india table tennis
-
WTT Champions Tourney 2024: పోరాడి ఓడిన మనిక
ఇంచియోన్ (దక్షిణ కొరియా): వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) చాంపియన్స్ లెవెల్ టోర్నీలో భారత నంబర్‌వన్ మనిక బత్రా తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 38వ ర్యాంకర్ మనిక 12–10, 9–11, 6–11, 11–8, 8–11తో ప్రపంచ ఆరో ర్యాంకర్ హినా హయాటా (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయింది. 47 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణాయక ఐదో సెట్లో కీలక తరుణంలో మనిక తప్పిదాలు చేసి ఓటమి పాలైంది. తొలి రౌండ్లో ఓడిన మనిక బత్రాకు 3,500 డాలర్ల (రూ. 2 లక్షల 91 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 15 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
శ్రీజకు సింగిల్స్.. మనుష్–మానవ్‌లకు డబుల్స్ టైటిళ్లు
లెబనాన్‌లో జరిగిన ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఫీడర్ లెవెల్ రెండో టోర్నీలో భారత్‌కు చెందిన మనుష్ షా–మానవ్ ఠక్కర్ జోడీ డబుల్స్ టైటిల్ సాధించింది. బీరుట్లో జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో మనుష్–మానవ్ ద్వయం 11–7, 11–5, 9–11, 11–6తో భారత్‌కే చెందిన ముదిత్–ఆకాశ్ పాల్ జోడీపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సత్యన్ జ్ఞానశేఖరన్–మనిక బత్రా (భారత్) జోడీ రన్నరప్‌గా నిలిచింది. ఆకుల శ్రీజకు సింగిల్స్ టైటిల్.. ప్రపంచ 47వ ర్యాంకర్ శ్రీజ అకుల 6-11, 12-10, 11-5, 11-9తో లక్సెంబర్గ్‌కు చెందిన సారా డి నట్టేపై గెలిచి, మహిళల సింగిల్స్ టైటిల్ సొంతం చేసుకుంది. -
చరిత్ర సృష్టించిన భారత టేబుల్ టెన్నిస్ జట్లు.. తొలిసారి ఒలింపిక్స్ అర్హత
భారత టేబుల్ టెన్నిస్ జట్లు చరిత్ర సృష్టించాయి. పురుషులు, మహిళల జట్లు తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. వరల్డ్ ర్యాంకింగ్స్ ఆధారంగా భారత జట్లకు పారిస్ ఒలింపిక్స్‌లో (2024) పాల్గొనే సువర్ణావకాశం దక్కింది. తాజాగా (మార్చి) ప్రకటించిన వరల్డ్ ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల జట్టు 15వ ర్యాంక్‌ను.. మహిళల జట్టు 13వ ర్యాంక్‌ను సాధించి ఒలింపిక్స్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాయి. Indian Men's and Women's Table Tennis teams Qualifies for the Olympics for the first tym ever! The TT March World Team Rankings are out. Men's Team remained at WR15 while Women's team made a jump to WR13. This is Huge. Historic Feat!#Paris2024#TableTennis https://t.co/MBqX417KQQ pic.twitter.com/zV4yhhWZUz — Rambo (@monster_zero123) March 4, 2024 ఇటీవల ముగిసిన ITTF వరల్డ్ టేబుల్ టెన్నిస్ టీమ్ ఛాంపియన్షిప్ ప్రీ క్వార్టర్ ఫైనల్ పోటీల్లో భారత జట్లకు ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, ప్రపంచ ర్యాంకింగ్ కారణంగా ఒలింపిక్స్ బెర్తులు ఖరారు చేసుకోవడం విశేషం. కాగా, వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 16 స్థానాల్లో నిలిచే జట్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. -
భారత టీటీ జట్టుకు పతకం ఖాయం
ప్యాంగ్‌చాంగ్ (దక్షిణ కొరియా): ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు 3–0తో సింగపూర్ జట్టును ఓడించింది. భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్లో 0–3తో జపాన్ చేతిలో ఓడిపోయింది. సింగపూర్‌తో తొలి మ్యాచ్‌లో 41 ఏళ్ల ఆచంట శరత్ కమల్ 11–1, 10–12, 11–8, 11–13, 14–12తో ఇజాక్ క్వెక్‌పై నెగ్గగా... రెండో మ్యాచ్‌లో సత్యన్ జ్ఞానశేఖరన్ 11–6, 11–8, 12–10తో యె ఎన్ కొయెన్ పాంగ్‌ను ఓడించాడు. దాంతో భారత్ 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో మ్యాచ్‌లో హరీ్మత్ దేశాయ్ 11–9, 11–4, 11–6తో జె యు క్లారెన్స్ చ్యూపై గెలవడంతో భారత్ 3–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. బుధవారం జరిగే సెమీఫైనల్స్‌లో చైనీస్ తైపీతో భారత్; దక్షిణ కొరియాతో చైనా తలపడతాయి. చదవండి: World Cup 2023: నేడు భారత ప్రపంచకప్ జట్టు ప్రకటన.. ఎవరూ ఊహించని ఆటగాడి ఎంట్రీ! -
శరత్ కమల్–మనిక జంటకు క్లిష్టమైన ‘డ్రా’
టోక్యో ఒలింపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) జోడీ శరత్ కమల్–మనిక బత్రాకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. బుధవారం విడుదల చేసిన ‘డ్రా’లో భారత జంట తొలి రౌండ్లో మూడో సీడ్ లిన్ యున్–జు, చెంగ్ చింగ్ (చైనీస్ తైపీ) ద్వయంతో తలపడుతుంది. మార్చిలో ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీలో ప్రపంచ 8వ ర్యాంక్ జంట సాంగ్ సు లీ–జీ జెనోన్ (దక్షిణ కొరియా)పై నెగ్గి శరత్ కమల్–మనిక జోడీ టోక్యో ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకుంది. -
సత్యన్ సంచలనం
బెల్జియం ఓపెన్ టీటీ టైటిల్ సొంతం న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) యువ క్రీడాకారుడు సత్యన్ జ్ఞానశేఖరన్ సంచలనం సృష్టించాడు. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) బెల్జియం ఓపెన్ వరల్డ్ టూర్ టైటిల్‌ను సత్యన్ సొంతం చేసుకున్నాడు. బెల్జియంలోని డీ హాన్ నగరంలో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో సత్యన్ 4-0 (15-13, 11-6, 11-2, 17-15)తో సెడ్రిక్ న్యుటింక్ (జర్మనీ)పై గెలుపొందాడు. 2010లో ఆచంట శరత్ కమల్ ఈజిప్టు ఓపెన్ గెలిచాక...భారత్ నుంచి ఐటీటీఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ నెగ్గిన రెండో క్రీడాకారుడు సత్యనే కావడం విశేషం. ప్రపంచ ర్యాంకింగ్‌సలో 152వ స్థానంలో ఉన్న సత్యన్ ఈ టోర్నీలో నెగ్గిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ఆటగాళ్లపై ఉండటం విశేషం. విజేత సత్యన్‌కు 4 వేల డాలర్ల (రూ. 2 లక్షల 66 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ‘టైటిల్ గెలుస్తానని ఊహించలేదు. నా కెరీర్లోనే గొప్ప విజయమిది’ అని సత్యన్ అన్నాడు. -
భారత్‌కు పతకాల పంట
కామన్వెల్త్ టీటీ చాంపియన్‌షిప్ సూరత్: సొంతగడ్డపై భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారులు పతకాల పంట పండించారు. కామన్వెల్త్ టీటీలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా 15 పతకాలను సొంతం చేసుకొని అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు. రెండేళ్ల క్రితం న్యూఢిల్లీలో జరిగిన పోటీల్లో భారత్ అత్యుత్తమంగా తొమ్మిది పతకాలు సాధించింది. సోమవారం ముగిసిన ఈ ఈవెంట్లో భారత్‌కు మూడు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఏడు కాంస్య పతకాలు లభించాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆంథోనీ అమల్‌రాజ్, మహిళల సింగిల్స్ విభాగంలో మౌమా దాస్ రన్నరప్‌లుగా నిలిచి రజత పతకాలను దక్కించుకున్నారు. ఫైనల్స్‌లో ఆంథోనీ అమల్‌రాజ్ 5-11, 5-11, 11-9, 11-6, 12-14, 7-11తో చెన్ ఫెంగ్ (సింగపూర్) చేతిలో; మౌమా దాస్ 7-11, 5-11, 11-7, 2-11, 3-11తో జౌ యిహాన్ (సింగపూర్) చేతిలో ఓటమి చవిచూశారు. పురుషుల డబుల్స్ విభాగంలో సౌమ్యజిత్ ఘోష్-హర్మీత్ దేశాయ్ (భారత్) జంట 5-11, 11-8, 10-12, 11-9, 11-3తో సత్యన్-దేవేశ్ (భారత్) జోడీపై నెగ్గి స్వర్ణం దక్కించుకుంది. మహిళల డబుల్స్ ఫైనల్లో మణిక బాత్రా-అంకిత దాస్ (భారత్) జంట 6-11, 9-11, 9-11తో లిన్ యె-జౌ యిహాన్ (సింగపూర్) ద్వయం చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. -
క్వార్టర్స్‌లో శరత్ కమల్
ఆసియా కప్ టీటీ జైపూర్: సంచలన ప్రదర్శనతో భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) అగ్రశ్రేణి క్రీడాకారుడు ఆచంట శరత్ కమల్ ఆసియా కప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గ్రూప్ ‘బి’లో 32 ఏళ్ల శరత్ కమల్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచి రెండో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించాడు. తొలి మ్యాచ్‌లో శరత్ 11-6, 7-11, 11-5, 11-3తో ప్రపంచ 8వ ర్యాంకర్ చువాంగ్ చియె యువాన్ (చైనీస్ తైపీ)ను బోల్తా కొట్టించగా... రెండో మ్యాచ్‌లో 11-3, 4-11, 11-8, 7-11, 13-11తో ప్రపంచ 16వ ర్యాంకర్ జూ సేయుక్ (దక్షిణ కొరియా)ను కంగుతినిపించాడు. ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాన్ జెంగ్‌డాంగ్ (చైనా)తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో శరత్ 4-11, 8-11, 2-11తో ఓడిపోయాడు.