
ఐటీటీఎఫ్ ప్రపంచకప్ టోర్నీ
మకావు: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి మహిళాక్రీడాకారిణులు మనిక బత్రా, ఆకుల శ్రీజలకు నిరాశ ఎదురైంది. వీరిద్దరు గ్రూప్ దశలోనే నిష్క్రమించారు. మొత్తం 48 మంది క్రీడాకారిణులను మొత్తం 16 గ్రూప్‌లుగా విభజించారు.
ఒక్కో గ్రూప్‌లో ముగ్గురికి చోటు క ల్పించారు. 16 గ్రూప్‌ల్లో టాపర్‌గా నిలిచిన వారు నాకౌట్ దశ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. గ్రూప్–2లో ఢిల్లీ అమ్మాయి మనిక, గ్రూప్–4లో తెలంగాణ ప్లేయర్ శ్రీజ రెండో స్థానంలో నిలిచారు.
నాకౌట్ దశకు అర్హత సాధించాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ప్రపంచ 37వ ర్యాంకర్ మనిక, ప్రపంచ 39వ ర్యాంకర్ శ్రీజ ఓడిపోయారు. బుధవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లలో మనిక 6–11, 4–11, 9–11, 4–11తో ప్రపంచ రెండో ర్యాంకర్ మాన్యు వాంగ్ (చైనా) చేతిలో... శ్రీజ 4–11, 4–11, 15–13, 2–11తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ చెన్ మెంగ్ (చేతిలో) ఓటమి పాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment