహిల్స్ లేదా జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో నివాసయోగ్యమైన ఇంటిస్థలాన్ని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ఇషా పసిడి గురి.. షూటింగ్ వరల్డ్ కప్‌లో మూడో స్వర్ణం సాధించిన హైదరాబాదీ
న్యూఢిల్లీ: జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ షూటర్ ఇషా సింగ్ తన ఖాతాలో మరో స్వర్ణ పతకం వేసుకుంది. జర్మనీలో మంగళవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో ఇషా సింగ్, మనూ భాకర్, రిథమ్ సాంగ్వాన్‌లతో కూడిన భారత జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఇషా, మనూ, రిథమ్ జట్టు 16–2తో జర్మనీ జట్టుపై గెలిచింది. ఇదే టోర్నీలో ఇషా సింగ్ మిక్సడ్ టీమ్ పిస్టల్ ఈవెంట్‌తో పాటు మహిళల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లలో బంగారు పతకం సాధించింది. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో పంకజ్ ముఖేజా, సిఫ్ట్ కౌర్ సమ్రా (భారత్) జట్టు రజతం సాధించింది. ప్రస్తుతం భారత్ 11 స్వర్ణాలు, 13 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 28 పతకాలతో టాప్ ర్యాంక్‌లో ఉంది. -
Junior World Cup: మనోళ్ల గురి అదిరింది
సాక్షి, హైదరాబాద్/విజయవాడ స్పోర్ట్స్: జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో శుక్రవారం టీమ్ ఈవెంట్స్‌లో భారత్‌కు నాలుగు స్వర్ణ పతకాలు లభించాయి. జర్మనీలో జరుగుతున్న ఈ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ యువ షూటర్ మద్దినేని ఉమామహేశ్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో... తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో బంగారు పతకాలు గెల్చుకున్నారు. ఎయిర్ రైఫిల్ టీమ్ ఫైనల్లో ఉమామహేశ్, పార్థ్, రుద్రాం„Š లతో కూడిన భారత జట్టు 16–8తో స్పెయిన్ జట్టును ఓడించి విజేతగా నిలిచింది. విజయవాడకు చెందిన 17 ఏళ్ల ఉమామహేశ్ కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ తొలి సంవత్సరం చదువుతున్నాడు. ఎయిర్ పిస్టల్ టీమ్ ఫైనల్లో ఇషా సింగ్, పలక్, మనూ భాకర్‌లతో కూడిన భారత జట్టు 16–8తో జార్జియా జట్టుపై గెలిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఫైనల్లో రమిత, జీనా ఖిట్టా, ఆర్యా బోర్సెలతో కూడిన భారత జట్టు 17–9తో దక్షిణ కొరియా జట్టును ఓడించి స్వర్ణం సొంతం చేసుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో సౌరభ్ చౌదరీ, శివ, సరబ్జీత్లతో కూడిన భారత జట్టు 17–9తో ఉజ్బెకిస్తాన్ జట్టుపై గెలిచి నాలుగో పసిడి పతకాన్ని అందించింది. -
ఇషా సింగ్–సౌరభ్ జోడీకి స్వర్ణం
జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్–సౌరభ్ చౌదరీ (భారత్) ద్వయం 16–12తో పలక్–సరబ్‌జ్యోత్ (భారత్) జంటను ఓడించి స్వర్ణ పతకం గెలిచింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో రమిత–పార్థ్ (భారత్) జంట 13–17తో జూలియా–విక్టర్ (పోలాండ్) జోడీ చేతిలో ఓడి రజతం నెగ్గింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో పలక్ స్వర్ణం, మనూ రజతం గెల్చుకున్నారు. -
ప్రపంచకప్ టోర్నీకి షూటర్ ఇషా సింగ్
అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న హైదరాబాద్ యువ షూటర్ ఇషా సింగ్ మరో టోర్నీకి సిద్ధమైంది. ఈనెల 9 నుంచి 20 వరకు జర్మనీలో జరిగే ప్రపంచకప్ జూనియర్ షూటింగ్ టోర్నీలో ఇషా సింగ్ బరిలోకి దిగనుంది. 17 ఏళ్ల ఇషా 10 మీటర్ల, 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో పోటీపడుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మద్దినేని ఉమామహేశ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాడు. చదవండి: IPL 2022: ఇప్పటి వరకు నేను చూసిన బెస్ట్ ఇన్నింగ్స్ ఇది: పంత్ -
ఇషా గురికి రెండో స్వర్ణం
కైరో (ఈజిప్ట్): ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ షూటర్ ఇషా సింగ్ రెండో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో ఇషా సింగ్, రాహీ సర్నోబత్, రిథమ్ సాంగ్వాన్‌లతో కూడిన భారత జట్టు పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఫైనల్లో భారత జట్టు 17–13తో సింగపూర్ జట్టును ఓడించింది. ఈ టోర్నీలో 17 ఏళ్ల ఇషా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం, వ్యక్తిగత విభాగంలో రజతం సాధించింది. ఆదివారమే జరిగిన 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ మిక్స్డ్ ఈవెంట్లో అఖిల్ షెరాన్–శ్రియాంక జోడీ కాంస్య పతకాన్ని సాధించింది. అఖిల్–శ్రియాంక జంట 16–10తో రెబెకా–రుంప్లెర్ (ఆస్ట్రియా) ద్వయంపై గెలిచింది. -
టీమ్ ఈవెంట్లో ఇషాకు స్వర్ణం
కైరో: అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్‌లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ రెండో పతకంతో మెరిసింది. మంగళవారం వ్యక్తిగత విభాగంలో రజతం సాధించిన ఇషా... గురువారం టీమ్ ఈవెంట్లో స్వర్ణం గెలుచుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ టీమ్ ఈవెంట్లో ఇషా సింగ్, రుచిత వినేర్కర్, శ్రీ నివేతలతో కూడిన భారత జట్టు విజేతగా నిలిచింది. స్వర్ణ పతక పోరులో జర్మనీ షూటర్లతో తలపడిన భారత బృందం 16 పాయింట్లు సాధిస్తే... సాండ్రా, అండ్రియా, కెరీనాలున్న జర్మనీ జట్టు కేవలం 6 పాయింట్లే స్కోరు చేసి రజతంతో సరిపెట్టుకుంది. అంతకుముందు తొలి క్వాలిఫయింగ్‌లో భారత జట్టు 856 పాయింట్లు, రెండో క్వాలిఫయింగ్‌లో 574 పాయింట్లు స్కోరు చేసింది. జర్మనీ ఈ రెండు అర్హత పోటీల్లోనూ 851, 571 స్కోర్లతో వెనుకంజలోనే ఉంది. 16–8తో సింగపూర్‌పై నెగ్గిన చైనీస్ తైపీ జట్టుకు కాంస్యం లభించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సౌరభ్ చౌదరీ, గౌరవ్ రాణా, బాలకృష్ణలతో కూడిన భారత జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో 2 స్వర్ణాలు, ఒక రజతం నెగ్గిన భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. -
ISSF World Cup 2022: భారత్‌కు తొలి గోల్డ్ మెడల్.. అదరగొట్టిన సౌరభ్ చౌదరీ
Saurabh Wins Gold In ISSF World Cup In Cairo: సీనియర్ విభాగంలో తొలిసారి ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ యువ షూటర్ ఇషా సింగ్ అదరగొట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 17 ఏళ్ల ఇషా సింగ్ రజత పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో ఇషా 4–16 పాయింట్ల తేడాతో ‘రియో ఒలింపిక్స్’ స్వర్ణ పతక విజేత అనా కొరాకాకి (గ్రీస్) చేతిలో ఓడిపోయింది. మరోవైపు పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ భాగంలో సౌరభ్ చౌదరీ భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు. ఫైనల్లో సౌరభ్ 16–6తో మైకేల్ ష్వాల్డ్ (జర్మనీ)పై గెలిచాడు. 19 ఏళ్ల సౌరభ్‌కు ప్రపంచకప్ టోర్నీలలో ఇది మూడో పసిడి పతకం కావడం విశేషం. చదవండి: IND vs IRE: మూడేళ్ల తర్వాత ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా.. రోహిత్, కోహ్లి లేకుండానే! -
‘టాప్స్’ డెవలప్మెంట్ గ్రూప్‌లో స్నేహిత్, శ్రీజ, ఇషా సింగ్
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లో కొత్తగా 20 మందిని చేర్చారు. తాజా జాబితాతో కలిపి 2024 పారిస్ ఒలింపిక్స్ కోసం ప్రభుత్వ సహకారంతో సన్నద్ధమవుతున్న మొత్తం ఆటగాళ్ల సంఖ్య 148కి చేరింది. వర్ధమాన క్రీడాకారులను కూడా సహకారం అందించేందుకు ‘టాప్స్’ డెవలప్మెంట్ గ్రూప్ ను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి టేబుల్ టెన్నిస్‌లో ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్, ఆకుల శ్రీజకు... షూటింగ్లో ఇషా సింగ్‌కు చోటు లభించింది. చదవండి: Ind Vs SA- Test Series: రోహిత్ శర్మ స్థానంలో ప్రియాంక్ పాంచల్.. 314 నాటౌట్.. 24 సెంచరీలు! -
ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ: ఇషా సింగ్‌కు రజతం
అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) జూనియర్ ప్రపంచకప్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ రజత పతకం సాధించింది. జర్మనీలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో 14 ఏళ్ల ఇషా సింగ్ 236.6 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. సెవ్వల్ తర్హాన్ (టర్కీ–241.8 పాయింట్లు) స్వర్ణం సొంతం చేసుకోగా... యాస్మిన్ (టర్కీ–215.4 పాయింట్లు) కాంస్యం కైవసం చేసుకుంది. జూనియర్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో అనీశ్ భన్వాలా (భారత్–29 పాయింట్లు) పసిడి పతకం సాధించాడు. భళా... రాజా రిత్విక్ సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ప్లేయర్ రాజా రిత్విక్ అండర్–15 ఓపెన్ విభాగంలో విజేతగా అవతరించాడు. తమిళనాడులో బుధవారం ముగిసిన ఈ పోటీల్లో రాజా రిత్విక్ 9.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించాడు. తెలంగాణకే చెందిన మరో ఆటగాడు కుశాగ్ర మోహన్ రన్నరప్‌గా నిలిచి రజత పతకం సాధించాడు. కుశాగ్ర మోహన్ 9 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) హోదా కలిగిన రిత్విక్ ఈ టోర్నీలో 11 గేముల్లోనూ అజేయంగా నిలిచి స్వర్ణ పతకాన్ని గెలిచాడు. ప్రవీణ్ (తమిళనాడు), శాశ్వత పాల్ (జార్ఖండ్), అనిరుధ (మహారాష్ట్ర), శ్రీహరి (పుదుచ్చేరి), నిఖిల్ (తమిళనాడు), సంకేత్ చక్రవర్తి (బెంగాల్), ప్రళయ్ సాహూ (బెంగాల్), అజయ్ కార్తికేయన్ (తమిళనాడు)పై విజయం సాధించిన రిత్విక్... నారాయణ్ చౌహాన్ (ఉత్తరప్రదేశ్), ప్రణవ్ (తమిళనాడు), ఆదిత్య సామంత్ (మహారాష్ట్ర)లతో జరిగిన గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. ఎన్.రామరాజు వద్ద శిక్షణ తీసుకుంటున్న రిత్విక్ తాజా విజయంతో ఆసియా చాంపియన్‌షిప్, ప్రపంచ చాంపియన్‌షిప్, కామన్వెల్త్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. దీపిక గురి అదిరె... టోక్యో: వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ వేదికపై నిర్వహిస్తున్న టెస్ట్ ఈవెంట్ ఆర్చరీ టోర్నమెంట్లో భారత స్టార్ క్రీడాకారిణి దీపిక కుమారి మెరిసింది. మహిళల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో ఆమె రజత పతకం సాధించింది. దక్షిణ కొరియా ఆర్చర్ యాన్ సాన్తో బుధవారం జరిగిన ఫైనల్లో దీపిక 0–6 తేడాతో ఓడిపోయింది. దీపిక వరుసగా మూడు సెట్లను 26–27, 25–29, 28–30తో చేజార్చుకుంది. సెట్ గెలిస్తే రెండు పాయింట్లు లభిస్తాయి. తొలి రౌండ్లో దీపిక 6–0తో లీ షుక్ క్వాన్ (హాంకాంగ్)పై, రెండో రౌండ్లో 6–4తో అనస్తాసియా పావ్లో వా (ఉక్రెయిన్)పై, మూడో రౌండ్లో 6–0తో వాకా సొనాడా (జపాన్)పై, క్వార్టర్ ఫైనల్లో 6–5తో తాతియానా ఆండ్రోలి (ఇటలీ)పై, సెమీఫైనల్లో 6–0తో జెంగ్ యిచాయ్ (చైనా)పై విజయం సాధించింది. అజేయ హారిక... సాక్షి, హైదరాబాద్: షావోజింగ్ ఓపెన్ అంతర్జాతీయ మహిళల చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మెరిసింది. 34 మంది క్రీడాకారిణులు తొమ్మిది రౌండ్లలో పోటీపడ్డ ఈ టోర్నమెంట్లో హారిక కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. చైనాలో బుధవారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత హారిక ఆరు పాయింట్లతో మరో ఇద్దరు క్రీడాకారిణులు గువో కి (చైనా), ముంగున్తుల్ భత్కుయాగ్ (మంగోలియా)లతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... గువో కి రజతం ఖాయమైంది. హారికకు కాంస్యం దక్కింది. ఈ టోర్నీలో మూడు గేముల్లో గెలిచిన హారిక మరో ఆరు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది. మూడో స్థానంలో నిలిచిన హారికకు 15 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 10 లక్షల 32 వేలు) లభించింది. ప్రపంచ మాజీ చాంపియన్ అంటొనెటా స్టెఫనోవా (బల్గేరియా) ఏడు పాయింట్లతో ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. -
ఇషా సింగ్ ‘డబుల్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఇషా సింగ్ ‘డబుల్’ సాధించింది. ఆమె యూత్ మహిళల, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్స్‌లో విజేతగా నిలిచింది. గచ్చిబౌలిలోని ‘శాట్స్’ షూటింగ్ రేంజ్లో బుధవారం ముగిసిన ఈ మూడు రోజుల టోర్నీకి విశేష స్పందన లభించింది. మునుపెన్నడూ లేని విధంగా 500 మంది షూటర్లు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. బుధవారం జరిగిన టోర్నీ ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ, శాట్స్ ఎండీ ఎ. దినకర్‌బాబు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా డీజీపీ అనురాగ్ శర్మ మాట్లాడుతూ యువతరం షూటింగ్ క్రీడ పట్ల ఆసక్తి కనబరుస్తుండటం హర్షించదగ్గ విషయమన్నారు. షూటర్లకు గన్ లైసెన్స్‌లు జారీ చేయడంలో ఢిల్లీ తరహా విధానాన్ని త్వరలోనే హైదరాబాద్‌లోనూ అమలు చేస్తామని పేర్కొన్నారు. 24 గంటల్లోనే లైసెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లకు ఆతిథ్యమిచ్చేందుకు నగరంలోని షూటింగ్ రేంజ్‌లను అభివృద్ధి చేయాల్సి ఉందని శాట్స్ ఎండీ దినకర్ బాబు అభిప్రాయపడ్డారు. దేశంలోనే అత్యుత్తమ షూటింగ్ రేంజ్‌లుగా తీర్చిదిద్దేందుకు దాదాపు రూ. 10 కోట్లు అవసరమని ఆయన అంచనా వేశారు. షూటింగ్ క్రీడ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని తెలిపారు. తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ కృషిని ఆయన అభినందించారు. బుధవారం జరిగిన వివిధ ఈవెంట్ల విజేతల వివరాలు పురుషుల 50 మీ. రైఫిల్ ప్రోన్: 1. సాబీర్ అలీఖాన్, 2. తాహెర్ ఖాద్రి, 3. ప్రీత్‌పాల్ సింగ్. మహిళలు: 1. వర్కాల సువర్ణ, 2. అనూష ఎర్రబల్లి, 3. సంయుక్త స్వామి. 50 మీ. జూనియర్ పురుషుల రైఫిల్ ప్రోన్: 1. సయ్యద్ మొహమ్మద్ మహమూద్, 2. అబిద్ అలీఖాన్, 3. ధీరజ్. జూనియర్ మహిళలు: 1. సురభి భరద్వాజ్, 2. ఆర్. వైష్ణవి, 3. మౌనిక. పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్: 1. అనురాగ్ గౌత మ్, 2. మహేంద్ర రెడ్డి, 3. నాగసాయి తరుణ్. యూత్ పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్: 1. తనిష్క్, 2. అబ్దుల్ రెహమాన్ ఖాన్, 3. నాగసాయి తరుణ్. యూత్ మహిళలు: 1. ఇషా సింగ్, 2. ఐషిత, 3. పెనిషా. మహిళల 10 మీ. ఎయిర్ పిస్టల్: 1. ఇషా సింగ్, 2. ఐషితా, 3. ఫాతిమా ముఫద్దల్. జూ. పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్: 1. మహేం ద్రరెడ్డి, 2.తనిష్క్, 3.అబ్దుల్ రెహమాన్ ఖాన్. పురుషుల 10 మీ. ఎయిర్ రైఫిల్: 1. వినయ్ కుమార్, 2. ఆదిత్య, 3. అమన్. మహిళలు: 1. స్నిగ్ధ, 2. సంయుక్త, 3. నందిని. -
బెల్టుతో భార్యను హతమార్చిన భర్త
ఉస్మానియా యూనివర్సిటీ: తాగిన మైకంలో ఓ భర్త ... భార్య మెడకు బెల్టు బిగించి హత్య చేసిన సంఘటన ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ అశోక్‌రెడ్డి కథనం ప్రకారం...ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పూర్‌కు చెందిన ఇషాసింగ్ (30)తో చాదర్‌గట్‌కు చెందిన నగర నివాసి మిర్జాహుస్సెన్‌అలీ (34) ఎనమిది సంవత్సరాల క్రితం ప్రేమా వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. హబ్సిగూడ వీధినంబర్.8లో ఇండిపెండెంట్ హౌజ్‌లో ఉంటు రోలింగ్ షట్టర్స్ వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. గత కొంత కాలం భార్య, భర్తల మధ్య చిన్న చితక విషయాలకు గొడవలు ప్రారంభమైనవి. బుధవారం ఇషాసింగ్ తన పిల్లను కొట్టింది. పిల్లలను ఎందుకు కొట్టావని భర్త గొడవకు దిగాడు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి గొడవ తీవ్రరూపం దాల్చింది. అప్పటికె తాగి ఉన్న భర్త మిర్జాహుస్సెన్‌అలీ నడుముకు గల బెల్టును భార్య మెడకు బిగించి చనిపోయోవరకు గట్టిగా లాగాడు. ఊపిరాడని ఇషాసింగ్ అప్పటికప్పుడే మతి చెందింది. విషయం తెలుసుకున్న ఓయూ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి భర్త మిర్జాహుస్సెన్‌అలీని అరెస్ట్ చేసి ఇషాసింగ్ మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు.