న్యూఢిల్లీ: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ర్యాంకింగ్స్‌లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో 25 ఏళ్ల శ్రీజ ఏడు స్థానాలు ఎగబాకి 40వ ర్యాంక్‌కు చేరుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)లో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీజ గత వారం లెబనాన్‌లో జరిగిన వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) రెండు టోర్నీల్లో రాణించింది.
తొలి టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన ఆమె రెండో టోర్నీలో విజేతగా నిలిచింది. మనిక బత్రా 38వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. మే 16వ తేదీ వరకు భారత టాప్–2 ర్యాంకర్లకు పారిస్ ఒలింపిక్స్‌లో సింగిల్స్ విభాగంలో పోటీపడే అవకాశం లభిస్తుంది.
మరోవైపు పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ఆచంట శరత్ కమల్ 35వ ర్యాంక్‌లో ఉండగా... సత్యన్ జ్ఞానశేఖరన్ 43 స్థానాలు ఎగబాకి 60వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. తెలంగాణ ప్లేయర్ స్నేహిత్ 22 స్థానాలు పురోగతి సాధించి 144వ ర్యాంక్‌లో నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment