కైరో (ఈజిప్ట్): ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ షూటర్ ఇషా సింగ్ స్వర్ణ పతకం సాధించింది. శనివారం జరిగిన జూనియర్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో ఇషా సింగ్ చాంపియన్ గా అవతరించింది. ఫైనల్లో ఇషా 29 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. సిజువాన్ ఫెంగ్ (చైనా; 26 పాయింట్లు) రజతం, మిరియమ్ జాకో (హంగేరి; 18 పాయింట్లు) కాంస్యం గెలిచారు.
పురుషుల జూనియర్ 25 మీటర్ల పిస్టల్, స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్స్‌లో భారత్‌కే చెందిన ఉదయ్‌వీర్ సిద్ధూ పసిడి పతకాలు సొంతం చేసుకున్నాడు. పిస్టల్ విభాగంలో ఉదయ్‌వీర్ 580 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. మాస్ట్రోవలెరియో (ఇటలీ; 579 పాయింట్లు) రజతం, లియు యాంగ్‌పన్ (చైనా; 577 పాయింట్లు) కాంస్యం సాధించారు. స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్‌లో ఉదయ్‌వీర్ 568 పాయింట్లు స్కోరు చేసి అగ్ర స్థానాన్ని దక్కించుకున్నాడు. సమీర్ (భారత్; 567 పాయింట్లు) కాంస్యం గెలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment