
జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్–సౌరభ్ చౌదరీ (భారత్) ద్వయం 16–12తో పలక్–సరబ్‌జ్యోత్ (భారత్) జంటను ఓడించి స్వర్ణ పతకం గెలిచింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో రమిత–పార్థ్ (భారత్) జంట 13–17తో జూలియా–విక్టర్ (పోలాండ్) జోడీ చేతిలో ఓడి రజతం నెగ్గింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో పలక్ స్వర్ణం, మనూ రజతం గెల్చుకున్నారు.