శ్రీజకు సింగిల్స్‌.. మనుష్‌–మానవ్‌లకు డబుల్స్‌ టైటిళ్లు    | WTT Feeder Level Tourney: Manav Thakkar, Manush Shah Pair Crowned Mens Doubles Title | Sakshi
Sakshi News home page

WTT Feeder Level Tourney: శ్రీజకు సింగిల్స్‌.. మనుష్‌–మానవ్‌లకు డబుల్స్‌ టైటిళ్లు   

Published Tue, Mar 26 2024 9:10 AM | Last Updated on Tue, Mar 26 2024 3:05 PM

WTT Feeder Level Tourney: Manav Thakkar, Manush Shah Pair Crowned Mens Doubles Title - Sakshi

లెబనాన్‌లో జరిగిన ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ ఫీడర్‌ లెవెల్‌ రెండో టోర్నీలో భారత్‌కు చెందిన మనుష్‌ షా–మానవ్‌ ఠక్కర్‌ జోడీ డబుల్స్‌ టైటిల్‌ సాధించింది. బీరుట్‌లో జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో మనుష్‌–మానవ్‌ ద్వయం 11–7, 11–5, 9–11, 11–6తో భారత్‌కే చెందిన ముదిత్‌–ఆకాశ్‌ పాల్‌ జోడీపై గెలిచింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో సత్యన్‌ జ్ఞానశేఖరన్‌–మనిక బత్రా (భారత్‌) జోడీ రన్నరప్‌గా నిలిచింది.

ఆకుల శ్రీజకు సింగిల్స్‌ టైటిల్‌..
ప్రపంచ 47వ ర్యాంకర్ శ్రీజ అకుల 6-11, 12-10, 11-5, 11-9తో లక్సెంబర్గ్‌కు చెందిన సారా డి నట్టేపై గెలిచి, మహిళల సింగిల్స్‌ టైటిల్‌ సొంతం చేసుకుంది.  
   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement