న్యూఢిల్లీ: జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ షూటర్ ఇషా సింగ్ తన ఖాతాలో మరో స్వర్ణ పతకం వేసుకుంది. జర్మనీలో మంగళవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో ఇషా సింగ్, మనూ భాకర్, రిథమ్ సాంగ్వాన్‌లతో కూడిన భారత జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఇషా, మనూ, రిథమ్ జట్టు 16–2తో జర్మనీ జట్టుపై గెలిచింది.
ఇదే టోర్నీలో ఇషా సింగ్ మిక్సడ్ టీమ్ పిస్టల్ ఈవెంట్‌తో పాటు మహిళల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లలో బంగారు పతకం సాధించింది. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో పంకజ్ ముఖేజా, సిఫ్ట్ కౌర్ సమ్రా (భారత్) జట్టు రజతం సాధించింది. ప్రస్తుతం భారత్ 11 స్వర్ణాలు, 13 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 28 పతకాలతో టాప్ ర్యాంక్‌లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment