
న్యూఢిల్లీ: ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్లు ఖరారయ్యాయి. పురుషుల జట్టుకు వెటరన్ స్టార్ ఆచంట శరత్ కమల్, మహిళల జట్టుకు సీనియర్ మనిక బత్రా కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఈ టోర్నీ కజకిస్తాన్ రాజధాని అస్తానాలో వచ్చే నెల 7 నుంచి 13 వరకు జరుగుతుంది.
ఇది ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌నకు క్వాలిఫయింగ్ టోర్నీ కావడంతో ఐదుసార్లు ఒలింపిక్స్ క్రీడల్లో పోటీపడ్డ 42 ఏళ్ల శరత్ సహా అనుభవజ్ఞులైన హర్మీత్ దేశాయ్, సత్యన్ తదితరులతో భారత్ పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగనుంది.
ఇక పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నాక విశ్రాంతి తీసుకుంటున్న తెలంగాణ స్టార్, భారత నంబర్‌వన్ ఆకుల శ్రీజ ఈ టోర్నీతో మళ్లీ బరిలోకి దిగనునంది. ప్రస్తుతం జరుగుతున్న అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్‌లో శ్రీజ పాల్గొనడం లేదు.
జట్ల వివరాలు
మహిళల జట్టు: మనిక బత్రా (కెప్టెన్), ఆకుల శ్రీజ, ఐహిక ముఖర్జీ, దియా చిటాలే, సుతీర్థ ముఖర్జీ, రిజర్వ్ ప్లేయర్లు: యశస్విని, పాయ్‌మంటీ బైస్య.
ఫురుషుల జట్టు: శరత్ కమల్ (కెప్టెన్), మానవ్ ఠక్కర్, హర్మీత్ దేశాయ్, సత్యన్, మనుశ్ షా,
రిజర్వ్ ప్లేయర్లు: స్నేహిత్, జీత్‌చంద్ర.
Comments
Please login to add a commentAdd a comment