Table tennis championship
-
భారత టీటీ జట్ల కెప్టెన్లుగా మనిక, శరత్ కమల్
న్యూఢిల్లీ: ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్లు ఖరారయ్యాయి. పురుషుల జట్టుకు వెటరన్ స్టార్ ఆచంట శరత్ కమల్, మహిళల జట్టుకు సీనియర్ మనిక బత్రా కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఈ టోర్నీ కజకిస్తాన్ రాజధాని అస్తానాలో వచ్చే నెల 7 నుంచి 13 వరకు జరుగుతుంది. ఇది ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌నకు క్వాలిఫయింగ్ టోర్నీ కావడంతో ఐదుసార్లు ఒలింపిక్స్ క్రీడల్లో పోటీపడ్డ 42 ఏళ్ల శరత్ సహా అనుభవజ్ఞులైన హర్మీత్ దేశాయ్, సత్యన్ తదితరులతో భారత్ పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగనుంది.ఇక పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నాక విశ్రాంతి తీసుకుంటున్న తెలంగాణ స్టార్, భారత నంబర్‌వన్ ఆకుల శ్రీజ ఈ టోర్నీతో మళ్లీ బరిలోకి దిగనునంది. ప్రస్తుతం జరుగుతున్న అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్‌లో శ్రీజ పాల్గొనడం లేదు. జట్ల వివరాలు మహిళల జట్టు: మనిక బత్రా (కెప్టెన్), ఆకుల శ్రీజ, ఐహిక ముఖర్జీ, దియా చిటాలే, సుతీర్థ ముఖర్జీ, రిజర్వ్ ప్లేయర్లు: యశస్విని, పాయ్‌మంటీ బైస్య. ఫురుషుల జట్టు: శరత్ కమల్ (కెప్టెన్), మానవ్ ఠక్కర్, హర్మీత్ దేశాయ్, సత్యన్, మనుశ్ షా, రిజర్వ్ ప్లేయర్లు: స్నేహిత్, జీత్‌చంద్ర. -
శ్రీజకు నిరాశ
ప్యాంగ్‌చాంగ్ (దక్షిణ కొరియా): ఆసియా టేబుల్ టెన్నిస్ చాంపియన్ర్నీప్లో జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ విభాగాల్లో రెండో రౌండ్‌ను దాటలేకపోయింది. సింగిల్స్ రెండో రౌండ్లో శ్రీజ 5–11, 6–11, 9–11తో ఇటో మిమా (జపాన్) చేతి లో ఓడిపోయింది. డబుల్స్‌లో తొలి రౌండ్లో ‘బై’ పొందిన శ్రీజ–దియా (భారత్) జోడీ రెండో రౌండ్ లో 7–11, 6–11, 6–11తో సన్ యింగ్షా–వాంగ్ యిది (చైనా) జంట చేతిలో ఓటమి పాలైంది. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో శ్రీజ–హరీ్మత్ జోడీ 6–11, 7–11, 8–11తో తొమోకాజు–హినా హయాటా (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. -
భారత టీటీ జట్టుకు పతకం ఖాయం
ప్యాంగ్‌చాంగ్ (దక్షిణ కొరియా): ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు 3–0తో సింగపూర్ జట్టును ఓడించింది. భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్లో 0–3తో జపాన్ చేతిలో ఓడిపోయింది. సింగపూర్‌తో తొలి మ్యాచ్‌లో 41 ఏళ్ల ఆచంట శరత్ కమల్ 11–1, 10–12, 11–8, 11–13, 14–12తో ఇజాక్ క్వెక్‌పై నెగ్గగా... రెండో మ్యాచ్‌లో సత్యన్ జ్ఞానశేఖరన్ 11–6, 11–8, 12–10తో యె ఎన్ కొయెన్ పాంగ్‌ను ఓడించాడు. దాంతో భారత్ 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో మ్యాచ్‌లో హరీ్మత్ దేశాయ్ 11–9, 11–4, 11–6తో జె యు క్లారెన్స్ చ్యూపై గెలవడంతో భారత్ 3–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. బుధవారం జరిగే సెమీఫైనల్స్‌లో చైనీస్ తైపీతో భారత్; దక్షిణ కొరియాతో చైనా తలపడతాయి. చదవండి: World Cup 2023: నేడు భారత ప్రపంచకప్ జట్టు ప్రకటన.. ఎవరూ ఊహించని ఆటగాడి ఎంట్రీ! -
World TT Championship: మనిక శుభారంభం
డర్బన్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ మనిక బత్రా శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి రౌండ్లో మనిక 11–1, 11–3, 11–2, 11–5తో లిండా లోగ్రైబి (అల్జీరియా)పై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. పురుషుల సింగిల్స్‌లో ఆచంట శరత్ కమల్, సత్యన్ జ్ఞానశేఖరన్ కూడా రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్లో శరత్ కమల్ 11–8, 9–11, 11–9, 11–6, 11–6తో డేవిడ్ సెర్డారోగ్లు (ఆస్ట్రియా)పై నెగ్గగా... సత్యన్ 11–9, 11–8, 7–11, 11–2, 13–15, 11–13, 11–6తో టామ్ జార్విస్ (ఇంగ్లండ్)ను ఓడించాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో శరత్ కమల్–సత్యన్ ద్వయం 11–6, 11–9, 11–6తో ఎల్బెలీ–షౌమన్ (ఈజిప్ట్) జోడీపై విజయం సాధించింది. -
మనిక బాత్రా సంచలనం
బ్యాంకాక్: ఐటీటీఎఫ్–ఏటీటీయూ ఆసియాన్ కప్‌లో భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనిక బాత్రా సంచలన విజయంతో క్వార్టర్స్ చేరింది. ఈ క్రీడలో ‘పవర్ హౌజ్’ అయిన చైనాకు చెందిన ప్రపంచ ఏడో ర్యాంకర్ చెన్ జింగ్టాంగ్ను కంగు తినిపించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 44వ ర్యాంకర్ మనిక 4–3 (8–11, 11–9, 11–6, 11–6, 9–11, 8–11, 11–9)తో తనకన్నా ఎన్నో రెట్లు మెరుగైన ర్యాంకింగ్ ప్లేయర్ జింగ్టాంగ్ను ఇంటిదారి పట్టించింది. చదవండి: Indian Racing League: రెడీ టూ రైడ్.. ఇండియన్ రేసింగ్ లీగ్‌కు సర్వం సిద్దం -
టేబుల్ టెన్నిస్ చాంపియన్ శ్రీజకు కేటీఆర్ అభినందన
సాక్షి, హైదరాబాద్: జాతీయ మహిళా చాంపియన్‌షిప్ సాధించిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ, కోచ్ సోమ్‌నాథ్ ఘోష్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు. రాష్ట్రం నుంచి తొలిసారిగా ఈ ఘనత సాధించిన శ్రీజ, బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ సందర్భంగా క్రీడాకారిణి శ్రీజ, కోచ్‌లు మంత్రి కేటీఆర్‌ను ప్రగతి భవన్లో సోమవారం కలిశారు. ప్రయాణం, క్రీడా సామ గ్రికి ఆర్థిక సాయంతో పాటు ఇతర సహ కారం కూడా అందిస్తామని వారికి భరోసా ఇచ్చా రు. కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ప్రభుత్వ చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ ఆత్మకూరి అమర్నాథ్రెడ్డి, రాష్ట్ర టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి ప్రకాశ్‌రాజు ఉన్నారు. -
పాయస్ జైన్‌కు పతకం ఖాయం
ప్రపంచ యూత్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో పతకం ఖరారైంది. పోర్చుగల్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో అండర్–19 బాలుర సింగిల్స్‌లో భారత ప్లేయర్ పాయస్ జైన్ సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో పాయస్ జైన్ 11–9, 11–8, 11–8, 8–11, 11–4తో నవీద్ షమ్స్ (ఇరాన్)పై గెలిచాడు. అండర్–15 బాలికల డబుల్స్‌లో సుహానా సైనీ (భారత్)–వెరోనికా (ఉక్రెయిన్) జంట సెమీఫైనల్లో ఓడి కాంస్యం దక్కించుకుంది. -
ఆకుల శ్రీజకు మిశ్రమ ఫలితాలు
ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. దోహాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో శ్రీజ మహిళల సింగిల్స్ విభాగంలో రెండో రౌండ్లోకి ప్రవేశించగా... డబుల్స్ విభాగంలో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉద్యోగి అయిన శ్రీజ సింగిల్స్ తొలి రౌండ్లో 11–4, 11–7, 12–10తో సితీ అమీనా (ఇండోనేసియా)పై విజయం సాధించింది. డబుల్స్ తొలి రౌండ్లో శ్రీజ–అర్చన కామత్ (భారత్) జోడీ 11–5, 11–3, 11–6తో సోనమ్ సుల్తానా–సాదియా (బంగ్లాదేశ్) జంటపై గెలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీజ–అర్చన ద్వయం 10–12, 7–11, 12–10, 13–15తో డు హై కెమ్–లీ హో చింగ్ (హాంకాంగ్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
మనిక బాత్రాకు షాకిచ్చిన టీటీఎఫ్ఐ
న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) స్టార్ ప్లేయర్ మనిక బాత్రాకు ఊహించని షాకిచ్చింది. భారత జట్టు నుంచి తప్పించింది. దోహాలో ఈ నెల 28 నుంచి జరగాల్సిన ఆసియా టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ కోసం ప్రకటించిన భారత జట్టులో అమెను ఎంపిక చేయలేదు. సోనెపట్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన జాతీయ శిక్షణ శిబిరానికి గైర్హాజరు కావడం వల్లే ఆమెపై వేటు వేసినట్లు టీటీఎఫ్ఐ వర్గాలు తెలిపాయి. 56వ ప్రపంచ ర్యాంకర్ మనికను తప్పించడంతో 97వ ర్యాంకర్ సుతీర్థ ముఖర్జీ మహిళల జట్టును నడిపించనుంది. ఈ జట్టులో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ, ఐహిక ముఖర్జీ (131వ ర్యాంకు), అర్చన కామత్ (132వ ర్యాంకు) ఉన్నారు. పురుషుల జట్టులో వెటరన్ శరత్ కమల్ (33వ రాం్యకర్), సత్యన్ (38), హరీ్మత్ దేశాయ్ (72), మానవ్ ఠక్కర్ (134), సానిల్ శెట్టి (247) ఎంపికయ్యారు. -
95 ఏళ్ల చరిత్ర.. అమెరికాలో తొలిసారిగా..
లుసాన్ (స్విట్జర్లాండ్): కరోనా వైరస్ కారణంగా గత ఏడాది దక్షిణ కొరియాలో జరగాల్సిన ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్ రద్దయింది. అయితే ఈ ఏడాది ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తామని అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ప్రకటించింది. అమెరికాలోని హ్యూస్టన్ నగరం ఈ ఏడాది నవంబర్ 23 నుంచి 29 వరకు ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్ పోటీలకు వేదికగా నిలుస్తుందని ఐటీటీఎఫ్ వెల్లడించింది. కాగా, 95 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్ పోటీలు అమెరికాలో జరగనుండటం ఇదే ప్రథమం. 1937లో అమెరికా ఏకైకసారి పురుషుల టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకం సాధించింది. ఆ తర్వాత అమెరికా మూడు కాంస్యాలు (1938, 1948, 1949), ఒక రజతం (1947) దక్కించుకుంది. 1949 తర్వాత అమెరికా మరోసారి టీమ్ చాంపియన్‌షిప్‌లో పతకాన్ని సాధించలేకపోయింది. -
స్నేహిత్‌కు మూడో స్థానం
సాక్షి, హైదరాబాద్: ఒమన్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ క్రీడాకారుడు సూరావజ్జుల స్నేహిత్ రాణించాడు. మస్కట్‌లో జరిగిన ఈ టోర్నీలో స్నేహిత్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. శనివారం జరిగిన అండర్–21 పురుషుల సెమీఫైనల్లో స్నేహిత్ పోరాడి ఓడిపోయాడు. ఈ మ్యాచ్‌లో స్నేహిత్ 11–7, 5–11, 8–11, 11–8, 12–14తో ప్రపంచ నంబర్‌వన్ మానవ్ ఠక్కర్ (భారత్) చేతిలో పరాజయం పాలయ్యాడు. అంతకుముందు క్వార్టర్స్ మ్యాచ్‌లో స్నేహిత్ 11–6, 11–2, 13–11తో హజిన్ జెరెమీ (కెనడా)పై గెలుపొందాడు. సెమీస్‌లో ఓటమి పట్ల స్నేహిత్ నిరాశ వ్యక్తం చేశాడు. ‘ఈ గేమ్ కోసం పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యా. నా కోచ్ సోమనాథ్ ఘోష్‌తో కూడా చర్చించా. కానీ అద్భుత ఫామ్‌లో ఉన్న మానవ్‌పై పైచేయి సాధించలేకపోయా. ఫైనల్ చేరే గొప్ప అవకాశం చేజార్చుకున్నా. కాస్త నిరాశగా ఉంది’ అని స్నేహిత్ అన్నాడు. పురుషుల విభాగంలో మెయిన్‌డ్రాకు అర్హత పొందిన స్నేహిత్ తొలి రౌండ్లోనే 2–4తో చెయ్ హి యు క్లారెన్స్ (సింగపూర్) చేతిలో ఓడిపోయాడు. -
తెలంగాణ పురుషుల జట్టుకు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ పురుషుల జట్టు కాంస్యాన్ని సాధించింది. సరూర్‌నగర్ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో తెలంగాణ సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్యంతో సరిపెట్టుకుంది. బుధవారం సెమీస్ మ్యాచ్‌లో పీఎస్‌పీబీ 3–0తో తెలంగాణపై గెలుపొందింది. మొదట మ్యాచ్‌లో శరత్ కమల్ (పీఎస్‌పీబీ) 3–1తో ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ (తెలంగాణ)పై, రెండో మ్యాచ్‌లో సతియాన్ (పీఎస్‌పీబీ) 3–0తో అమన్‌పై, హర్మీత్ దేశాయ్ (పీఎస్‌పీబీ) 3–0తో మొహమ్మద్ అలీపై గెలుపొందడంతో పీఎస్‌పీబీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అంతకుముందు క్వార్టర్స్ మ్యాచ్‌లో తెలంగాణ 3–1తో తమిళనాడు జట్టుపై గెలుపొంది సెమీస్‌కు చేరుకుంది. తొలి మ్యాచ్‌లో స్నేహిత్ (తెలంగాణ) 3–0తో ప్రభాకరన్‌పై గెలుపొందగా... రెండో మ్యాచ్‌లో మొహమ్మద్ అలీ (తెలంగాణ) 1–3తో నితిన్ చేతిలో ఓడిపోయాడు. తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అమన్ (తెలంగాణ) 3–2తో నిఖిల్‌పై, స్నేహిత్ 3–1తో నితిన్‌పై గెలుపొంది జట్టుకు విజయాన్నందించారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో పతకం సాధించిన తెలంగాణ పురుషుల జట్టును తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ సంఘం అధ్యక్షుడు ఎ. నరసింహా రెడ్డి అభినందించారు. -
ప్రపంచ నంబర్‌వన్‌గా మానవ్ ఠక్కర్
న్యూఢిల్లీ: భారత యువ టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారుడు మానవ్ ఠక్కర్ అండర్–21 పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించాడు. గత నెలలో జరిగిన నార్త్ అమెరికా ఓపెన్ టోర్నీలో మానవ్ విజేతగా నిలిచాడు. దాంతో అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) శుక్రవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో మానవ్ తొమ్మిది స్థానాలు ఎగబాకి టాప్ ర్యాంక్‌ను అధిరోహించాడు. గతంలో భారత్ తరఫున అండర్–21 విభాగంలో హర్మీత్ దేశాయ్, సత్యన్, సౌమ్యజిత్ ఘోష్ ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచారు. -
సత్యన్ సంచలనం
చెంగ్డూ (చైనా): పురుషుల ప్రపంచకప్‌లో భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) ఆటగాడు సత్యన్ జ్ఞానశేఖరన్ అద్భుతం చేశాడు. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) మెగా ఈవెంట్లో అతను ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. గ్రూప్ ‘డి’లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ తనకంటే మెరుగైన ర్యాంకు ఉన్న ఆటగాళ్లను కంగుతినిపించాడు. తొలి ప్రపంచకప్ ఆడుతున్న ప్రపంచ 30వ ర్యాంకర్ సత్యన్ తొలి మ్యాచ్‌లో 4–3 (11–13, 9–11, 11–8, 14–12, 7–11, 11–5, 11–8)తో 22వ ర్యాంకర్ సైమన్ గాజీ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. అనంతరం రెండో మ్యాచ్‌లో 26 ఏళ్ల ఈ చెన్నై ప్లేయర్ 4–2 (11–3, 12–10, 7–11, 16–14, 8–11, 11–8)తో డెన్మార్క్‌కు చెందిన ప్రపంచ 24వ ర్యాంకర్ గ్రోత్ జొనథన్‌ను ఇంటిదారి పట్టించాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 8వ ర్యాంకర్, గత రెండు ప్రపంచకప్‌లలో రన్నరప్‌గా నిలిచిన టిమో బోల్ (జర్మనీ)తో సత్యన్ తలపడతాడు. -
విజేతలు స్నేహిత్, ప్రణీత, జతిన్ దేవ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్టాగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ (జీటీటీఏ), జి. ప్రణీత (హెచ్‌వీఎస్) సత్తా చాటారు. బండ్లగూడలోని మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వేదికగా జరిగిన ఈ టోరీ్నలో వీరిద్దరూ పురుషులు, మహిళల విభాగాల్లో విజేతలుగా నిలిచి టైటిళ్లను హస్తగతం చేసుకున్నారు. బుధవారం పురుషుల ఫైనల్లో స్నేహిత్ 11–0, 11–7, 6–11, 12–10, 6–11, 11–6తో అమన్ (సీఆర్‌ఎస్‌సీబీ)పై గెలుపొందాడు. మహిళల టైటిల్‌పోరులో ప్రణీత 11–7, 11–4, 14–12, 7–11, 8–11, 8–11, 11–7తో వరుణి జైస్వాల్ (జీఎస్ఎం)ను ఓడించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో వరుణి జైస్వాల్ 11–9, 11–9, 13–11, 11–7తో మోనిక (జీఎస్ఎం)పై, ప్రణీత (హెచ్‌వీఎస్) 11–7, 11–13, 11–9, 6–11, 12–10, 11–7తో నైనా జైస్వాల్ (ఎల్బీఎస్)పై, బి. అమన్ 11–5, 11–6, 6–11, 15–13, 11–5తో అమాన్ ఉర్ రహమాన్ (ఏవీఎస్‌సీ)పై, స్నేహిత్ 11–4, 11–1, 8–11, 11–5, 11–8తో సరోజ్ సిరిల్‌పై గెలుపొందారు. క్యాడెట్ విభాగంలో జతిన్‌దేవ్ (ఎస్పీహెచ్ఎస్), శ్రీయ (ఏడబ్ల్యూఏ) చాంపియన్లుగా నిలిచారు. ఫైనల్ మ్యాచ్‌ల్లో జతిన్ దేవ్ 6–11, 5–11, 11–8, 13–11, 11–4, 11–8తో ఆరుశ్ (ఏపీజీ)పై గెలుపొందగా... శ్రీయ 11–9, 11–4, 11–8, 11–8తో పి. జలాని (వీపీజీ)ని ఓడించింది. సబ్ జూనియర్ బాలుర ఫైనల్లో జషన్ సాయి (ఎంఎల్ఆర్) 11–3, 4–11, 11–3, 11–7, 11–9తో త్రిశూల్ మెహ్రా (ఎల్బీఎస్)పై నెగ్గాడు. బాలికల తుదిపోరులో గౌరి (ఎంఎల్ఆర్) 5–11, 7–11, 14–12, 13–11, 9–11, 11–4, 11–8తో పూజ (ఏడబ్ల్యూఏ)ను ఓడించింది. జూనియర్ కేటగిరీలో కేశవన్ కన్నన్ (ఎంఎల్ఆర్), ఎన్. భవిత విజేతలుగా నిలిచారు. ఫైనల్లో కేశవన్ M 7–11, 7–11, 12–10, 11–7, 8–11, 11–4, 11–4తో ప్రణవ్ నల్లారి (ఏడబ్ల్యూఏ)పై, భవిత 11–3, 15–17, 11–9, 11–8, 11–13, 9–11, 11–5తో కీర్తన (హెచ్‌వీఎస్)పై గెలిచారు. యూత్ బాలుర ఫైనల్లో మొహమ్మద్ అలీ (ఎల్బీఎస్) 11–9, 5–11, 11–8, 11–3, 11–9తో స్నేహిత్‌పై గెలుపొందగా... బాలికల తుదిపోరులో రాగ నివేదిత 6–11, 4–11, 11–9, 11–9, 11–8, 9–11, 12–10తో నైనా జైస్వాల్ (ఎల్బీఎస్)ను ఓడించింది. -
క్వార్టర్స్‌లో పూజ, జతిన్‌దేవ్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: అనంత నారాయణ రెడ్డి, రామేశ్వరమ్మ స్మారక స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ సబ్ జూనియర్ బాలికల విభాగంలో పూజ (ఏడబ్ల్యూఏ), క్యాడెట్ బాలుర విభాగంలో జతిన్‌దేవ్ (ఎస్పీహెచ్ఎస్) సెమీఫైనల్‌కు చేరుకున్నారు. ఖైరతాబాద్‌లోని ఏడబ్ల్యూఏ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా గురువా రం జరిగిన సబ్ జూనియర్ బాలికల క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో పూజ 3–2తో అనన్య డోనెకల్ (జీఎస్ఎం)పై గెలుపొందగా, పలక్ 3–0తో హెచ్ఎస్ నిఖిత (వీపీజీ)ని ఓడించింది. కావ్య (ఏడబ్ల్యూఏ) 3–0తో నందిని (వీపీజీ)పై, మెర్సీ (హెచ్‌వీఎస్) 3–2తో అఫీఫా ఫాతిమాపై గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టారు. క్యాడెట్ బాలుర క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో జతిన్‌దేవ్ 3–0తో తరుణ్ ముకేశ్ (ఆర్‌టీటీఏ)పై, ధ్రువ్ సాగర్ (జీఎస్ఎం) 3–1తో తరుణ్ (జీఎస్ఎం)పై, ఆరుశ్ (ఏపీజీ) 3–0తో అక్షయ్ (ఏడబ్ల్యూఏ)పై, చిరంథన్ 3–1తో శ్రీహాన్ (ఏడబ్ల్యూఏ)పై నెగ్గారు. క్యాడె ట్ బాలికల క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో శ్రేయ 3–1తో వత్సల (హెచ్‌పీఎస్)పై, ప్రజ్ఞాన్ష 3–0తో తేజస్విని (ఏడబ్ల్యూఏ)పై, శ్రీయ 3–0తో శరణ్య (హెచ్‌పీఎస్)పై, జలాని 3–1తో శ్రేష్టా(జీఎస్ఎం)పై నెగ్గారు. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు యూత్ బాలికల క్వార్టర్స్: రాగ నివేదిత 4–2తో సృష్టిపై, వినిచిత్ర (జీఎస్ఎం) 4–2తో భవిత (జీఎస్ఎం)పై, ప్రణీత (హెచ్‌వీఎస్) 4–0తో కీర్తన పై, వరుణి (జీఎస్ఎం) 4–0తో ఇక్షిత (ఏడబ్ల్యూఏ)పై గెలుపొందారు. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్: లోహిత్ (ఏడబ్ల్యూఏ) 4–3తో దీపేశ్‌పై, సౌరభ్ 4–1తో మహేందర్‌పై, విశాల్ 4–1తో వివేక్‌పై, సాయి తేజేశ్ (ఏడబ్ల్యూఏ) 4–0తో ప్రజ్వల్ (హెచ్‌వీఎస్)పై, రాజు (ఏడబ్ల్యూఏ) 4–3తో శశి కిరణ్ (ఎంఎల్ఆర్)పై, వత్సిన్ 4–0తో దీపక్‌పై గెలిచారు. -
ఐదో స్థానమైనా అదే రికార్డు
యోగ్యకార్త: ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు ఐదో స్థానంలో నిలిచింది. ఈ టోర్నీ చరిత్రలో మనకిదే అత్యుత్తమం కావడం విశేషం. బుధవారం 5–6 స్థానాల కోసం ఇక్కడ జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 3–0తో హాంకాంగ్‌పై నెగ్గింది. దీంతోపాటు చాంపియన్స్ డివిజన్లో ఇరాన్‌ను 3–0తో ఓడించి స్వర్ణం గెల్చుకుంది. వర్గీకరణ మ్యాచ్‌లో తొలుత శరత్ కమల్ 9–11, 11–6, 7–11, 11–7, 11–7తో లామ్ స్యు హంగ్‌ను ఓడించాడు. రెండో మ్యాచ్‌లో అమల్ రాజ్ 9–11, 11–4, 11–6, 11–7 స్కోరుతో ఎన్జీ పాక్నమ్పై గెలిచాడు. మూడో దాంట్లో సత్యన్ 11–5, 11–13, 11–7, 14–12తో క్వాన్ మన్ హొపై నెగ్గాడు. దీంతో తదుపరి రెండు మ్యాచ్‌లు నిర్వహించాల్సిన అవసరం లేకుండానే భారత్ జయభేరి మోగించినట్లైంది. టీమ్ విభాగంలో సత్యన్ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలుపొందడం విశేషం. వ్యక్తిగత విభాగం పోటీలు గురువారం మొదలవుతాయి. -
క్వార్టర్స్‌లో రాగ నివేదిత, ప్రణీత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో బి. రాగ నివేదిత (జీటీటీఏ), జి. ప్రణీత (హెచ్‌వీఎస్) క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. ఆనంద్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో రాగ నివేదిత 4–3తో సృష్టి (ఏవీఎస్‌సీ)పై గెలుపొందగా... ప్రణీత 4–0తో ప్రాచీని ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో మోనిక (జీఎస్ఎం) 4–1తో ఇక్షిత (ఏడబ్ల్యూఏ)పై, వరుణి (జీఎస్ఎం) 4–0తో కీర్తనపై, భవిత (జీఎస్ఎం) 4–0తో వినిచిత్ర (జీఎస్ఎం)పై, లాస్య 4–0తో నిఖితపై, సస్య 4–1తో దియా వోరాపై గెలుపొంది క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. యూత్ బాలికల ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో రాగ నివేదిత 4–1తో సృష్టిపై, ప్రణీత 4–0తో నిఖిత (వైఎంసీఏఎక్స్‌టీటీఏ)పై, సస్య 4–0తో విధి జైన్‌పై, లాస్య 4–0తో కీర్తనపై, భవిత 4–1తో ఇక్షితపై, హనీఫా 4–1తో శరణ్యపై గెలుపొందారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాలానీ గ్రూప్ చైర్మన్, ఎండీ పురుషోత్తమ్ పోటీలను ప్రారంభించారు. -
కామన్వెల్త్లో టీటీ అంపైర్‌గా అజయ్
సాక్షి, హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఉద్యోగి, అంతర్జాతీయ అంపైర్ డి. అజయ్ కుమార్‌కు గొప్ప అవకాశం దక్కింది. కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో అజయ్ కుమార్ అంపైర్‌గా విధులు నిర్వర్తించనున్నారు. కటక్‌లోని జవహర్లాల్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 17 నుంచి 22 వరకు కామన్వెల్త్ టీటీ చాంపియన్‌షిప్ జరుగుతుంది. -
చాంప్స్ పలక్, జషన్ సాయి
సాక్షి, హైదరాబాద్: సెయింట్ పాల్స్ వార్షిక తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ ఇంటర్ స్కూల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో పలక్ (జీఎస్ఎం), జషన్ సాయి (ఎంఎల్ఆర్), శ్రీయ (ఏడబ్ల్యూఏ), జతిన్ దేవ్ (ఎస్పీహెచ్ఎస్) సత్తా చాటారు. హైదర్‌గూడలో జరుగుతోన్న ఈ టోర్నీ క్యాడెట్ విభాగంలో జతిన్ దేవ్, శ్రీయ... సబ్‌జూనియర్ విభాగంలో జషన్ సాయి, పలక్ విజేతలుగా నిలిచారు. ఆదివారం సబ్ జూనియర్ బాలుర ఫైనల్లో జషన్ సాయి 11–5, 12–10, 9–11, 11–5, 11–9తో త్రిశూల్ మెహ్రా (ఎల్బీ స్టేడియం)పై గెలుపొందగా... బాలికల కేటగిరీలో పలక్ 9–11, 11–6, 11–7, 11–9, 14–12తో అనన్య (జీఎస్ఎం)ను ఓడించింది. మరోవైపు క్యాడెట్ బాలుర టైటిల్ పోరులో జతిన్ దేవ్ 13–11, 11–6, 11–8, 11–5తో తరుణ్ ముకేశ్ (ఆర్‌టీటీఏ)పై, బాలికల ఫైనల్లో శ్రీయ 7–11, 12–14, 11–9, 6–11, 11–7, 11–9, 12–10తో ప్రజ్ఞాన్ష (వీపీజీ)పై గెలుపొందారు. జూనియర్ బాలికల విభాగంలో భవిత (జీఎస్ఎం) చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో భవిత 9–11, 11–6, 11–9, 11–5, 11–9తో పలక్ (జీఎస్ఎం)ను ఓడించింది. అంతకుముందు సెమీస్ మ్యాచ్‌ల్లో పలక్ 11–7, 11–5, 11–5, 11–7తో ఇక్షిత (ఏడబ్ల్యూఏ)పై, భవిత 11–9, 11–8, 11–9, 11–7తో విధి జైన్ (జీఎస్ఎం)పై గెలుపొందారు. బాలుర విభాగంలో కేశవన్ కన్నన్ (ఎంఎల్ఆర్), బి. వరుణ్ శంకర్ (జీటీటీఏ) ఫైనల్‌కు చేరుకున్నారు. సెమీస్ మ్యాచ్‌ల్లో కేశవన్ కన్నన్ 10–12, 11–7, 11–8, 5–11, 11–7, 11–6తో జషాన్ సాయి (ఎంఎల్ఆర్)పై, వరుణ్ శంకర్ 15–13, 11–9, 11–4, 8–11, 11–9తో ప్రణవ్ నల్లారి (ఏడబ్ల్యూఏ)పై నెగ్గారు. యూత్ బాలికల సెమీఫైనల్లో ప్రణీత (హెచ్‌వీఎస్) 11–2, 11–4, 11–6, 11–6తో విధి జైన్ (జీఎస్ఎం)పై గెలుపొందగా... వరుణి జైస్వాల్ (జీఎస్ఎం) 11–5, 11–13, 11–8, 7–11, 11–3, 11–7తో రాగ నివేదిత (జీటీటీఏ)ను ఓడించింది. యూత్ బాలుర విభాగంలో స్నేహిత్ (జీటీటీఏ), అరవింద్ (ఏడబ్ల్యూఏ), మొహ్మమద్ అలీ (ఎల్బీఎస్) సెమీఫైనల్లో అడుగుపెట్టారు. పురుషుల క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో స్నేహిత్ (జీటీటీఏ) 11–9, 11–5, 11–7, 8–11, 8–11, 11–13, 11–8తో వి. చంద్రచూడ్ (ఎంఎల్ఆర్)పై, అమన్ (సీఆర్‌ఎస్‌సీబీ) 11–3, 11–7, 11–9, 11–6తో అరవింద్ (ఏడబ్ల్యూఏ)పై, అమన్ రహమాన్ (ఏవీఎస్‌సీ)11–9, 11–6, 5–11, 11–6, 11–6తో వరుణ్ శంకర్ (జీటీటీఏ)పై, మొహమ్మద్ అలీ (ఎల్బీఎస్) 6–11, 12–10, 11–6, 11–8, 12–10తో సరోజ్ సిరిల్ (ఏడబ్ల్యూఏ)పై గెలుపొంది సెమీఫైనల్‌కు చేరుకున్నారు. మహిళల విభాగంలో మోనిక (జీఎస్ఎం), ప్రణీత (హెచ్‌వీఎస్), వరుణి జైస్వాల్ (జీఎస్ఎం), నిఖత్ బాను (ఆర్బీఐ) కూడా సెమీస్‌కు చేరుకున్నారు. -
శ్రీజకు క్రీడల మంత్రి అభినందన
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జాతీయ సీనియర్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తరఫున బరిలోకి దిగి మహిళల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచిన తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ శుక్రవారం రాష్ట్ర క్రీడల మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా శ్రీజను, ఆమె కోచ్ సోమ్‌నాథ్ ఘోష్‌ను అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
విజేతలు ప్రగ్యాన్ష, జతిన్‌దేవ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో జతిన్ దేవ్, ప్రగ్యాన్ష సత్తా చాటారు. బండ్లగూడలోని మహావీర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో క్యాడెట్ బాలబాలికల విభాగాల్లో వీరిద్దరూ విజేతలుగా నిలిచారు. సోమవారం జరిగిన క్యాడెట్ బాలుర ఫైనల్లో జతిన్ దేవ్ (ఎస్పీహెచ్ఎస్) 11–3, 11–3, 12–14, 11–2, 11–13 ,11–6తో ఎం. రిషభ్ సింగ్ (వైఎంసీఏఎక్స్‌టీటీఏ)పై గెలుపొందాడు. అంతకుముందు సెమీస్ మ్యాచ్‌ల్లో జతిన్ దేవ్ 14–12, 11–7, 11–6తో ధ్రువ్ సాగర్ (జీఎస్ఎం)పై, రిషభ్ సింగ్ 14–12, 10–12, 4–11, 11–9, 11–6తో శౌర్యరాజ్ సక్సేనా (ఏవీఎస్‌సీ)పై గెలుపొంది ఫైనల్‌కు చేరుకున్నారు. బాలికల టైటిల్ పోరులో పి. ప్రగ్యాన్ష (వీపీజీ) 11–5, 11–7, 7–11, 11–6, 11–7తో పి. జలాని (వీపీజీ)ని ఓడించి చాంపియన్‌గా నిలిచింది. సెమీస్ మ్యాచ్‌ల్లో ప్రగ్యాన్ష 11–6, 11–3, 11–6తో పి. సన్హిత (కేడబ్ల్యూఎస్ఏ)పై, జలాని (వీపీజీ) 8–11, 11–7, 11–4, 11–9తో శ్రేయ (జీఎస్ఎం)పై గెలుపొందారు. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు సబ్ జూనియర్ బాలుర క్వార్టర్స్: ఇషాంత్ (ఏడబ్ల్యూఏ) 3–1తో క్రిష్ మాల్పానీ (ఏడబ్ల్యూఏ)పై, ఆయుశ్ డాగా (ఏడబ్ల్యూఏ) 3–1తో రాజు (ఏడబ్ల్యూఏ)పై, త్రిశూల్ మెహ్రా (ఎల్బీఎస్) 3–1తో కరణ్ సప్తర్షి (ఎంఎల్ఆర్)పై, జషన్ సాయి (ఎంఎల్ఆర్) 3–0తో కె. వరుణ్ (జీఎస్ఎం)పై నెగ్గారు. బాలికలు: మెర్సీ (హెచ్‌వీఎస్) 3–1తో దేవీశ్రీ (ఎంఎల్ఆర్)పై, అనన్య (జీఎస్ఎం) 3–0తో పూజ (ఏడబ్ల్యూఏ)పై, పలక్ 3–1తో నందిని (వీపీజీ)పై, ఆశ్లేష సింగ్ (ఏడబ్ల్యూఏ) 3–2తో కావ్య (ఏడబ్ల్యూఏ)పై గెలిచారు. జూనియర్ బాలుర ప్రిక్వార్టర్స్: త్రిశూల్ (ఎల్బీఎస్) 3–0తో అనూప్ (ఎంఎల్ఆర్)పై, ప్రణవ్ నల్లారి (ఏడబ్ల్యూఏ) 3–1తో యశ్ గోయల్ (జీఎస్ఎం)పై, కార్తీక్ (ఏడబ్ల్యూఏ) 3–0తో క్రిష్ (ఎంఎల్ఆర్)పై, రఘురామ్ (నల్లగొండ) 3–1తో యశ్‌చంద్ర (పీఆర్ఓటీటీ)పై, జషాన్ సాయి (ఎంఎల్ఆర్) 3–1తో శ్రేయ (హెచ్‌వీఎస్)పై, శ్రీనాథ్ (ఎంఎల్ఆర్) 3–0తో ఇషాంత్ (ఏడబ్ల్యూఏ)పై, కేశవన్ (ఎంఎల్ఆర్) 3–0తో కమల్ (పీఆర్ఓటీటీ)పై, విశాల్ (జీఎస్ఎం) 3–0తో వరుణ్‌పై విజయం సాధించారు. బాలికలు: ఇక్షిత (ఏడబ్ల్యూఏ) 3–0తో అఫిఫా (వైఎంసీఏ)పై, ప్రియాన్షి (జీఎస్ఎం) 3–1తో పూజ (ఏడబ్ల్యూఏ)పై, విధి జైన్ (జీఎస్ఎం) 3–1తో కావ్య (ఏడబ్ల్యూఏ)పై, అనన్య (జీఎస్ఎం) 3–1తో శరణ్య (జీఎస్ఎం)పై, పలక్ (జీఎస్ఎం) 3–0తో తేజస్విని (నల్లగొండ)పై, మెర్సీ (హెచ్‌వీఎస్) 3–1తో నమ్రత (ఏడబ్ల్యూఏ)పై, దియా (హెచ్‌వీఎస్) 3–0తో కీర్తన (హెచ్‌వీఎస్)పై, భావిత (జీఎస్ఎం) 3–0తో నిఖిత (వీపీజీ)పై గెలుపొందారు. -
మనిక, సుతీర్థ ఓటమి
బుడాపెస్ట్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్ షిప్లో భారత స్టార్ ప్లేయర్ మనికా బత్రా పోరాటం ముగిసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 56వ ర్యాంకర్ మనిక 2–11, 8–11, 11–7, 7–11, 9–11తో ప్రపంచ 24వ ర్యాంకర్ చెన్ జు యు (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. గత ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం నెగ్గిన మనిక తొలి రౌండ్ మ్యాచ్‌లో 14–12, 11–5, 11–5, 11–8తో సెర్బియా క్రీడాకారిణి ఆండ్రియా టొడొరివిక్ను సునాయాసంగా ఓడించింది. భారత క్వాలిఫయర్, ప్రపంచ 502వ ర్యాంకర్ సుతీర్థ ముఖర్జీ 8–11, 17–15, 11–9, 5–11, 6–11, 11–8, 11–6తో ప్రపంచ 58వ ర్యాంకర్ సబైన్ వింటర్ (జర్మనీ)పై సంచలన విజయం సాధించింది. అయితే రెండో రౌండ్లో సుతీర్థ 11–4, 8–11, 11–7, 5–11, 3–11, 9–11తో అడ్రియానా దియాజ్ (ప్యూర్టోరికో) చేతిలో ఓడిపోయింది. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో అర్చన11–8, 11–8, 19–17, 8–11, 6–11, 7–11, 4–11తో దినా మెష్రెఫ్ (ఈజిప్ట్) చేతిలో, మధురికా 5–11, 11–9, 11–6, 8–11, 11–7, 13–11తో అమెలీ సొల్జా (ఆస్ట్రియా) చేతిలో పరాజయం పాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్ లో సత్యన్–అర్చన ద్వయం 11–9, 11–4, 11–8, 11–13, 11–9తో అల్వారో–గాలియా ద్వొరాక్ (స్పెయిన్) జోడీపై గెలిచి ప్రి క్వార్టర్స్‌కు చేరింది. -
నైనాకు రజతం, కాంస్యం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అమ్మాయి నైనా జైస్వాల్ జూనియర్, యూత్ జాతీయ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటింది. హరియాణాలోని సోనెపట్‌లో జరిగిన ఈ పోటీల్లో ఆమె రెండు పతకాలు గెలుపొందింది. యూత్ బాలికల సింగిల్స్ కేటగిరీలో కాంస్యం నెగ్గిన హైదరాబాదీ టీమ్ ఈవెంట్లో రజతం గెలుపొందింది. యూత్ బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో నైనా జైస్వాల్ 1–4 గేముల తేడాతో శ్రుతి అమ్రుతే (మహారాష్ట్ర) చేతిలో ఓడింది. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆమె 4–1తో యశస్విని (కర్ణాటక)పై, క్వార్టర్ ఫైనల్లో 4–2తో సెలెన దీప్తి (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా)పై విజయం సాధించింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) కార్యదర్శి ఎంపీ సింగ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి పతకాలు, మెరిట్ సర్టిఫికేట్లను అందజేశారు. ఇందులో టీటీఎఫ్ఐ అడ్వైజర్ డి.ఆర్. చౌదరి పాల్గొన్నారు. -
మొహమ్మద్ అలీ, శ్రీజలకు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో మొహమ్మద్ అలీ (ఎల్బీఎస్), ఆకుల శ్రీజ (ఎంఎల్ఆర్) విజేతలుగా నిలిచారు. రంగారెడ్డి జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో వ్యాసపురి బండ్లగూడ వేదికగా జరిగిన ఈ టోర్నీలో పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో వీరిద్దరూ టైటిళ్లను కైవసం చేసుకున్నారు. సోమవారం జరిగిన పురుషుల ఫైనల్లో మొహమ్మద్ అలీ 4–2తో అమన్ ఉర్ రహమాన్ (ఏవీఎస్‌సీ)పై గెలుపొందగా... మహిళల విభాగంలో శ్రీజ 4–3తో నిఖత్ బాను (ఆర్బీఐ)ను ఓడిచింది. యూత్ బాలికల విభాగంలోనూ శ్రీజ టైటిల్‌తో మెరిసింది. యూత్ బాలికల ఫైనల్లో శ్రీజ 4–0తో వరుణి జైస్వాల్ (జీఎస్ఎం)పై నెగ్గింది. యూత్ బాలుర ఫైనల్లో ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ (జీటీటీఏ) 4–3తో మొహమ్మద్ అలీ (ఎల్బీఎస్)ను ఓడించి చాంపియన్‌గా నిలిచాడు. జూనియర్ బాలబాలికల విభాగాల్లో సస్య (ఏడబ్ల్యూఏ), బి. వరుణ్ శంకర్ (జీటీటీఏ) చాంపియన్లుగా నిలిచారు. బాలుర ఫైనల్లో వరుణ్ 4–3తో అమన్‌పై, బాలికల తుదిపోరులో సస్య 4–2తో భవితపై నెగ్గారు. సబ్ జూనియర్ కేటగిరీలో భవిత, కార్తీక్ టైటిళ్లను హస్తగతం చేసుకున్నారు. ఫైనల్లో కార్తీక్ (ఏడబ్ల్యూఏ) 4–2తో కేశవన్ (ఎంఎల్ఆర్)పై, భవిత (జీఎస్ఎం) 4–0తో విధిజైన్ (జీఎస్ఎం)పై గెలిచారు. క్యాడెట్ విభాగంలో కావ్య, జతిన్‌దేవ్ విజేతలుగా నిలిచారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో శాట్స్ ఎండీ ఎ. దినకర్ బాబు పాల్గొ్గని విజేతలకు ట్రోఫీలను అందజేశారు.