కైరో: అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచకప్‌లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ రెండో పతకంతో మెరిసింది. మంగళవారం వ్యక్తిగత విభాగంలో రజతం సాధించిన ఇషా... గురువారం టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం గెలుచుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో ఇషా సింగ్, రుచిత వినేర్కర్, శ్రీ నివేతలతో కూడిన భారత జట్టు విజేతగా నిలిచింది. స్వర్ణ పతక పోరులో జర్మనీ షూటర్లతో తలపడిన భారత బృందం 16 పాయింట్లు సాధిస్తే... సాండ్రా, అండ్రియా, కెరీనాలున్న జర్మనీ జట్టు కేవలం 6 పాయింట్లే స్కోరు చేసి రజతంతో సరిపెట్టుకుంది.
అంతకుముందు తొలి క్వాలిఫయింగ్‌లో భారత జట్టు 856 పాయింట్లు, రెండో క్వాలిఫయింగ్‌లో 574 పాయింట్లు స్కోరు చేసింది. జర్మనీ ఈ రెండు అర్హత పోటీల్లోనూ 851, 571 స్కోర్లతో వెనుకంజలోనే ఉంది. 16–8తో సింగపూర్‌పై నెగ్గిన చైనీస్ తైపీ జట్టుకు కాంస్యం లభించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో సౌరభ్ చౌదరీ, గౌరవ్ రాణా, బాలకృష్ణలతో కూడిన భారత జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో 2 స్వర్ణాలు, ఒక రజతం నెగ్గిన భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment