సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ క్రీడల్లో విజేతలకు తెలంగాణ సర్కార్ భారీ నజరానా ప్రకటించింది. తెలంగాణకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషా సింగ్‌లకు రూ. 2కోట్ల చొప్పున నగదు బహుమతి ప్రకటించింది. నగదు బహుమతితో పాటు ఇంటిస్థలం కూడా కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.
ఇటీవలే ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌లో స్వర్ణం గెలిచి నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. ఇక దేశం తరపున నిఖత్ జరీన్ ఐదో మహిళా బాక్సింగ్ చాంపియన్‌గా నిలిచింది. ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్‌కప్ షూటింగ్ పోటీల్లో ఈషా సింగ్ గోల్డ్ మెడల్ సాధించింది. సీఎం కెసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగదు బహుమతితో పాటు వీరికి బంజారాహిల్స్ లేదా జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో నివాసయోగ్యమైన ఇంటిస్థలాన్ని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment