
పారిస్: ఒలింపిక్స్‌లో భారత మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్టు పోరాటం ముగిసింది. జర్మనీ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆకుల శ్రీజ, మనిక బత్రా, అర్చనా కామత్‌లతో కూడిన భారత జట్టు 1–3తో ఓడిపోయింది.
తొలి మ్యాచ్‌లో శ్రీజ–అర్చన ద్వయం 5–11, 11–8, 10–12, 6–11తో చైనా సంతతికి చెందిన జర్మనీ జోడీ యువాన్ వాన్–జియోనా షాన్ చేతిలో పరాజయం పాలైంది. రెండో మ్యాచ్‌లో మనిక బత్రా 11–8, 5–11, 7–11, 5–11తో అనెట్ కౌఫమన్ చేతిలో ఓడింది. మూడో మ్యాచ్‌లో అర్చన 19– 17, 1–11, 11–5, 11–9తో జియోనా షాన్‌ను ఓడించింది. అయితే నాలుగో మ్యాచ్‌లో శ్రీజ 6–11, 7–11, 7–11తో అనెట్ చేతిలో ఓడిపోవడంతో భారత కథ ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment