Sreeja Akula
-
భారత టీటీ జట్ల కెప్టెన్లుగా మనిక, శరత్ కమల్
న్యూఢిల్లీ: ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్లు ఖరారయ్యాయి. పురుషుల జట్టుకు వెటరన్ స్టార్ ఆచంట శరత్ కమల్, మహిళల జట్టుకు సీనియర్ మనిక బత్రా కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఈ టోర్నీ కజకిస్తాన్ రాజధాని అస్తానాలో వచ్చే నెల 7 నుంచి 13 వరకు జరుగుతుంది. ఇది ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌నకు క్వాలిఫయింగ్ టోర్నీ కావడంతో ఐదుసార్లు ఒలింపిక్స్ క్రీడల్లో పోటీపడ్డ 42 ఏళ్ల శరత్ సహా అనుభవజ్ఞులైన హర్మీత్ దేశాయ్, సత్యన్ తదితరులతో భారత్ పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగనుంది.ఇక పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నాక విశ్రాంతి తీసుకుంటున్న తెలంగాణ స్టార్, భారత నంబర్‌వన్ ఆకుల శ్రీజ ఈ టోర్నీతో మళ్లీ బరిలోకి దిగనునంది. ప్రస్తుతం జరుగుతున్న అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్‌లో శ్రీజ పాల్గొనడం లేదు. జట్ల వివరాలు మహిళల జట్టు: మనిక బత్రా (కెప్టెన్), ఆకుల శ్రీజ, ఐహిక ముఖర్జీ, దియా చిటాలే, సుతీర్థ ముఖర్జీ, రిజర్వ్ ప్లేయర్లు: యశస్విని, పాయ్‌మంటీ బైస్య. ఫురుషుల జట్టు: శరత్ కమల్ (కెప్టెన్), మానవ్ ఠక్కర్, హర్మీత్ దేశాయ్, సత్యన్, మనుశ్ షా, రిజర్వ్ ప్లేయర్లు: స్నేహిత్, జీత్‌చంద్ర. -
పోరాడి ఓడిన శ్రీజ
పారిస్ ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళల సింగిల్స్‌లో సంచలన ప్రదర్శనతో ప్రిక్వార్టర్స్‌కు చేరిన భారత నంబర్‌వన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ.. ప్రపంచ నంబర్‌వన్ చేతిలో పోరాడి ఓడింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీజ 10–12, 10–12, 8–11, 3–11తో సన్ యింగ్షా (చైనా) చేతిలో పరాజయం పాలైంది. తొలి రెండు గేమ్‌ల్లో మొదట ఆధిక్యం కనబర్చిన శ్రీజ.. చివరి వరకు దాన్ని కొనసాగించలేకపోయింది. -
మనిక అవుట్... ప్రిక్వార్టర్స్‌లో శ్రీజ
పారిస్ ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ (టీటీ) వ్యక్తిగత విభాగంలో భారత్ నుంచి ఆకుల శ్రీజ మాత్రమే బరిలో నిలిచింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో భారత నంబర్‌వన్, ప్రపంచ 25వ ర్యాంకర్ ఆకుల శ్రీజ 9–11, 12–10, 11–4, 11–5, 10–12, 12–10తో జెంగ్ జియాన్ (సింగపూర్)పై విజయం సాధించింది. 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీజకు గట్టిపోటీ ఎదురైంది. అయితే కీలక దశల్లో శ్రీజ పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. ఈ గెలుపుతో మనిక బత్రా తర్వాత ఒలింపిక్స్ క్రీడల టీటీ పోటీల్లో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరిన రెండో భారతీయ క్రీడాకారిణిగా తెలంగాణ అమ్మాయి శ్రీజ గుర్తింపు పొందింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ సన్ యింగ్షా (చైనా)తో శ్రీజ తలపడుతుంది. మరోవైపు భారత రెండో ర్యాంకర్ మనిక బత్రా పోరాటం విశ్వ క్రీడల్లో ముగిసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 28వ ర్యాంకర్ మనిక 6–11, 9–11, 14–12, 8–11, 7–11తో ప్రపంచ 13వ ర్యాంకర్ మియు హిరానో (జపాన్) చేతిలో ఓడిపోయింది. -
Olympics 2024: సంచలనం.. ప్రి క్వార్టర్స్‌లో ఆకుల శ్రీజ
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో ఐదోరోజు భారత్‌కు అనుకూల ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటికే బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు ప్రిక్వార్టర్స్ చేరగా.. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ సైతం రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించాడు.మూడో సీడ్ పై లక్ష్య గెలుపుబుధవారం నాటి మ్యాచ్‌లో ఇండోనేషియా షట్లర్, మూడో సీడ్ జొనాథన్ క్రిస్టీని 21-18, 21-12తో ఓడించి లక్ష్య సేన్ ప్రి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. ఆరంభంలో క్రిస్టీ ఆధిపత్యం కనబరిచినా.. రెండో సెట్లో అన్‌సీడెడ్ లక్ష్య ఊహించని రీతిలో తిరిగి పుంజుకున్నాడు. వరల్డ్ నంబర్ 3 క్రిస్టీపై పైచేయి సాధించిన 22 ఏళ్ల లక్ష్య సేన్‌కు ఇవే తొలి ఒలింపిక్స్. Lakshya Sen 2️⃣ - 0️⃣ Jonatan ChristieSensational Sen has defeated World No.3 Christie 🇮🇩 in straight sets 21-18, 21-12Lakshya qualifies for Pre-QF, Well Done 🇮🇳♥️#Badminton #Paris2024 pic.twitter.com/q6klX0L0AY— The Khel India (@TheKhelIndia) July 31, 2024 ఆకుల శ్రీజ సంచలన విజయంమరోవైపు.. వుమెన్స్ టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ కూడా రౌండ్ ఆఫ్ 16లో అడుగుపెట్టింది. విశ్వ క్రీడల్లో పాల్గొన్న తొలి ప్రయత్నంలోనే ప్రిక్టార్టర్స్ చేరిన ప్లేయర్‌గా నిలిచింది. బుధవారం నాటి మ్యాచ్‌లో వరల్డ్ నంబర్ 16 శ్రీజ.. సింగపూర్‌కు చెందిన జియాన్ జెంగ్‌తో తలపడింది.తొలి గేమ్‌లో శ్రీజ వెనుకబడ్డా.. ఆ తర్వాత అదరగొట్టింది. ప్రత్యర్థిని 9-11, 12-10, 11-4, 11-5, 10-12, 12-10తో ఓడించి ప్రి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఇక భారత్ నుంచి మరో టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బత్రా ఇప్పటికే ప్రిక్వార్టర్స్ చేరుకున్న విషయం తెలిసిందే.ఫైనల్లో స్వప్నిల్ కుసాలే50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్స్‌లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే ఫైనల్‌కు చేరుకున్నాడు. మొత్తంగా 590 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచిన అతడు.. టాప్-8లో చోటు దక్కించుకున్నాడు. తద్వారా మెడల్ఈవెంట్కు అర్హత సాధించాడు.ఇదే ఈవెంట్లో మరో భారత షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ మాత్రం ఈ అడ్డంకిని అధిగమించలేక ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించాడు. చదవండి: ‘పిస్టల్’తో పంట పండించాడు! -
పారిస్‌కు మన లేడీస్..
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్ వేదికపై మరోసారి హైదరాబాదీ అమ్మాయిలు దేశఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయనున్నారు. పారిస్‌లో జరగనున్న 2024 ఒలింపిక్ పోటీలు శుక్రవారం నుంచే ప్రారంభం కానున్నాయి. ఈసారి ఒలింపిక్స్‌లో మొత్తంగా 117 మంది భారతీయ అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఈ భారత క్రీడాకారుల బృందంలో 47 మంది మహిళా అథ్లెట్లు ఉండగా.. అందులో నలుగురు హైదరాబాదీలే ఉండటం గమనార్హం.ముఖ్యంగా ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు టేబుల్ టెన్నిస్‌లో పతకం సాధించలేదు. అయితే ఈసారి హైదరాబాద్ నుంచి ఒలింపిక్స్ వెళ్లిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిని శ్రీజ ఆకులపై అంచనాలు పెరిగాయి. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో శ్రీజ ఆకుల, శరత్ కమల్‌తో కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. భారత బ్యాడ్మింటన్ దిగ్గజం 2016, 2020 ఒలింపిక్స్‌లో దేశానికి పతకాలను సాధించిపెట్టి భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన పీవీ సింధు కచి్చతంగా పతకంతోనే తిరిగొస్తుందని దేశమంతా దీమాగా ఉంది.రెండుసార్లు వరల్డ్ చాంపియన్‌షిప్ నెగ్గిన మరో అథ్లెట్ నిఖత్ జరీన్ భారతీయ బృందంలో స్టార్ ప్లేయర్‌గా పారిస్ వెళ్లింది. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా ఆమె బంగారు పతకాన్ని సాధించింది. ఇదే ఏడాది ఏషియన్ గేమ్స్‌లోనూ కాంస్యం సాధించింది. 13 ఏళ్ల వయస్సులో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ కేటగిరిలో నేషనల్ చాంపియన్‌గా నిలిచిన హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్‌పై కూడా భారత్ ఎన్నో ఆశలు పెట్టుకుంది.ఏషియన్‌గేమ్స్‌లో రజత పతకంతో రాణించిన ఇషా ఒలింపిక్స్‌లో దేశానికి పతకాన్ని ఖాయం చేస్తుందని క్రీడా ప్రముఖులు అభిలాíÙస్తున్నారు. ఈసారి పారిస్ ఒలింపిక్స్‌లో మాజీ ఒలింపిక్స్ పతక విజేత, హైదరాబాదీ పీవీ సింధూనే ఫ్లాగ్ బేరర్స్‌గా ఇండియన్ ఒలింపిక్ కమిటీ ప్రకటించడం విశేషం. పారిస్ ఒలింపిక్స్ నేపథ్యంలో మన క్రీడాకారులకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, ప్రముఖులు, సెలబ్రిటీల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో శ్రీజ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ర్యాంకింగ్స్‌లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో 25 ఏళ్ల శ్రీజ ఏడు స్థానాలు ఎగబాకి 40వ ర్యాంక్‌కు చేరుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీజ గత వారం లెబనాన్‌లో జరిగిన వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) రెండు టోర్నీల్లో రాణించింది. తొలి టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన ఆమె రెండో టోర్నీలో విజేతగా నిలిచింది. మనిక బత్రా 38వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. మే 16వ తేదీ వరకు భారత టాప్–2 ర్యాంకర్లకు పారిస్ ఒలింపిక్స్‌లో సింగిల్స్ విభాగంలో పోటీపడే అవకాశం లభిస్తుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ఆచంట శరత్ కమల్ 35వ ర్యాంక్‌లో ఉండగా... సత్యన్ జ్ఞానశేఖరన్ 43 స్థానాలు ఎగబాకి 60వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. తెలంగాణ ప్లేయర్ స్నేహిత్ 22 స్థానాలు పురోగతి సాధించి 144వ ర్యాంక్‌లో నిలిచాడు. -
ఆసియా క్రీడలకు భారత టీటీ జట్టులో శ్రీజ.. జట్ల వివరాలివే
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో, ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్లను శుక్రవారం ప్రకటించారు. 10 మంది సభ్యులతో కూడిన భారత పురుషుల, మహిళల జట్లకు ఆచంట శరత్ కమల్, మనిక బత్రా సారథ్యం వహిస్తారు. మహిళల సింగిల్స్ జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ కూడా ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుంది. తెలంగాణకు చెందిన ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్, మహారాష్ట్ర ప్లేయర్ సానిల్ షెట్టి రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు. ఆసియా టీటీ చాంపియన్‌షిప్ సెపె్టంబర్ 3 నుంచి 10 వరకు దక్షిణ కొరియాలో... ఆసియా క్రీడల టీటీ ఈవెంట్ చైనాలోని హాంగ్జౌలో సెపె్టంబర్ 23 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతాయి. భారత టీటీ జట్లు: పురుషుల టీమ్ విభాగం: ఆచంట శరత్ కమల్, సత్యన్ జ్ఞానశేఖరన్, హర్మీత్ దేశాయ్, మానవ్ ఠక్కర్, మనుష్ షా. రిజర్వ్: ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్, సానిల్ శెట్టి. మహిళల టీమ్ విభాగం: మనిక బత్రా, ఆకుల శ్రీజ, సుతీర్థ ముఖర్జీ, అహిక ముఖర్జీ, దియా చిటాలె. రిజర్వ్: అర్చన కామత్, రీత్ రిష్యా. పురుషుల డబుల్స్: శరత్ కమల్–సత్యన్; మానవ్–మనుష్. మహిళల డబుల్స్: సుతీర్థ–అహిక ముఖర్జీ; శ్రీజ–దియా. మిక్స్డ్ డబుల్స్: మనిక– సత్యన్; శ్రీజ–హర్మీత్ దేశాయ్. ఫైనల్లో రష్మిక–వైదేహి జోడీ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించింది. థాయ్‌లాండ్‌లో శుక్రవారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో రష్మిక–వైదేహి చౌధరీ (భారత్) ద్వయం 6–4, 6–3తో పునిన్ కొవాపిటుక్‌టెడ్–మంచాయ సావంగ్కెవ్ (థాయ్‌లాండ్) జంటపై నెగ్గింది. హైదరాబాద్‌కే చెందిన సహజ యామలపల్లి సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్లో సహజ 0–6, 6–1, 6–1తో లీ జాంగ్ సియో (కొరియా)పై విజయం సాధించింది. గంటా 34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ రెండు ఏస్‌లు సంధించి, ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. -
పారుపల్లి కశ్యప్ అవుట్.. క్వార్టర్స్‌లో ప్రణయ్
Taipei Open 2023- తైపీ: ఈ ఏడాది నిలకడగా రాణిస్తున్న భారత నంబర్‌వన్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ తైపీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 21–9, 21–17తో టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై గెలుపొందాడు. భారత్‌కే చెందిన పారుపల్లి కశ్యప్ కథ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. కశ్యప్ 16–21, 17–21తో సు లి యాంగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 13–21, 18–21తో చియు సియా సియె–లిన్ జియావో మిన్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తాన్యా హేమంత్ (భారత్) 11–21, 6–21తో తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలైంది. పోరాడి ఓడిన శ్రీజ న్యూఢిల్లీ: వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నీలో భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో ఆకుల శ్రీజ, దియా చిటాలె తొలి రౌండ్లోనే నిష్క్రమించగా... అహిక ముఖర్జీ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో శ్రీజ 6–11, 11–4, 5–11, 11–2, 7–11తో హువాంగ్ యిహువా (చైనీస్ తైపీ) చేతిలో, దియా 11–9, 7–11, 2–11, 1–11తో మియు కిహారా (జపాన్) చేతిలో ఓడిపోయారు. అహిక 11–8, 11–3, 11–2తో జియోటాంగ్ వాంగ్ (చైనా)పై నెగ్గింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సత్యన్–మనిక బత్రా (భారత్) ద్వయం 11–3, 11–3, 11–6తో అబ్దుల్ బాసిత్ చైచి–మలీసా నస్రి (అల్జీరియా) జంటను ఓడించిం -
World TT Championship: శ్రీజ, శరత్ కమల్ పరాజయం
డర్బన్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ పోరాటం ముగిసింది. సింగిల్స్‌తోపాటు డబుల్స్ విభాగంలోనూ శ్రీజ ఇంటిదారి పట్టింది. సోమవారం జరిగిన సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 112వ ర్యాంకర్ శ్రీజ 2–11, 4–11, 2–11, 4–11తో ప్రపంచ పదో ర్యాంకర్ యింగ్ హాన్ (జర్మనీ) చేతిలో ఓడిపోయింది. డబుల్స్ రెండో రౌండ్లో శ్రీజ–దియా చితాలె (భారత్) జోడీ 8–11, 8–11, 11–13తో సన్ యింగ్షా–వాంగ్ మాన్యు (చైనా) ద్వయం చేతిలో ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్‌లో భారత వెటరన్ స్టార్, 40 ఏళ్ల ఆచంట శరత్ కమల్ రెండో రౌండ్లో 4–11, 11–13, 8–11, 10–12తో లీ సాంగ్ సు (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్‌లో శరత్ కమల్–సత్యన్ (భారత్) జోడీ.. మిక్స్డ్ డబుల్స్‌లో మనిక బత్రా–సత్యన్ (భారత్) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాయి. అర్జున్ ఖాతాలో మూడో ‘డ్రా’ షార్జా మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ మూడో ‘డ్రా’ నమోదు చేశాడు. షాంట్ సర్గ్‌సియాన్ (అర్మేనియా)తో సోమవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను అర్జున్ 34 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఈ టోర్నీలో రెండు గేముల్లో గెలిచి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిన అర్జున్ 3.5 పాయింట్లతో 18వ ర్యాంక్‌లో ఉన్నాడు. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, నిహాల్ సరీన్, ఆర్యన్ చోప్రా నాలుగు పాయింట్లతో ఉమ్మడిగా రెండో ర్యాంక్‌లో ఉన్నారు. -
ప్రపంచ టీటీలో శ్రీజ ముందంజ
World TT Championship: దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో ప్రారంభమైన ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి రౌండ్లో శ్రీజ 4–1 (11–6, 11–9, 9–11, 11–4, 11–5) స్కోరుతో నికోల్ అర్లియా (ఇటలీ)ని ఓడించింది. మహిళల డబుల్స్‌లో భారత్‌కు చెందిన మనికా బాత్రా – అర్చనా కామత్ జోడి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. తొలి పోరులో మనిక – అర్చన ద్వయం 3–1 (10–12, 11–2, 11–9, 11–5) స్కోరుతో లిన్ యుషాన్ – క్వాన్ ఎమిలీ (అమెరికా)ను చిత్తు చేసింది. మిక్స్డ్ డబుల్స్‌లో కూడా మనికా బాత్రా – సత్యన్ జ్ఞానశేఖరన్ జంట విజయాన్ని అందుకుంది. మొదటి రౌండ్లో మనిక – సత్యన్ 3–2 (9–11, 11–8, 14–16, 11–7, 11–6)తో గ్జియా లిన్ – ల్యూకా మ్లాడనోవిచ్ (లక్సెంబర్గ్)పై గెలుపొందింది. -
ఆకుల శ్రీజ సంచలనం.. ఒకేసారి మూడు టైటిల్స్
జమ్మూ: తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ సత్తా చాటింది. తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో మూడు విభాగాల్లో టైటిల్స్ సొంతం చేసుకుంది. సోమవారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తరఫున పోటీపడిన శ్రీజ మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ నిలబెట్టుకోగా... డబుల్స్ విభాగంలో తన భాగస్వామి దియా చిటాలెతో కలిసి విజేతగా నిలిచింది. మహిళల టీమ్ ఈవెంట్లో శ్రీజ, దియా, అహిక ముఖర్జీలతో కూడిన ఆర్బీఐ జట్టు టైటిల్ సాధించింది. సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 9–11, 14–12, 11–7, 13–11, 6–11, 12–10తో సుతీర్థ ముఖర్జీ (పశ్చిమ బెంగాల్)పై గెలిచి రూ. 2 లక్షల 75 వేల ప్రైజ్‌మనీని దక్కించుకుంది. డబుల్స్ ఫైనల్లో శ్రీజ–దియా ద్వయం 11–7, 11–7, 8–11, 14–12తో స్వస్తిక ఘోష్–శ్రుతి అమృతే (మహారాష్ట్ర) జోడీని ఓడించింది. టీమ్ ఫైనల్లో ఆర్బీఐ 3–2తో తమిళనాడును ఓడించింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో మొహమ్మద్ అలీ–వంశ్ సింఘాల్ (తెలంగాణ) జోడీ 6–11, 7–11, 6–11తో జీత్ చంద్ర–అంకుర్ భట్టాచార్య (పశ్చిమ బెంగాల్) జంట చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో మనిక.. పడిపోయిన ఆకుల శ్రీజ ర్యాంకు
International Table Tennis Federation (ITTF) world rankings- న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) స్టార్ క్రీడాకారిణి మనిక బత్రా అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది. గురువారం విడుదల చేసిన మహిళల సింగిల్స్ తాజా ర్యాంకింగ్స్‌లో మనిక మూడు స్థానాలు ఎగబాకి 33వ ర్యాంక్‌లో నిలిచింది. ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల మనిక గత నవంబర్‌లో ఆసియా కప్‌లో కాంస్యం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతవారం దోహా డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీలో కాంస్యం గెలిచి 140 ర్యాంకింగ్ పాయింట్లు సంపాదించింది. తెలంగాణకు చెందిన జాతీయ చాంపియన్ ఆకుల శ్రీజ ఆరు స్థానాలు పడిపోయి 79వ ర్యాంక్‌కు చేరుకుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో సత్యన్ జ్ఞానశేఖరన్ 41వ ర్యాంక్‌లో, ఆచంట శరత్ కమల్ 46వ ర్యాంక్‌లో ఉన్నారు. తెలంగాణకు చెందిన సూరావజ్జుల స్నేహిత్ మూడు స్థానాలు పడిపోయి 125వ ర్యాంక్‌లో నిలిచాడు. చదవండి: Rajat Patidar: అలా అయితే ఇషాన్ కూడా రాంచీలో నన్ను ఆడించు అంటాడు! కానీ.. Ind Vs NZ: రాంచిలో మ్యాచ్ అంటే అంతే! టాస్ గెలిస్తే... -
ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్ పోటీలకు శ్రీజ అర్హత
World Table Tennis Championships: దక్షిణాఫ్రికాలో ఈ ఏడాది మే నెలలో జరిగే ప్రతిష్టాత్మక ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ పోటీలకు మహిళల సింగిల్స్ విభాగంలో జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ, మనిక బత్రా అర్హత పొందారు. దోహాలో జరుగుతున్న ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీలో వీరిద్దరు ప్రిక్వార్టర్ ఫైనల్ చేరి ఈ బెర్త్‌లు ఖరారు చేసుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో ఆచంట శరత్ కమల్... పురుషుల డబుల్స్‌లో శరత్ కమల్–సత్యన్.. మిక్స్డ్ డబుల్స్‌లో మనిక బత్రా–సత్యన్ కూడా ఈ మెగా ఈవెంట్‌కు అర్హత పొందారు. ఇది కూడా చదవండి: బోపన్న, రామ్‌కుమార్ జోడీలు ఓటమి అడిలైడ్ ఓపెన్ ఇంటర్నేషనల్–2 ఏటీపీ టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)... రామ్‌కుమార్ (భారత్)–రేయస్ వరేలా (మెక్సికో) జోడీలు ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాయి. బుధవారం జరిగిన మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ బోపన్న–ఎబ్డెన్ 6–7 (4/7), 5–7తో నికొలస్ మహుట్ (ఫ్రాన్స్)–టిమ్ ప్యూయెట్జ్ (జర్మనీ) చేతిలో... రామ్–వరేలా 3–6, 4–6తో అరెవాలో (ఎల్ సాల్వడోర్)–రోజర్ (నెదర్లాండ్స్) చేతిలో ఓటమి పాలయ్యారు. చదవండి: Ind Vs NZ- Uppal: హైదరాబాద్‌లో వన్డే.. టికెట్ల ధరలు, పూర్తి వివరాలు! ఒక్కొక్కరికి ఎన్ని? శ్రీలంకతో రెండో వన్డే.. సూర్యకుమార్, ఇషాన్ కిషన్‌లకు ఛాన్స్.. ఎవరిపై వేటు..? -
National Games 2022: రెండు రజత పతకాలు నెగ్గిన ఆకుల శ్రీజ
జాతీయ క్రీడల టేబుల్ టెన్నిస్ (టీటీ) ఈవెంట్లో తెలంగాణ క్రీడాకారిణి, జాతీయ చాంపియన్ ఆకుల శ్రీజ మెరిసింది. గుజరాత్‌లోని సూరత్‌లో శనివారం టీటీ ఈవెంట్ ముగిసింది. ఈ పోటీల్లో శ్రీజ మహిళల సింగిల్స్‌లో రజతం... మిక్స్డ్ డబుల్స్‌లో తెలంగాణకే చెందిన స్నేహిత్‌తో కలిసి రజతం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో శ్రీజ–స్నేహిత్ (తెలంగాణ) ద్వయం 8–11, 5–11, 6–11తో మనుష్ ఉత్పల్ షా–కృత్విక సిన్హా రాయ్ (గుజరాత్) జోడీ చేతిలో ఓడిపోయింది. అనంతరం జరిగిన సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 8–11, 7–11, 8–11, 14–12, 9–11తో సుతీర్థ ముఖర్జీ (బెంగాల్) చేతిలో ఓటమి పాలైంది. జాతీయ క్రీడలు అధికారికంగా ఈనెల 29 నుంచి మొదలుకానున్నాయి. అయితే ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్‌లో భారత జట్లు పాల్గొనాల్సి ఉండటంతో ముందుగానే టీటీ ఈవెంట్‌ను నిర్వహించారు. -
కామన్ వెల్త్ గేమ్స్ టీటీలో స్వర్ణం గెలిచిన ఆకుల శ్రీజ
-
శ్రీజ ‘డబుల్’ ధమాకా
షిల్లాంగ్ (మేఘాలయ): కొన్నేళ్లుగా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న తెలంగాణ టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారిణి ఆకుల శ్రీజ అందని ద్రాక్షగా ఉన్న జాతీయ సీనియర్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఎట్టకేలకు అందుకుంది. అంతేకాకుండా మహిళల డబుల్స్ విభాగంలోనూ విజేతగా నిలిచి ‘డబుల్’ సాధించింది. గత ఏడాది సింగిల్స్‌లో కాంస్య పతకంతో సంతృప్తి పడ్డ 23 ఏళ్ల శ్రీజ ఈసారి చాంపియన్‌గా అవతరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హైదరాబాద్ బ్రాంచ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న శ్రీజ ఈ మెగా ఈవెంట్లో ఆర్బీఐ తరఫున బరిలోకి దిగింది. సోమవారం సాయంత్రం జరిగిన సింగిల్స్ ఫైనల్లో ఆకుల శ్రీజ 11–8, 11–13, 12–10, 11–8, 11–6తో భారత సీనియర్ స్టార్ ప్లేయర్, మౌమా దాస్‌పై విజయం సాధించింది. బెంగాల్‌కు చెందిన 38 ఏళ్ల మౌమా దాస్ ఐదుసార్లు జాతీయ సింగిల్స్ చాంపియన్‌గా నిలువడంతోపాటు అత్యధికంగా 17 సార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పోటీపడ్డ భారత, ఆసియా ప్లేయర్‌గా గుర్తింపు పొంది ంది. సెమీఫైనల్లో శ్రీజ 12–10, 8–11, 11–8, 11–9, 3–11, 12–10తో అహిక ముఖర్జీ (ఆర్బీఐ) పై నెగ్గింది. అంతకుముందు జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో శ్రీజ–అహిక ముఖర్జీ (ఆర్బీఐ) ద్వయం 3–11, 11–9, 11–5, 12–10తో రైల్వేస్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్ఎస్పీబీ)కు చెందిన టకేమి సర్కార్–ప్రాప్తి సేన్ జోడీపై గెలిచింది. తాజా విజయంతో శ్రీజ జాతీయ సీనియర్ టీటీ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన తొలి తెలంగాణ ప్లేయర్‌గా ఘనత వహించింది. గతంలో హైదరాబాద్‌కు చెందిన సయీద్ సుల్తానా ఆరుసార్లు (1949, 1950, 1951, 1952, 1953, 1955) జాతీయ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా నిలిచింది. అయితే సుల్తానా కుటుంబం 1956లో హైదరాబాద్ నుంచి పాకిస్తాన్‌కు వలస వెళ్లి అక్కడే స్థిర పడింది. పురుషుల సింగిల్స్ విభాగంలో హైదరా బాద్‌కు చెందిన మీర్ ఖాసిమ్ అలీ రెండుసార్లు (1968, 1969) చాంపియన్‌గా నిలిచారు. నా కల నిజమైంది... గతంలో మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో జాతీయ టైటిల్స్ సాధించాను. కానీ సింగిల్స్ విభాగంలో తొలిసారి జాతీయ చాంపియన్ కావడంతో నా చిరకాల స్వప్నం నెరవేరింది. తాజా విజయం త్వరలో మొదలయ్యే అంతర్జాతీయ సీజన్ లో మరింత మెరుగ్గా రాణించేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. –‘సాక్షి’తో ఆకుల శ్రీజ -
శ్రీజ జోడీకి కాంస్యం
మస్కట్ (ఒమన్): ప్రపంచ టేబుల్ టెన్నిస్ మస్కట్ కంటెండర్ టోర్నీలో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మహిళల డబుల్స్‌లో కాంస్య పతకం నెగ్గింది. సెమీఫైనల్లో శ్రీజ–సెలీనా (భారత్) జంట 4–11, 6–11, 10–12తో సుతీర్థ–అహిక (భారత్) ద్వయం చేతిలో ఓడింది. ఫైనల్లో సుతీర్థ–అహిక జోడీ 6–11, 11–8, 10– 12, 7–11తో జాంగ్ రుయ్–కుయ్ మాన్ (చైనా) జంట చేతిలో ఓడి రజతం దక్కించుకుంది. -
మెయిన్ ‘డ్రా’కు శ్రీజ
మస్కట్ (ఒమన్): ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ మస్కట్ ఓపెన్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి ఆకుల శ్రీజ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ మూడో రౌండ్ మ్యాచ్‌లో శ్రీజ 3–11, 11–7, 12–10, 9–11, 12–10తో హుయ్ జింగ్ యాంగ్ (చైనా)పై గెలిచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉద్యోగి అయిన 23 ఏళ్ల శ్రీజ తొలి రౌండ్లో 11–4, 11–6, 11–8తో జాంగ్ వాన్లింగ్ (సింగపూర్) పై, రెండో రౌండ్లో 11–6, 11–4, 11–5తో ఇవా జుర్కోవా (స్లొవేకియా)పై నెగ్గింది. చదవండి: T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ జట్టులో హార్దిక్ పాండ్యా.. స్టార్ బౌలర్‌కు నో ఛాన్స్! -
యోధాస్ జట్టులో శ్రీజ
ముంబై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్‌లో పాల్గొనే ఆయా జట్ల ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. జూన్‌లో జరిగే ఈ లీగ్‌లో హైదరాబాద్ అమ్మాయి ఆకుల శ్రీజ యోధాస్ జట్టులో చోటు దక్కించుకుంది. ఇదే జట్టులో ఎనిమిదిసార్లు జాతీయ చాంపియన్, కామన్వెల్త్ గేమ్స్‌లో మూడు స్వర్ణాలు నెగ్గిన భారత స్టార్ ఆచంట శరత్ కమల్ కూడా ఉన్నాడు. యూటీటీ రెండో సీజన్ జూన్ 14న పుణేలో మొదలవుతుంది. దబంగ్ స్మాషర్స్, ఫాల్క న్స్, మహారాష్ట్ర యునైటెడ్, ఆర్పీ–ఎస్జీ మావెరిర్స్, యోధాస్ జట్లు ఈ లీగ్ బరిలో ఉన్నాయి. 19న పుణేలో తొలి అంచె ముగిశాక... జూన్ 20 నుంచి 25 వరకు ఢిల్లీ్లలో రెండో అంచె పోటీలు జరుగుతాయి. చివరిదైన మూడో అంచె మ్యాచ్‌లకు జూన్ 26 నుంచి జూలై 1 వరకు కోల్‌కతా ఆతిథ్యం ఇస్తుంది. -
శ్రీజకు స్వర్ణ, రజతాలు
ముంబై: ఇండియన్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ ప్యాడ్లర్లు మెరిశారు. ఆదివారం ఇక్కడ ముగిసిన ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, నైనా జైస్వాల్ సత్తా చాటారు. పోటీల చివరి రోజు క్యాడెట్ (బాలికలు) వ్యక్తిగత విభాగంలో శ్రీజ స్వర్ణం, రజతం సాధించగా... నైనా రజత పతకం గెల్చుకుంది. నాలుగు రోజుల క్రితం జరిగిన టీమ్ ఈవెంట్లో కూడా శ్రీజ, నైనా చెరో రజతం గెలుచుకున్నారు. జూనియర్ బాలికల వ్యక్తిగత కన్సొలేషన్ విభాగంలోనూ శ్రీజ విజయం సాధించడం విశేషం. క్యాడెట్ బాలికల డబుల్స్‌లో ఆకుల శ్రీజ-హర్షవర్ధిని జోడికి స్వర్ణం దక్కింది. ఫైనల్లో ఈ జంట 12-10, 11-8, 11-4 స్కోరుతో నైనా జైస్వాల్-శృతి అమృతేపై విజయం సాధించింది. ఈ ఫలితంతో నైనా ఖాతాలో రజతం చేరింది. వ్యక్తిగత విభాగంలో మాత్రం శ్రీజ రజతం గెలుచుకుంది. ఫైనల్లో సాగరిక ముఖర్జీ (భారత్) 13-11, 11-13, 11-8, 17-19, 11-9 తేడాతో శ్రీజను ఓడించింది. కీలకమైన ఐదో గేమ్‌లో శ్రీజ ఒక దశలో 7-4తో ఆధిక్యంలో నిలిచింది. అయితే సాగరిక వరుసగా ఐదు పాయింట్లతో 9-7కు చేరింది. ఆ తర్వాత మరో రెండు పాయింట్లతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. జూనియర్ బాలికల కన్సొలేషన్ ఈవెంట్ ఫైనల్లో శ్రీజ, తన సహచరిణి నైనా జైస్వాల్‌ను 12-10, 11-7, 12-14, 10-12, 13-11తో ఓడించి విజేతగా నిలిచింది.