ITTF
-
గ్రూప్ దశలోనే శ్రీజ, మనిక నిష్క్రమణ
మకావు: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి మహిళాక్రీడాకారిణులు మనిక బత్రా, ఆకుల శ్రీజలకు నిరాశ ఎదురైంది. వీరిద్దరు గ్రూప్ దశలోనే నిష్క్రమించారు. మొత్తం 48 మంది క్రీడాకారిణులను మొత్తం 16 గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో ముగ్గురికి చోటు క ల్పించారు. 16 గ్రూప్‌ల్లో టాపర్‌గా నిలిచిన వారు నాకౌట్ దశ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. గ్రూప్–2లో ఢిల్లీ అమ్మాయి మనిక, గ్రూప్–4లో తెలంగాణ ప్లేయర్ శ్రీజ రెండో స్థానంలో నిలిచారు. నాకౌట్ దశకు అర్హత సాధించాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ప్రపంచ 37వ ర్యాంకర్ మనిక, ప్రపంచ 39వ ర్యాంకర్ శ్రీజ ఓడిపోయారు. బుధవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లలో మనిక 6–11, 4–11, 9–11, 4–11తో ప్రపంచ రెండో ర్యాంకర్ మాన్యు వాంగ్ (చైనా) చేతిలో... శ్రీజ 4–11, 4–11, 15–13, 2–11తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ చెన్ మెంగ్ (చేతిలో) ఓటమి పాలయ్యారు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో శ్రీజ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ర్యాంకింగ్స్‌లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో 25 ఏళ్ల శ్రీజ ఏడు స్థానాలు ఎగబాకి 40వ ర్యాంక్‌కు చేరుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీజ గత వారం లెబనాన్‌లో జరిగిన వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) రెండు టోర్నీల్లో రాణించింది. తొలి టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన ఆమె రెండో టోర్నీలో విజేతగా నిలిచింది. మనిక బత్రా 38వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. మే 16వ తేదీ వరకు భారత టాప్–2 ర్యాంకర్లకు పారిస్ ఒలింపిక్స్‌లో సింగిల్స్ విభాగంలో పోటీపడే అవకాశం లభిస్తుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ఆచంట శరత్ కమల్ 35వ ర్యాంక్‌లో ఉండగా... సత్యన్ జ్ఞానశేఖరన్ 43 స్థానాలు ఎగబాకి 60వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. తెలంగాణ ప్లేయర్ స్నేహిత్ 22 స్థానాలు పురోగతి సాధించి 144వ ర్యాంక్‌లో నిలిచాడు. -
భారత ఆటగాళ్లకు నిరాశ
బెన్‌డిగో (ఆస్ట్రేలియా): కొంతకాలంగా అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) జూనియర్ సర్క్యూట్లో విశేషంగా రాణిస్తున్న భారత ఆటగాళ్లు ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో మాత్రం తడబడ్డారు. జూనియర్ బాలుర సింగిల్స్‌లో భారత ప్లేయర్ మానవ్ ఠక్కర్ క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించగా... మనుశ్ షా, జీత్ చంద్ర నాకౌట్ దశ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. హైదరాబాద్ ప్లేయర్ సురావజ్జుల స్నేహిత్ గ్రూప్ దశ దాటలేకపోయాడు. గ్రూప్–12లో ఉన్న స్నేహిత్ రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, మరో మ్యాచ్‌లో ఓడిపోయి రెండో ర్యాంక్‌లో నిలిచాడు. క్వార్టర్ ఫైనల్లో మానవ్ 6–11, 5–11, 11–7, 16–14, 4–11, 11–8, 8–11తో పెంగ్ జియాంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మరోవైపు మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో జీత్ చంద్ర 8–11, 5–11, 8–11, 8–11తో ప్లెటీ (రొమేనియా) చేతిలో... మనుశ్ షా 11–6, 9–11, 11–4, 5–11, 4–11, 7–11తో పాంగ్ కొయెన్ (సింగపూర్) చేతిలో ఓటమి చవిచూశారు. జూనియర్ బాలికల సింగిల్స్‌లో అర్చన కామత్ తొలి రౌండ్లోనే ఓడిపోయింది. జూనియర్ బాలుర డబుల్స్‌లో స్నేహిత్–జీత్ చంద్ర ద్వయం తొలి రౌండ్లో... మానవ్ –మనుశ్ షా జోడీ క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాయి. -
సత్యన్ సంచలనం
బెల్జియం ఓపెన్ టీటీ టైటిల్ సొంతం న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) యువ క్రీడాకారుడు సత్యన్ జ్ఞానశేఖరన్ సంచలనం సృష్టించాడు. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) బెల్జియం ఓపెన్ వరల్డ్ టూర్ టైటిల్‌ను సత్యన్ సొంతం చేసుకున్నాడు. బెల్జియంలోని డీ హాన్ నగరంలో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో సత్యన్ 4-0 (15-13, 11-6, 11-2, 17-15)తో సెడ్రిక్ న్యుటింక్ (జర్మనీ)పై గెలుపొందాడు. 2010లో ఆచంట శరత్ కమల్ ఈజిప్టు ఓపెన్ గెలిచాక...భారత్ నుంచి ఐటీటీఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ నెగ్గిన రెండో క్రీడాకారుడు సత్యనే కావడం విశేషం. ప్రపంచ ర్యాంకింగ్‌సలో 152వ స్థానంలో ఉన్న సత్యన్ ఈ టోర్నీలో నెగ్గిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ఆటగాళ్లపై ఉండటం విశేషం. విజేత సత్యన్‌కు 4 వేల డాలర్ల (రూ. 2 లక్షల 66 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ‘టైటిల్ గెలుస్తానని ఊహించలేదు. నా కెరీర్లోనే గొప్ప విజయమిది’ అని సత్యన్ అన్నాడు.