కైరో (ఈజిప్ట్): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో వరుసగా రెండో రోజు భారత్ ఖాతాలో పతకాలు చేరాయి. సోమవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్స్‌లో భారత జోడీలు స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నాయి. ఎయిర్ రైఫిల్ విభాగంలో నర్మద నితిన్ రాజు–రుద్రాం, బాలాసాహెబ్ పాటిల్ జోడీ... ఎయిర్ పిస్టల్ విభాగంలో వరుణ్ తోమర్–రిథమ్ సాంగ్వాన్ జోడీ విజేతగా నిలిచాయి.
ఎయిర్ రైఫిల్ టీమ్ మిక్స్‌డ్ ఫైనల్లో తమిళనాడుకు చెందిన నర్మద, మహారాష్ట్రకు చెందిన రుద్రాం„Š జోడీ 16–6తో ఎస్తెర్ డెనిస్–ఇస్త్‌వాన్ పెని (హంగేరి) ద్వయంపై గెలిచింది. క్వాలిఫయింగ్ రౌండ్‌లో నర్మద–రుద్రాం, 635.8 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్‌లో నిలిచి ఫైనల్‌కు చేరారు. ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఫైనల్లో వరుణ్–రిథమ్ ద్వయం 16–10తో జొరానా అరునోవిచ్–దామిర్ మికెచ్ (సెర్బియా) జోడీని ఓడించింది.
క్వాలిఫయింగ్ రౌండ్‌లో వరుణ్–రిథమ్ ద్వయం 583 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచి ఫైనల్ చేరింది. ఆదివారం జరిగిన ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో వరుణ్ కాంస్య పతకాన్ని సాధించాడు. ప్రస్తుతం భారత్ రెండు స్వర్ణాలు, ఒక కాంస్యంతో కలిపి మూడు పతకాలతో అగ్రస్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment