పారిస్‌కు మన లేడీస్‌.. | Four Athletes From Hyderabad City Have Been Selected For Paris Olympics | Sakshi
Sakshi News home page

పారిస్‌కు మన లేడీస్‌..

Jul 26 2024 7:22 AM | Updated on Jul 26 2024 11:07 AM

Four Athletes From Hyderabad City Have Been Selected For Paris Olympics

నేటి నుంచే పారిస్‌ ఒలింపిక్స్‌

నగరం నుంచి నలుగురు అమ్మాయిలు ఒలింపిక్స్‌కు..

పీవీ సింధు, ఇషా, నిఖత్‌లపై భారీగా అంచనాలు

ఇటీవల కాలంలో రాణిస్తున్న శ్రీజ ఆకుల

క్రీడాకారులకు పెద్దఎత్తున అభినందనల వెల్లువ

సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక పారిస్‌ ఒలింపిక్స్‌ వేదికపై మరోసారి హైదరాబాదీ అమ్మాయిలు దేశఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయనున్నారు. పారిస్‌లో జరగనున్న 2024 ఒలింపిక్‌ పోటీలు శుక్రవారం నుంచే ప్రారంభం కానున్నాయి. ఈసారి ఒలింపిక్స్‌లో మొత్తంగా 117 మంది భారతీయ అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఈ భారత క్రీడాకారుల బృందంలో 47 మంది మహిళా అథ్లెట్లు ఉండగా.. అందులో నలుగురు హైదరాబాదీలే ఉండటం గమనార్హం.

ముఖ్యంగా ఒలింపిక్స్‌లో భారత్‌ ఇప్పటి వరకు టేబుల్‌ టెన్నిస్‌లో పతకం సాధించలేదు. అయితే ఈసారి హైదరాబాద్‌ నుంచి ఒలింపిక్స్‌ వెళ్లిన టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిని శ్రీజ ఆకులపై అంచనాలు పెరిగాయి. 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌లో శ్రీజ ఆకుల, శరత్‌ కమల్‌తో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించింది. భారత బ్యాడ్మింటన్‌ దిగ్గజం 2016, 2020 ఒలింపిక్స్‌లో దేశానికి పతకాలను సాధించిపెట్టి భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన పీవీ సింధు కచి్చతంగా పతకంతోనే తిరిగొస్తుందని దేశమంతా దీమాగా ఉంది.

రెండుసార్లు వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ నెగ్గిన మరో అథ్లెట్‌ నిఖత్‌ జరీన్‌ భారతీయ బృందంలో స్టార్‌ ప్లేయర్‌గా పారిస్‌ వెళ్లింది. 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌లో కూడా ఆమె బంగారు పతకాన్ని సాధించింది. ఇదే ఏడాది ఏషియన్‌ గేమ్స్‌లోనూ కాంస్యం సాధించింది. 13 ఏళ్ల వయస్సులో 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ కేటగిరిలో నేషనల్‌ చాంపియన్‌గా నిలిచిన హైదరాబాదీ షూటర్‌ ఇషా సింగ్‌పై కూడా భారత్‌ ఎన్నో ఆశలు పెట్టుకుంది.

ఏషియన్‌గేమ్స్‌లో రజత పతకంతో రాణించిన ఇషా ఒలింపిక్స్‌లో దేశానికి పతకాన్ని ఖాయం చేస్తుందని క్రీడా ప్రముఖులు అభిలాíÙస్తున్నారు. ఈసారి పారిస్‌ ఒలింపిక్స్‌లో మాజీ ఒలింపిక్స్‌ పతక విజేత, హైదరాబాదీ పీవీ సింధూనే ఫ్లాగ్‌ బేరర్స్‌గా ఇండియన్‌ ఒలింపిక్‌ కమిటీ ప్రకటించడం విశేషం. పారిస్‌ ఒలింపిక్స్‌ నేపథ్యంలో మన క్రీడాకారులకు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు, ప్రముఖులు, సెలబ్రిటీల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement