
ప్యాంగ్‌చాంగ్ (దక్షిణ కొరియా): ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు 3–0తో సింగపూర్ జట్టును ఓడించింది. భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్లో 0–3తో జపాన్ చేతిలో ఓడిపోయింది.
సింగపూర్‌తో తొలి మ్యాచ్‌లో 41 ఏళ్ల ఆచంట శరత్ కమల్ 11–1, 10–12, 11–8, 11–13, 14–12తో ఇజాక్ క్వెక్‌పై నెగ్గగా... రెండో మ్యాచ్‌లో సత్యన్ జ్ఞానశేఖరన్ 11–6, 11–8, 12–10తో యె ఎన్ కొయెన్ పాంగ్‌ను ఓడించాడు.
దాంతో భారత్ 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో మ్యాచ్‌లో హరీ్మత్ దేశాయ్ 11–9, 11–4, 11–6తో జె యు క్లారెన్స్ చ్యూపై గెలవడంతో భారత్ 3–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. బుధవారం జరిగే సెమీఫైనల్స్‌లో చైనీస్ తైపీతో భారత్; దక్షిణ కొరియాతో చైనా తలపడతాయి.
చదవండి: World Cup 2023: నేడు భారత ప్రపంచకప్ జట్టు ప్రకటన.. ఎవరూ ఊహించని ఆటగాడి ఎంట్రీ!