సత్యన్ సంచలనం | ITTF World Tour Belgium table tennis Open: Sathiyan wins his maiden Pro Tour title | Sakshi
Sakshi News home page

సత్యన్ సంచలనం

Published Mon, Sep 26 2016 12:58 AM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM

సత్యన్ సంచలనం

సత్యన్ సంచలనం

బెల్జియం ఓపెన్ టీటీ టైటిల్ సొంతం
 న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) యువ క్రీడాకారుడు సత్యన్ జ్ఞానశేఖరన్ సంచలనం సృష్టించాడు. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) బెల్జియం ఓపెన్ వరల్డ్ టూర్ టైటిల్‌ను సత్యన్ సొంతం చేసుకున్నాడు. బెల్జియంలోని డీ హాన్ నగరంలో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో సత్యన్ 4-0 (15-13, 11-6, 11-2, 17-15)తో సెడ్రిక్ న్యుటింక్ (జర్మనీ)పై గెలుపొందాడు.

2010లో ఆచంట శరత్ కమల్ ఈజిప్టు ఓపెన్ గెలిచాక...భారత్ నుంచి ఐటీటీఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ నెగ్గిన రెండో క్రీడాకారుడు సత్యనే కావడం విశేషం. ప్రపంచ ర్యాంకింగ్‌‌సలో 152వ స్థానంలో ఉన్న సత్యన్ ఈ టోర్నీలో నెగ్గిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ఆటగాళ్లపై ఉండటం విశేషం. విజేత సత్యన్‌కు 4 వేల డాలర్ల (రూ. 2 లక్షల 66 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ‘టైటిల్ గెలుస్తానని ఊహించలేదు. నా కెరీర్‌లోనే గొప్ప విజయమిది’ అని సత్యన్ అన్నాడు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement